05-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీ ప్రతిజ్ఞ ఏమిటంటే - ఎప్పటివరకైతే
మేము పావనముగా అవ్వమో, అప్పటివరకు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాము, ఒక్క తండ్రినే
ప్రేమిస్తాము’’
ప్రశ్న:-
తెలివైన పిల్లలు సమయాన్ని చూస్తూ ఏ పురుషార్థము చేస్తారు?
జవాబు:-
అంతిమములో
శరీరము వదిలినప్పుడు కేవలము ఒక్క బాబా స్మృతియే ఉండాలి, ఇంకేమీ గుర్తు రాకూడదు.
ఇటువంటి పురుషార్థాన్ని తెలివైన పిల్లలు ఇప్పటి నుండే చేస్తూ ఉంటారు ఎందుకంటే
కర్మాతీతముగా అయి వెళ్ళాలి, దాని కొరకు ఈ పాత శరీరము నుండి మమకారాన్ని తొలగిస్తూ
వెళ్ళండి, ఇక మేము బాబా వద్దకు వెళ్తున్నాము, అంతే.
పాట:-
వారు మా నుండి
దూరము కారు...
ఓంశాంతి
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు అనంతమైన తండ్రితో ప్రతిజ్ఞ
చేస్తారు. బాబా, మేము మీకు చెందినవారిగా అయ్యాము, అంతిమములో ఎప్పటివరకైతే మేము
శాంతిధామానికి చేరుకోమో అప్పటివరకు మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మా
జన్మ-జన్మాంతరాల పాపాలు ఏవైతే తలపై ఉన్నాయో, అవి భస్మమైపోతాయి. దీనినే యోగాగ్ని అని
అంటారు, ఇంకే ఉపాయము లేదు. పతిత-పావనుడు అని లేక శ్రీశ్రీ 108 జగద్గురు అని ఒక్కరినే
పిలవడం జరుగుతుంది. వారే జగత్తుకు తండ్రి, జగత్తుకు శిక్షకుడు, జగద్గురువు. రచన
యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తండ్రియే ఇస్తారు. ఇది పతిత ప్రపంచము, ఇందులో ఒక్కరు
కూడా పావనముగా ఉండడము అసంభవము. పతిత-పావనుడైన తండ్రియే సర్వుల సద్గతిని చేస్తారు.
మీరు కూడా వారి పిల్లలుగా అయ్యారు. జగత్తును పావనముగా ఎలా చేయాలి అనేది మీరు
నేర్చుకుంటున్నారు. శివ అన్న పేరు ముందు త్రిమూర్తి అన్నది తప్పకుండా కావాలి. దైవీ
స్వరాజ్యము మీ జన్మసిద్ధ అధికారము అన్నది కూడా వ్రాయాలి. అది కూడా ఇప్పుడు కల్పపు
సంగమయుగములో లభిస్తుంది. స్పష్టముగా వ్రాయకపోతే మనుష్యులు ఏమీ అర్థం చేసుకోలేరు. మరో
విషయమేమిటంటే - బ్రహ్మాకుమారీ అన్న పదము ఎక్కడైతే ఉపయోగిస్తారో, అక్కడ ప్రజాపిత
అన్న పదము కూడా తప్పకుండా ఉండాలి, ఎందుకంటే బ్రహ్మా అన్న పేరు కూడా చాలామందికి ఉంది.
ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని వ్రాయాలి. రాయివంటి విశ్వాన్ని
పావనముగా మరియు పారసముగా ఒక్క తండ్రియే తయారుచేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ
సమయములో ఒక్కరు కూడా పావనముగా లేరు. అందరూ పరస్పరము దెబ్బలాడుకుంటూ, నిందించుకుంటూ
ఉంటారు. తండ్రి గురించి కూడా, వారు కూర్మావతారము, మత్స్యావతారము అని అంటూ ఉంటారు.
అవతారము అని ఎవరిని అంటారో కూడా అర్థం చేసుకోరు. అవతారమనేది ఒక్కరిదే ఉంటుంది. అది
కూడా అలౌకిక రీతిలో శరీరములోకి ప్రవేశించి విశ్వాన్ని పావనముగా చేస్తారు. మిగిలిన
ఆత్మలైతే తమ-తమ శరీరాలను తీసుకుంటారు, కానీ పరమాత్మకు తమదంటూ శరీరము లేదు. కానీ వారు
జ్ఞానసాగరుడు కావున మరి జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? శరీరము కావాలి కదా. ఈ విషయాలను
గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా అవ్వడము
- ఇది సాహసముతో కూడిన పని. మహావీర్ అనగా సాహసాన్ని చూపించేవారు. ఇది కూడా సాహసమే, ఏ
పనినైతే సన్యాసులు చేయరో అది మీరు చేయగలరు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు - మీరు
ఈ విధముగా గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి, అప్పుడే
ఉన్నత పదవిని పొందగలరు. లేకపోతే విశ్వ రాజ్యాధికారము ఎలా లభిస్తుంది. ఇది ఉన్నదే
నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు చదివే చదువు. ఇది పాఠశాల. ఇక్కడ చాలామంది
చదువుకుంటారు, అందుకే ‘‘ఈశ్వరీయ విశ్వవిద్యాలయము’’ అని వ్రాయండి. ఇవి చాలా కరక్టు
పదాలు. మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారము, ఇది నిన్నటి విషయమే అని భారతవాసులకు
తెలుసు. ఇప్పటివరకు రాధ-కృష్ణులు మరియు లక్ష్మీ-నారాయణుల మందిరాలు తయారవుతూ ఉంటాయి.
కొందరైతే పతిత మనుష్యుల మందిరాలను కూడా తయారుచేస్తూ ఉంటారు. ద్వాపరము నుండి
మొదలుకుని ఉన్నది పతిత మనుష్యులే. శివుని మందిరాలను, దేవతల మందిరాలను
నిర్మించడమెక్కడ, ఈ పతిత మనుష్యుల మందిరాలను నిర్మించడమెక్కడ. వీరు దేవతలేమీ కాదు
కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ విషయాలపై సరిగ్గా విచార సాగర మంథనము చేయాలి.
బాబా అయితే అర్థం చేయిస్తూ ఉంటారు, రోజురోజుకు ఈ వ్రాయబడిన మ్యాటర్ మారుతూ ఉంటుంది.
అలాగని ముందే ఎందుకు ఇలా తయారుచేయించలేదు అని అనడానికి లేదు. మన్మనాభవ అర్థాన్ని
ముందే ఈ విధముగా ఎందుకు అర్థం చేయించలేదు అని అనడానికి లేదు. అరే, మొదట్లోనే ఈ
విధముగా స్మృతిలో ఉండలేరు కదా. ప్రతి విషయానికి పూర్తిగా రెస్పాన్స్ ఇవ్వగలిగే
పిల్లలు చాలా తక్కువమంది ఉన్నారు. వారి భాగ్యములో ఉన్నత పదవి లేకపోతే ఇక టీచరు కూడా
ఏమి చేయగలరు. వారు ఆశీర్వాదాలతో ఉన్నతముగా తయారుచేసేస్తారు అనేమీ కాదు. నేను ఎలా
సేవ చేస్తున్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. విచార సాగర మంథనము నడుస్తూ ఉండాలి. గీతా
భగవానుడు ఎవరు - ఈ చిత్రము చాలా ముఖ్యమైనది. భగవంతుడు నిరాకారుడు, వారు బ్రహ్మా
శరీరము లేకుండా వినిపించలేరు. వారు బ్రహ్మా తనువులోకే సంగమములో వస్తారు, లేకపోతే ఈ
బ్రహ్మా-విష్ణువు-శంకరులు ఎందుకు ఉన్నారు. వారి చరిత్ర గురించి తెలియాలి కదా. అది
ఎవరికీ తెలియదు. బ్రహ్మా విషయములో - 100 భుజాలు కలిగిన బ్రహ్మా వద్దకు వెళ్ళండి,
1000 భుజాలు కలిగిన బ్రహ్మా వద్దకు వెళ్ళండి అని అంటూ ఉంటారు. దీనిపై కూడా ఒక కథ
తయారై ఉంది. ప్రజాపిత బ్రహ్మాకు ఇంతమంది సంతానము ఉన్నారు కదా. పవిత్రముగా అయ్యేందుకే
ఇక్కడకు వస్తారు. జన్మ-జన్మాంతరాలు అపవిత్రముగా అవుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తిగా
పవిత్రముగా అవ్వాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని శ్రీమతము లభిస్తుంది.
కొందరికైతే - మేము ఎలా స్మృతి చేయాలి అనేది ఇప్పటివరకు ఇంకా అర్థం కాలేదు,
తికమకపడుతూ ఉంటారు. తండ్రికి చెందినవారిగా అయి కూడా వికర్మాజీతులుగా అవ్వకపోతే,
పాపాలు నశించకపోతే, స్మృతియాత్రలో ఉండకపోతే, ఇక వారు ఏం పదవిని పొందుతారు. వారు
సరెండర్ అయినవారు అయినా కానీ దాని వలన లాభమేముంది. ఎప్పటివరకైతే పుణ్యాత్ములుగా అయి
ఇతరులను తయారుచేయరో అప్పటివరకు ఉన్నత పదవిని పొందలేరు. నన్ను ఎంత తక్కువగా స్మృతి
చేస్తారో అంత తక్కువ పదవిని పొందుతారు. అటువంటివారు డబుల్ కిరీటధారులుగా ఎలా అవుతారు.
ఇక నంబరువారు పురుషార్థానుసారముగా ఆలస్యముగా వస్తారు. మేము మా సర్వస్వాన్ని సరెండర్
చేసేసాము, అందుకే డబుల్ కిరీటధారులుగా అవుతాము అని భావించడానికి లేదు. మొదట
దాస-దాసీలుగా అవుతూ, అవుతూ ఆ తరువాత చివరిలో ఏదో కాస్త పదవి లభిస్తుంది. నేనైతే
సరెండర్ అయ్యాను అని చాలామందికి అహంకారము ఉంటుంది. అరే, స్మృతి లేకుండా మీరేమి
అవ్వగలరు. దాస-దాసీలుగా అవ్వడం కన్నా షావుకారులుగా అవ్వడం మంచిది. దాస-దాసీలు కూడా
శ్రీకృష్ణుడితోపాటు ఊయలలో ఊగలేరు కదా. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇందులో
చాలా కష్టపడవలసి ఉంటుంది. ఏదో కాస్త లభిస్తే అందులోనే సంతోషపడిపోకూడదు. మేము కూడా
రాజులుగా అవుతాము అని అంటారు. అలాగైతే ఎంతోమంది రాజులైపోతారు కదా. తండ్రి అంటారు,
మొట్టమొదట ముఖ్యమైనది స్మృతియాత్ర. ఎవరైతే మంచి రీతిలో స్మృతియాత్రలో ఉంటారో, వారికి
సంతోషముంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి
తీసుకుంటుంది. సత్యయుగములో సంతోషముగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు.
ఇక్కడైతే ఏడవడం మొదలుపెడతారు. సత్యయుగములోని విషయాలనే మర్చిపోయారు. సర్పము తన
కుబుసాన్ని వదులుతుంది కదా, అక్కడ ఆ విధముగా శరీరాన్ని వదులుతారు. మనము ఒక ఆత్మ అని,
ఈ పాత శరీరాన్ని ఇప్పుడిక వదలాల్సిందే అని మీకు తెలుసు. తెలివైన పిల్లలు ఎవరైతే
తండ్రి స్మృతిలో ఉంటారో, వారు అంటారు, మేము తండ్రి స్మృతిలోనే శరీరము వదలాలి, ఆ
తరువాత వెళ్ళి తండ్రిని కలుసుకోవాలి అని. వారిని ఎలా కలుసుకోగలము అనేది
మనుష్యమాత్రులకెవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు దారి లభించింది. ఇప్పుడు పురుషార్థము
చేస్తున్నారు. మీరు జీవిస్తూ మరణించారు కానీ ఆత్మ పవిత్రముగా కూడా అవ్వాలి కదా.
పవిత్రముగా అయి ఇక పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి. కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక ఈ
శరీరాన్ని వదిలేస్తాము అని భావిస్తారు, కానీ కర్మాతీత అవస్థ ఏర్పడితే శరీరాన్ని
దానంతటదే వదిలేస్తారు. ఇక మేము వెళ్ళి బాబా వద్ద ఉండాలి అని భావిస్తారు. ఈ పాత
శరీరముపై ఇక అయిష్టము కలిగినట్లు అవుతుంది. సర్పానికి తన పాత కుబుసముపై అయిష్టము
కలుగుతూ ఉండవచ్చు కదా. మీ కొత్త శరీరము ఇప్పుడు తయారవుతోంది. కానీ దాని కొరకు
కర్మాతీత అవస్థ ఏర్పడాలి. అంతిమములో మీ అవస్థ ఆ విధముగా తయారవుతుంది. ఇప్పుడు ఇక
నేను వెళ్ళిపోతున్నాను, అంతే అన్న భావన కలుగుతుంది. యుద్ధము కొరకు కూడా పూర్తి
ఏర్పాట్లు జరుగుతాయి. వినాశనము యొక్క ఆధారమంతా మీరు కర్మాతీత అవస్థకు చేరుకోవడముపైనే
ఉంది. అంతిమములో కర్మాతీత అవస్థకు నంబరువారుగా అందరూ చేరుకుంటారు. ఇందులో ఎంత
లాభముంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు కావున ఎంతగా తండ్రిని స్మృతి చేయాలి.
మీరు చూస్తుంటారు, కొందరు ఎలాంటివారు తయారవుతారంటే, వారు లేస్తూ, కూర్చుంటూ కూడా
తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పటికిప్పుడే
యుద్ధము ప్రారంభమవ్వబోతుంది అన్నట్లుగా వార్తాపత్రికల్లో చూపిస్తుంటారు. పెద్ద
యుద్ధము ప్రారంభమైతే ఇక బాంబులను ప్రయోగిస్తారు, దానికి పెద్ద సమయము పట్టదు.
తెలివైన పిల్లలు అర్థం చేసుకుంటారు. మందబుద్ధి కలవారు ఏమీ అర్థం చేసుకోరు, వారికి
కొద్దిగా కూడా ధారణ జరగదు. అవును, అవును అని అంటూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు.
స్మృతిలో ఉండరు. ఎవరైతే దేహాభిమానములో ఉంటారో, ఎవరికైతే ఈ ప్రాపంచిక స్మృతులు ఉంటాయో
వారు ఏమి అర్థం చేసుకోగలరు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, దేహీ-అభిమానులుగా అవ్వండి.
దేహాన్ని మర్చిపోవాలి. చివరిలో మీరు చాలా ప్రయత్నము చేయడము మొదలుపెడతారు. ఇప్పుడు
మీరు అర్థం చేసుకోవడం లేదు. చివరిలో చాలా-చాలా పశ్చాత్తాపపడతారు. బాబా
సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు - మీరు ఈ ఈ పాపాలు చేసారు, ఇప్పుడిక శిక్షలు
అనుభవించండి, పదవిని కూడా చూసుకోండి అని. ప్రారంభములో కూడా ఇటువంటి సాక్షాత్కారాలు
చూసేవారు, మళ్ళీ అంతిమములో కూడా సాక్షాత్కారాలను చూస్తారు.
తండ్రి అంటారు, మీ పరువును పోగొట్టుకోకండి, చదువులో నిమగ్నమయ్యే పురుషార్థము
చేయండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి. వారే పతిత-పావనుడు.
ప్రపంచములో పతిత-పావనులు ఎవ్వరూ లేరు. శివ భగవానువాచ. సర్వుల సద్గతిదాత,
పతిత-పావనుడు ఒక్కరే అని అందరూ అంటారు, వారినే అందరూ తలచుకుంటారు. కానీ ఎప్పుడైతే
స్వయాన్ని ఆత్మా బిందువుగా భావిస్తారో, అప్పుడే తండ్రి స్మృతి కలుగుతుంది. మన ఆత్మలో
84 జన్మల పాత్ర నిశ్చితమై ఉందని, అది ఎప్పుడూ వినాశనమవ్వదని మీకు తెలుసు. ఇది అర్థం
చేసుకోవడమనేది అంత సులువైన విషయమేమీ కాదు, మర్చిపోతారు, అందుకే ఇతరులెవ్వరికీ అర్థం
చేయించలేకపోతారు. దేహాభిమానము అందరినీ బాగా హతమార్చేసింది. ఇది మృత్యులోకముగా
అయిపోయింది. అందరూ అకాల మృత్యువు చెందుతూ ఉంటారు. జంతువులు, పక్షులు మొదలైనవి ఎలా
మరణిస్తాయో, అలాగే మనుష్యులు కూడా మరణిస్తారు, తేడా ఏమీ లేదు. లక్ష్మీ-నారాయణులు
అయితే అమరలోకానికి యజమానులు కదా. అక్కడ అకాల మృత్యువులు ఉండవు, దుఃఖమే ఉండదు.
ఇక్కడైతే దుఃఖము ఉంటే వెళ్ళి మరణిస్తారు. అకాల మృత్యువును తమంతట తామే ఆహ్వానిస్తారు.
ఈ గమ్యము చాలా ఉన్నతమైనది. ఎప్పుడూ కూడా వికారీ దృష్టి కలగకూడదు, ఇందులో శ్రమ ఉంది.
ఇంత ఉన్నత పదవిని పొందడమనేది అంత సులువైన విషయమేమీ కాదు. ఇందులో ధైర్యము కావాలి.
లేకపోతే చిన్న విషయానికే భయపడిపోతారు. ఎవరైనా దుర్మార్గులు లోపలికి దూరి వచ్చి చేయి
వేస్తే, కర్రతో కొట్టి తరిమివేయాలి. పిరికివారిలా అవ్వకూడదు. శివశక్తి పాండవ సేన
అన్న గాయనము ఉంది కదా, మీరే స్వర్గ ద్వారాలను తెరుస్తారు. ఆ పేరు ప్రఖ్యాతి చెంది
ఉంది కావున అటువంటి ధైర్యము కూడా ఉండాలి. ఎప్పుడైతే సర్వశక్తివంతుడైన తండ్రి
స్మృతిలో ఉంటారో, అప్పుడు ఆ శక్తి మీలో ప్రవేశిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రిని స్మృతి చేయాలి, ఈ యోగాగ్ని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, తద్వారా
వికర్మాజీత్ రాజుగా అవుతారు. స్మృతిలోనే శ్రమ ఉంది, ఎవరైతే చేస్తే వారు పొందుతారు.
ఇతరులను కూడా సావధానపరచాలి. స్మృతియాత్ర ద్వారానే నావ తీరానికి చేరుతుంది. చదువును
యాత్ర అని అనరు. అవి భౌతికమైన యాత్రలు, ఇది ఆత్మిక యాత్ర. నేరుగా శాంతిధామమైన తమ
ఇంటికి వెళ్ళిపోతారు. తండ్రి కూడా ఇంటిలో ఉంటారు. నన్ను స్మృతి చేస్తూ, చేస్తూ మీరు
ఇంటికి చేరుకుంటారు. ఇక్కడ అందరూ పాత్రను అభినయించాలి. డ్రామా అయితే అవినాశీగా
నడుస్తూనే ఉంటుంది. పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - ఒకటేమో తండ్రి స్మృతిలో
ఉండండి మరియు పవిత్రముగా అవ్వండి, దైవీ గుణాలను ధారణ చేయండి, అలాగే ఎంత సేవ చేస్తే
అంత ఉన్నత పదవిని పొందుతారు. కళ్యాణకారులుగా తప్పకుండా అవ్వాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సర్వశక్తివంతుడైన తండ్రి మాతోపాటు ఉన్నారు అన్నది సదా గుర్తుండాలి, ఈ స్మృతితో
శక్తి ప్రవేశిస్తుంది, వికర్మలు భస్మమవుతాయి. శివశక్తి పాండవ సైన్యము అన్న పేరు ఉంది,
కావున ఆ ధైర్యాన్ని చూపించాలి, పిరికివారిగా అవ్వకూడదు.
2. జీవిస్తూ మరణించిన తరువాత ఇక - నేను సరెండర్ అయ్యాను అన్న అహంకారము రాకూడదు.
సరెండర్ అయి పుణ్యాత్మగా అయి ఇతరులను తయారుచేయాలి, ఇందులోనే లాభముంది.
వరదానము:-
నిర్విఘ్న స్థితి ద్వారా స్వయము యొక్క పునాదిని దృఢముగా
చేసుకునే పాస్ విత్ ఆనర్ భవ
ఏ పిల్లలైతే చాలాకాలముగా నిర్విఘ్న స్థితి యొక్క
అనుభవజ్ఞులుగా ఉన్నారో వారి పునాది ధృడముగా ఉన్న కారణముగా స్వయము కూడా శక్తిశాలిగా
ఉంటారు మరియు ఇతరులను కూడా శక్తిశాలిగా తయారుచేస్తారు. చాలాకాలము శక్తిశాలిగా,
నిర్విఘ్నముగా ఉన్న ఆత్మ అంతిమములో కూడా నిర్విఘ్నముగా అయి పాస్ విత్ ఆనర్ గా
అవుతారు లేదా ఫస్ట్ డివిజన్ లోకి వస్తారు. కావున సదా ఇదే లక్ష్యము ఉండాలి -
చాలాకాలము నుండి నిర్విఘ్న స్థితి యొక్క అనుభవాన్ని తప్పకుండా చేయాలి.
స్లోగన్:-
ప్రతి
ఆత్మ పట్ల సదా ఉపకారము అనగా శుభ కామనను ఉంచినట్లయితే స్వతహాగా దీవెనలు
ప్రాప్తిస్తాయి.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి
యోగము అనగా శాంతి
యొక్క శక్తి. ఈ శాంతి యొక్క శక్తి చాలా సహజముగా స్వయాన్ని మరియు ఇతరులను పరివర్తన
చేస్తుంది. దీని ద్వారా వ్యక్తులు కూడా మారిపోతారు, అలాగే ప్రకృతి కూడా మారిపోతుంది.
వ్యక్తులకైతే నోటితో కోర్స్చేయిస్తారు కానీ ప్రకృతిని మార్చేందుకైతే శాంతి యొక్క
శక్తి అనగా యోగబలమే కావాలి.
| | |