05-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రికి సహయోగులుగా అయ్యేందుకు
అందరికీ మన్మనాభవ మంత్రాన్ని పక్కా చేయించండి, ఒక్క తండ్రినే సదా ఫాలో చేయండి’’
ప్రశ్న:-
పురుషోత్తములుగా అయ్యేందుకు సహజమైన మరియు శ్రేష్ఠమైన పురుషార్థము ఏమిటి?
జవాబు:-
ఓ
పురుషోత్తములుగా అయ్యే పిల్లలూ - మీరు సదా శ్రీమతముపై నడుస్తూ ఉండండి. ఒక్క తండ్రిని
స్మృతి చేయండి, ఇంకే విషయములోనూ జోక్యము చేసుకోకండి. తినండి, తాగండి, అన్నీ చేయండి
కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పురుషోత్తములుగా అయిపోతారు. ఎవరిపైనైతే
బృహస్పతి దశ ఉందో, వారే పురుషోత్తములుగా అవుతారు. వారు ఎప్పుడూ శ్రీమతాన్ని
ఉల్లంఘించరు. వారి ద్వారా ఎలాంటి తప్పుడు కర్మలు జరగవు.
పాట:-
ఓం నమః శివాయ...
ఓంశాంతి
ఈ మహిమ ఎవరిది?
ఒక్క పరమపిత పరమాత్మునిది. ఎవరైతే మంచి పనులు చేస్తారో, వారికి తప్పకుండా మహిమ
జరుగుతుంది. చెడు పనులు చేసేవారు నిందించబడతారు. ఉదాహరణకు అక్బర్ ను మహిమ చేసేవారు,
ఔరంగజేబ్ ను నిందించేవారు. రాముడిని మహిమ చేస్తారు, రావణుడిని నిందిస్తారు. భారత్
లోనే రామ రాజ్యము, రావణ రాజ్యము ప్రసిద్ధమైనవి. రామ రాజ్యాన్ని పురుషోత్తమ రాజ్యమని
అంటారు మరియు రావణ రాజ్యాన్ని ఆసురీ రాజ్యమని అంటారు. పిల్లలకు ఇప్పుడు సంగమయుగము
గురించి తెలిసింది. ఇది పురుషోత్తమ యుగము. ఈ భారత్ ను పురుషోత్తమముగా తయారుచేసే
తీరాలి. ఇక్కడ నివసించే వ్యక్తులను కూడా పురుషోత్తములుగా తయారుచేయాలి మరియు నివసించే
స్థానాన్ని కూడా పురుషోత్తమముగా తయారుచేయాలి. భారత్ నే స్వర్గము అని అంటారు,
నివసించేవారిని దేవీ-దేవతలు, స్వర్గవాసులు అని అంటారు. కావున నివసించే స్థానము మరియు
నివసించేవారు కూడా ఉత్తమముగా అవుతారు. కొత్త ప్రపంచము ఉత్తమముగా ఉంటుందని, పాత
ప్రపంచము కనిష్ఠముగా ఉంటుందని అందరికీ తెలుసు. ప్రపంచము ఎలా ఉంటుందో, అందులో
నివసించేవారు కూడా అలాగే ఉంటారు. కొత్త భారత్ , పాత భారత్ అని అంటూ ఉంటారు, ఇతర ఏ
ఖండాన్ని కొత్త ఖండము అని అనరు. కొత్త ప్రపంచములో కొత్త అమెరికా, కొత్త చైనా ఉంటాయని
కాదు. కొత్త ప్రపంచములో కొత్త భారత్ అని అంటారు, అందుకే ‘న్యూ ఇండియా’ అని అంటారు.
కొత్త భారత్ అనే పేరు పెడతారు కానీ అర్థం తెలియకుండా పెడతారు. ఈ సమయములో ‘న్యూ
ఇండియా’ ఎక్కడ నుండి వచ్చింది! న్యూ ఇండియాలోనైతే ఢిల్లీ పరిస్తాన్ గా ఉంటుంది.
ఇప్పుడు పరిస్తాన్ ఎక్కడుంది? పిల్లలైన మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు ఇక్కడకు
వస్తారు. బృహస్పతి దశ ఉన్నతోన్నతమైనది. పురుషోత్తములుగా అవ్వడముతో బృహస్పతి దశ
కూర్చుంటుంది. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన
సుఖాన్ని తీసుకునే పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. సత్యయుగములో
పురుషోత్తములు ఉంటారు. తర్వాత కిందకు వస్తే, మధ్యములుగా, ఆ తర్వాత కనిష్టులుగా
అయిపోతారు. ఇప్పుడు తండ్రి మనల్ని సతోప్రధానముగా, సత్యయుగీ స్వర్గవాసులుగా,
పురుషోత్తములుగా తయారుచేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా-చాలా సహజము.
దీని కోసం మందులు తీసుకోవాల్సిన పని లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం స్మృతి
చేయాలి, అందుకే దీనిని ‘సహజ స్మృతి’ అని అంటారు. స్మృతి ద్వారానే పాపాత్ముల నుండి
పుణ్యాత్ములుగా తయారవ్వాలి. అందరికీ ముక్తి తప్పకుండా లభించనున్నది.
తండ్రి అంటారు - నేను
సర్వుల సద్గతిదాతను, కావున తప్పకుండా మనుష్యుల శరీరాలు సమాప్తమైపోతాయి. ఇకపోతే,
ఆత్మలను పవిత్రముగా తయారుచేసి తీసుకువెళ్తాను. తిరిగి వెళ్ళేందుకు ఏర్పాట్లు
చేసుకోవాల్సి ఉంటుంది. తండ్రి ఏర్పాట్లు చేయిస్తున్నారు ఎందుకంటే ఆత్మ యొక్క రెక్కలు
తెగిపోయాయి అనగా ఆత్మ తమోప్రధానముగా ఉంది. మీరు యోగబలముతో పవిత్రముగా అయ్యే కృషి
చేస్తారు. ఎవరైతే కృషి చేయరో, వారు తమ లెక్కాచారాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది.
ఇందులో ఆలోచించే విషయమేమీ లేదు. పిల్లల కర్తవ్యమేమిటంటే - తండ్రి నుండి పూర్తి
వారసత్వాన్ని తీసుకోవాలి, తండ్రికి సహాయకులుగా అయి సహయోగము ఇవ్వాల్సి ఉంటుంది.
తండ్రి సహయోగము కూడా ఉండాలి మరియు పిల్లల సహయోగము కూడా ఉండాలి. సహయోగము ఎలా ఇవ్వాలి
అనేది తండ్రిని చూసి ఫాలో చేయండి. పురుషోత్తములుగా తయారయ్యేందుకు అందరికీ నా
మంత్రాన్ని ఇస్తూ ఉండండి. తండ్రి కల్ప-కల్పము వచ్చి ఇలా అంటారు - నన్ను స్మృతి
చేయకుండా పతితుల నుండి పావనముగా అవ్వలేరు. నేనేమైనా గంగా స్నానాలు చేయమంటానా? కేవలం
‘మన్మనాభవ’ అనే మహామంత్రాన్ని గుర్తు చేసుకోవాలి. దీని అర్థము - నన్ను స్మృతి
చేసినట్లయితే మీరు పావనముగా అయి, పురుషోత్తములుగా అయి, స్వర్గానికి యజమానులుగా
అవుతారు. స్త్రీ-పురుషులు ఇరువురూ పవిత్ర ప్రవృత్తి మార్గములో యజమానులుగా అవుతారు.
తండ్రి ఈ విషయాలన్నింటినీ వివరముగా అర్థం చేయిస్తారు. మీరు ప్రాక్టికల్ గా అలా
తయారవుతారు. భగవంతుడు వచ్చి పిల్లలను పురుషోత్తములుగా తయారుచేసారని మీకు తెలుసు,
అందుకే పతితులను పావనముగా చేసే పతిత-పావనా రండి అని పిలుస్తారు. పురుషోత్తమ మాసానికి
చాలా మహిమను వినిపిస్తారు కదా. కావున ఈ పురుషోత్తమ యుగానికి చాలా మహిమ ఉంది.
కలియుగము అనగా రాత్రి తర్వాత పగలు తప్పకుండా రావాలి. దుఃఖము తర్వాత సుఖము వస్తుంది.
ఈ పదాలు కూడా స్పష్టముగా ఉన్నాయి. స్త్రీ-పురుషులు ఇరువురూ ఉత్తమోత్తములుగా,
శ్రేష్ఠాతి-శ్రేష్ఠులుగా తయారవుతారు, ఎందుకంటే అది ప్రవృత్తి మార్గము. సత్యయుగము
చాలా ప్రసిద్ధమైనది, దానినే సుఖధామమని అనడం జరుగుతుంది. ఆ తర్వాత ద్వాపరయుగము
వచ్చినప్పుడు మనుష్యులు సన్యాసాన్ని ధారణ చేసి ఉత్తములుగా అవుతారు, అందుకే పతిత
మనుష్యులు వెళ్ళి వారికి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రమైనవారి ముందు అపవిత్రమైనవారు
తల వంచి నమస్కరిస్తారు. ఇది కామన్ విషయము. పతిత-పావనుడైన తండ్రిని తెలుసుకోని
కారణముగా పతిత-పావని అని గంగను పావనమైనదిగా భావించి, అక్కడకు వెళ్ళి తల వంచి
నమస్కరిస్తారు. గంగ మరియు సాగరము యొక్క మేళా కూడా జరుగుతుంది. పిల్లలైన మీకు తండ్రి
చాలా స్పష్టము చేసి అర్థం చేయిస్తారు, అయినప్పటికీ తండ్రి అంటారు - కోట్లలో కొందరు,
ఆ కొందరిలో కూడా కొందరు అర్థం చేసుకుంటారు. మళ్ళీ వారిలో కూడా కొంతమంది ఆశ్చర్యము
కలిగేలా వింటారు, వినిపిస్తారు, విడాకులిస్తారు మరియు పారిపోతారు... డిస్సర్వీస్
చేసేవారిగా అయిపోతారు. సర్వీస్ మరియు డిస్సర్వీస్, రెండూ జరుగుతూ ఉంటాయి. తండ్రిని
తెలుసుకోనివారు, చాలామంది పారిపోతారు కూడా.
మీరు పాపాత్ముల నుండి
పుణ్యాత్ములుగా అవుతారు. మళ్ళీ, పిల్లలే కూర్చుని విఘ్నాలను కలిగిస్తారు,
డిస్సర్వీస్ చేస్తారు, అప్పుడు ఎంతటి మహాపాపము అవుతుంది. రావణుడు అందరినీ
మహాపాపులుగా చేస్తాడు. కానీ ఎవరైతే పిల్లలుగా అయి డిస్సర్వీస్ చేస్తారో, వారి కోసం
ట్రిబ్యునల్ (న్యాయ సభ) కూర్చుంటుంది. భక్తి మార్గములో ఇంత కఠినమైన శిక్షలు లభించవు
కానీ ఇక్కడ తండ్రికి చెందినవారిగా అయి డిస్సర్వీస్ చేస్తే, తండ్రికి రైట్ హ్యాండ్
గా ధర్మరాజు ఉన్నారు. అందుకే తండ్రి అంటారు - పిల్లలూ, నా సేవలో సహాయకులుగా అయిన
తర్వాత ఇక ఏ తప్పుడు పనులు చేయకండి, డిస్సర్వీస్ చేస్తే అబలలకు విఘ్నాలు కలుగుతాయి.
మాతలపై బాబాకు దయ కలుగుతుంది. ద్రౌపదికి కూడా భగవంతుడు కాళ్ళు ఒత్తారు కదా. నన్ను
వివస్త్రగా చేస్తున్నారని ద్రౌపది పిలిచారు. బాబా మాతల తలపై కలశాన్ని పెడతారు. ముందు
మాతలు, ఆ తర్వాత పురుషులు. కానీ ఈ మధ్యన పురుషులలో చాలా గర్వము ఉంటుంది - నేను
స్త్రీకి గురువును, పతిని, ఈశ్వరుడిని, స్త్రీ నాకు దాసి అని అనుకుంటున్నారు. ఇక్కడ
తండ్రి నిరహంకారిగా అయి మాతలకు కాళ్ళు కూడా ఒత్తుతారు. మీరు అలసిపోయారు. నేను మీ
అలసటను దూరం చేయడానికి వచ్చాను. మాతలైన మిమ్మల్ని అందరూ తిరస్కరించారు. సన్యాసులు
స్త్రీలను వదిలేసి వెళ్ళిపోతారు. కొందరికి 5-7 మంది పిల్లలుంటారు, వారిని
సంభాళించలేకపోతే విసిగిపోయి పారిపోతారు. రచనను రచించి, వారిని భ్రమించేలా చేసి
వెళ్ళిపోతారు. తండ్రి అంటారు - నేను ఎవ్వరినీ భ్రమించేలా చేయడం లేదు. నేనైతే అందరికీ
దుఃఖహర్త, సుఖకర్తను. మాయ వచ్చి దుఃఖితులుగా చేస్తుంది. ఇది కూడా ఒక ఆట. అజ్ఞాన
కాలములో మనుష్యులు - భగవంతుడే సుఖ-దుఃఖాలను ఇస్తారని భావిస్తారు, కానీ తండ్రి అయిన
ఈశ్వరుడు ఈ వ్యాపారము చేయరు. ఇది కర్మల అనుసారముగా తయారై ఉన్న డ్రామా, ఎవరు ఎలాంటి
కర్మలు చేస్తే, అలాంటి ఫలాన్ని పొందుతారు. ఇది శ్రేష్ఠ కర్మలు చేసే సమయము. గతంలో
చేసిన కర్మలకు ఇప్పుడు పశ్చాత్తాపపడడం కాదు. ఎవరైనా అనారోగ్యముగా ఉన్నా, దివాలా
తీసినా, వారు ఆ కర్మలకు పశ్చాత్తాపపడతారు. పిల్లలైన మీరు ఎంత సౌభాగ్యశాలిగా అవుతారు,
మీరు 21 జన్మలు చేసిన కర్మలకు పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండదు. ఇది ఎంత భారీ ఫలము.
కావున తండ్రి శ్రీమతముపై నడవాలి. తండ్రి ఇతర ఏ విషయాలలోనూ జోక్యము చేసుకోరు. తినండి,
తాగండి, ఏదైనా చేయండి, కానీ కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మీరు
- మేము పతితులము అని అంటారు, కావున పావనముగా అయ్యేందుకు తండ్రి ఏ యుక్తులనైతే
చెప్తారో, వాటిపై నడవండి. కేవలం స్మృతి చేసే విషయములో శ్రమ ఉంటుంది. మాయా తుఫానులకు
భయపడకూడదు. ఇది గుప్తమైన కృషి. జ్ఞానము కూడా గుప్తమైనది, మురళి వినిపించడము
ప్రత్యక్షముగా కనిపిస్తుంది. కానీ ఈ వాణి ద్వారా మీరు పావనముగా అవ్వరు, స్మృతి
ద్వారానే పావనముగా అవుతారు. కనుక అనంతమైన తండ్రిని స్మృతి చేయండి మరియు వారికి
సహాయకులుగా కూడా అవ్వాలి. ఆత్మిక హాస్పిటల్ ను మరియు యూనివర్సిటీని తెరిచే
పురుషార్థము కూడా చేయండి. ఏదైనా మంచి స్థానముంటే, అక్కడకు వెళ్ళి భాషణ చేయండి. మీరు
చేతిలోకి పుస్తకము తీసుకోకూడదు. మీలో మొత్తం జ్ఞానమంతా ఉంది, ఇకపోతే అర్థం
చేయించేందుకు వృక్షము, త్రిమూర్తి, సృష్టి చక్రము యొక్క రహస్యాలను అందరికీ అర్థం
చేయించాలి. తండ్రి అంటారు, నేను బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచిస్తాను. బ్రాహ్మణుల
లక్ష్యము-ఉద్దేశ్యము అయిన విష్ణువు నిలబడి ఉన్నారు. అలా తయారుచేసే టీచర్ ఆ
నిరాకారుడు. బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన... అని అంటూ ఉంటారు.
కల్పక్రితం కూడా ఇటువంటి చిత్రాలనే తయారుచేయించారు. సైన్సు మొదలైనవాటితో ఎన్ని
మిసైల్స్ తయారుచేస్తారో చూడండి. పిల్లలైన మీకు పురుషోత్తములుగా అయ్యేందుకు కూడా
శ్రమ అనిపిస్తుంది, ఎందుకంటే జన్మజన్మల భారము తలపై ఉంది. సెకండులో నిశ్చితార్థము
అవుతుంది, ఇక ఆత్మలు తండ్రిని స్మృతి చేయాలి, దాని ద్వారా తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అవుతారు.
తండ్రి అంటారు -
మన్మనాభవ, మీరు కర్మయోగులు. స్మృతి చార్టు పెట్టుకోవాలి. మీకు మాయతో యుద్ధము
జరుగుతుంది. ఇది చాలా కఠినమైన యుద్ధము. మీరు స్మృతిలో ఉండేందుకు ప్రయత్నిస్తారు,
మాయ స్మృతిని దూరము చేసేస్తుంది. జ్ఞానములో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఆత్మలో 84 జన్మల
సంస్కారాలు నిండి ఉన్నాయి. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా. ఈ చక్రము
తిరుగుతూనే ఉంటుంది. ఇది సమాప్తమయ్యేది కాదు. సృష్టిని ఎందుకు రచించారు అన్న ప్రశ్నే
తలెత్తదు. ఆత్మ ఎలా మారుతుంది. కొత్త ఆత్మ ఎక్కడ నుండి రాదు. ఆత్మలు ఏవైతే ఉన్నాయో,
అవే ఉంటాయి. ఎక్కువ, తక్కువ అవ్వవు. పాత్రధారులంతా పూర్తిగా ఉన్నారు. మీరు అనంతమైన
పాత్రధారులు, మీరు ఎంతమందినైతే చూస్తున్నారో, అంతమంది పాత్రధారులు డ్రామాలో ఉన్నారు,
మళ్ళీ అంతమందే ఉంటారు. ఎవ్వరూ మోక్షము పొందరు. మనుష్యులు ఆవాగమన (రాకపోకల) చక్రము
నుండి విడుదల అవ్వాలని కోరుకుంటారు కానీ అవ్వలేరు. ఎవరైతే పాత్రను అభినయించేందుకు
వస్తారో, వారు మళ్ళీ రావాల్సి ఉంటుంది. తండ్రి అంటారు - నేను కూడా ఈ పతిత
ప్రపంచములోకి వచ్చి-వెళ్ళాల్సి ఉంటుంది. కల్ప-కల్పము నేను వస్తాను. నేనే రావాల్సి
వస్తుంది అన్నప్పుడు, పిల్లలు రావడమనేది ఎలా ఆగిపోతుంది. మీరు 84 సార్లు శరీరములోకి
వస్తారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. నేను రావడం-వెళ్ళడం అనేది చాలా అద్భుతముగా
ఉంటుంది. అందుకే, మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము మీకే తెలుసు... అని అంటూ ఉంటారు.
సద్గతినిచ్చేందుకు ఏ మతమైతే ఉందో, అది మీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు.
వారు పాడుతారు, కానీ మీరు ప్రత్యక్షముగా ఉన్నారు. ముఖ్యమైన విషయము స్మృతికి
సంబంధించింది, ఇంకా అంధులకు చేతికర్రగా అవ్వాలి. ఇది పురుషోత్తమ యుగము. ఇది 5 వేల
సంవత్సరాల తర్వాత వస్తుంది. పురుషోత్తమ మాసం మూడు సంవత్సరాల తర్వాత వస్తుంది. అదంతా
భక్తి మార్గము. వారి మంత్ర-తంత్రాల పుస్తకాలు అనేకమున్నాయి. ఇక్కడైతే అటువంటి
విషయాలేవీ లేవు. భక్తి చేయనివారిని అధర్మయుక్తమైనవారు అని అంటారు. కావున వారిని
సంతుష్టపరిచేందుకు నిమిత్తముగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, ఎప్పుడూ డిస్సర్వీస్ చేసే పురుషార్థము చేయకూడదు.
ఎవరైనా ద్రోహులుగా అయితే, వారిని అజామిళుడు అని అంటారు. అజామిళుడు, సూరదాసు
మొదలైనవారి కథలు ఎన్ని ఉన్నాయి. ఇదంతా భక్తి మార్గము. వారికంటే పెద్ద పాపాత్ములు
ఎవరంటే - ఇక్కడకు వచ్చి, నా పిల్లలుగా అయి నాకు విడాకులిచ్చేవారు. ఎవరైతే నన్ను
నిందలపాలు చేస్తారో, వారి కోసం న్యాయ సభ కూర్చుంటుంది. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ
డిస్సర్వీస్ చేస్తే కఠినమైన శిక్ష లభిస్తుంది. పదవి ఉన్నతమైనది కావున తప్పులకు కూడా
కఠినమైన శిక్షలు ఉంటాయి. అందుకే, ఏ ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. సద్గురువుకు నింద
తీసుకుచ్చేవారు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరని అంటారు, అనగా నరుని నుండి నారాయణునిగా
అయ్యే లక్ష్యాన్ని పొందలేరు. గురువులకు నింద తీసుకువచ్చేవారు ఉన్నతమైన స్థానాన్ని
పొందలేరని మీరు అంటారు కదా, మరి ఆ స్థానమేమిటి అని మీరు గురువులను అడుగవచ్చు. వారు
ఆ స్థానము గురించి చెప్పలేరు. తండ్రి టైటిల్ ను వారు తమకు పెట్టుకున్నారు. ఒకవేళ
పూర్తిగా చదువుకోకపోతే ఉన్నత పదవిని కూడా పొందలేరని టీచర్ అంటారు. పావనముగా అయి
దేవీ-దేవతలుగా అవ్వాలి. ఇక్కడ పావనమైనవారు ఎవరూ ఉండరు. ఇప్పుడు అందరూ పావనముగా
అవ్వాలి. రాజ్య భాగ్యము 21 జన్మల కోసం లభిస్తుంది కావున కేవలం ఈ ఒక్క అంతిమ జన్మలో
పావనముగా అవ్వాలి, ఇది ఎంత పెద్ద ప్రాప్తి. ప్రాప్తి లేకపోతే ఇలాంటి పురుషార్థము
చేస్తారా? కానీ మాయ ఎటువంటిదంటే, అది ఉన్నత ప్రాప్తిలో కూడా విఘ్నాలు కలిగిస్తుంది
మరియు కింద పడేస్తుంది. అహో మమ మాయా... అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. డిస్సర్వీస్ జరిగే విధముగా ఏ కార్యము చేయకూడదు. తండ్రికి నింద తీసుకువచ్చే
కర్మలేవీ జరగకూడదు. ఆజ్ఞల ఉల్లంఘన నుండి స్వయాన్ని రక్షించుకోవాలి, పురుషోత్తములుగా
అవ్వాలి.
2. మాయా తుఫానులకు భయపడకూడదు, పావనముగా అయ్యేందుకు స్మృతిలో ఉండే పురుషార్థము
చేయాలి.
వరదానము:-
అలసిపోయిన మరియు తపిస్తున్న ఆత్మలకు సిద్ధిని ఇచ్చే ఈశ్వరీయ
సేవాధారీ భవ
ఆత్మలకు చాలాకాలము నుండి ఉన్న కోరిక లేక ఆశ ఏమిటంటే -
నిర్వాణము లేక ముక్తిధామములోకి వెళ్ళాలి అని. దాని కోసమే అనేక జన్మల నుండి అనేక
రకాల సాధనలను చేస్తూ-చేస్తూ అలసిపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సిద్ధిని
కోరుకుంటున్నారు, అంతేకానీ సాధనను కాదు. సిద్ధి అనగా సద్గతి. కావున అటువంటి
తపిస్తున్న, అలసిపోయి దాహముతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు శ్రేష్ఠ ఆత్మలైన మీరు
మీ సైలెన్స్ శక్తితో మరియు సర్వ శక్తులతో ఒక్క సెకండులో సిద్ధిని ఇవ్వండి, అప్పుడు
ఈశ్వరీయ సేవాధారులు అని అంటారు.
స్లోగన్:-
బలహీన
సంస్కారాలే మాయ వచ్చేందుకు దొంగ దారి, ఇప్పుడు ఆ దారిని మూసివేయండి.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
బ్రహ్మా పిల్లలైన మీరు
భాగ్యరేఖను గీసే బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు, అందుకే సదా మీ భాండాగారము
నిండుగా ఉండాలి. ఎవరినీ కూడా ఖాళీ చేతులతో వెళ్ళనివ్వకండి. దాత పిల్లలు సదా ఇస్తూ
ఉండండి, సర్వుల భావనలను, సర్వుల ఆశలను పూర్తి చేస్తూ ఉండండి, మహాదానిగా, వరదానిగా
అవ్వండి, ఇదే మీ స్వరూపము.