05-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ పతిత ప్రపంచము ఒక పాత గ్రామము, ఇది మీరు నివసించేందుకు యోగ్యముగా లేదు, మీరు ఇప్పుడు కొత్త పావన ప్రపంచములోకి వెళ్ళాలి’’

ప్రశ్న:-
తండ్రి తన పిల్లలకు ఉన్నతి కోసం ఏ ఒక్క యుక్తిని తెలియజేస్తారు?

జవాబు:-
పిల్లలూ, మీరు ఆజ్ఞాకారులుగా అయి బాప్ దాదా యొక్క మతముపై నడుస్తూ ఉండండి. బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారు, అందుకే ఒకవేళ వీరు చెప్పడము వల్ల ఏదైనా నష్టము కలిగినా కానీ, బాధ్యత తండ్రిదే, వారు అంతా సరి చేసేస్తారు. మీరు మీ మతాన్ని నడిపించకండి. శివబాబా మతమని భావించి నడుస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్న మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఏమిటంటే - స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. అక్కడ వాళ్ళు ఆశీర్వదిస్తారు కదా. ఈ తండ్రి కూడా అంటున్నారు - పిల్లలూ, మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి, మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది అతి సహజమైన విషయము. ఇది భారత్ యొక్క ప్రాచీన సహజ రాజయోగము. ప్రాచీనము అన్నదానికి కూడా సమయమనేది ఉండాలి కదా. చాలా కాలము క్రితము అని అన్నా, అది కూడా ఎంతకాలము క్రితము? తండ్రి అర్థం చేయిస్తున్నారు, పూర్తిగా 5 వేల సంవత్సరాల క్రితము ఈ రాజయోగాన్ని నేర్పించారు. దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు మరియు పిల్లలు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. పిల్లలైన ఆత్మలు మరియు తండ్రి అయిన పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు... అని గాయనము కూడా ఉంది. తండ్రియే అంటారు, మీరు మెట్లు దిగుతూ-దిగుతూ పతితముగా అయిపోయారు. ఇప్పుడు స్మృతి కలిగింది. ఓ పతిత-పావనా... అని అందరూ ఆర్తనాదాలు చేస్తారు. కలియుగములో పతితులే ఉంటారు. సత్యయుగములో పావనమైనవారు ఉంటారు. అది ఉన్నదే పావన ప్రపంచము. ఈ పాత పతిత ప్రపంచము నివసించేందుకు యోగ్యముగా లేదు. కానీ మాయ ప్రభావము కూడా తక్కువేమీ లేదు. ఇక్కడ చూసినట్లయితే 100-125 అంతస్థులు కల పెద్ద-పెద్ద భవనాలను తయారుచేస్తూ ఉంటారు. దీనిని మాయ ఆర్భాటము అని అనడము జరుగుతుంది. మాయ సత్తా ఎలా ఉందంటే, స్వర్గానికి వెళ్దాము పదండి అని అంటే, మా కోసం స్వర్గమైతే ఇక్కడే ఉంది అని అంటారు. దీనిని మాయ సత్తా అని అనడము జరుగుతుంది. కానీ పిల్లలైన మీకు తెలుసు - ఇది పాత గ్రామము, దీనిని నరకము అని అంటారు, ఇది పాత ప్రపంచము, అందులోనూ ఇది రౌరవ నరకము. సత్యయుగాన్ని స్వర్గము అని అంటారు. ఈ పదాలైతే ఉన్నాయి కదా. దీనిని వికారీ ప్రపంచము అనైతే అందరూ అంటారు. ఈ స్వర్గము నిర్వికారీ ప్రపంచముగా ఉండేది. స్వర్గాన్ని నిర్వికారీ ప్రపంచము అనే అంటారు, నరకాన్ని వికారీ ప్రపంచము అని అంటారు. ఇంత సహజమైన విషయాలు కూడా ఎవరి బుద్ధిలోకి ఎందుకు రావడము లేదు! మనుష్యులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఎన్ని యుద్ధాలు-గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. రోజురోజుకూ బాంబులు మొదలైనవి కూడా ఎలా తయారుచేస్తూ ఉంటారంటే, అవి వేయగానే మనుష్యులు అంతమైపోతారు. కానీ తుచ్ఛబుద్ధి కల మనుష్యులు ఇప్పుడు ఏం జరుగబోతుంది అన్నది అర్థం చేసుకోవడము లేదు. ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఏం జరుగబోతుంది? పాత ప్రపంచ వినాశనము జరగనున్నది మరియు కొత్త ప్రపంచ స్థాపన కూడా గుప్తముగా జరుగుతూ ఉంది.

పిల్లలైన మిమ్మల్ని గుప్త యోధులు అని అంటారు. మీరు యుద్ధము చేస్తున్నారని ఎవరైనా భావిస్తారా? మీ యుద్ధము ఉన్నదే 5 వికారాలతో. పవిత్రముగా అవ్వండి అని మీరు అందరికీ చెప్తారు. మీరు ఒక్క తండ్రి పిల్లలు కదా. ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలు కావున అందరూ సోదరీ-సోదరులవుతారు కదా! అర్థం చేయించేందుకు మంచి యుక్తులు కావాలి. ప్రజాపిత బ్రహ్మాకు అయితే ఎంతోమంది పిల్లలున్నారు, ఒక్కరే కాదు. వారి పేరే ప్రజాపిత. లౌకిక తండ్రిని ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. వారు ప్రజాపిత బ్రహ్మా కావున వారి పిల్లలంతా పరస్పరములో సోదరీ-సోదరులు, బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు అయినట్లు కదా. కానీ అర్థం చేసుకోరు. రాతిబుద్ధి కలవారిలా ఉన్నారు, అర్థం చేసుకునే ప్రయత్నము కూడా చేయరు. ప్రజాపిత బ్రహ్మా యొక్క పిల్లలు సోదరీ-సోదరులవుతారు. వికారాలలోకి వెళ్ళడానికి వీల్లేదు. మీ బోర్డుపై కూడా ప్రజాపిత అన్న పదము తప్పకుండా ఉండాలి. ఈ పదాన్ని తప్పకుండా ఉంచాలి. కేవలం బ్రహ్మా అని వ్రాసినట్లయితే అంతగా ప్రభావముండదు. కావున బోర్డుపై కూడా సరైన పదాలను వ్రాసి సరిచేయవలసి ఉంటుంది. ఇది తప్పకుండా వ్రాయవలసిన పదము. బ్రహ్మా అనే పేరైతే స్త్రీలకు కూడా ఉంటుంది. పేర్లు తరిగిపోతూ ఉంటే ఇక పురుషుల పేర్లను స్త్రీలకు పెట్టేస్తున్నారు. ఇన్ని పేర్లు ఎక్కడ నుండి తీసుకువస్తారు? వాస్తవానికి అంతా డ్రామా ప్లాన్ అనుసారముగానే జరుగుతుంది. తండ్రికి నమ్మకస్థులుగా, ఆజ్ఞాకారులుగా అవ్వడమనేది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. బాబా మరియు దాదా, ఇరువురు కలిసే ఉన్నారు కదా. వీరు ఎవరు అనేది అర్థం చేసుకోలేరు. అందుకే శివబాబా అంటారు, నా ఆజ్ఞను కూడా మీరు అర్థం చేసుకోలేకపోతారు. తప్పు చెప్పినా లేక ఒప్పు చెప్పినా, అది శివబాబా చెప్పారని మీరు భావించినట్లయితే వారే రెస్పాన్సిబుల్ (బాధ్యులు) అవుతారు. ఇతను చెప్పడము వలన ఏదైనా నష్టము కలిగినా కూడా, బాధ్యులు వారు కావున, వారు అంతా సరి చేసేస్తారు. శివబాబాయే చెప్తున్నారని భావిస్తూ ఉన్నట్లయితే మీ ఉన్నతి ఎంతగానో జరుగుతుంది. కానీ కష్టము మీద అలా భావిస్తారు. కొందరైతే తమ సొంత మతముపైనే నడుస్తూ ఉంటారు. పిల్లలైన మీకు డైరెక్షన్లు ఇచ్చేందుకు, మీకు అర్థం చేయించేందుకు తండ్రి ఎంత దూరము నుండి వస్తారు. మరెవ్వరి వద్ద ఈ ఆధ్యాత్మిక జ్ఞానము లేదు. మనుష్యులు అర్థం చేసుకునే విధముగా ఏమి రాయాలి అని మొత్తము రోజంతా ఈ చింతన జరుగుతూ ఉండాలి. మనుష్యుల దృష్టి పడే విధముగా స్పష్టమైన పదాలను వ్రాయాలి. ఎటువంటి ప్రశ్నలు అడగవలసిన అవసరమే రాని విధముగా మీరు అర్థం చేయించండి. మీరు ఇలా చెప్పండి - తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. ఎవరైతే బాగా స్మృతిలో ఉంటారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. ఇది క్షణము యొక్క విషయము. మనుష్యులు ఏమేమో అడుగుతూ ఉంటారు, మీరు ఏమీ చెప్పకండి. మీరు వారికి ఇలా చెప్పండి - ఎక్కువ అడగకండి, ముందు ఒక విషయముపై నిశ్చయము ఏర్పరచుకోండి, ప్రశ్నల అడవిలో ఎక్కువగా చిక్కుకున్నట్లయితే ఇక బయటకు వచ్చేందుకు దారి లభించదు. ఏ విధంగా పొగ మంచులో మనుష్యులు తికమకపడితే ఇక బయటికి రాలేరో, ఇది కూడా అటువంటిదే. మనుష్యులు ఎక్కడ నుండి ఎక్కడికో మాయ వైపుకు వెళ్ళిపోతారు. అందుకే మొదట మీరు అందరికీ ఒకే మాట చెప్పండి - మీరైతే ఆత్మ, అవినాశీ అయినవారు. తండ్రి కూడా అవినాశీయే. వారు పతిత-పావనుడు. మీరు పతితులు. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళాలి మరియు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. పాత ప్రపంచములో చివరి వరకు వస్తూనే ఉంటారు. ఎవరైతే పూర్తిగా చదువుకోరో, వారు తప్పకుండా చివర్లో వస్తారు. లెక్క ఎంతగా ఉంది. అంతేకాక మొదట ఎవరు వెళ్తారు అన్నది చదువు ద్వారా కూడా అర్థం చేసుకోవడము జరుగుతుంది. స్కూల్లో కూడా గమ్యాన్ని చూపిస్తారు కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ముట్టుకుని రండి అని అంటారు. మొదటి నంబరు లభించినవారికి బహుమతి లభిస్తుంది. ఇది అనంతమైన విషయము. అనంతమైన బహుమతి లభిస్తుంది. తండ్రి అంటారు, స్మృతియాత్రలో ఉండండి. దైవీ గుణాలను ధారణ చేయాలి. సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే తయారవ్వాలి, అందుకే బాబా అంటారు, చార్టు పెట్టండి. స్మృతియాత్ర యొక్క చార్టు కూడా పెట్టినట్లయితే - మనము లాభములో ఉన్నామా లేక నష్టములో ఉన్నామా అన్నది తెలుస్తుంది. కానీ పిల్లలు చార్టు పెట్టరు. బాబా చెప్తారు కానీ పిల్లలు చేయరు. చాలా కొద్దిమందే చేస్తారు, అందుకే మాల కూడా చాలా కొద్దిమందిదే తయారవుతుంది. 8 మంది పెద్ద స్కాలర్షిప్ తీసుకుంటారు, ఆ తర్వాత 108 మంది ప్లస్ లో ఉంటారు. ప్లస్ లోకి ఎవరు వెళ్తారు? చక్రవర్తులు మరియు రాణులు. చాలా కొద్ది తేడాయే ఉంటుంది.

తండ్రి చెప్తున్నారు, మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి - ఇదే స్మృతియాత్ర. తండ్రి యొక్క ఈ సందేశాన్నే ఇవ్వాలి, అంతే. ఎక్కువగా విస్తారములోకి వెళ్ళవలసిన అవసరము లేదు. మన్మనాభవ. దేహపు సర్వ సంబంధాలను వదిలి, పాత ప్రపంచములోని వారందరినీ బుద్ధితో త్యాగము చేయాలి, ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, అశరీరిగా అవ్వాలి. ఇక్కడ బాబా స్మృతిని కలిగిస్తున్నారు, మళ్ళీ రోజంతటిలో కొంచెం కూడా స్మృతి చేయరు, శ్రీమతముపై నడవరు. బుద్ధిలో కూర్చోదు. బాబా అంటారు, కొత్త ప్రపంచములోకి వెళ్ళాలంటే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. బాబా మనకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చారు, మనము మళ్ళీ 84 జన్మలు తీసుకుని ఈ విధముగా పోగొట్టుకున్నాము. ఇది లక్షల సంవత్సరాల విషయము కాదు. చాలామంది పిల్లలు భగవంతుని గురించి తెలుసుకోని కారణముగా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తండ్రి అంటారు, మొదట నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపము తొలగిపోతుంది మరియు దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే దేవతలుగా తయారవుతారు, ఇంకేమీ అడగవలసిన అవసరము లేదు. భగవంతుడిని అర్థం చేసుకోకుండా వారసత్వము మరియు మిగిలిన విషయాల గురించి చెప్తూ ఉంటే స్వయము కూడా తికమకపడతారు, ఇక తర్వాత విసిగిపోతారు. తండ్రి అంటారు, మొదట భగవంతుని గురించి తెలుసుకున్నట్లయితే అన్నీ తెలుసుకుంటారు. నా ద్వారా నన్ను తెలుసుకోవడముతో మీరు అన్నీ తెలుసుకుంటారు. ఇక తెలుసుకోవడానికి ఏమీ మిగలవు. అందుకే 7 రోజులు పెట్టడము జరుగుతుంది. 7 రోజుల్లో చాలా అర్థం చేసుకోవచ్చు. కానీ అర్థం చేసుకునేవారు నంబరువారుగా ఉంటారు. కొందరైతే ఏమీ అర్థం చేసుకోరు. వారేమి రాజా-రాణులుగా అవుతారు? ఒక్కరిపైనే రాజ్యము చేస్తారా ఏమిటి? ప్రతి ఒక్కరూ తమ ప్రజలను తయారుచేసుకోవాలి. సమయాన్ని చాలా వృధా చేస్తారు. తండ్రి - అయ్యో పాపం అని అంటారు. వారు ఎంత గొప్ప-గొప్ప పదవులు కలవారైనా కానీ తండ్రి తెలుసు, ఇవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. ఇంకా కొద్ది సమయము మాత్రమే ఉంది. వినాశ కాలే విపరీత బుద్ధి కలవారి వినాశనము జరగనున్నది. ఆత్మలమైన మనకు ఎంత ప్రీతి బుద్ధి ఉంది అనేది అర్థం చేసుకోగలరు. కొందరు అంటారు, ఒకటి-రెండు గంటలు స్మృతి ఉంటుంది అని. లౌకిక తండ్రితో మీరు కేవలం ఒకటి-రెండు గంటలు మాత్రమే ప్రీతి కలిగి ఉంటారా? పూర్తి రోజంతా బాబా, బాబా అని అంటూ ఆ తండ్రిని తలచుకుంటూ ఉంటారు. ఇక్కడ బాబా-బాబా అని అంటారు కానీ అంతటి లోతైన ప్రీతి లేదు. శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి అని పదే-పదే చెప్తుంటారు. సత్యముగా స్మృతి చేయాలి. చతురత నడవదు. మేమైతే శివబాబాను చాలా స్మృతి చేస్తామని అనేవారు చాలామంది ఉన్నారు, మరి అలా అయితే వారు ఎగరడం మొదలుపెట్టాలి. బాబా, ఇక మేమైతే అనేకుల కళ్యాణము చేసే సేవ చేయడానికి వెళ్తాము అని అంటారు. ఎంతగా అనేకమందికి సందేశాన్ని ఇస్తారో, అంతగా స్మృతిలో ఉంటారు. చాలామంది కుమార్తెలు బంధనముంది అని అంటారు. అరే, బంధనమైతే మొత్తము ప్రపంచానికి ఉంది, బంధనాన్ని యుక్తిగా తెంచుకోవాలి. యుక్తులు చాలా ఉన్నాయి. ఒకవేళ రేపు మరణించారనుకోండి, పిల్లలను ఎవరు సంభాళిస్తారు? సంభాళించేందుకు తప్పకుండా ఎవరో ఒకరు వెలువడుతారు. అజ్ఞాన కాలములోనైతే రెండవ వివాహము చేసుకుంటారు. ఈ సమయములోనైతే వివాహము కూడా సమస్యనే. ఎవరికైనా కొద్దిగా డబ్బును ఇచ్చి పిల్లలను సంభాళించమని చెప్పండి. ఇది మీ మరజీవా జన్మ కదా. జీవిస్తూ మరణించినట్లయితే మీ వెనుక ఎవరు సంభాళిస్తారు? కావున తప్పకుండా నర్సును పెట్టుకోవలసి ఉంటుంది. డబ్బుతో సాధ్యము కానిది ఏముంది. బంధనముక్తులుగా తప్పకుండా అవ్వాలి. సేవ చేయాలనే అభిరుచి ఉన్నవారు తమంతట తామే పరుగెత్తుతారు. ప్రపంచముతో మరణించారు కదా. ఇక్కడైతే తండ్రి అంటారు, మిత్ర-సంబంధీకులు మొదలైనవారిని కూడా ఉద్ధరించండి. మన్మనాభవ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి, దీని ద్వారా తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. ఇది తండ్రియే చెప్తారు, ఇతరులైతే పై నుండి వస్తారు. వారి ప్రజలు కూడా వారి వెనుక వస్తూ ఉంటారు. ఉదాహరణకు క్రైస్ట్ అందరినీ కిందకు తీసుకువస్తారు. కింద పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ ఎప్పుడైతే అశాంతిగా అయిపోతారో, అప్పుడు మాకు శాంతి కావాలి అని అంటారు. వారు శాంతిలోనే కూర్చుని ఉండేవారు, ఆ తర్వాత ధర్మ స్థాపకుని వెనుక రావలసి ఉంటుంది. మళ్ళీ, ఓ పతిత-పావనా రండి అని అంటారు. ఈ ఆట ఏ విధముగా తయారై ఉంది. వారు అంతిమములో వచ్చి లక్ష్యము తీసుకుంటారు. పిల్లలు సాక్షాత్కారాన్ని పొందారు. వారు వచ్చి మన్మనాభవ అన్న లక్ష్యాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. ఈ సమయములో ఎవరైతే షావుకార్లుగా ఉన్నారో, వారు బికారులుగా అవుతారు. ఇది అద్భుతము. ఈ ఆట గురించి కొద్దిగా కూడా ఎవ్వరికీ తెలియదు. పూర్తి రాజధాని స్థాపన అవుతూ ఉంది. కొందరు పేదవారిగా కూడా అవుతారు కదా. ఇవి చాలా దూరదృష్టి కల బుద్ధితో అర్థం చేసుకోవలసిన విషయాలు. మనమెలా ట్రాన్స్ఫర్ అవుతాము అని చివర్లో అన్నీ సాక్షాత్కారమవుతాయి. మీరు కొత్త ప్రపంచము కోసం చదువుకుంటారు. ఇప్పుడు సంగమములో ఉన్నారు. చదువుకుని పాస్ అయితే దైవీ కులములోకి వెళ్తారు. ఇప్పుడు బ్రాహ్మణ కులములో ఉన్నారు. ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. భగవంతుడు చదివిస్తున్నారన్నది కొద్దిగా కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. నిరాకారుడైన భగవంతుడు తప్పకుండా వస్తారు కదా. ఈ డ్రామా చాలా అద్భుతముగా తయారై ఉంది, దీని గురించి మీకు తెలుసు మరియు పాత్రను అభినయిస్తున్నారు. బ్రహ్మా ద్వారా స్థాపన అని త్రిమూర్తి చిత్రముపై కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. వినాశనమైతే ఆటోమేటిక్ గా జరిగేదే ఉంది. కేవలం పేరు పెట్టారు. ఇది కూడా డ్రామాగా నిశ్చితమై ఉంది. ముఖ్యమైన విషయమేమిటంటే - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. స్కూల్లో ఎంత బాగా చదివితే, అంత ఎక్కువ ఆదాయము ఉంటుంది. మీకు 21 జన్మల కోసం ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి, ఇదేమైనా తక్కువ విషయమా. ఇక్కడ సంపద ఉన్నా కానీ పిల్లలు-మనవలు మొదలైనవారు తినేంతటి సమయము లేదు. తండ్రి తన సర్వస్వాన్ని ఈ సేవలో సమర్పితము చేసారు కావున వారికి ఎంతగా జమా అయ్యింది. అందరిదీ అలా జమా అవ్వదు. ఇంతమంది లక్షాధికారులు ఉన్నారు, వారి ధనము ఉపయోగపడదు. అది తీసుకుంటే తిరిగి ఇవ్వవలసి ఉంటుంది కావున తండ్రి వారిది తీసుకోనే తీసుకోరు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బంధనాలను తెంచుకునేందుకు యుక్తులు రచించాలి. తండ్రిపై లోతైన ప్రీతిని ఉంచుకోవాలి. తండ్రి సందేశాన్ని అందరికీ ఇచ్చి అందరి కళ్యాణము చేయాలి.

2. దూరదృష్టి కల బుద్ధితో ఈ అనంతమైన ఆటను అర్థం చేసుకోవాలి. బికారుల నుండి రాకుమారులుగా అయ్యే చదువు పట్ల పూర్తి శ్రద్ధ పెట్టాలి. సత్యాతి-సత్యమైన స్మృతి చార్టును పెట్టాలి.

వరదానము:-
సంకల్పము రూపీ బీజాన్ని కళ్యాణపు శుభ భావనతో నిండుగా ఉంచే విశ్వ కళ్యాణకారీ భవ

ఏ విధముగా మొత్తము వృక్షము యొక్క సారమంతా బీజములో ఉంటుందో, అలాగే సంకల్పము రూపీ బీజము ప్రతి ఆత్మ పట్ల, ప్రకృతి పట్ల శుభ భావన కలదిగా ఉండాలి. సర్వులను బాబా సమానముగా తయారుచేయాలి అనే భావన, బలహీనులను శక్తివంతులుగా తయారుచేయాలి అనే భావన, దుఃఖిత-అశాంత ఆత్మలను సదా సుఖ-శాంతులతో ఉండేటట్లుగా చేయాలి అనే భావన యొక్క రసము లేక సారము ప్రతి సంకల్పములో నిండి ఉండాలి. సంకల్పము రూపీ బీజము ఏదీ కూడా ఈ సారము లేకుండా ఉండకూడదు అనగా వ్యర్థము అవ్వకూడదు, కళ్యాణ భావనతో సమర్థముగా ఉండాలి, అప్పుడే వారిని బాబా సమానమైన విశ్వ కళ్యాణకారీ ఆత్మ అని అంటారు.

స్లోగన్:-
మాయ యొక్క జంజాటాలకు భయపడేందుకు బదులుగా పరమాత్మ మేళా యొక్క ఆనందాన్ని పొందుతూ ఉండండి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

కర్మాతీతులుగా అయ్యేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి. శరీర బంధనము, కర్మ బంధనము, వ్యక్తుల బంధనము, వైభవాల బంధనము, స్వభావ-సంస్కారాల బంధనము... ఏ బంధనము కూడా తనవైపుకు ఆకర్షితము చేయకూడదు. ఈ బంధనమే ఆత్మను టైట్ గా చేస్తుంది. దీని కోసం సదా నిర్లిప్తముగా అనగా అతీతమైనవారిగా మరియు అతి ప్రియమైనవారిగా అయ్యే అభ్యాసాన్ని చెయ్యండి.