06-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఎప్పుడైతే మీరు సంపూర్ణముగా పావనముగా
అవుతారో, అప్పుడే తండ్రి మీ బలిహారాన్ని స్వీకరిస్తారు, మీ మనసును ప్రశ్నించుకోండి
- నేను ఎంత పావనముగా అయ్యాను!’’
ప్రశ్న:-
పిల్లలైన మీరు ఇప్పుడు చాలా సంతోషముగా తండ్రిపై బలిహారమవుతారు - ఎందుకని?
జవాబు:-
ఎందుకంటే
ఇప్పుడు మీరు బలిహారమైతే, తండ్రి 21 జన్మల కోసం బలిహారమవుతారని మీకు తెలుసు. ఇప్పుడు
ఈ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞములో మనుష్యమాత్రులందరూ స్వాహా అవ్వాల్సిందేనని కూడా
పిల్లలైన మీకు తెలుసు, అందుకే మీరు ముందు నుండే చాలా సంతోషముగా మీ తనువు-మనసు-ధనము
అన్నింటినీ స్వాహా చేసి సఫలం చేసుకుంటారు.
పాట:-
ముఖాన్ని
చూసుకో ప్రాణీ...
ఓంశాంతి
శివ భగవానువాచ. వారు తప్పకుండా తమ పిల్లల కోసమే జ్ఞానాన్ని నేర్పిస్తారు మరియు
శ్రీమతాన్ని ఇస్తారు - ఓ పిల్లలూ లేదా ఓ ప్రాణులు, శరీరము నుండి ప్రాణము
వెళ్ళిపోతుంది అన్నా లేదా ఆత్మ వెళ్ళిపోతుంది అన్నా, రెండూ ఒకటే. ఓ ప్రాణులు లేదా ఓ
పిల్లలూ, మీ జీవితములో ఎంత పాపము ఉండేది మరియు ఎంత పుణ్యము ఉండేది అనేది మీరు చూసారా!
మీ జీవితములో అర్ధకల్పము పుణ్యము, అర్ధకల్పము పాపముంటుందని మీకు లెక్క చెప్పడము
జరిగింది. పుణ్యము యొక్క వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది, వారిని రాముడని అంటారు.
రాముడు అని నిరాకారుడిని అంటారు, అంతేకానీ సీతకు చెందిన రాముడిని కాదు. ఇప్పుడు
పిల్లలైన మీరు ఎవరైతే బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యారో, మీ బుద్ధిలోకి
వచ్చింది - అర్ధకల్పము మేము పుణ్యాత్ములుగానే ఉండేవారము, తర్వాత అర్ధకల్పము
పాపాత్ములుగా అయ్యాము. ఇప్పుడు పుణ్యాత్ములుగా అవ్వాలి. ఎంత పుణ్యాత్మగా అయ్యాను
అనేది ప్రతి ఒక్కరూ మీ మనసును ప్రశ్నించుకోండి. పాపాత్మ నుండి పుణ్యాత్మగా ఎలా
అవుతారు... అది కూడా తండ్రి అర్థం చేయించారు. యజ్ఞ-తపాదులు మొదలైనవాటి ద్వారా మీరు
పుణ్యాత్ములుగా అవ్వరు, అది భక్తి మార్గము, దీని ద్వారా మనుష్యులెవరూ పుణ్యాత్ములుగా
అవ్వరు. మీరు పుణ్యాత్ములుగా అవుతూ ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమవుతుంది.
ఆసురీ మతము ద్వారా పాపాత్ములుగా అవుతూ-అవుతూ మెట్లు దిగుతూనే వచ్చారు. తాము ఎంత
సమయము పుణ్యాత్ములుగా అవుతాము లేదా సుఖ వారసత్వాన్ని తీసుకుంటాము అనేది ఎవరికీ
తెలియదు. ఆ తండ్రిని మనుష్యులందరూ స్మృతి చేస్తారు, వారినే పరమపిత పరమాత్మ అని
అంటారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను పరమాత్మ అని అనరు, ఇంకెవ్వరినీ పరమాత్మ అని అనలేరు.
ఈ సమయములో మీరు ప్రజాపిత బ్రహ్మా అని అంటారు, కానీ ప్రజాపితను భక్తి మార్గములో
ఎప్పుడూ స్మృతి చేయరు. అందరూ నిరాకార తండ్రినే స్మృతి చేస్తారు - ఓ గాడ్ ఫాదర్, ఓ
భగవాన్ అన్న పదాలే వెలువడుతాయి. ఒక్కరినే స్మృతి చేస్తారు. మనుష్యులు తమను తాము గాడ్
ఫాదర్ అని చెప్పుకోలేరు. అలానే, బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా తమను తాము గాడ్ ఫాదర్
అని చెప్పుకోలేరు. వారి శరీరాలకు పేర్లు అయితే ఉన్నాయి కదా. గాడ్ ఫాదర్ ఒక్కరే,
వారికి తమదంటూ శరీరము లేదు. భక్తి మార్గములో కూడా శివుడిని చాలా పూజిస్తారు. శివబాబా
ఈ శరీరము ద్వారా మీతో మాట్లాడుతున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - ఓ పిల్లలూ,
అని ఎంత ప్రేమగా అంటారు. వారు సర్వుల పతిత-పావనుడు, సద్గతిదాత అన్నది వారికి తెలుసు.
మనుష్యులు తండ్రి మహిమను చేస్తారు కదా, కానీ ఆ తండ్రి 5 వేల సంవత్సరాల తర్వాత
వస్తారు అన్నది మనుష్యులకు తెలియదు. తప్పకుండా కలియుగము సమాప్తమైనప్పుడే వారు
వస్తారు. ఇప్పుడిది కలియుగ అంతిమము కావున తప్పకుండా ఇప్పుడు వచ్చి ఉంటారు. మీకు
శ్రీమతము లభిస్తుంది, శ్రీమతము శ్రీకృష్ణుడిదేమీ కాదు. శ్రీకృష్ణుని ఆత్మ కూడా
శ్రీమతము ద్వారానే దేవతగా అయ్యారు, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు మీరు ఆసురీ
మతము వారిగా అయ్యారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే మీ చక్రము పూర్తవుతుందో, అప్పుడే
నేను వస్తాను. ప్రారంభములో వచ్చిన మీరు, ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నారు. వృక్షము
పాతబడి, శిథిలమైనప్పుడు, మొత్తము వృక్షమంతా అలాగే అయిపోతుంది. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, మీరు తమోప్రధానముగా అవ్వడముతో అందరూ తమోప్రధానముగా అయిపోయారు. ఇది
మనుష్య సృష్టి యొక్క వెరైటీ ధర్మాల వృక్షము, దీనిని తలకిందులుగా ఉన్న వృక్షమని
అంటారు, దీని బీజము పైన ఉన్నారు. ఆ బీజము నుండే మొత్తము వృక్షమంతా వెలువడుతుంది.
మనుష్యులు ‘‘గాడ్ ఫాదర్’’ అని అంటారు కూడా. ఆత్మ పేరు ఆత్మనే అని ఆత్మ అంటుంది.
ఆత్మ శరీరములోకి వచ్చినప్పుడు శరీరానికి పేరు పెట్టడము జరుగుతుంది, ఆట కొనసాగుతుంది.
ఆత్మల ప్రపంచములో ఆట ఉండదు. ఆట జరిగే స్థానము ఇదే. నాటకములో లైట్లు మొదలైనవన్నీ
ఉంటాయి. ఇకపోతే, ఎక్కడైతే ఆత్మలు ఉంటాయో, అక్కడ సూర్యుడు, చంద్రుడు ఉండరు, డ్రామా
యొక్క ఆట నడవదు. రాత్రి-పగలు అనేవి ఇక్కడ ఉంటాయి. సూక్ష్మవతనములో కానీ లేక
మూలవతనములో కానీ రాత్రి-పగలు అనేవి ఉండవు, కర్మక్షేత్రము ఇదే. ఇక్కడ మనుష్యులు మంచి
కర్మలు కూడా చేస్తారు, చెడు కర్మలు కూడా చేస్తారు. సత్య, త్రేతాయుగాలలో మంచి కర్మలు
జరుగుతాయి ఎందుకంటే అక్కడ 5 వికారాల రూపీ రావణ రాజ్యమే లేదు. తండ్రి కూర్చుని
కర్మ-అకర్మ-వికర్మల రహస్యాన్ని తెలియజేస్తారు. కర్మలనైతే చేయాల్సిందే, ఎందుకంటే ఇది
కర్మక్షేత్రము. సత్యయుగములో మనుష్యులు ఏవైతే కర్మలు చేస్తారో, అవి అకర్మలుగా ఉంటాయి.
అక్కడ రావణ రాజ్యమే లేదు, దానిని స్వర్గము అని అంటారు. ఈ సమయములో స్వర్గము లేదు.
సత్యయుగములో భారత్ ఒక్కటే ఉండేది, ఇతర ఖండాలేవీ ఉండేవి కాదు. హెవెన్లీ గాడ్ ఫాదర్
అని అంటున్నారంటే తండ్రి తప్పకుండా హెవెన్ ను రచిస్తారు. భారత్ ప్రాచీన దేశమని అన్ని
దేశాల వారికి తెలుసు. మొట్టమొదట కేవలం భారత్ మాత్రమే ఉండేది, అది ఎవరికీ తెలియదు.
ఇప్పుడు అలా లేదు కదా. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. క్రైస్టుకు 3 వేల
సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేదని అంటారు కూడా. రచయిత తప్పకుండా రచనను
రచిస్తారు. తమోప్రధాన బుద్ధి కలవారిగా ఉన్న కారణముగా ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు.
భారత్ అయితే అన్నింటి కన్నా ఉన్నతమైన ఖండము. అది మనుష్య సృష్టి యొక్క మొదటి వంశము.
ఈ డ్రామా తయారై ఉంది. షావుకారులు పేదవారికి సహాయము చేస్తారు, ఇది కూడా కొనసాగుతూ
వస్తుంది. భక్తి మార్గములో కూడా షావుకారులు పేదవారికి దానము చేస్తారు. కానీ ఇది
ఉన్నదే పతిత ప్రపంచము. కావున ఎవరు ఏ దాన-పుణ్యాలు చేసినా, చేసేవారు పతితులే,
ఎవరికైతే దానము చేస్తారో వారు కూడా పతితులే. పతితులు, పతితులకు దానము చేస్తారు,
దానికి ఏమి ఫలం పొందుతారు. ఎన్ని దాన-పుణ్యాలు చేస్తూ వచ్చినా సరే, దిగిపోతూనే
వచ్చారు. భారత్ వంటి దానీ ఖండము ఇంకేదీ ఉండదు. ఈ సమయములో మీ తనువు-మనస్సు-ధనము ఏవైతే
ఉన్నాయో, అన్నింటినీ ఇందులో స్వాహా చేస్తారు, దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశీ జ్ఞాన
యజ్ఞమని అంటారు. ఈ పాత శరీరాన్ని కూడా ఇక్కడ స్వాహా చేయాలి అని ఆత్మ అంటుంది,
ఎందుకంటే మొత్తము ప్రపంచములోని మనుష్యమాత్రులందరూ ఇందులో స్వాహా అవుతారని మీకు
తెలుసు, అటువంటప్పుడు మనము సంతోషముగా బాబాపై ఎందుకు బలిహారమవ్వకూడదు. నేను తండ్రిని
స్మృతి చేస్తాను అని - ఆత్మకు తెలుసు. బాబా, మీరు వచ్చినప్పుడు మేము బలిహారమవుతామని
కూడా అంటూ వచ్చారు, ఎందుకంటే ఇప్పుడు మేము బలిహారమైతే, మీరు కూడా 21 జన్మలకు మాపై
బలిహారమవుతారు. ఇది వ్యాపారము. మేము మీపై బలిహారమైతే, మీరు కూడా 21 సార్లు
బలిహారమవుతారు. తండ్రి అంటారు, ఎప్పటివరకైతే మీ ఆత్మ పవిత్రముగా అవ్వదో, అప్పటివరకు
నేను మీ బలిహారాన్ని స్వీకరించను.
తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రముగా అయిపోతుంది.
తండ్రిని మర్చిపోవడముతో మీరు ఎంత పతితులుగా, దుఃఖితులుగా అయ్యారు. మనుష్యులు
దుఃఖితులుగా అయినప్పుడు, శరణాగతిని తీసుకుంటారు. ఇప్పుడు మీరు 63 జన్మలు రావణుడి
కారణముగా చాలా దుఃఖితులుగా అయ్యారు. ఇది ఒక్క సీత విషయము కాదు, మనుష్యమాత్రులందరూ
సీతలే. సీతను రావణుడు శోక వాటికలో పెట్టాడని రామాయణములోనైతే కథ వ్రాశారు.
వాస్తవానికి ఆ విషయమంతా ఈ సమయానికి చెందినదే. అందరూ రావణుడి జైలులో అనగా 5 వికారాల
జైలులో ఉన్నారు, అందుకే దుఃఖితులుగా అయి - మమ్మల్ని వీటి నుండి విడిపించండి అని
పిలుస్తారు. ఇది ఒక్కరి విషయము కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మొత్తము
ప్రపంచమంతా రావణుడి జైలులో ఉంది. ఇది రావణ రాజ్యము కదా. రామ రాజ్యము కావాలని
కోరుకుంటారు కూడా. గాంధీ కూడా కోరుకునేవారు. రామ రాజ్యము కావాలని సన్యాసులు ఎప్పుడూ
అనరు. భారతవాసులే అంటారు. ఈ సమయములో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము లేదు, మిగిలిన
శాఖలు ఉన్నాయి. సత్యయుగము ఉన్నప్పుడు ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉండేది.
ఇప్పుడు ఆ పేరే మారిపోయింది. తమ ధర్మాన్ని మరచి వేరే-వేరే ధర్మాలలోకి కన్వర్ట్
అయిపోతూ ఉంటారు. ముసల్మానులు వచ్చి ఎంతమంది హిందువులను తమ ధర్మములోకి కన్వర్ట్
చేసుకున్నారు. క్రిస్టియన్ ధర్మములోకి కూడా చాలామంది కన్వర్ట్ అయ్యారు, అందుకే
భారతవాసుల జన సంఖ్య తగ్గిపోయింది. లేకపోతే భారతవాసుల జన సంఖ్య అందరికన్నా ఎక్కువగా
ఉండాలి. అనేక ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. తండ్రి అంటారు, మీ ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మము అన్నింటికన్నా ఉన్నతమైనది. మీరు సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడు
మీరే మారిపోయి తమోప్రధానముగా అయ్యారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు,
జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు అని ఎవరినైతే పిలుస్తారో, వారే సమ్ముఖములో
చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు. క్రైస్టును ఈ విధముగా మహిమ చేయరు.
శ్రీకృష్ణుడిని జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు అని అనడము జరగదు. సాగరము ఒక్కటే ఉంటుంది.
నలువైపులా ఆల్రౌండ్ సాగరమే సాగరముంది. రెండు సాగరాలు ఉండవు. ఇది మనుష్య సృష్టి
నాటకము, ఇందులో అందరివీ వేరు-వేరు పాత్రలు ఉన్నాయి. తండ్రి అంటారు, నా కర్తవ్యము
అందరికన్నా భిన్నమైనది, నేను జ్ఞానసాగరుడిని. ఓ పతిత-పావనా అని మీరు నన్నే
పిలుస్తారు, అలాగే ఓ ముక్తిప్రదాత అని కూడా అంటారు. వారు దేని నుండి విముక్తులుగా
చేస్తారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. మీరు సత్య, త్రేతాయుగాలలో చాలా సుఖముగా
ఉండేవారని, దానిని స్వర్గమని అంటారని మీకు తెలుసు. ఇప్పుడిది నరకము, అందుకే - దుఃఖము
నుండి విడిపించి సుఖధామానికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. ఫలానావారు
స్వర్గస్థులయ్యారని సన్యాసులు ఎప్పుడూ అనరు, వారు నిర్వాణములోకి వెళ్ళారని అంటారు.
విదేశాలలో కూడా ‘‘లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబోడ్’’ (స్వర్గానికి వెళ్ళారు) అని అంటారు.
గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళారని భావిస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు, కావున
తప్పకుండా స్వర్గముండేది. ఇప్పుడు లేదు. నరకము తర్వాత స్వర్గము ఉండాలి. గాడ్ ఫాదర్
ఇక్కడకు వచ్చి స్వర్గాన్ని స్థాపన చేయాలి. సూక్ష్మవతనము, మూలవతనములో స్వర్గమేమీ
ఉండదు. తప్పకుండా తండ్రియే రావాల్సి ఉంటుంది.
తండ్రి అంటారు - నేను వచ్చి ప్రకృతిని ఆధారముగా చేసుకుంటాను, నా జన్మ మనుష్యుల
వలె జరగదు, నేను గర్భములోకి రాను, మీరంతా గర్భములోకి వస్తారు. సత్యయుగములో గర్భ మహల్
ఉంటుంది, ఎందుకంటే శిక్షలు అనుభవించేందుకు అక్కడ ఎలాంటి వికర్మలు జరగవు, అందుకే
దానిని గర్భ మహల్ అని అంటారు. ఇక్కడ వికర్మలు చేస్తారు, వాటికి శిక్షలు అనుభవించవలసి
ఉంటుంది, అందుకే దీనిని గర్భ జైలు అని అంటారు. ఇక్కడ, రావణ రాజ్యములో మనుష్యులు
పాపాలు చేస్తూ ఉంటారు. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. అది పుణ్యాత్ముల ప్రపంచము -
స్వర్గము. అందుకే రావి ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చారని అంటారు. ఇలా శ్రీకృష్ణుని మహిమను
చూపిస్తారు. సత్యయుగములో గర్భములో దుఃఖముండదు. తండ్రి కర్మ-అకర్మ-వికర్మల గతులను
అర్థం చేయిస్తారు, దానినే మళ్ళీ గీతా శాస్త్రముగా తయారుచేసారు. కానీ, అందులో శివ
భగవానువాచకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసేసారు. మనము అనంతమైన తండ్రి నుండి
అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు భారత్ రావణుడి
ద్వారా శాపగ్రస్థమైంది, అందుకే దుర్గతిపాలు అయ్యింది. ఈ పెద్ద శాపము కూడా డ్రామాలో
నిశ్చితమై ఉంది. తండ్రి వచ్చి - ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ, సంపత్తివాన్ భవ... అని
వరాలను ఇస్తారు. అన్ని సుఖాల వారసత్వాన్ని ఇస్తారు. వారు వచ్చి మిమ్మల్ని
చదివిస్తారు, ఆ చదువు ద్వారా మీరు దేవతలుగా అవుతారు. కొత్త రచన రచించబడుతుంది.
బ్రహ్మా ద్వారా మిమ్మల్ని తండ్రి తమవారిగా చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మా అని అంటూ
ఉంటారు కూడా. మీరు వారి పిల్లలైన బ్రహ్మాకుమార-కుమారీలుగా అయ్యారు. తాతగారి
వారసత్వాన్ని తండ్రి ద్వారా తీసుకుంటారు. ఇంతకుముందు కూడా తీసుకున్నారు. ఇప్పుడు
మళ్ళీ తండ్రి వచ్చారు. తండ్రి పిల్లలు తండ్రి వద్దకే వెళ్ళాలి. కానీ, ప్రజాపిత
బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టి స్థాపన అవుతుందని అంటూ ఉంటారు. అది ఇక్కడే జరుగుతుంది
కదా. ఆత్మ సంబంధములో మేము సోదరులమని అంటారు. ప్రజాపిత బ్రహ్మాకు సంతానముగా అవ్వడముతో
మీరు సోదరీ-సోదరులుగా అవుతారు. ఈ సమయములో మీరంతా సోదరీ-సోదరులు, మీరు తండ్రి నుండి
వారసత్వాన్ని తీసుకున్నారు. ఇప్పుడు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు.
శివబాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయండి. ఆత్మ అయిన మీరు శివబాబాను స్మృతి చేయాలి.
స్మృతి చేయడము ద్వారానే మీరు పావనముగా అవుతారు, ఇంకే ఉపాయము లేదు. పావనముగా
అవ్వకుండా మీరు ముక్తిధామానికి వెళ్ళలేరు. జీవన్ముక్తిధామములో మొట్టమొదట ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మముండేది, ఆ తర్వాత నంబరువారుగా వేరే-వేరే ధర్మాలు వచ్చాయి. తండ్రి
చివరిలో వచ్చి అందరినీ దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు. వారిని ముక్తిప్రదాత అని
కూడా అంటారు. తండ్రి అంటారు, మీరు కేవలం నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి.
బాబా రండి, మమ్మల్ని పతితుల నుండి పావనముగా చేయండి అని పిలుస్తారు కూడా. లౌకికములో
టీచరు చదివిస్తారు, అందులో మీ చరిత్ర ఏమైనా తయారుచేస్తారా? ఇది కూడా చదువే.
జ్ఞానసాగరుడైన తండ్రే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. కర్మ, అకర్మ మరియు వికర్మల గతులను తెలుసుకుని, ఇప్పుడు ఎటువంటి వికర్మలు
చేయకూడదు. కర్మక్షేత్రములో కర్మలు చేస్తూ వికారాలను త్యాగము చేయడమే వికర్మల నుండి
రక్షించుకోవడము.
2. మన బలిహారాన్ని తండ్రి స్వీకరించే విధముగా పావనముగా అవ్వాలి. పావనముగా అయి
పావన ప్రపంచములోకి వెళ్ళాలి. తనువు-మనస్సు-ధనములను ఈ యజ్ఞములో స్వాహా చేసి సఫలం
చేసుకోవాలి.
వరదానము:-
నాలెడ్జ్ యొక్క లైట్-మైట్ ద్వారా విఘ్న వినాశకులుగా అయ్యే
మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ భవ
భక్తి మార్గములో గణేశుడిని విఘ్నవినాశకుడు అని అంటూ
పూజిస్తారు, అంతేకాక వారిని మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అనగా విద్యాపతిగా కూడా భావిస్తారు.
కనుక ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అవుతారో, వారు ఎప్పుడూ విఘ్నాలతో ఓడిపోరు.
ఎందుకంటే నాలెడ్జ్ ను లైట్-మైట్ అని అంటారు, దాని ద్వారా గమ్యాన్ని చేరుకోవడం
సహజమవుతుంది. ఇలా ఎవరైతే విఘ్న వినాశకులుగా ఉన్నారో, తండ్రితో సదా కంబైండ్ గా ఉంటూ
జ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటారో, వారు ఎప్పుడూ విఘ్నాలతో ఓడిపోలేరు.
స్లోగన్:-
లోపల
బయట ఏవైతే లోపాలు ఉన్నాయో, వాటిని సంపూర్ణముగా వీలునామా చేస్తే విల్ పవర్
వచ్చేస్తుంది.
అవ్యక్త ప్రేరణలు -
‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చెయ్యండి’’
ఇప్పుడిది
అనుభవజ్ఞులుగా అయ్యి ఇతరులను కూడా అచంచలముగా, స్థిరముగా చేసే, అనుభవము చేయించే సమయము.
ఇప్పుడు ఆడుకునే సమయము సమాప్తమయ్యింది. ఇప్పుడు సదా సమర్థులుగా అయ్యి నిర్బల ఆత్మలను
సమర్థులుగా చేస్తూ వెళ్ళండి. మీలో బలహీనతతో కూడిన సంస్కారాలు ఉన్నట్లయితే ఇతరులను
కూడా బలహీనులుగా తయారుచేస్తారు. జ్ఞానములోని ప్రతి పాయింట్ యొక్క అనుభవజ్ఞులుగా
అయ్యేందుకు ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకాగ్రతా అభ్యాసాన్ని పెంచండి.
| | | |