06-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 19.10.2011


‘‘వ్యర్థ సమయము, వ్యర్థ సంకల్పాలపై విజయులుగా అయ్యి పరస్పరములో సంస్కార మిలనము యొక్క రాస్ చేసే సంకల్పము చేయండి’’

ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. అందరూ ఎంతో ప్రేమతో తమ స్మృతిని అందిస్తున్నారు. ఇంతగా ఒక్క బాబాను మాత్రమే ప్రేమిస్తారు. ఈ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు మాత్రమే ప్రాప్తిస్తుంది. ప్రతి బిడ్డ ప్రేమలో లవలీనమై ఉన్నారు. బాబా కూడా ప్రతి బిడ్డకు ప్రేమకు బదులు ఇస్తున్నారు. వాహ్ పిల్లలు వాహ్! సమ్ముఖములో ఉన్నా లేక దూరంగా ఉన్నా, ప్రతి బిడ్డ బాబా హృదయములో ఇమిడి ఉన్నారు. ఇంతటి ప్రేమను ఎవరు ఇస్తారు అని అందరి మనసులలో ఈ పాట మ్రోగుతుంది! బాబా మరియు పిల్లల యొక్క ఈ ఆత్మిక ప్రేమ ప్రతి బిడ్డను దేహము నుండి అతీతముగా మరియు బాబాకు ప్రియముగా చేసేది మరియు ఈ ప్రేమ ఈ సమయములోనే పిల్లలకు ప్రాప్తిస్తుంది. ఈ ప్రేమ పిల్లలను ఎలా ఉన్నవారిని ఎలా తయారుచేస్తుంది. ఈ ప్రేమ కేవలం ఈ ఒక్క జన్మలో మాత్రమే ప్రాప్తిస్తుంది. బాబా కూడా పిల్లల స్నేహాన్ని చూసి పిల్లల స్నేహములో ఇమిడిపోతారు.

ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకములో మూడు భాగ్యాలను చూస్తున్నారు. ఒకటి - తండ్రి స్వరూపములో ప్రాప్తించిన వారసత్వము యొక్క భాగ్యము, రెండు - శిక్షకుని రూపములో శ్రేష్ఠ శిక్షణ యొక్క భాగ్యము మరియు మూడు - సద్గురువు రూపములో వరదానాల భాగ్యము. ప్రతి ఒక్కరి మస్తకము ఈ మూడు భాగ్యాలతో మెరుస్తూ ఉంది. బాప్ దాదా కూడా తమ భాగ్యశాలి పిల్లలను చూసి హర్షిస్తున్నారు. సమ్ముఖములో కూర్చుని ఉన్నా లేక దూరంగా కూర్చుని ఉన్నా, హృదయములో సమీపముగా ఉన్నారు. తండ్రి, పిల్లల ఇటువంటి ప్రేమ పూర్తి కల్పములో ఈ సమయములోనే ప్రాప్తిస్తుంది. ఈ ప్రేమ యొక్క అనుభవాన్ని ఇతరులకు కూడా కలిగిస్తున్నారు. ఈ బ్రాహ్మణ ఆత్మలకు ఏదో లభించింది అని ఇప్పుడు కొందరు భావిస్తున్నారు. ఏమి లభించింది అన్నది స్పష్టమవుతూ ఉంది. బాబా ఏమి చూసారంటే, ఇప్పుడు ఈ ప్లాటినమ్ జూబ్లీ ప్రభావము నలువైపులా ఉంది మరియు పిల్లలు కూడా హృదయపూర్వకముగా సేవ చేసారు మరియు భవిష్యత్తు కోసం కూడా ప్లాన్ ను తయారుచేసారు. కావున బాప్ దాదా కూడా నలువైపులా ఉన్న పిల్లలకు అభినందనలు తెలియజేస్తున్నారు - వాహ్ పిల్లలూ వాహ్! ఈ 75 సంవత్సరాలు తమ-తమ పురుషార్థమనుసారముగా ముందుకు వెళ్తూ, నిర్విఘ్నులుగా అవుతూ, తయారుచేస్తూ ఇక్కడ వరకు చేరుకున్నారు. ఇప్పుడు బాబా పిల్లల నుండి ఏమి కోరుకుంటున్నారు? బాబాకు సదా ప్రతి బిడ్డ పట్ల ఇదే ఆశ ఉంది - ప్రతి బిడ్డ బాబా సమానముగా అవ్వాలి. ఎలా అయితే బ్రహ్మాబాబా విజయులుగా అయ్యారో, అలా ప్రతి బిడ్డ సదా విజయీగా అవ్వాలి. దీని కోసం బ్రహ్మాబాబా ఏమి చేసారు? ఫాలో ఫాదర్. అలా మీరందరూ కూడా ప్రతి అడుగు వేసే ముందు చెక్ చేసుకోండి - ఈ అడుగు బ్రహ్మాబాబా వేసారా? బ్రహ్మాబాబాకు ప్రతి బడ్డ పట్ల, ఫలానా బిడ్డ బలహీనముగా ఉన్నారని తెలిసినప్పటికీ, పురుషార్థములో కూడా మరియు సేవలో కూడా బలహీనముగా ఉన్నారని తెలిసినా, బలహీనముగా ఉన్నవారి పట్ల వారికి మరింత దయ మరియు కళ్యాణ భావన ఉండేవి. అలాగే బాప్ దాదా పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు - మీ పరివారములోని ప్రతి సోదరుడు లేక సోదరి పట్ల శుభ భావనను, శుభ కామనను, దయను మరియు కళ్యాణ దృష్టిని ఉంచి వారికి కూడా సహయోగులుగా అవ్వండి. బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు. ప్రేమ అనే సబ్జెక్టులో ప్రతి బిడ్డ యథాశక్తి పాస్ అయి ఉన్నారు. ప్రేమ ఉన్న కారణముగానే ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు బాప్ దాదా పిల్లల ప్రేమను చూసి సంతోషిస్తున్నారు. ప్రేమ సబ్జెక్టు కారణముగానే ప్రతి బిడ్డ నంబరువారుగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు బాప్ దాదా ఏమి ఆశిస్తున్నారంటే, ప్రేమలో కొంత త్యాగము కూడా చెయ్యడం జరుగుతుంది. బాబా పట్ల ప్రేమ ఉంది కనుక ఏ త్యాగము చేయాలి? బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు అనేదైతే అర్థమైంది కదా. అర్థమైంది కదా బాబా ఏమి కోరుకుంటున్నారో? అర్థమైందా? తల ఊపండి. అర్థమైందా? మరి అది చేయాలి. దాని కోసం కూడా ధైర్యము ఉంది కదా. ధైర్యముంటే చేతులెత్తండి. ధైర్యము ఉందా? అచ్ఛా! అయితే ధైర్యము చేసే పిల్లలకు తండ్రి సహాయము ఉండనే ఉంటుంది. ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే, రిజల్టులో ఏమి కనిపించిందంటే, ఇప్పటివరకు సంపూర్ణ పవిత్రత లెక్కలో వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతకు బీజమే. బాప్ దాదా ఏమి చూసారంటే, వ్యర్థ సంకల్పాలు నడవడమనే సంస్కారము మెజారిటీ పిల్లలలో ఇప్పటికీ ఉంది. ఒకటి వ్యర్థ సంకల్పాలు, రెండు వ్యర్థ సమయము - ఇది మెజారిటీ పిల్లల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. వ్యర్థ సంకల్పాలకు ఆధారము మనసు, అది మన్మనాభవ స్థితిలో ఉండనివ్వదు ఎందుకంటే బాప్ దాదా ఎంతోకాలం నుండి - ఏమి జరిగేది ఉన్నా అది అకస్మాత్తుగా జరగనున్నది అన్న సూచనను ఇచ్చి ఉన్నారు. అకస్మాత్తుగా జరగనున్నది అన్న కోణములో బాప్ దాదా చెక్ చేసారు. మెజారిటీ పిల్లల్లో ఈ వ్యర్థ సంకల్పాల సంస్కారము ఉంది. బ్రహ్మాబాబా వ్యర్థ సమయము, వ్యర్థ సంకల్పాలపై విజయునిగా అయ్యి కర్మాతీతముగా అయ్యారు కదా, అలా ఫాలో ఫాదర్.

బాప్ దాదా ఏమి చూసారంటే - మనసు మీ రచన, మీరు మనసుకు రచయిత అంటే మీరు మనసును నడిపించేవారు. మనసు యొక్క కంట్రోలింగ్ పవర్ కు, రూలింగ్ పవర్ కు మీరు యజమానులు, అయినా కానీ మనసు ఎక్కడో ఒక చోట మోసం చేసేస్తుంది. వాస్తవానికి మనసు మీ రచన, నా మనసు అని అంటారు కదా! కానీ కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉన్న కారణముగా అది మోసము చేస్తుంది. మనసును గుర్రమని కూడా అంటారు. కానీ మీ వద్ద శ్రీమతము అనే కళ్ళెము ఉంది. ఉంది కదా కళ్ళెము! ఒకవేళ మనసు ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాల వైపుకు తీసుకువెళ్తే వెంటనే కళ్ళెమును టైట్ చేయడం ద్వారా (బిగించడం ద్వారా) వ్యర్థ సంకల్పాలు అనే కొద్దిపాటి అపవిత్రతను కూడా సమాప్తము చేయగలుగుతారు. మనసుకు యజమానిగా అయ్యి, ఎలా అయితే బ్రహ్మాబాబా రోజూ మనసును చెక్ చేసుకునేవారో, అలాగే రోజూ చెకింగ్ చేసుకోండి మరియు వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేయండి. ఈ రోజు బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ఈ వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేయండి. చెడు సంకల్పాలు తక్కువ ఉన్నాయి, వ్యర్థ సంకల్పాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇందులో సమయము చాలా వృధా అవుతుంది. మనసుకు యజమానిగా అయ్యి మనసును ఎలా బిజీ పెట్టండంటే అది ఇతర వైపులకు ఆకర్షితమై మీ కళ్ళెమును ఢీలా చేయకూడదు. ఇది వీలవుతుందా? ఈ రోజు బాప్ దాదా వ్యర్థ సంకల్పాల సమాప్తి కోసం అందరికీ సంకల్పము ఇస్తున్నారు. వీలవుతుందా? వ్యర్థ సంకల్పాలు కూడా సమాప్తమవ్వాలి అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సమారోహము జరుపుతాము. సమయము కూడా వ్యర్థమవ్వకుండా పొదుపు చేయాలి. సమయము మరియు సంకల్పాలు, రెండింటినీ పొదుపు చేయాలి ఎందుకంటే బాప్ దాదా అందరి చార్టును చూస్తారు. చార్టులో మెజారిటీ పిల్లల్లో ఈ లోపము కనిపించింది. మనసుకు యజమానులే విశ్వానికి యజమానులుగా అవ్వబోతున్నారు. ఎలా అయితే బ్రహ్మాబాబా మనసును జయించి విశ్వానికి యజమానిగా అయ్యారు. ఇప్పుడైతే మీ కోసం, పిల్లల కోసం ఆహ్వానము ఇస్తున్నారు. మీ అడ్వాన్స్ పార్టీ కూడా ఆహ్వానిస్తుంది. వినిపించాము కదా, ఉదయము నాలుగు గంటలకు అడ్వాన్స్ పార్టీవారు వతనములోకి వస్తారు, అప్పుడు ముక్తి ద్వారాలను ఎప్పుడు తెరుస్తారు అని అడుగుతారు? ఎవరు తెరవాలి? మీరందరూ ముక్తి ద్వారాలను తెరిచేవారు కదా! మీరు సంపూర్ణముగా అవ్వడము అంటే ముక్తి ద్వారాలు తెరుచుకోవడము. బాప్ దాదాను అడ్వాన్స్ పార్టీవారు - ఇంకా ఎప్పటివరకు అని ఆత్మిక సంభాషణలో అడుగుతూ ఉంటారు. మరి ఎప్పటివరకు - అని బాబా మిమ్మల్ని అడుగుతున్నారు. మరి ఏమని జవాబు ఇస్తారు? మొదటి లైన్ వారు చెప్పండి, ఎప్పటివరకు? ప్రతి కార్యానికి డేట్ ను ఫిక్స్ చేస్తారు కదా! అలా ఈ కార్యానికి డేట్ ఏమిటి? బ్రహ్మాబాబా అయితే ఫరిశ్తా రూపములో ఆహ్వానిస్తున్నారు. డేట్ చెప్పగలరా? చెప్పండి, డేట్ ను ఫిక్స్ చెయ్యగలరా? ఇప్పుడు డేట్ ఫిక్స్ అయిందా? పాండవులు చేతులెత్తండి, డేట్ ఫిక్స్ అయిందా? లేదా? ఎందుకని? దీదీ అన్నారు - బాబా, మాకైతే ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అన్న తపన ఉండేది. దాదీ అన్నారు - బాబా, మాకు కర్మాతీతముగా అవ్వాలి, కర్మాతీతముగా అవ్వాలి అన్న తపన ఉండేది. మరి మీ అందరికీ అయితే దీదీ, దాదీల పట్ల ప్రేమ ఉంది కదా. వాస్తవానికి అందరి పట్ల ప్రేమ ఉండేది, ఎందుకంటే ఎవరెవరైతే అడ్వాన్స్ పార్టీలో వెళ్ళారో, వారందరి పట్ల మీకు ప్రేమైతే ఉంది. ఇప్పుడు వారి ప్రశ్నకు జవాబు ఇవ్వండి. మీరు పరస్పరము మాట్లాడుకుని ఇప్పుడు ఏదైనా జవాబును సిద్ధము చేయండి. చేస్తారా?

ఈ రోజైతే డబుల్ విదేశీయుల మిలనము కదా. కనుక డబుల్ విదేశీయులు కూడా పరస్పరములో చర్చించుకుని డేట్ ను చెప్పండి. అలాగే భారతవాసులు కూడా దీనిపై చర్చించుకుని చెప్పండి. ఉందా జవాబు! ఆ చెప్పండి, చెప్పండి... ఎవరైతే చెప్పారో, వారు చేతులెత్తండి. (న్యూ యార్క్ మోహినీ దీదీ మాట్లాడారు - బాబా, డేట్ ను మీరు ఫిక్స్ చేయండి, మేము ఎవర్రెడీగా ఉన్నాము) బాబా అన్నారు - లేదు. మీరు ఫిక్స్ చేయండి. తయారవ్వాల్సింది మీరు కదా. బాబా అయితే ఈ దీపావళికి దీపావళి చేసేయండి అని అంటారు. ఎవర్రెడీనా? ఎవర్రెడీనా? లేదా ఈ డేట్ చాలా దగ్గరగా ఉంది అని అంటారా? అందుకే, డేట్ మీరు ఫిక్స్ చేయండి అని చెప్తున్నాము. (డాక్టర్ నిర్మల దీదీ అన్నారు - బాబా, ఒక్క సంవత్సరము ఇవ్వండి) అచ్ఛా, దీనికి ఒప్పుకుంటారా, వీరు ఒక్క సంవత్సరము కావాలని అంటున్నారు. ఎవరైతే ఒక్క సంవత్సరము కావాలి అని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. చేతులు బాగా పైకి ఎత్తండి. అచ్ఛా! ఒక్క సంవత్సరము అనేవారి పేర్లు నోట్ చేసుకోండి. మంచిది. మిగతావారంతా చిరునవ్వు నవ్వుతున్నారు. చెప్పండి. (నిర్వైర్ భాయిజీ అన్నారు - నౌ ఆర్ నెవర్, ఈ రోజే, ఇప్పుడే జరగాలి అని అన్నారు) అయితే చప్పట్లు కొట్టండి. మంచిది, చాలా మంచిది. అయితే ఇప్పటికిప్పుడే అందరూ మీ మనసులో ఈ ప్రతిజ్ఞను చేయండి - ఎప్పుడూ కూడా వ్యర్థ సంకల్పాలను రానివ్వము అని. ఇది వీలవుతుందా? నౌ ఆర్ నెవర్ (ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు) అని ఇప్పటినుండే అంటున్నట్లయితే మరి అందరూ కనీసం ఈ ప్రతిజ్ఞను అయినా చెయ్యగలరా - ఇప్పటినుండి వ్యర్థ సంకల్పాలు చేయము, సమయాన్ని వ్యర్థముగా పోగొట్టము అని? ఈ విషయములో ఎవరైతే సిద్ధముగా ఉన్నారో, వారు చేతులెత్తండి. మెజారిటీ చేతులెత్తారు. ఎవరైతే ఇంకా సమయము పడుతుంది అని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. కొద్దిమంది చేతులెత్తుతున్నారు. అచ్ఛా, అయితే ఈ దీపావళికి ఈ ఒక్క దృఢ సంకల్పము చేయండి. ఎవరైతే మెజారిటీ చేతులెత్తారో, వారు స్వాహా చేయండి. దృఢ సంకల్పము చేసిన సందర్భముగా మీ అందరి తరఫు నుండి ఈ రోజు కేక్ కట్ చేస్తాము. ఇష్టమే కదా! ఈ నాటి కేక్ ఈ దృఢ సంకల్పానికి సూచకము ఎందుకంటే - ఇప్పుడు అందరూ, అజ్ఞానులు కూడా - ఇప్పుడు ఏదైనా జరగాలి, ఏదైనా జరగాలి అని కోరుకుంటున్నారు, కానీ శక్తి లేదు. పిల్లలైన మీలోనైతే సంకల్పాన్ని పూర్తి చేసే శక్తి ఉంది. ఫాలో ఫాదర్ కదా. బ్రహ్మాబాబా జన్మయే దృఢ సంకల్పము ద్వారా జరిగింది. చెయ్యాల్సిందే. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఆలోచిద్దాము అని అనుకోలేదు. చెయ్యాల్సిందే. ఆ ఒక్క దృఢ సంకల్పము ఇంతమంది పిల్లల భవిష్యత్తును తయారుచేసింది. ఒక్క బ్రహ్మాబాబా ఎంత ధైర్యమును ఉంచారు. సగం వాటా లభించగానే యజ్ఞాన్ని రచించారు. యజ్ఞములో బ్రాహ్మణులను రచించారు మరియు దేశ-విదేశాల నుండి ఆత్మలు చేరుకున్నారు - ఇదంతా ఒక్క బ్రహ్మాబాబా దృఢ సంకల్పము కారణముగా జరిగింది. మరి దృఢ సంకల్పము చేయలేనిదంటూ ఏముంది? బాబా అయితే మీ ముందు ఒక ఉదాహరణగా ఉన్నారు. సంకల్పాలు చేస్తుంటారు, చాలా మంచి-మంచి సంకల్పాలు బాబా వద్దకు చేరుకుంటాయి కానీ వాటిలో దృఢత్వము లోపిస్తుంది. ఏదైనా విషయము ఎదురుగా రాగానే దృఢత్వము తగ్గిపోతుంది. దృఢత సఫలతకు తాళంచెవి.

చూడండి, ఢిల్లీవారు ‘చెయ్యాల్సిందే’ అని దృఢ సంకల్పము చేసారు. మరి జరిగింది కదా! ఆలోచిద్దాము, చూద్దాము అని అనుకోలేదు. అందరి దృఢ సంకల్పము ఉంది. నిమిత్తమైన పిల్లల సహయోగము మరియు దృఢ సంకల్పము ప్రాక్టికల్ సఫలతను తీసుకువచ్చింది. ఇందులో అందరూ సహయోగము అందించారు మరియు ఏకమతముతో ఉన్నారు. అవును కాదు, అవును కాదు అని లేకుండా ఒకే దృఢ మతముతో ఉన్నారు. దృఢతలో ఇంతటి శక్తి ఉంది. ఏ కార్యాన్ని అయితే ఆరంభిస్తారో, అందులో ముందుగా దృఢ సంకల్పము అనే బీజాన్ని వేయండి, దానికి ఫలము వెలువడాల్సిందే. ఈ 75 సంవత్సరాలు ఎలా గడిచాయి! బ్రహ్మాబాబా మరియు పిల్లల తోడుతో, దృఢ సంకల్పముతో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ, ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు, అప్పుడే కదా ఈ 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ సంకల్పము చేయండి - ఈ రోజు నుండి వ్యర్థ సమయాన్ని, వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేయాల్సిందే. ఎప్పుడైతే వ్యర్థము సమాప్తమైపోతుందో, అప్పుడు సదా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా అద్భుతము చూపిస్తుంది.

బాప్ దాదా డబుల్ విదేశీయులను చూసి సంతోషిస్తున్నారు. వృద్ధి కూడా జరుగుతుంది మరియు డబుల్ సేవ వైపు అటెన్షన్ కూడా బాగా ఉంది. ఇప్పుడు బాప్ దాదా కేవలం ఒక సూచనను మళ్ళీ ఇస్తున్నారు - పరస్పరములో సంస్కార మిలనము యొక్క రాస్ ను చేయండి. సెంటర్ అయితే బాగానే నడుస్తుంది కదా, సేవ అయితే బాగానే జరుగుతుంది కదా అని ఈ మాత్రమే ఆలోచించకండి. ఇది ఒక్క పరివారము, ప్రభు పరివారము కదా, లౌకిక పరివారము కాదు, ఇది ప్రభు పరివారము అని అన్నప్పుడు పరస్పరములో శుభ భావన, కళ్యాణ భావన ఉండాలి. పరస్పరములో ఈ విధమైన సంకల్పాలే ఉండాలి - మేమందరమూ కలిసి-మెలిసి ఒకరినొకరము ముందుకు తీసుకువెళ్తూ ముక్తి ద్వారాలను తెరిచి కలిసి వెళ్ళాల్సిందే. అందుకే ప్రతి సెంటరులోనూ ఎటువంటి వాయుమండలము ఉండాలంటే - వీరు 8 మంది కాదు, 10 మంది కాదు, ఈ 10 మందీ ఒక్కరే అని అనిపించాలి. దీపావళి సందర్భము ప్రతి ఒక్కరూ మనసులో సంకల్పము చేయండి - ఇప్పుడు సంస్కార మిలనము యొక్క రాస్ చేయాల్సిందే. ఒక్క ఆత్మ కూడా ఒకరికొకరు దూరంగా ఉండకూడదు, అందరూ ఒకటిగా ఉండాలి. కావున ఈ దీపావళికి సంస్కార మిలనము యొక్క రాస్ చేయండి. మనసులో ఈ దృఢ సంకల్పము చేయండి - ఒక్కరు కూడా నా కారణముగా భారీగా అవ్వకూడదు, అందరూ తేలికగా ఉండాలి. సంస్కారాలు కలవనప్పుడే భారీగా అవుతారు. ఈ సంకల్పముతో ముక్తి ద్వారాలను తెరిచేందుకు త్వరగా తయారైపోతారు అని బాబా భావిస్తున్నారు. చెక్ చేసుకోండి, ఎవ్వరూ నాతో అసంతుష్టముగా అవ్వటము కాదు కదా, కనీసము భారీగా కూడా అవ్వకూడదు. ఇది వీలవుతుందా? వీలవుతుందా? వీలవుతుంది అంటే తల ఊపండి. వీలవుతుంది అంటే చేతులెత్తండి. అయితే ఈ దీపావళికి మంచి కళ వచ్చేస్తుంది.

బాప్ దాదా డబుల్ విదేశీయులను ప్రతి రోజూ హృదయములో ఇమర్జ్ చేసుకుంటారు, ఎందుకని? ఎందుకని ఇమర్జ్ చేసుకుంటారు? ఎందుకంటే పూర్తి విశ్వములో బాబా పేరును ప్రసిద్ధి చేసేందుకు డబుల్ విదేశీయులు నిమిత్తమయ్యారు. ఏ విషయములో? వీరు భారతవాసులు కాకపోయినా సరే, విదేశీయులైనా సరే, వీరు తమ భాగ్యాన్ని తయారుచేసుకున్నప్పుడు మేమెందుకు ఉండిపోవాలి అని? ఈ ప్రేరణ ఈ ఢిల్లీ కార్యక్రమము ద్వారా భారత్ లో మంచిగా వ్యాపించింది, అందుకే బాప్ దాదా సేవకు నిమిత్తమైన మీ అందరినీ ఇమర్జ్ చేసుకుంటారు. భారత్ ను మేలుకొలుపుతారు, మేలుకొలుపుతున్నారు, ఇకముందు కూడా భారత్ ను మేలుకొలిపే వి.ఐ.పీ.లను ఇలానే తయారుచేస్తారు. వారి అనుభవము భారతవాసులను మేలుకొలుపుతుంది. ప్రారంభములో ఎంతోమంది వి.ఐ.పీ.లను తీసుకువచ్చేవారు, ప్రోగ్రాములు చేసేవారు అనేది బాప్ దాదాకు గుర్తుంది. ఇప్పుడు ఆ సేవ లేదు. ఎటువంటి వి.ఐ.పి.లను తయారుచెయ్యండంటే వారు స్టేజ్ పై తమ అనుభవాన్ని వినిపించగలగాలి. ఇప్పుడు ఎక్కువ కల్చరల్ చూపించారు, అనుభవము కూడా వినిపించారు, కానీ కొద్ది సమయమే ఉంది. ఇప్పుడు ఎటువంటి వి.ఐ.పి.లను తీసుకురండి అంటే వారు భారతవాసుల అదృష్టాన్ని మేలుకొలపాలి. ఇప్పుడు కూడా విదేశీయుల మరియు భారతవాసుల సేవను కలిసి చేసారు, దాని ప్రభావము కూడా బాగా ఉంది. ఇప్పుడు కలిసి ఇటువంటి సేవలను ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. మరో ముఖ్య విషయమేమిటంటే, ప్రతి ఒక్కరూ, భారతవాసులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, స్వయాన్ని మీరు త్వరత్వరగా ఎలా సంపన్నముగా తయారుచేసుకోండి అంటే మీ అందరి సంపన్నత ముక్తి ద్వారాలను తెరవాలి. అచ్ఛా!

నలువైపులా ఉన్నవారికి, సమ్ముఖములో ఉన్నవారైనా, ఎక్కడ కూర్చున్నవారైనా కానీ అందరి అటెన్షన్ మధుబన్ లో ఉంది. బాప్ దాదాను చూస్తున్నారు, మెజారిటీ అయితే చూస్తున్నారు. బాప్ దాదా కూడా పిల్లలందరికీ, నలువైపులా ఉన్న పిల్లలకు, సదా హర్షితముగా ఉండే పిల్లలకు, సదా డబుల్ పురుషార్థీ పిల్లలకు, డబుల్ పురుషార్థీ అనగా స్వ పురుషార్థములో కూడా మరియు సేవా పురుషార్థములో కూడా, ఇటువంటి డబుల్ పురుషార్థీ మరియు డబుల్ నిశ్చయము, నషాలో ఉండేవారికి, సదా బాబాతో పాటు ఉండేవారికి, సదా పరస్పరములో కళ్యాణము మరియు దయతో కూడిన శుభ భావనను ఉంచేవారికి, ఒక్కొక్క బిడ్డకు పేరు సహితముగా బాప్ దాదా హృదయపూర్వక ప్రియస్మృతులను అందిస్తున్నారు.

కానీ ఈ నాటి విషయమైన - వ్యర్థ సంకల్పాల సమాప్తి, ఇది మర్చిపోకండి. బాప్ దాదా వద్దకు రికార్డు అయితే చేరనే చేరుకుంటుంది. ఎంతమంది తీవ్ర పురుషార్థీ పిల్లలు ఉన్నారు మరియు ఒకరికొకరు ఉల్లాస-ఉత్సాహాలను అందించుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు అన్నది బాప్ దాదా చూస్తారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేసినా కూడా, వారు తప్పు చేసారు అని మీరు వారి పట్ల మనసులో - వీరు చేస్తారు, వీరు చేస్తారు, వీరు చేస్తారు... అన్న సంకల్పము చేస్తుంటే, ఇది కూడా సమాప్తము చేయండి. వారికి సహయోగము ఇవ్వండి, శ్రేష్ఠ భావనను అందించండి. ఈ విధమైన సేవను చేస్తూ పూర్తి సంగఠనను శ్రేష్ఠ సంకల్పాలు కలవారిగా చెయ్యాల్సిందే. ఏ సెంటరులోనూ ఎప్పుడూ ఒకరి పట్ల ఒకరికి మరో భావన ఉండకూడదు. శుభ భావన, శుభ కామన ఉండాలి, సరేనా! చాలా మంచిది. ఇప్పుడు పిల్లలందరికీ బాప్ దాదా అభినందనలతో పాటు హృదయపూర్వక ప్రియస్మృతులను కూడా ఇస్తున్నారు. అచ్ఛా!

వరదానము:-
నిష్కామ సేవ ద్వారా విశ్వ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునే విశ్వకళ్యాణి, దయార్ద్ర హృదయ భవ

ఎవరైతే నిష్కామ సేవాధారులో, వారికి ఎప్పుడూ కూడా ఈ సంకల్పము రాకూడదు - నేను ఇంత చేశాను, నాకు దీని ద్వారా ఎంతోకొంత పేరు-ప్రతిష్టలు లేక మహిమ లభించాలి అని. ఇది కూడా తీసుకోవడమే అవుతుంది. దాత పిల్లలు ఒకవేళ తీసుకోవాలి అనే సంకల్పము చేసినా సరే మరి వారు దాతగా అయినట్లు కాదు. ఇచ్చేవారికి ఈ తీసుకోవడమనేది కూడా శోభించదు. ఎప్పుడైతే ఈ సంకల్పము సమాప్తమైపోతుందో, అప్పుడు విశ్వమహారాజు యొక్క హోదా ప్రాప్తిస్తుంది. ఇటువంటి నిష్కామ సేవాధారులు, అనంతమైన వైరాగులే విశ్వ కళ్యాణకారులుగా, దయార్ద్ర హృదయులుగా అవుతారు.

స్లోగన్:-
తమ తప్పును వేరొకరిపై వేయడము, ఇది కూడా పరచింతనయే.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

అన్నింటికంటే అతి పెద్ద కానుక - దాత పిల్లలుగా అయ్యి సర్వులకు సహయోగాన్ని ఇవ్వటము. పాడైపోయిన కార్యాన్ని, పాడైన సంస్కారాలను, పాడైన మూడ్ ను శుభ భావనతో సరి చెయ్యటములో సదా సర్వులకు సహయోగిగా అవ్వండి. వారు ఇలా అన్నారు, వీరు అలా చేసారు - ఇటువంటివి చూస్తూ, వింటూ, అర్థమవుతూ కూడా మీ సహయోగపు స్టాక్ ద్వారా పరివర్తన చేసి వారిని నిండుగా చెయ్యటము - ఇది అన్నింటికంటే పెద్ద దానము.