06-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు నేర్చుకోవడముతో పాటు టీచర్
గా అయి నేర్పించాలి కూడా, ఈ చదువు ఈ అంతిమ జన్మ కోసం మాత్రమే, అందుకే మంచి రీతిలో
చదువుకోండి మరియు చదివించండి’’
ప్రశ్న:-
సత్యయుగీ
రాజధాని దేని ఆధారముగా స్థాపనవుతుంది?
జవాబు:-
సంగమయుగ చదువు
యొక్క ఆధారముతో స్థాపనవుతుంది. ఎవరైతే బాగా చదువుకుంటారో మరియు ఎవరిపైనైతే బృహస్పతి
దశ ఉందో, వారు సూర్యవంశములోకి వస్తారు. ఎవరైతే చదువుకోరో, సేవ చేయరో, వారిపై బుధ దశ
కూర్చుంటుంది, వారు బుద్ధూ (మంద బుద్ధి కలవారు) వలె ఉంటారు. వారు ప్రజల్లోకి వస్తారు.
ఉన్నత ప్రజలు, నౌకర్లు మొదలైనవారంతా ఈ సమయములోని చదువు ఆధారముగానే తయారవుతారు.
ఓంశాంతి
ఆత్మిక
పిల్లలకు లేక ఆత్మలకు ఆత్మిక తండ్రి అనగా పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తున్నారు.
ఆత్మిక తండ్రిని పరమాత్మ అని అంటారు. ఆత్మలందరికీ తండ్రి ఒక్క పరమపిత పరమాత్మ. వారు
కూర్చుని బ్రహ్మా తనువు ద్వారా అర్థం చేయిస్తారు. భక్తి మార్గములోని మనుష్యులు
త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు అలా అనరు. మీరు
త్రిమూర్తి శివ అనగా బ్రహ్మా, విష్ణు, శంకరుల రచయిత శివుడు అని అంటారు. త్రిమూర్తి
బ్రహ్మా అంటే అర్థమేమీ ఉండదు. ఈ ముగ్గురు దేవతలకు రచయిత శివుడు, అందుకే త్రిమూర్తి
శివ అని అంటారు. వారొక్కరే రచయిత, మిగిలినవారంతా రచన. అనంతమైన తండ్రి ఒక్కరే. లౌకిక
తండ్రి అయితే ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఉంటారు. ఈ సమయములో అందరూ శివబాబాకు
పిల్లలుగా అయ్యారు. ఆత్మలమైన మనము 84 జన్మల చక్రములో తిరుగుతామని పిల్లలకు తెలుసు.
కనుక హద్దు తండ్రులు 84 మంది ఉంటారు. సత్యయుగములో కూడా తల్లిదండ్రులు అనంతమైన
వారసత్వాన్ని ఏమీ ఇవ్వరు. సత్యయుగము కోసం అనంతమైన వారసత్వమనేది ఇప్పుడు మీకు
లభిస్తుంది. అక్కడ లక్ష్మీ-నారాయణుల రాజధాని ఉంటుంది. మిగిలిన రాజ్య కుటుంబాలకు
చెందిన పిల్లలకు తమ తండ్రి యొక్క వారసత్వము లభిస్తుంది. ఎంతైనా, సత్యయుగములో చాలా
సుఖముంటుంది. ఈ సమయములో మిమ్మల్ని అనంతమైన తండ్రి అనంతమైన విశ్వానికి యజమానులుగా
తయారుచేస్తారు. 21 జన్మల కోసం సదా సుఖము యొక్క వారసత్వము లభిస్తుంది. అక్కడ దుఃఖము
యొక్క నామ-రూపాలు ఉండవు. వామ మార్గము ప్రారంభమవ్వగానే దుఃఖము ప్రారంభమవుతుంది. ఎవరు
వచ్చినా సరే, వారికి ఇలా అర్థం చేయించాలి - మీకు ఇద్దరు తండ్రులున్నారు, 84 జన్మలలో
84 మంది హద్దు తండ్రులు లభిస్తారు, అనంతమైన తండ్రి అయితే ఒక్కరే.
మూలవతనము అంటే
ఏమిటి అనే అవగాహన కూడా ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది! చిత్రాలలో ఏ మూలవతనాన్ని
అయితే చూపిస్తారో, దానిని కూడా పెద్దదిగా తయారుచేయాలి, అందులో చిన్న-చిన్న ఆత్మలు
నక్షత్రాల వలె మెరుస్తూ ఉండాలి. ఎలాగైతే ఇంతకుముందు మీరు దీపపు పురుగుల హారాన్ని
తయారుచేసేవారో, అలా ఈ మూలవతనానికి సంబంధించింది కూడా తయారుచేయాలి. ప్రొజెక్టర్ షో
చూపించినప్పుడు కూడా, అందులో మూలవతనము యొక్క చిత్రాన్ని అలా చూపించాలి. వృక్షము
పెద్దదిగా ఉంటే - ఆత్మలమైన మేము అక్కడ నివసిస్తాము అనేది స్పష్టముగా కనిపిస్తుంది.
పిల్లలకు అర్థం చేసుకునేందుకు కూడా సహజమవుతుంది. వీరు అనంతమైన బాబా, వీరు బ్రహ్మా
ద్వారా దైవీ సాంప్రదాయాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు ఇప్పుడు బ్రాహ్మణులు, తర్వాత
దైవీ గుణాలు కల దేవతలుగా అవుతారు. ఇప్పుడు అందరిలో ఆసురీ గుణాలున్నాయి, వాటిని ఆసురీ
అవగుణాలు అని అంటారు. వామ మార్గము నుండి దుఃఖము మొదలవుతుంది. అలాగని రజోప్రధానముగా
అయినప్పుడు ఒక్కసారిగా దుఃఖితులుగా అవుతారని కాదు. అలా కాదు. కళలు నెమ్మది-నెమ్మదిగా
తగ్గుతూ వస్తాయి. ముఖ్యమైన చిత్రాలు - త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు
స్వర్గాన్ని-నరకాన్ని గ్లోబ్ పై చూపించే చిత్రాలు. మొట్టమొదట అర్థం చేయించేందుకు ఇవి
చాలా అవసరము. వృక్షము చిత్రములో కూడా సగం-సగంగా పూర్తి కల్పము ఉంది. ఏక్యురేట్ గా
ఉన్నప్పుడు పూర్తిగా అర్థం చేయించగలరు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం
చేయించలేరు. పదే-పదే అర్థం చేయించేందుకు త్రిమూర్తి చిత్రము తప్పకుండా కావాలి. వారు
నిరాకారుడైన అనంతమైన తండ్రి, వారిని అందరూ స్మృతి చేస్తారు. వారు మా అనంతమైన తండ్రి
కూడా అని ఆత్మకు తెలుసు, వారిని దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు. సత్యయుగములో స్మృతి
చేసే అవసరమే ఉండదు. అది ఉన్నదే సుఖధామము. దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఇది
కూడా ఎవ్వరికీ తెలియదు.
మనము
సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి ఎలా వస్తాము అనేది మీకు తెలుసు. ఆత్మలో
మాలిన్యము చేరుతూ ఉంటుంది. మనము 84 జన్మల పాత్రను అభినయించాలని ఆత్మ అయిన మీకు
తెలుసు. అది ఏక్యురేట్ గా మన ఆత్మలో నిశ్చితమై ఉంది. ఎంత చిన్నని ఆత్మలో మొత్తం
పాత్ర అంతా నిశ్చితమై ఉంది. ఇవి గుహ్యాతి-గుహ్యమైన, అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ
విషయాలు ఏ మనుష్యమాత్రులు, సన్యాసులు మొదలైనవారి బుద్ధిలోకి రావు. నాటకము గురించి
మాట్లాడుతారు, నాటకాన్ని డ్రామా అని అనరు. ఇది డ్రామా. డ్రామా, బయోస్కోప్ (సినిమా)
మొదలైనవి ఇంతకుముందు ఉండేవి కావు. ఇంతకుముందు మూవీ (మూగ సైగలు) ఉండేది, ఇప్పుడు టాకీ
తయారైంది. ఆత్మలమైన మనము కూడా సైలెన్స్ నుండి టాకీలోకి వస్తాము. టాకీ నుండి మళ్ళీ
మూవీలోకి వెళ్ళి, ఆ తర్వాత సైలెన్స్ లోకి వెళ్తాము, అందుకే - ఎక్కువగా మాట్లాడకండి
అని పిల్లలైన మీకు నేర్పించడము జరుగుతుంది. రాయల్ మనుష్యులు చాలా నెమ్మదిగా
మాట్లాడుతారు. మీరు సూక్ష్మవతనములోకి వెళ్ళాలి. సూక్ష్మవతన జ్ఞానాన్ని ఇప్పుడు
తండ్రి అర్థం చేయించారు. ఇది టాకీ ప్రపంచము, అది మూవీ. అక్కడ ఈశ్వరునితో సంభాషణ
జరుగుతుంది. అక్కడ తెల్లని ప్రకాశ రూపముంటుంది, శబ్దము ఉండదు. అక్కడి మూవీ భాష
ద్వారా పరస్పరంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు వయా మూవీ, సైలెన్సులోకి
వెళ్ళాలి. తండ్రి అంటారు - ముందుగా నేను సూక్ష్మ సృష్టిని రచించాల్సి ఉంటుంది, ఆ
తర్వాత స్థూల సృష్టిని రచిస్తాను. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము అని అంటూ
ఉంటారు కూడా. బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మవతనవాసులని కూడా మనుష్యులకు తెలియదు.
అక్కడ ప్రపంచమేదీ లేదు. కేవలం బ్రహ్మా-విష్ణు-శంకరులు కనిపిస్తారు. 4 భుజాల కల
విష్ణువును చూస్తారు, దాని ద్వారా ఇది ప్రవృత్తి మార్గమని ఋజువవుతుంది. సన్యాసులది
నివృత్తి మార్గము. ఇది కూడా డ్రామా, దీనిని వర్ణిస్తూ తండ్రి అర్థం చేయిస్తారు.
తండ్రి అంటారు - ముఖ్యమైన విషయము ‘మన్మనాభవ’. మిగిలినదంతా విస్తారము. అది అర్థం
చేసుకోవడానికి సమయము పడుతుంది. సారములో - బీజము మరియు వృక్షము. బీజాన్ని చూసినప్పుడు
పూర్తి వృక్షమంతా బుద్ధిలోకి వస్తుంది. తండ్రి బీజరూపుడు, వారికి ఈ వృక్షము మరియు
సృష్టి చక్రానికి సంబంధించిన పూర్తి జ్ఞానముంది, అర్థం చేయించేందుకు సృష్టి చక్రము
వేరుగా, వృక్షము వేరుగా ఉన్నాయి. వృక్షములో ఈ చిత్రాలన్నింటినీ చూపించారు. ఏ ధర్మము
వారికి చూపించినా సరే వారు - మేము స్వర్గములోకైతే రాలేమని అర్థం చేసుకోగలరు. భారత్
ప్రాచీనముగా ఉన్నప్పుడు కేవలం దేవీ-దేవతలే ఉండేవారు. మిగిలినవారంతా శాంతిధామములో
ఉండేవారు.
మీకు బీజము
మరియు వృక్షము, రెండింటి గురించి తెలుసు. బీజము పైన ఉంది, వారిని వృక్షపతి అని
అంటారు. ఇప్పుడు మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక మీపై బృహస్పతి దశ కూర్చుని
ఉంది. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అవుతారో, వారిపై బృహస్పతి దశ ఉందని అంటారు. ఆ
తర్వాత శుక్ర దశ, బుధ దశ ఉంటాయి. బృహస్పతి దశ కలవారు సూర్యవంశీయులుగా అవుతారు. బుధ
దశ కలవారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు, వారు సేవ చేయలేరు. వారు తండ్రిని స్మృతి చేయలేరు
కనుక వారు బుద్ధూ (మంద బుద్ధి కలవారు) అని అర్థం, ఇందులో కూడా నంబరువారుగా
బుద్ధూలుగా అవుతారు. కొందరు ఉన్నతమైన ప్రజలుగా, కొందరు సాధారణ ప్రజలుగా అవుతారు.
షావుకారు ప్రజలెక్కడ, వారి నౌకర్లు ఎక్కడ. అంతా చదువుపై ఆధారపడి ఉంది. చదువు కూడా
సతోగుణీ, రజోగుణీ, తమోగుణీగా ఉంటుంది. రాజధాని స్థాపనవుతూ ఉంది. చురుకైనవారు తండ్రి
స్మృతిలో కూడా ఉంటారు. వారికి మొత్తం వృక్షము బుద్ధిలో ఉంటుంది. చదువు ద్వారానే
టీచర్ గా, బ్యారిస్టర్ గా అవుతారు. చదువు ద్వారా టీచర్ గా అయి మళ్ళీ ఇతరులను కూడా
చదివిస్తారు. చదువుకోవడము అందరూ చదువుకుంటారు. చదువు ఒక్కటే కానీ కొందరు చదువుకుని
ఉన్నతిలోకి వెళ్తారు, మరికొందరు అక్కడే టీచర్ గా అవుతారు. ఎవరైతే నేర్చుకుంటారో,
వారు చదివిస్తారు. ఇప్పుడు మీరు కూడా చదువుకుంటారు. కొందరైతే చదువుకుంటూ-చదువుకుంటూ
టీచర్ గా అవుతారు. టీచర్ యొక్క కర్తవ్యము - తమ సమానముగా టీచర్ గా తయారుచేయడము అని
వారు స్వయం అంటారు. టీచర్ గా అవ్వకపోతే ఇతరుల కళ్యాణము ఎలా చేస్తారు. సమయము
కొద్దిగానే ఉంది, వినాశనము అయ్యేంత వరకు నేర్చుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత
నేర్చుకోవడము ఆగిపోతుంది. మళ్ళీ బాబా 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి నేర్పిస్తారు. ఈ
చదువు వందలాది సంవత్సరాలేమీ నడవదు. ఈ చదువు ఈ అంతిమ జన్మ కోసం మాత్రమే. చదువుకోవాలి
మరియు చదివించాలి. అందరూ టీచర్లుగా అవ్వలేరు. ఒకవేళ అందరూ టీచర్లుగా అయితే, చాలా
ఉన్నత పదవిని పొందాలి. కానీ తప్పకుండా నంబరువారుగా ఉంటారు. ముందుగా ఎవరికైనా ఇద్దరు
తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. చిత్రాలు ఉన్నట్లయితే బాగా అర్థం చేసుకుంటారు.
త్రిమూర్తి చిత్రమైతే తప్పకుండా మీతో పాటు ఉండాలి. వారు శివబాబా, వీరు ప్రజాపిత
బ్రహ్మా. వీరు అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కావున తప్పకుండా అందరికన్నా
ముందే వచ్చి ఉంటారు కదా. అందరికన్నా ముందు బ్రహ్మా ఉన్నారు. ఇప్పుడు రచనను
రచిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. తర్వాత బ్రాహ్మణులే దేవతలుగా
అవుతారు. బ్రాహ్మణుల వృక్షము చిన్ననిది. దేవతలు కొద్దిమందే ఉంటారు, తర్వాత వృద్ధి
చెందుతూ ఉంటారు. ఇప్పుడు మీ కొత్త వృక్షము స్థాపనవుతుంది. ఇతర ధర్మాల ఆత్మలైతే
పాత్రను అభినయించేందుకు పై నుండి వస్తారు. పడిపోయే మాటేమీ లేదు. ఇక్కడ మీ కొత్త
వృక్షము స్థాపనవుతుంది. మాయ కూడా ఎదురుగా ఉంది. మీరు తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అవ్వాల్సిందే. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎందుకంటే ప్రపంచము
పరివర్తనవుతుంది, అందుకే శ్రమ అనిపిస్తుంది. దేవీ-దేవతా ధర్మము ఇప్పుడు సంగమయుగములో
స్థాపన అవుతుంది. సత్యయుగము ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, సత్యయుగము నుండి మళ్ళీ
కలియుగము ఎలా తయారవుతుంది అనేది కూడా మీరు అర్థం చేయిస్తారు. కలియుగములో
తమోప్రధానముగా అవ్వాల్సిందే. తమోప్రధానముగా అయినప్పుడే మళ్ళీ సతోప్రధానముగా అవుతారు.
మీరు సతోప్రధానముగా ఉండేవారు, తర్వాత మాలిన్యము చేరుతూ వచ్చింది. ఇప్పుడు ఏదైనా
కొత్త ఆత్మ 2-3 జన్మలు తీసుకుంటే, వెంటనే మాలిన్యము చేరుతుంది. అందులోనే సుఖము,
అందులోనే దుఃఖము అనుభవిస్తుంది. కొందరికి ఒక్క జన్మ కూడా ఉంటుంది. ఆత్మలు రావడము
ఆగిపోయినప్పుడు వినాశనము జరుగుతుంది. అప్పుడిక ఆత్మలందరూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది.
పాపాత్ములు, పుణ్యాత్ములు అందరూ కలిసి వెళ్తారు. తర్వాత పుణ్యాత్ములు కిందకు
దిగుతారు. సంగమములో అంతా పరివర్తన అవుతుంది. పిల్లలు పూర్తి డ్రామాను బుద్ధిలో
ఉంచుకోవాలి. తండ్రి వద్ద ఈ జ్ఞానమంతా ఉంది కదా. తండ్రి అంటారు, నేను వచ్చి ఈ సృష్టి
చక్రము యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అంతా తెలియజేస్తాను. భక్తి మార్గములో ఈ
జ్ఞానాన్ని వినిపించను. భక్తులు స్మృతి చేస్తే వారికి సాక్షాత్కారాలు చేయిస్తాను.
భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు నా పాత్ర కూడా ప్రారంభమవుతుంది. సత్య, త్రేతాయుగాలలో
నేను వానప్రస్థములో ఉంటాను. పిల్లలను సుఖములోకి పంపించాను, ఇంకేమి కావాలి! నేను
వానప్రస్థము తీసుకుంటాను. ఈ వానప్రస్థము తీసుకునే ఆచారము భారత్ లోనే ఉంది. నేను
వానప్రస్థములో కూర్చుంటానని అనంతమైన తండ్రి అంటారు. అనంతమైన తండ్రియే వచ్చి గురువు
రూపములో వానప్రస్థములోకి తీసుకువెళ్తారు. మనుష్యులు భగవంతుడిని కలుసుకునేందుకు
గురువుల సాంగత్యములో ఉంటారు. శాస్త్రాలను చదువుతారు, తీర్థాలకు వెళ్తారు, గంగా
స్నానాలు చేస్తారు కానీ ఏమీ లభించదు. ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి లభించారు. వారు
దుఃఖము నుండి విముక్తులుగా చేసి రావణ రాజ్యము నుండి బయటకు తీసి రామ రాజ్యములోకి
తీసుకువెళ్తారు. అనంతమైన తండ్రి ఒకేసారి వచ్చి రావణుడి దుఃఖాల నుండి విముక్తులుగా
చేస్తారు, అందుకే వారిని ముక్తిప్రదాత అని అంటారు. సత్యయుగములో రామ రాజ్యముంటుంది.
మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మనైన
నా స్వధర్మమే శాంతి. ఇక్కడ పాత్రలోకి రావడము వలన అశాంతిగా అయ్యాము. మళ్ళీ శాంతి
గుర్తుకువస్తుంది. వాస్తవానికి మనము శాంతిధామ నివాసులము. ఇప్పుడు నాకు శాంతి కావాలి,
మనసుకు శాంతి కావాలి అని అంటారు. ఆత్మ మనసు-బుద్ధి సహితముగా ఉంటుందని అర్థం
చేయించడము జరుగుతుంది. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము. ఇక్కడ కర్మలోకి వస్తుంది. ఇక్కడ
శాంతి ఎలా లభిస్తుంది? ఇది ఉన్నదే అశాంతిధామము. సత్యయుగములో సుఖ-శాంతులు, రెండూ
ఉన్నాయి. పవిత్రత కూడా ఉంది, ధన-సంపదలు కూడా ఉన్నాయి.
తండ్రి అర్థం
చేయిస్తున్నారు, మీకు సుఖ-శాంతులు, ధన-సంపదలు మొదలైనవన్నీ ఎంతో ఉండేవి. ఇప్పుడు మీరు
ఇతరులకు అర్థం చేయించాలి. ఎవరైతే కల్పక్రితం వారసత్వము తీసుకున్నారో, వారే బాగా
అర్థం చేసుకునేందుకు ప్రయత్నము చేస్తారు. ఆలస్యముగా వచ్చినా కానీ, పాతవారి కంటే
ముందుకు వెళ్ళిపోతారు. ఆలస్యముగా వచ్చేవారికి ఇంకా మంచి పాయింట్లు లభిస్తాయి.
రోజురోజుకు సహజమవుతూ ఉంటుంది. ఇప్పుడు మేము అంతా అర్థం చేసుకున్నామని కూడా
భావిస్తారు. కానీ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు కృషి కూడా చేయాలి.
దాని కోసం తీవ్ర పురుషార్థము చేయడము మొదలుపెడతారు. ఎందుకంటే సమయము తక్కువ ఉందని
అర్థం చేసుకుంటారు. ఎంత వీలైతే అంత పురుషార్థములో నిమగ్నమైపోవాలి. మృత్యువు కన్నా
ముందే మేము పురుషార్థము చేయాలని భావిస్తారు. వారు తమ చార్టును పెట్టుకుంటారు.
చదువైతే సహజమైనది, ఇక మిగిలినది స్మృతి విషయము. ఓ మనసా, ప్రభాత వేళలో రామ నామాన్ని
స్మరించు... అని గాయనము కూడా చేయబడింది. ఓ నా మనసా! రాముడిని స్మరించు అని ఆత్మ
చెప్తుంది. భక్తి మార్గములోనైతే రాముడు ఎవరు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. వారు
రఘుపతి రాఘవ రాజా రామ్ అని అంటారు. ఎంత తారుమారు చేసేసారు. అందరి భగవంతుడైన ఆ రాముడు
ఎవరు అనేది మనుష్యులేమీ అర్థం చేసుకోరు. సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తూ ఉంటారు.
పిల్లలైన మీకు నేను విశ్వ రాజ్య భాగ్యాన్ని ఇచ్చాను, దానినేమి చేసారు? 5000
సంవత్సరాల క్రితం మీకు స్వర్గ రాజ్య భాగ్యాన్ని ఇచ్చాను, దానిని ఎలా
పోగొట్టుకున్నారు? మనము ఎలా కిందకు పడిపోతూ వచ్చామనేది ఇప్పుడు మీరు అర్థం
చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి. ఎక్కే కళ ఒక్క క్షణములో, దిగే కళ 5000
సంవత్సరాలలో. బ్రహ్మా నుండి విష్ణువుగా అయ్యేందుకు ఒక్క సెకెండు, విష్ణువు నుండి
బ్రహ్మాగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. తండ్రి ఎన్ని పాయింట్లను అర్థం
చేయిస్తారు. అచ్ఛా!
మధురాతి
మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు టాకీ నుండి మూవీలోకి, మూవీ నుండి సైలెన్స్ లోకి వెళ్ళాలి, అందుకే
టాకీని (మాటలను) చాలా తగ్గించాలి. రాయల్టీతో చాలా నెమ్మదిగా మాట్లాడాలి.
2. జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత తీవ్ర పురుషార్థము చేసి సతోప్రధానముగా
అవ్వాలి. స్మృతి చార్టును పెట్టుకోవాలి.
వరదానము:-
ఈ లోకం యొక్క ఆకర్షణ నుండి ముక్తులై అవ్యక్త వతనములో విహరించే
ఎగిరే పక్షి భవ
బుద్ధి రూపీ విమానము ద్వారా అవ్యక్త వతనము మరియు
మూలవతనములో విహరించేందుకు ఎగిరే పక్షిగా అవ్వండి. బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలంటే
అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోండి. మీరు ఎప్పుడైతే ఈ లోకం యొక్క
ఆకర్షణ నుండి అతీతముగా ఉంటారో అప్పుడే ఇది జరుగుతుంది. ఇది సారములేని ప్రపంచము, ఈ
సారములేని ప్రపంచముతో ఏ పనీ లేనప్పుడు, ఏ ప్రాప్తి లేనప్పుడు, అక్కడకు బుద్ధి ద్వారా
వెళ్ళడాన్ని కూడా సమాప్తము చేయండి. ఇది రౌరవ నరకము, ఇందులోకి వెళ్ళాలన్న సంకల్పము
మరియు స్వప్నము కూడా రాకూడదు.
స్లోగన్:-
మీ ముఖము మరియు
నడవడిక ద్వారా సత్యత యొక్క సభ్యతను అనుభవం చేయించడమే శ్రేష్ఠత.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
ఎవరైతే పరోపకార భావనతో
సంపన్నముగా ఉంటారో, వారు సదా సంతుష్టమణి సమానముగా స్వయం కూడా సంతుష్టముగా ఉంటారు
మరియు సర్వులను కూడా సంతుష్టపరిచేవారిగా ఉంటారు. అద్భుతమైన విషయమేమిటంటే ఆశ
కోల్పోయినవారికి ఆశను కలిగిస్తారు, ఎవరిపట్లనైతే అందరూ నిరాశను చూపిస్తారో, అటువంటి
వ్యక్తిలో లేక అటువంటి స్థితిలో సదా కొరకు వారి యొక్క ఆశాదీపాన్ని వెలిగిస్తారు. తమ
ఉపకారమనే శుభభావనతో, స్నేహముతో, శక్తితో, మధురమైన మాటలతో, ఉల్లాస-ఉత్సాహాల సహయోగముతో
నిరాశలో ఉన్నవారిని శక్తివంతులుగా తయారుచేస్తారు అనగా బికారిని చక్రవర్తిగా చేస్తారు.