ఓంశాంతి
పిల్లలకు ఓం శాంతి అర్థాన్ని అయితే చాలా సార్లే అర్థం చేయించారు. ఓం అనగా నేను ఎవరు?
నేను ఒక ఆత్మను. ఈ శరీరము నా ఇంద్రియాలు. ఆత్మనైన నేను పరంధామ నివాసిని. ఓ దూరదేశ
నివాసీ రండి, ఎందుకంటే భారత్ లో ఇప్పుడు చాలా ధర్మ గ్లాని, దుఃఖము ఉంది, మీరు మళ్ళీ
వచ్చి గీతోపదేశాన్ని వినిపించండి అని భారతవాసులు పిలుస్తారు. శివబాబా రండి, అని
గీతలోనే అంటారు ఎందుకంటే వారు అందరికీ తండ్రి. భారతవాసులపై మళ్ళీ మాయ రూపీ రావణుడి
నీడ పడింది, అందుకే అందరూ దుఃఖితులుగా, పతితులుగా ఉన్నారని అంటారు. రూపాన్ని
మార్చుకుని రండి అని పిలుస్తారు అనగా మనిషి రూపములో రండి. కనుక మనిషి రూపములో
వస్తాను. నేను రావడమనేది దివ్యముగా మరియు అలౌకికముగా ఉంటుంది. నేను గర్భములోకి రాను,
నేను సాధారణ వృద్ధ తనువులోకే వస్తాను.
నేను కల్ప-కల్పము నా నిరాకారీ రూపాన్ని మార్చుకుని వస్తానని పిల్లలైన మీకు తెలుసు.
జ్ఞానసాగరుడైతే పరమపిత పరమాత్మయే, శ్రీకృష్ణుడిని ఎప్పుడూ అలా అనరు. తండ్రి అంటారు
- నేను ఈ సాధారణ తనువులోకి వచ్చి మీకు మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నాను.
ఎప్పుడైతే ప్రపంచము పతితముగా అయిపోతుందో, అప్పుడు నేను రావలసి ఉంటుంది. కలియుగాన్ని
సత్యయుగముగా తయారుచేయడానికి నేను వస్తాను. బ్రహ్మా, విష్ణు, శంకరుల చిత్రాలు కూడా
ఉన్నాయి. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా వినాశనము మరియు విష్ణువు ద్వారా
పాలన జరుగుతుంది. ఈ లక్ష్మీ-నారాయణులు విష్ణువు యొక్క రెండు రూపాలు. ఈ విషయము
పిల్లలైన మీకు తెలుసు. బాబా మళ్ళీ రూపాన్ని మార్చుకుని వచ్చారు. వారు మన సుప్రీమ్
తండ్రి కూడా, సుప్రీమ్ టీచర్ కూడా, సుప్రీమ్ గురువు కూడా. వేరే గురువులను సుప్రీమ్
అని అనరు. వీరైతే తండ్రి, టీచర్, గురువు ముగ్గురూ అయ్యారు. లౌకిక తండ్రి అయితే
పిల్లలను పాలన చేసి వారిని స్కూలుకు పంపిస్తారు. తండ్రియే టీచరుగా కూడా ఉండడమనేది
ఎక్కడో అరుదుగా జరుగుతుంది. ఈ మాట ఎవరూ చెప్పలేరు. ఆత్మలందరూ నన్ను పిలుస్తారు, గాడ్
ఫాదర్ అని అంటారు, కనుక వారు ఆత్మలకు ఫాదర్ అయినట్లు. ఈ పాట కూడా భక్తి మార్గానికి
చెందినది. సత్యయుగములోనైతే భగవంతుడిని పిలిచే అవసరము రావడానికి, అక్కడ మాయ ఉండనే
ఉండదు. అక్కడైతే సుఖమే సుఖముంటుంది. ఇది 5 వేల సంవత్సరాల చక్రమని మీకు తెలుసు.
అర్ధకల్పము సత్య, త్రేతాయుగాలు పగలు, అర్ధకల్పము ద్వాపర, కలియుగాలు రాత్రి. మీరు
బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు. బ్రహ్మా మరియు బ్రాహ్మణులైన మీ యొక్క రాత్రి-పగలు
అనే అంటూ ఉంటారు. రాత్రి మరియు పగలు యొక్క జ్ఞానము కూడా పిల్లలైన మీకు ఉంది.
లక్ష్మీ-నారాయణులకు ఈ జ్ఞానము లేదు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు, ఇప్పుడు భక్తి
మార్గము పూర్తయ్యి పగలు ఉదయిస్తుందని మీకు తెలుసు. ఈ జ్ఞానము ఇప్పుడు మీకు తండ్రి
ద్వారా లభించింది. కలియుగములో గాని, సత్యయుగములో గాని ఈ జ్ఞానము ఎవరికీ ఉండదు.
అందుకే బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి అని అంటూ ఉంటారు. మీరు ఇప్పుడు
సూర్యవంశీ-చంద్రవంశీ రాజ్యాన్ని పొందే పురుషార్థము చేస్తున్నారు. మళ్ళీ అర్ధకల్పము
తర్వాత మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఈ జ్ఞానము బ్రాహ్మణులైన మీకు తప్ప
ఇంకెవరికీ లేదు. మీరు దేవతలుగా అయిపోతారు, అప్పుడిక ఈ జ్ఞానముండదు. ఇప్పుడిది రాత్రి.
శివరాత్రి అని కూడా అంటూ ఉంటారు. శ్రీకృష్ణుని రాత్రి అని కూడా అంటారు కానీ దాని
అర్థాన్ని తెలుసుకోరు. శివజయంతి అనగా శివుని పునః అవతరణ జరుగుతుంది. ఇటువంటి తండ్రి
అవతరణ రోజును తక్కువలో తక్కువ ఒక మాసమైనా జరుపుకోవాలి. ఎవరైతే మొత్తము సృష్టిని
పతితము నుండి పావనముగా తయారుచేస్తారో, వారి జన్మదినాన్ని సెలవుగా కూడా జరుపుకోరు.
తండ్రి అంటారు, నేను అందరి ముక్తిదాతను, నేను మార్గదర్శకుడినై అందరినీ
తీసుకువెళ్తాను.
ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు పురుషార్థము చేస్తారు. తండ్రి మీకు
జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు. ఆత్మ రూపము ఏమిటి - ఇది కూడా ఎవరికీ తెలియదు.
తండ్రి అంటారు, ఆత్మలైన మీరు అంగుష్టము వలె కూడా ఉండరు, అలాగే అఖండ జ్యోతి వలె కూడా
ఉండరు. మీరు ఒక నక్షత్రములా, బిందువులా ఉంటారు. ఆత్మనైన నేను కూడా బిందువునే, కానీ
నేను పునర్జన్మల్లోకి రాను. నా మహిమయే వేరు, నేను సుప్రీమ్ అయిన కారణముగా జనన-మరణ
చక్రములోకి రాను. ఆత్మలైన మీరు శరీరములోకి వస్తారు కనుక 84 జన్మలను తీసుకుంటారు.
నేను ఈ శరీరములో ప్రవేశిస్తాను, ఇది లోన్ గా తీసుకున్నటువంటిది. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - మీరు కూడా ఆత్మలే, కానీ మీరు - నేను ఒక ఆత్మను అని స్వయాన్ని
రియలైజ్ అవ్వరు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. దుఃఖములో ఎల్లప్పుడూ - ఓ
భగవంతుడా, ఓ దయార్ద్ర హృదయుడైన బాబా, దయ చూపించండి అని తలచుకుంటారు. దయను
కోరుకుంటారు ఎందుకంటే ఆ తండ్రియే నాలెడ్జ్ ఫుల్, బ్లిస్ ఫుల్, ప్యూరిటీ ఫుల్. వారు
జ్ఞానములో కూడా ఫుల్. వారు జ్ఞానసాగరుడు. మనుష్యులకు ఇటువంటి మహిమను ఇవ్వలేము.
మొత్తము ప్రపంచమంతటికీ ఆనందాన్ని ఇవ్వడము అనేది తండ్రి పని మాత్రమే. వారు రచయిత,
మిగిలినవారంతా రచన. రచయిత రచనను రచిస్తారు. ముందు స్త్రీని (పత్నిని) దత్తత
తీసుకుంటారు, ఆ తర్వాత ఆమె ద్వారా రచనను రచిస్తారు, ఆ తర్వాత వారి పాలనను కూడా
చేస్తారు, కానీ వినాశనము చేయరు. ఈ అనంతమైన తండ్రి వచ్చి స్థాపన-పాలన-వినాశనము
చేయిస్తారు, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని పాలన చేయిస్తారు. సత్యయుగము ఆదిలో
రాజధాని వెంటనే స్థాపన అవుతుంది. ఇతర ధర్మాల వారైతే కేవలం తమ-తమ ధర్మాలను స్థాపన
చేస్తారు, తర్వాత ఎప్పుడైతే లక్షల, కోట్ల సంఖ్యలో వారి వృద్ధి జరుగుతుందో, అప్పుడు
రాజ్యము ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు. యోగబలముతో మీరు
మొత్తము విశ్వానికి యజమానులుగా అవుతారు, బాహుబలముతో ఎప్పుడూ ఎవరూ విశ్వముపై రాజ్యము
చేయలేరు. బాబా అర్థం చేయించారు - క్రిస్టియన్లలో ఎంతటి శక్తి ఉందంటే, వారు పరస్పరము
ఒకటైతే, మొత్తము విశ్వమంతటిపైనా రాజ్యము చేయగలరు. కానీ బాహుబలముతో విశ్వ రాజ్యాన్ని
పొందడము అనేటువంటి లా లేదు. బాహుబలము కలవారు విశ్వానికి యజమానులుగా అవ్వడమనే నియమము
డ్రామాలో లేదు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, విశ్వ రాజ్యాధికారమనేది యోగబలముతో నా ద్వారానే
లభించగలదు. అక్కడ ఎటువంటి విభజనలు ఉండవు. భూమి, ఆకాశము అన్నీ మీవిగా ఉంటాయి.
మిమ్మల్ని ఎవ్వరూ ముట్టుకోలేరు. దానిని అద్వైత రాజ్యమని అంటారు. ఇక్కడ అనేక రాజ్యాలు
ఉన్నాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - 5 వేల సంవత్సరాల తర్వాత, పిల్లలైన మీకు ఈ
రాజయోగాన్ని నేర్పిస్తాను. శ్రీకృష్ణుని ఆత్మ ఇప్పుడు నేర్చుకుంటుంది. శ్రీకృష్ణుడు
మొదటి నంబరు రాకుమారుడిగా ఉండేవారు, వారు ఈ సమయములో 84 జన్మల అంతిమములోకి వచ్చి
బ్రహ్మాగా అయ్యారు. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది పిల్లలకు అర్థం చేయించడము
జరిగింది. తండ్రి మళ్ళీ స్వర్గ స్థాపనను చేస్తున్నారు. తప్పకుండా అనేక ధర్మాల
వినాశనము జరగనున్నది, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. భారత్ యే 100 శాతము సంపన్నముగా,
ధర్మ శ్రేష్ఠముగా ఉండేది. దేవతల కర్మలు కూడా శ్రేష్ఠముగా ఉండేవి. సర్వగుణ సంపన్నులు...
అని వారి మహిమయే గాయనము చేయబడింది. మొట్టమొదట పవిత్రముగా ఉండేవారు, ఇప్పుడు పతితముగా
అయ్యారు, మళ్ళీ తండ్రి వచ్చి స్త్రీ-పురుషులు ఇరువురినీ పవిత్రముగా తయారుచేస్తారు.
రక్షాబంధనము ఉత్సవాన్ని ఇంతగా ఎందుకు జరుపుకుంటారు - ఇది ఎవరికీ తెలియదు. అంతిమ
జన్మలో మీరిరువురూ పవిత్రముగా ఉండండి అని తండ్రియే వచ్చి ప్రతిజ్ఞను చేయించుకున్నారు.
సన్యాసులదైతే వారి ధర్మమే వేరు. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము - ఇవి మీ కోసము
ఉన్నాయి. క్రిస్టియన్ ఫాదర్లు నడిచేటప్పుడు, వారి కళ్ళు ఒకవైపే ఉంటాయి, ఇంకెవరి వైపు
చూడరు, ఇది మీరు గమనించి ఉంటారు. నన్స్ ఉంటారు కదా, వారైతే క్రైస్టును స్మృతి
చేస్తారు. క్రైస్టు భగవంతుని సంతానమని అంటారు. మీకు శ్వేత వస్త్రాలు మొదలైనవాటితో
కనెక్షన్ ఏమీ లేదు. మీరు ఆత్మలు, నన్ బట్ వన్ (ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు),
ఒక్కరినే స్మృతి చేయాలి. సత్యమైన నన్స్ అయితే మీరు, మీకు ఆ తండ్రి నుండి వారసత్వము
లభించనున్నది, వారిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి, అందుకే తండ్రి
ఆజ్ఞనిచ్చారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఆత్మలము అన్న నిశ్చయము లేని కారణముగా
నన్స్ క్రైస్టును స్మృతి చేస్తారు. గాడ్ ఎవరు అనేది వారికి తెలియదు. మొట్టమొదట ఏ
భారతవాసులైతే వస్తారో, వారికే తెలియదు. లక్ష్మీ-నారాయణులకు ఈ సృష్టి యొక్క జ్ఞానము
లేదు, వారు త్రికాలదర్శులు కూడా కాదు. బ్రాహ్మణులైన మీరు త్రికాలదర్శులుగా అవుతారు.
తండ్రి మిమ్మల్ని గవ్వ నుండి మార్చి వజ్రము వలె తయారుచేస్తారు. ఇప్పుడు మీరు
ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు. మీ ఈ అంతిమ జన్మ చాలా అమూల్యమైనది. ముఖ్యంగా భారత్ కు మరియు
మొత్తము ప్రపంచమంతటికీ మీరు ఆత్మిక సేవను చేస్తారు. ఇకపోతే, వారు దైహిక సమాజ సేవకులు,
మీరు ఆత్మిక సమాజ సేవకులు. మీకు నేర్పించేవారు సుప్రీమ్ ఆత్మ. తండ్రిని స్మృతి
చేయండి అని ప్రతి ఒక్క ఆత్మకు చెప్పండి. తండ్రినే పతిత-పావనుడు అని అంటూ ఉంటారు.
మీకు పడిపోవడానికి 84 జన్మలు పడుతుంది, మళ్ళీ ఎక్కడానికి ఒక్క సెకండు పడుతుంది. ఈ
మృత్యులోకములో ఇది మీ అంతిమ జన్మ. మృత్యులోకము ముర్దాబాద్ అవ్వనున్నది (నశించబోతుంది),
అమరలోకము జిందాబాద్ అవ్వనున్నది (వర్ధిల్లనున్నది). దీనిని అమరకథ అని అంటారు. అమర
బాబా వచ్చి అమర ఆత్మలైన మిమ్మల్ని అమర యుగములోకి తీసుకువెళ్ళేందుకు అమర కథను
వినిపిస్తారు. తండ్రి అంటారు - అచ్ఛా, వేరే విషయాలను మర్చిపోతున్నట్లయితే, కేవలం
స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని, తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి.
బుద్ధియోగాన్ని నాతో జోడించినట్లయితే మీ పాపాలు భస్మమై మీరు పుణ్యాత్ములుగా
అయిపోతారు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, ఇది కొత్త విషయము కాదు. 5 వేల
సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి మీకు వారసత్వాన్ని ఇస్తారు, రావణుడేమో శాపాన్ని
ఇస్తాడు - ఇది ఆట. ఈ కథ భారత్ కు చెందినదే. ఈ విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు,
ఇవి వేద-శాస్త్రాలు మొదలైనవాటిలో లేవు. అందుకే గాడ్ ఫాదర్ నే నాలెడ్జ్ ఫుల్, పీస్
ఫుల్ (శాంతి స్వరూపులు), బ్లిస్ ఫుల్ (ఆనంద స్వరూపులు) అని అంటారు. మిమ్మల్ని కూడా
తమ సమానముగా తయారుచేస్తారు. మీరు కూడా పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా
అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అనే ఈ మాట భగవంతునికి సంబంధించినది కాదు. ఇది
భారతవాసులైన మీకు సంబంధించిన విషయము. మొదటిలో మీరు కేవలం శివుని భక్తిని మాత్రమే
చేసేవారు, అవ్యభిచారి భక్తిని చేసారు. తర్వాత దేవతల భక్తిని ప్రారంభించారు, తర్వాత
కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు దేవీ-దేవతలుగా అవుతున్నారు. ఎవరైతే
కొద్దిగా చదువుకుంటారో, వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఎవరైతే మంచి రీతిలో
చదువుకుంటారో మరియు చదివిస్తారో, వారు రాజ్యములోకి వస్తారు. ప్రజలైతే ఎంతోమంది
తయారవుతారు. ఒక్క మహారాజుకు లక్షలు, కోట్ల సంఖ్యలో ప్రజలు ఉంటారు. మీరు కల్పక్రితం
వలె పురుషార్థము చేస్తారు. మాలలోకి ఎవరెవరు వచ్చేది ఉంది అనేది పురుషార్థము ద్వారా
తెలుస్తుంది. ప్రజలలో కూడా కొందరు పేదవారిగా, కొందరు షావుకారులుగా అవుతారు. భక్తి
మార్గములో ఈశ్వరార్థము దానము చేస్తారు. ఎందుకు చేస్తారు, ఈశ్వరుని వద్ద లేదా ఏమిటి?
లేదా శ్రీకృష్ణార్పణము అని అంటారు. కానీ వాస్తవానికి ఈశ్వరార్పణము జరుగుతుంది.
మనుష్యులు ఏదైతే చేస్తారో, దాని ఫలం మరుసటి జన్మలో లభిస్తుంది, ఒక్క జన్మ కోసం
లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు - నేను మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇవ్వడానికి
వచ్చాను. నా పేరు మీద డైరెక్టుగా ఏమి చేసినా సరే, దానికి మీకు 21 జన్మల కోసం
ప్రాప్తి లభిస్తుంది. ఇన్ డైరెక్టుగా చేసినా సరే, ఒక్క జన్మ కోసం అల్పకాలిక సుఖము
లభిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీదంతా మట్టిలో కలిసిపోనున్నది, అందుకే
దీనిని సఫలం చేసుకోండి. మీరు ఈ ఆత్మిక హాస్పిటల్ ను మరియు యూనివర్శిటీని తెరుస్తూ
వెళ్ళండి. ఇక్కడ అందరూ సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. దీనితో
చాలా సంపాదన జరుగుతుంది. యోగముతో ఆరోగ్యము మరియు చక్రాన్ని తెలుసుకోవడముతో ఐశ్వర్యము
లభిస్తుంది. కనుక ప్రతి ఇంట్లో ఇటువంటి యూనివర్శిటీని మరియు హాస్పిటల్ ను తెరుస్తూ
వెళ్ళండి. పెద్ద వ్యక్తి అయితే, అనేకమంది రాగలిగేలా పెద్దది తెరవండి. నేచర్ క్యూర్
వారు ఏ విధముగా వ్రాస్తారో, బోర్డుపై అలా వ్రాయండి. తండ్రి మొత్తము ప్రపంచము యొక్క
నేచర్ ను మార్చి పవిత్రముగా తయారుచేస్తారు. ఈ సమయములో అందరూ అపవిత్రముగా ఉన్నారు.
మొత్తం ప్రపంచాన్ని సదా ఆరోగ్యవంతముగా, సదా ఐశ్వర్యవంతముగా తయారుచేసేవారు తండ్రి,
వారు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు అత్యంత మధురమైన పిల్లలు.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.