07-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మన బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చారని మీకు నషా ఉండాలి, మనము వారి సమ్ముఖముగా కూర్చున్నాము’’

ప్రశ్న:-
కర్మల గుహ్య గతి తెలిసినవారు ఏ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు?

జవాబు:-
స్మృతిలో ఉండే పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు, ఎందుకంటే స్మృతితోనే పాత లెక్కాచారాలు సమాప్తమవ్వనున్నాయని వారికి తెలుసు. ఆత్మ ఒకవేళ పాత లెక్కాచారాలను, కర్మభోగాన్ని సమాప్తము చేసుకోకపోతే, దానికి శిక్షలు అనుభవించవలసి ఉంటుందని మరియు పదవి కూడా భ్రష్టమైపోతుందని, పునర్జన్మ కూడా అటువంటిదే లభిస్తుందని వారికి తెలుసు.

ఓంశాంతి
బాప్ దాదా సమ్ముఖముగా వచ్చారన్నది చూసినప్పుడు, పిల్లలకు అపారమైన సంతోషము యొక్క పాదరసము ఎక్కుతుంది. 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ శివబాబా బ్రహ్మా తనువులోకి వచ్చి ఉన్నారని కూడా పిల్లలకు తెలుసు. ఏమి చేయడానికి వచ్చారు? పిల్లలకు ఈ నషా ఎక్కి ఉంది. స్వర్గానికి యజమానులుగా చేయడానికి తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలందరికీ తెలుసు. వారు మనల్ని యోగ్యులుగా చేస్తున్నారు. వారు మనకు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే యుక్తులను పదే-పదే తెలియజేస్తున్నారు. ఆ యుక్తి చాలా సహజమైనది. పిల్లలకు చాలా సహజమైన స్మృతిని నేర్పిస్తారు. అజ్ఞాన కాలములో తండ్రికి కొడుకు జన్మిస్తే, నాకు వారసుడు జన్మించాడని భావిస్తారు. ఈ సమయములో తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని దత్తత తీసుకుంటారని మీకు తెలుసు. మీరంతా ఎలాగూ శివబాబా పిల్లలే. కానీ మీకు వినిపించగలిగేలా మరియు మీరు వారి నుండి వినగలిగేలా తండ్రి మిమ్మల్ని తమవారిగా ఎలా చేసుకోగలరు? శివబాబా ఈ బ్రహ్మా తనువు ద్వారా చెప్తున్నారు - నేను మీ తండ్రిని, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. కేవలం పతితముగా ఉన్న మీ ఆత్మ ముక్తిధామానికి గాని, జీవన్ముక్తిధామానికి గాని వెళ్ళలేదు. మీరంతా ఒక్క తండ్రి పిల్లలు. అందరూ తండ్రి ఆస్తిని తీసుకోవాలి. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. దత్తత తీసుకుంటూ ఉంటారు. ఓ ఆత్మలూ, ఇప్పుడు మీరు నా సంతానము. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఎవరినైతే మనము అర్ధకల్పము పాటు స్మృతి చేసేవారమో, మనకు ఆ బాబా లభించారు, ఇది ఎప్పుడూ మర్చిపోకండి. ఓ పతిత-పావన, ఓ దుఃఖహర్త-సుఖకర్త అని ఆత్మ అర్ధకల్పము నుండి ఈ శరీరము ద్వారా స్మృతి చేస్తూ వచ్చింది, ఎందుకంటే ఇది రావణ రాజ్యము కదా. మేము చాలా సుఖముగా ఉన్నాము, మాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని మిల్లులు ఉన్నాయి, ఫ్యాక్టరీలు మొదలైనవి ఉన్నాయి అని ఇప్పుడు ఎవరైతే భావిస్తున్నారో, అవన్నీ అల్పకాలికమైనవి. అంతిమములోనైతే దుఃఖముతో రక్షణ కొరకు చాలా అలమటిస్తూ ఉంటారు. దుఃఖపు పర్వతాలు పడతాయి. ఇంతటి ఆస్తి అంతా సెకెండులో సమాప్తమైపోతుంది. తండ్రి నుండి మీకు సెకెండులో వారసత్వము లభిస్తుంది. మీకు సెకెండులో స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తానని అంటారు. ఈ పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అంతా శుభ్రము అవ్వాలి కదా. మీ ఆత్మ కూడా ఇప్పుడు పవిత్రముగా అవుతూ ఉంది.

పిల్లలు ఎంత శ్రమిస్తున్నారు అనేది బాప్ దాదా, ఇరువురూ అర్థం చేసుకోగలరు. తండ్రి నుండి వారసత్వాన్ని పొందడానికి చాలా తక్కువ శ్రమను ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఆ ఆత్మిక తండ్రి నిరాకారుడు, ఆత్మలమైన మనము వారిని పిలుస్తాము కదా. తండ్రి అంటారు, పతితముగా ఉన్న మీ ఆత్మ పావనముగా ఎలా అవుతుంది. పతిత-పావనుడు అయితే ఒక్క తండ్రి మాత్రమే కదా. నీటి నదులు పతిత-పావని అయితే, మరి వెంటనే వెళ్ళి మునకలు వేసి రావాలి. గంగా స్నానాలు చాలామంది చేస్తారు, అయినా పతితులుగానే ఎందుకున్నారు? రాత్రింబవళ్ళు ఇదే జపిస్తూ ఉంటారు - పతిత-పావన సీతారామ, అనగా భక్తులందరి రక్షకుడు లేక సీతలందరి రక్షకుడు ఒక్క రాముడైన పరమపిత పరమాత్మ. వారే పతిత-పావనుడు, పతులకే పతి. వారు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు పావనముగా తయారుచేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - మీరు నా శ్రీమతముపై నడవాలి, ఇంకెవ్వరి మతముపైనా నడవకండి. భక్తితో భగవంతుడు లభిస్తారని వారు భావిస్తారు. భక్తితో భగవంతుడు లభిస్తారంటే, మరి భక్తులను రక్షించడానికి వారు వస్తారని ఎందుకంటారు? భక్తులకు ఏ ఆపద వచ్చిందని వారిని రక్షిస్తారు? ఏదైనా ఆపద వస్తే కదా, రక్షించడమనేది జరుగుతుంది. తండ్రి అంటారు, మీరు ఎంత దుర్గతిని పొందారు. ఇది రౌరవ నరకము, అందరూ దుఃఖితులుగా, రోగగ్రస్తులుగా ఉన్నారు. ఇంటింటిలో ఏమేమి జరుగుతుందో చూడండి. దుఃఖమే దుఃఖముంది, అందుకే - బాబా, మా దుఃఖాన్ని హరించండి, సుఖము ఇవ్వండి అని పిలుస్తారు. భారత్ లోనే సదా సుఖము ఉండేది, ఇప్పుడు దుఃఖముంది. ఇది భారత్ కు సంబంధించిన విషయము, మిగతా ఖండాలు వేరు. అవి తర్వాత వెలువడుతాయి. కొందరు 60 జన్మలు, కొందరు అంతకన్నా తక్కువ జన్మలు తీసుకుంటారు. దేవతా ధర్మము వారు 84 జన్మలు తీసుకుంటారు. ఈ లెక్కన అర్ధకల్పము తర్వాత ఎవరైతే వస్తారో, వారు 84లో సగము జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ 84 జన్మల చక్రములో తిరుగుతారని కాదు. మనుష్యులకు ఏది తోస్తే, అది చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి అవినాశీ జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకుంటున్నారు. రత్నాలైతే చాలా విలువైనవి. తండ్రి అర్థం చేయించడము కూడా చాలా సహజముగా అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని మీరు పిలుస్తూ వచ్చారు, అందుకే తండ్రి వచ్చారు. మనము పావనముగా అయినట్లయితే, స్వర్గానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శివబాబా మనల్ని రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా, రాతినాథుల నుండి పారసనాథులుగా తయారుచేయడానికి వచ్చారు. భక్తి మార్గపు చిత్రాలన్నీ రాతితో తయారుచేయబడినవి. రాతి విగ్రహాల వెనుక కష్టపడుతూ ఉంటారు. తండ్రి అంటారు - మీరు ఎంత కష్టపడినా కానీ లాభమేమీ ఉండదు. పూర్వము మిమ్మల్ని మీరు బలి ఇచ్చుకునేవారు. కానీ ఏమి లాభము కలిగింది? మహా అయితే దేవి యొక్క సాక్షాత్కారము జరుగుతుంది, మళ్ళీ తర్వాత, ఎలా ఉన్నవారు అలాగే ఉంటారు. పతిత-పావనుడైన తండ్రి ఒక్కసారి మాత్రమే సంగమములో వస్తారు. సత్యయుగములోనైతే భక్తి మార్గపు విషయాలు ఉండనే ఉండవు. శిరస్సును ఖండించుకోండి, అది-ఇది చేయండి అని అయితే తండ్రి చెప్పరు. భక్తి మార్గములో అనేక రకాలుగా ఏమేమో చేస్తూ ఉంటారు. పూర్వము దేవీలకు మనుష్యులను బలి ఇచ్చేవారు. తండ్రి అంటారు, మీరు బాగున్నప్పుడు దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చాను. ఎన్ని బంగారు, వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి, అపారమైన ధనము ఉండేది. దానిని ఏమి చేసారు? ఇప్పుడు మీరు ఎంత దుఃఖితులుగా అయిపోయారు. మీరు వాస్తవానికి దేవీ-దేవతా ధర్మమువారిగా ఉండేవారు కదా. ఇప్పుడు కేవలం మీరు రజో, తమోలలోకి వచ్చారు. మీరైతే దేవతా ధర్మమువారిగా ఉండేవారు, మరి స్వయాన్ని హిందువులని ఎందుకు చెప్పుకుంటారు? ఇతర ధర్మాలవారందరూ తమ-తమ ధర్మాలనే నమ్ముతారు. ధర్మమైతే ఒక్కటే ఉంటుంది కదా. ముసల్మానులది ముస్లిమ్ ధర్మము, క్రిస్టియన్లది క్రిస్టియన్ ధర్మము, ఇవి కొనసాగుతూ వస్తాయి. మీకు ఏమయ్యింది? మీరు చాలా సుఖముగా, పవిత్రముగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత వికారులుగా అయిపోయారు? వాస్తవానికి మేము సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారము, తర్వాత సంపూర్ణ వికారులుగా ఎలా అయ్యాము అనేది అసలెవరికీ తెలియదు. 84 జన్మలు తీసుకుంటూ సతో నుండి తమోగా అయ్యారు, ఇప్పుడు పూర్తిగా తమోప్రధానముగా, పతితముగా ఉన్నారు. సత్యయుగము నుండి కలియుగము వరకు తప్పకుండా రావాల్సి ఉంటుంది. అన్ని ధర్మాలు సతో, రజో, తమోలలోకి రావాల్సిందే, వృద్ధిని పొందాల్సిందే. మీరు కూడా వృక్షములో ఉన్నారు కదా. వృక్షములో చూడండి - అంతిమములో బ్రహ్మా నిలబడి ఉన్నారు, బ్రహ్మాయే 84 జన్మలు తీసుకుని వెళ్ళి అంతిమములో వృక్షము యొక్క చివరి స్థానములో నిలబడి ఉన్నారు. కింద కూర్చుని ఉన్న బ్రాహ్మణులైన మీరే మళ్ళీ అంతిమములో పతితులుగా, శూద్రులుగా అయ్యారు. కింద మళ్ళీ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు కూడా శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు వృక్షములో చాలా మంచి వివరణ ఉంది. ఇప్పుడు మీరు రాజయోగ తపస్యను చేస్తున్నారు. మీ స్మృతిచిహ్నమే నిలబడి ఉంది. ఇది చైతన్య దిల్వాడా మందిరము, అది జడమైనది. సత్యయుగములో ఇది ఉండేది కాదు. ఈ సమయములో మీరు మీ స్మృతిచిహ్నాన్ని చూసుకుంటున్నారు. మీరు ప్రాక్టికల్ గా సత్యాతి-సత్యమైన దిల్వాడా మందిరములో చైతన్యముగా కూర్చున్నారు. స్వర్గ స్థాపన జరుగుతోంది. తర్వాత స్వర్గములోకి వచ్చినప్పుడు ఈ మందిరాలు మొదలైనవేవీ ఉండవు. మమ్మా-బాబా మరియు పిల్లలైన మనము కూర్చున్నాము. ఇది యథావిధిగా మీ మందిరమే. మధుబన్, ఒక చైతన్య దిల్వాడా మందిరము అనే పేరు పెట్టడము జరిగింది. తర్వాత ఎప్పుడైతే భక్తి మార్గము ప్రారంభమవుతుందో, అప్పుడు ఈ మందిరాలను నిర్మిస్తారు. తండ్రి మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేసారు, అందుకే మళ్ళీ వారి మందిరాలను నిర్మిస్తారు. శివుని మందిరాలను ఒక్కరే నిర్మించరు, యోగ్యత అనుసారముగా, శక్తి అనుసారముగా అందరూ నిర్మిస్తారు.

మేము పూజ్యులుగా ఉండేవారమని, తర్వాత ద్వాపరములో పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. ఇంతటి షావుకారులుగా తయారుచేసిన శివబాబాకు, భక్తిలో మళ్ళీ మీరే మందిరాలు నిర్మిస్తారు. ఈ విషయాలు ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. కనుక ఇప్పుడు పురుషార్థము చేసి, మళ్ళీ రాజులకే రాజులుగా అవ్వాలి. సత్యయుగములో మహారాజులు అని అంటారు, త్రేతాలో రాజులని అంటారు. తర్వాత ప్రపంచము పతితముగా అయినప్పుడు మహారాజులు కూడా పతితముగా అవుతారు, రాజులు కూడా పతితముగా అవుతారు. వారు నిర్వికారీ మహారాజుల మందిరాలను నిర్మించి పూజిస్తారు. మొట్టమొదట శివుని మందిరాలను నిర్మిస్తారు, ఆ తర్వాత దేవతలవి నిర్మిస్తారు. వారంతట వారే మందిరాలను నిర్మించి పూజిస్తారు, 84 జన్మలైతే అనుభవిస్తారు కదా. అర్ధకల్పము మీరు పూజ్యులుగా, మళ్ళీ అర్ధకల్పము పూజారులుగా అవుతారు. మనుష్యులు భగవంతుని గురించి - వారే పూజ్యుడు, వారే పూజారి అని అనుకుంటారు. అంతా వారే ఇస్తారు, వారే తీసేసుకుంటారు అని అనుకుంటారు. అచ్ఛా, మరి వారే ఇచ్చి వారే తీసుకున్నప్పుడు మీకెందుకు చింత కలుగుతుంది? మీరైతే ట్రస్టీలైనట్లు. ఇక ఏడ్వాల్సిన అవసరము ఏముంది? తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు, నంబరువారుగా. కొందరైతే అసలు తండ్రిని స్మృతే చేయరు. దేహీ-అభిమానులుగా ఉండనే ఉండరు. ఇక్కడ ఎంతగా అర్థం చేయించడము జరుగుతుంది - అరే, మీరు ఆత్మలు, పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు అని. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. ఆత్మయే బ్యారిస్టరు మొదలైనవారిగా అవుతుంది, ఆత్మయే మెజిస్ట్రేటుగా అవుతుంది. రేపు ఏమవుతారు? ఒకవేళ ఆత్మ తండ్రిని మంచి రీతిలో స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, ఇక అమరలోకానికి వెళ్ళి జన్మ తీసుకుంటుంది. ఇక మృత్యులోకములో మరో జన్మ తీసుకోదు. ఒకవేళ ఏవైనా లెక్కాచారాలు మిగిలి ఉంటే, శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. కర్మభోగాన్ని అనుభవించి సమాప్తము చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు పదవి ఉన్నతమైనది లభించదు. ఈ కర్మల గుహ్యగతిని తండ్రి కూర్చుని పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. సత్యయుగము సతోప్రధానమైనదని కూడా పిల్లలకు తెలుసు. ప్రతి వస్తువు అక్కడ సతోప్రధానముగా ఉంటుంది. కృష్ణుడు ఆవులను సంభాళించేవారని అంటారు. రాజులు ఆవులను సంభాళిస్తారా? అటువంటిదేమీ ఉండదు. సత్యయుగములో ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయని చూపిస్తారు, వాటిని కామధేనువు అని అంటారు. జగదంబ సరస్వతి కూడా కామధేనువే. 21 జన్మల కోసం అందరి మనోకామనలను పూర్తి చేస్తారు. మీరు కూడా కామధేనువులే. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులకు కూడా ఈ పేరే పెట్టారు. రాజుల ఇళ్ళల్లో చాలా ఫస్ట్ క్లాస్ ఆవులు ఉంటాయి. ఇక్కడి రాజుల వద్దనే మంచి-మంచి ఆవులు ఉన్నప్పుడు, ఇక స్వర్గములో ఇంకెంత సుందరముగా ఉంటాయి! అక్కడ అసలు ఎటువంటి దుర్గంధము ఉండదు.

ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు - నేను వచ్చాను, మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేసి నాతోపాటు తీసుకువెళ్తాను. ఓ పతిత-పావనా రండి, పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి రండి అనే నన్ను పిలుస్తారు. ఈ బ్రహ్మా పతితముగా ఉన్నారు, ఆ బ్రహ్మా పావన ఫరిశ్తా. పోల్చడము జరుగుతుంది. మీరు కూడా పతితము నుండి అటువంటి పావన ఫరిశ్తాలుగా అవుతారు. సత్యయుగీ దేవతలను ఇంగ్లీష్ లో డైటీ అని అంటారు. సూక్ష్మవతనవాసులు ఫరిశ్తాలు. ఇప్పుడు మీరు ఫరిశ్తాలుగా, పవిత్రముగా అవుతారు. తండ్రి ఎంత సహజమైన శిక్షణను ఇస్తున్నారు. ఇక్కడకు వచ్చినప్పుడు, బయటి మిత్ర-సంబంధీకులు, ఇళ్ళు-వాకిళ్ళు, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటిని గుర్తు చేసుకోకూడదు. తండ్రికి సమ్ముఖముగా వచ్చారు కదా! యోగము యొక్క సంపాదన చేసుకోవడానికే ఇక్కడకు వచ్చారు కావున అందులో నిమగ్నమైపోవాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శిక్షల నుండి విముక్తులుగా అయ్యేందుకు, పాత లెక్కాచారాలన్నింటినీ యోగబలముతో సమాప్తము చేసుకోవాలి. ట్రస్టీగా ఉంటూ అంతా సంభాళించాలి. ఏ విషయములోనూ చింతించకూడదు. ఆత్మాభిమానులుగా అవ్వాలి.

2. ఇది సంపాదన యొక్క సమయము. ఇందులో ఇళ్ళు-వాకిళ్ళు, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటిని గుర్తు చేసుకోకూడదు. ఫరిశ్తాలుగా అయ్యేందుకు, ఒక్క తండ్రి స్మృతిలో ఉండేందుకు పూర్తి పురుషార్థము చేయాలి.

వరదానము:-
స్మృతి యొక్క సెర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారుచేసే విజయీ రత్న భవ

సర్వీసబుల్ ఆత్మల మస్తకముపై విజయ తిలకము దిద్దబడే ఉంటుంది. కానీ ఏ స్థానము యొక్క సేవనైతే చేయాలో, ఆ స్థానముపై ముందు నుండే సెర్చ్ లైట్ యొక్క ప్రకాశాన్ని ప్రసరింపజేయాలి. స్మృతి యొక్క సెర్చ్ లైట్ ద్వారా ఎటువంటి వాయుమండలము తయారవుతుందంటే, ఇక అనేక ఆత్మలు సహజముగా, సమీపముగా వచ్చేస్తారు. అప్పుడు తక్కువ సమయములో సఫలత వేలాది రెట్లుగా లభిస్తుంది. దీని కొరకు - మేము విజయీ రత్నాలము అని దృఢ సంకల్పము చేయండి, అప్పుడు ప్రతి కర్మలోనూ విజయము ఇమిడి ఉంటుంది.

స్లోగన్:-
ఏ సేవ అయితే స్వయాన్ని లేక ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో, ఆ సేవ, సేవ కాదు, భారము.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

జ్వాలా రూపులుగా అయ్యేందుకు - ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అన్న ఈ ధ్యాసే ఎల్లప్పుడూ ఉండాలి. వెళ్ళటము అనగా ఉపరామము. మీ నిరాకారీ ఇంటికి వెళ్ళాలి అన్నప్పుడు మరి మీ వేషాన్ని కూడా ఆ విధముగా తయారుచేసుకోవాలి. కనుక వెళ్ళాలి మరియు అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి - ఈ స్మృతితో స్వతహాగానే సర్వ సంబంధాల నుండి, సర్వ ప్రకృతి ఆకర్షణల నుండి ఉపరామమైపోతారు అనగా సాక్షీగా అయిపోతారు. సాక్షీగా అవ్వటము ద్వారా సహజముగానే బాబాకు సహచరులుగా మరియు బాబా సమానముగా అవుతారు.