07-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇప్పటివరకు ఏదైతే చదివారో, అదంతా
మర్చిపోయి ఒక్క తండ్రిని స్మృతి చేయండి’’
ప్రశ్న:-
భారత్ లో
సత్యయుగ స్వరాజ్యాన్ని స్థాపన చేయడానికి ఏ బలము కావాలి?
జవాబు:-
పవిత్రతా బలము.
మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో యోగము జోడించి పవిత్రముగా అవుతారు. ఈ పవిత్రతా
బలముతోనే సత్యయుగీ స్వరాజ్యము స్థాపనవుతుంది, ఇందులో యుద్ధము మొదలైనవాటి విషయమేమీ
లేదు. జ్ఞాన-యోగ బలాలే పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తాయి. ఈ బలముతోనే ఏకమత
స్థాపన జరుగుతుంది.
పాట:-
చివరికి ఆ రోజు
నేడు రానే వచ్చింది...
ఓంశాంతి
పిల్లలు పాటను విన్నారు. ఈ పాట మనము తయారుచేసిందేమీ కాదు. ఎలాగైతే ఇతర
వేద-శాస్త్రాల సారము అర్థం చేయించడము జరుగుతుందో, అలానే తయారుచేయబడిన ఈ పాటల
సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. నావికుడు, తోట యజమాని మరియు సద్గతిదాత ఒక్క తండ్రి
మాత్రమేనని పిల్లలకు తెలుసు. జీవన్ముక్తి కోసమని భక్తి చేస్తారు. కానీ జీవన్ముక్తి
దాత లేక సద్గతిదాత ఒక్క భగవంతుడే. దీని అర్థాన్ని పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు,
ఆ మనుష్యులు అర్థం చేసుకోలేరు. సద్గతి ఇవ్వడము అనగా దుఃఖము నుండి విడిపించి శాంతి
యొక్క ప్రాప్తిని కలిగిస్తారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యమున్నప్పుడు ఇక్కడ పవిత్రత,
సుఖము, శాంతి ఉండేవని భారతవాసులైన పిల్లలకు తెలుసు. దానిని రాధ-కృష్ణుల రాజ్యమని
అనలేరు. వాస్తవానికి మాతల యొక్క తోటివారు రాధ కావున ఆమెను ఎక్కువ ప్రేమించాలి, కానీ
శ్రీకృష్ణుడినే ఎక్కువ ప్రేమిస్తారు. వారిని ఊయలలో ఊపుతారు. శ్రీకృష్ణుని
జన్మాష్టమిని కూడా జరుపుకుంటారు. రాధ జయంతిని జరుపుకోరు. వాస్తవానికి ఇద్దరి జయంతిని
జరుపుకోవాలి. ఏమీ అర్థం చేసుకోరు. వారి జీవిత కథ గురించైతే ఎవరికీ తెలియదు. తండ్రి
వచ్చి తమ జీవిత కథను మరియు అందరి జీవిత కథలను వినిపిస్తారు. మనుష్యులు శివ
పరమాత్మాయ నమః అని కూడా అంటారు, కానీ వారి జీవిత కథ గురించి తెలియదు. మనుష్యుల
జీవిత కథలను చరిత్ర-భౌగోళికాలని అంటారు, ప్రపంచము యొక్క చరిత్ర మరియు భౌగోళికము అని
అంటారు కదా - ఎన్ని ప్రాంతాలలో రాజ్యము చేసేవారు, ఎంత భూమిపై రాజ్యము చేసేవారు, ఎలా
రాజ్యము చేసారు, తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు... ఈ విషయాలు ఎవరికీ తెలియవు.
పిల్లలైన మీకు మంచి రీతిలో అర్థం చేయించడము జరుగుతుంది. రచయిత మరియు రచనల జ్ఞానాన్ని
పిల్లలకు అర్థం చేయిస్తారు. ఖచ్చితముగా ఇప్పుడు ఇది కలియుగ అంతిమము మరియు సత్యయుగ
ఆది అని పిల్లలైన మీకు తెలిసింది. సంగమములోనే పరమపిత పరమాత్మ వచ్చి మనుష్యులను
పతితుల నుండి పావన దేవతలుగా తయారుచేస్తారు, ఉత్తమ పురుషులుగా అనగా పురుషోత్తములుగా
తయారుచేస్తారు ఎందుకంటే ఈ సమయములోని మనుష్యులు ఉత్తములుగా లేరు, కనిష్టులుగా ఉన్నారు.
ఉత్తములు, మధ్యములు, కనిష్టులు ఉంటారు, సతో, రజో, తమో స్థితులు ఉంటాయి. ఎవరైతే మంచి
రీతిలో జ్ఞానము వింటారో, వారిని సతోగుణీ అని అంటారు. ఎవరైతే కొద్దిగా వింటారో,
వారిని రజోగుణీ అని అంటారు, ఎవరైతే అస్సలు వినరో, వారిని తమోగుణీ అని అంటారు.
చదువులో కూడా ఇలానే ఉంటుంది. పిల్లలైన మీకు సతోప్రధానమైన చదువు కావాలి, అందుకే
సతోప్రధానమైన లక్ష్మీ-నారాయణులుగా అయ్యే జ్ఞానాన్ని మీకు ఇవ్వడము జరుగుతుంది. నరుని
నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారవ్వాలి. ఇది సత్యమైన గీత అని గీత
గురించి కూడా మీరు చెప్తారు. మీరు ఇలా వ్రాయవచ్చు కూడా - ఇది సత్యమైన గీతా పాఠశాల
అనగా సత్యనారాయణునిగా తయారుచేసే కథ లేక సత్యమైన అమరకథ, సత్యమైన మూడవ నేత్రము యొక్క
కథ. చిత్రాలైతే మీ వద్ద అన్నీ ఉన్నాయి, వీటిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు
పిల్లలైన మీరు ఈ విధముగా ప్రతిజ్ఞ చేస్తారు - ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలైన మేము
భారత్ ను సతోప్రధాన స్వర్గముగా తయారుచేసే తీరుతాము అని. మీరు అందరికీ ఈ వార్తను
తెలియజేయాలి. గాంధీజీ కూడా పావన రాజ్యాన్ని కోరుకునేవారు అంటే తప్పకుండా ఇప్పుడు
పతిత రాజ్యమున్నట్లు. తాము స్వయము పతితులుగా ఉన్నారని ఎవరూ అర్థం చేసుకోలేరు.
రావణుడు అనగా 5 వికారాలు. రామ రాజ్యము కావాలని అంటున్నారంటే తప్పకుండా ఆసురీ
సాంప్రదాయులుగా ఉన్నట్లే కదా, కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఎంతో పెద్ద-పెద్ద
గురువులు కూడా ఏమీ అర్థం చేసుకోరు. మేము శ్రీమతమనుసారముగా బ్రహ్మా ద్వారా 5 వేల
సంవత్సరాల క్రితం వలె దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తాము అని పిల్లలైన మీరు అందరికీ
ప్రకటిస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము, ఈ సమయములోనే మీరు కనిష్ట పురుషుల నుండి
సతోప్రధాన పురుషోత్తములుగా తయారవుతారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే మర్యాద
పురుషోత్తమమైనది. ఇప్పుడు కేవలం దేవీ-దేవతా ధర్మ స్థాపన మాత్రమే జరుగుతుంది,
అప్పుడిక ఇతర ధర్మాలు ఉండనే ఉండవు. సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేవని
పిల్లలైన మీరు ఋజువు చేసి అర్థం చేయిస్తారు. త్రేతాలో సూర్యవంశము నుండి
చంద్రవంశములోకి వెళ్ళినా కానీ ఒక భాషే ఉంటుంది. ఇప్పుడైతే భారత్ లో అనేక భాషలున్నాయి.
మన రాజ్యములో ఒకే భాష ఉండేదని పిల్లలకు తెలుసు. ఈ రోజుల్లోనైతే చాలా చూస్తూ ఉంటారు.
ఎలాగైతే యాత్రకు వెళ్ళి తిరిగి తమ దేశము వైపుకు దగ్గరకు వచ్చే కొలది, ఇక మా ఇంటికి
చేరుకున్నాము, ఇక ఇప్పుడు వెళ్ళి అందరినీ కలుసుకుంటాము అని సంతోషపడతారు, అలా మీకు
కూడా మీ రాజధాని యొక్క సాక్షాత్కారము జరుగుతూ ఉంటుంది. మీ పురుషార్థము యొక్క
సాక్షాత్కారము కూడా జరుగుతుంది. అప్పుడు - పురుషార్థము చేయమని బాబా మాకు ఎంతగా
చెప్పారు అన్నది చూస్తారు. పురుషార్థము చేయకపోతే అయ్యో-అయ్యో అని అంటారు మరియు పదవి
కూడా తగ్గిపోతుంది. యోగము యొక్క యాత్ర గురించి అందరికీ చెప్తూ ఉండండి. అర్థం
చేయించడము చాలా సహజము. మెట్ల వరుస చిత్రము ఎంత సహజమైనది. ఎవరైతే ఆలస్యముగా వస్తారో,
వారికి రోజురోజుకు సహజమైన జ్ఞానము లభిస్తుంది. ఒక వారము రోజులు అర్థం
చేసుకున్నట్లయితే సహజముగా అర్థం చేసుకుంటారు. ఖచ్చితమైన వివరణ కలిగి ఉండేలా చిత్రాలు
తయారుచేయబడి ఉన్నాయి. 84 జన్మల చక్రము పూర్తిగా కరక్టుగా ఉంది. ఇది భారతవాసుల కోసమే.
పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మీకు తెలుసు - పతితపావనుడు, సద్గతిదాత
అయిన శివబాబా మతమనుసారముగా మనము మళ్ళీ సహజ రాజయోగ బలముతో, మన తనువు-మనసు-ధనములతో
భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నాము, వేరే వారెవరిదీ మనము ఉపయోగించము, మన
తనువు-మనసు-ధనములతోనే సేవ చేస్తాము. ఎవరెంతగా చేస్తారో, వారు అంతగానే తమ భవిష్యత్తు
కోసం తయారుచేసుకుంటారు. మీరే కుటుంబ సభ్యులు. మీ ద్వారానే బాబా సత్యయుగీ
స్వరాజ్యాన్ని స్థాపన చేయిస్తున్నారు. ఖర్చును కూడా మీరే చూసుకుంటారు. మీకు పెద్ద
ఖర్చేమీ లేదు. మీరు కేవలం శివబాబాను స్మృతి చేయాలి. కన్యలు ఖర్చులెలా చూసుకుంటారు.
వారి వద్ద ఏమైనా ఉందా? బాబా, పిల్లల నుండి ఏమి ఫీజు తీసుకుంటారు. ఏమీ తీసుకోరు.
స్కూళ్ళలోనైతే ముందు ఫీజు గురించే మాట్లాడుతారు. అక్కడ చదువుకు ఎంత ఖర్చవుతుంది.
ఇక్కడైతే శివబాబా పిల్లల నుండి డబ్బులు ఎలా తీసుకుంటారు. ఇక్కడ డబ్బులు
తీసుకోవడానికి శివబాబాకు తమ ఇల్లు కట్టుకునేదేమీ లేదు. పిల్లలైన మీరు భవిష్య
స్వర్గములోకి వెళ్ళి వజ్ర-వైఢూర్యాల మహళ్ళు నిర్మించవలసి ఉంటుంది, అందుకే ఇక్కడ మీరు
ఏదైతే చేస్తారో, దానికి ప్రతిఫలముగా భవిష్యత్తులో మీకు మహళ్ళు లభిస్తాయి. ఇవి చాలా
అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరెంతగా తనువు-మనసు-ధనములతో సేవ చేస్తారో, వారు
అక్కడ ఆ విధముగానే పొందుతారు. కాలేజీ లేదా హాస్పిటల్ కట్టించేటప్పుడు, 10 లేక 20
లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే అంత ఖర్చు అవ్వదు. చిన్న ఇంటిలో ఆత్మిక
కాలేజీని మరియు హాస్పిటల్ ను తయారుచేస్తారు. పాండవుల ఆది పతి ఎవరు? వారైతే
శ్రీకృష్ణుని పేరును వ్రాశారు. వాస్తవానికి పాండవుల ఆది పతి నిరాకార భగవంతుడు. మీకు
శ్రీమతాన్ని ఇచ్చేవారు భగవంతుడు. మిగిలినవారంతా రావణ రాజ్యములో, రావణుడి మతాన్ని
అనుసరిస్తున్నారు. రావణుడి మతాన్ని అనుసరిస్తూ ఎంత అశుద్ధముగా అయిపోయారు. ఇప్పుడు ఈ
సృష్టియే పాతదిగా, ఇదే మళ్ళీ కొత్తదిగా అవుతుంది. సృష్టిలో భారత్ మాత్రమే ఉండేది.
కొత్త భారత్, పాత భారత్ అని అంటారు. కొత్త భారత్ స్వర్గముగా ఉండేది. తర్వాత భారత్
పాతబడినప్పుడు నరకముగా అవుతుంది. దీనిని రౌరవ నరకమని అంటారు. ఇది మనుష్యుల విషయమే.
ఇక్కడ సుఖము యొక్క నామ-రూపాలే లేవు. ఇది సుఖమేమీ కాదు. సన్యాసులు కూడా, ఈ సమయములోని
సుఖాన్ని కాకిరెట్టతో సమానమని అంటారు, అందుకే వారు గృహస్థ వ్యవహారాన్ని వదిలేస్తారు.
వారు స్వర్గాన్ని లేక సత్యయుగాన్ని స్థాపన చేయలేరు. శ్రీకృష్ణపురినైతే పరమాత్మయే
స్థాపన చేస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ మరియు శరీరము, రెండూ సతోప్రధానముగా ఉండేవి,
అందుకే శ్రీకృష్ణుడిని చాలా ప్రేమిస్తారు, ఎందుకంటే వారు పవిత్రమైనవారు కదా. చిన్న
పిల్లలు బ్రహ్మజ్ఞానులతో సమానమని అంటూ ఉంటారు. చిన్న పిల్లలకు వికారాల గురించి
తెలియదు. సన్యాసులకైతే ఎంతైనా తెలుసు. పిల్లలైతే జన్మతః మహాత్ములు. పిల్లలనైతే
పవిత్రమైన పుష్పాలని అంటారు. నంబరువన్ పుష్పము శ్రీకృష్ణుడు. వారు కొత్త ప్రపంచమైన
స్వర్గములోని మొదటి రాకుమారుడు. జన్మించగానే, వారిని మొదటి రాకుమారుడని అంటారు.
శ్రీకృష్ణుడి వంటి కొడుకు లభించాలని శ్రీకృష్ణుడినైతే అందరూ గుర్తు చేసుకుంటారు.
ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు ఎలా తయారవ్వాలనుకుంటే, అలా తయారవ్వండి. కేవలం ఒక్క
శ్రీకృష్ణుడు మాత్రమే తయారవ్వరు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ (వేల్స్ పట్టణము యొక్క
రాకుమారుడు) గా ఎంతమంది అవుతారు? సెకెండ్, థర్డ్... ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా
వంశముంటుంది. తండ్రి తర్వాత ఇంకొకరు ఆ రాజ్య సింహాసనముపై కూర్చుంటారు. ఎలాగైతే ఇతర
వంశాలు ఉంటాయో, అలాగే ఈ వంశావళి కూడా ఉంది. మీకు క్రిస్టియన్లతో సంబంధము ఉంది.
శ్రీకృష్ణుడు మరియు క్రిస్టియన్, ఇరువురి రాశి ఒక్కటే. పరస్పరములో
ఇచ్చి-పుచ్చుకోవడాలు కూడా చాలా జరుగుతుంటాయి. భారత్ నుండి వారు ఎంత ధనము
తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇస్తున్నారు. రిటర్న్ సర్వీస్
చేస్తున్నారు. ఈ యూరోప్ వాసులు పరస్పరములో దెబ్బలాడుకుని సమాప్తమైపోతారు. దీని
గురించి ఒక కథ కూడా ఉంది - రెండు పిల్లులు కొట్లాడుకుంటే, మధ్యలో కోతి వచ్చి వెన్న
తినేసింది అని. ఇది ఇప్పటి విషయమే. వారు పరస్పరములో కొట్లాడుకుంటారు మరియు రాజ్య
భాగ్యము మీకు లభించనున్నది. ఇప్పుడు పిల్లలైన మీకు అపారమైన జ్ఞానముంది. మేమంతా
బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలమని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అంతేకానీ, మేము
గుజరాతీలము, మేము బెంగాలీలము అని కాదు. ఇలా ఉండకూడదు. ఈ అభిప్రాయ బేధాలు కూడా
తొలగిపోవాలి. మనము ఒక్క తండ్రికి సంతానము. బ్రహ్మా ద్వారా శివబాబా శ్రీమతమనుసారముగా,
మనము జ్ఞాన-యోగాల బలముతో మన స్వరాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేసుకుంటున్నాము.
యోగబలముతోనే మనము పావనముగా అవుతాము. తండ్రి సర్వశక్తివంతుడు, వారి నుండి బలము
లభిస్తుంది. మీరు విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఇందులో యుద్ధాలు మొదలైనవేమీ
చేయరు. అంతా పవిత్రతా బలానికి సంబంధించిందే. మీరు వచ్చి పతితులను పావనముగా
తయారుచేయండి అని అంటున్నారంటే, దానికి ఆధారము స్మృతి బలమే. అంతేకానీ, అక్కడ
వ్యాపార-వ్యవహారాలలోకి వెళ్ళి అంతా మర్చిపోవడము కాదు. ఇక్కడ సమ్ముఖములో జ్ఞానసాగరుని
అలలను చూస్తూ ఉంటారు. నదులలోనైతే ఆ అలలు ఉండవు. సాగరము యొక్క ఒక్క అల ఎంత నష్టము
కలిగిస్తుంది. భూకంపము వచ్చినప్పుడు, సాగరము కూడా ఉప్పొంగుతుంది. సాగరాన్ని
ఎండబెట్టి భూమిని తీసుకున్నారు, మళ్ళీ ఆ భూమిని ఎంత రేటుకు అమ్ముతారు. ఈ బొంబాయి ఇక
ఉండనే ఉండదని మీకు తెలుసు. ఇంతకుముందు ఈ బొంబాయి ఉండేది కాదు కదా, ఒక చిన్న
గ్రామముగా ఉండేది. ఈ మాతలు అమాయకులు. వారు అంతగా ఏమీ చదువుకోలేదు. ఇక్కడైతే
చదువుకున్నదంతా మర్చిపోవాలి. మీరేమీ చదువుకోలేదంటే మంచిది. చదువుకున్న మనుష్యులు,
వారికి అర్థం చేయించేటప్పుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడైతే కేవలం తండ్రిని
స్మృతి చేయాలి. దేహధారులైన మనుష్యులెవరినీ తలచుకునే విషయము కాదు. మహిమ అంతా ఒక్క
అనంతమైన తండ్రిదే. భగవంతుడొక్కరే ఉన్నతోన్నతమైనవారని, తర్వాత రెండవ నంబరులో బ్రహ్మా
ఉన్నారని మీకు తెలుసు. వారి కన్నా ఉన్నతమైనవారు ఇంకెవరూ ఉండరు. వీరి కన్నా గొప్ప
ఆసామి ఇంకెవ్వరూ లేరు, కానీ ఎంత సాధారణముగా ఉంటూ ఉంటారో చూడండి. ఎంత సాధారణ రీతిలో
పిల్లలతో కూర్చుంటారు. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు, వీరు ఎవరు అనేది ఇతరులకు ఏమి
తెలుస్తుంది! భగవంతుడు వచ్చి జ్ఞానము ఇస్తారంటే, తప్పకుండా ఎవరిలోనైనా ప్రవేశించి
జ్ఞానము ఇస్తారు కదా. ఒకవేళ వారు శ్రీకృష్ణుడైతే, పెద్ద గుంపు ఏర్పడిపోతుంది,
అప్పుడిక చదివించలేరు కూడా, కేవలం దర్శనము చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి
గుప్తముగా, సాధారణ వేషములో కూర్చుని పిల్లలను చదివిస్తున్నారు.
మీరు గుప్తమైన సైన్యము. ఆత్మలమైన మనము యోగబలముతో మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపన
చేసుకుంటున్నామని మీకు తెలుసు. ఈ పాత శరీరాలను వదిలి వెళ్ళి కొత్త సుందరమైన శరీరాలను
ధరిస్తారు. ఇప్పుడు ఆసురీ సాంప్రదాయము వారిగా ఉన్నారు, తర్వాత దైవీ సాంప్రదాయము
వారిగా అవుతారు. నేను కొత్త ప్రపంచములో దైవీ శరీరాన్ని ధారణ చేసి రాజ్యము చేస్తాను
అని ఆత్మ అంటుంది. ఆత్మ పురుష్, శరీరము ప్రకృతి. ఆత్మ సదా పురుష్ గా ఉంటుంది. ఇకపోతే
లెక్కాచారము అనుసారముగా స్త్రీ లేక పురుషుని శరీరము లభిస్తుంది. కానీ నేను అవినాశీ
ఆత్మను. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. కలియుగ వినాశనము కూడా తప్పకుండా జరుగుతుంది.
వినాశనము గుర్తులు కూడా మీరు ఎదురుగా చూస్తున్నారు. అదే మహాభారత యుద్ధము జరుగుతుంది
కనుక తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. వారు ఏ రూపములో ఉన్నారు మరియు ఎవరి తనువులో
ఉన్నారు అనేది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. తండ్రి అంటారు - నేను పూర్తి
సాధారణ తనువులోకి వస్తాను, నేను శ్రీకృష్ణుని తనువులోకి రాను. వీరే పూర్తి 84 జన్మలు
తీసుకుంటారు. నేను వీరి అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో వస్తాను. 84 జన్మలను
సూర్యవంశానికి చెందినవారే తీసుకుంటారు. వారే మొదటి నంబరులోకి వస్తారు. సాకారీ
వృక్షము మరియు నిరాకారీ వృక్షము - ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానమంతా మీకు ఉంది.
మూలవతనము నుండి నంబరువారుగా ఆత్మలు వస్తారు. మొట్టమొదటగా దేవీ-దేవతా ధర్మానికి
చెందిన ఆత్మలు వస్తారు, తర్వాత నంబరువారుగా ఇతర ధర్మాల వారు వస్తారు. చిత్రాలలో
వివరణ అయితే చాలా ఉన్నతముగా ఉంది. పిల్లలు అందరికీ అర్థం చేయించాలి, కుమారీలు లేచి
నిలబడాలి. కుమార్తెలు ఎవరైనా ఇలాంటి విషయాలను అర్థం చేయిస్తే అది అద్భుతము కదా. వారు
ఎంత పేరు తీసుకువస్తారు. లౌకికము మరియు అలౌకికము - ఇరువురి పేర్లను ప్రఖ్యాతి
చేస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సంగమయుగములో శ్రేష్ఠ కర్మలు చేసి పురుషోత్తములుగా అవ్వాలి. కనిష్టులుగా
తయారుచేసే కర్మలేవీ చేయకూడదు.
2. గుప్త రూపములో తండ్రికి సహాయకులుగా అయి భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవ
చేయాలి. తమ తనువు-మనసు-ధనములతోనే భారత్ ను స్వర్గముగా తయారుచేయాలి. స్మృతి మరియు
పవిత్రత బలాలను జమ చేసుకోవాలి.
వరదానము:-
మీ సంపూర్ణ స్థితి ద్వారా అన్ని రకాల ఆధీనతలను సమాప్తము చేసే
ప్రకృతి జీత్ భవ
ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితులవుతారో,
అప్పుడు ప్రకృతిపై కూడా విజయము అనగా అధికారము అనుభవమవుతుంది. సంపూర్ణ స్థితిలో ఏ
రకమైన ఆధీనత ఉండదు. కానీ ఇటువంటి సంపూర్ణ స్థితిని తయారుచేసుకునేందుకు మూడు విషయాలు
కలిపి ఉండాలి - 1. ఆత్మికత 2. ఆత్మిక నషా 3. దయా హృదయము యొక్క గుణము. ఎప్పుడైతే ఈ
మూడు విషయాలు ప్రత్యక్ష రూపములో, స్థితిలో, ముఖములో మరియు కర్మలలో కనిపిస్తాయో,
అప్పుడు అధికారి మరియు ప్రకృతీజీత్ ఆత్మ అని అంటారు.
స్లోగన్:-
శ్రీమతమనే
కళ్ళెం దృఢముగా ఉన్నట్లయితే, మనసు రూపీ గుర్రము పరుగుపెట్టలేదు.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
ఒకవేళ ఎవరైనా
అపవిత్రతకు చెందిన వృత్తి, స్మృతి లేక సంకల్పాలతో ఉన్నట్లయితే, వారు
బ్రాహ్మణత్వానికి చెందిన స్థితిలో స్థితులవ్వలేరు, అందుకే అడుగుడుగులోనూ జాగ్రత్తగా
ఉండండి. విశేషతలతోపాటు ఒకవేళ ఏదైనా ఒక్క బలహీనత ఉన్నా సరే, ఒక్క బలహీనత అనేక
విశేషతలను సమాప్తము చేసేస్తుంది.