07-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇక్కడ శ్రీకృష్ణుని వలె
రాకుమారులుగా తయారయ్యే చదువును చదువుకుంటారు, మిమ్మల్ని చదివించేవారు స్వయంగా
భగవంతుడు’’
ప్రశ్న:-
బాబా ఎప్పుడైతే
భగవానువాచ అనే పదాన్ని ఉపయోగిస్తారో, అప్పుడు కొంతమంది పిల్లలు కూడా తికమకపడతారు -
ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే
భగవంతుడైతే గుప్తముగా ఉన్నారు. వారు, బహుశా ఈ దాదానే భగవానువాచ అని అన్నారని
భావిస్తారు. కానీ నిరాకారుడైన భగవంతుడికి మాట్లాడేందుకు తప్పకుండా నోరు కావాలి కదా.
బాబా అంటారు - నేను ఎలా ఇతనిలోకి ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తున్నాను అనేది అర్థం
చేసుకోవాల్సిన అద్భుతమైన విషయము.
ఓంశాంతి
భగవానువాచ. భగవంతుడు ఏమంటారు? ఇలా భగవానువాచ అని ఎవరన్నారు? చూసేందుకైతే ఎవరూ
కనిపించడం లేదు. మనుష్యులను భగవంతుడు అని అనరు. ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా
కనిపిస్తున్నారో, వారే ‘భగవానువాచ’ అని అంటున్నారని కొందరు భావిస్తారు. కానీ
నిరాకారుడైన భగవంతుడు మాట్లాడుతున్నారని కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఎవరు
కూర్చుని ఉన్నారు! భగవంతుడు ఎక్కడ ఉన్నారు! ఇది కొత్త విషయము కదా, అందుకే మనుష్యులు
తికమకపడతారు. కానీ భగవానువాచ తప్పకుండా ఉంది. వారు, నేను పిల్లలకు రాజయోగాన్ని
నేర్పిస్తున్నానని అంటారు. నరుని నుండి నారాయణునిగా లేక కృష్ణునిగా, నారి నుండి
లక్ష్మిగా లేక రాధగా చేయడానికి యోగాన్ని మరియు జ్ఞానాన్ని నేర్పిస్తాను, ఇంతకన్నా
ఇంకేమి కావాలి. మిమ్మల్ని నేను రాజులకే రాజులుగా, రాకుమారులకే రాకుమారులుగా
తయారుచేస్తాను. రాకుమార-రాకుమారీలు కూడా మందిరాలకు వెళ్తూ ఉండవచ్చు కదా. వికారీ
రాకుమారులు, నిర్వికారీ రాకుమారుడైన శ్రీకృష్ణునికి నమస్కరిస్తారు. కావున నేను
మిమ్మల్ని రాకుమారులకే రాకుమారులుగా తయారుచేస్తాను. శ్రీకృష్ణుని వలె స్వర్గానికి
రాకుమారునిగా తయారవ్వండి. జ్ఞానము చదువుకోవడముతోనే కదా అలా తయారవుతారు. డాక్టరు లేక
బ్యారిస్టరు విద్యార్థులతో ఇలా అంటారు కదా - నేను మిమ్మల్ని డాక్టరుగా లేక
బ్యారిస్టరుగా తయారుచేస్తాను అని. కానీ చదువుకుంటేనే అలా తయారవుతారు. బాబా అంటారు -
పిల్లలూ, రాజయోగాన్ని నేర్పించేది ఒక్క భగవంతుడే అని, శ్రీకృష్ణుడు కాదు అని మీరు
మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. రాధా-కృష్ణులు వేర్వేరు రాజ్యాలకు చెందిన పిల్లలు.
వారిరువురికీ నిశ్చితార్థము జరుగుతుంది, వివాహము తర్వాత పేరు మారుతుంది, అందుకే
చిత్రములో కూడా లక్ష్మీ-నారాయణుల కింద రాధా-కృష్ణులను చూపించారు.
ఇప్పుడు తండ్రి
మంచి రీతిలో అర్థం చేయిస్తున్నారు - ఒకప్పుడు ఈ బ్రహ్మా కూడా నంబరువన్ భక్తునిగా
ఉండేవారు. చివరిలో నారాయణుడిని పూజించేవారు. శ్రీకృష్ణుని భక్తి చేసినా లేక
శ్రీనారాయణుని భక్తి చేసినా, విషయము ఒక్కటే. కృష్ణుడే పెద్దవారయ్యాక నారాయణునిగా
అవుతారు. ఇప్పుడు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు మీకు రాజయోగాన్ని
నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఈ సమయములో ఇతని ఆత్మ కూడా
చదువుకుంటుంది, తర్వాత భవిష్యత్తులో శ్రీకృష్ణునిగా అవుతుంది. తండ్రి అంటారు -
పిల్లలూ, మీరు జ్ఞాన చితిపై కూర్చుని తెల్లగా అవుతారు, మళ్ళీ కామ చితిపై కూర్చుని
నల్లగా అయిపోయారు. ఇది కంసపురి, నేను మిమ్మల్ని కృష్ణపురిలోకి తీసుకువెళ్ళేందుకు
వచ్చాను. శ్రీకృష్ణుడే సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు... ఇక్కడ ఎవరిలోనూ
సర్వ గుణాలు లేవు. నేను పిల్లలైన మిమ్మల్ని సంపూర్ణ నిర్వికారులుగా తయారుచేయడానికి
వచ్చాను. యోగబలముతో అలా తయారవ్వాలి. బాహుబలము అంటే హింసాయుతమైన యుద్ధము, అది
విల్లు-బాణాలతో జరిగేది, ఆ తర్వాత తుపాకులతో, ఖడ్గాలతో జరిగింది. ఇప్పుడిక బాంబులతో
జరుగుతుంది. ఇంట్లో కూర్చునే అంతా సమాప్తమయ్యే విధముగా బాంబులను తయారుచేస్తామని వారు
స్వయంగా అంటారు. అప్పుడిక మిలటరీ ఏం చేస్తుంది! తండ్రి అంటారు - మధురాతి-మధురమైన
పిల్లలూ, ఇది పాఠశాల. నేను మిమ్మల్ని రాకుమారుడైన శ్రీకృష్ణుని వలె తయారుచేస్తాను.
సత్యయుగము యొక్క మొదటి రాకుమారుడు ఇప్పుడు 84 జన్మలను తీసుకుని కలియుగములో బికారిగా
అయ్యారు. భారత్ లోనే అతని రాజ్యము ఉండేది. తర్వాత పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది
కదా. ఒకవేళ శ్రీకృష్ణుడిని భగవంతుడు అని అంటే, భగవంతుడు పునర్జన్మలలోకి ఎలా వస్తారు?
భగవంతుడైతే నిరాకారుడు. వారు ఒక్కరే రచయిత, మిగిలినవారంతా రచన. అందుకే ఆత్మలమైన
మనమందరము పరస్పరములో సోదరులమని అంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు -
బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలైన మీరు పరస్పరములో సోదరీ-సోదరులు. అటువంటప్పుడు అశుద్ధ
దృష్టి ఎలా ఉండగలదు. మీరు ఆ ఒక్క తండ్రి నుండి భవిష్యత్తు కోసం వారసత్వాన్ని
తీసుకుంటారు. ఒకవేళ పవిత్రముగా ఉండకపోతే శాంతిధామానికి, సుఖధామానికి ఎలా వెళ్తారు.
మేము పతితముగా అయిపోయాము, మమ్మల్ని పావనముగా తయారుచేయడానికి రండి అని పిలుస్తారు
కూడా. అందుకే తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి. ఇది మీ అంతిమ జన్మ. ఆత్మలైన
మీరంతా ఇప్పుడు తిరిగి వానప్రస్థములోకి వెళ్ళగలరు, అందుకే మీరు వానప్రస్థులు. ఈ
విధముగా ఏ గురువు మార్గము చూపించలేరు. ఈ జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది.
వారే పతిత-పావనుడు, నిరాకారుడు. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి, కొంత సమయము
కోసం నేను ఈ తనువును అప్పుగా తీసుకున్నాను. శరీరము లేకుండా ఆత్మ ఎలా మాట్లాడగలదు!
భగవానువాచ - నేను వృద్ధ సాధారణ తనువులోకి ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను.
నేను గర్భములోకి రాను. గర్భములో ప్రవేశించేవారైతే పునర్జన్మలలోకి రావాల్సి ఉంటుంది.
నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. నాకు తప్పకుండా ప్రకృతి యొక్క ఆధారము కావాలి. నేను
ఇతనిలో కూర్చుని మిమ్మల్ని చదివిస్తాను. ఇంతకుముందు ఇతను వజ్రాల వ్యాపారము చేసేవారు.
ఇతనికి ఏ గురువు నేర్పించలేదు, అకస్మాత్తుగా తండ్రి ప్రవేశించారు. తండ్రి
చేసేవారు-చేయించేవారు కనుక ఇతని ద్వారా కర్తవ్యాన్ని చేయిస్తూ ఉంటారు. ఇతను కూడా
నేర్చుకుంటూ ఉంటారు. ఇతనితో పాటు మీరు కూడా నేర్చుకుంటూ ఉంటారు. (శివబాబా) మీకు
చెప్తారు, కానీ ముందు నేను (బ్రహ్మా) వింటాను. పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు
వస్తాను, కానీ ఇతని ఆత్మ కూడా చదువుకుంటూ ఉంటుంది. పిల్లలకు రాజయోగాన్ని
నేర్పించేందుకు వచ్చాను. ఈ విధముగా ఎప్పుడూ ఎవ్వరూ చదివించరు. ఇది పావనముగా అయ్యే
విషయము. ఈ సంగమయుగము పురుషోత్తములుగా అయ్యే యుగము. పురుషోత్తముడు శ్రీకృష్ణుడు.
స్వయంవరం తర్వాత వారి డిగ్రీ కొద్దిగా తగ్గిపోతుంది. అందుకే శ్రీకృష్ణునికి చాలా
మహిమ ఉంది. దాని పేరే శ్రీకృష్ణపురి. దీనిని కంసపురి అని అంటారు. ఇకపోతే
శ్రీకృష్ణుడు మరియు కంసుని గురించి కథ తయారుచేయబడింది.
పరిపక్వ అవస్థ
తయారైందంటే, భక్తి దానంతటదే వదిలిపోతుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. మీరు
ఎప్పుడూ ఎవరికీ భక్తి చేయవద్దని చెప్పకూడదు. వారికి జ్ఞానమివ్వాలి. తండ్రి మీకు
జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గము యొక్క రాకుమారునిగా తయారుచేయడానికి వచ్చారు. శ్రీకృష్ణుడు
కూడా స్వర్గానికి యజమానిగా ఉండేవారు కానీ ఇప్పుడు అలా లేరు. వారు కూడా మళ్ళీ
రాజయోగము ద్వారా ఆ విధముగా తయారవుతున్నారు. మీరు కూడా పురుషార్థము చేసి తండ్రిని
స్మృతి చేయాల్సి ఉంటుంది. స్వర్గ స్థాపన చేసేవారు హెవెన్లీ గాడ్ ఫాదర్. వారే వచ్చి
కొత్త సృష్టిని రచిస్తారు. కలియుగము పూర్తి అయినప్పుడు వారు కొత్త సృష్టిని
రచిస్తారు. వారు సత్య, త్రేతా యుగాలలోకి రారు. నేను కల్ప-కల్పము సంగమయుగములో
వస్తానని చెప్తారు. వారు కల్పము అన్న పదాన్ని తీసివేసి కేవలం యుగే-యుగే అని
వ్రాసేసారు. అలా అయినా సరే నాలుగు యుగాలు ఉన్నాయి, ఐదవది ఈ సంగమయుగము. అచ్ఛా,
అటువంటప్పుడు 5 అవతారాలని భావించండి. కానీ తాబేలు, చేప, పరశురామ... ఇలా ఇన్ని
అవతారాలుంటాయా! ఇవన్నీ శాస్త్రాల విషయాలు. ధర్మము పేరును మరియు భారత్ పేరును
మార్చేసారు. హిందు ధర్మము మరియు హిందుస్థాన్ అని అంటారు. భారత్ అన్న పేరును ఎందుకు
మార్చాలి! యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అని ఉంది కదా. ఇందులో కూడా భారత్
అన్న పదము వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు భక్తిని కేవలం ఒక జన్మ
మాత్రమే చేయలేదు, భక్తిని ద్వాపరము నుండి చేస్తూ వచ్చారు. భక్తి కూడా మొదట
అవ్యభిచారిగా ఉండేది, కేవలం శివుని భక్తి మాత్రమే చేసేవారు. ఆ శివబాబాయే ఇంతకుముందు
భారత్ ను స్వర్గముగా తయారుచేసారు మరియు మళ్ళీ ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా
తయారుచేయడానికి వచ్చారు. కావున పతిత శరీరములో కూర్చుని చెప్తున్నారు - నేను పతితులను
పావనముగా తయారుచేయడానికి పతిత శరీరములోకి, పతిత ప్రపంచములోకి వస్తాను. భక్తి
మార్గములో నా కోసం చాలా భారీ మందిరాలను నిర్మిస్తారు. ఇది ఎంత స్పష్టమైన విషయము.
వీరిలోకి బాబా ప్రవేశించగానే, గీత మొదలైనవి చదవడము విడిచిపెట్టేసారు. భక్తి దానంతటదే
వదిలిపోయింది. కష్టము లేకుండా వదిలేశారు. భక్తి చేయకండి అని మీకు ఎవరూ చెప్పలేదు.
ఇప్పుడు
పిల్లలైన మీకు బాబా అర్థం చేయిస్తున్నారు - నేను మిమ్మల్ని మళ్ళీ శ్రీకృష్ణపురికి
యజమానులుగా చేస్తాను. శ్రీకృష్ణునివి 8 వంశాలు కొనసాగుతాయి. ముందుగా సత్యయుగ
రాకుమారుడు అని అంటారు, ఆ తర్వాత సత్యయుగానికి మహారాజుగా అవుతారు. వారివి 8 తరాలు
కొనసాగుతాయి. ఆ సమయములో రెండవ రాజ్యమనేదేదీ ఉండదు. ఇప్పుడు బాబా అంటారు - పిల్లలైన
మీరు కూడా సత్యయుగ రాకుమారులుగా అవ్వండి. భక్తిలో ఏ సుఖము లేదు. జ్ఞానము ద్వారా మీరు
స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఎవరి తండ్రి అయినా మరణించినప్పుడు, మీ తండ్రి
ఎక్కడికి వెళ్ళారని అడిగితే స్వర్గస్థులయ్యారని అంటారు. ఆత్మ మరియు శరీరము, రెండు
వెళ్ళాయని భావిస్తారు. కానీ, శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు, ఇక వెళ్ళింది ఆత్మ
మాత్రమే. స్వర్గస్థులయ్యారని అంటే అంతకుముందు నరకములో ఉన్నారని అర్థము. ఆత్మ
శరీరాన్ని వదిలి స్వర్గములోకి వెళ్తే, ఇక అందులో ఏడ్వాల్సిన అవసరమేముంది? ఇప్పుడు
స్వర్గమేమైనా ఇక్కడ ఉందా? కానీ అర్థం చేసుకోరు. అంతా ఈశ్వరుని ఆజ్ఞ, సుఖము-దుఃఖము
అన్నీ ఈశ్వరుడే ఇస్తారు, అన్నీ ఈశ్వరుని రూపాలే అని అంటారు. కానీ తండ్రి అంటారు -
నేను పిల్లలకు దుఃఖమెలా ఇవ్వగలను. తండ్రి నుండి పిల్లలు ఎప్పుడైనా దుఃఖము
కోరుకుంటారా? తండ్రి అయితే పిల్లలను యోగ్యులుగా తయారుచేసి, ఆస్తిని ఇచ్చి వెళ్తారు.
ఇకపోతే, దుఃఖమనేది ప్రతి ఒక్కరికి తమ కర్మల అనుసారముగానే లభిస్తుంది. తండ్రి అంటారు
- ఇప్పుడు సంతానము కావాలని అడగకండి. ఇప్పుడు ఈ ఆస్తులు మొదలైనవన్నీ
సమాప్తమవ్వనున్నాయి. అప్పుడిక మీ పిల్లలకు ఏం లభిస్తుంది! పిల్లలు మీ ఆస్తికి
యజమానులుగా అవ్వగలిగేంత సమయమే లేదు. పిల్లలు పెద్దవారైతే కదా యజమానులుగా అవుతారు,
కానీ అంత సమయమే లేదు. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. మనుష్యులు అంటారు - కలియుగము
పూర్తవ్వడానికి ఇంకా 40 వేల సంవత్సరాలు ఉంది, ఈ బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు
వినాశనము-వినాశనము అని అంటూ ఉంటారు. ఒక కథ ఉంది కదా - పులి వచ్చింది, పులి వచ్చింది...
అని అంటారు, చివరికి అది వచ్చింది మరియు తినేసింది. మృత్యువు నెమ్మది-నెమ్మదిగా
వస్తుందని, ఇదంతా జరుగుతూనే ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ మీరు మహాకాలుడు వచ్చి
ఉన్నారని అంటారు. కాలుడికే కాలుడైన శివబాబా వచ్చి ఉన్నారు, వారు ఆత్మలందరినీ తిరిగి
తీసుకువెళ్తారు. కావున శరీరాన్ని అయితే తప్పకుండా వదలాల్సి ఉంటుంది, అందుకే బాబా
అంటారు - యోగముతో పవిత్రముగా అవ్వండి. వారు ఆత్మలను పవిత్రముగా తయారుచేసి తిరిగి
తీసుకువెళ్తారు. ఒకవేళ పవిత్రముగా అవ్వకపోతే, చివరిలో చాలా శిక్షలు అనుభవించాల్సి
ఉంటుంది మరియు ఉన్నత పదవిని కూడా పొందలేరు. శ్రీకృష్ణుడు నంబరువన్ పాస్ విత్ ఆనర్,
వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. 21 జన్మల కోసం రాజ్యము పొందుతారు. ఎంత సహజముగా అర్థం
చేయిస్తారు. బుద్ధిలో కూర్చుంటుంది కూడా కానీ మళ్ళీ మాయమైపోతుంది. ఎవరి చేత భక్తి
వదిలేలా చేయకూడదు. భక్తులకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. వారు అంటారు
- నేను కల్పక్రితం వలె మళ్ళీ అదే సాధారణ తనువులోకి వచ్చాను. కల్ప-కల్పము వచ్చి
మిమ్మల్ని చదివిస్తాను. ఇది ఉన్నతోన్నతమైన చదువు. మనం సతోప్రధానముగా ఉండేవారమని,
ఇప్పుడు తమోప్రధానముగా ఉన్నామని మీకు తెలుసు. తర్వాత, భారత్ యే సతోప్రధానముగా
తయారవుతుంది. ఇతర ధర్మాల వారు అంత సుఖాన్ని అనుభవించలేదు, అంత దుఃఖాన్ని కూడా
అనుభవించలేదు. విదేశీయుల వద్ద ధనమైతే చాలా ఉంది కనుక పేద దేశానికి అప్పు ఇస్తారు.
కానీ అది వారు రిటర్న్ ఇస్తున్నారని పాపం వారికి తెలియదు. పూర్తిగా ఘోర అంధకారములో,
కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. చివరిలో అయ్యో-అయ్యో అని అంటూ మేలుకుంటారు.
అప్పుడు మీరు - టూ లేట్ (చాలా ఆలస్యమైపోయింది) అని అంటారు ఎందుకంటే అప్పటికి యుద్ధము
మొదలైపోతుంది. అప్పుడిక ఏం చేస్తారు! అడవికి నిప్పు అంటుకుంటే ‘టూ లేట్’ అయిపోతుంది,
అందుకే తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు త్వరత్వరగా పురుషార్థము చేస్తూ వెళ్ళండి.
బాబా పెద్ద కష్టమేమీ ఇవ్వరు. బాబాకు వచ్చి చెప్తారు - బాబా, ఒకవేళ మేము పూజ చేయకపోతే,
మీరు నాస్తికులుగా అయిపోయారని వారంటారు. బాబా సలహా ఇస్తున్నారు - సాక్షీగా అయి బాబా
స్మృతిలో ఉండండి, బాహ్యముగా ఏదో కాస్త పూజ చేయండి. ఒకటేమో హృదయపూర్వకముగా చేయడము,
మరొకటి ఇతరులను తృప్తి పరిచేందుకు చేయడము. లోలోపల మీరు శివబాబాను స్మృతి చేయాలి.
ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే, మీరు పూజ చేసి చూపించండి, అప్పుడు వారు సంతోషపడతారు.
ఇలా చేయడం పాపమేమీ కాదు. బాబా అయితే చాలామందికి చెప్తూ ఉంటారు - వివాహాలు
మొదలైనవాటికి వెళ్ళండి, ఇరువైపులా యుక్తియుక్తముగా సంబంధాలను నిర్వర్తించాలి. అక్కడ
కూడా వినిపిస్తూ ఉంటే, ఎవరో ఒకరికి బాణము తగులుతుంది. యుక్తిగా నడుచుకోవాలి. తండ్రి
ఆజ్ఞాపిస్తున్నారు - ఇప్పుడు పతితముగా అవ్వకూడదు. పవిత్రముగా అయితేనే మీరు
శ్రీకృష్ణపురికి యజమానులుగా అవుతారు. శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు
వినాశనమవుతాయి మరియు విశ్వానికి యజమానులుగా అవుతారు. పిల్లలూ, ఇలాంటి యుక్తుల ద్వారా
మీ మిత్ర-సంబంధీకులకు అర్థం చేయించాలి. అది భౌతిక యాత్ర, ఇది ఆత్మిక యాత్ర. ఈ
ఆత్మిక యాత్రను తండ్రి నేర్పిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే పతితము నుండి
పావనముగా అవుతారని, దుఃఖాలన్నీ దూరమవుతాయని అంటారు. ఎవరో అరుదుగా మాత్రమే ఈ
వ్యాపారము చేస్తారు అనగా వైకుంఠ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. శ్రీమతముపై నడుస్తూ
ఉండండి. అలాగని, ధనము మొదలైనవాటిని వ్యర్థముగా, ఫలితము లేకుండా ఖర్చు పెట్టకూడదు.
ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళించాలి, పిల్లల పాలనను కూడా చేయాలి. కేవలం శ్రీమతముపై
నడవాలి. బాబా, ఈ పరిస్థితిలో మేము ఏం చేయాలి అని సలహా తీసుకోవాలి. బాబా, కూతురు
వివాహము చేసుకుంటానని అంటుంది, బాబా అంటారు - అప్పుడు వివాహము చేయించాల్సే ఉంటుంది
ఎందుకంటే అది ఆమె భాగము, ఆమెకు ఇచ్చేయండి. కానీ ఇంకేమైనా అడగాలంటే అడిగి శ్రీమతముపై
నడవండి అని తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు తండ్రి ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలి,
ఇందులోనే కళ్యాణముంది. అచ్ఛా!
మధురాతి
మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ప్రతి కర్మను సాక్షీగా అయి శివబాబా స్మృతిలో చేయాలి. లౌకికము, అలౌకికము రెండు
వైపులా యుక్తియుక్తముగా సంబంధాలను నిర్వర్తించాలి. లౌకికము వారితో యుక్తియుక్తముగా
నడుచుకోవాలి.
2. ఈ సమయములో ఈ అంతిమ జన్మలో కూడా ఇది వానప్రస్థ అవస్థ. తిరిగి ఇంటికి వెళ్ళాలి
కావున పావనముగా తప్పకుండా అవ్వాలి. ఎలాంటి బంధనాలు తయారుచేసుకోకూడదు.
వరదానము:-
ఆజ్ఞా పాలన ద్వారా సర్వ కోరికలను సమాప్తము చేసుకునే మాయా
ప్రూఫ్ భవ
అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు దినచర్య కోసం ఏ
ఆజ్ఞలైతే లభించాయో, వాటి అనుసారముగా తమ వృత్తిని, దృష్టిని, సంకల్పాలను, స్మృతిని,
సేవను మరియు సంబంధాలను చెక్ చేసుకోండి. ఎవరైతే ప్రతి సంకల్పములో, ప్రతి అడుగులో
ఆజ్ఞను పాటిస్తారో, వారి కోరికలన్నీ సమాప్తమైపోతాయి. ఒకవేళ మీ లోపల, పురుషార్థము
లేక సఫలత యొక్క కోరిక ఉన్నట్లయితే, తప్పకుండా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక ఆజ్ఞ యొక్క
పాలన జరగడము లేదు. కనుక ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే, నలువైపుల నుండి చెక్ చేసుకోండి
- దానితో మాయా ప్రూఫ్ గా స్వతహాగా అయిపోతారు.
స్లోగన్:-
తమ సూక్ష్మ
బలహీనతల గురించి చింతన చేసి వాటిని తొలగించుకోవడమే స్వచింతన.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
ఎలా అయితే ఏదైనా ఖాళీ
స్థానము ఉన్నట్లయితే ఆల్రౌండ్ సేవాధారులు సమయమనుసారముగా ఆ స్థానాన్ని నింపుతారు,
అలాగే ఒకవేళ ఎవరిలోనైనా ఏదైనా శక్తి లోపించినట్లు అనుభవమైతే, అప్పుడు కూడా మీ
సహయోగముతో ఆ ఖాళీని భర్తీ చేయండి, తద్వారా వారిలో లోపించిన శక్తి మరెవ్వరికీ
అనుభవమవ్వకూడదు. దీనినే దాత పిల్లలుగా అయి సమయమనుసారముగా వారికి సహయోగమనే కానుకను
ఇవ్వటము అని అంటారు.