07-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సాంగత్య దోషము చాలా నష్టపరుస్తుంది,
అందుకే సాంగత్య దోషము నుండి స్వయాన్ని చాలా-చాలా సంభాళించుకుంటూ ఉండండి, అది చాలా
చెడ్డది’’
ప్రశ్న:-
మూడు రకాల
బాల్యములు ఏమిటి? ఏ బాల్యాన్ని ఎప్పుడూ మర్చిపోకండి?
జవాబు:-
మొదటి బాల్యము
- లౌకిక తల్లిదండ్రుల వద్ద జన్మించగానే లభించింది. రెండవ బాల్యము - గురువుకు
శిష్యునిగా అయినప్పుడు లభించింది మరియు మూడవ బాల్యము - లౌకిక తల్లిదండ్రులను వదిలి
అలౌకిక తలిదండ్రులకు చెందినవారిగా అయినప్పుడు లభించింది. అలౌకిక బాల్యము అనగా
ఈశ్వరుని ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలుగా అవ్వడము. ఈశ్వరుని పిల్లలుగా అవ్వడము
అనగా మరజీవాగా అయినట్లు. ఈ అలౌకిక బాల్యాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. ఒకవేళ
మర్చిపోయారంటే చాలా ఏడవాల్సి ఉంటుంది. ఏడవడము అనగా మాయ దెబ్బ తినడము.
పాట:-
బాల్యపు
రోజులను మర్చిపోకండి...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట అర్థాన్ని అర్థం చేసుకున్నారు. బాల్యము మూడు
రకాలుగా ఉంటుంది. ఒకటి - లౌకిక బాల్యము, రెండవది - నివృత్తి మార్గానికి చెందిన
బాల్యము, వారు కూడా ఇళ్ళు-వాకిళ్ళను వదిలి, జీవిస్తూ మరణించి గురువుకు చెందినవారిగా
లేక సన్యాసికి చెందినవారిగా అవుతారు. ఆ గురువు వారికి తండ్రి కాదు, వారు గురువుకు
చెందినవారిగా అవుతారు, వారితో పాటు ఉంటారు. వారు కూడా జీవిస్తూ మరణించి గురువుకు
చెందినవారిగా అవుతారు, అడవులకు వెళ్ళిపోతారు. మూడవది - మీ ఈ అద్భుతమైన మరజీవా జన్మ.
ఒక తల్లిదండ్రులను వదిలి మరొక తల్లిదండ్రులకు చెందినవారిగా అవుతారు. వీరు ఆత్మిక
తల్లి-తండ్రి. ఇది మీ మరజీవా జన్మ. ఈశ్వరీయ ఒడిలో ఇది మీ ఆత్మిక జన్మ. మీతో ఇప్పుడు
ఆత్మిక తండ్రి మాట్లాడుతున్నారు. వారంతా శారీరక తండ్రులు. వీరు ఆత్మిక తండ్రి,
అందుకే ఈ తండ్రికి చెందినవారిగా, మరజీవాగా అయ్యి ఈ బాల్యాన్ని మర్చిపోకూడదు అని
పాడుతారు. శివబాబా ఉన్నతోన్నతమైన భగవంతుడు. ఎప్పుడైనా ఎవరైనా గీత మొదలైనవాటి గురించి
వాదించారంటే, మొట్టమొదట - ఉన్నతోన్నతమైన భగవంతుడు ఎవరు అని వారిని అడగండి. బ్రహ్మా
దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు, తర్వాత శివ పరమాత్మాయ నమః... అని అంటారు.
వారు సర్వ ధర్మాల వారికి తండ్రి. ఉన్నతోన్నతమైన తండ్రి వారొక్కరే అన్న విషయాన్ని
మొట్టమొదట అర్థం చేయించాలి. బ్రహ్మా-విష్ణువులను ఎవ్వరూ గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్
ఫాదర్ ఒక్కరే, వారు నిరాకారుడు, వారిని రచయిత అని కూడా అంటారు, పతిత-పావనుడు అని
కూడా అంటారు - ఇది ముందు పక్కా చేయించండి. తండ్రి నుండైతే తప్పకుండా వారసత్వము
లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి వారసత్వము ఎవరికి లభించింది అని ఆలోచించండి.
తండ్రి కొత్త ప్రపంచాన్ని రచించేవారు. వారి పేరు ‘శివ’. శివ పరమాత్మాయ నమః అని
అంటారు, వారి జయంతిని కూడా జరుపుకుంటారు. వారే పతిత-పావనుడు, రచయిత, నాలెడ్జ్ ఫుల్,
కనుక సర్వవ్యాపి అనే మాటే ఉండదు. వారి కర్తవ్యము అనుసారముగా వారి మహిమ ఉంటుంది.
గతంలో ఎవరైతే ఏవైనా కర్తవ్యాలను చేసి వెళ్ళారో, వారి మహిమ గానము చేయబడుతుంది.
ఉన్నతోన్నతమైనవారు తండ్రి. వారిని ముక్తిదాత అని కూడా అంటారు, వారిని దయా హృదయుడు,
దుఃఖహర్త-సుఖకర్త అని కూడా అంటారు, గైడ్ అని కూడా అంటారు. ఏదైనా కొత్త స్థానానికి
వెళ్ళినప్పుడు గైడ్ ను తమతో పాటు తీసుకువెళ్తారు. విదేశాల నుండి ఎవరైనా వస్తే వారికి
అంతా చూపించేందుకు ఇక్కడున్న గైడ్ ను నియమిస్తారు. తీర్థ యాత్రలకు తీసుకువెళ్ళే
పండాలు ఉంటారు. మరి తండ్రిని గైడ్ అని అంటున్నారంటే, వారు తప్పకుండా గైడ్ చేసి
ఉంటారు. సర్వవ్యాపి అని అన్న కారణముగా విషయమంతా సమాప్తమైపోతుంది. అందరి తండ్రి
ఒక్కరేనని, సర్వ శాస్త్రమయి శిరోమణి గీత, అది భగవంతుని ద్వారా గానము చేయబడినది అని
మొట్టమొదట అర్థం చేయించండి. దీనిని నిరూపించగలిగితే, దాని నుండి వెలువడిన ఇతర
శాస్త్రాలన్నీ అసత్యము అని నిరూపించబడుతుంది. మొట్టమొదట సత్యమైన గీతా సారాన్ని
వినిపించాలి. శివ భగవానువాచ. ఇప్పుడు శివబాబా యొక్క చరిత్ర (దివ్య కర్తవ్యాలు) ఏమిటి?
నేను ఈ శరీరాన్ని ఆధారముగా తీసుకుని, మీకు పతితము నుండి పావనముగా అయ్యే మార్గాన్ని
తెలియజేస్తానని మాత్రమే వారు అంటారు. నేను పిల్లలకు రాజయోగము నేర్పించేందుకు వస్తాను,
ఇందులో చరిత్రకు సంబంధించి ఏముంది. వీరైతే వృద్ధుడు. బాబా వచ్చి కేవలం పిల్లలను
చదివిస్తారు. పతితులను పావనముగా చేయడానికి రాజయోగాన్ని నేర్పిస్తారు. మీరు
సత్యయుగములోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. మీకు వారసత్వము లభిస్తుంది, మిగిలిన
ఆత్మలందరూ ముక్తిధామములో, నిరాకారీ ప్రపంచములో ఉంటారు. ఇది చాలా సహజమైన విషయము.
భారత్ లో దేవీ-దేవతల రాజ్యముండేది, ఒకే ధర్మముండేది. ఇప్పుడు కలియుగములో ఎంతమంది
మనుష్యులున్నారు, అక్కడ చాలా కొద్దిమంది ఉంటారు. పరమపిత పరమాత్మ ఏక ధర్మ స్థాపన,
అనేక ధర్మాల వినాశనము చేయించేందుకు వస్తారు. మిగిలినవారంతా శాంతిధామానికి
వెళ్ళిపోతారు. అక్కడ అపవిత్ర ఆత్మలెవ్వరూ ఉండరు. వారి పేరే పతిత-పావనుడు, సర్వుల
సద్గతిదాత. ఇది పాత ప్రపంచము, ఇనుప యుగము. సత్యయుగాన్ని బంగారు యుగమని అంటారు.
ఎవరైతే దేవతల పూజారులు ఉంటారో, వారు అన్నీ సహజముగా అర్థం చేసుకుంటారు. ఎవరైతే
పూజ్యులుగా ఉన్నారో, వారే పూజారులుగా అవుతారు. మొదట బాబా పరిచయాన్ని ఇవ్వాలి - మనము
వారి పిల్లలము, ఇది మర్చిపోకండి. మర్చిపోతే ఏడవాల్సి ఉంటుంది. ఎంతోకొంత మాయ దెబ్బలు
తగులుతాయి. దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మలమైన మనము తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలి.
ఇంతమంది మనుష్యులు మరణిస్తే, ఇక ఎవరు ఎవరి కోసం ఏడుస్తారు? భారత్ లో అందరికంటే
ఎక్కువగా ఏడుస్తారు. మొదటి 12 నెలలు అయ్యో భగవంతుడా, అయ్యో భగవంతుడా... అని అంటారు.
గుండెలు బాదుకుంటూ ఉంటారు. ఇవి మృత్యులోకము యొక్క ఆచార-వ్యవహారాలు, మీకు ఇప్పుడు
అమరలోకానికి సంబంధించిన ఆచార-వ్యవహారాలన్నీ నేర్పిస్తున్నారు. మీకు ఇప్పుడు మొత్తం
పాత ప్రపంచము పట్ల వైరాగ్యముంది.
తండ్రి అంటున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇవన్నీ సమాప్తమవ్వనున్నాయి.
ఇప్పుడు మనము తిరిగి వెళ్తున్నాము, నాటకము పూర్తి అవుతుంది. నాటకములో అందరూ
పాత్రధారులే, అటువంటప్పుడు మోహము ఎవరి పట్ల పెట్టుకుంటారు? వారు వెళ్ళి మరొక పాత్రను
అభినయించాల్సి ఉంటుందని భావిస్తారు. ఏడవాల్సిన అవసరమేముంది. ప్రతి ఒక్కరి పాత్ర
నిశ్చితమై ఉంది. తండ్రి ఎలాగైతే జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడో,
తండ్రిని ఫాలో చేసి ఆ విధముగా తయారవ్వాలి. సాగరము నుండి నదులు వెలువడతాయి. అందరూ
నంబరువారుగా ఉన్నారు. కొందరు బాగా వర్షిస్తారు, చాలామందిని తమ సమానముగా
తయారుచేస్తారు, అంధులకు చేతికర్రగా అవుతారు. తండ్రికైతే చాలామంది సహాయకులు కావాలి.
తండ్రి అంటారు - మీరు అంధులకు చేతికర్రగా అవ్వండి. అందరికీ మార్గాన్ని తెలియజేయండి.
కేవలం ఒక్క బ్రాహ్మణి మాత్రమే అంధులకు చేతికర్రగా అవ్వడము కాదు, మీరందరూ అలా
తయారవ్వాలి. మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది, దీనిని ‘మూడవ నేత్రము
లభించే కథ’ అని అంటారు. ఆత్మకు దివ్య నేత్రము ఉంది. మనుష్యులైతే ఏమీ అర్థం చేసుకోరు.
పూర్తిగా తుచ్ఛ బుద్ధి కలవారిగా అయిపోయారు. తమ ధర్మాన్ని ఎవరు స్థాపించారు అనేది
భారతవాసులకు తెలియదు. తండ్రి జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. శివజయంతిని కూడా
జరుపుకుంటారు. కావున వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు. తండ్రి గురించి మరియు రచన
గురించి ప్రపంచములోని వారెవ్వరికీ తెలియదు. ఋషులు-మునులు అందరూ మాకు తెలియదు, మాకు
తెలియదు అని అంటూ వచ్చారు. ఒకే ఒక పెద్ద పొరపాటును చేసారు, అదేమిటంటే, పరమాత్మను
సర్వవ్యాపి అని అనేశారు. వారు సర్వుల తండ్రి అని, పతిత-పావనుడు, ముక్తిదాత అని మీరు
ఋజువు చేసి చెప్పండి. వారు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్తారు.
అక్కడ దుఃఖమనే మాట ఉండదు. శాస్త్రాలలోనైతే ఏమేమో వ్రాసేశారు. లక్ష్మీ-నారాయణుల
గురించి కూడా - అక్కడ వారికి వికారాలు లేకుండా పిల్లలు జన్మిస్తారా అని అడుగుతారు.
అరే, వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అని అంటారు.
అది నిర్వికారీ ప్రపంచము, దీనిని వికారీ ప్రపంచమని అంటారు, మరి అక్కడ కూడా వికారాలు
ఉంటాయని ఎలా అంటారు. మొట్టమొదట తండ్రిని తెలుసుకోనంత వరకు ఏమీ అర్థం చేసుకోలేరు.
సర్వవ్యాపి అనడము చాలా పెద్ద పొరపాటు. తండ్రిని తెలుసుకున్నప్పుడే ఆ పొరపాటును
సరిదిద్దుకుంటారు. బాబా, మీ నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు మేము మళ్ళీ మీ
వారిగా అయ్యామని నిశ్చయము చేసుకోవాలి. శాస్త్రాలలోనైతే ఏమేమో వ్రాసేశారు.
లక్ష్మీ-నారాయణులను సత్యయుగములో చూపిస్తారు మరియు బాల్య రూపమైన రాధా-కృష్ణులను
ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు శ్రీకృష్ణుడైతే స్వర్గము యొక్క రాకుమారుడు.
తర్వాత శ్రీకృష్ణుని ముఖకవళికలు జన్మ-జన్మకు మారిపోతూ ఉంటాయి. ఒకేలాంటి ముఖకవళికలు
ఎప్పుడూ ఉండవు. శ్రీకృష్ణుడు మళ్ళీ అవే ముఖకవళికలతో ద్వాపరములోకి రాలేరు, అది
అసంభవము.
మీకు తెలుసు, మనము వాస్తవానికి అక్కడి (మూలవతన) నివాసులము, అది మన స్వీట్ సైలెన్స్
హోమ్, దాని కోసమే భక్తి చేస్తారు. మాకు శాంతి కావాలని అంటారు. ఆత్మకు పాత్రను
అభినయించేందుకు ఇంద్రియాలు లభించాయి, మరి శాంతిగా ఎలా ఉండగలదు. శాంతి కోసమనే హఠయోగము
నేర్చుకుంటారు, గుహలలోకి వెళ్తారు. ఒక నెల ఎవరైనా గుహలో కూర్చుంటే వారి కోసం అది
శాంతిధామము అయినట్లా? మీకు తెలుసు, ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్ళి, మళ్ళీ
పాత్రను అభినయించేందుకు సుఖధామములోకి వస్తాము. సుఖముగా ఉన్నవారి కోసం ఇది స్వర్గము,
దుఃఖితులుగా ఉన్నావారి కోసం ఇది నరకమని వారు అంటారు. స్వర్గమని కొత్త ప్రపంచాన్ని,
నరకమని పాత ప్రపంచాన్ని అంటారని మీకు తెలుసు. భగవానువాచ - ఈ భక్తి, యజ్ఞ-తపాదులు,
దాన-పుణ్యాలు మొదలైనవి చేయడము - ఇదంతా భక్తి మార్గము. ఇందులో ఏ సారము లేదు. సత్య,
త్రేతాయుగాలను బ్రహ్మా యొక్క పగలు అని అంటారు. బ్రహ్మా యొక్క పగలు అంటే
బ్రాహ్మణులైన మీ పగలు, తర్వాత మీ రాత్రి ప్రారంభమవుతుంది. మీరు మొట్టమొదట
సత్యయుగములోకి వెళ్తారు, తర్వాత మీరే చక్రములోకి వస్తారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ,
వైశ్య, శూద్రులుగా మీరే అవుతారు. మీరు శివ భగవానువాచ అని అంటారు, వారు శ్రీకృష్ణ
భగవానువాచ అని అంటారు. చాలా తేడా ఉంది. వారు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. వారితో
పాటు మొత్తం సూర్యవంశీ సాంప్రదాయము వారంతా పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ, ఇప్పుడు
మళ్ళీ అంతిమములో రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. పిల్లలైన మీలో ఎవరైతే అర్థం
చేసుకుంటారో, వారికే ఆనందము కలుగుతుంది. కొత్తవారికి ఆనందము కలగదు. మీరు ఎవ్వరినీ
నిందించరు. తండ్రి మీకు ఎంత సహజముగా అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ మీరు బాబా
సాంగత్యములో కూర్చుని ఉన్నారు కనుక బాగా అర్థం చేసుకుంటారు. బయటకు వెళ్తూనే
సాంగత్యము కారణముగా ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో తెలియదు. సాంగత్య దోషము చాలా
చెడ్డది. స్వర్గములో ఇలాంటి విషయాలుండవు, దాని పేరే స్వర్గము, వైకుంఠము, సుఖధామము.
అక్కడ కూడా అసురులు ఉండేవారని శాస్త్రాలలో వ్రాశారు. ఇప్పుడు మీకు తెలిసింది - మనము
విశ్వానికి యజమానులుగా ఉండేవారము, అక్కడ భూమి, ఆకాశము ఎందులోనూ విభజనలు ఉండవు.
ఇప్పుడు ఎన్ని విభజనలు ఉన్నాయి. తమ-తమ హద్దులను ఏర్పరచుకుంటూ ఉంటారు. ప్రపంచములో
ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. ఎవరైనా వచ్చినప్పుడు మొట్టమొదట - తండ్రి ఎవరు, భగవంతుడు
అని ఎవరిని అంటారో వారికి అర్థం చేయించండి. బ్రహ్మా, విష్ణు, శంకరులు దేవతలు.
భగవంతుడు ఒక్కరే ఉంటారు, 10 మంది ఉండరు. శ్రీకృష్ణుడు భగవంతుడు కాలేరు. భగవంతుడు ఎలా
హింసను నేర్పిస్తారు. భగవానువాచ - కామము మహాశత్రువు, దానిపై విజయము పొందేందుకు
ప్రతిజ్ఞ చేయండి. రాఖీ కట్టుకోండి. ఇది ఇప్పటి విషయమే. ఏదైతే గడిచిపోయిందో, అది
మళ్ళీ భక్తి మార్గములో జరుగుతుంది. దీపావళి రోజున మహాలక్ష్మిని పూజిస్తారు.
లక్ష్మీ-నారాయణులు ఇరువురూ కలిసి ఉన్నారని ఎవ్వరికీ తెలియదు. లక్ష్మికి ధనము ఎక్కడ
నుండి లభిస్తుంది? సంపాదన చేసేవారు పురుషులు కదా, కానీ లక్ష్మి యొక్క పేరు గాయనము
చేయబడింది. మొదట లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు. వారు మహాలక్ష్మిని వేరుగా భావిస్తారు.
మహాలక్ష్మికి 4 భుజాలు ఉన్నట్లుగా చూపిస్తారు. రెండు స్త్రీవి, రెండు పురుషునివి.
కానీ వారికి ఈ విషయాల గురించి తెలియదు. మీకు ఇప్పుడు వివరముగా తెలుసు.
బచ్ పన్ కే దిన్ భులా నా దేనా... (బాల్యపు రోజులను మర్చిపోకండి) అనే పాటను విన్నారు.
బాబా, నాకిప్పుడు గుర్తుకువచ్చింది అని ఆత్మ అంటుంది. ఉదయాన్నే లేచి తండ్రితో
మాట్లాడాలి. అమృతవేళ తండ్రిని స్మృతి చేయడము మంచిదే కదా. సంధ్యా సమయములో ఏకాంతములోకి
వెళ్ళి కూర్చోండి. పరస్పరములో పత్ని-పతి కలిసి ఉంటూ కూడా ఈ విషయాలను మాట్లాడుకుంటూ
ఉండండి. శివబాబా బ్రహ్మా తనువు ద్వారా ఏం చెప్తున్నారు. మనము పూజ్యులుగా ఉన్నప్పుడు
బాబాను స్మృతి చేసేవారము కాదు, పూజారులుగా అయినప్పుడు తండ్రిని స్మృతి చేస్తాము.
ఇటువంటి విషయాలను మాట్లాడుకుంటూ ఉండాలి, ఈ మాటలు ఎవరైనా విని ఆశ్చర్యపోవాలి.
అర్ధకల్పము మనము కామ చితిపై కూర్చుని కాలి భస్మమైపోయాము, శ్మశానగ్రస్థులుగా
అయిపోయాము. ఇప్పుడు మనము జ్ఞాన చితిపై కూర్చోవాలి, స్వర్గములోకి వెళ్ళాలి. ఇది పాత
ప్రపంచము. ఇది స్వర్గమని భారతవాసులు భావిస్తారు. అరే, స్వర్గము సత్యయుగములో ఉంటుంది.
స్వర్గములో దేవీ-దేవతల రాజ్యముండేది. ఇక్కడైతే మాయ ఆర్భాటము ఉంది. ఇప్పుడు బాబా
అంటారు, సాంగత్య దోషములోకి వచ్చి ఎక్కడా మరణించకండి, లేదంటే చాలా పశ్చాత్తాపపడతారు.
పరీక్ష ఫలితాలు వెలువడినప్పుడు అందరికీ తెలిసిపోతుంది. ఇంతకుముందు కుమార్తెలు
ధ్యానములోకి వెళ్ళి - వీరు రాణిగా అవుతారు, వీరు దాసిగా అవుతారు అని అంతా
వినిపించేవారు. తర్వాత బాబా దానిని ఆపు చేయించారు. చివరిలో - మేము తండ్రి సేవను ఎంత
చేసాము, ఎంతమందిని మా సమానముగా తయారుచేసాము అని అంతా తెలిసిపోతుంది. అవన్నీ
గుర్తుకువస్తాయి, సాక్షాత్కారాలు జరుగుతాయి. సాక్షాత్కారము చేయించకుండా ధర్మరాజు
కూడా శిక్షను విధించలేరు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని పిల్లలకు పదే-పదే అర్థం
చేయించారు. తండ్రి వచ్చి మధురాతి-మధురమైన వృక్షము యొక్క అంటు కడతారు. ఆ ప్రభుత్వము
వృక్షాలకు అంటు కడుతుంది, ఉత్సవాన్ని జరుపుతుంది. ఇక్కడ కొత్త ప్రపంచము యొక్క అంటు
కట్టడము జరుగుతుంది. ఇటువంటి తండ్రిని మర్చిపోకండి. తండ్రి సేవలో నిమగ్నమవ్వండి
లేదంటే చివరిలో చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. ఇప్పుడు వారసత్వము తీసుకోలేదంటే,
కల్ప-కల్పము కోసం ఇదే లెక్క తయారవుతుంది. అందుకే పురుషార్థము పూర్తిగా చేయాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎలాగైతే తండ్రి జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడో, అలా తండ్రి
సమానముగా తయారవ్వాలి మరియు తమ సమానముగా తయారుచేసే సేవను చేయాలి. అందరికీ జ్ఞానము
యొక్క మూడవ నేత్రాన్ని ఇవ్వాలి.
2. పశ్చాత్తాపపడవలసి వచ్చే విధముగా ఎలాంటి సాంగత్యము చేయకూడదు. సాంగత్య దోషము
చాలా చెడ్డది, అందుకే స్వయాన్ని సంభాళించుకోవాలి. తండ్రి నుండి వారసత్వము
తీసుకునేందుకు పూర్తి పురుషార్థము చేయాలి.
వరదానము:-
సంతుష్టత యొక్క విశేషత మరియు శ్రేష్ఠత ద్వారా సర్వులకు
ఇష్టులుగా అయ్యే వరదానీ మూర్త భవ
ఎవరైతే సదా స్వయముతో మరియు సర్వులతో సంతుష్టముగా ఉంటారో,
వారే అనేక ఆత్మలకు ఇష్టులుగా మరియు అష్ట దేవతలుగా అవ్వగలరు. అన్నింటికంటే పెద్ద
గుణమనండి, దానమనండి, లేదా విశేషత లేక శ్రేష్ఠత అనండి - అది సంతుష్టతయే. సంతుష్ట
ఆత్మయే ప్రభు ప్రియముగా, లోక ప్రియముగా మరియు స్వయం ప్రియముగా ఉంటుంది. ఇటువంటి
సంతుష్ట ఆత్మయే వరదానీ రూపములో ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు అంతిమ సమయములో మహాదాని
కన్నా ఎక్కువగా వరదాని రూపము ద్వారా సేవ జరుగుతుంది.
స్లోగన్:-
ఎవరి
మస్తకముపైనైతే సదా విజయ తిలకము ప్రకాశిస్తూ ఉంటుందో, వారే విజయీ రత్నాలు.
అవ్యక్త ప్రేరణలు -
బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
కొండలపైకి వెళ్ళి
కరిగిపోయి అంతర్థానమైపోయారు అని పాండవుల గురించి గాయనము ఉంది. కొండలపై కాదు, కానీ
ఉన్నత స్థితిలో కరిగిపోయి తమకు తాము కింద స్థితి నుండి పూర్తిగా పైన ఉన్న అవ్యక్త
స్థితిలో కరిగిపోయారు అనగా ఆ అవ్యక్త స్థితిలో సంపూర్ణతను ప్రాప్తి చేసుకున్నారు,
ఇది పాండవులైన మీ స్మృతిచిహ్నమే.