07-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 02.02.2008


‘‘సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీని మరియు పర్సనాలిటీని అనుభవం చేస్తూ, మీ మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న రాయల్టీ మరియు పర్సనాలిటీ గల తమ పరివారాన్ని చూస్తున్నారు. ఈ రాయల్టీ (హుందాతనము) మరియు ఆత్మిక పర్సనాలిటీకి (వ్యక్తిత్వము) పునాది సంపూర్ణ పవిత్రత. పవిత్రతకు గుర్తుగా అందరి మస్తకములో, అందరి శిరస్సుపై ప్రకాశ కిరీటము మెరుస్తూ ఉంది. ఈ విధముగా మెరుస్తున్న కిరీటము కలవారు, ఆత్మిక రాయల్టీ, ఆత్మిక పర్సనాలిటీ కలవారు కేవలం బ్రాహ్మణ పరివారానికి చెందిన మీరు మాత్రమే ఎందుకంటే మీరు పవిత్రతను అలవరచుకున్నారు. బ్రాహ్మణ అత్మలైన మీ పవిత్రత యొక్క ప్రభావము ఆదికాలము నుండి ప్రసిద్ధమైనది. మీ అనాది మరియు ఆదికాలము గుర్తుకువస్తుందా! గుర్తు తెచ్చుకోండి, అనాది కాలములో కూడా పవిత్ర ఆత్మలైన మీరు ఆత్మ రూపములో కూడా విశేషముగా మెరుస్తున్న సితారలు, మెరుస్తూ ఉంటారు. మిగతా ఆత్మలు కూడా ఉంటారు కానీ సితారలైన మీ మెరుపు అందరి మధ్యన ఉంటూ కూడా విశేషముగా మెరుస్తూ ఉంటుంది. ఏ విధముగా ఆకాశములో సితారలు ఎన్నో ఉంటాయి కానీ కొన్ని-కొన్ని సితారలు విశేషముగా మెరుస్తూ ఉంటాయి. అందరూ మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? ఆ తర్వాత ఆదికాలములో మీ పవిత్రత యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంది! అందరూ ఆదికాలములోకి చేరుకున్నారా? చేరుకోండి. చెక్ చేసుకోండి - నా మెరుస్తున్న రేఖ ఎంత శాతముతో ఉంది? ఆదికాలము నుండి అంతిమ కాలము వరకు మీ పవిత్రత యొక్క రాయల్టీ, పర్సనాలిటీ సదా ఉంటుంది. అనాది కాలములో మెరుస్తున్న సితార మెరుస్తున్న తండ్రితో పాటు నివసించేది. ఇప్పటికిప్పుడే మీ విశేషతను అనుభవము చేయండి. అందరూ అనాది కాలములోకి చేరుకున్నారా? ఆ తర్వాత పూర్తి కల్పములో పవిత్ర ఆత్మలైన మీ రాయల్టీ భిన్న-భిన్న రూపాలలో ఉంటుంది ఎందుకంటే ఆత్మలైన మీ వలె ఎవ్వరూ సంపూర్ణ పవిత్రముగా తయారవ్వలేదు. పవిత్రత యొక్క జన్మ సిద్ధ అధికారము విశేష ఆత్మలైన మీకు తండ్రి ద్వారా ప్రాప్తించింది. ఇప్పుడు ఆదికాలములోకి రండి. అనాది కాలమును కూడా చూసారు. ఆ తర్వాత ఆదికాలములో మీ పవిత్రత యొక్క రాయల్టీతో కూడిన స్వరూపము ఎంత గొప్పగా ఉంది! అందరూ సత్యయుగానికి చేరుకున్నారా? చేరుకున్నారా! వచ్చేసారా? దేవతా రూపము ఎంతటి ప్రియమైన స్వరూపము. దేవతల వంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ పూర్తి కల్పములో మరే ఇతర ఆత్మకు లేదు. దేవతా రూపము యొక్క మెరుపును అనుభవం చేస్తున్నారు కదా! ఇంతటి ఆత్మిక పర్సనాలిటీ - ఇదంతా పవిత్రత యొక్క ప్రాప్తి. ఇప్పుడు దేవతా రూపాన్ని అనుభవము చేస్తూ మధ్యకాలములోకి రండి. వచ్చేసారా? రావడము, అనుభవము చేయడము సహజమే కదా. మధ్యకాలములో కూడా చూడండి, మీ భక్తులు పూజ్య ఆత్మలైన మీ పూజలను చేస్తారు, చిత్రాలను తయారుచేస్తారు. ఎంతటి రాయల్టీతో కూడిన చిత్రాలను తయారుచేస్తారు మరియు ఎంత రాయల్టీతో పూజలు చేస్తారు. మీ పూజ్య చిత్రము ఎదురుగా వచ్చింది కదా! చిత్రాలైతే ధర్మాత్ములవి కూడా తయారుచేస్తారు. ధర్మ పితల చిత్రాలు కూడా తయారవుతాయి మరియు అభినేతల చిత్రాలు కూడా తయారవుతాయి, కానీ మీ చిత్రాలలోని ఆత్మికత మరియు విధిపూర్వక పూజలో తేడా ఉంటుంది. మరి మీ పూజ్య స్వరూపము ఎదురుగా వచ్చిందా! అచ్ఛా, ఇప్పుడు అంతిమ కాలమైన సంగమయుగములోకి రండి. ఈ ఆత్మిక డ్రిల్ చేస్తున్నారు కదా! తిరుగుతూ ఉండండి మరియు మీ పవిత్రతను, మీ విశేష ప్రాప్తులను అనుభవము చేయండి. అంతిమ కాలమైన సంగమములో బ్రాహ్మణ ఆత్మలైన మీకు పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ చదువు యొక్క భాగ్యము కోట్లలో కొద్దిమంది ఆత్మలైన మీకే లభిస్తుంది. పరమాత్ముని డైరెక్ట్ రచన, మొదటి రచన అయిన పవిత్ర ఆత్మలైన మీకే ప్రాప్తిస్తుంది. దాని ఆధారముగా బ్రాహ్మణులైన మీరే విశ్వాత్మలకు కూడా ముక్తి యొక్క వారసత్వాన్ని తండ్రి ద్వారా ఇప్పిస్తారు. మరి పూర్తి చక్రములో అనాది కాలము, ఆది కాలము, మధ్య కాలము మరియు అంతిమ కాలము - పూర్తి చక్రములో ఇంతటి శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారము పవిత్రత. పూర్తి చక్రములో తిరిగారు కదా, ఇప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోండి, స్వయాన్ని చూసుకోండి, చూసుకునేందుకు దర్పణము ఉంది కదా! స్వయాన్ని చూసుకునేందుకు దర్పణము ఉందా? ఎవరి వద్ద అయితే ఉందో వారు చేతులెత్తండి. దర్పణము ఉందా, దర్పణము స్పష్టముగా ఉందా? దర్పణములో చూసుకోండి - నా పవిత్రత యొక్క శాతము ఎంత ఉంది? పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యము మాత్రమే కాదు, కానీ బ్రహ్మాచారిగా అవ్వడము. మనసా, వాచా, కర్మణా, సంబంధ, సంపర్కాలలో అన్నింటిలోనూ పవిత్రత ఉందా? ఎంత శాతములో ఉంది? శాతాన్ని చూసుకోవడము వచ్చు కదా? టీచర్లకు వచ్చా? పాండవులకు వచ్చా? మంచి తెలివైనవారు. మాతలకు వచ్చా? వచ్చా మాతలకు? అచ్ఛా!

పవిత్రతకు పరిశీలన - వృత్తి, దృష్టి మరియు కృతి, ఈ మూడింటిలోనూ చెక్ చేసుకోండి. సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి ఏదైతే ఉంటుందో, అది బుద్ధిలోకి వచ్చేసింది కదా! ఆలోచించండి, సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన. అనుభవీలు కదా! మరియు దృష్టి ఎలా ఉంటుంది? ప్రతి ఆత్మను ఆత్మ రూపములో చూడటము, ఆత్మిక స్మృతితో మాట్లాడటము, నడవడము. క్లుప్తముగా వినిపిస్తున్నాము. వివరముగా అయితే మీరు భాషణ ఇవ్వగలరు. మరియు కృతి అనగా కర్మలో సుఖాన్ని తీసుకోవడము, సుఖాన్ని ఇవ్వడము. చెక్ చేసుకోండి - నా వృత్తి, దృష్టి, కృతి ఈ ప్రమాణములోనే ఉన్నాయా? సుఖాన్ని తీసుకోండి, దుఃఖాన్ని తీసుకోవద్దు. చెక్ చేసుకోండి - ఎప్పుడైనా దుఃఖాన్ని అయితే తీసుకోవటము లేదు కదా! అప్పుడప్పుడూ, కొంచెం-కొంచెం తీసుకుంటున్నారా? దుఃఖాన్ని ఇచ్చేవారు కూడా ఉంటారు కదా. ఒకవేళ వారు దుఃఖాన్ని ఇచ్చారనుకోండి, మీరు వారిని ఫాలో చేయాలా! ఫాలో చేయాలా, వద్దా? ఎవరిని ఫాలో చేయాలి? దుఃఖాన్ని ఇచ్చేవారినా లేక బాబానా? బాబా, అనగా బ్రహ్మా బాబా, నిరాకారుని విషయమైతే ఉండనే ఉంది, కానీ బ్రహ్మా బాబా ఏ బిడ్డ ఇచ్చిన దుఃఖాన్ని అయినా తీసుకున్నారా? సుఖాన్ని ఇచ్చారు మరియు సుఖాన్ని తీసుకున్నారు. ఫాలో ఫాదర్ చెయ్యాలా లేక అప్పుడప్పుడూ దుఃఖాన్ని తీసుకోవలసే వస్తుందా? దాని పేరే దుఃఖము, మరి దుఃఖమిచ్చినప్పుడు, అవమానించినప్పుడు, అది చెడ్డ విషయము అని మీకు తెలుసు. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు దానిని మంచిగా భావిస్తారా? చెడుగా భావిస్తారు కదా! మరి వారు మీకు దుఃఖాన్ని ఇచ్చినా, అవమానపరచినా, ఒకవేళ చెడు వస్తువును మీకు ఎవరైనా ఇస్తే మీరు దానిని తీసుకుంటారా? తీసుకుంటారా? కొద్ది సమయము కోసమే, ఎక్కువ సమయము కోసం కాదు, కానీ తీసుకుంటారా? చెడు వస్తువును తీసుకుంటారా? మరి దుఃఖాన్ని లేక అవమానాన్ని ఎందుకు తీసుకుంటారు? అనగా మనసులో ఫీలింగ్ రూపములో ఎందుకు పెట్టుకుంటారు? కావున స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను దుఃఖాన్ని తీసుకుంటున్నానా లేక దుఃఖాన్ని పరివర్తన రూపములో చూస్తున్నానా? ఏమనుకుంటున్నారు - దుఃఖాన్ని తీసుకోవడము రైటా? రైటా? మధుబన్ వారు చెప్పండి, రైటేనా? కొద్దికొద్దిగా తీసుకోవాలా? దుఃఖాన్ని తీసుకోవాలి కదా! తీసుకోకూడదు కానీ తీసుకుంటారు. పొరపాటున తీసుకుంటారు. ఒకవేళ దుఃఖము యొక్క ఫీలింగ్ కలిగితే, ఎవరు కలత చెందుతారు? మనసులో చెత్తను పెట్టుకుంటే ఎవరు కలత చెందుతారు? ఎక్కడైతే చెత్త ఉంటుందో అక్కడే కలత ఉంటుంది కదా! కావున ఆ సమయములో మీ రాయల్టీని మరియు పర్సనాలిటీని మీ ఎదురుగా తెచ్చుకోండి మరియు స్వయాన్ని ఏ రూపములో చూడాలి? మీ టైటిల్ ఏమిటో తెలుసా? మీ టైటిల్ - సహనశీలతా దేవి, సహనశీలతా దేవత. మరి మీరు ఎవరు? సహనశీలతా దేవీలు, సహనశీలతా దేవతలు. అవునా, కాదా? అప్పుడప్పుడూ అలా అవుతారా? మీ పొజిషన్ ను గుర్తు తెచ్చుకోండి, స్వమానాన్ని గుర్తు తెచ్చుకోండి. నేను ఎవరిని! ఇది స్మృతిలోకి తెచ్చుకోండి. పూర్తి కల్పములోని విశేష స్వరూపాలను స్మృతిలోకి తెచ్చుకోండి. స్మృతి అయితే వస్తుంది కదా!

బాప్ దాదా ఏమి చూసారంటే - ఎలా అయితే ‘నా’ అన్న పదాన్ని సహజముగా స్మృతిలోకి పరివర్తన చేసారో, అక్కడ నా అన్న విస్తారాన్ని ఇమిడ్చివేయడానికి ఏమని అంటారు? నా బాబా. నా, నా అన్నది ఎప్పుడు వచ్చినా కానీ దానిని నా బాబాలోకి ఇమిడ్చివేస్తారు. పదే-పదే నా బాబా అని అనడము ద్వారా స్మృతి కూడా సహజము అయిపోతుంది మరియు ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజంతటిలో కూడా ఒకవేళ ఏ విధమైన సమస్య లేక కారణము వచ్చినా కానీ, దానికి ఈ రెండు పదాలు విశేషమైన ఆధారము, అవేమిటంటే - నేను మరియు నాది. ఎలా అయితే బాబా అన్న పదము పలకగానే నా అన్న పదము పక్కా అయిపోయింది. పక్కా అయిపోయింది కదా? అందరూ ఇప్పుడు బాబా, బాబా అని అనరు. నా బాబా అని అంటారు. అలాగే ఈ ‘నేను’ అన్న పదమేదైతే ఉందో, దానిని కూడా పరివర్తన చేసేందుకు, నేను అన్న పదాన్ని ఎప్పుడు పలికినా అప్పుడు మీ స్వమానాల లిస్ట్ ను ఎదురుగా తెచ్చుకోండి. నేను ఎవరిని? ఎందుకంటే నేను అన్న పదము దిగజార్చేందుకు కూడా నిమిత్తమవుతుంది మరియు నేను అన్న పదము స్వమానాల స్మృతితో ఉన్నతిలోకి కూడా తీసుకువెళ్తుంది. కావున ఎలా అయితే నా బాబా అన్నది అభ్యాసమైపోయిందో అలాగే నేను అన్న పదము ఉపయోగించినప్పుడు దేహాభిమానపు స్మృతికి బదులుగా మీ శ్రేష్ఠ స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి. నేను శ్రేష్ఠ ఆత్మను, సింహాసనాధికారి ఆత్మను, విశ్వ కళ్యాణి ఆత్మను, ఇలా ఏదో ఒక స్వమానాన్ని ‘నేను’ అన్న పదానికి జోడించండి. అప్పుడు నేను అన్న పదము ఉన్నతికి సాధనము అవుతుంది. ఎలా అయితే నా అన్న పదము ఇప్పుడు మెజారిటీ బాబా అన్న పదాన్ని గుర్తు తెప్పిస్తుందో, అలాగే నేను అన్న పదము స్వమానాన్ని గుర్తు తెప్పించాలి ఎందుకంటే ఇప్పుడు సమయము ప్రకృతి ద్వారా తన ఛాలెంజ్ చేస్తుంది.

సమయము యొక్క సమీపతను సామాన్యమైన విషయముగా భావించకండి. అకస్మాత్తు మరియు ఎవర్రెడీ అన్న పదాలను మీ కర్మయోగీ జీవితములో అన్ని వేళలా స్మృతిలో ఉంచుకోండి. మీ శాంతి శక్తిని స్వయము పట్ల కూడా భిన్న-భిన్న రూపాలలో ప్రయోగించండి. ఏ విధముగా సైన్స్ తన కొత్త-కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఎంతగా స్వయము కోసం ప్రయోగించేందుకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, అంతగానే ఇతరుల కోసం కూడా శాంతి శక్తి ప్రయోగింపబడుతూ ఉంటుంది.

ఇప్పుడు విశేషముగా మీ శక్తుల సకాష్ ను నలువైపులా వ్యాపింపజేయండి. మీ ప్రకృతిలోని సూర్యుని శక్తి, సూర్యుని కిరణాలు తమ కార్యాన్ని ఎన్ని రూపాలలో చేస్తున్నాయి! నీటిని కురిపిస్తుంది కూడా మరియు నీటిని ఆవిరి చేస్తుంది కూడా. పగలు నుండి రాత్రిగా, రాత్రి నుండి పగలుగా చేసి చూపిస్తుంది. మరి మీరు మీ శక్తుల సకాష్ ను వాయుమండలములో వ్యాపింపజేయలేరా? ఆత్మలను మీ శక్తుల సకాష్ తో దుఃఖము, అశాంతి నుండి విడిపించలేరా! జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. కిరణాలను వ్యాపింపజేయండి, సకాష్ ను వ్యాపింపజేయండి. ఎలా అయితే స్థాపన యొక్క ఆదికాలములో బాప్ దాదా తరఫు నుండి అనేక ఆత్మలకు సుఖ-శాంతుల సకాష్ ఇంటిలో కూర్చునే లభించినట్లు అనుభవమైంది కదా. వెళ్ళండి అని సంకల్పము లభించింది. అలాగే ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్యులైన పిల్లలైన మీ ద్వారా సుఖ-శాంతుల అలను వ్యాపింపజేసే అనుభూతి కలగాలి. కానీ అది ఎప్పుడు అవుతుంది. దీనికి సాధనము మనసు యొక్క ఏకాగ్రత, స్మృతిలో ఏకాగ్రత. ఏకాగ్రతా శక్తిని స్వయములో పెంచుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఎప్పటివరకు కావాలంటే అప్పటివరకు మనసును ఏకాగ్రము చేయగలగాలి. ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి మరియు శక్తుల కిరణాలను, సకాష్ ను వ్యాపింపజేయండి.

బాప్ దాదా విన్నారు మరియు సంతోషిస్తున్నారు - పిల్లలు సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలతో అనేక ప్రదేశాలలో సేవను చాలా బాగా చేస్తున్నారు. బాప్ దాదా వద్దకు అన్ని వైపుల నుండి మంచి-మంచి సేవా సమాచారాలు చేరుకున్నాయి. ప్రదర్శనీల ద్వారానైనా, సమాచార పత్రాల ద్వారానైనా, టి.వీ ద్వారానైనా సందేశాన్ని ఇచ్చే కార్యాన్ని పెంచుతూ ఉన్నారు. సందేశము కూడా చేరుకుంటుంది. సందేశాన్ని మంచిగా అందిస్తున్నారు. మిగిలి ఉన్న గ్రామాలలో కూడా, ప్రతి ఒక్క జోన్ వారు మంచిగా తమ-తమ ఏరియాను పెంచుతున్నారు. వార్తాపత్రికల ద్వారా, టి.వీ.ల ద్వారా, భిన్న-భిన్న సాధనాల ద్వారా ఉల్లాస-ఉత్సాహాలతో చేస్తున్నారు. ఇలా చేస్తున్న పిల్లలందరికీ బాప్ దాదా ఎంతో స్నేహయుక్తమైన, దీవెనలు నిండిన అభినందనలను ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సందేశాన్ని ఇవ్వడములోనైతే మంచి ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి మరియు నలువైపులా బ్రహ్మాకుమారీస్ ఎవరు, వీరు చాలా మంచి శక్తిశాలి కార్యాన్ని చేస్తున్నారు అన్న శబ్దము కూడా మంచిగా వ్యాపిస్తుంది మరియు అది పెరుగుతూ ఉంది. కానీ... కానీ ఏమిటో వినిపించమంటారా? వినిపించమంటారా? కానీ... బ్రహ్మాకుమారీల బాబా ఎంత మంచివారు... అన్న ఈ సందేశము ఇప్పుడు పెరగాలి. బ్రహ్మాకుమారీలు మంచి కార్యము చేస్తున్నారు కానీ చేయించేవారు ఎవరు, ఇప్పుడు ఈ ప్రత్యక్షత జరగాలి. బాబా వచ్చారు, ఈ సమాచారము మనసు వరకు చేరుకోవాలి. దీని కోసం ప్లాన్ తయారుచెయ్యండి.

బాప్ దాదాను పిల్లలు ప్రశ్న అడిగారు - వారసులు లేక మైక్ లు అని ఎవరిని అనాలి అని? మైక్ లు వెలువడ్డారు కూడా, కానీ బాప్ దాదా ప్రస్తుత సమయానుసారముగా ఎటువంటి మైక్ లను ఆశిస్తున్నారంటే లేక ఎటువంటి మైక్ ల ఆవశ్యకత ఉంది అంటే, వారి మాటలో మహానత ఉండాలి. ఒకవేళ సాధారణమైనవారు బాబా అన్న మాట మాట్లాడినా, మంచిగా చేసినా, ఇంత వరకు తీసుకువచ్చినా, దానికి బాప్ దాదా అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎటువంటి మైక్ లు కావాలంటే, వారి మాటకు ప్రజలలో విలువ ఉండాలి. అంతటి ప్రసిద్ధులుగా ఉండాలి, ప్రసిద్ధులు అంటే ఉన్నత పదవి కలిగినవారు అన్ని అర్థము కాదు. కానీ వారి మాట విని, వీరు ఏదైతే చెప్తున్నారో, వీరి మాటలో విలువ ఉంది అని ప్రజలు భావించాలి. ఒకవేళ వారు అనుభవముతో చెప్తే దానికి విలువ ఉంటుంది. ఏ విధముగానైతే స్థూలమైన మైక్ లు చాలా ఉన్నా కానీ ఒక్కొక్క మైక్ కు ఒక్కొక్క పవర్ ఉంటుంది, అదే విధముగా ఎటువంటి మైక్ లను వెతకండంటే వారి మాటలో శక్తి ఉండాలి. వారి మాట విని అర్థం చేసుకోవాలి - వీరు అనుభవము చేసి వచ్చారు కావున తప్పకుండా ఏదో విషయము ఉండే ఉంటుంది అని. అయినప్పటికీ వర్తమాన సమయములో ప్రతి జోన్ నుండి, ప్రతి వర్గము నుండి మైక్ లు తప్పకుండా వెలువడ్డారు. సేవ యొక్క ప్రత్యక్ష ఫలము రాలేదు అని బాప్ దాదా అనడము లేదు, మైక్ లు వెలువడ్డారు. కానీ ఇప్పుడు సమయము తక్కువగా ఉంది మరియు సేవ పట్ల మహత్వము ఉన్న ఆత్మలను ఇప్పుడు నిమిత్తము చేయవలసి ఉంది, వారి మాటకు విలువ ఉండాలి. పదవి లేకపోయినా పర్వాలేదు కానీ వారి ప్రాక్టికల్ జీవితము మరియు ప్రాక్టికల్ అనుభవము యొక్క అథారిటీ ఉండాలి. వారి మాటలో అనుభవము యొక్క అథారిటీ ఉండాలి. అర్థమయ్యిందా ఎటువంటి మైక్ కావాలో? వారసులు గురించైతే మీకు ఎలాగూ తెలుసు. వారి ప్రతి శ్వాసలో, ప్రతి అడుగులో తండ్రి మరియు కర్తవ్యము, మరియు దానితో పాటు మనసా, వాచా, కర్మణా, తనువు, మనసు, ధనము, అన్నింటిలోనూ బాబా మరియు యజ్ఞము ఇమిడి ఉండాలి, అనంతమైన సేవ ఇమిడి ఉండాలి. సకాష్ ను ఇచ్చే సమర్థులుగా ఉండాలి. అచ్ఛా!

ఇప్పుడు ఒక్క సెకండ్ లో, ఒక్క సెకండ్ అయిపోయింది, ఒక్క సెకండ్ లో పూర్తి సభ ఎవరు ఎక్కడ ఉన్నా కానీ మనసును ఒకే సంకల్పములో స్థిరము చేయండి - బాబా మరియు నేను, నేను పరంధామములో అనాది జ్యోతిర్బిందు స్వరూపాన్ని, పరంధామములో బాబాతో పాటు కూర్చుండిపోండి. అచ్ఛా. ఇప్పుడు సాకారములోకి రండి.

ఇప్పుడు వర్తమాన సమయమనుసారముగా మనసును-బుద్ధిని ఏకాగ్రము చేసే అభ్యాసము చెయ్యండి. ఏ కార్యము చేస్తున్నారో ఆ కార్యములోనే ఏకాగ్రము చెయ్యండి, కంట్రోలింగ్ పవర్ ను ఎక్కువగా పెంచుకోండి. మనసు, బుద్ధి, సంస్కారాలు, మూడింటిపైనా కంట్రోలింగ్ పవర్. ఈ అభ్యాసము రాబోయే సమయములో చాలా సహయోగాన్ని ఇస్తుంది. వాయుమండలము అనుసారముగా ఒక్క సెకండ్ లో కంట్రోల్ చేయవలసి ఉంటుంది. ఏది కోరుకుంటారో అదే జరగాలి. కావున ఈ అభ్యాసము చాలా అవసరము. దీనిని తేలికగా తీసుకోకండి ఎందుకంటే సమయానికి ఇదే అంతిమమును సుందరముగా చేస్తుంది. అచ్ఛా!

నలువైపులా ఉన్న డబుల్ సింహాసనాధికారులకు, బాప్ దాదా హృదయ సింహాసనాధికారులకు, దానితో పాటు విశ్వ రాజ్య సింహాసనాధికారులకు, సదా తమ అనాది స్వరూపము, ఆది స్వరూపము, మధ్య స్వరూపము, అంతిమ స్వరూపములో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితులయ్యేవారికి, సదా సర్వ ఖజానాలను స్వయము కార్యములో వినియోగించేవారికి మరియు ఇతరులను కూడా ఖజానాలతో సంపన్నము చేసేవారికి, సర్వాత్మలకు బాబా నుండి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేవారికి, పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఇటువంటి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, హృదయపూర్వక దీవెనలు మరియు నమస్తే.

వరదానము:-
సహచరుడు మరియు సాక్షీ స్థితి యొక్క అనుభవము ద్వారా సదా సఫలతామూర్త భవ

ఏ పిల్లలైతే సదా బాబాతో పాటు ఉంటారో వారు సాక్షీగా స్వతహాగా అయిపోతారు ఎందుకంటే బాబా స్వయము సాక్షీగా అయి పాత్రను అభినయిస్తారు, కావున బాబాతో పాటు ఉండేవారు కూడా సాక్షీగా అయి పాత్రను అభినయిస్తారు మరియు ఎవరికైతే స్వయము సర్వశక్తివంతుడైన తండ్రి సహచరుడిగా ఉన్నారో, వారు సఫలతామూర్తులుగా కూడా స్వతహాగానే అయిపోతారు. భక్తి మార్గములోనైతే పిలుస్తూ ఉంటారు - కొద్ది సమయము కోసం తోడును అనుభవం చేయించండి, కాస్త దర్శనము ఇవ్వండి అని. కానీ మీరు సర్వ సంబంధాలతోనూ సహచరులుగా అయిపోయారు కావున ఇదే సంతోషము మరియు నషాలో ఉండండి - పొందాల్సినదేదో పొందేసాము.

స్లోగన్:-
వ్యర్థ సంకల్పాలకు గుర్తు - మనసు ఉదాసీనముగా ఉండడము మరియు సంతోషము మాయమైపోవడము.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

బహుకాలము అచలమైన, స్థిరమైన, నిర్విఘ్న, నిర్బంధన, నిర్వికల్ప, నిర్వికర్మ అనగా నిరాకారీ, నిర్వికారీ మరియు నిరహంకారీ స్థితిలో ఉండండి, అప్పుడు కర్మాతీతులుగా అవ్వగలరు. సేవ విస్తారాన్ని ఎంతైనా పెంచండి కానీ విస్తారములోకి వెళ్తూ సార స్థితి యొక్క అభ్యాసము తగ్గకూడదు, విస్తారములో సారాన్ని మర్చిపోకూడదు. తినండి, త్రాగండి, సేవ చెయ్యండి కానీ అతీతత్వమును మర్చిపోకండి.