08-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ సభలో బాహ్యముఖులుగా అయి కూర్చోకూడదు,
తండ్రి స్మృతిలో ఉండాలి, మిత్ర-సంబంధీకులు, వ్యాపారాలు మొదలైనవి గుర్తు చేసినట్లయితే
వాయుమండలములో విఘ్నాలు ఏర్పడతాయి’’
ప్రశ్న:-
పిల్లలైన మీరు
చేసే ఆత్మిక డ్రిల్ యొక్క విశేషత ఏమిటి, దానిని మనుష్యులు చేయలేరు?
జవాబు:-
మీ ఆత్మిక
డ్రిల్ బుద్ధికి సంబంధించినది. దాని విశేషత ఏమిటంటే - మీరు ప్రేయసులుగా అయి మీ
ప్రియుడిని స్మృతి చేస్తారు. దీని గురించే గీతలో కూడా ‘మన్మనాభవ’ అని సూచించడము
జరిగింది. కానీ మనుష్యులకు తమ ప్రియుడైన పరమాత్మ గురించి తెలియనే తెలియనప్పుడు ఇక
డ్రిల్ ఎలా చేయగలరు. వారు ఒకరికొకరు దైహిక డ్రిల్ ను నేర్పిస్తారు.
ఓంశాంతి
పిల్లలు (యోగము చేయించేవారు) ఇక్కడ ఏమి చేస్తున్నారు అనేది పిల్లలకు కూడా
అర్థమవుతుంది, తండ్రికి కూడా అర్థమవుతుంది. స్మృతియాత్ర యొక్క డ్రిల్ ను
చేయిస్తున్నారు. నోటితో చెప్పేది ఏమీ లేదు. ఎవరి స్మృతి ఉంది? పరమపిత పరమాత్మ అయిన
శివబాబా స్మృతి ఉంది. వారి స్మృతిలో ఉండటముతో మన వికర్మలు ఏవైతే ఉన్నాయో, అవి
భస్మమైపోతాయి మరియు ఎవరెంతగా స్మృతి యొక్క డ్రిల్ చేస్తారో, అంతగా వికర్మాజీతులుగా
అవుతారు. ఇది ఆత్మ యొక్క డ్రిల్, శరీరానికి సంబంధించింది కాదు. భారత్ లో ఏవేవైతే
డ్రిల్లులు నేర్పిస్తారో, అవన్నీ దైహికమైనవి, ఇది ఆత్మిక డ్రిల్. ఈ ఆత్మిక డ్రిల్
గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియనే తెలియదు.
ఆత్మిక డ్రిల్ కు సంబంధించిన సూచన గీతలో తప్పకుండా ఉంది. భగవానువాచ మరియు భగవంతుని
పిల్లల యొక్క వాచా కూడా. మీరు ఇప్పుడు భగవంతుడైన శివబాబాకు పిల్లలుగా అయ్యారు కదా.
నన్నొక్కరినే స్మృతి చేయండి అని పిల్లలకు ఆజ్ఞ లభించింది. తండ్రి కూడా డ్రిల్
నేర్పిస్తారు. పిల్లలు కూడా ఇదే డ్రిల్ నేర్పిస్తారు. కల్పక్రితం కూడా తండ్రి ఇదే
చెప్పారు, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇది పదే-పదే చెప్పాల్సిన అవసరము లేదు,
కానీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చుని ఎవరైనా తమ మిత్ర-సంబంధీకులను, వ్యాపారాలు
మొదలైనవాటిని గుర్తు చేస్తూ ఉన్నట్లయితే వాయుమండలములో విఘ్నాలను కలిగిస్తారు. తండ్రి
అంటారు - ఎలాగైతే ఇక్కడ మీరు స్మృతిలో కూర్చుని ఉన్నారో, అలానే నడుస్తూ-తిరుగుతూ,
కర్మలు చేస్తూ స్మృతిలో ఉండాలి. ఉదాహరణకు ప్రేయసి-ప్రియుడు ఒకరినొకరు గుర్తు
చేసుకుంటారు, వారి స్మృతి దేహానికి సంబంధించినది. మీది ఆత్మిక స్మృతి. ఆత్మలు భక్తి
మార్గములో కూడా ప్రియుడైన పరమపిత పరమాత్మకు ప్రేయసులుగా ఉంటారు. కానీ ప్రియుని కోసమూ
తెలియదు, తమ ఆత్మ గురించి కూడా తెలియదు. ప్రియుడైన తండ్రి వచ్చి ఉన్నారు. భక్తి
మార్గము నుండి మొదలుకుని ఆత్మలు ప్రేయసులుగా అయ్యారు. ఇది ఆత్మలు మరియు పరమాత్మకు
సంబంధించిన విషయము. తండ్రి పిల్లలకు సమ్ముఖముగా చెప్తున్నారు - ప్రేయసులైన మీరు
ప్రియుడినైన నన్ను - బాబా రండి, మీరు వచ్చి మమ్మల్ని దుఃఖము నుండి విడిపించి
మీతోపాటు శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు. ఇప్పుడు ఈ దుఃఖధామము,
మృత్యులోకము యొక్క వినాశనము జరగనున్నదని మీకు తెలుసు. అమరలోకము జిందాబాద్,
మృత్యులోకము ముర్దాబాద్. మీరు ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలుగా అయ్యారు, మీలో కూడా
నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారు. మనము ఇప్పుడు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా
21 జన్మల కోసం అవుతామని పిల్లలైన మీకు పూర్తి నిశ్చయముండాలి. ఎవరైనా మరణిస్తే
స్వర్గవాసులయ్యారని అంటారు, కానీ ఎంత సమయము కోసం స్వర్గవాసులుగా అయ్యారు... అనేది
ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు.
ఈ నిశ్చయము కలిగించేది ఎవరు! వారు గీతా భగవానుడు. కానీ వారు ఆ నిరాకారుడు ఒక్కరే.
నిరాకారుడు నిరాకారుడే కదా, వారు ఇక్కడికి ఎలా వచ్చి నేర్పిస్తారని మనుష్యులు
అనుకుంటారు. తండ్రి గురించి తెలియని కారణముగా, డ్రామానుసారముగా, శ్రీకృష్ణుని పేరును
పొరపాటుగా వేసేసారు. ఈ సమయములో శ్రీకృష్ణుడికి మరియు శివునికి మధ్యన సంబంధము దగ్గరగా
ఉంది. శివజయంతి సంగమములో జరుగుతుంది. తర్వాత, రేపు శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది.
శివజయంతి రాత్రి సమయములో, శ్రీకృష్ణ జయంతి ఉదయాన్నే జరుగుతుంది, దానిని ప్రభాత
సమయమని అంటారు. శివరాత్రి పూర్తి అయిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది. ఈ
విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇక్కడ సభలో ఎవరూ బాహ్యముఖులుగా ఉండకూడదు,
తండ్రి స్మృతిలో ఉండాలి అనే నియమము ఉంది. ఓ పతిత-పావనా రండి, వచ్చి పావనముగా చేయండి
అని మనుష్యులు పిలుస్తారు కూడా. కానీ డ్రామానుసారముగా రాతిబుద్ధి కలవారు ఏమీ అర్థం
చేసుకోరు. ఒకవేళ అర్థమైతే ఇతరులకు చెప్పేవారు. ఇప్పుడిది కలియుగ అంతిమమని, మళ్ళీ
ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు ఆది ప్రారంభమవుతుందని కూడా వారికి తెలియదు.
మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. కలియుగము పూర్తవ్వడానికి ఇంకా 40 వేల
సంవత్సరాలు ఉందని మనుష్యులు భావిస్తారు. హద్దు తండ్రి ఎప్పుడూ పతిత-పావనుడిగా
అవ్వలేరని అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాపూ అనే పేరునైతే చాలామందికి
పెట్టేసారు. వృద్ధులను కూడా బాపూ లేదా పితాజీ అని అంటారు. ఈ ఆత్మిక పితాశ్రీ ఒక్కరే,
వీరే పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు. పిల్లలకు పావనముగా అయ్యేందుకు జ్ఞానము కావాలి.
నీటిలో స్నానము చేయడముతో ఎవరూ పావనముగా అవ్వరు. శివబాబా ఈ తనువులో మన ముందు
ప్రత్యక్షముగా ఉన్నారని మీకు తెలుసు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులకు రాజయోగాన్ని
నేర్పిస్తున్నారు. వారు అర్జునుడి పట్ల భగవానువాచ అని అంటారు, బ్రాహ్మణుల నామ-రూపాలు
లేవు. బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన అని అంటూ ఉంటారు. స్థాపన అయితే
బ్రహ్మా ద్వారానే చేస్తారు, అంతేకానీ విష్ణువు ద్వారానో లేక శంకరుని ద్వారానో కాదు.
పిల్లలైన మీకు ఈ వివరణ ఇప్పుడు లభించింది. తండ్రి ఇక్కడికి రావాల్సి వస్తుంది, ఏ
ఆత్మ కూడా తిరిగి వెళ్ళలేదు. ఎవరు వచ్చినా సరే, వారు సతో, రజో, తమోలను తప్పకుండా
దాటాల్సిందే. శ్రీకృష్ణుడు కూడా పూర్తి 84 జన్మలను తీసుకుంటారు మరియు పూర్తి 5 వేల
సంవత్సరాలు పాత్రను అభినయించారు. ఆత్మ గర్భములో ఉన్నప్పుడు కూడా జన్మలో ఉన్నట్లే కదా.
శ్రీకృష్ణుని ఆత్మ సత్యయుగములోకి వచ్చినప్పుడు, గర్భములోకి ప్రవేశించినప్పటి నుండి
మొదలుకుని 5 వేల సంవత్సరాలలో 84 జన్మల పాత్రను అభినయించాలి. ఉదాహరణకు, శివజయంతిని
జరుపుకుంటున్నారంటే, వారు ఇతనిలో కూర్చుని ఉన్నారు కదా. శ్రీకృష్ణుని ఆత్మ కూడా
గర్భములోకి వచ్చినప్పుడు కదలికలు జరుగుతాయి, ఆ సమయము నుండి మొదలుకుని 5 వేల
సంవత్సరాల లెక్క ప్రారంభమవుతుంది. ఒకవేళ అటు ఇటు అయితే, 5 వేల సంవత్సరాల లెక్కలో
తగ్గిపోతుంది. ఇవి చాలా సూక్ష్మముగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శ్రీకృష్ణుని
ఆత్మ మళ్ళీ శ్రీకృష్ణునిగా తయారయ్యేందుకు మళ్ళీ ఈ జ్ఞానము తీసుకుంటుందని పిల్లలకు
తెలుసు. మీరు కూడా కంసపురి నుండి కృష్ణపురిలోకి వెళ్తారు. ఈ విషయాలు తండ్రి కూర్చుని
పిల్లలకు అర్థం చేయిస్తారు.
బాబా అంటారు - మాయ చాలా శక్తివంతమైనది, మంచి-మంచి మహారథులను కూడా ఓడించేస్తుంది.
జ్ఞానాన్ని తీసుకుంటూ-తీసుకుంటూ ఎక్కడో అక్కడ గ్రహచారము కూర్చుంటుంది. ఆశ్చర్యము
కలిగించేలా నా వారిగా అవుతారు, ఇతరులకు వినిపిస్తారు... అహో మాయ, మళ్ళీ పారిపోతారు.
సంపాదనలో గ్రహచారము కూర్చుంటుంది. రాహు గ్రహణము అందరికీ పట్టి ఉంది. ఇప్పుడు మీపై
బృహస్పతి దశ కూర్చుంది, తర్వాత నడుస్తూ-నడుస్తూ కొందరిపై రాహు గ్రహణము కూర్చుంటుంది,
అందుకే అంటారు - ఈ ప్రపంచములో మహాన్ దురదృష్టవంతులను చూడాలంటే ఇక్కడే చూడండి అని.
మీ ఆత్మ అంటుంది - మేము తండ్రి నుండి సదా సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము,
బాబా, మీ నుండి కల్పక్రితం కూడా ఈ వారసత్వాన్ని తీసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు తండ్రి
వద్దకు వచ్చాము. తండ్రి అర్థం చేయించారు - అక్కడ మీ సెంటర్లకు చాలామంది అర్థం
చేసుకునేందుకు వస్తారు, ఇక్కడ ఇది ఇంద్ర సభ. ఇంద్రుడు శివబాబా కదా, వారే జ్ఞాన
వర్షాన్ని కురిపిస్తారు. కావున ఇలాంటి సభలోకి పతితులు ఎవరూ రాలేరు. సబ్జపరి, పుఖరాజ్
పరి వలె బ్రాహ్మణీలు ఎవరైతే పండాలుగా అయి వస్తారో, వారు వికారాల్లోకి
వెళ్ళేవారెవరినీ తమతో పాటు తీసుకురాకూడదని వారికి చెప్పడము జరుగుతుంది. లేదంటే
ఇద్దరూ బాధ్యులు అవుతారు. వికారులు ఎవరినైనా తమతో పాటు తీసుకువస్తే, ఆ బ్రాహ్మణీపై
చాలా పెద్ద మచ్చ పడుతుంది. అప్పుడు, చాలా భారీ శిక్ష లభిస్తుంది. దేవకన్యలపై చాలా
బాధ్యత ఉంది. మానస సరోవరములో స్నానము చేస్తే దేవకన్యలుగా అవుతారని అంటారు.
వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరము. బాబా మనుష్య తనువులోకి వచ్చి జ్ఞాన వర్షాన్ని
కురిపిస్తారు. వారు జ్ఞాన సాగరుడు కదా. మీరు నది కూడా, సరోవరము కూడా. జ్ఞాన సాగరుడు
వీరిలో కూర్చుని పిల్లలను స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తారు.
స్వర్గములో శ్రీలక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంది. ఇది ప్రవృత్తి మార్గము యొక్క
లక్ష్యము-ఉద్దేశ్యము. మేము ఇరువురము జ్ఞాన చితిపై కూర్చుని లక్ష్మీ-నారాయణులుగా
అవుతామని అంటారు. ఉన్నత పదవిని పొందాలి కదా. అర్ధకల్పము ఆత్మలు తపిస్తూ ఉంటారు. బాబా
రండి, మీరు వచ్చి మాకు రాజయోగాన్ని నేర్పించి పావనముగా చేయండి అని అంటారు. తండ్రి
సూచనను ఇస్తారు. దేవీ-దేవతలను నమ్మే భారతవాసులు తప్పకుండా 84 జన్మలను అనుభవించారు.
తండ్రి వచ్చి 3 ధర్మాలను ఎలా స్థాపన చేస్తారు అనేది దేవీ-దేవతల భక్తులకు ప్రయత్నించి
అర్థం చేయించండి. బ్రాహ్మణ, సూర్య వంశము, చంద్ర వంశము, 3 ధర్మాలను తండ్రి స్థాపన
చేస్తారు. అర్ధకల్పము ఇక ఏ ధర్మ స్థాపన జరగదు. ఆ తర్వాత, మిగతా అర్ధకల్పములో ఎన్ని
మఠాలు, మార్గాలు మొదలైన అనేక ధర్మాలు స్థాపనవుతాయి. అర్ధకల్పము ఒకే ధర్మముంటుంది,
అది కూడా సంగమయుగములో భవిష్యత్తు కోసం రాజధానిని స్థాపన చేస్తారు. వారందరూ పాత
ప్రపంచములోనే తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఇక్కడ తండ్రి అర్ధకల్పము కోసం ఏక ధర్మ
స్థాపనను చేస్తారు. ఇంకెవరిలోనూ శక్తి లేదు. తండ్రి మిమ్మల్ని తమవారిగా చేసుకుని
సూర్య, చంద్ర వంశాలను స్థాపన చేసి, మిగిలిన ధర్మాలన్నింటినీ వినాశనము చేయిస్తారు.
ఆత్మలందరూ శాంతిలోకి వెళ్ళిపోతారు. మీరు సుఖములోకి వస్తారు, ఆ సమయములో భగవంతుడిని
స్మృతి చేయడానికి ఏ దుఃఖము లేదు. ఈ జ్ఞానము కూడా మీ బుద్ధిలో ఉంది. జ్ఞాన సాగరుడైన
తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. సాగరుడైతే ఒక్కరే. మీరు స్వయాన్ని
సాగరమని చెప్పుకోలేరు. మీరు వారికి సహాయకులుగా అవుతారు, అందుకే మీకు జ్ఞాన గంగలు అనే
పేరు ఉంది. ఇకపోతే, అవి నీటి నదులు. తండ్రి అంటారు - సాగరుడినైన నా పిల్లలైన మీరు
కామ చితిపై కూర్చుని కాలి మరణించారు అనగా పతితులుగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ నన్ను
స్మృతి చేసినట్లయితేనే మీరు పావనముగా అవుతారు. ఈ సృష్టి చక్రము 5 వేల సంవత్సరాలది.
ఇది కూడా ఎవరికీ తెలియదు. సృష్టి చక్రము పూర్తిగా 4 భాగాలుగా ఉంది. 4 యుగాలు ఉన్నాయి
కదా. ఈ సంగమయుగము కళ్యాణకారి యుగము. కుంభ్ (సంగమము) అని అంటారు కదా. కుంభ్ అని
మేళాను అంటారు. నది వచ్చి సాగరములో కలుస్తుంది. ఆత్మ వచ్చి పరమాత్మను కలుస్తుంది,
దీనినే సంగమము అని అంటారు. ఆత్మ మరియు పరమాత్మల మేళాను కూడా మీరు చూస్తారు. మీరూ
పరస్పరములో కలుసుకుంటారు, సెమినార్లు చేసుకుంటారు, కానీ దానిని సంగమమని అనరు.
సాగరుడైతే తన స్థానములోనే కూర్చుని ఉన్నారు, వారు ఈ తనువులో ఉన్నారు కదా. వీరి తనువు
ఎక్కడైతే ఉంటుందో, అక్కడ జ్ఞాన సాగరుడు ఉంటారు. ఇకపోతే, జ్ఞాన గంగలైన మీరు
పరస్పరములో కలుసుకుంటారు. చిన్న-పెద్ద నదులైతే ఉంటాయి కదా. అక్కడికి స్నానాలు
చేయడానికి వెళ్తారు. గంగ, యమున, సరస్వతి మొదలైనవైతే ఉండనే ఉన్నాయి. యమునా నది
తీరములో ఉన్న ఢిల్లీ - స్వర్గము. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు ఢిల్లీని
పరిస్తాన్ అని అనేవారు. శ్రీకృష్ణుని రాజ్యము అని అనరు, ఎందుకంటే రాధా-కృష్ణులు
యుగళులుగా అయినప్పుడు రాజ్యము చేయగలరు.
ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత సంతోషముగా ఉన్నారు. మాయ తుఫానులైతే ఎన్నో వస్తాయి. ఇది
అనంతమైన బాక్సింగ్. ప్రతి ఒక్కరికీ 5 వికారాలతో యుద్ధము జరుగుతుంది. మనం తండ్రిని
నిరంతరము స్మృతి చేయాలని కోరుకుంటాము. మాయ మన యోగాన్ని తెంచేస్తుంది. ఒక ఆటను కూడా
చూపిస్తారు - పరమాత్మ తమ వైపుకు ఆకర్షిస్తారు, మాయ తన వైపుకు ఆకర్షిస్తుంది, ఇలాంటి
నాటకాన్ని ఒకటి తయారుచేసారు. సినిమాల ఫ్యాషన్ ఇప్పుడు వచ్చింది. డ్రామానుసారముగా
మీకు సినిమా యొక్క ఉదాహరణను తీసుకుని అర్థం చేయించవలసి ఉంది. నాటకములోనైతే
మార్పు-చేర్పులు జరుగుతాయి. ఇదైతే అనాది, అవినాశీ, తయారై, తయారుచేయబడిన డ్రామా. ఈ
సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ
తయారయ్యేది లేదు, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది... ఫలానావారు మరణించారంటే, వారి
పాత్ర అంతే ఉంది, మనమెందుకు చింతించాలి. ఇది డ్రామా కదా. శరీరము వదిలేసారు, ఇక మళ్ళీ
రాలేరు. ఏడవడము వలన లాభమేముంది? దీని పేరే దుఃఖధామము. సత్యయుగములో మోహజీత్ రాజులు
ఉంటారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. సత్యయుగములో మోహమనే మాట ఉండదు. ఇక్కడైతే
మనుష్యులకు ఎంత మోహము ఉంది. ఎవరికైనా ఏడుపు రాకపోయినా కానీ ఏడ్చి-ఏడ్చి అయినా సరే
వారిని ఏడిపిస్తారు. అప్పుడు వారు బాధపడుతున్నారని భావిస్తారు, లేదంటే నిందిస్తారు.
భారత్ లోనే ఈ ఆచారాలన్నీ ఉన్నాయి. భారత్ లోనే సుఖము, భారత్ లోనే చాలా దుఃఖము ఉంటుంది.
భారత్ లో దేవి-దేవతలు రాజ్యము చేసేవారు. విదేశీయులు పాత చిత్రాలను చాలా సంతోషముగా
తీసుకుంటారు. పాత వస్తువులకు గౌరవము ఉంటుంది. అందరికన్నా పాతవారైన శివుడైతే ఇక్కడికి
వచ్చారు కదా, వారిని ఎంతగా పూజిస్తారు. ఇప్పుడు ఇక్కడికి శివబాబా వచ్చారు కానీ మీరు
పూజించరు. వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు కావున వారిని పూజిస్తూ ఉంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని నిశ్చింతగా అవ్వాలి. ఏ రకమైన చింత
చేయకూడదు ఎందుకంటే - ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు
జరుగుతుంది... అని తెలుసు. నిర్మోహులుగా అవ్వాలి.
2. తండ్రి ద్వారా ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుని ఉంది కావున రాహు గ్రహణము
పట్టకుండా సంభాళించుకోవాలి. ఏదైనా గ్రహచారము ఉన్నట్లయితే దానిని జ్ఞాన దానముతో
సమాప్తము చేసుకోవాలి.
వరదానము:-
స్వయము యొక్క టెన్షన్ పట్ల అటెన్షన్ ఉంచి విశ్వము యొక్క
టెన్షన్ ను సమాప్తము చేసే విశ్వకళ్యాణకారీ భవ
ఇతరుల పట్ల ఎక్కువ అటెన్షన్ ను ఇచ్చినట్లయితే మీ లోపల
టెన్షన్ పెరుగుతుంది, అందుకే విస్తారము చేసేందుకు బదులుగా సార స్వరూపములో
స్థితులైపోండి, క్వాంటిటీతో ఉన్న సంకల్పాలను ఇముడ్చి క్వాలిటీ సంకల్పాలను చేయండి.
మొదట మీ టెన్షన్ పట్ల అటెన్షన్ పెట్టండి, అప్పుడు విశ్వములో అనేక రకాల టెన్షన్ లు
ఏవైతే ఉన్నాయో, వాటిని సమాప్తము చేసి విశ్వ కళ్యాణకారులుగా అవ్వగలుగుతారు. మొదట
మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ సేవ ఫస్ట్. మీ సేవ చేసుకున్నట్లయితే ఇతరుల సేవ
స్వతహాగానే జరుగుతుంది.
స్లోగన్:-
యోగాన్ని
అనుభవం చేయాలంటే దృఢతా శక్తితో మనసును కంట్రోల్ చేసుకోండి.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
ఎంతగా స్థాపనకు
నిమిత్తులుగా అయ్యి జ్వాలా రూపులుగా అవుతారో, అంతగానే వినాశన జ్వాల
ప్రత్యక్షమవుతుంది. సంగఠన రూపములో జ్వాలా రూప స్మృతి విశ్వ వినాశన కార్యాన్ని
సంపన్నము చేస్తుంది. దీని కోసం ప్రతి సేవా కేంద్రములోనూ విశేషముగా యోగ ప్రోగ్రాములు
జరుగుతూ ఉన్నట్లయితే వినాశ జ్వాల మరింత తీవ్రమవుతుంది. యోగాగ్నితో వినాశనము యొక్క
అగ్ని వెలుగుతుంది, జ్వాలతో జ్వాల ప్రజ్వలితమవుతుంది.