08-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు శబ్దానికి అతీతముగా వెళ్ళాలి, అందుకే నోటి ద్వారా ‘శివ-శివ’ అని అనవలసిన అవసరము కూడా లేదు’’

ప్రశ్న:-
ఒక్క తండ్రిని మాత్రమే సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు, ఇతరులను అలా అనరు - ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే ఒక్క తండ్రిని స్మృతి చేయడము ద్వారానే ఆత్మ పతితము నుండి పావనముగా అవుతుంది. కేవలం తండ్రి మాత్రమే పతితులను పావనముగా తయారుచేస్తారు, వేరే ఏ దేహధారి మనుష్యులు పావనముగా చేయలేరు. తండ్రి మిమ్మల్ని రావణ రాజ్యము నుండి విముక్తులుగా చేస్తారు. మీరు శివబాబా నుండి శక్తిని తీసుకుంటారు, ఎంత ఎక్కువ స్మృతి చేస్తే అంత శక్తి లభిస్తుంది మరియు మాలిన్యము తొలగుతూ ఉంటుంది.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు భక్తి మార్గములోని మహిమను విన్నారు. మీరు కూడా మహిమను గానము చేసేవారు. ఇప్పుడు మహిమను గానము చేయరు, అలాగే మీకు మహిమ అవసరమూ లేదు. భక్తులు ఏదైతే చేస్తారో, అది పిల్లలైన మీరు చేయలేరు. ఇంతకుముందు మీరు భక్తులుగా ఉండేవారు, ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. వారు అందరినీ ఒకేసారైతే కలవలేరు. తండ్రి అందరినీ ఒకేసారి ఎలా చదివిస్తారు? అలా జరగదు. అలాగే, భక్తులందరూ కూడా ఒకే చోట కలవలేరు. అయితే, తండ్రి తప్పకుండా చదివించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది రాజయోగము. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలు స్థాపనవ్వనున్నాయి. పిల్లలు ప్రదర్శనీలలో అర్థం చేయించాలి. పండుగల సమయములో కూడా మీరు చాలా మంచి సేవ చేయవచ్చు. మీరు మీ కోసమే రాజ్య స్థాపనను చేసుకోవాలి. మీరు శివశక్తులు, మహారథి సైన్యము. మీరు ఇంకే డ్రిల్ మొదలైనవి నేర్చుకోరు. మీరు ఆత్మిక డ్రిల్ ను నేర్చుకుంటారు. ఈ డ్రిల్ భారత్ లో ప్రసిద్ధి గాంచినది. ఇది యోగము యొక్క డ్రిల్. ఆత్మ పరమపిత పరమాత్మతో యోగాన్ని జోడించాలి, వారి నుండి వారసత్వము తీసుకోవాలి. ఇందులో యుద్ధము యొక్క విషయమేమీ లేదు. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు, దీనికి యుద్ధముతో సంబంధమేమీ లేదు. మీరు అనంతమైన తండ్రికి వారసులు కనుక తండ్రికి చెందినవారిగా అయ్యి తండ్రి శ్రీమతముపై నడవాలి. తండ్రి మతము యుద్ధము మొదలైనవి చేయడానికి కాదు. తండ్రి కేవలం ఏమని తెలియజేస్తారంటే - మధురాతి మధురమైన పిల్లలూ! మీరు సతోప్రధానముగా ఉండేవారు, రాజ్యము చేసేవారు, ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. తండ్రి అంటారు - మీకు మీ జన్మల గురించి తెలియదు. మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారని కూడా అంటారు. 84 లక్షల జన్మలు అనేది కేవలం వ్యర్థ ప్రలాపమే. భక్తి మార్గములో ఎవరికి ఏది తోస్తే, అది చదువుతూ ఉంటారు. డ్రామానుసారముగా ఇది భక్తి మార్గపు సామాగ్రి. సత్య, త్రేతాయుగాలలో భక్తి ఉండనే ఉండదు. భక్తి వేరు, జ్ఞానము వేరు. పిల్లలైన మీకు తప్ప ఇతర ఏ ఋషులు, మునుల బుద్ధిలో ఈ జ్ఞానము లేదు. వారికి సుఖము వేరు, దుఃఖము వేరు అనే విషయము కూడా తెలియదు. సుఖాన్ని తండ్రి ఇస్తారు, దుఃఖాన్ని రావణుడు ఇస్తాడు. మీరు సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా ఉండేవారు, ఇప్పుడు 84 జన్మల చక్రములో తిరిగి శూద్రవంశీయులుగా అయ్యారు. తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు - మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మీరు 84 జన్మలను అనుభవించి కిందికి దిగుతూ తుచ్ఛబుద్ధి కలవారిగా, తమోప్రధానులుగా అయ్యారు. సతోప్రధానులను స్వచ్ఛమైన, ఉన్నతమైన బుద్ధి కలవారని అంటారు. తమోప్రధానులను నీచ బుద్ధి కలవారని అంటారు. నీచ బుద్ధి కలవారు ఉన్నత బుద్ధి కలవారికి నమస్కరిస్తారు. మేమే ఉన్నతముగా ఉండేవారము, ఇప్పుడు మేమే నీచులుగా అయ్యాము - అని ఇంతకుముందు మీకు కూడా తెలియదు. తండ్రి అర్థం చేయించారు, ఎవరైతే మొదటి నంబరులో జన్మ తీసుకుని ఉంటారో, వారే సతోప్రధానముగా అవుతారు. 84 జన్మలు కూడా సూర్యవంశీయులే తీసుకుంటారు. మేము విశ్వానికి యజమానులుగా ఉన్నప్పుడు పావనముగా, సతోప్రధానముగా ఉండేవారము - అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పతితులు విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. వారి మహిమ ఎంత ఉన్నతమైనదో చూడండి. వారు సర్వ గుణ సంపన్నులు... త్రేతాలో 14 కళల సంపూర్ణులని అనరు. సూర్యవంశీయులను 16 కళల సంపూర్ణులని అంటారు. 14 కళలు అనే మాట పక్కన సంపూర్ణులు అనే పదము రాదు. సంపూర్ణులు అనే పదము 16 కళలు కలవారికే వ్రాయాలి. ఇప్పుడు పిల్లలైన మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు.

ఈ జ్ఞానము అతి సజహమైనదని, దీని కన్నా సహజమైనది ఇంకేదీ ఉండదని కూడా పిల్లలకు అర్థం చేయించడము జరిగింది. బాబా దయాహృదయుడు కదా. పిల్లలు భక్తి మార్గములో ఎదురుదెబ్బలు తింటూ, తింటూ అలసిపోయి ఉంటారని బాబాకు తెలుసు కావుననే ద్రౌపది పాదాలను ఒత్తినట్లుగా చూపించారు. బాబా వద్దకు వృద్ధ మాతలు వస్తారు. బాబా అంటారు - మీరు భక్తిలో ఎదురుదెబ్బలు తింటూ-తింటూ అలసిపోయారు, అందుకే బాబా ఇప్పుడు మీ అలసటనంతా దూరం చేసేస్తారు. భక్తిలో రామ-రామ అని జపిస్తూ మాలను తిప్పుతూ ఉంటారు. బాబాకు క్రిస్టియన్ ఫాదర్లతో కూడా సంబంధముండేది. ఆ ఫాదర్లు కూడా బైబిల్ తీసుకుని అర్థం చేయిస్తూ ఉంటారు. చాలామంది క్రిస్టియన్లుగా అవుతారు. ఇక్కడ మాలను తిప్పే విషయమేమీ లేదు. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి. శివ-శివ అని నోటి ద్వారా అనవలసిన అవసరము లేదు. మనమైతే శబ్దానికి అతీతముగా వెళ్ళనున్నాము. బాబా చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు - నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది మరియు గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా అవ్వాలి. కమల పుష్పము చాలా ప్రసిద్ధమైనది. దానికి చాలా పెద్ద సంసారము ఉంటుంది, అయినా కానీ, అది అతీతముగా మరియు ప్రియముగా ఉంటుంది. మీరు కూడా విషయ సాగరములో ఉంటూ అతీతముగా, ప్రియముగా ఉండండి. ఇది విషయ సాగరము, దీనిని నది అని అనరు.

పిల్లలైన మీరిప్పుడు ఎంత వివేకవంతులుగా అవుతారు. ఈ వివేకముతోనే మీరు మహారాజకుమారులుగా అవుతారు. మీకు చాలా సంతోషముండాలి. పురుషార్థము చేయాలి. కుమారులు మరియు కుమార్తెలు, ఇరువురి ఆత్మలు పురుషార్థము చేయాలి. లౌకిక సంబంధములో తండ్రి వారసత్వము కేవలం కుమారులకు మాత్రమే లభిస్తుంది, కుమార్తెలకు లభించదు. ఇక్కడ ఆత్మలందరికీ వారసత్వము లభిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - స్మృతియాత్ర ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందగలరు. ప్రదర్శనీలో మొట్టమొదటగా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, ఆ తర్వాత తండ్రి వారసత్వము గురించి తెలియజేయాలి. వారికి ముందుగా - వీరు మీ అనంతమైన తండ్రి అనే నిశ్చయాన్ని కలుగజేయాలి. వారికి అర్థం చేయించాలి - భగవంతుడు ఒక్కరే, బ్రహ్మా, విష్ణు, శంకరులు కూడా భగవంతుడు కాదు, వారు దేవతలు. భగవంతుడు పతిత-పావనుడైన నిరాకార తండ్రి. వారి మహిమయే వేరు. ఈ రోజుల్లో ప్రదర్శనీలలో త్రిమూర్తి చిత్రము గురించి అర్థం చేయించాల్సి ఉంటుంది. వారు తండ్రి, వీరు దాదా. వారసత్వము వారి నుండి లభిస్తుంది. వారు నిరాకారుడు. వారి నుండి వారసత్వము ఎలా లభిస్తుంది! వారు అందరికీ రచయిత. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా రచన. రచనకు రచయిత నుండే వారసత్వము లభించగలదు. ఆ నిరాకార తండ్రి వీరి ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. రచయిత అందరికీ ఒక్కరే, అందుకే సర్వుల సద్గతిదాత ఒక్కరేనని అంటారు. వారిని జ్ఞానసాగరుడని అంటారు. మిగిలినవారంతా శాస్త్రాల అథారిటీ. బాబా జ్ఞాన సాగరుడు, బాబా స్వయమే అథారిటీ. వరల్డ్ ఆల్మైటీ అథారటీ స్వయంగా చెప్తున్నారు - నాకు వేద-శాస్త్రాలన్నింటి గురించి తెలుసు మరియు మీకు వాటి సారాన్ని అర్థం చేయిస్తాను. ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. ఇవి సత్య, త్రేతాయుగాలలో ఉండవు. భక్తి ద్వారానే మెట్లు కిందికి దిగాల్సి ఉంటుంది. సర్వశక్తివంతుడు అని ఒక్క తండ్రినే మాత్రమే అంటారు. వారితో యోగాన్ని జోడించడము ద్వారానే మనము పవిత్రముగా అవుతాము కనుక వారు సర్వశక్తివంతుడే కదా. వారు మనందరినీ పతితుల నుండి పావనులుగా చేస్తారు, రావణ రాజ్యము నుండి విముక్తులుగా చేస్తారు. మీరు ఇప్పుడు శివబాబా నుండి శక్తిని తీసుకుంటున్నారు. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే, అంత ఎక్కువ శక్తి లభిస్తుంది మరియు మాలిన్యము తొలగిపోతుంది. పతితుల నుండి పావనులుగా, తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వాలని మీకు రాత్రింబవళ్ళు ఇదే చింత ఉండాలి. మాయా తుఫానులు వస్తాయి. బాబా అంటారు - జాగ్రత్తగా ఉండాలి. మీకు మాయతో యుద్ధము ఉంది. వ్యర్థమైన వికల్పాలు చాలా వస్తాయి. అజ్ఞాన కాలంలో ఎప్పుడూ రానటువంటి వికల్పాలు కూడా వస్తాయి. మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. శ్రమంతా స్మృతియాత్రలోనే ఉంది. భారత్ యొక్క యోగము ప్రసిద్ధమైనది. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి - అని యోగము గురించే బాబా అర్థం చేయిస్తారు. ఈ విధముగా ఇతర మనుష్యులెవ్వరూ అర్థం చేయించలేరు. వారు, అందరూ భగవంతుని రూపాలే అని, ఎక్కడ చూసినా పరమాత్మయే పరమాత్మ అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ఆత్మలు, మీరు 84 జన్మలను అనుభవిస్తారు. ఒకవేళ అందరూ పరమాత్మలే అయినట్లయితే, పరమాత్మ జనన-మరణాల చక్రములోకి వస్తారా? ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మలో మంచి-చెడు సంస్కారాలు ఉంటాయి. మంచి సంస్కారాలు ఉన్నవారి మహిమను గానము చేస్తారు. చెడు సంస్కారాలు ఉన్నవారిని పాపులు, నీచులు అని అంటారు. బాబా పవిత్రముగా అయ్యేందుకు సహజమైన యుక్తిని తెలియజేస్తారు. మనసా-వాచా-కర్మణా ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు. స్వయానికి కూడా దుఃఖము ఇచ్చుకోకూడదు. ఎలాంటి వికర్మలు, దొంగతనము మొదలైనవి చేయకూడదు. ఒకవేళ ఎక్కడైనా అసత్యము చెప్పాల్సి వస్తే బాబాను సలహా అడగండి. అన్నింటికన్నా పెద్ద పాపం కామ ఖడ్గాన్ని ఉపయోగించడము, దానిని ఉపయోగించకండి.

తండ్రి అంటారు - పిల్లలూ, చేతులతో కర్మలు చేస్తూ బుద్ధియోగాన్ని నాతో జోడించండి. బాబా సర్జన్ కూడా. అందరి అనారోగ్యము ఒకే రకంగా ఉండదు, కర్మలు కూడా ఒకే రకంగా ఉండవు. కావున అడుగడుగులోనూ సలహాను అడగాలి. గమ్యము చాలా ఉన్నతమైనది. అమరనాథ యాత్రకు వెళ్ళినప్పుడు అమరనాథునికి జై, బద్రీనాథునికి జై, ఓ బద్రీనాథ, మమ్మల్ని రక్షించండి అని అంటారు. ఇప్పుడు మీరు తీర్థయాత్రలు మొదలైనవేవీ చేయకూడదు. ఈ జ్ఞాన విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు. ఈ పాత్ర వారిదే. మీరు కూడా బాబాతో పాటు పాత్రధారులు. ఎవరు ఎంతగా చదువుకుంటారో, అంత ఉన్నత పదవి లభిస్తుంది. ఇందులో ఎవరి గొప్పతనము లేదు. గొప్పతనమంతా ఒక్కరిదే, వారే మనుష్యులందరికీ సద్గతినిస్తారు, వారు పిల్లలందరినీ పతితుల నుండి పావనులుగా చేస్తారు. డ్రామాలో నాకు కూడా పాత్ర లభించి ఉంది. 5 తత్వాలకు కూడా తమ-తమ పాత్ర లభించి ఉంది, దానిని అభినయించాల్సి ఉంటుంది. భూమి కంపించాల్సి ఉంటుంది, వినాశనము జరుగుతుంది. మీకు కూడా డ్రామాలో పాత్ర ఉంది, ఇందులో గొప్ప ఏముంది. రాజ్యము చేస్తూ-చేస్తూ పతితముగా అయిపోయారు. మీరు కూడా ఇంతకుముందు ఎలా ఉండేవారు? పైసకు కొరగానివారిగా ఉండేవారు. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు, ఇది మీ పాత్ర, మళ్ళీ మనము అలా అవ్వాల్సిందే. ఇందులో గొప్ప ఏమీ లేదు, మహిమ చేసే విషయమేమీ లేదు. ఈ డ్రామా తయారై ఉంది. బాబా కూడా వచ్చి తమ పాత్రను అభినయిస్తారు. భక్తులు వారి గొప్పతనాన్ని వినిపిస్తారు, మహిమను పాడుతారు, మనము ఆ పని చేయలేము. ఇక్కడైతే తండ్రిని స్మృతి చేయాలి. బాబా, ఈ డ్రామా రహస్యము చాలా అద్భుతమైనది! ఇది ఎవ్వరికీ తెలియదు. బాబా, మేము సత్యయుగములో ఈ విషయాన్ని కూడా మర్చిపోతాము! ఇది చాలా విచిత్రమైన డ్రామా! ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోండి. పాత్రధారులెవరైనా పాత్రను బాగా అభినయిస్తే, వారి కోసం చప్పట్లు కొడతారు. మనము కూడా ఏమంటామంటే - మధురమైన బాబా యొక్క పాత్ర, శివబాబా యొక్క పాత్ర చాలా బాగుంది. మనము కూడా బాబాతో పాటు మంచి పాత్రను అభినయిస్తాము. ఎంత బాగా అర్థం చేయిస్తారు. అయినా కొందరికి అర్థం కాదు, అప్పుడిక వారు మన రాజధానిలోకి వచ్చేది లేదు అని అర్థమవుతుంది. ఎవరైతే ఇంతకుముందు బ్రాహ్మణులుగా అయ్యారో, వారే మళ్ళీ బ్రాహ్మణులుగా అయి దేవతలుగా అవుతారని కూడా తెలుసు. దేవతలలో కూడా ప్రజలు మొదలైనవారంతా తయారవుతారు. అందరికీ అనాది పాత్ర లభించి ఉంది. సృష్టి కూడా ఒక్కటే, అది నడుస్తూ ఉంటుంది. భగవంతుడు ఒక్కరే, రచన ఒక్కటే. అదే చక్రము తిరుగుతూ ఉంటుంది. చంద్రునిలో ఏముంది, ఆపైన ఏముంది చూడాలని మనుష్యులు పరిశోధన చేస్తూ ఉంటారు. దానిపైన సూక్ష్మవతనముంది. అక్కడ ఏం చూస్తారు? ప్రకాశమే ప్రకాశము. చాలా ప్రయత్నము చేస్తారు కానీ సైన్సుకు కూడా హద్దు ఉంది కదా. మాయ ఆర్భాటము కూడా చాలా ఉంది. సైన్సు సుఖము కోసం కూడా ఉంది మరియు దుఃఖము కోసం కూడా ఉంది. అక్కడ విమానాలు ఎప్పుడూ పడిపోవు. దుఃఖము అన్న మాటే ఉండదు. ఇక్కడైతే అంతా దుఃఖమే దుఃఖముంది, దొంగలు దోచుకుంటారు, అగ్ని అంతా కాల్చేస్తుంది. అక్కడ భవనాలు చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కొక్క రాజుకు ఆబూ అంతటి భూమి ఉంటుంది. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకే వచ్చారు. బాబాను స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది. మీరందరూ ప్రేయసులు. ఇప్పుడు ప్రియతముడు మీకు చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే అమరపురికి యజమానులుగా అయిపోతారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. సత్యయుగములో శ్రేష్ఠాచారీ ప్రపంచముంటుంది, ఇది భ్రష్టాచారీ ప్రపంచము. ఎంతమంది బి.కె.లు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు కూడా వారసత్వాన్ని తీసుకోండి. ఒకవేళ శ్రీమతముపై నడవకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత బాబా స్వర్గాన్ని తయారుచేయడానికి వస్తారు. కలియుగములో అనేకమంది మనుష్యులున్నారు, సత్యయుగములో కొద్దిమందే ఉంటారు. కనుక వినాశనము తప్పకుండా జరుగుతుంది. అందుకే మహాభారత యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనసా-వాచా-కర్మణా ఎవరికీ దుఃఖమివ్వకూడదు. చెడు సంస్కారాలను తొలగించి ఇప్పుడు మంచి సంస్కారాలను ధారణ చేయాలి. ఏ వికర్మలు జరగకూడదు, దాని పట్ల అటెన్షన్ పెట్టాలి.

2. ఈ విచిత్రమైన డ్రామాలో తమ శ్రేష్ఠ భాగ్యాన్ని చూసుకుంటూ తమతో తాము ఈ విధముగా మాట్లాడుకోవాలి - మేము భగవంతునితో కలిసి పాత్రను అభినయిస్తున్నాము, మా పాత్ర ఎంత బాగుంది.

వరదానము:-
స్నేహానికి రిటర్న్ లో సమానతను అనుభవం చేసే సర్వ శక్తి సంపన్న భవ

ఏ పిల్లలైతే తండ్రి స్నేహములో సదా ఇమిడి ఉంటారో, వారికి వారి స్నేహానికి రిటర్న్ లో తండ్రి సమానముగా అయ్యే వరదానము ప్రాప్తిస్తుంది. ఎవరైతే సదా స్నేహయుక్తముగా మరియు యోగయుక్తముగా ఉంటారో, వారు సర్వశక్తులతో స్వతహాగా సంపన్నముగా అవుతారు. సర్వశక్తులు సదా తోడుగా ఉన్నట్లయితే విజయము తప్పకుండా లభిస్తుంది. ఎవరికైతే సర్వశక్తివంతుడైన తండ్రి నా సహచరుడు అన్న స్మృతి ఉంటుందో, వారు ఎప్పుడూ ఏ విషయములోనూ చలించరు.

స్లోగన్:-
పురుషార్థీ జీవితములో ఎవరైతే సదా సంతుష్టముగా మరియు సంతోషముగా ఉంటారో, వారే అదృష్టవంతులు.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

ఈ సమయములో ఎటువంటి పరోపకారి గ్రూప్ కావాలంటే, వారు ఇచ్చే దాతలుగా ఉండాలి. సంపన్న రాజులు సదా ప్రజలకు ఇచ్చేవారిగా ఉంటారు. సంపన్న రాజుల చేయి ఎప్పుడూ కూడా తీసుకునేదిగా ఉండదు, ఇచ్చేదిగా ఉంటుంది. పిల్లలైన మీరైతే స్వర్గములో విశ్వ మహారాజులుగా అయ్యి దాతా రూపపు పాత్రను అభినయించేవారిగా ఉంటారు, కావున ఇప్పటినుండే ఆ సంస్కారాన్ని స్వయములో నింపుకోండి.