08-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
18.10.2071
విశేషముగా దీపావళి నిమిత్తముగా అవ్యక్త బాప్ దాదా
యొక్క మధుర మహావాక్యాలు
ఈ రోజు బాప్ దాదా ఏం చూస్తున్నారు? దీపాలైన మీ మాలను
చూడటానికి వచ్చారు. మనుష్యులు దీపమాల యొక్క స్మృతిచిహ్న
దినాన్ని జరుపుకుంటారు, కానీ బాప్ దాదా చైతన్య దీపాల మాలను
చూస్తున్నారు. మీరందరూ కూడా దీపమాల రోజున వెలుగుతున్న దీపాలను
చూసినప్పుడు - మా స్మృతిచిహ్నాన్నే జరుపుకుంటున్నారు అన్న
సంతోషము కలుగుతుందా? ఎలా అయితే వెలుగుతున్న దీపము ప్రియముగా
అనిపిస్తుందో, అలా మీ స్మృతిచిహ్నాన్ని చూసి స్మృతి రావడముతో
మీరందరూ కూడా విశ్వ పితకు మరియు సమస్త విశ్వ ఆత్మలకు
ప్రియమైనవారిగా అనిపిస్తారు. కావున ఈ రోజు స్మృతిచిహ్న రూపాన్ని
ప్రత్యక్ష రూపములో చూడటానికి వచ్చారు. మాలలో ఒక్క మణి ఉండదు,
అనేక మణుల మాల తయారవుతుంది. ఒకవేళ ఒకే దీపము విడిగా వెలుగుతూ
ఉంటే దానిని దీపాల మాల అని అనరు. కావున అలా అనేక దీపాలు
వెలుగుతూ మాల రూపములో కనిపిస్తున్నాయి. మరి ప్రతి ఒక్కరూ
స్వయాన్ని ఈ దీపమాల మధ్యలో కూర్చబడిన, వెలుగుతున్న దీపముగా
భావిస్తున్నారా? లేదా మీరు కూడా వెలుగుతున్న అనేక దీపాల మాలను
చూస్తూ హర్షిస్తున్నారా? నేడు దీపమాల రోజున మీరందరూ దీపావళిని
జరుపుకున్నారా? నేడు విశేష రూపములో దీపావళిని జరుపుకున్నారా? ఆ
మాటకొస్తే మీరు సదా వెలిగి ఉన్న దీపాలే, కానీ విశేషముగా
స్మృతిచిహ్న రోజు వచ్చినప్పుడు విశేష ఆత్మలు ఏం చేయాలి?
విశేషాత్మలు ఎవరైతే విశేష రూపములో నిమిత్తముగా అవుతారో, వారు
విశేష సేవ ఏమి చేయాలి? విశేష ఆత్మలైతే ఇతరుల కంటే విశేషమైన
కార్యాన్ని చేయాలి కదా, ఎందుకంటే ఇతర ఆత్మలు కూడా చేయగలిగినది
మరియు చేస్తున్నదే మీరు కూడా చేస్తే, ఇక తేడా ఏముంది? విశేష
ఆత్మలు విశేష కార్యము చేయాలి. బాప్ దాదా విశేష దినాలలో విశేష
రూపములో పిల్లలకు మరియు భక్తులకు మూడు రూపాలలోనూ సేవ చేస్తారు.
విశేష ఆత్మలు ప్రత్యేకముగా తమ స్మృతిచిహ్నము రోజున సాక్షాత్కార
మూర్తులుగా అయి, సాక్షాత్తు బాప్ దాదా సమానముగా, ఆత్మల పట్ల తమ
కళ్యాణ భావనతో, తమ ఆత్మిక స్నేహ స్వరూపముతో, తమ సూక్ష్మ
శక్తులతో ఆత్మలలో బలాన్ని నింపాలి. అవ్యక్త రూపములో బాప్ దాదా
నలువైపులా పిల్లల సేవను చేస్తున్నారు. బాప్ దాదా నన్ను కలిశారు,
నా స్మృతికి రెస్పాన్స్ ఇచ్చారు లేదా నా స్మృతి యొక్క
ప్రత్యక్ష ఫలాన్ని నేను అనుభవం చేసాను అని పిల్లలు భావిస్తారు;
అలాగే భక్తులు కూడా, మా ప్రేమకు మరియు భావనకు భగవంతుడు ఫలాన్ని
ఇచ్చారు అని అనుభవం చేస్తారు. ఈ అనుభవం ప్రాక్టికల్ రూపములో
కలుగుతూ ఉంటుంది.
అలాగే విశేష ఆత్మలు తమ అవ్యక్త స్థితిలో, తమ ఆత్మిక లైట్
మరియు మైట్ యొక్క స్థితి ద్వారా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ గా
అయి ఒకే స్థానములో ఉంటూ కూడా నలువైపులా అలౌకిక ఆత్మిక సేవా
భావనతో మరియు వృత్తితో సేవ చేయాలి. దీనినే అనంతమైన సేవ అని
అంటారు. ఎలా అనుభవం అవ్వాలంటే లేక ఎలా అనుభూతి కలగాలంటే, నా
ప్రజలు లేదా భక్తులు నేడు విశేషముగా స్మృతిచిహ్న రోజున విశేష
ఆత్మనైన నన్ను గుర్తు చేసుకుంటున్నారు. అల్పకాలిక రిద్ధి-సిద్ధి
కలవారు ఒకే స్థానములో ఉంటూ తమ భక్తులకు తమ రూపము యొక్క
ప్రత్యక్ష సాక్షాత్కారాన్ని చేయించగలిగినప్పుడు, మరి విశేష
ఆత్మలు తమ లైట్ మరియు మైట్ ద్వారా భక్తులకు మరియు ప్రజలకు తమ
సేవ ద్వారా అనుభవం చేయించలేరా? కావున ఇలాంటి విశేష స్మృతిచిహ్న
రోజులు వచ్చినప్పుడు విశేష ఆత్మలు ఇలాంటి విశేష సేవలో అనుభవం
చేయాలి. అలాంటి సేవను చేశారా? అచ్ఛా. ఇది సేవ విషయము. మరి
దీపావళి రోజున స్వయం పట్ల విశేష అటెన్షన్ ఉండినదా? నేటి రోజున
స్వయం యొక్క ఆత్మ సంస్కారాలలో సదా కోసం పరివర్తనను తీసుకువచ్చే
విశేష అటెన్షన్ పెట్టారా? స్మృతిచిహ్న రూపములో నేటి ఈ రోజున
పాత ఖాతాను సమాప్తము చేసే పద్ధతి నడుస్తూ వస్తోంది కదా, అది
తప్పకుండా ప్రాక్టికల్ రూపములో ఆత్మలైన మీరు చేశారు, అందుకే
స్మృతిచిహ్నము కొనసాగుతూ వచ్చింది. మరి నేటి రోజున మీ పాత
సంస్కారాల ఖాతా ఏ కొద్దిగానైనా మిగిలి ఉంటే దానిని సమాప్తము
చేశారా? సమాప్తము చేసే కంటే ముందు తమ ఖాతాను చెక్ చేసుకుంటారు.
రిజల్ట్ తీస్తారు. అలా మీరందరూ మీ లెక్కాపత్రాన్ని చెక్
చేసుకున్నారా? ఏం చెక్ చేసుకోవాలి? ఈ రోజు వరకు ఏ పురుషార్థమైతే
జరిగిందో, దాని రిజల్టులో - ఇప్పటివరకు ఏయే విషయాలలో మరియు ఎంత
పర్సెంటేజ్ లో సఫలతా మూర్తులుగా అయ్యారు? ముందుగా మీ మనసా
సంకల్పాల లెక్కాపత్రాన్ని చెక్ చేసుకోండి - ఇప్పటివరకు సంపూర్ణ
శ్రేష్ఠ సంకల్పాల పురుషార్థములో ఎంతవరకు సఫలత వచ్చింది? వ్యర్థ
సంకల్పాలపై మరియు వికల్పాలపై ఎంతవరకు విజయులుగా అయ్యారు? మరియు
వాణి ద్వారా ఎంతవరకు ఆత్మలకు తండ్రి పరిచయము ఇవ్వగలిగారు?
ఎంతమంది ఆత్మలను బాబాకు స్నేహీలుగా మరియు సహయోగులుగా చేయగలిగారు?
వాచాలో ఎంతవరకు ఆత్మికత మరియు అలౌకికత మరియు ఆకర్షణ వచ్చింది?
అలాగే కర్మణా ద్వారా సదా అతీతమైన మరియు ప్రియమైన, అలౌకికమైన,
అసాధారణమైన కర్మలు ఎంతవరకు చేయగలిగారు? కర్మలలో ఎంతవరకు
కర్మయోగి, యోగయుక్త, యుక్తియుక్త, స్నేహయుక్త రూపాన్ని
తీసుకువచ్చారు? మీ సంస్కారాలలో మరియు స్వరూపాలలో అనగా ముఖములో
ఎంతవరకు బాబా సమానమైన ఆకర్షణ రూపముగా, స్నేహీ రూపముగా, సహయోగీ
రూపముగా అయ్యారు? ఇలా మీ లెక్కాపత్రాన్ని చెక్ చేసుకున్నట్లయితే
ఇప్పటివరకు ఏవైతే లోపాలు మరియు బలహీనతలు మిగిలి ఉన్నాయో, వాటిని
సమాప్తము చేసి కొత్త ఖాతాను ప్రారంభించగలరు. ఇలా మీ
లెక్కాపత్రాన్ని చెక్ చేసుకోండి.
దీనిని దీపావళి జరుపుకోవడము అంటారు, లేదా తమను తాము
సంపూర్ణముగా తయారుచేసుకోవాలనే దృఢ సంకల్పము చేయడమే జరుపుకోవడము.
మరి ఇటువంటి దీపావళిని జరుపుకున్నారా లేక కేవలం మిలనము మాత్రమే
జరుపుకున్నారా? మిలనము జరుపుకోవడానికి స్మృతిచిహ్నము మాల
రూపములో ఉంది, కానీ దృఢ సంకల్పాల స్మృతిచిహ్నము దీపము యొక్క
జ్యోతి రూపములో ఉంది. మరి రెండు రూపాలలోనూ జరుపుకున్నారా?
కొత్త వస్త్రాలను ధరించారా? ఆత్మకు కొత్త శరీరము ఏ ఆధారముగా
లభిస్తుంది? సంస్కారాల ఆధారముగా లభిస్తుంది కదా. ఆత్మ
సంస్కారాలు ఎలా ఉంటాయో దాని అనుసారముగానే శరీరము తయారవుతుంది.
మరి కొత్త శరీరము లేదా కొత్త వస్త్రాలు ఎలాంటివి ధరిస్తారు?
ఆత్మలో కొత్త యుగము యొక్క సంస్కారాలను లేదా కొత్త యుగము యొక్క
స్థాపకుడైన తండ్రి వంటి సంపూర్ణ సంస్కారాలను ధారణ చేయడము - ఇదే
కొత్త వస్త్రాలను ధరించడము. శరీరానికి కొత్త వస్త్రాలు ఎన్ని
ధరించినా కానీ నేటి పాత ప్రపంచములోని కొత్త వస్తువు కూడా కొత్త
ప్రపంచము ముందు పాతదే, ఎందుకంటే శిథిలావస్థకు చేరుకుంది, అందుకే
కొత్త వస్త్రాలను ధరించినా వాటిని కొత్తవి అని అనరు. సతోప్రధాన
ప్రపంచములోనే అంతా కొత్తగా ఉంటుంది. తమోప్రధాన ప్రపంచములోని
వస్తువులన్నీ పాతవే, నిస్సారమైనవే. మరి వాటిని కొత్తవి అని
అంటారా ఏమిటి? కావున కొత్త వస్త్రాలు అనగా తమ ఆత్మ యొక్క కొత్త
సంస్కారాలను, శ్రేష్ఠ సంస్కారాలను ధారణ చేయడము. ఇంకా ఏం
చేస్తారు? కొత్త సంస్కారాలను ధారణ చేసినప్పుడు లెక్కాపత్రాన్ని
ఉంచుకోవడము అనగా సున్నము వేయడము వంటిది. కావున లెక్కాపత్రాన్ని
ఉంచుకోవడము - ఇదే సున్నము వేయడము అనగా శుభ్రత, స్వచ్ఛత. సున్నము
వేసినప్పుడు మురికి మరియు క్రిములు ఏవైతే ఉంటాయో అవి స్వతహాగానే
నశించిపోతాయి. మరి ఇలా లెక్కాపత్రాన్ని చెక్ చేసుకున్నప్పుడు ఏ
బలహీనత అయినా ఉంటే అది స్వతహాగానే సమాప్తమైపోతుంది. ఒకరికొకరు
తమ మధురమైన మాటలతో ఏమి ఇచ్చిపుచ్చుకుంటారు? దీపావళికి ఒకరి
నుండి ఒకరు కానుకను తీసుకుంటారు కదా. మీరు ఒకరికొకరు ఏ కానుకను
ఇచ్చుకుంటారు? మీ వద్ద ఉన్న ఏ వస్తువును ఒకరికొకరు కానుకగా
ఇచ్చుకుంటారు? (స్నేహమనే కానుక) స్నేహీలుగా ఒకరికొకరు సదా కాలం
కొరకు ఉన్నారా లేక నేటి రోజున మాత్రమే ప్రత్యేకముగా స్నేహీలుగా
అవుతారా? స్నేహీలుగానే ఉన్నారు మరియు ఈ స్నేహానికి గుర్తునే,
ఒకరికొకరి సామీప్యతకు గుర్తునే దీపమాల అంటారు. విశేషమైన దినాలలో
విశేషముగా ఏ కానుకను ఇవ్వాలి? ఇప్పటివరకు మీ పురుషార్థము ద్వారా
ఏదైతే సహజ సఫలత ప్రాప్తించిందో లేదా అనుభవమైందో, అలా మీ అనుభవం
యొక్క జ్ఞాన రత్నాలను, దేని ద్వారానైతే ప్రాక్టికల్ అనుభవీలుగా
అయి అనుభవీలుగా చేయగలరో, అలాంటి రత్నాలను ఒకరికొకరు కానుక
రూపములో విశేషముగా ఇచ్చుకోవాలి. అర్థమైందా? బాబా ఖజానాను తమ
అనుభవము ద్వారా ఏదైతే స్వంతం చేసుకున్నారో, అలా స్వంతం
చేసుకున్న జ్ఞాన రత్నాలను ఒకరికొకరు ఇచ్చుకోవాలి; తద్వారా ఆ
ఆత్మ కూడా వాటితో సహజ అనుభవీగా అయిపోవాలి, ఇదే కానుకను ఇవ్వటము.
ఒకరికొకరు సదాకాలం కొరకు స్మృతి రూపముగా నిలిచిపోయే ఇలాంటి
కానుకను ఇవ్వాలి. ఇలాంటి రత్నాలను ఎవరికైనా ఇచ్చినప్పుడు,
సదాకాలం కొరకు ఆ ఆత్మకు బాబాతో పాటు మీరు ఇచ్చిన రత్నాల యొక్క
స్మృతి తప్పకుండా ఉంటుంది. కావున ఎవరినైనా సదా కాలం కొరకు
సంపన్నము చేసే కానుకను ఇవ్వాలి. ఇలాంటి దీపావళిని జరుపుకోండి
మరియు ఇలాగే శ్రేష్ఠ ఆత్మగా అయి ఇతర ఆత్మల శ్రేష్ఠ సేవ చేయండి.
ఈ రోజుల్లో సర్వ ఆత్మలు ధనము కోసం దాహముతో ఉన్నారు. అలాంటి
దాహముతో ఉన్న ఆత్మలకు ఎలాంటి ఆత్మిక ధనాన్ని ఇవ్వండి అంటే,
తద్వారా ఇక ఎన్నడూ ఆత్మకు ధనాన్ని అడగాల్సిన అవసరమే ఉండకూడదు.
ధనాన్ని ఎవరు అడుగుతారు? బికారి. నేటి రోజున ఆత్మ బికారిగా
అవుతుంది. రాయల్ బికారి అనండి. ఎంతటి కోటీశ్వరులైనా కానీ నేటి
రోజున బికారిగా అవుతారు. అటువంటి బికారి ఆత్మను బికారితనము
నుండి విడిపించండి, ఇది అనంతమైన సేవ. మీరు దాత పిల్లలు కదా.
కావున దాత పిల్లలు, వరదాత పిల్లలు తమ వరదాన శక్తితో, జ్ఞానదాన
శక్తితో బికారులను సుసంపన్నులుగా చేయండి. నేటి రోజున ఈ బికారి
ఆత్మలపై విధాత మరియు వరదాత పిల్లలకు దయ కలగాలి. ఏ ఆత్మలకైతే ఈ
విధముగా దయ కలుగుతుందో, వారికే మాయ మరియు విశ్వములోని ఇలాంటి
ఆత్మలు నమస్కరిస్తాయి, అందుకే ఇప్పటికీ దీపాలు వెలిగిస్తారు.
లైట్ వెలిగించినప్పుడు తప్పకుండా నమస్కరిస్తారు. కావున ఇలా
జ్యోతి వెలిగిన ఆత్మల స్మృతిచిహ్నము ఇప్పటికీ నిలిచి ఉంది.
ఆరిపోయిన దీపానికి నమస్కారము చేయరు. కావున సదా వెలిగే జ్యోతిగా
అవ్వండి. అటువంటి ఆత్మలకు బాప్ దాదా కూడా నమస్తే చేస్తున్నారు.
అచ్ఛా!
(మహారాష్ట్ర జోన్ కు చెందిన
సోదర-సోదరీలకు అవ్యక్త బాప్ దాదా మహావాక్యాలు - రివైజ్
(20-3-12)
ఈ జోన్ సంఖ్య ఎక్కువగా ఉంది. పేరు మహారాష్ట్ర, కావున ‘మహా’గా
ఉంటారు కదా! పేరుకు తగ్గట్లుగా సంఖ్య కూడా మహాన్ గా ఉంది.
బొంబాయి మరియు ఢిల్లీ, రెండు స్థానాలలోని పిల్లలు సేవ అయితే
బాగా చేస్తున్నారు, అందులో చెప్పేదేమీ లేదు. బాగా చేస్తున్నారు,
చేస్తూ ఉంటారు కానీ బాప్ దాదా ఢిల్లీ మరియు బొంబాయి నుండి ఏమి
కోరుకుంటున్నారంటే, మీ సంబంధ-సంపర్కములోకి వచ్చిన విశేష ఆత్మలు,
మైక్ గా కూడా అవ్వగలరు మరియు తర్వాత వారసులుగా కూడా అవ్వగలరు,
అటువంటి గ్రూపును తయారుచేయండి, ఎందుకంటే మెజారిటీ వర్గాలు తమ
లిస్టును బాప్ దాదాకు పంపారు. ఆ లిస్టును చూశాము. లిస్టులో
మంచి-మంచివారు ఉన్నారు, వారు మంచి పేరును తీసుకురాగలరు. ఇప్పుడు
వారిని ప్రత్యక్షము చేయండి. మీ బదులు వారు భాషణ చేయాలి. మీ
అనుభవాన్ని వారు వినిపించాలి. జ్ఞానము ఏమిటి, ఇక్కడకు వచ్చాక
జీవితములో ఏమి పరివర్తన వచ్చింది అన్నది వర్ణించాలి. ఫంక్షన్
జరిగినప్పుడు, ఇప్పుడు కూడా కొంతమంది తమ అనుభవాలను చక్కగా
వినిపిస్తారు కానీ అది ఫంక్షన్ లో వినిపించారు, కానీ నిరంతరం
అటువంటి జీవితాన్ని అనుభవము చేయాలి. ఇలాంటి అటెన్షన్ ఉంచితే
తయారయ్యేవారున్నారు. కొంతమంది అటువంటి యోగ్యులు ఉన్నారు కానీ
కొద్దిగా పురుషార్థము చేసి వారిని ముందుకు తీసుకువెళ్ళండి.
ప్రతి ఒక్క వర్గము వారు వాస్తవానికి ఈ లిస్టును ప్రత్యక్ష
రూపములో పరివారము మరియు బాబా ఎదుటకు తీసుకురావాలి. వర్గాలవారు
కార్యమునైతే చేసారు. కార్యమునైతే చేసారు కానీ బాప్ దాదా ఏం
చూసారంటే చాలాకాలం నుండి చేస్తున్నారు, ఇప్పుడు ఏదైనా నవీనతను
తీసుకురండి. నవీనత ఏమిటంటే వారసులుగా చేయండి. కనీసం సంపర్కములో
ఉండేవారు సంబంధములోకి రావాలి, సంబంధము తర్వాత సేవలోకి రావాలి.
సంబంధము అంటే కేవలం వచ్చిపోయే సంబంధము కాదు, కానీ బాబాకు మరియు
పరివారానికి సహచరులుగా అవ్వాలి. ఇది కూడా జరిగేది ఉంది. ఇప్పుడు
బాప్ దాదా ఏమి చూసారంటే - ఒకవేళ బ్రాహ్మణులు కలిసి ఏదైనా ఒక
సంకల్పము చేస్తే అది జరిగి తీరవలసిందే కానీ అందరిదీ ఒకే
సంకల్పము అయి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వాయుమండలము మారిపోయింది.
కనుక బాప్ దాదా ఇటువంటి మైక్ క్వాలిటీ కల పిల్లల సంగఠనను
తయారుచేయించాలని కోరుకుంటున్నారు. మధుబన్ లో కలవడానికి వస్తారు,
అది వేరే విషయము, కానీ పరివారానికి చెందినవారిగా అయ్యి రావాలి
ఎందుకంటే సేవలో ఏదో ఒక నవీనత అయితే కావాలి కదా! అచ్ఛా.
ఇకపోతే బాప్ దాదాకు జోన్ వారి పట్ల ఒక ఆశ ఇంకా మిగిలిపోయి ఉంది.
అది ఏమిటి? ప్రతి సెంటరు ఈ శుభవార్తను వ్రాయాలి, మా సెంటరు
నిర్విఘ్నముగా ఉంది, కలుపుగోలుగా ఉంది, బాబా పిల్లలందరూ
ఏక్యురేట్ గా, తయారుచేయబడిన ప్రోగ్రామ్ అనుసారముగా బిజీగా
ఉన్నారు, నిర్విఘ్నముగా ఉన్నారు అని వ్రాయాలి. ఇలా ఇప్పటివరకు
ఏ జోన్ నుండి రాలేదు. మరి మహారాష్ట్ర అయితే మహాన్ కార్యాన్ని
చేస్తారు కదా! ఏ జోన్ వారూ ఇప్పటివరకు ఈ శుభవార్తను పంపలేదు.
తయారవ్వాలి. తయారవ్వాల్సిందే మీరే, ఇంకెవరు తయారవుతారు! మీ
తపస్య తక్కువైనదేమీ కాదు. టీచరైనా, విద్యార్థి అయినా ప్రపంచము
దృష్టిలో ప్రతి ఒక్కరూ మహాన్ ఆత్మలే. ఇప్పుడిప్పుడే చూడండి,
మీరు ఈ నిర్విఘ్నము గురించి కొద్దిగా పురుషార్థము చేసినా కానీ,
ఎలా అయితే మీ జడ చిత్రాలను అందరూ శుభ భావనతో చూస్తారో, అలా
మిమ్మల్ని చైతన్యములో దేవీల రూపములో, దేవతల రూపములో చూస్తారు.
ఇకపోతే సేవ అయితే అందరూ చాలా బాగా చేసారు. దానికి బాప్ దాదా
అభినందనలు తెలియజేస్తున్నారు.
వరదానము:-
దివ్య గుణాల ఆహ్వానము ద్వారా అవగుణాలను
సమాప్తము చేసే దివ్యగుణధారి భవ
ఏ విధముగానైతే దీపావళి నాడు
శ్రీలక్ష్మిని ఆహ్వానిస్తారో, అలా పిల్లలైన మీరు స్వయములో
దివ్య గుణాలను ఆహ్వానించండి, అప్పుడు అవగుణాలు ఆహుతి రూపములో
సమాప్తమైపోతాయి. అప్పుడు కొత్త సంస్కారాల రూపీ కొత్త వస్త్రాలను
ధారణ చేస్తారు. ఇప్పుడు పాత వస్త్రాల పట్ల కొద్దిగా కూడా ప్రీతి
ఉండకూడదు. ఏవైతే లోపాలు, బలహీనతలు, నిర్బలత, సున్నితత్వము
మిగిలిపోయిందో, ఆ పాత ఖాతా అంతటినీ ఈ రోజు నుండి సదా కాలం కొరకు
సమాప్తము చేయండి, అప్పుడు దివ్యగుణధారులుగా అవుతారు మరియు
భవిష్యత్తులో పట్టాభిషేకము జరుగుతుంది. దాని స్మృతిచిహ్నమే ఈ
దీపావళి.
స్లోగన్:-
స్వరాజ్యాధికారులుగా అవ్వాలంటే మనసు రూపీ మంత్రిని మీ సహయోగిగా
చేసుకోండి.
అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ
స్థితిని అనుభవము చేయండి
‘‘బిందువు మరియు సింధువు (సముద్రము)’’ - ఈ రెండు పదాలను గుర్తు
పెట్టుకున్నా సరే సంపూర్ణత సహజముగా రాగలదు. ఒకటేమో బిందువు
యొక్క స్మృతి మరియు ఏకరస అవస్థ, ఒకే ఒక్కరి మతము మరియు ఒకే
ఒక్కరి కర్తవ్యములో సహాయకులు. కేవలం బిందువు మరియు ఒక్కరు, దీని
కంటే ఎక్కువగా ఇక విస్తారములోకి వెళ్ళే అవసరము లేదు. కేవలం
సర్వీస్ కోసమే విస్తారములోకి వెళ్ళాలి. అంతకుమించి తమ బుద్ధిని
నడిపించే అవసరము లేదు.