ఓంశాంతి
ఈ పాత ప్రపంచములో ఇప్పుడు మనము కొద్ది రోజుల బాటసారులమని చాలా కాలం దూరమైన తర్వాత
కలిసిన మధురాతి మధురమైన పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రపంచములోని మనుష్యులు ఇక్కడ
ఇంకా 40 వేల సంవత్సరాలు ఉండేది ఉందని భావిస్తారు. పిల్లలైన మీకైతే నిశ్చయముంది కదా.
ఈ విషయాలను మర్చిపోకండి. ఇక్కడ కూర్చున్నప్పుడు పిల్లలైన మీకు లోలోపల చాలా
పులకరించిపోవాలి. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో, ఇదంతా వినాశనమయ్యేది ఉంది.
ఆత్మ అయితే అవినాశీ. ఆత్మలమైన మనము పూర్తి 84 జన్మలు తీసుకున్నామని, ఇప్పుడు తండ్రి
తీసుకువెళ్ళేందుకు వచ్చారని ఇది కూడా బుద్ధిలో ఉంది. పాత ప్రపంచము ఎప్పుడైతే
పూర్తవుతుందో అప్పుడు తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారుచేయడానికి వస్తారు. కొత్త
ప్రపంచము నుండి పాత ప్రపంచముగా, మళ్ళీ పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచముగా అయ్యే ఈ
చక్రము గురించి మీ బుద్ధిలో జ్ఞానము ఉంది. అనేకసార్లు మనము ఈ చక్రములో తిరిగాము.
ఇప్పుడు ఈ చక్రము పూర్తవుతోంది. ఆ తర్వాత కొత్త ప్రపంచములో కొద్దిమంది దేవతలమైన మనమే
ఉంటాము. అక్కడ మనుష్యులు ఉండరు. ఇప్పుడు మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము.
ఈ విషయములోనైతే పక్కా నిశ్చయముంది కదా. ఇకపోతే కర్మలపైనే మొత్తమంతా ఆధారపడి ఉంది.
మనుష్యులు తప్పుడు కర్మలు చేసినప్పుడు అవి తప్పకుండా లోలోపల తింటూ ఉంటాయి, అందుకే
తండ్రి అడుగుతున్నారు - ఈ జన్మలో ఇటువంటి పాపాలైతే ఏమీ చేయలేదు కదా? ఇది ఉన్నదే
ఛీ-ఛీ రావణ రాజ్యము. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. రావణుడు అన్న పేరు ఎవరిది
అనేది ప్రపంచానికి తెలియదు. రామ రాజ్యము కావాలని బాపూజీ అనేవారు కానీ దాని అర్థము
వారికి తెలియదు. రామ రాజ్యము ఏ రకముగా ఉంటుంది అనేది ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం
చేయిస్తున్నారు. ఇదైతే అంధకారమయమైన ప్రపంచము. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలకు
వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తి చేయరు. ఇప్పుడు తండ్రి చేయి లభించింది.
తండ్రి ఆధారము లేనప్పుడు మీరు విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉండేవారు. అర్ధకల్పము
భక్తియే ఉంటుంది. జ్ఞానము లభించడముతో మీరు కొత్త ప్రపంచమైన సత్యయుగములోకి
వెళ్ళిపోతారు. మేము బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ పవిత్రముగా అయిపోతాము, ఆ తర్వాత
పవిత్ర రాజ్యములోకి వస్తామని ఇప్పుడు పిల్లలైన మీకు ఈ నిశ్చయముంది. ఈ జ్ఞానము కూడా
ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగము మీకు లభిస్తుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సమయములో
మీరు ఛీ-ఛీ నుండి పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. అలా ఎవరు
తయారుచేస్తారు? తండ్రి. మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఆత్మలమైన మనకు వారు అనంతమైన
తండ్రి. లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు. ఆత్మల విషయములో పారలౌకిక తండ్రి
అందరికీ తండ్రి అవుతారు. అలాగే బ్రహ్మా యొక్క కర్తవ్యము గురించి కూడా కావాలి కదా.
పిల్లలైన మీరు అందరి కర్తవ్యాల గురించి తెలుసుకున్నారు. విష్ణువు యొక్క కర్తవ్యము
గురించి కూడా తెలుసు. వారు ఎంతగా అలంకరించబడి ఉన్నారు. వారు స్వర్గానికి యజమాని కదా.
ఇతడినైతే సంగమయుగము వారనే అంటారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, ఇవి కూడా
సంగమములోనే ఉంటాయి కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పాత ప్రపంచము మరియు కొత్త
ప్రపంచము యొక్క సంగమము ఇది. ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు కూడా. పావన ప్రపంచము
కొత్త ప్రపంచము మరియు పతిత ప్రపంచము పాత ప్రపంచము. అనంతమైన తండ్రి పాత్ర కూడా ఉందని
మీకు తెలుసు. వారు క్రియేటర్, డైరెక్టర్ కదా. అందరూ ఒప్పుకుంటున్నారంటే తప్పకుండా
వారికి ఏదో పాత్ర ఉంటుంది కదా! వారిని మానవుడు అని అనరు, వారికైతే శరీరము లేదు.
మిగిలినవారందరినీ మనుష్యులని అంటారు లేక దేవతలని అంటారు. శివబాబానైతే దేవత అని కానీ,
మనిషి అని కానీ అనలేరు ఎందుకంటే వారికి శరీరమే లేదు. ఈ శరీరాన్ని అల్పకాలికముగా
తీసుకున్నారు. వారు మధురాతి మధురమైన పిల్లలకు స్వయముగా చెప్తున్నారు, నేను శరీరము
లేకుండా రాజయోగాన్ని ఎలా నేర్పించను! నన్ను మనుష్యులు రాళ్ళల్లో-రప్పల్లో ఉంటానని
అన్నారు, కానీ నేను ఎలా వస్తాను అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు
రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దీనిని మనుష్యులెవ్వరూ నేర్పించలేరు. దేవతలు
సత్యయుగీ రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు? తప్పకుండా పురుషోత్తమ సంగమయుగములో రాజయోగము
నేర్చుకుని ఉంటారు. కనుక దీనిని స్మరణ చేసుకుంటూ పిల్లలైన మీకు ఇప్పుడు అపారమైన
సంతోషము ఉండాలి. మనము ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము. తండ్రి కల్ప-కల్పము
వస్తారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి స్వయముగా అంటారు. పూర్వము సత్యయుగ
రాకుమారునిగా ఉన్న శ్రీకృష్ణుడే మళ్ళీ 84 జన్మల చక్రములో తిరుగుతారు. మీరు
శివునికైతే 84 జన్మలని చెప్పరు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు.
మాయ చాలా కఠినమైనది, అది ఎవ్వరినీ విడిచిపెట్టదు. ఈ విషయము తండ్రికి బాగా తెలుసు.
అలాగని తండ్రి అంతర్యామి అని భావించకండి. కాదు, వారు అందరి నడవడిక ద్వారా
తెలుసుకుంటారు. మాయ పూర్తిగా పచ్చిగానే కడుపులో వేసేసుకుంటుందని సమాచారాలు వస్తాయి.
ఇటువంటి విషయాలెన్నో పిల్లలైన మీకు తెలియవు, తండ్రికైతే అన్నీ తెలుస్తాయి. కానీ
మనుష్యులు బాబా అంతర్యామి అని భావిస్తారు. తండ్రి అంటారు, నేను అంతర్యామిని కాను.
ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అంతా తెలుస్తుంది. చాలా ఛీ-ఛీ నడవడికను నడుస్తారు.
తండ్రి పిల్లలను అప్రమత్తము చేస్తున్నారు. మాయ నుండి సంభాళించుకోవాలి. మాయ
ఎటువంటిదంటే అది ఏదో ఒక రూపములో పూర్తిగా మింగేస్తుంది. ఆ తర్వాత తండ్రి అర్థం
చేయించినా బుద్ధిలో కూర్చోదు, అందుకే పిల్లలు చాలా అప్రమత్తముగా ఉండాలి. కామము
మహాశత్రువు. మేము వికారాలలోకి వెళ్ళాము అని కొందరికి తెలియను కూడా తెలియదు, ఇలా కూడా
జరుగుతుంది, అందుకే తండ్రి అంటారు - ఏదైనా పొరపాటు మొదలైనవి జరిగినట్లయితే సత్యముగా
చెప్పండి, దేనినీ దాచిపెట్టకండి. లేదంటే పాపం వంద రెట్లు పెరిగిపోతుంది, అది లోలోపల
తింటూ ఉంటుంది. పూర్తిగా పడిపోతారు. సత్యమైన తండ్రితో పూర్తిగా సత్యముగా ఉండాలి,
లేదంటే చాలా-చాలా నష్టము కలుగుతుంది. మాయ ఈ సమయములోనైతే చాలా కఠినముగా ఉంది. ఇది
రావణుడి ప్రపంచము. మనము ఈ పాత ప్రపంచాన్ని అసలు స్మృతి ఎందుకు చేయాలి! మనమైతే కొత్త
ప్రపంచాన్ని స్మృతి చేయాలి, అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాము. తండ్రి కొత్త ఇల్లును
నిర్మించేటప్పుడు, మా కోసం కొత్త ఇల్లు తయారవుతుందని పిల్లలు భావిస్తారు కదా, ఆ
సంతోషము ఉంటుంది. ఇదేమో అనంతమైన విషయము. మన కోసం కొత్త ప్రపంచమైన స్వర్గము
తయారవుతుంది. స్వర్గములో నివసించేందుకు తప్పకుండా ఇళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు మనము
కొత్త ప్రపంచములోకి వెళ్ళబోతున్నాము. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా
సుందరమైన పుష్పాలుగా అవుతారు. మనము వికారాలకు వశమై ముళ్ళలా అయిపోయాము. మాయ సగం
మందినైతే పూర్తిగా తినేస్తుందని బాబాకు తెలుసు. ఎవరైతే రారో వారు మాయకు
వశమైపోయినట్లే కదా అని మీరు కూడా అర్థం చేసుకుంటారు! తండ్రి వద్దకైతే రారు. ఈ
విధముగా మాయ చాలామందిని మింగేస్తుంది. మేము ఇలా చేస్తాము, ఇది చేస్తాము, మేము యజ్ఞము
కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాము అని చాలా మంచి-మంచి మాటలు చెప్తారు.
నేడు వారు లేరు. మీ యుద్ధము మాయతో. మాయతో యుద్ధము ఎలా జరుగుతుంది అనేది ప్రపంచములో
ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు,
దాని ద్వారా మీరు అంధకారము నుండి ప్రకాశములోకి వచ్చేసారు. ఆత్మకే ఈ జ్ఞాన నేత్రాన్ని
ఇస్తారు, అందుకే తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, అనంతమైన తండ్రిని
స్మృతి చేయండి. భక్తిలో మీరు స్మృతి చేసేవారు కదా. మీరు వస్తే మేము బలిహారమైపోతాము
అని అనేవారు కూడా. మరి ఎలా బలిహారమవుతారు! ఇది తెలియదు. ఏ విధముగా మనము ఆత్మలమో, అదే
విధముగా బాబా కూడా ఆత్మనేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రిది అలౌకిక
జన్మ. పిల్లలైన మిమ్మల్ని ఎంత బాగా చదివిస్తారు! ఎవరైతే కల్ప-కల్పము మాకు తండ్రిగా
అవుతారో, వీరు ఆ తండ్రేనని మీరు స్వయము అంటారు. మనము కూడా బాబా, బాబా అని అంటాము,
బాబా కూడా పిల్లలూ, పిల్లలూ అని అంటారు. వారే టీచర్ రూపములో రాజయోగాన్ని
నేర్పిస్తారు. ఇతరులెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. విశ్వానికి మిమ్మల్ని
యజమానులుగా తయారుచేస్తున్నారు కావున ఇటువంటి తండ్రికి చెందినవారిగా అయి ఆ టీచర్
యొక్క శిక్షణను కూడా తీసుకోవాలి కదా. సంతోషములో పులకరించిపోవాలి. ఒకవేళ ఛీ-ఛీగా
అయినట్లయితే ఇక మళ్ళీ ఆ సంతోషము రాదు. మీరు ఎంతగా తల బాదుకున్నా కానీ వారు మన జాతి
సోదరులు కానట్లే. ఇక్కడ మనుష్యులకు ఎన్ని ఇంటి పేర్లు ఉంటాయి. మీ ఇంటి పేరు చూడండి,
ఎంత పెద్దది! వీరు అందరికన్నా ఉన్నతమైన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మా.
వీరి గురించి ఎవరికీ తెలియనే తెలియదు. శివబాబానైతే సర్వవ్యాపి అనేసారు. బ్రహ్మా
గురించి కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మా-విష్ణు-శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి.
బ్రహ్మాను సూక్ష్మవతనములో చూపించారు. వారి జీవితచరిత్రను గురించి ఏమీ తెలియదు.
సూక్ష్మవతనములో బ్రహ్మాను చూపిస్తారు, మరి ప్రజాపిత బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు!
అక్కడ పిల్లలను దత్తత తీసుకుంటారా ఏమిటి! ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మా
అని అంటారు కానీ వారి జీవితచరిత్రను గురించి తెలియదు. ఇది నా రథమని బాబా అర్థం
చేయించారు. అనేక జన్మల అంతిమములో నేను ఈ ఆధారాన్ని తీసుకున్నాను. ఇది పురుషోత్తము
సంగమయుగము యొక్క గీతా అధ్యాయము. పవిత్రత కూడా ముఖ్యమైనది. పతితము నుండి పావనముగా ఎలా
అవ్వాలి అనేది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. దేహ సహితముగా అన్నింటినీ మర్చిపోండి,
ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే మాయ యొక్క పాప కర్మలన్నీ భస్మమైపోతాయి అని
సాధు-సన్యాసులు మొదలైనవారు ఎప్పుడూ ఈ విధముగా చెప్పరు. ఏ గురువు ఎప్పుడూ ఈ విధముగా
చెప్పలేరు.
వీరు బ్రహ్మాగా ఎలా అవుతారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. బాల్యములో వీరు ఒక
పల్లెటూరి బాలుడిగా ఉండేవారు. ప్రారంభము నుండి మొదలుకొని చివరి వరకు 84 జన్మలు
తీసుకున్నారు. కొత్త ప్రపంచమే మళ్ళీ పాతదిగా అవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి
తాళము తెరుచుకుంది. మీరు అర్థం చేసుకోగలరు, ధారణ చేయగలరు. ఇప్పుడు మీరు
వివేకవంతులుగా అయ్యారు. పూర్వము బుద్ధిహీనులుగా ఉండేవారు. ఈ లక్ష్మీ-నారాయణులు
వివేకవంతులు మరియు ఇక్కడ బుద్ధిహీనులు ఉన్నారు. ఎదురుగా చూడండి, వీరు స్వర్గానికి
యజమానులుగా ఉన్నారు కదా. శ్రీకృష్ణుడు స్వర్గానికి యజమానిగా ఉండేవారు, ఆ తర్వాత
పల్లెటూరి బాలుడిగా అయ్యారు. పిల్లలైన మీరు ఈ విషయాలను ధారణ చేసి ఆ తర్వాత
పవిత్రముగా కూడా తప్పకుండా అవ్వాలి. ముఖ్యమైనది పవిత్రత యొక్క విషయమే. బాబా, మాయ
మమ్మల్ని పడేసింది, కనులు వికారీగా అయిపోయాయని వ్రాస్తారు కూడా. తండ్రి అంటారు,
స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, తండ్రిని స్మృతి చేయాలి.
కొద్ది సమయము శరీర నిర్వహణ కోసం కర్మలు చేసి ఇక మనము వెళ్ళిపోతాము. ఈ పాత ప్రపంచ
వినాశనము కోసం యుద్ధము కూడా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు చూడండి.
మనము దేవతలుగా అవుతున్నాము కావున మనకు కొత్త ప్రపంచము కూడా కావాలి, అందుకే వినాశనము
తప్పకుండా జరుగుతుంది అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. మనము శ్రీమతము ఆధారముగా
మన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసుకుంటున్నాము.
తండ్రి అంటారు - నేను మీ సేవలో ఉపస్థితుడినవుతాను. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని
పావనముగా తయారుచేయండి అని మీరు డిమాండ్ చేసారు, కావున మీరు పిలవడముతో నేను వచ్చాను,
మీకు చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తాను. మన్మనాభవ. ఇది భగవానువాచ కదా. కేవలం
శ్రీకృష్ణుని పేరును వేసేసారు. తండ్రి తర్వాత శ్రీకృష్ణుడు. తండ్రి పరంధామానికి
యజమాని, శ్రీకృష్ణుడు విశ్వానికి యజమాని. సూక్ష్మవతనములోనైతే అసలు ఏమీ ఉండదు.
అందరిలోనూ నంబర్ వన్ అయినవారు శ్రీకృష్ణుడు, వారిని చాలా ప్రేమిస్తారు.
మిగిలినవారంతా వెనుక వచ్చినవారే. స్వర్గములోకైతే అందరూ వెళ్ళలేరు. అందుకే మధురాతి
మధురమైన పిల్లలకు అపారమైన సంతోషము ఉండాలి. కృత్రిమమైన సంతోషము నడవదు. బయటి నుండి
రకరకాల పిల్లలు బాబా వద్దకు వచ్చేవారు, కొందరు పవిత్రముగా ఉండేవారు కాదు.
వికారాలలోకి వెళ్తున్నప్పుడు మరి నీవు అసలు ఇక్కడకు ఎందుకు వస్తున్నావు అని బాబా
అర్థం చేయించేవారు, అప్పుడు వారు - ఏమి చేయను, రాకుండా ఉండలేను, నేను రోజు వస్తాను,
ఎప్పుడు ఏ బాణము తగులుతుందో తెలియదు, మీరు తప్ప ఇంకెవరు సద్గతినిస్తారు. ఇలా అంటూ
వచ్చి కూర్చుండిపోయేవారు. మాయ చాలా శక్తివంతమైనది. బాబా మమ్మల్ని పతితము నుండి
పావనముగా, పుష్పాలుగా తయారుచేస్తున్నారని నిశ్చయము కూడా ఉంటుంది. కానీ ఏమి చేయాలి,
ఎంతైనా సత్యమైతే చెప్పేవాడు కదా - ఇప్పుడు తప్పకుండా అతను బాగుపడి ఉంటాడు. వీరి
ద్వారానే నేను బాగుపడతాను అని అతనికి నిశ్చయముండేది.
ఈ సమయములో ఎంతమంది పాత్రధారులు ఉన్నారు. ఒకరి ముఖకవళికలు మరొకరితో కలవవు. మళ్ళీ
కల్పము తర్వాత అవే ముఖకవళికలతో పాత్రను రిపీట్ చేస్తారు. ఆత్మలందరూ అయితే ఫిక్స్ కదా.
పాత్రధారులందరూ పూర్తిగా ఏక్యురేట్ పాత్రను అభినయిస్తూ ఉంటారు. కొద్దిగా కూడా తేడా
ఉండదు. ఆత్మలందరూ అవినాశీ. వారిలో పాత్ర కూడా అవినాశీగా నిశ్చితమై ఉంది. ఇవి ఎంతగా
అర్థం చేయించవలసిన విషయాలు. ఎంతగా అర్థం చేయిస్తారు, అయినా కూడా మర్చిపోతారు. అర్థం
చేయించలేరు. ఇది కూడా డ్రామాలో జరగవలసి ఉంది. ప్రతి కల్పము రాజ్యమైతే తప్పకుండా
స్థాపన అవుతుంది. సత్యయుగములోకి కొద్దిమంది మాత్రమే వస్తారు - అది కూడా నంబరువారుగా.
ఇక్కడ కూడా నంబరువారుగా ఉన్నారు కదా. ఎవరి పాత్ర గురించి ఎవరికి వారికే తెలుస్తుంది,
ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.