‘‘మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న స్వమానము యొక్క
సీటుపై ఉంటూ, పరస్పరము ఒకరికొకరు ఉల్లాస-ఉత్సాహాలను ఇచ్చుకుంటూ,
సహయోగులుగా అయ్యి వ్యర్థ సంకల్పాలనే జిల్లేడు పుష్పాలను
అర్పించి నంబరువన్ యొక్క బహుమతిని తీసుకోండి’’
ఈ రోజు మీరందరూ మరియు మీతో పాటు నలువైపులా ఉన్న పిల్లలందరూ
అమృతవేళ నుండి తమ ప్రేమ మరియు సంతోషముతో కూడిన ఎంతో
స్నేహభరితమైన అభినందనలను తెలియజేస్తున్నారు. అలాగే బాబా కూడా
చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలైన మీ అందరికీ ఈ జయంతికి
సంబంధించిన అభినందనలను ఇవ్వడానికి వచ్చారు. ఒక్కొక్క బిడ్డ
బాబాకు అతి ప్రియమైనవారు, మనసుకు ఇష్టమైనవారు. బాప్ దాదా తమ
బాహువుల మాలతో మీ అందరికీ అభినందనలను తెలియజేస్తున్నారు.
బాప్ దాదా ఏమి చూస్తున్నారంటే, మీరైతే ఎదురుగా ఉండి
అభినందనలను ఇస్తున్నారు కూడా మరియు తీసుకుంటున్నారు కూడా.
అంతేకాక నలువైపులా ఉన్న అనేక స్థానాలలోని మిగిలిన పిల్లలు కూడా
అభినందనలను తెలియజేస్తున్నారు. బాబా కూడా దేశ విదేశాలలో ఉన్న,
అన్ని వైపులా ఉన్న పిల్లలకు అతి స్నేహపూర్వకమైన అభినందనలను
తెలియజేస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు, ప్రతి బిడ్డ తమ
సంతోషకరమైన ముఖముతో ప్రేమ సాగరునిలో తేలియాడుతూ ఉన్నారు. బాబా
ఒంటరిగా రారు, పిల్లలతోపాటే వస్తారు అన్నందుకు బాబాకు సంతోషముగా
ఉంది, ఎందుకంటే బాబా వచ్చేది యజ్ఞాన్ని రచించడము కోసమే. మరి
యజ్ఞములో ఎవరు ఉంటారు? బ్రాహ్మణులు. అందుకే బాబా ఒంటరిగా రారు,
పిల్లలతో పాటు కలిసి వస్తారు ఎందుకంటే ఈ జయంతియే అన్ని
జయంతులలోకల్లా అద్భుతమైన జయంతి. పూర్తి కల్పములో ఈ ఒక్క
జయంతిలోనే తండ్రి మరియు పిల్లల జన్మ కలిసి జరుగుతుంది. అందుకే
ఈ జయంతిని వజ్రతుల్యమైన జయంతి అని అనడము జరుగుతుంది. బాబా కూడా
విశేషముగా ఆది రత్నాలైన పిల్లలకు అభినందనలు తెలియజేస్తున్నారు.
మరి మీరందరూ ఈ రోజు అభినందనలను తెలపడానికి వచ్చారా లేక
అభినందనలు తీసుకోవడానికి కూడా వచ్చారా! కలిసి ఉంటాము, కలిసి
ఎగురుతాము, కలిసి వస్తాము అనే బాబా అంటారు మరియు బ్రహ్మాబాబాతో
కలిసి రాజ్యము చేస్తాము. కలిసి ఉంటాము అన్న ప్రతిజ్ఞ ఉంది కదా.
మీరు కూడా ఏమంటారు? మేము కూడా ఎక్కడ బాబా ఉంటే అక్కడ కలిసి
ఉంటాము అని అంటారు కదా. ఇదే బాబా పిల్లలకు, పిల్లలు బాబాకు చేసే
ప్రతిజ్ఞ. శరీరము ద్వారా ఎక్కడ ఉన్నా కానీ హృదయములో సదా బాబా
తోడుగా ఉన్నారు, అందుకే బాబాను దిలారామ్ (హృదయాభిరాముడు) అని
అంటారు. ఇక్కడ స్మృతిచిహ్నముగా కూడా దిల్వాలా (దిల్వాడా)
మందిరము ఉంది. మరి అందరి హృదయాలలో, అందరికీ తోడుగా
హృదయాభిరాముడు ఉన్నారు కదా! బాబా సదా పిల్లలకు ఏం చెప్తూ
ఉంటారంటే - ఎప్పుడూ కూడా ఒంటరిగా అవ్వకండి. సదా కలిసి ఉంటాము,
కలిసి ఉండాల్సిందే. ఒంటరిగా ఉంటే మాయ తన అవకాశాన్ని
తీసుకుంటుంది మరియు కలిసి ఉంటే స్వయముగా లైట్ హౌస్ తోడుగా
ఉంటారు, వారి ఎదురుగా మాయ దూరము నుండే పారిపోతుంది, దగ్గరకు
కూడా రాలేదు. అందుకే పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో కలిసి
ఉంటాము అన్నది ప్రతిజ్ఞ. మీ అందరి ప్రతిజ్ఞ కూడా ఉంది కదా!
కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము. కలిసి ఉండటము మంచిగా అనిపిస్తుంది
కదా. మంచిది, చేతులెత్తండి.
బాప్ దాదా ఏమి చూసారంటే, ప్రతి బిడ్డ అమృతవేళ బాబాతో ఎంతో
మనసులోని విషయాలను మాట్లాడుతారు. మామూలుగా అయితే సమయము లభించదు
కానీ అమృతవేళ ప్రతి ఒక్కరూ ఎంతో మధురాతి మధురమైన మనసులోని
విషయాలను మాట్లాడుతారు. బాబా కూడా ప్రతి బిడ్డ యొక్క మనసులోని
విషయాలను విని అన్ని విషయాలకు జవాబు కూడా ఇస్తారు. అందరికీ
ఒక్క విషయములో చాలా సంతోషముగా ఉంది, అదేమిటంటే - మేము
మనస్ఫూర్తిగా నా బాబా అని అంటాము, అప్పుడు బాబా హాజరైపోతారు అని.
స్వామి హాజరైపోతారు. ఇందులో కేవలం మనస్ఫూర్తిగా అనడము కావాలి,
మరింకేదీ చేయవలసిన అవసరము లేదు. మనస్ఫూర్తిగా నా బాబా అన్నారంటే
వెంటనే స్వామి హాజరైపోతారు.
ఈ రోజు బాప్ దాదా చెవులలో నలువైపుల నుండి ఒక మధురమైన పాట
వినిపిస్తుంది. అది ఏ పాట? నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన
బాబా. బాప్ దాదా కూడా పిల్లల స్నేహములో మునిగి ఉండేవారు, మునిగి
ఉన్నారు. ఇప్పుడు బాప్ దాదా మీ స్నేహము యొక్క దివ్య
కర్తవ్యాన్ని చూసి ఏమంటారంటే, మీ భక్తులు కూడా తక్కువ బుద్ధి
కలవారు కాదు. వారు కూడా మీ స్మృతిచిహ్నాన్ని బాగా కాపీ చేసారు.
మీ భక్తులు ద్వాపరములో వచ్చారు, వారి మొట్టమొదటి జన్మ ఎలాగూ
సతోప్రధానముగా ఉంటుంది ఎందుకంటే పరంధామము నుండి ఆత్మ వస్తుంది.
కావున ఈ రోజు భక్తుల వైపు కూడా దృష్టి వెళ్ళింది. కాపీ
చెయ్యటాన్ని చాలా యుక్తాయుక్తముగా చేసారు ఎందుకంటే
ప్రారంభములోని మీ విశేష భక్తులు మీ ప్రాక్టికల్ కర్మ ఎలా ఉండేదో,
అలాగే వారు కూడా స్మృతిచిహ్నాన్ని చాలా మంచిగా తయారుచేసారు,
కాకపోతే మీది ప్రాక్టికల్, వారిది స్మృతిచిహ్నము. ఎలాగైతే మీరు
వ్రతము తీసుకున్నారు కదా, ఏ వ్రతాన్ని తీసుకున్నారు? పవిత్రత
యొక్క వ్రతము. అలాగే వారు కూడా వ్రతము తీసుకుంటారు. వ్రతాన్ని
కాపీ చేసారు కానీ మీరు వ్రతాన్ని ఒక్క జన్మ తీసుకుంటే అనేక
జన్మలు ఆ వ్రతము కొనసాగుతుంది. వారు ఒక్క రోజు కోసం పవిత్రముగా
కూడా ఉంటారు మరియు ఆహార-పానీయాలను కూడా శుద్ధముగా ఉంచుకుంటారు.
మీది 21 జన్మల వ్రతము, వారిది అల్పకాలికమైనది. అలాగే జాగరణ,
మీరు వెలుతురులోకి వచ్చినప్పుడు పూర్తి విశ్వములో ఉన్న
అంధకారాన్ని తొలగించారు. అర్ధకల్పము ఇక అంధకారము రాలేదు.
మనసులోని అంధకారాన్ని తొలగించారు మరియు బయట ప్రకృతిలోని దుఃఖపు
అంధకారాన్ని కూడా తొలగించారు. వారు ఇది కూడా కాపీ చేసారు,
అందుకే జాగరణ చేస్తారు. మరో విషయము ఏమిటంటే, మీరు బాబాపై
బలిహారమయ్యారు, బలి అయ్యారు, పూర్తిగా సమర్పణ అయ్యారు. వారు
కూడా దీనిని కాపీ చేసారు కానీ వారు తమను తాము బలి చేసుకోవడము
లేదు, తమను తాము బలి ఇవ్వడము లేదు, దేనిని బలి ఇస్తారు? తెలుసు
కదా! మేకను బలి ఇస్తారు. మేకనే ఎందుకు ఎంచుకున్నారు, మరోదానిని
ఎందుకు ఎంచుకోలేదు? అందరూ నవ్వుతున్నారు, మీకు తెలుసు కదా! నేను
అన్నదానిని వదిలి నిమిత్త భావాన్ని ధారణ చేయండి అని బాబా
పదే-పదే ఏదైతే పిల్లలకు సూచనను ఇస్తూ ఉన్నారో, దానికి వారు
మేకను ఎంచుకున్నారు, ఎందుకంటే అది కూడా మే, మే (నేను, నేను) అని
అంటుంది. భక్తుల బుద్ధి అద్భుతముగా ఉంది కదా! మీ భక్తులు కదా!
బాబాకు మరియు మీకు భక్తులు. అందుకే బాబా మీ భక్తులకు కూడా,
ఎవరైతే సత్యమైన మనసుతో భక్తి చేస్తారో, వారికి ఏదో ఒక భక్తి
ఫలాన్ని ఇస్తారు. భక్తులు కూడా సదా సత్యముగా మరియు సాత్వికముగా
ఉంటారు, సంతోషముగా ఉంటారు. దుఃఖములో దుఃఖితులవ్వరు ఎందుకంటే
భక్తిని సత్యమైన హృదయముతో చేస్తారు. బాబా కూడా ఈ మధ్య కాలములో
పిల్లలైన మీకు ఇదే సూచనను ఇస్తున్నారు - నేను అన్నదానిని
తీసుకురాకండి. నేను ఏమి చెప్తానో అదే జరగాలి, నేనే కరక్టుగా
చెప్తాను, అదే జరగాలి... ఈ నేను, నేను అన్నది - ఒకటేమో
సాధారణముగా ఉంటుంది, ఉదాహరణకు, నేను శరీరధారిని, దేహధారిని...
ఇది సాధారణమైన నేను. రెండవది, సూక్ష్మమైన నేను. అందులో బాబా
ఇచ్చినవాటిని కూడా - నేను చేసాను, నేను మాట్లాడాను, నేను
చేస్తున్నాను అంటారు, బాబా ఇచ్చిన విశేషతలలో కూడా నేను అనే
భావన వచ్చేస్తుంది. జ్ఞానము యొక్క అవగాహన, విశేషతల యొక్క
అవగాహన, వాటిలో కూడా సూక్ష్మమైన నేను అనే భావన వచ్చేస్తుంది.
అందుకే బాబా సూచనను ఇస్తూ ఉంటారు - నేను మరియు నాది, సదా నా
బాబా, అన్నదాని వైపుకే హృదయము యొక్క ఆకర్షణ ఉండాలి. హద్దులోని
నాది, నా పేరు, నా ప్రతిష్ఠ, దీనిని సమాప్తము చేసి నేను బాబా
వాడిని, బాబా నా వారు అని అనుకుంటే ఎంత సంతోషము కలుగుతుంది!
భగవంతుడు నా వారు అయ్యారు, ఇంకేమి కావాలి! కనుక ఒకటేమో సాధారణ
నాది, ఇంకొకటి సూక్ష్మమైన నాది. ఈ సూక్ష్మమైన నాది అన్నది
మురికిగా చేసేస్తుంది మరియు నా బాబా అన్నది సంపన్నముగా
చేస్తుంది.
మరి ఈ రోజు జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. మీ
జన్మదినాన్ని కూడా జరుపుకోవడానికి వచ్చారు కదా! పిల్లలు లేనిదే
బాబా ఏమీ చెయ్యరు, అందుకే ఈ రోజు బాబా పిల్లల జన్మ ఉత్సవానికి
అభినందనలను తెలియజేయడానికి వచ్చారు. వాహ్ నా పిల్లలు వాహ్!
ఇప్పుడు ఒక విషయము చెప్పమంటారా, సిద్ధముగా ఉన్నారా! చెప్పమంటారా?
మరి చెయ్యవలసి ఉంటుంది. చేతులెత్తండి, చేస్తారా? డబల్
విదేశీయులు చేస్తారా? టీచర్లు చేస్తారా? అచ్ఛా. మరి ఈ రోజు బాప్
దాదా ఎలా అయితే స్మృతిచిహ్నములో, శివ పరమాత్ముని
స్మృతిచిహ్నముపై జిల్లేడు పుష్పాలను వేస్తారో, గులాబీ పుష్పాలను
వేయరో, మరే ఇతర పుష్పాలను వేయరు, జిల్లేడు పుష్పాలను వేస్తారు.
అలా ఈ రోజు బాప్ దాదా మీరు ఏ విషయాన్ని అర్పించాలో, ఆ హోమ్
వర్కును ఇవ్వాలని కోరుకుంటున్నారు. సిద్ధముగా ఉన్నారు కదా!
అచ్ఛా.
పిల్లలందరూ హా జీ (సరేనండి) అనడము బాబాకు చాలా మంచిగా
అనిపిస్తుంది. మరి ఈ రోజు జన్మదినము నాడు బాబా సంకల్పము ఏమిటంటే
- అందరూ పరస్పరము ఒకరికొకరు ఉల్లాస-ఉత్సాహాలను ఇచ్చుకుంటూ,
ఒకరికొకరు సహయోగులుగా అవుతూ, వ్యర్థ సంకల్పాలనే జిల్లేడు
పుష్పాలను అర్పించండి. వ్యర్థ సంకల్పాలు చేయకూడదు, వినకూడదు
మరియు సాంగత్యములోకి వచ్చి వ్యర్థ సంకల్పాల సాంగత్యపు రంగును
అంటించుకోకూడదు, ఎందుకంటే ఎక్కడైతే వ్యర్థ సంకల్పాలు ఉంటాయో,
అక్కడ స్మృతి యొక్క సంకల్పాలు, జ్ఞానము యొక్క మధురమైన మాటలు,
దేనినైతే మురళి అని అంటామో, ఆ శుద్ధ సంకల్పాలు స్మృతిలో ఉండవు.
మురళి విన్నప్పటికీ, చదువుకున్నప్పటికీ, అదైతే అవసరము, అది
బ్రాహ్మణుల నియమము, కానీ అది వినడము వరకే ఉండిపోతుంది, మనసులో
మననము జరగదు. ఆలోచిస్తారు, ఈ రోజు మురళీ చాలా బాగుంది అని
అంటారు, ఏముందో ఆలోచిస్తున్నాను అని అంటారు. వరదానము కూడా చాలా
బాగుంది, కానీ గుర్తు తెచ్చుకుంటున్నాను అని అంటారు. వ్యర్థ
సంకల్పాలు మనసు, బుద్ధిని తమ వైపుకు ఆకర్షిస్తాయి. బాబా ఎదురుగా
ఏమంటారో మీకు తెలుసా? బాబా, ఉత్సుకత కల సమాచారాన్ని అయితే
వినాలి కదా, నాలెడ్జ్ ఫుల్ గా అవ్వాలి కదా అని అంటారు. కానీ
వ్యర్థ విషయాలు పదవిని ప్రాప్తి చేసుకోవడములో నష్టము
కలిగిస్తాయి. మరి మీరందరూ వ్యర్థ సంకల్పాల గురించి బాబాకు
ప్రతిజ్ఞ చేస్తారా? మేము కోరుకోము కానీ అవే వచ్చేస్తూ ఉంటాయి
అని మీరంటారు. కోరుకోవడము లేదు, కానీ వచ్చేస్తున్నాయి అని
అంటారు. బాబాకు దృఢ సంకల్పముతో ఇవ్వడము ద్వారా, ఇంతకీ అసలు
ఇవ్వడము వచ్చా? బాబాకు ఇచ్చేసారు. ఇచ్చిన వస్తువు ఒకవేళ మీ
వద్దకు తిరిగి వచ్చినా కానీ ఆ ఇచ్చిన వస్తువును మీ వద్ద
పెట్టుకుంటారా లేక తిరిగి ఇచ్చేస్తారా? ఒకవేళ ఇచ్చేసిన
వస్తువును మళ్ళీ మీ వద్ద పెట్టుకుంటే మీ టైటిల్ ఏమవుతుంది?
కావున బాబాకు ఒక్కసారి మీరు ఇష్టముతో, దృఢత్వముతో ఇచ్చేయండి, ఆ
తర్వాత చెక్ చేసుకోండి, ఇచ్చేసిన వస్తువు పదే-పదే నా వద్దకు
రాలేదు కదా. ఇతరుల వస్తువును తమదిగా చేసుకోవడమంటే, అది మంచిది
కాదు. మరి రోజూ విశ్రాంతి తీసుకునే ముందు, విశ్రాంతి తర్వాత
తీసుకోండి కానీ ముందు చెక్ చేసుకోండి - ఈ రోజు రోజంతటిలో
ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రాలేదు కదా? చేయలేదు కదా? ఇచ్చేసిన
వస్తువును తిరిగి తీసుకోలేదు కదా?
మరి ఈ రోజు పుట్టినరోజు కానుకను ఇచ్చే ధైర్యముంది కదా! ఉందా
ధైర్యము? చేతులెత్తండి, ధైర్యముందా? ఎక్కడైతే ధైర్యము ఉంటుందో,
అక్కడ బాప్ దాదా కూడా మీకు కానుకను ఇస్తారు. మీరు మనస్ఫూర్తిగా
అనండి - నా బాబా, దయాళు కృపాళు బాబా, ఇది మీరు తీసేసుకోండి.
ఒకవేళ మనస్ఫూర్తిగా అన్నట్లయితే బాబా ఎక్స్ ట్రా కానుకను
ఇస్తారు. ఎందుకంటే ధైర్యము మీది, ఎక్స్ ట్రా సహాయము బాబా
ఇస్తారు. ఎక్కడైతే ధైర్యము ఉంటుందో, అక్కడ బాబా సహాయము
తప్పకుండా ఉంటుంది, ఇదైతే అనుభవము చేసారు కదా. ఎందుకంటే బాప్
దాదా ఎంతోకాలం నుండి ఈ సూచనను ఇస్తున్నారు - ఇప్పుడు తీవ్ర
పురుషార్థానికి మార్గము ఏమిటంటే - మూడు బిందువులను పెట్టడము.
నేను బిందువును, బిందువైన బాబాను గుర్తు చెయ్యటము మరియు
గడిచినదానికి బిందువు పెట్టడము, ఫుల్ స్టాప్ బిందువు, దీనినే
బాప్ దాదా మననము చేయమని చెప్తున్నారు, బిందువుగా అవ్వాలి,
బిందువును చూడాలి మరియు బిందువును పెట్టాలి. అందుకే బిందువుకు
ఎంతో మహత్వము ఉంది. ఈ కాలంలో కూడా బిందువుకు మహత్వము ఉంది.
చూడండి, డబ్బులు లెక్కపెడతారు కదా. ఈ రోజుల్లో అందరికీ
అన్నిటికన్నా ఎక్కువ ప్రేమ దేనిపై ఉంది? డబ్బులపై. మరి డబ్బులు
ఎలా పెరుగుతాయి? బిందువు పెట్టుకుంటూ వెళ్ళండి. 10 తర్వాత
బిందువు పెడితే 100 అవుతుంది. మరో బిందువు పెడితే 1000 అవుతుంది.
కావున బిందువుకు మహత్వము ఉంది. కానీ అసలైన బిందువు ఏది అనేది
మర్చిపోయారు. మరి ఈ రోజు బాబాకు జన్మదిన కానుకను ఇచ్చారా?
ఇచ్చారా? మనస్ఫూర్తిగా ఇచ్చారా? ఎందుకు, ఏమిటి అని అనరు కదా?
ఎలా చేయను, ఏం చేయను... (కైసే కరూ, క్యా కరూ) ఈ కై, కై భాష
మంచిది కాదు. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు ఏమిటి (క్యోం,
క్యా), ఇలా కై కై అని అనకండి. మరి కానుకను ఇవ్వడానికి సంతోషముగా
చేతులెత్తారా లేక సంగఠనలో తప్పదని ఎత్తారా? ఎందుకంటే తప్పదు కదా
అని ఎత్తేవారిది సదా ఉండదు, అప్పుడప్పుడూ ఉంటుంది. మనస్ఫూర్తిగా
చేసేవారు చేయవలసిందే, అవ్వవలసిందే అని అంటారు. కానుకను
ఇచ్చేసారా, ఇవ్వాల్సిందే. ఇలా సంతోషముగా సంకల్పము చేసినట్లయితే
సర్వశక్తివంతుడైన బాబా పిల్లలైన మాస్టర్ సర్వశక్తివంతులైన మీకు
ఇదేమంత పెద్ద విషయము! సీటుపై ఉండండి, మాస్టర్ సర్వశక్తివంతుని
సీటుపై సదా సెట్ అయ్యి ఉండండి. మర్చిపోవద్దు. ఇది స్వమానము కదా.
తమ స్వమానాన్ని వదలడము జరగదు. స్వమానము కోసం గొడవపడుతూ ఉంటారు.
ఈ రోజు బాబాకు ఈ విషయములో ప్రేమ కలుగుతుంది, చిన్న విషయాలలో తమ
స్వమానాన్ని, పరమాత్మ ద్వారా లభించిన స్వమానాన్ని
పోగొట్టుకోవద్దు. మనుష్యుల ద్వారా లభించే స్వమానానికే ఎంతో
నషాతో ఉంటారు! ఇది పరమాత్మ ద్వారా లభించిన స్వమానము - మాస్టర్
సర్వశక్తివాన్. ఏది కావాలంటే అది చెయ్యగలరు. ఉంది కదా ధైర్యము?
తల ఊపండి. చేయి ఊపకండి, తల ఊపండి. ధైర్యముందా? టీచర్లు. మీరు
చేయించవలసి ఉంటుంది, అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు చేయాలి,
అటెన్షన్ ఇప్పించి చేయించవలసి కూడా ఉంటుంది. మీరు నిమిత్తముగా
ఉన్నారు కదా. అప్పుడు చూద్దాము, ఏ క్లాసు, ఎవరి క్లాసు నంబరు
తీసుకుంటుందో! అప్పుడు మంచి బహుమతిని ఇస్తాము. ఏ బహుమతిని
ఇస్తామన్నది చెప్పము. మంచి బహుమతిని ఇస్తాము. పూర్తి క్లాసు
ప్రయత్నించాలి. ఒక్కరు చేస్తే సరిపోదు, అలా కాదు, మెజారిటీ
చేయాలి.
ఈ రోజు బాప్ దాదాకు ఒక్కొక్క బిడ్డ పట్ల ప్రేమ కలుగుతుంది,
పిల్లలు నంబరు వన్ లోకి రావాలి. టూ (రెండు) లో కూడా కాదు. మొదటి
రాజ్య సింహాసనముపైనైతే కూర్చోరు, సింహాసనముపైనైతే ఇద్దరే
కూర్చుంటారు కదా. కానీ మొదటి రాజధానిలోకి, మొదటి రాజ్య వంశము
యొక్క సంబంధములోకి రావాలి. రెండవ నంబరుగా అయితే అయ్యారు కానీ
రాజ్యము చేయాలి, రాజ్యాధికారులుగా అవ్వాలంటే ముందు రాజ్యములోకి
రావాలి. బాప్ దాదాకు పిల్లల పట్ల ఇదే ప్రేమ ఉంది - ఒక్కొక్క
బిడ్డ ఏదో ఒక విశేషతలో నంబర్ వన్ లోకి రావాలి. నంబరువారుగా కాదు,
నంబర్ వన్ లోకి రావాలి. ఉల్లాసము ఉందా? నంబర్ వన్ లోకి రావాలా
లేక ఏది లభించినా మంచిదే అని అనుకుంటున్నారా? మంచిది, మంచిది
అని అనకండి. ఒక్కొక్క బిడ్డ ఏదో ఒక అద్భుతములో నంబర్ వన్ రావాలి
అన్నది బాబా ఆశ. నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి, ఏదో ఒక
సబ్జెక్టులో నంబర్ వన్ అవ్వాల్సిందే. అవ్వాల్సిందే, దీనిని
అండర్ లైన్ చేయండి. ఎక్కువ కష్టమేమీ ఇవ్వడము లేదు. ఏదో ఒక
సబ్జెక్టులో నంబరువన్ అవ్వాలి. ఇదైతే సహజమే కదా. ఇకపోతే ఈ రోజు
అమృతవేళ, ఏయే పిల్లలైతే మిలనము జరుపుకున్నారో, వారు చాలా
సంతోషముగా, సంతోషముతో నవ్వుతూ, సంతోషముగా ఉన్న ముఖముతో
కనిపించారు. బాబా కూడా ప్రతి బిడ్డకు సదా ఎగిరే కళ యొక్క
వరదానాన్ని ఇచ్చారు. నడిచే కళ కాదు, ఎగిరే కళ. మరి బాప్ దాదా ఈ
రోజు ఇస్తున్న ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి. బాప్ దాదా తమ జయంతి
మరియు పిల్లల జయంతి సందర్భముగా ఏ వరదానాన్ని ఇచ్చారు? ఎగిరే కళ
భవ. మీరు కూడా రోజంతా శివరాత్రి ఉత్సవాన్ని మనసులో
జరుపుకున్నారు కదా. మరి అందరూ మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు,
చాలా-చాలా మంచి రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ
మంచిగా ఉన్నారు కదా! బాబా అయితే అంతా మంచినే చూస్తారు. అచ్ఛా!
నలువైపులా సమ్ముఖములో కూర్చుని ఉన్నవారైనా, తమ-తమ స్థానాలలో
కూర్చుని మిలనాన్ని జరుపుకుంటున్నవారైనా, అందరినీ చూసి బాప్
దాదా కూడా హర్షిస్తున్నారు. పిల్లలు కూడా బాబా మిలనాన్ని చూసి
సంతోషిస్తున్నారు. కానీ ఈ నాటి సంకల్పాన్ని గుర్తుంచుకోండి -
సదా సంతోషము. అప్పుడప్పుడూ కాదు, సదా సంతోషము. మిమ్మల్ని ఎవరు
చూసినా సరే, మీ ముఖాన్ని చూసి, వీరు చాలా భాగ్యశాలి ఆత్మగా
కనిపిస్తున్నారని అనుకోవాలి. మీ భాగ్యము ముఖము మరియు నడవడికతో
కనిపించాలి. కేవలం మనసులో చాలా ఉంది అంటే కాదు. అలా కాదు. మీ
భాగ్యశాలి ముఖము, సంతోషకర ముఖము ఇతరులకు పరిచయాన్ని ఇస్తుంది.
ఏదో ఉంది అని ముఖము చెప్తుంది. మీ ముఖము సేవ చేయాలి. బాబా వరకు
తీసుకురావాలి. సంతోషముగా ఉండటము, ఇది కూడా సేవా సాధనమే. మరి
నలువైపులా ఉన్న పిల్లలకు, మీకు కూడా జన్మదినము యొక్క పదమాల
రెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా!