09-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీపైన మీరే కృప చూపించుకోవాలి,
చదువులో వేగముగా ముందుకు వెళ్ళండి, ఏ విధమైన వికర్మను చేసి మీ రిజిస్టరును పాడు
చేసుకోకండి’’
ప్రశ్న:-
ఈ
ఉన్నతమైన చదువులో పాస్ అయ్యేందుకు ఏ ముఖ్యమైన శిక్షణ లభిస్తుంది? దాని కోసము ఏ
విశేషమైన అటెన్షన్ కావాలి?
జవాబు:-
ఈ చదువులో పాస్
అవ్వాలంటే కళ్ళు చాలా-చాలా పవిత్రముగా ఉండాలి ఎందుకంటే ఈ కళ్ళే మోసము చేస్తాయి, ఇవే
అశుద్ధముగా అవుతాయి. శరీరాన్ని చూడడముతోనే కర్మేంద్రియాలలో చంచలత్వము వస్తుంది,
అందుకే కళ్ళు ఎప్పుడూ అశుద్ధముగా ఉండకూడదు. పవిత్రముగా అయ్యేందుకు సోదరీ-సోదరులుగా
అయి ఉండండి, స్మృతియాత్రపై పూర్తి అటెన్షన్ ఇవ్వండి.
పాట:-
ఓర్పు వహించు
మానవా...
ఓంశాంతి
ఇలా ఎవరు చెప్తున్నారు? అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలతో చెప్తున్నారు. ఎప్పుడైనా
మనుష్యులు ఎవరైనా అనారోగ్యముతో ఉంటే, వారికి - కాస్త ఓర్పు వహించు, నీ దుఃఖాలన్నీ
దూరమైపోతాయి అని ఓదార్పును ఇవ్వడం జరుగుతుంది. వారిని సంతోషములోకి తీసుకువచ్చేందుకు
ఓదార్పును ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ హద్దులోని విషయాలు. ఇది అనంతమైన విషయము.
వీరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు. అందరినీ దుఃఖము నుండి విడిపించాలి. ఇది కూడా
పిల్లలైన మీకే తెలుసు. మీరు మర్చిపోకూడదు. తండ్రి సర్వులకు సద్గతిని ఇచ్చేందుకు
వచ్చారు. వారు సర్వులకు సద్గతిని ఇస్తారు అనగా దీని అర్థము అందరూ దుర్గతిలో ఉన్నారనే
కదా. మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులందరూ, అందులోనూ విశేషముగా భారత్ వారు,
అంతేకాక మిగతా ప్రపంచములోని వారు దుర్గతిలో ఉన్నారు. విశేషముగా మీరు సుఖధామములోకి
వెళ్తారు. మిగిలినవారంతా శాంతిధామములోకి వెళ్తారు. తప్పకుండా మేము సుఖధామములో
ఉన్నప్పుడు మిగిలిన ధర్మాలవారందరూ శాంతిధామములో ఉండేవారు అని మీ బుద్ధిలోకి వస్తుంది.
బాబా వచ్చారు, భారత్ ను సుఖధామముగా తయారుచేసారు. కావున ప్రచారము కూడా ఈ విధంగా
చేయాలి. ప్రతి 5000 సం.ల తరువాత నిరాకారుడైన శివబాబా వస్తారని అర్థం చేయించాలి. వారు
అందరికీ తండ్రి. మిగిలినవారందరూ సోదరులు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు
సోదరులే పురుషార్థము చేస్తారు. అంతేకానీ తండ్రులు పురుషార్థము చేస్తారని కాదు. అందరూ
తండ్రులే అయితే ఇక వారసత్వము ఎవరి నుండి తీసుకుంటారు. సోదరుల నుండి తీసుకుంటారా? అది
సాధ్యము కాదు. ఇది చాలా సహజమైన విషయమని ఇప్పుడు మీరు భావిస్తారు. సత్యయుగములో ఒకే
ఒక్క దేవీ-దేవతా ధర్మము ఉంటుంది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములోకి వెళ్ళిపోతాయి.
ప్రపంచ చరిత్ర మరియు భూగోళికము రిపీట్ అవుతుంది అని అంటున్నారంటే, మరి తప్పకుండా
చరిత్ర మరియు భూగోళికము ఒక్కటే ఉంటుంది, అదే రిపీట్ అవుతుందని అర్థము. కలియుగము
తరువాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. ఈ రెండింటికీ మధ్యలో సంగమయుగము కూడా తప్పకుండా
ఉంటుంది. దీనిని సుప్రీమ్ పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని అంటారు. ఇప్పుడు మీ
బుద్ధి తాళము తెరుచుకుంది కావున ఇది చాలా సహజమైన విషయము అని భావిస్తారు. కొత్త
ప్రపంచము మరియు పాత ప్రపంచము. పాత వృక్షములో తప్పకుండా చాలా ఆకులు ఉంటాయి. కొత్త
వృక్షములో కొన్ని ఆకులే ఉంటాయి. అది సతోప్రధానమైన ప్రపంచము, దీనిని తమోప్రధానము అని
అంటారు. మీ బుద్ధి తాళము కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెరుచుకుంది ఎందుకంటే
అందరూ యథార్థ రీతిలో తండ్రిని స్మృతి చేయరు కావున ధారణ కూడా జరగదు. తండ్రి అయితే
పురుషార్థము చేయిస్తారు, కానీ భాగ్యములో లేదు. డ్రామానుసారముగా ఎవరైతే బాగా
చదువుకుంటారో మరియు చదివిస్తారో, తండ్రికి సహాయకులుగా అవుతారో, ఎట్టి పరిస్థితిలోనూ
ఉన్నత పదవిని వారే పొందుతారు. తాము ఎన్ని మార్కులతో పాస్ అవుతారు అనేది స్కూల్లో
విద్యార్థులు కూడా అర్థం చేసుకుంటారు. తీవ్ర వేగముతో వెళ్ళేవారు చాలా తీవ్రముగా
పురుషార్థము చేస్తారు. ఎలాగైనా సరే పాస్ అవ్వలని ట్యూషన్ కోసం టీచరును పెట్టుకుంటారు.
ఇక్కడ కూడా చాలా వేగముగా ముందుకు వెళ్ళాలి. స్వయముపై కృప చూపించుకోవాలి. ఇప్పుడు
శరీరము వదిలితే ఈ పరిస్థితిలో ఏ పదవిని పొందుతాను అని బాబాను ఎవరైనా అడిగితే బాబా
వెంటనే చెప్తారు. ఇది చాలా సహజముగా అర్థం చేసుకునే విషయము. ఏ విధముగా హద్దులోని
విద్యార్థులు అర్థం చేసుకోగలరో, అలాగే అనంతమైన విద్యార్థులు కూడా అర్థం చేసుకోగలరు.
నా ద్వారా ఘడియ-ఘడియ ఈ పొరపాట్లు జరుగుతున్నాయి, వికర్మలు జరుగుతున్నాయి అని బుద్ధి
ద్వారా అర్థం చేసుకోగలరు. రిజిస్టరు పాడైనట్లయితే మరి రిజల్టు కూడా అటువంటిదే
వెలువడుతుంది. ప్రతి ఒక్కరూ తమ రిజిస్టరును పెట్టుకోవాలి. వాస్తవానికి
డ్రామానుసారముగా అంతా నిశ్చితమయ్యే ఉంటుంది. నా రిజిస్టరు అయితే బాగా బాగోలేదని
స్వయం కూడా అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే బాబా చెప్పగలరు. స్కూల్లో
రిజిస్టరు మొదలైనవన్నీ పెట్టడం జరుగుతుంది. దీని గురించైతే ప్రపంచములో ఎవ్వరికీ
తెలియదు. దీని పేరే గీతా పాఠశాల. వేద పాఠశాల అని ఎప్పుడూ అనరు. వేదాలు, ఉపనిషత్తులు,
గ్రంథాలు మొదలైనవాటి పాఠశాలలు అని అనరు. పాఠశాలలో - మేము భవిష్యత్తులో ఈ విధంగా
తయారవుతాము అన్న లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటుంది. ఎవరైనా వేద-శాస్త్రాలు బాగా చదివితే
వారికి కూడా టైటిల్స్ లభిస్తాయి, సంపాదన కూడా జరుగుతుంది. కొందరైతే చాలా
సంపాదిస్తారు. కానీ అది అవినాశీ సంపాదనేమీ కాదు. అది తమతోపాటు రాదు. ఈ సత్యమైన
సంపాదన తమతోపాటు వస్తుంది. మిగిలినదంతా సమాప్తమైపోతుంది. మనము చాలా-చాలా సంపాదన
చేసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనము విశ్వానికి యజమానులుగా అవ్వవచ్చు.
సూర్యవంశీ రాజ్యము ఉంటుంది కావున తప్పకుండా పిల్లలు సింహాసనముపై కూర్చుంటారు. చాలా
ఉన్నతమైన పదవి ఉంటుంది. మీరు పురుషార్థము చేసి రాజ్య పదవిని పొందుతారు అని మీకు
స్వప్నములో కూడా లేదు. దీనిని రాజయోగము అని అంటారు. అవి బ్యారిస్టరీ యోగము, డాక్టరు
యోగము మొదలైనవి. చదువు మరియు చదివించేవారు గుర్తు ఉంటారు. ఇక్కడ కూడా ఇది సహజమైన
స్మృతి. స్మృతిలోనే శ్రమ ఉంది. స్వయాన్ని దేహీ-అభిమానిగా భావించవలసి ఉంటుంది.
ఆత్మలోనే సంస్కారాలు నిండుతాయి. మేమైతే శివబాబాను పూజిస్తాము అని అనేవారు చాలామంది
వస్తారు కానీ ఎందుకు పూజిస్తారు అన్న విషయము తెలియదు. శివుడినే తండ్రి అని అంటారు.
ఇంకెవ్వరినీ తండ్రి అని పిలవరు. హనుమంతుడు, గణేశుడు మొదలైనవారిని పూజిస్తారు,
బ్రహ్మాకు పూజ జరగదు. అజ్మీర్లో బ్రహ్మా మందిరము ఉంది కానీ అక్కడ ఉన్న కొద్దిమంది
బ్రాహ్మణులు మాత్రమే పూజిస్తూ ఉండవచ్చు. అంతేకానీ గాయనము మొదలైనవేవీ లేవు.
శ్రీకృష్ణుడికి, లక్ష్మీ-నారాయణులకు ఎంత గాయనము ఉంది. బ్రహ్మాకు గాయనము లేదు
ఎందుకంటే బ్రహ్మా అయితే ఈ సమయములో నల్లగా ఉన్నారు, ఆ తరువాత తండ్రి వచ్చి వారిని
దత్తత తీసుకుంటారు. ఇది కూడా చాలా సహజమైన విషయమే. కావున తండ్రి పిల్లలకు
భిన్న-భిన్న రకాలుగా అర్థం చేయిస్తారు. శివబాబా మనకు వినిపిస్తున్నారు అని బుద్ధిలో
ఉండాలి. వారు తండ్రి కూడా, టీచరు మరియు గురువు కూడా. శివబాబా జ్ఞాన సాగరుడు, వారు
మనల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. జ్ఞానమనే
మూడవ నేత్రము మీకు లభిస్తుంది. ఆత్మ అవినాశీ అని కూడా మీరు అర్థం చేసుకుంటారు.
ఆత్మల తండ్రి కూడా అవినాశీ అయినవారు. ఈ విషయము కూడా ప్రపంచములోనివారికెవ్వరికీ
తెలియదు. ఓ తండ్రి, మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేయండి అని వారందరూ పిలుస్తూనే
ఉంటారు. అంతేకానీ - మీరు వచ్చి ప్రపంచ చరిత్ర మరియు భూగోళికాలను వినిపించండి అని
పిలవరు. ఇది తండ్రి స్వయముగా వచ్చి వినిపిస్తారు. పతితుల నుండి పావనులుగా మరియు
పావనుల నుండి పతితులుగా ఎలా అవుతారు, చరిత్ర ఏ విధంగా రిపీట్ అవుతుంది, ఇది కూడా
వారు తెలియజేస్తారు. ఇది 84 జన్మల చక్రము. మనము పతితులుగా ఎందుకు అయ్యాము, మళ్ళీ
పావనులుగా అయి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము? మనుష్యులైతే సన్యాసులు మొదలైనవారి
వద్దకు వెళ్ళి మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. అంతేకానీ మేము సంపూర్ణ
నిర్వికారులుగా, పావనులుగా ఎలా అవ్వవచ్చు అని అడగరు. ఇలా అడగడానికి సిగ్గుగా
అనిపిస్తుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - మీరందరూ భక్తురాళ్ళు, నేను
భగవంతుడిని, వరుడిని, మీరు వధువులు. మీరందరూ నన్ను స్మృతి చేస్తారు. యాత్రికుడినైన
నేను చాలా సుందరమైనవాడిని. మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులందరినీ సుందరముగా
తయారుచేస్తాను. స్వర్గమే ప్రపంచ అద్భుతముగా ఉంటుంది. ఇక్కడ 7 అద్భుతాలు ఉన్నాయని
అంటారు. అక్కడైతే ప్రపంచ అద్భుతమైన స్వర్గము ఒక్కటే ఉంటుంది. తండ్రి కూడా ఒక్కరే,
స్వర్గము కూడా ఒక్కటే, వారినే మనుష్యమాత్రులందరూ తలచుకుంటూ ఉంటారు. ఇక్కడైతే ఏదీ
అద్భుతము కాదు. ఇప్పుడు ఇక సుఖపు రోజులు రాబోతున్నాయి అని పిల్లలైన మీ లోపల ఓర్పు
ఉంది.
ఈ పాత ప్రపంచ వినాశనమైతేనే స్వర్గ రాజ్యము లభిస్తుందని మీరు భావిస్తారు. ఇప్పుడు
ఇంకా రాజ్య స్థాపన జరగలేదు. అయితే, ప్రజలు తయారవుతూ ఉంటారు. సేవ ఎలా వృద్ధిని
పొందాలి, అందరికీ సందేశాన్ని ఎలా అందించాలి అని పిల్లలు పరస్పరము చర్చించుకుంటూ
ఉంటారు. తండ్రి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగిలినవాటన్నిటి
వినాశనాన్ని చేయిస్తారు. మరి ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. ఈ తండ్రి మనల్ని
రాజ్యతిలకానికి అధికారులుగా తయారుచేసి, మిగిలినవాటన్నిటి వినాశనము చేస్తారు. ప్రకృతి
వైపరీత్యాలు కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఇవి లేకుండా ప్రపంచ వినాశనము జరగదు.
తండ్రి అంటారు, ఇప్పుడు మీ పరీక్ష చాలా దగ్గరలో ఉంది, మృత్యులోకము నుండి
అమరలోకములోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎంత బాగా చదువుకుంటారో మరియు చదివిస్తారో అంత
ఉన్నత పదవిని పొందుతారు ఎందుకంటే తమ ప్రజలను తయారుచేసుకుంటారు. పురుషార్థము చేసి
అందరి కళ్యాణము చేయాలి. దానము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఇది ఒక నియమము. మొదట
మిత్ర-సంబంధీకులు మరియు తమ కులమువారే వస్తారు. వారి వెనుక జనమంతా వస్తారు.
ప్రారంభములో ఈ విధంగానే జరిగింది. మెల్లమెల్లగా వృద్ధి జరిగింది, అప్పుడు ఇక పిల్లలు
ఉండడానికి పెద్ద ఇల్లు తయారైంది, దానిని ఓం నివాస్ అని పిలిచేవారు. పిల్లలు వచ్చి
చదువుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది, ఇది మళ్ళీ రిపీట్
అవుతుంది. దీనిని ఎవ్వరూ మార్చలేరు. ఈ చదువు ఎంత ఉన్నతమైనది. స్మృతియాత్రయే
ముఖ్యమైనది. ముఖ్యముగా కళ్ళే చాలా మోసము చేస్తూ ఉంటాయి. కళ్ళు అశుద్ధముగా అయితే
అప్పుడు శరీర కర్మేంద్రియాలు చంచలమవుతాయి. ఎవరైనా సుందరమైన కుమార్తెను చూస్తే ఇక
ఆమెలో చిక్కుకుపోతారు. ప్రపంచములో ఇటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. గురువుకు కూడా
ఒక్కోసారి అశుద్ధమైన దృష్టి కలుగుతుంది. ఇక్కడ తండ్రి అంటారు, అశుద్ధమైన దృష్టి ఏ
మాత్రము ఉండకూడదు. సోదరీ-సోదరులుగా అయి ఉంటేనే పవిత్రముగా ఉండగలుగుతారు. ఈ విషయాలు
మనుష్యులకేమి తెలుసు, కావున వారు వేళాకోళం చేస్తారు. శాస్త్రాలలోనైతే ఈ విషయాలు లేనే
లేవు. తండ్రి అంటారు, ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. ఆ తరువాత ద్వాపరము నుండి ఈ
శాస్త్రాలు మొదలైనవి తయారయ్యాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయమేమిటంటే -
భగవంతుడిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావించండి.
మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీ ఆత్మ దేవతగా అవుతోంది.
చిన్న ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంది, ఇది ఒక అద్భుతము కదా. ఇటువంటి
ప్రపంచ అద్భుతాలకు సంబంధించిన విషయాలను తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. కొందరికి 84
జన్మలు, కొందరికి 50-60 జన్మల పాత్ర ఉంటుంది. పరమపిత పరమాత్మకు కూడా పాత్ర లభించి
ఉంది. డ్రామానుసారముగా ఇది అనాది, అవినాశీ అయిన డ్రామా. ఇది ఎప్పుడు ప్రారంభమయ్యింది
మరియు ఎప్పుడు అంతమవుతుంది - ఇది ఎవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే ఇది అనాది, అవినాశీ
డ్రామా. ఈ విషయాల గురించి ఇంకెవ్వరికీ తెలియదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు పరీక్ష సమయము చాలా దగ్గరగా ఉంది, అందుకే పురుషార్థము చేసి స్వకళ్యాణము
మరియు సర్వుల కళ్యాణము చేయాలి, చదవాలి మరియు చదివించాలి. దానము ఇంటి నుండే
ప్రారంభమవుతుంది.
2. దేహీ-అభిమానులుగా అయి సత్యమైన అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. తమ రిజిస్టరును
పెట్టుకోవాలి. రిజిస్టరు పాడయ్యే విధంగా ఎటువంటి వికర్మలు చేయకూడదు.
వరదానము:-
సర్వులకు ఉల్లాస-ఉత్సాహాల సహయోగాన్ని ఇచ్చి వారిని
శక్తిశాలిగా తయారుచేసే సత్యమైన సేవాధారీ భవ
సేవాధారి అనగా సర్వులకు ఉల్లాస-ఉత్సాహాల సహయోగాన్ని ఇచ్చి
శక్తిశాలిగా తయారుచేసేవారు. ఇప్పుడు సమయము తక్కువగా ఉంది మరియు రచన చాలా-చాలా
ఎక్కువగా వచ్చేది ఉంది. చాలామంది వచ్చారు అని కేవలం ఈ సంఖ్యకే సంతోషపడిపోకండి.
ఇప్పుడు ఇంకా సంఖ్య చాలా పెరగనున్నది. అందుకే మీరు ఏదైతే పాలన తీసుకున్నారో, దానికి
రిటర్ను ఇవ్వండి. రాబోయే నిర్బల ఆత్మలకు సహయోగులుగా అయ్యి వారిని సమర్థులుగా,
చలించనివారిగా, స్థిరమైనవారిగా తయారుచెయ్యండి, అప్పుడు సత్యమైన సేవాధారి అని అంటారు.
స్లోగన్:-
ఆత్మను
ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా స్థితి చేసుకోండి
- ఇదే ఆత్మిక డ్రిల్.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి
శక్తిశాలి మనసుకు
గుర్తు ఏమిటంటే - క్షణములో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి చేరుకోగలగాలి. మనసుకు
ఎగరడం వచ్చినప్పుడు, అది అభ్యాసమైపోయినప్పుడు ఇక క్షణములో ఎక్కడికి కావాలనుకుంటే
అక్కడికి చేరుకోగలరు. ఇప్పుడిప్పుడే సాకారవతనములోకి, ఇప్పుడిప్పుడే పరంధామములోకి,
క్షణకాలపు వేగముతో చేరుకోవాలి - ఇప్పుడు ఈ అభ్యాసమునే పెంచండి.
| | |