09-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ చదువే మిమ్మల్ని నరుని నుండి
నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారుచేస్తుంది, అందుకే చదువు పట్ల చాలా-చాలా
అటెన్షన్ పెట్టాలి’’
ప్రశ్న:-
తండ్రి ద్వారా
పిల్లలకు ఏ వారసత్వము లభిస్తుంది, అది ఏ తీర్థ స్థానాలకు లేక అడవులకు వెళ్ళినా కూడా
లభించదు?
జవాబు:-
తండ్రి ద్వారా
పిల్లలకు సుఖము-శాంతి-సంపదల వారసత్వము లభిస్తుంది, అది ఇంకెక్కడా లభించదు. మనుష్యులు
శాంతి కోసం అడవులకు వెళ్తారు, కానీ శాంతి అనేది ఆత్మలమైన మన స్వధర్మమని మీకు తెలుసు.
పాట:-
మిమ్మల్ని
పొంది మేము విశ్వాన్ని పొందాము...
ఓంశాంతి
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు నాథుడికి
చెందినవారిగా అయ్యారు. మిగిలిన మనుష్యమాత్రులందరూ అనాథలుగా ఉన్నారు. నాథుడు అని
ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. ఇంటిలో గొడవపడుతున్నప్పుడు, మీకు నాథుడు ఎవరూ లేరా
అని అంటారు. ఇప్పుడు మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులందరూ గొడవపడుతూ,
కొట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరినొకరు హతమార్చుకుంటారు కూడా. తండ్రియే వచ్చి అర్థం
చేయిస్తున్నారు - ఈ కామమనేది మహాశత్రువు, దీని వలన అందరూ ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని
పొందుతారు. ఇప్పుడు మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము యొక్క వారసత్వాన్ని
తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు, మాకు శాంతి కావాలని అంటారు, కానీ
శాంతి అంటే ఏమిటి, ఎక్కడ నుండి లభిస్తుంది, అడవులకు వెళ్ళడము వలన శాంతి లభిస్తుందా,
సుఖ-శాంతులను ఎప్పుడు మరియు ఎవరు ఇస్తారు, తీర్థ యాత్రలకు ఎందుకు వెళ్తారు - ఈ
విషయాలు కూడా ఎవ్వరికీ తెలియవు. భక్తి చేయడముతో భగవంతుడు లభిస్తారని విన్నారు, అంతే.
కానీ భగవంతుడి గురించి కూడా తెలియదు. తండ్రి అంటారు, నేను వచ్చి పిల్లలైన మీకు
సుఖ-శాంతులను ఇస్తాను. ఇప్పుడు సుఖము, శాంతి, సంపదలు ఎవరి వద్ద లేవు. ఇచ్చేవారి
గురించి కూడా ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - దుఃఖహర్త,
సుఖకర్త అని మీరు పాడుతారు కూడా. గాంధీజీ కూడా - ఓ పతిత-పావనా, వచ్చి పావనముగా
తయారుచేయండి అని పిలిచేవారు. పతిత-పావన సీతారామ అని పాడుతారు, కానీ అర్థం తెలియదు.
భక్తిని ఎందుకు చేస్తారు, దాని నుండి ఏం లభిస్తుంది అనేది ఏమీ తెలియదు. ఈ భక్తి కూడా
డ్రామాలో నిశ్చితమై ఉంది. ద్వాపరము నుండి రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. రావణుడు
ఎవరు, ఎప్పటివరకు రావణుడిని కాలుస్తూ ఉంటారు, అతని జన్మ ఎప్పుడు జరిగింది అనేది
మనుష్యులకు తెలియదు. రావణుడి దిష్టిబొమ్మను తయారుచేసి కాలుస్తారు. ఆత్మ ఎప్పుడూ
కాలదు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం
భారత్ స్వర్గముగా ఉండేది, ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. లక్ష్మీ-నారాయణులనే
భగవతి-భగవాన్ అని అంటారు. తర్వాత త్రేతాలో రాముని రాజ్యముండేది. వారికి ఆ రాజ్యము
ఎలా లభించింది, తర్వాత ఆ రాజ్యము ఎక్కడికి వెళ్ళింది, అది ఎవ్వరికీ తెలియదు, అనగా
రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు ఈ జ్ఞానము ద్వారా
స్వర్గానికి యజమానులుగా అవుతారు. స్కూలులో చదువు ద్వారా కొందరు వకీలుగా, జడ్జీగా
అవుతారు, కానీ లక్ష్మీ-నారాయణులుగా అవ్వరు. వీరు ఏ చదువు ద్వారా ఆ పదవిని పొందారు!
ఇది ఎవ్వరికీ తెలియదు. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. నేను
మిమ్మల్ని ఈ విధముగా తయారుచేస్తాను అని చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. ఈ
లక్ష్మీ-నారాయణుల వంశావళి ఈ చదువు ద్వారానే తయారయ్యిందని పిల్లలైన మీకు తెలుసు.
ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. లక్షల సంవత్సరాలని సత్యయుగము గురించి కూడా
చెప్తారు. అటువంటప్పుడు, లక్ష్మీ-నారాయణులు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎలా తెలుస్తుంది.
భారత్ లోనే లక్ష్మీ-నారాయణులవి అనేక చిత్రాలున్నాయని చూస్తున్నారు కూడా. ఎన్నో
మందిరాలు నిర్మించబడి ఉన్నాయి. వారి నుండి మాకు ధనము లభిస్తుందని భావిస్తారు.
మహాలక్ష్మి నుండి ప్రతి దీపావళి నాడు ధనాన్ని కోరుకుంటారు, కానీ లక్ష్మితో పాటు
తప్పకుండా నారాయణుడు కూడా ఉంటారు. దీపావళి రోజున పూజ చేస్తారు, అప్పుడు వారికి
అల్పకాలిక సుఖము యొక్క భావన పూర్తవుతుంది, అందుకే లక్ష్మి నుండి ధనము లభిస్తుందని
భావిస్తారు. వాస్తవానికి లక్ష్మీ-నారాయణులు ఇరువురూ ఉంటారు. లక్ష్మి, మహాలక్ష్మి
వేర్వేరు కాదు, ఈ విషయాలు మనుష్యులకు తెలియదు. బాబాయే అర్థం చేయిస్తారు. ఈ రోజుల్లో
మనుష్యులు, ఈశ్వరుడు రాయి-రప్పలలో ఉన్నారని అంటారు. తండ్రి అంటారు - అందరూ రాతి
బుద్ధి కలవారిగా ఉన్నారు. పారసబుద్ధి కలవారు సత్యయుగములో ఉంటారు. లక్ష్మీ-నారాయణుల
రాజ్యము ఉన్నప్పుడు బంగారము-వజ్రాల మహళ్ళు ఉండేవి. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము.
శాస్త్రాలలో కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. తండ్రి అంటారు - ఈ భక్తి
మార్గము వలన మెట్లు కిందకు దిగాల్సి ఉంటుంది. డ్రామానుసారముగా దుర్గతిని
పొందినప్పుడు నేను వస్తాను, వచ్చి కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తాను. ఇప్పుడు
పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు రాజయోగము నేర్చుకుంటున్నారు.
ఈ మహాభారత యుద్ధముతో పాత ప్రపంచ వినాశనము జరుగుతుందని మీకు తెలుసు. ఈ డ్రామా తయారై,
తయారుచేయబడినది. సత్యయుగములో దేవీ-దేవతల రాజ్యముండేది. అది గడిచి 5 వేల సంవత్సరాలు
అయ్యింది. 2500 సంవత్సరాలు సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజధానులు కొనసాగాయి. తర్వాత,
ద్వాపరము నుండి రావణ రాజ్యము మొదలయ్యింది. మనుష్యులు పతితముగా అవుతూ ఉంటారు. కానీ
మమ్మల్ని పతితముగా ఎవరు తయారుచేసారు అనేది వారికి తెలియదు. మనము పావనముగా ఉండేవారము,
పతితముగా ఎలా అయ్యాము? తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. రావణ రాజ్యము
మొదలవ్వడముతో మీరు పతితముగా అవుతూ ఉంటారు. రావణుడు జన్మించి ఇప్పటికి 2500
సంవత్సరాలయ్యింది. శివబాబా జన్మించి 5 వేల సంవత్సరాలయ్యింది. దానిని రామ రాజ్యమని,
దీనిని రావణ రాజ్యమని అంటారు. వాస్తవానికి రామ అని అనకూడదు. ఈ రోజుల్లో మనుష్యులకు
రామచంద్ర, కృష్ణచంద్ర అని పేర్లు పెడతారు.
5 వేల సంవత్సరాల క్రితం భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది. దానిని బంగారుయుగపు ప్రపంచము
అని అంటారు. వైకుంఠము ఉండేది, కానీ ఎక్కడ ఉండేది అనేది వారికి తెలియదు. ఆత్మ అంటే
ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి - ఏమీ తెలియదు, అందుకే వారిని తుచ్ఛ
బుద్ధి కలవారని అంటారు. ఋషులకు, మునులకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి
తెలియదు. అందుకే మాకు తెలియదు, మాకు తెలియదు అని అంటారు. వారికి తండ్రి గురించి గాని,
వారసత్వము గురించి గాని తెలియదు. తండ్రి ద్వారా విశ్వ రాజ్యము యొక్క వారసత్వము ఏదైతే
లభిస్తుందో, దాని గురించి కూడా తెలియదు. ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల
గురించి మీకు తెలుసు, కనుక మీరు డబల్ ఆస్తికులు అయినట్లు. శాంతి ఎవరి నుండి
లభిస్తుంది మరియు ఎక్కడ నుండి లభిస్తుంది అన్న విషయము కూడా మనుష్యులకు తెలియదు.
సన్యాసుల వద్దకు వెళ్ళి, మాకు శాంతి కావాలని అంటారు. ఇప్పుడు మనకు శాంతి ఇక్కడ ఎలా
లభిస్తుంది? కర్మలైతే చేయాలి కదా. శాంతి అయితే శాంతిధామములో లభిస్తుంది. ఒకవేళ
ఇంటిలో ఒక్కరు అశాంతిగా ఉన్నా, మొత్తం ఇంటిని అశాంతిగా చేస్తారు. శాంతి అనేది స్వీట్
హోమ్ లో లభిస్తుంది. తర్వాత అక్కడ నుండి తండ్రి ఆత్మలైన మనల్ని పాత్రను
అభినయించేందుకు కొత్త ప్రపంచములోకి పంపిస్తారు. తండ్రి నరకములోకి పంపించరు.
శాంతిధామము నుండి సుఖధామములోకి వెళ్తారు. ఇది భగవంతుని పాఠశాల, ఇది సత్సంగమేమీ కాదని
పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ పిల్లల కోసం భగవానువాచ ఉంటుంది. నిరాకార శివబాబా
శరీరములోకి ప్రవేశించి పిల్లలైన మీతో మాట్లాడుతారు. ఆత్మ కూడా శరీరములో ఉంది కదా.
ఆత్మకు కర్మేంద్రియాలు లభించినప్పుడు మాట్లాడుతుంది, వింటుంది. ఇప్పుడు తండ్రి
కూర్చుని ఆత్మలను చదివిస్తున్నారు. పరమాత్మను, ఓ పతిత-పావనా, ఓ సద్గతిదాత, లిబరేటర్,
గైడ్ అని పిలుస్తారు. కానీ వారు విముక్తులుగా ఎలా చేస్తారు, మళ్ళీ గైడ్ గా అయి
ఎక్కడికి తీసుకువెళ్తారు అనేది వారికి తెలియదు. కేవలం ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు.
ఇప్పుడు గాడ్ ఫాదర్ వచ్చారు. పిల్లలైన మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. స్వయం వారే
మిమ్మల్ని శాంతిధామములోకి తీసుకువెళ్తారు. తర్వాత మీ అంతట మీరే సుఖధామములోకి
వెళ్ళిపోతారు. తండ్రి ఒక్కసారే వచ్చి అందరికీ గైడ్ గా అవుతారు. తర్వాత కొత్త
ప్రపంచములో తండ్రి గైడ్ చేయరు. ఈ సమయములో మనుష్యులంతా పతితముగా ఉన్న కారణముగా, వారు
తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలి అనేది వారికి తెలియదు, ఎగరలేరు. అక్కడకు వెళ్ళేందుకు
భక్తి చాలా చేస్తారు కానీ వారు పతితముగా ఉన్నారు, అందుకే వెళ్ళలేరు అన్న విషయము
వారికి తెలియదు. పతిత-పావనుడైన తండ్రి వచ్చి పావనముగా తయారుచేసినప్పుడు మనము
వెళ్ళగలము. ఇప్పుడు తండ్రి పావనముగా తయారయ్యేందుకు మీకు యుక్తిని తెలియజేస్తున్నారు.
అందరూ పతితము నుండి పావనముగా అవ్వాల్సిందే. ఇప్పుడు ఎంతమంది మనుష్యులున్నారు.
సత్యయుగములో దేవతల రాజ్యమున్నప్పుడు కొత్త వృక్షములో 9 లక్షల మంది ఉంటారు. ముందు
కొన్ని ఆకులే ఉంటాయి కదా, తర్వాత వృక్షము పెద్దదవుతూ ఉంటుంది. ముందు ఒక్క ధర్మము
వారే ఉండేవారు. ఇప్పుడు మీరు స్వయాన్ని నరకవాసులుగా భావించరు. మిగిలినవారంతా
నరకవాసులు కానీ వారు తమను తాము ఆ విధముగా భావించరు. ఈ సమయములో ముఖాలైతే అందరివీ
మనుష్యులవే, కానీ గుణము కోతి వలె ఉంది. పెద్ద-పెద్ద రాజులు కూడా లక్ష్మీ-నారాయణుల
చరణాలపై తల వంచుతారు. ఇప్పుడు వారేమీ పతితులను పావనముగా తయారుచేసేవారు కాదు, అలాగే
వారేమీ దయార్ద్ర హృదయులు కాదు. ఎవరైనా దుఃఖితులుగా ఉన్నప్పుడు వారిపై దయ చూపించడము
జరుగుతుంది. దయార్ద్ర హృదయుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రియే వచ్చి రాతిబుద్ధి
కలవారిని పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు దేవతలుగా తయారవుతున్నారు.
ఇది ఉన్నదే నరుని నుండి నారాయణునిగా తయారయ్యే పాఠశాల. ఇది రాజయోగము. ఋషులు-మునులకు,
గీతలోని రాజయోగాన్ని ఎవరు నేర్పించారు అనేది తెలియదు. గీతను పూర్తిగా ఖండించారు.
శ్రీకృష్ణుడు రాజయోగాన్ని నేర్పించారని అనుకుంటారు. శ్రీకృష్ణ భగవానువాచ -
‘మన్మనాభవ’ అని అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడైతే పరమాత్మ కాదు. వారు సత్యయుగ
రాకుమారుడు. వారే సంగమయుగములో రాజయోగాన్ని నేర్చుకుని రాజ్యాన్ని ప్రాప్తి
చేసుకుంటారు. వారిని భగవంతునిగా చేసేసారు. ఎంతోమంది మనుష్యులు గీతను వింటారు. కానీ
గీతా భగవానుడు శివుడని, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదని ఒక్కరికి కూడా తెలియదు. అందరూ
ఒక్కరేనని అంటారు. ఇటువంటి మనుష్యుల విషయములో కూడా కష్టపడాల్సి ఉంటుంది. 63 జన్మలుగా
శ్రీకృష్ణుడే భగవంతుడని భావిస్తూ వచ్చారు. ద్వాపరము నుండి శాస్త్రాలు తయారయ్యాయి.
తప్పకుండా మొట్టమొదట గీత తయారై ఉంటుంది. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి
సంబంధించినవి. జ్ఞాన మార్గానికి సంబంధించిన శాస్త్రము ఒక్కటి కూడా లేదు. గీత
నంబరువన్. తర్వాత ఈ వేదాలు, ఉపనిషత్తులు తయారయ్యాయి. ఇవన్నీ కూడా గీతకు పిల్లలే.
వీటిని చదువుతూ-చదువుతూ కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి.
ఇప్పుడు మొదటి నంబరులోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు మళ్ళీ సత్యయుగీ లక్ష్మీ-నారాయణులుగా
అయ్యేందుకు ఇక్కడకు చదువుకోవడానికి వచ్చారు. అందరూ లక్ష్మీ-నారాయణులుగా అవ్వలేరు. ఈ
రాజధాని స్థాపనవుతూ ఉంది కానీ రాజధానిని ఎవరు స్థాపన చేసారు, ఇది ఎవరి బుద్ధిలోకీ
రాదు. కలియుగములో ఎంతమంది మనుష్యులు ఉన్నారంటే, వారికి తినడానికి ధాన్యము కూడా
లభించదు మరియు సత్యయుగములో కేవలం లక్ష్మీ-నారాయణుల రాజధాని మాత్రమే ఉంటుంది. ఇక్కడ
ఎన్ని ధర్మాలు ఉన్నాయో చూడండి. ఎదురుగా మహాభారీ మహాభారత యుద్ధము కూడా నిలబడి ఉంది,
అయినా కానీ మనుష్యుల కళ్ళు తెరుచుకోవడము లేదు. ఈ మహాభారీ యుద్ధము కల్పక్రితం కూడా
జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, అదేమీ తెలియదు. ఈ విషయాలన్నీ
బ్రాహ్మణ-బ్రాహ్మణీలైన మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని తండ్రి బ్రహ్మా ద్వారా దత్తత
తీసుకున్నారు. భగవంతుడు మిమ్మల్ని చదివించి ఈ లక్ష్మీ-నారాయణులుగా తయారుచేస్తారు
కనుక బాగా చదువుకోవాలి. కేవలం తండ్రిని మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేసినట్లయితే
మీరు కొత్త ప్రపంచములోకి వెళ్ళిపోతారు. ఒకవేళ బాగా చదువుకున్నట్లయితే మరియు
చదివించినట్లయితే రాజు-రాణులుగా అవ్వగలరు. ఎంతగా ఆత్మిక సేవను చేస్తారో, అంతగా
తయారవుతారు. మీరు ఆత్మిక సమాజ సేవకులు. మిగిలిన ప్రపంచమంతా దైహిక సమాజ సేవకులు.
ఆత్మలైన మీకు తండ్రి రోజూ జ్ఞానమిస్తారు. ఆత్మలకు సేవ చేస్తారు కదా. దీనిని ఆత్మలకు
చేసే సేవ అని అంటారు, దీనిని నేర్పించేవారు కూడా స్పిరిచ్యువల్ ఫాదర్ (ఆత్మిక తండ్రి).
ఇది మనుష్యులను దేవతలుగా తయారుచేసే పాఠశాల, తప్పకుండా దేవతలుగా అవుతారు కూడా. మీరు
చదువుకుని తయారైనప్పుడు వినాశనము మొదలవుతుంది, అప్పుడు మీరు కూడా వెళ్ళిపోతారు.
రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, వారి పరివారములోని వారందరూ కూడా
వెళ్ళిపోయారు అని అంటారు కదా (ఇక్కడ ఎవ్వరూ శాశ్వతము కాదు అని అర్థము). కేవలం
కొద్దిమంది మాత్రమే మిగులుతారు, వారు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. అప్పుడు మీరు
స్వర్గములోకి వస్తారు. మీ కోసం ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపనవుతూ ఉంది. మీరు
స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఇది నరకము. ఇప్పుడు మీరు సంగమములో
ఉన్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలుగా అవ్వకపోతే వారసత్వాన్ని తీసుకోలేరు.
ఏ బ్రాహ్మణులైతే ఒక్క తండ్రిని తప్ప ఇంకే దేహధారులను గుర్తు చేయరో, వారికే వారసత్వము
లభిస్తుంది. ఇకపోతే, ఎంతోకొంత విన్నా సరే ప్రజల్లోకి వచ్చేస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మిక సమాజ సేవకులుగా అయి చదువుకోవాలి మరియు చదివించాలి. తండ్రితో పాటు
రాబోయే కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేయాలి.
2. తండ్రి సమానముగా దయార్ద్ర హృదయులుగా అయి అందరినీ పారసబుద్ధి కలవారిగా
తయారుచేసే సేవను చేయాలి.
వరదానము:-
నిరాకారి నుండి సాకారి - ఈ మంత్రము యొక్క స్మృతితో సేవా
పాత్రను అభినయించే ఆత్మిక సేవాధారి భవ
ఏ విధముగా తండ్రి నిరాకారుని నుండి సాకారునిగా అయి సేవా
పాత్రను అభినయిస్తారో, అదే విధముగా పిల్లలు కూడా ఈ మంత్రమనే యంత్రాన్ని స్మృతిలో
ఉంచుకుని సేవా పాత్రను అభినయించాలి. ఈ సాకార సృష్టి, సాకార శరీరము ఒక స్టేజ్. స్టేజ్
ఆధారము వంటిది మరియు పాత్రధారులు ఆధారమూర్తులు, యజమానులు. ఈ స్మృతితో అతీతముగా అయి
పాత్రను అభినయించినట్లయితే సెన్స్ తో పాటు ఎస్సెన్స్ ఫుల్ (జ్ఞానముతో పాటు
సారభరితమైన) ఆత్మిక సేవాధారిగా అవుతారు.
స్లోగన్:-
సాక్షీగా అయి
ప్రతి ఆటను చూసేవారే సాక్షీదృష్టాలు.
అవ్యక్త ప్రేరణలు -
బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
స్నేహము మరియు శక్తి,
ఎప్పుడైతే ఈ రెండింటి కలయిక జరుగుతుందో, అప్పుడు అవస్థ అతి అతీతమైనదిగా మరియు అతి
ప్రియమైనదిగా అవుతుంది. ఎవరిపైనైతే స్నేహము ఉంటుందో వారి సమానముగా అవ్వాలి, ఇదే
స్నేహానికి ఋజువు. కానీ కేవలం స్నేహాన్ని పెట్టుకున్నంత మాత్రాన సంపూర్ణముగా అవ్వరు,
స్నేహముతోపాటు శక్తి కూడా ఉన్నట్లయితే స్వయము సంపూర్ణముగా అయి ఇతరులను కూడా
సంపూర్ణముగా తయారుచేస్తారు.