10-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - దేహాభిమానాన్ని వదిలి
దేహీ-అభిమానులుగా అవ్వండి, దేహీ-అభిమానులనే ఈశ్వరీయ సాంప్రదాయము వారు అని అంటారు’’
ప్రశ్న:-
పిల్లలైన మీరు ఇప్పుడు ఏ సత్సంగమునైతే చేస్తున్నారో, ఇది ఇతర సత్సంగాలకంటే అతీతమైనది,
ఎలా?
జవాబు:-
ఆత్మ మరియు
పరమాత్మల జ్ఞానమును వినే సత్సంగము ఇది ఒక్కటే. ఇక్కడ ఉండేది చదువు. లక్ష్యము,
ఉద్దేశ్యము కూడా ఎదురుగా ఉంది. ఇతర సత్సంగాలలో చదువు కూడా ఉండదు, అలాగే లక్ష్యము,
ఉద్దేశ్యము కూడా ఉండదు.
ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలు వింటున్నారు.
మొట్టమొదట తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ఎప్పుడు కూర్చున్నా సరే స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ కూర్చోండి, దేహముగా భావించకండి. దేహాభిమానము కలవారిని ఆసురీ
సాంప్రదాయులు అని అంటారు, దేహీ-అభిమానులను ఈశ్వరీయ సాంప్రదాయులు అని అంటారు.
ఈశ్వరునికి తన దేహము లేదు. వారు సదా ఆత్మాభిమానిగానే ఉంటారు. వారు సుప్రీమ్ ఆత్మ,
సర్వాత్మలకు తండ్రి. పరమ ఆత్మ అనగా ఉన్నతోన్నతుడు. మనుష్యులు ఎప్పుడైతే
ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని అంటారో, అప్పుడు అతడు నిరాకారుడని, లింగరూపుడని వారి
బుద్ధిలోకి వస్తుంది. నిరాకార లింగమునకు పూజ కూడా జరుగుతుంది. వారు పరమ ఆత్మ అనగా
సర్వాత్మలలో కల్లా ఉన్నతమైనవారు. వారు కూడా ఒక ఆత్మయే కానీ వారు ఉన్నతమైన ఆత్మ. వారు
జనన-మరణాలలోకి రారు, మిగిలినవారంతా పునర్జన్మలు తీసుకుంటారు. మిగిలినవారంతా రచన.
రచయిత అయితే ఒక్క తండ్రియే. బ్రహ్మా, విష్ణు, శంకరులు కూడా రచనయే. అలాగే మనుష్య
సృష్టి అంతా కూడా రచనయే. రచయితను తండ్రి అని అంటారు. ఇంటిలో పురుషుడిని కూడా రచయిత
అని అంటారు. అతను పత్నిని దత్తత తీసుకుని ఆమె ద్వారా రచనను రచిస్తాడు, ఆ తర్వాత
పాలన చేస్తాడు, కానీ వినాశనము చేయడు. ఇతర ధర్మ స్థాపకులు ఎవరైతే ఉన్నారో, వారు కూడా
రచన రచిస్తారు, ఆ తర్వాత పాలన కూడా చేస్తారు. కానీ వినాశనము ఎవరూ చేయరు. అనంతమైన
తండ్రిని పరమ ఆత్మ అని అంటారు. ఏ విధముగా ఆత్మ రూపము బిందువో, అలాగే పరమపిత
పరమాత్ముని రూపము కూడా ఒక బిందువే. కానీ ఇంత పెద్ద లింగ రూపమునేదైతే తయారుచేస్తారో,
దానిని భక్తి మార్గములో పూజ కోసమని తయారుచేస్తారు. బిందువుకు పూజ ఎలా చేయగలరు. భారత్
లో రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు శివలింగాన్ని మరియు సాలిగ్రామాలను మట్టితో
తయారుచేసి వాటిని పూజిస్తారు. దానిని రుద్ర యజ్ఞము అని అంటారు. వాస్తవానికి దాని
యథార్థమైన నామము రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము. శాస్త్రాలలో కూడా
ఈ విధముగా వ్రాయబడి ఉంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా
భావించండి. ఇతర సత్సంగాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము
ఎవరిలోనూ లేదు, అలాగే ఆ జ్ఞానమును ఎవరూ ఇవ్వలేరు. అక్కడైతే ఎటువంటి లక్ష్యము,
ఉద్దేశ్యము ఉండదు. పిల్లలైన మీరైతే ఇప్పుడు చదువు చదువుతున్నారు. ఆత్మ శరీరములోకి
ప్రవేశిస్తుందని మీకు తెలుసు. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. ఆత్మ శరీరము ద్వారా
పాత్రను అభినయిస్తుంది. ఆత్మ అయితే అశరీరిగానే ఉంది కదా. వివస్త్రగా వచ్చాము,
వివస్త్రగా వెళ్ళాలి అని కూడా అంటారు. శరీరాన్ని ధారణ చేసాము, మళ్ళీ శరీరాన్ని వదిలి
వివస్త్రగా వెళ్ళిపోవాలి. ఈ తండ్రి కూర్చుని పిల్లలైన మీకే అర్థం చేయిస్తున్నారు.
భారత్ లో ఒకప్పుడు సత్యయుగము ఉండేదని, అప్పుడు దేవీ-దేవతల రాజ్యము ఉండేదని, ఒకే
ధర్మము ఉండేదని కూడా పిల్లలకు తెలుసు. ఈ విషయము కూడా భారతవాసులకు తెలియదు. తండ్రి
గురించి ఎవరైతే తెలుసుకోలేదో, వారు ఏమీ తెలుసుకోనట్లే. మాకు రచయిత మరియు రచన గురించి
తెలియదు అని ప్రాచీన ఋషులు, మునులు కూడా అనేవారు. అనంతమైన తండ్రియే రచయిత, వారికే
రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. ఆది అని మొదలును అంటారు, ఆ తర్వాత మధ్యమము.
ఆది సత్యయుగము, దానిని పగలు అని అంటారు, ఆ తర్వాత మధ్యమము నుండి అంతిమము వరకు రాత్రి
ఉంటుంది. సత్య, త్రేతాయుగాలు పగలు. స్వర్గము ప్రపంచ అద్భుతము. భారత్ యే స్వర్గముగా
ఉండేది, అందులో లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేసేవారు. ఈ విషయము భారతవాసులకు తెలియదు.
తండ్రి ఇప్పుడు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు.
తండ్రి అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఫస్ట్ క్లాస్ ఆత్మను. ఈ
సమయములో మనుష్యమాత్రులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. తండ్రి ఆత్మాభిమానులుగా
తయారుచేస్తారు. ఆత్మ అంటే ఏమిటి అనేది కూడా తండ్రి తెలియజేస్తారు. మనుష్యులకు ఏమీ
తెలియదు. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రము మెరుస్తోంది అని అంటారు కానీ అది
ఏమిటి, అందులో పాత్ర ఏ విధంగా నిండి ఉంది అనేది ఏమీ తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు
అర్థం చేయిస్తున్నారు, భారతవాసులైన మీరు 84 జన్మల పాత్రను అభినయించవలసి ఉంటుంది.
భారత్ యే ఉన్నతమైన ఖండము. మనుష్యమాత్రులంతా ఎవరైతే ఉన్నారో, వారికి ఇది తీర్థ
స్థానము. సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి ఇక్కడికి వస్తారు. రావణ రాజ్యము నుండి
విముక్తులను చేసి గైడ్ గా అయి (మార్గదర్శకుడై) తీసుకువెళ్తారు. మనుష్యులు - భగవంతుడు
మార్గదర్శకుడు అని అంటారే కానీ దాని అర్థమేమీ తెలియదు. భారత్ లో మొదట దేవీ-దేవతలు
ఉండేవారు. వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి ఉంటుంది. భారతవాసులే దేవతలుగా అయి
మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటారు కదా.
ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఏడు రోజులు పడుతుంది. పతిత బుద్ధిని
పావనముగా తయారుచేయాలి. ఈ లక్ష్మీ-నారాయణులు పావన ప్రపంచములో రాజ్యము చేసేవారు కదా.
వారి రాజ్యమే భారత్ లో ఉండేది, ఆ సమయములో ఇతర ధర్మాలేవీ లేవు. ఒకే ఒక్క రాజ్యము
ఉండేది. భారత్ ఎంత సుసంపన్నముగా ఉండేది. వజ్ర-వైఢూర్యాలతో నిర్మితమైన మహళ్ళు ఉండేవి,
ఆ తర్వాత రావణ రాజ్యములో పూజారులుగా అయ్యారు, అప్పుడు భక్తి మార్గములో ఈ మందిరాలు
మొదలైనవి తయారుచేసారు. సోమనాథుని మందిరము ఉండేది కదా. కేవలం ఒక్క మందిరము మాత్రమే
ఉండదు కదా. ఇక్కడ కూడా శివుని మందిరాలలో ఎన్ని వజ్ర-వైఢూర్యాలు ఉండేవంటే వాటిని
మహ్మద్ గజనవీ ఒంటెలపై నింపుకుని వెళ్ళాడు. ఎవరైనా కొన్ని లక్షల ఒంటెలను తీసుకువచ్చి
నింపుకుని వెళ్ళినా కూడా తరగనంత సంపద అక్కడ ఉండేది. సత్యయుగములో బంగారము,
వజ్ర-వైఢూర్యాలతో నిర్మితమైన మహళ్ళు ఎన్నో ఉండేవి. మహ్మద్ గజనవీ అంటే ఇప్పుడు
వచ్చారు కానీ ద్వాపరములో కూడా ఎన్ని మహళ్ళు మొదలైనవి ఉంటాయి. అవన్నీ మళ్ళీ భూకంపాలలో
లోపలికి వెళ్ళిపోతాయి. రావణుడి బంగారు లంక అంటూ ఏదీ ఉండదు. రావణ రాజ్యములోనైతే భారత్
పరిస్థితి ఇలా అయిపోయింది. వంద శాతము అధార్మికముగా, అధర్మయుక్తముగా, నిరుపేదగా,
పతితముగా, వికారీగా తయారయ్యింది. కొత్త ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచము అని అంటారు.
భారత్ శివాలయముగా ఉండేది, దానిని ప్రపంచ అద్భుతము అని అంటారు. అక్కడ చాలా తక్కువమంది
మనుష్యులు ఉండేవారు. ఇప్పుడైతే కోట్లాదిమంది మనుష్యులు ఉన్నారు. మరి ఆలోచించాలి కదా.
ఇప్పుడు పిల్లలైన మీకు ఇది పురుషోత్తమ సంగమయుగము, ఈ సమయములో తండ్రి మిమ్మల్ని
పురుషోత్తములుగా, పారసబుద్ధికలవారిగా తయారుచేస్తున్నారు. తండ్రి మనుష్యుల నుండి
దేవతలుగా తయారుచేసేందుకు మీకు సుమతమును (మంచి మతమును) ఇస్తున్నారు. మీరు ఇచ్చే గతి,
మీరు చూపే మార్గము అతీతమైనవి అని తండ్రి ఇచ్చే మతమును గురించే అంటూ ఉంటారు. దీని
అర్థము కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఎటువంటి శ్రేష్ఠ
మతమును ఇస్తానంటే, దాని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇప్పుడు కలియుగము పూర్తి
అవుతుంది, పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. మనుష్యులు పూర్తి ఘోర
అంధకారములో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. ఎందుకంటే శాస్త్రాలలో - కలియుగము
ఇప్పుడింకా బాల్యములోనే ఉందని, ఇంకా 40 వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయని వ్రాసి ఉంది.
84 లక్షల యోనులలో జన్మ తీసుకుంటామని భావించిన కారణముగా కల్పము ఆయువును కూడా చాలా
ఎక్కువగా చూపించారు. వాస్తవానికి అది ఐదు వేల సంవత్సరాలు మాత్రమే. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు తీసుకుంటారే కానీ 84 లక్షల జన్మలు కాదు. అనంతమైన
తండ్రికైతే ఈ శాస్త్రాలు మొదలైనవాటన్నిటి గురించి తెలుసు, కావుననే వారు అంటారు,
ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవని, ఇవి అర్ధకల్పము నడుస్తాయి, వీటి ద్వారా నన్ను
ఎవరూ కలుసుకోలేరు. రెండు వేల సంవత్సరాల సమయములో క్రిస్టియన్ల సంఖ్య ఇంతగా
పెరిగినప్పుడు, మరి కల్పము ఆయువు లక్షల సంవత్సరాలైతే ఇక సంఖ్య చాలా ఎక్కువగా ఉండి
ఉండాలి కదా, ఇది కూడా ఆలోచించవలసిన విషయము. భారత్ యొక్క వాస్తవిక ధర్మము దేవీ-దేవతా
ధర్మము, వాస్తవానికి అదే కొనసాగుతూ రావాలి, కానీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని
మర్చిపోయిన కారణముగా, మాది హిందూ ధర్మము అని చెప్పుకుంటున్నారు. నిజానికి హిందూ
ధర్మమనేది ఏదీ ఉండదు. భారత్ ఎంత ఉన్నతముగా ఉండేది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము
ఉన్నప్పుడు విష్ణుపురిగా ఉండేది. ఇప్పుడు ఇది రావణపురిగా మారిపోయింది. అదే
దేవీ-దేవతలు 84 జన్మల తర్వాత ఎలా అయిపోయారో చూడండి. దేవతలను నిర్వికారులుగా భావిస్తూ
స్వయాన్ని వికారులుగా భావిస్తూ వారిని పూజిస్తూ ఉంటారు. సత్యయుగములో భారత్
నిర్వికారిగా ఉండేది, అప్పుడు క్రొత్త ప్రపంచము ఉండేది, దానినే కొత్త భారత్ అని
అంటారు. ఇది పాత భారత్. కొత్త భారత్ ఎలా ఉండేది, ఇప్పుడు పాత భారత్ ఎలా తయారయ్యింది.
క్రొత్త ప్రపంచములో భారత్ యే కొత్తగా ఉండేది, ఇప్పుడు పాత ప్రపంచములో భారత్ కూడా
పాతదిగా ఉంది. ఎటువంటి గతి పట్టిందో చూడండి. భారత్ యే స్వర్గముగా ఉండేది, ఇప్పుడు
నరకముగా ఉంది. భారత్ అత్యంత సంపన్నముగా ఉండేది, ఇప్పుడు భారత్ యే పూర్తిగా దివాలా
తీసినట్లు అయిపోయింది. అందరి నుండి భిక్షము యాచిస్తున్నారు. ప్రజల నుండి కూడా
భిక్షము యాచిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. నేటి దేహాభిమానులైన
మనుష్యులకు కాస్త ధనము లభించేసరికి, మేమైతే స్వర్గములో కూర్చున్నాము అని భావిస్తారు.
సుఖధామమైన స్వర్గము గురించి అసలు ఏ మాత్రము తెలియదు ఎందుకంటే రాతిబుద్ధి కలవారిగా
ఉన్నారు. ఇప్పుడు వారిని పారసబుద్ధి కలవారిగా తయారుచేసేందుకు ఏడు రోజుల భట్టీలో
కూర్చోబెట్టండి, ఎందుకంటే పతితముగా ఉన్నారు కదా. పతితులను ఇక్కడైతే కూర్చోబెట్టలేరు.
ఇక్కడ కేవలం పావనులు మాత్రమే ఉండగలరు, పతితులను అనుమతించడానికి వీల్లేదు.
మీరు ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగములో కూర్చున్నారు. బాబా మమ్మల్ని ఇటువంటి
పురుషోత్తములుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. ఇది సత్యమైన సత్యనారాయణ కథ.
సత్యమైన తండ్రి మిమ్మల్ని నరుడి నుండి నారాయణుడిగా తయారుచేసే రాజయోగాన్ని
నేర్పిస్తున్నారు. జ్ఞానము కేవలం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది, వారినే జ్ఞాన
సాగరుడు అని అంటారు. శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడు, ఇది కేవలం వారొక్కరి మహిమనే.
ఇతరులెవ్వరి మహిమ ఇలా ఉండదు. దేవతల మహిమ వేరు, పరమపిత పరమాత్మ శివుని మహిమ వేరు.
వారు తండ్రి, శ్రీకృష్ణుడు దేవత. సూర్యవంశీయులే చంద్రవంశీయులు అవుతారు, వారే మళ్ళీ
వైశ్యవంశీయులు అవుతారు... మనుష్యులకు హంసో యొక్క అర్థము కూడా తెలియదు. ఆత్మ అయిన
మనమే పరమాత్మ అని అంటారు, అది ఎంత పొరపాటు. భారత్ యొక్క ఎక్కే కళ మరియు దిగే కళ ఏ
విధముగా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఇది జ్ఞానము, అదంతా భక్తి.
సత్యయుగములో అందరూ పావనముగా ఉండేవారు, రాజు, రాణుల రాజ్యము నడిచేది, అక్కడ మంత్రులు
కూడా ఉండరు ఎందుకంటే రాజు, రాణులు స్వయమే యజమానులుగా ఉంటారు. వారికి తండ్రి నుండి
వారసత్వము లభించింది. వారిలో తెలివి ఉంది. లక్ష్మీ-నారాయణులకు ఎవరి సలహా
తీసుకోవలసిన అవసరము ఉండదు. అక్కడ మంత్రులు ఉండరు. భారత్ వంటి పవిత్ర దేశము ఇంకేదీ
ఉండదు. ఇది చాలా ఉన్నతమైన, పవిత్రమైన దేశముగా ఉండేది, దాని పేరే స్వర్గము, ఇప్పుడు
అది నరకముగా ఉంది. నరకాన్ని మళ్ళీ స్వర్గముగా తండ్రియే తయారుచేస్తారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఒక్క తండ్రి ఇచ్చే సుమతముపై నడుస్తూ మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. ఈ
మనోహరమైన సంగమయుగములో స్వయాన్ని పురుషోత్తములుగా, పారసబుద్ధి కలవారిగా
తయారుచేసుకోవాలి.
2. ఏడు రోజుల భట్టీలో కూర్చుని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారుచేసుకోవాలి.
సత్యమైన తండ్రి నుండి సత్యనారాయణుని సత్య కథను విని నరుని నుండి నారాయణునిగా అవ్వాలి.
వరదానము:-
ప్రతి ఖజానాను తండ్రి డైరెక్షన్ల అనుసారముగా కార్యములో
వినియోగించే నిజాయితీ కలవారిగా మరియు
నమ్మకస్థులుగా కండి
నిజాయితీ కలవారు మరియు నమ్మకస్థులు అని ఎవరిని అంటారంటే, ఎవరైతే తండ్రి నుండి
ప్రాప్తించిన ఖజానాలను తండ్రి డైరెక్షన్లు లేకుండా ఏ కార్యములోనూ వినియోగించరో వారు.
ఒకవేళ సమయమును, వాణిని, కర్మను, శ్వాసను మరియు సంకల్పాన్ని పరమతము లేక సాంగత్య దోషము
కారణముగా వ్యర్థముగా పోగొడితే, స్వ చింతనకు బదులుగా పరచింతన చేస్తే, స్వమానానికి
బదులుగా ఏ రకమైన అభిమానములోకైనా వస్తే, శ్రీమతానికి బదులుగా మన్మతము ఆధారముగా
నడుచుకుంటే, వారిని నిజాయితీ కలవారు అని అనరు. ఈ ఖజానాలన్నీ విశ్వ కళ్యాణము కొరకు
లభించాయి, అందుకే వాటిని ఆ కార్యము కోసమే వినియోగించాలి, దీనినే నిజాయితీ కలవారిగా
ఉండడము అని అంటారు.
స్లోగన్:-
అపోజిషన్ అనేది మాయతో చేయాలి, దైవీ పరివారముతో కాదు.
అవ్యక్త సూచనలు -
సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి
ఆత్మలందరూ ఒకే
అనంతమైన పరివారానికి చెందినవారు, మన పరివారానికి చెందిన ఏ ఆత్మ కూడా వరదానము నుండి
వంచితమవ్వకూడదు - ఇటువంటి ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన శ్రేష్ఠ సంకల్పాలు మనసులో సదా
ఉండాలి. మీ ప్రవృత్తిలోనే బిజీగా ఉండకూడదు. అనంతమైన స్టేజిపై స్థితులై అనంతమైన
ఆత్మల సేవ చెయ్యాలి అన్న శ్రేష్ఠ సంకల్పాన్ని చెయ్యండి, ఇదే సఫలతకు సహజమైన సాధనము.
| | |