10-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పిల్లలైన మీ జోలెను అవినాశీ జ్ఞాన
రత్నాలతో నింపడానికి తండ్రి వచ్చారు, ఈ ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల రూపాయల
విలువైనది’’
ప్రశ్న:-
గుప్త దానానికి
ఇంత ఎక్కువ మహత్వము ఎందుకుంది?
జవాబు:-
ఎందుకంటే
తండ్రి మీకు ఇప్పుడు జ్ఞాన రత్నాలను గుప్తముగా దానము ఇస్తున్నారు, ఈ విషయము గురించి
ప్రపంచానికి తెలియదు, పిల్లలైన మీరు ఈ జ్ఞాన రత్నాలను దానము చేయడముతో విశ్వ
రాజ్యాన్ని తీసుకుంటారు. ఇది కూడా గుప్తముగా జరుగుతుంది కదా, ఇందులో ఏ యుద్ధము లేదు,
ఏ తుపాకులు మొదలైనవి లేవు, ఏ ఖర్చూ లేదు. గుప్తమైన రీతిలో తండ్రి మీకు రాజ్యాన్ని
దానము ఇచ్చారు, అందుకే గుప్త దానానికి ఎంతో మహత్వము ఉంది.
ఓంశాంతి
డబల్ ఓంశాంతి. ఒకటి శివబాబా చెప్తారు, మరొకటి బ్రహ్మా దాదా చెప్తారు. ఇరువురి
స్వధర్మము శాంతి. ఇరువురూ శాంతిధామ నివాసులు. పిల్లలైన మీరు కూడా శాంతిధామ నివాసులే.
మీరు నిరాకారీ దేశములో నివసించేవారు, పాత్రను అభినయించేందుకు సాకారీ దేశములోకి
వచ్చారు, ఎందుకంటే ఇది డ్రామా కదా. పై నుండి మొదలుకుని కింద వరకు డ్రామా
ఆదిమధ్యాంతాల జ్ఞానము పిల్లల బుద్ధిలో నిండి ఉంది. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు,
వారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకోండి. మీలో
తప్ప ఇంకెవరిలోనూ ఈ జ్ఞానము లేదు. మీరు ఈశ్వరీయ స్కూలులో చదువుకుంటున్నారు.
భగవానువాచ - భగవంతుడైతే ఒక్కరే. 10-20 మంది భగవంతులేమీ లేరు. ఎన్ని ధర్మాల వారైతే
ఉన్నారో, ఆ ధర్మాలకు చెందిన ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. తర్వాత తండ్రి సృష్టిని
రచిస్తారు, అప్పుడు ప్రజాపిత బ్రహ్మా అని అంటారు. శివుడిని ప్రజాపిత అని అనరు.
ప్రజలైతే జనన-మరణాలలోకి వస్తారు. ఆత్మ సంస్కారాల ఆధారముగా జనన-మరణాలలోకి వస్తుంది.
తర్వాత ప్రజాపిత బ్రహ్మా కావాలి. పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మా ద్వారా రచనను
రచిస్తారని అంటూ ఉంటారు. వారిని - పతిత-పావనా రండి, అని పిలవడము జరుగుతుంది.
ఎప్పుడైతే ప్రపంచము పతితముగా అవుతుందో మరియు అంతిమానికి చేరుకుంటుందో, అప్పుడే
పతితుల నుండి పావనముగా తయారుచేయడానికి తండ్రి వస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే
వస్తారని, ఇంకెప్పుడూ రారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు పూర్తి
జ్ఞానము లభించింది. మీరు డ్రామాలోని పాత్రధారులు కదా. డ్రామాలోని పాత్రధారులకు, ఎవరి
పాత్ర ఏమిటి అని అందరి పాత్రల గురించి తప్పకుండా తెలియాలి. అవి చిన్న హద్దు పాత్రలు
(డ్రామా), వాటి గురించైతే అందరికీ తెలుస్తుంది. మీరు కూడా చూసి వస్తుంటారు. ఒకవేళ
వాటి గురించి వ్రాయాలంటే వ్రాయగలరు, గుర్తు చేసుకోగలరు. అవి చిన్న డ్రామాలు. ఇదైతే
చాలా పెద్ద అనంతమైన డ్రామా, దీని గురించి సత్యయుగము నుండి మొదలుకుని కలియుగాంతము
వరకు మీకు తెలుసు. మనకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుందని ఇప్పుడు
పిల్లలైన మీకు తెలుసు. తర్వాత హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వము, హద్దు ప్రాపర్టీ
లభిస్తుంది. బాబా అర్థం చేయించారు - ఎవరైతే రాజులుగా అవుతారో, వారు ముందు జన్మలో
దాన-పుణ్యాలు మొదలైనవి చేయడముతో ఒక్క జన్మ కోసం రాజులుగా అవుతారు, వారు తర్వాత
జన్మలో కూడా రాజులుగా అవుతారని కాదు! సత్యయుగములో మీరు రాజులుగా, మహారాజులుగా
ఉండేవారు కానీ మీ రాజ్యము మాయమైపోతుందని ఏమీ భావించకండి. తర్వాత భక్తి మార్గములో,
వేరే రాజులు ఎక్కువ దాన-పుణ్యాలను చేస్తారు కనుక వారు కూడా రాజ్యము చేస్తారు. కానీ
వారు వికారీ రాజులుగా ఉంటారు. పూజ్యులుగా ఉన్న మీరే మళ్ళీ పూజారులుగా అయ్యారు. అది
అల్పకాలికమైన సుఖము. దుఃఖమైతే కేవలం ఇప్పుడే ఉంటుంది. ఇప్పుడు తమోప్రధానతలో కూడా
మీకు సుఖముంది, ఎటువంటి గొడవలు-కొట్లాటల విషయము లేదు. అవి తర్వాత జరుగుతాయి. జనాభా
లక్షల సంఖ్యకు చేరుకున్నప్పుడు యుద్ధము మొదలైనవి ప్రారంభమవుతాయి. పిల్లలైన మీకైతే
సత్య, త్రేతా, ద్వాపరయుగాలలో కూడా సుఖముంటుంది. తమోప్రధానత ప్రారంభమైనప్పుడు
కొద్దిగా దుఃఖముంటుంది. ఇప్పుడైతే అంతా తమోప్రధానముగానే ఉంది. ఇది ఉన్నదే తమోప్రధాన
ప్రపంచమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది అనంతమైన డ్రామా అని, దీని నుండి ఎవరూ
విముక్తులవ్వలేరని మీకు తెలుసు. మనుష్యులు దుఃఖముతో విసిగిపోయినప్పుడు, భగవంతుడు
ఇలాంటి ఆటను ఎందుకు రచించారని అంటారు. ఒకవేళ భగవంతుడు రచించకపోయి ఉంటే, ఇక ప్రపంచమే
ఉండదు, అసలేమీ ఉండదు. రచయిత మరియు రచన అయితే ఉన్నారు కదా. సత్యయుగము నుండి
కలియుగాంతము వరకు రచన గురించిన వివరణ ఉంది. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. మీరు కూడా
ప్రాక్టికల్ గా చూస్తారు. ముందు నుండే చూపించరు. 5 వేల సంవత్సరాల చక్రములో ఇంకా
కొద్ది సమయమే మిగిలి ఉంది. దానిని ఇప్పుడే చూపించరు, అది గడుస్తున్నప్పుడు దానిని
కూడా సాక్షీగా అయి చూస్తారు. ఏదైతే జరగనున్నదో, అది కల్పక్రితం వలె జరుగుతుంది.
ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని మీరు చూస్తున్నారు. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది.
అన్నింటికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది డ్రామాలో ముందు నుండే నిశ్చితమై ఉంది.
వినాశనము తప్పకుండా జరుగుతుంది. తమోప్రధానముగా తయారైన మీ ఆత్మను కూడా ఇక్కడే
సతోప్రధానముగా తయారుచేసుకోవాలని ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు.
ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు.
తండ్రి గుప్తముగా వస్తారని, గుప్తముగానే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారని ప్రపంచములో
ఎవరికీ తెలియదు. మీరు విశ్వ రాజ్యాన్ని గుప్తముగా తీసుకుంటారు, ఎటువంటి శబ్దము కలగదు.
దీనిని పూర్తిగా గుప్తమైన దానమని అంటారు కదా. తండ్రి వచ్చి పిల్లలకు అవినాశీ జ్ఞాన
రత్నాల యొక్క గుప్త దానాన్ని ఇస్తారు. తండ్రి కూడా ఎంత గుప్తమైనవారు, వారి గురించి
ఎవరికీ తెలియదు. ఈ బ్రహ్మాకుమార-కుమారీలంతా ఎక్కడికి వెళ్తారు, ఏమి చేస్తారు అనేది
ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఎంత గుప్తమైనవారు అనేది పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన
మిమ్మల్ని గుప్తముగా విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఏ యుద్ధము లేదు, ఏ
తుపాకులు లేవు, ఏ ఖర్చూ లేదు. ఇక్కడైతే ఒక చిన్న గ్రామాన్ని తీసుకునేందుకు కూడా
ఎన్ని గొడవలు, ఎన్ని కొట్లాటలు జరుగుతాయి. తండ్రి వచ్చి గుప్త దానాన్ని ఇస్తారు.
అవినాశీ జ్ఞాన రత్నాలతో మీ జోలిని నింపుతారు. జోలిని నింపండి, శివ భోళా భండారీ అని
అంటారు.
శివబాబా మా జోలిని అవినాశీ జ్ఞాన రత్నాలతో నింపుతున్నారని మీకు తెలుసు. ఒక్కొక్క
రత్నము లక్షల రూపాయలు విలువైనది. మీరు ఎన్ని రత్నాలను ఇస్తారు, మీరు ఎంత దానీ
అవుతారు. ఇదంతా గుప్తముగా జరుగుతుంది. దేవతలకు ఎన్ని ఆయుధాలు, భుజాలు మొదలైనవి
చూపించారు. వాస్తవానికి అటువంటిదేమీ లేదు. సత్యయుగములో దేవతలకు ఇన్ని భుజాలు
మొదలైనవైతే ఉండవు. కలియుగములో అనేక రకాల ఆయుధాలను ఎన్ని చూపించారు. వినాశనము కోసం
బాంబులు ఉన్నప్పుడు ఇక ఖడ్గాలు, బాణాలు మొదలైనవాటిని ఏమి చేస్తారు. మీరు జ్ఞాన
ఖడ్గము అని అంటారు, దానిని వారు ఆయుధముగా అర్థం చేసుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు.
మీకైతే గుప్త దానము లభిస్తుంది, మీరు మళ్ళీ అందరికీ గుప్త దానాన్ని ఇస్తారు. బాబా
మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు, శ్రీమతము భగవంతునిది. మనము నరుని నుండి
నారాయణునిగా అయ్యేందుకు వస్తామని మీకు తెలుసు. వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళల
సంపూర్ణులు, దైవీ గుణధారులని అంటారు. దైవీ గుణాలు కేవలం ఆ దేవీ-దేవతల్లోనే ఉంటాయి,
తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. పౌర్ణమి చంద్రుని ప్రకాశము బాగుంటుంది, అది తర్వాత
తగ్గిపోతూ ఉంటుంది, అలా తగ్గిపోతూ-తగ్గిపోతూ ఒక సన్నని రేఖ మాత్రమే మిగులుతుంది.
అంతా మాయమవ్వదు, ఒక రేఖ తప్పకుండా ఉంటుంది, దానినే అమావాస్య అని అంటారు. ఇప్పుడు
మీది అనంతమైన విషయము. మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. కృష్ణుని నోటిలో మాతలు
చంద్రుడిని చూసేవారన్నట్లు చూపిస్తారు. ఇవి సాక్షాత్కారము యొక్క విషయాలు. వీటి
గురించి తండ్రి కూర్చుని వివరిస్తారు. ఇప్పుడు మీరు సంపూర్ణమవ్వాలి. మాయ యొక్క
సంపూర్ణ గ్రహణము పట్టి ఉంది. చివరికి ఒక సన్నని రేఖ మిగులుతుంది. మెట్లు దిగుతూ
వచ్చారు. అందరూ మెట్లు దిగాల్సిందే, అప్పుడే మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళవలసి ఉంటుంది.
మీరైతే ఇప్పుడు కొద్దిమందే ఉన్నారు. నెమ్మది-నెమ్మదిగా వృద్ధి జరుగుతుంది. చదువులో
ఎక్కువమంది పాస్ అవ్వరు. మీ సెంటర్లు కూడా నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటాయి.
సమయము సమీపముగా వస్తూ ఉంటుంది. అప్పుడు, మీలో ఏముంది అనేది అర్థం చేసుకుంటారు.
రోజురోజుకు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు మనుష్యులు అంటారు - ఈ సెంటర్లు
ఎప్పటివరకు నడుస్తాయి, ఇవి సమాప్తమైపోతాయని మేము ఒకప్పుడు అనుకున్నాము అని.
ప్రారంభములో ఈ భయము వల్ల చాలామంది పారిపోయారు. ఏమవుతుందో తెలియదు అనుకున్నారు! అటుకి
ఇటుకి కాకుండా అయిపోతాము, దీనికంటే పారిపోవడమే మేలు అని అనుకున్నారు. అలా పారిపోయారు,
మళ్ళీ అందులో కొందరు తిరిగి వస్తూ ఉన్నారు. తండ్రి కూర్చుని ఎంత సహజమైన రీతిలో అర్థం
చేయిస్తారు! ఈ అబలలకు, అహల్యలకు ఏ కష్టాన్ని ఇవ్వరు. వీరి ఉద్ధరణ కూడా జరగాలి. బాబా,
మేమైతే ఏమీ చదువుకోలేదు అని అంటారు. తండ్రి అంటారు - ఏమీ చదువుకోకపోతే చాలా మంచిది.
శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదువుకున్నారో, వాటన్నింటినీ మర్చిపోండి. నేను ఎక్కువగా
ఏమీ చదివించను. కేవలం - నన్ను స్మృతి చేసినట్లయితే, ఇక రాజ్యాధికారము మీదే అని
చెప్తాను. అంతే, అప్పుడిక మీ నావ తీరానికి చేరుకుంటుంది. బిడ్డ జన్మించగానే బాబా అని
అంటాడు. అంతే, వారసత్వానికి హక్కుదారుడిగా అయిపోతాడు. ఇక్కడ కూడా మీరు హక్కుదారులుగా
అవుతారు. బాప్ దాదాను స్మృతి చేసారంటే ఇక రాజధాని మీదే. అందుకే సెకండులో జీవన్ముక్తి
అని గాయనము చేయడము జరుగుతుంది. షావుకారుల పాత్ర చివరిలో ఉంటుంది. ముందు పేదవారి వంతు.
వారు మీ వద్దకు వారంతట వారే వస్తారు. దళితుల ఉద్ధరణ కూడా జరగాలి. కొండజాతి స్త్రీల
గురించి కూడా గాయనము ఉంది. రాముడు కొండజాతి స్త్రీ ఇచ్చిన పండ్లను తిన్నాడని అంటారు.
వాస్తవానికి అలా తిన్నది రాముడు కాదు, శివబాబా కూడా కాదు. ఈ బ్రహ్మా తినాల్సి వచ్చి
ఉండవచ్చు. కొండజాతి స్త్రీ మొదలైనవారు వస్తారు. వారు టోలీ మొదలైనవి తీసుకువచ్చారు
అనుకోండి, బ్రహ్మా ఎలా నిరాకరించగలరు? కొండజాతి స్త్రీలు, వేశ్యలు తీసుకువస్తే మీరు
కూడా తింటారు. నేనైతే తినను, నేను అభోక్తను అని శివబాబా అంటారు. మీ వద్దకు అందరూ
వస్తారు. వీరిని ఉద్ధరించండి అని గవర్నమెంట్ కూడా సహాయము చేస్తుంది. మీకు కూడా
స్వతహాగా ప్రేరణ లభిస్తుంది. బాబా పేదల పెన్నిధి కనుక మేము కూడా పేదవారికి అర్థం
చేయించాలి అని. కొండజాతి స్త్రీల నుండి కూడా వెలువడుతారు. ఇంత పెద్ద వృక్షముంది,
ఇందులో ఒక్కరు కూడా దేవీ-దేవతా ధర్మం వారిగా లేరు. వేరే ధర్మాలన్నింటిలోకి కన్వర్ట్
అయిపోయారు.
ఇప్పుడు తండ్రి అంటారు - ఎవరైతే భక్తి చేసేవారు ఉంటారో, వారికి అర్థం చేయించండి.
అంటు ఎలా కట్టబడుతుంది, బ్రాహ్మణులు ఎలా తయారవుతున్నారు అనేది మీరు చూస్తున్నారు.
ఎవరైతే సూర్యవంశీ, చంద్రవంశీ దేవతలుగా అయ్యేవారుంటారో, వారే వస్తూ ఉంటారు. ఒక్కసారి
విన్నా కూడా, స్వర్గములోకి తప్పకుండా వస్తారు. బాబా కాశీలోని కత్తుల బావిలోకి దూకే
ఉదాహరణ కూడా వినిపించారు. శివునిపై బలి అయ్యేవారు. వారికి కూడా ఏదో ఒకటి లభించాలి.
మీరు కూడా బలి అవుతారు, రాజ్యము కోసం పురుషార్థము చేస్తారు. భక్తి మార్గములో
రాజ్యమైతే ఉండదు. ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అప్పుడు ఏమి జరుగుతుంది, వారు చేసిన పాపాలు
ఏవైతే ఉంటాయో, వాటికి శిక్షలు అనుభవించి సమాప్తము చేసుకుంటారు. తర్వాత కొత్త జన్మ
లభిస్తుంది. కొత్తగా పాపాలు మొదలవుతాయి. ఇకపోతే, ఉండడమైతే అందరూ ఇక్కడే ఉండాలి.
నంబర్ వన్ లోనైతే మీరే ఉన్నారు. మీరే 84 జన్మలు అనుభవిస్తారు. అందరూ సతో, రజో,
తమోలలోకి రావాల్సి ఉంటుంది. ఈ సమయములో మొత్తం మనుష్య సృష్టి యొక్క వృక్షము
శిథిలావస్థలో ఉందని తండ్రి అంటారు. మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారములో,
కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. కుంభకర్ణుడు అంటే ఒక్కరే కాదు, అనేకమంది
ఉన్నారు. మీరెంతగా అర్థం చేయించినా సరే, అసలు వినరు. ఎవరి పాత్ర ఉంటే, వారు
పురుషార్థము చేస్తారు మరియు వారే తల్లిదండ్రుల హృదయాన్ని అధిరోహిస్తారు.
సింహాసనాధికారులుగా కూడా వారే అవుతారు. బాబా, పిల్లలను తిట్టాల్సి వస్తుందని ఎంతమంది
మాతలు అడుగుతారు. తండ్రి అంటారు - దానికి అంత శిక్ష ఏమీ ఉండదు. పతితులైన మమ్మల్ని
పావనముగా చేయండి అని మీరు పిలుస్తారు. కామము మహాశత్రువు అని తండ్రి కూడా అంటారు.
క్రోధము శత్రువని అనరు. మాతలలో క్రోధము అంతగా ఉండదు, పురుషులు చాలా గొడవపడతారు.
ఇప్పుడు తండ్రి మాతలైన మిమ్మల్ని ముందు పెట్టారు. వందేమాతరం. లేదంటే - నీ పతి గురువు,
ఈశ్వరుడు, వారి మతమనుసారముగా నడుచుకోవాలని మాతలకు చెప్తారు. ముడి వేసిన వెంటనే
పతితముగా అవుతారు. ఇటువంటి ఈశ్వరుడా ఆమెకు లభించింది! ఇప్పుడు రామ రాజ్యము స్థాపన
అవుతుంది. మిగిలినవారంతా మరణిస్తూ ఉంటారు. వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే
ప్రీతి బుద్ధి అని బాబా అర్థం చేయించారు. మీకు పరమపిత పరమాత్ముని పట్ల ప్రీతి బుద్ధి
ఉంది. శివబాబా వీరిలోకి వస్తారని, వీరి ద్వారా మనము వింటున్నామని మీ ఆత్మకు తెలుసు.
ఆత్మ ఎంత చిన్న బిందువు. ఇది శివబాబా యొక్క తాత్కాలిక రథము. వీరి ద్వారా ఈ రుద్ర
జ్ఞాన యజ్ఞాన్ని రచించారు, ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లల ఒక్కొక్క నీటి
బిందువుతో కొలను నిండుతూ ఉంటుంది. పిల్లలు తమది సఫలం చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే
ఇదంతా మట్టిలో కలిసిపోతుందని, ఏమీ మిగలదని వారికి తెలుసు. ఈ మాత్రం అయినా
సఫలమవ్వాలని భావిస్తారు. సుదాముని ఉదాహరణ కూడా ఉంది కదా. కుమార్తెలు పిడికెడు
బియ్యాన్ని లేక 6-8 రూపాయలను బాబాకు పంపిస్తారు. వాహ్ పిల్లలూ! తండ్రి పేదల పెన్నిధి
కదా. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది, మళ్ళీ అలాగే జరుగుతుంది. బంధనములో ఉన్నవారు
ఉన్నారు. బాబా అంటారు - మీరు భాగ్యశాలి ఎందుకంటే శివబాబా చేయి అయితే లభించింది కదా.
ఆర్య సమాజము వారు మొదలైనవారంతా ఇక్కడకు వచ్చే రోజు కూడా వస్తుంది. ఎక్కడికి వెళ్తారు?
ముక్తి-జీవన్ముక్తులు లభించే దుకాణమైతే ఒక్కటే. శిక్షలు అనుభవించి అందరూ ముక్తిలోకి
వెళ్ళాలి. ఇది వినాశన సమయము. అందరూ తిరిగి వెళ్తారు. ఇది ప్రియుని ఊరేగింపు.
ఊరేగింపు ఎలా వెళ్తుంది అనేది కూడా సాక్షాత్కారమవుతుంది. మీరు తప్ప వేరెవ్వరూ
చూడలేరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ద్వారా జ్ఞానము యొక్క గుప్త దానమేదైతే లభించిందో, దాని విలువను అర్థం
చేసుకుని తమ జోలెను జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. అందరికీ గుప్తముగా దానమిస్తూ
వెళ్ళాలి.
2. ఈ వినాశన సమయములో తిరిగి వెళ్ళాలి కావున తమదంతా సఫలము చేసుకోవాలి. ప్రీతి
బుద్ధి కలవారిగా అవ్వాలి. ముక్తి మరియు జీవన్ముక్తుల మార్గాన్ని అందరికీ తెలియజేయాలి.
వరదానము:-
అమాయకత్వముతోపాటు ఆల్మైటీ అథారిటీగా అయి మాయను ఎదుర్కునే
శక్తి స్వరూప భవ
అప్పుడప్పుడూ అమాయకత్వము చాలా భారీ నష్టాన్ని
కలుగజేస్తుంది. సరళత, భోళా రూపాన్ని ధారణ చేస్తుంది. కానీ ఎదుర్కోలేనంతగా భోళాగా
అవ్వకండి. సరళతతోపాటు ఇముడ్చుకునే శక్తి మరియు సహనశక్తి కూడా కావాలి. ఏ విధముగా
తండ్రి భోళానాథునిగా ఉండడంతో పాటు ఆల్మైటీ అథారిటీగా ఉన్నారో, అదే విధముగా మీరు కూడా
భోళాగా ఉండడంతో పాటు శక్తి స్వరూపముగా కూడా అవ్వండి, అప్పుడు మాయ బుల్లెట్ తగలదు,
మాయ ఎదిరించేందుకు బదులుగా నమస్కారము చేస్తుంది.
స్లోగన్:-
మీ హృదయములో
స్మృతి యొక్క జెండాను ఎగరవేసినట్లయితే ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేయబడుతుంది.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
విశేషముగా స్మృతి
యాత్రను శక్తిశాలిగా చేసుకోండి, జ్ఞాన స్వరూపములో అనుభవీలుగా అవ్వండి. శ్రేష్ఠ
ఆత్మలైన మీ శుభ వృత్తి, కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణము అనేక తపిస్తున్న,
భ్రమిస్తున్న, పిలుస్తున్న ఆత్మలకు ఆనందము, శాంతి మరియు శక్తి యొక్క అనుభూతిని
చేయిస్తాయి.