10-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మిమ్మల్ని పూజారుల నుండి
పూజ్యులుగా తయారుచేయడానికి వచ్చారు, పూజ్యుల నుండి పూజారులుగా మరియు పూజారుల నుండి
పూజ్యులుగా అయ్యేటువంటి పూర్తి కథ పిల్లలైన మీకు తెలుసు’’
ప్రశ్న:-
ఏ విషయము
ప్రపంచములోని వారికి అసంభవము అనిపిస్తుంది కానీ మీరు సహజముగా దానిని మీ జీవితములో
ధారణ చేస్తారు?
జవాబు:-
ప్రపంచములోని
వారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా ఉండటము పూర్తిగా అసంభవమని భావిస్తారు
కానీ మీరు దానిని సహజముగా ధారణ చేస్తారు, ఎందుకంటే దీని ద్వారా స్వర్గ రాజ్యాధికారము
లభిస్తుందని మీకు తెలుసు. మరి ఇది చాలా తక్కువ ధరతో కూడిన బేరము అయినట్లు కదా.
పాట:-
ఈ రోజు ఉదయమే
ఎవరు వచ్చారు...
ఓంశాంతి
అంధకారము మరియు
ఉదయము - ప్రపంచము దృష్టిలో వీటి అర్థము పూర్తిగా వేరుగా ఉంటుంది. వారి విషయములో అది
సామాన్యమైన విషయము. పిల్లలైన మీ ఉదయము అసామాన్యమైనది. అంధకారము మరియు ఉదయము అని
దేనిని అంటారో ప్రపంచానికి తెలియదు. వాస్తవానికి ఈ అంధకారము మరియు ఉదయము, కల్పము
యొక్క ఈ పురుషోత్తమ సంగమయుగములో ఉంటాయి. ఇప్పుడు అజ్ఞాన అంధకారము దూరమవుతుంది.
జ్ఞానసూర్యుడు ఉదయించినప్పుడు అజ్ఞానాంధకారము సమాప్తమవుతుందని పాడుతారు కూడా. ఆ
సూర్యుడైతే ప్రకాశాన్ని ఇచ్చేవాడు. ఇది జ్ఞానసూర్యునికి సంబంధించిన విషయము. భక్తిని
అంధకారమని, జ్ఞానాన్ని ప్రకాశమని అంటారు. ఉదయమవుతూ ఉందని, భక్తి మార్గపు అంధకారము
పూర్తి అయిపోతుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. భక్తిని అజ్ఞానమని అంటారు
ఎందుకంటే ఎవరినైతే భక్తి చేస్తున్నారో, వారి గురించిన జ్ఞానము ఏ మాత్రము లేదు. సమయము
వృధా అవుతుంది. బొమ్మల పూజ జరుగుతూ ఉంటుంది. అర్ధకల్పము నుండి ఈ బొమ్మల పూజ
జరుగుతుంది. ఎవరినైతే పూజిస్తున్నారో, వారి గురించిన పూర్తి జ్ఞానము కూడా ఉండాలి.
దేవీ-దేవతలది పూజ్య వంశావళి. ఆ పూజ్యులే, మళ్ళీ పూజారులుగా అవుతారు. పూజ్యుల నుండి
పూజారులుగా, పూజారుల నుండి పూజ్యులుగా అయ్యే కథ ఎంత పెద్దది. మనుష్యులకైతే, పూజ్యులు
మరియు పూజారులు యొక్క అర్థం కూడా తెలియదు. అంధకారము పూర్తి అయ్యే సమయములో సంగమములోనే
పరమపిత పరమాత్మ వస్తారు. ఉదయమును తీసుకువచ్చేందుకు వస్తారు. కానీ వారు కల్పము యొక్క
సంగమయుగానికి బదులుగా యుగే-యుగే అని వ్రాసేసారు. నాలుగు యుగాలు పూర్తి అయినప్పుడు,
పాత ప్రపంచము సమాప్తమై మళ్ళీ కొత్త ప్రపంచము ప్రారంభమవుతుంది. దీనిని కళ్యాణకారీ
సంగమయుగమని అంటారు. ఈ సమయములో అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఎవరైనా మరణించినప్పుడు,
స్వర్గానికి వెళ్ళారని అంటారు, అంటే వారు తప్పకుండా అప్పటివరకు నరకములో ఉన్నారని
అర్థము. కానీ తాము నరకములో ఉన్నారని ఎవరూ అర్థం చేసుకోరు. రావణుడు అందరి బుద్ధికి
పూర్తిగా తాళము వేసేసాడు. అందరి బుద్ధి పూర్తిగా హతమార్చబడింది. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - భారతవాసుల బుద్ధి అందరికంటే విశాలముగా ఉండేది. తర్వాత ఎప్పుడైతే
పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోతారో, అప్పుడే దుఃఖము పొందుతారు. డ్రామా ప్లాన్
అనుసారముగా వివేకహీనులుగా అవ్వాల్సిందే. వివేకహీనులుగా తయారుచేసేది మాయ. పూజ్యులను
వివేకవంతులని మరియు పూజారులను వివేకహీనులని అంటారు. మేము నీచులము, పాపులము అని కూడా
అంటారు, కానీ, వివేకవంతులుగా ఎప్పుడు ఉండేవారు అనేది తెలియదు. రావణ రూపీ మాయ
పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా చేసేస్తుంది. మనమే పూజ్యులుగా ఉండేవారమని, తర్వాత
పూజారులుగా అయ్యామని ఇప్పుడు మీకు అర్థమయ్యింది. ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషము
కలుగుతుంది. మాకు శాంతి లభించాలని మరియు జనన-మరణాల నుండి విముక్తులుగా అవ్వాలని చాలా
రోజుల నుండి ఆర్తనాదాలు చేస్తూ వచ్చారు, కానీ ఈ మాయ సంకెళ్ళ నుండి విముక్తులు
అవ్వాలి, ఈ జ్ఞానము కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు.
మెట్లు దిగుతూ
వస్తామని మీకు తెలుసు. సత్యయుగములోనైతే నెమ్మది-నెమ్మదిగా దిగుతారు, సమయము పడుతుంది.
సుఖము యొక్క మెట్లు దిగడానికి సమయము పడుతుంది. దుఃఖము యొక్క మెట్లను త్వరత్వరగా
దిగుతారు. సత్య-త్రేతా యుగాలలో 21 జన్మలు, ద్వాపర-కలియుగాలలో 63 జన్మలు ఉంటాయి,
ఆయుష్షు తగ్గిపోతుంది. ఒక్క చిటికెలో మనం ఎక్కే కళలోకి వెళ్తామని ఇప్పుడు మీకు
తెలుసు. జనకునికి ఒక్క సెకండులో జీవన్ముక్తి లభించిందని అంటూ ఉంటారు కూడా. కానీ
జీవన్ముక్తి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. ఒక్క జనకునికే జీవన్ముక్తి లభించిందా
లేక మొత్తం ప్రపంచానికి లభించిందా? ఇప్పుడు మీ బుద్ధి తాళము తెరుచుకుంది. ఎవరికైనా
మందబుద్ధి ఉంటే - పరమాత్మ, వీరికి మంచి బుద్ధిని ఇవ్వండి అని అంటారు. సత్యయుగములో
ఇలాంటి విషయమేమీ ఉండదు. ఏ ఆత్మలైతే పరమాత్మ నుండి చాలా కాలం వేరుగా ఉంటారో, వారి
లెక్క కూడా ఉంటుంది. తండ్రి పరంధామములో ఉన్నప్పుడు, ఆ సమయములో ఏ ఆత్మలైతే వారితో
పాటు ముక్తిధామములో ఉంటారో మరియు చివరిలో వస్తారో, వారు చాలా సమయము తండ్రితో పాటు
ఉంటారు. మనమైతే అక్కడ కొంత సమయమే ఉంటాము. అందరికన్నా ముందు తండ్రి నుండి మనం
వేరవుతాము, అందుకే ఆత్మ-పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారు... అని అంటూ ఉంటారు.
ఎవరైతే తండ్రి నుండి చాలా కాలం వేరుగా ఉన్నారో, ఇప్పుడు వారిదే మేళా జరుగుతుంది.
ఎవరైతే తండ్రితోపాటు అక్కడ చాలా సమయము ఉంటారో, వారిని కలుసుకోరు. తండ్రి అంటారు -
విశేషముగా పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకే నేను వస్తాను. నేను పిల్లలైన మీతో
ఉన్నప్పుడు అందరి కళ్యాణము జరుగుతుంది. ఇప్పుడిది అందరి వినాశన సమయము. ఇప్పుడు అందరూ
లెక్కాచారాలను సమాప్తము చేసుకుని వెళ్ళిపోతారు. తర్వాత, మీరు రాజ్య భాగ్యాన్ని
పొందుతారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. గాడ్ ఫాదర్, లిబరేటర్, గైడ్ అని
పాడుతారు కూడా. దుఃఖము నుండి విముక్తులుగా చేసి శాంతిధామానికి తీసుకువెళ్ళేందుకు
గైడ్ గా అవుతారు. సుఖధామానికి తీసుకువెళ్ళేందుకు గైడ్ గా అవ్వరు. ఆత్మలను
శాంతిధామానికి తీసుకువెళ్తారు, ఆత్మలు నివసించే ఆ ప్రపంచము నిరాకారీ ప్రపంచము. కానీ
పతితముగా ఉన్న కారణముగా ఎవరూ అక్కడికి వెళ్ళలేరు, అందుకే పతిత-పావనుడైన తండ్రిని
పిలుస్తారు. విశేషముగా భారతవాసులు ఎప్పుడైతే తలక్రిందులుగా అవుతారో, అప్పుడు
అనంతమైన తండ్రిని కుక్క-పిల్లి, రాయి-రప్పలలో ఉన్నారని అంటారు. విచిత్రము కదా. నన్ను
మీ కంటే కూడా తక్కువగా చూపిస్తారు. ఇది కూడా డ్రామా ఈ విధముగా తయారై ఉంది. ఇందులో
ఎవరి దోషము లేదు, అందరూ డ్రామాకు వశమై ఉన్నారు. ఈశ్వరునికి వశమై లేరు. ఈశ్వరుని కంటే
కూడా డ్రామా శక్తివంతమైనది. తండ్రి అంటారు - నేను కూడా డ్రామానుసారముగా నా సమయానికి
వస్తాను. నేను రావడమనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. భక్తి మార్గములో మనుష్యులు
ఎంతగా భ్రమిస్తూ ఉంటారు. మీకు తండ్రి లభించారు. తండ్రి నుండి చిటికెలో వారసత్వము
తీసుకోవాలి. వారసత్వము లభించిన తర్వాత ఇక భ్రమించాల్సిన అవసరము లేదు. భగవంతుడు
స్వయముగా చెప్తున్నారు - నేను వచ్చి వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. ముందు
సత్యఖండముగా ఉండేది, తర్వాత అసత్యఖండముగా ఎలా అయ్యింది, ఇది ఎవరికీ తెలియదు. గీతను
ఎవరు వినిపించారు, ఇది కూడా భారతవాసులకు తెలియదు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము భారత్
కు సంబంధించిందే. దేవతా ధర్మము వారే సతోప్రధాన పూజ్యుల నుండి తమోప్రధాన పూజారులుగా
అయినప్పుడు, దేవతా ధర్మము కనుమరుగైపోతుంది, అప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ ఆ ధర్మాన్ని
స్థాపన చేస్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి, శాస్త్రాలు కూడా ఉన్నాయి. భారతవాసుల
శాస్త్రము శిరోమణి గీత ఒక్కటే. ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్నే మర్చిపోయారు, అందుకే
పేరును మార్చి హిందువు అన్న పేరు పెట్టుకున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది.
ఆత్మయే పునర్జన్మల్లోకి వస్తూ తమోప్రధానముగా అయిపోతుంది, మాలిన్యము చేరుకుంటుంది.
మనం సత్యమైన నగలుగా
ఉండేవారమని, ఇప్పుడు అసత్యముగా అయిపోయామని మీకు తెలుసు. నగ అని శరీరాన్ని అంటారు.
శరీరము ద్వారానే పాత్రను అభినయిస్తారు. మనకు ఎంత పెద్ద 84 జన్మల పాత్ర లభించింది.
దేవతా, క్షత్రియ... అలా మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారు. నేను ఒకవేళ
పూజ్యము నుండి పూజారిగా అయితే, మిమ్మల్ని పూజ్యులుగా ఎవరు తయారుచేస్తారు. నేనైతే సదా
పావనుడిని, జ్ఞాన సాగరుడిని, పతిత-పావనుడిని. మీరే పూజ్యులుగా, పూజారులుగా అయి పగలు
మరియు రాత్రిలోకి వస్తారు. కానీ వారికి ఈ విషయము తెలియదు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - ప్రపంచము అసత్యముగా తయారవుతూ ఉన్నప్పుడు, ఇన్ని అసత్య కథలను
కూర్చుని తయారుచేసారు. వ్యాసుడు కూడా అద్భుతము చేసారు. ఇప్పుడు వ్యాసుడైతే భగవంతుడు
కాదు. భగవంతుడైతే వచ్చి బ్రహ్మా ద్వారా వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయించారు.
వారేమో బ్రహ్మా చేతిలో శాస్త్రాలను చూపించారు. మరి భగవంతుడు ఎక్కడ ఉన్నారు? విష్ణువు
నాభి నుండి బ్రహ్మా వెలువడ్డారు కనుక విష్ణువు కూర్చుని శాస్త్రాల సారాన్ని
తెలియజేసారని కాదు, అలా కాదు, వారు బ్రహ్మా ద్వారా అర్థం చేయించారు. త్రిమూర్తుల
పైన శివబాబా ఉన్నారు, వారు కూర్చుని బ్రహ్మా ద్వారా సారాన్ని తెలియజేస్తారు. ఎవరి
ద్వారానైతే అర్థం చేయిస్తారో, వారే మళ్ళీ పాలన చేస్తారు. మీరు
బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు. బ్రాహ్మణ వర్ణము ఉన్నతోన్నతమైనది. మీరు ఇప్పుడు
ఈశ్వరీయ సంతానము. ఈశ్వరుడు రచించిన యజ్ఞాన్ని మీరు సంభాళిస్తారు. ఈ జ్ఞాన యజ్ఞములో
మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. దీనికి రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర
జ్ఞాన యజ్ఞము అన్న పేరును పెట్టారు. రాజ్యాన్ని ప్రాప్తి చేయించేందుకు తండ్రి
యజ్ఞాన్ని రచించారు. వాళ్లు యజ్ఞాలను రచించినప్పుడు మట్టితో శివలింగాన్ని మరియు
సాలిగ్రామాలను తయారుచేస్తారు. వాటిని తయారుచేసి, పాలన చేసి, ఆ తర్వాత సమాప్తము
చేసేస్తారు. దేవతల మూర్తులను కూడా ఇలానే చేస్తారు. ఎలా అయితే చిన్న పిల్లలు బొమ్మలతో
ఆడుకుంటారో, ఇక్కడ కూడా అలా చేస్తారు. ఇప్పుడు తండ్రి గురించైతే - భగవంతుడు స్థాపన,
పాలన, ఆ తర్వాత వినాశనము చేస్తారని అంటారు. మొదట స్థాపన చేస్తారు.
ఇప్పుడు మీరు
మృత్యులోకములో అమరలోకము కోసం చదువుకుంటున్నారు. మృత్యులోకములో ఇది మీ అంతిమ జన్మ.
తండ్రి అమరలోకాన్ని స్థాపన చేయడానికి వస్తారు. కేవలం ఒక పార్వతికే కథ వినిపిస్తే
ఏమవుతుంది. అమరనాథుడని శంకరుడిని అంటారు, వారితో పార్వతిని చూపిస్తారు. ఇప్పుడు
శంకరుడిని మరియు పార్వతిని సూక్ష్మవతనములో చూపించినప్పుడు వారు స్థూలముగా ఎలా రాగలరు?
జగదంబ మరియు జగత్ పిత లక్ష్మీ-నారాయణులు అవుతారని ఇప్పుడు మీకు అర్థం చేయించారు. ఆ
లక్ష్మీ-నారాయణులే 84 జన్మల తర్వాత జగదంబ, జగత్ పితలుగా అవుతారు. వాస్తవానికి జగదంబ
పురుషార్థీ మరియు లక్ష్మి పావన ప్రారబ్ధము. ఎక్కువ మహిమ ఎవరికి ఉంది? జగదంబకు ఎన్ని
మేళాలు జరుగుతాయో చూడండి. కలకత్తాలోని కాళీ చాలా ప్రసిద్ధమైనవారు. నల్ల విగ్రహ
రూపములో ఉన్న కాళీ మాత వద్ద నల్లని తండ్రి మూర్తిని ఎందుకు తయారుచేయలేదు?
వాస్తవానికి ఆదిదేవి అయిన జగదంబ, జ్ఞాన చితిపై కూర్చుని నలుపు నుండి తెలుపుగా
తయారవుతారు. ముందు జ్ఞాన-జ్ఞానేశ్వరిగా ఉంటారు, తర్వాత రాజ-రాజేశ్వరిగా అవుతారు.
ఇక్కడకు మీరు ఈశ్వరుడి నుండి జ్ఞానాన్ని తీసుకుని రాజ-రాజేశ్వరిగా అవ్వడానికి
వచ్చారు. లక్ష్మీ-నారాయణులకు రాజ్యాన్ని ఎవరిచ్చారు? ఈశ్వరుడు. అమర కథను,
సత్యనారాయణ కథను ఆ తండ్రియే వినిపిస్తారు, దాని ద్వారా సెకెండులో నరుని నుండి
నారాయణునిగా తయారవుతారు.
ఇప్పుడు పిల్లలైన మీ
బుద్ధి తెరుచుకుంది - కామము మహాశత్రువని అర్థం చేసుకున్నారు. గృహస్థ వ్యవహారములో
ఉంటూ పవిత్రముగా ఉండటము అసంభవమని అంటారు. తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా వారు
తమ పిల్లలకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారని అర్థం చేయించడం జరుగుతుంది. మరి
స్వర్గ రాజ్యాధికారాన్ని పొందాలంటే ఈ ఒక్క జన్మ అయితే పవిత్రముగా ఉండాల్సి ఉంటుంది.
ఇది చాలా తక్కువ ధరతో కూడిన బేరము కదా. వ్యాపారస్థులు ఈ విషయాన్ని బాగా అర్థం
చేసుకుంటారు, ఎందుకంటే వ్యాపారస్థులు దానము కూడా చేస్తారు. ధర్మార్థము కూడా కొంత
ధనాన్ని పక్కకు తీస్తారు. తండ్రి అంటారు - ఈ వ్యాపారము ఎవరో అరుదుగా చేస్తారు. ఇది
ఎంత తక్కువ ధరతో కూడిన బేరము. కానీ కొంతమంది ఈ వ్యాపారము చేసి మళ్ళీ వదిలి
పారిపోతారు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. జ్ఞానసాగరుడు
ఒక్కరే, వారే అర్థం చేయిస్తారు. ఎవరైతే పావనముగా, పూజ్యునిగా ఉండేవారో, వారే మళ్ళీ
84 జన్మల అంతిమములో పూజారిగా అయ్యారు. వారి తనువులో నేను ప్రవేశించాను. ప్రజాపిత
అయితే ఇక్కడ ఉంటారు కదా. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి ఫరిశ్తాలుగా అవుతున్నారు.
ఇప్పుడు భక్తి మార్గపు రాత్రి తర్వాత జ్ఞానము అనగా పగలు వస్తుంది. తిథి-తారీఖులైతే
లేవు. శివబాబా ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. కృష్ణ జయంతిని ఘనముగా
జరుపుకుంటారు. శివజయంతి గురించి ఎవరికీ తెలియను కూడా తెలియదు. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ కళ్యాణకారీ యుగములో ఒక్క తండ్రి నుండే సత్యమైన సత్యనారాయణ కథను, అమరకథను
వినాలి. ఇంతవరకు ఏదైతే విన్నారో, దానిని మర్చిపోవాలి.
2. సత్యయుగీ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు ఈ ఒక్క జన్మలో పవిత్రముగా ఉండాలి.
ఫరిశ్తాలుగా అయ్యే పురుషార్థము చేయాలి.
వరదానము:-
ప్రతి సంకల్పము, సమయము, మాట మరియు కర్మ ద్వారా ఈశ్వరీయ సేవ
చేసే సంపూర్ణ విశ్వాసపాత్రులుగా కండి
ఎవరైతే ప్రతి వస్తువును పూర్తిగా సంభాళిస్తారో, వారిని
సంపూర్ణ విశ్వాసపాత్రులని అంటారు. వారు ఏ వస్తువునూ వ్యర్థముగా పోనివ్వరు. జన్మ
తీసుకున్నప్పటి నుండి సంకల్పము, సమయము మరియు కర్మ, అన్నీ ఈశ్వరీయ సేవార్థము ఉండాలి.
ఒకవేళ ఈశ్వరీయ సేవకు బదులుగా, ఇంకెటువైపైనా సంకల్పాలు లేక సమయము పోయినా, వ్యర్థమైన
మాటలు వెలువడినా లేదా తనువు ద్వారా వ్యర్థ కార్యము జరిగినా, అటువంటివారిని సంపూర్ణ
విశ్వాసపాత్రులని అనరు. ఒక్క సెకండు లేదా ఒక్క పైసా వ్యర్థముగా పోతే అదేమంత పెద్ద
విషయము అని అనుకోకూడదు. అలా కాదు. సంపూర్ణ విశ్వాసపాత్రులు అనగా అంతా సఫలము
చేసుకునేవారు.
స్లోగన్:-
శ్రీమతాన్ని
యథార్థముగా అర్థం చేసుకుని, ప్రతి అడుగు దాని అనుసారముగా నడుచుకోవడములోనే సఫలత ఇమిడి
ఉంది.
మాతేశ్వరిగారి
అమూల్యమైన మహావాక్యాలు - ‘‘రాజఋషులు సత్యయుగానికి చెందినవారు’’
ద్వాపరములో రాజఋషులు
ఉండేవారని, వారు త్రికాలదర్శులు అయిన కారణముగా కూర్చుని వేద-శాస్త్రాలను రచించారని
మనుష్యులు అంటూ ఉంటారు. ఇప్పుడు వాస్తవానికి రాజఋషులని మనం సత్యయుగములోనే అనగలము,
ఎందుకంటే అక్కడ వికారాలను పూర్తిగా జయించి ఉన్నారు అనగా కమల పుష్ప సమానముగా
జీవన్ముక్త అవస్థలో ఉంటూ రాజ్యాన్ని నడిపిస్తారు. ఇకపోతే, ద్వాపరములో పరమాత్మను
ప్రాప్తి చేసుకునేందుకు తపస్య చేసే ఋషులు ఎవరైతే ఉంటారో, వారు వేద-శాస్త్రాలను
రచించారు. సత్యయుగములోనైతే వేద-శాస్త్రాల అవసరమే ఉండదు, అలాగే వారిని
త్రికాలదర్శులని కూడా అనలేము. మనం బ్రహ్మా, విష్ణు, శంకరులనే త్రికాలదర్శులని అనలేము
అన్నప్పుడు ద్వాపరయుగానికి చెందిన రజోగుణీ సమయములోని ఋషులు, మునులు త్రికాలదర్శులుగా
ఎలా అవ్వగలరు. త్రికాలదర్శి, త్రిమూర్తి, త్రినేత్రి అని కేవలం ఒక్క పరమాత్మ
శివుడిని మాత్రమే అనగలము, వారు స్వయంగా ఈ కల్పము యొక్క అంతిమ సమయములో వచ్చి మొత్తం
రచనను సమాప్తము చేస్తారు. అక్కడ సత్యయుగములో ప్రారబ్ధాన్ని అనుభవించేది ఉంటుంది.
బ్రహ్మా వంశీ బ్రాహ్మణులైన మనం మాత్రమే మాస్టర్ త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా
అవుతాము అనే జ్ఞానము అక్కడ ఉండదు. ఇకపోతే, మొత్తం కల్పములో ఇంకెవ్వరికీ జ్ఞానము
లభించదు. దేవతలను గాని, మనుష్యులను గాని త్రికాలదర్శులని అనలేము. అచ్ఛా - ఓం శాంతి.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
ఎప్పుడూ కూడా మీరు
చేసిన పుణ్యానికి ప్రతిఫలముగా ప్రశంసను పొందాలన్న కోరికను కూడా పెట్టుకోకూడదు. ఈ
హద్దు ప్రశంసను స్వీకరించటము అనగా సదాకాలపు ప్రాప్తి నుండి వంచితులవ్వటము. అందుకే
సదా ఇవ్వటములో సాగరము సమానముగా సంపన్నముగా అవ్వండి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులకు
సంతోషము, బాబా స్నేహము, అతీంద్రియ సుఖముతో కూడిన ఆత్మిక ఆనందమయ జీవితాన్ని అనుభవము
చేయించాలి. మీరు చేసే ప్రతి కర్మ సర్వాత్మల పట్ల సదా సహయోగపు ప్రాప్తిని
కలిగించేదిగా ఉండాలి.