10-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తమ భాగ్యాన్ని ఉన్నతముగా
తయారుచేసుకోవాలంటే ఆత్మిక సేవ పట్ల అభిరుచి పెట్టుకోండి, అందరికీ జ్ఞాన ధనాన్ని
దానము చేస్తూ ఉండండి’’
ప్రశ్న:-
నేటి వరకు
మనుష్యులెవ్వరూ ఇవ్వలేని ఏ శ్రీమతాన్ని ఆత్మిక తండ్రి ఇస్తారు?
జవాబు:-
ఓ ఆత్మిక
పిల్లలూ, మీరు ఆత్మిక సేవలో దధీచి ఋషి వలె ఎముకలను అర్పించండి. తండ్రి ద్వారా
అవినాశీ జ్ఞాన రత్నాలు ఏవైతే లభించాయో, వాటిని దానము చేయండి. ఇదే సత్యమైన సేవ.
ఇటువంటి సేవను చేసే మతాన్ని మనుష్యులెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మిక సేవ చేసేవారు సంతోషములో
నాట్యము చేస్తూ ఉంటారు. వారి భాగ్యము ఉన్నతముగా తయారవుతూ ఉంటుంది.
పాట:-
ప్రపంచము
మారినా...
ఓంశాంతి
పిల్లలు పాటలోని రెండు లైన్లను విన్నారు. వారైతే పాటను తయారుచేసారు. ఎలాగైతే
ఎవరికైనా నిశ్చితార్థము జరిగితే, ఈ విషయము పక్కాగా ఉంటుంది - పతి-పత్ని ఒకరినొకరు
ఎప్పుడూ విడిచిపెట్టరు అని. పరస్పరములో పడకపోతే విడిచిపెట్టేసేవారు ఎవరో అరుదుగా
ఉంటారు. ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు? ఈశ్వరునితో. వారితో
పిల్లలైన మీకు లేదా ప్రేయసులైన మీకు నిశ్చితార్థము జరిగింది. కానీ ఎవరైతే ఇలా
విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని కూడా విడిచిపెట్టేస్తారు. ఇక్కడ
పిల్లలైన మీరు కూర్చున్నారు. ఇప్పుడిక అనంతమైన బాప్ దాదా రాబోతున్నారని మీకు తెలుసు.
ఇక్కడ మీకు ఈ అవస్థ ఏదైతే ఉంటుందో, అది బయట సెంటర్లలో ఉండదు. బాప్ దాదా రాబోతున్నారు
అని ఇక్కడ మీరు భావిస్తారు. బయట సెంటర్లలో, బాబా ద్వారా వినిపించబడిన మురళీ
రాబోతుందని భావిస్తారు. ఇక్కడికి మరియు అక్కడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ
అనంతమైన బాప్ దాదాకు సమ్ముఖములో మీరు కూర్చున్నారు. అక్కడ మీరు సమ్ముఖములో లేరు.
సమ్ముఖములోకి వెళ్ళి మురళీని వినాలని కోరుకుంటారు. బాబా రాబోతున్నారని ఇక్కడ పిల్లల
బుద్ధిలోకి వచ్చింది. ఇతర సత్సంగాలు ఉంటాయి కదా, అక్కడ ఫలానా స్వామి వస్తారని
భావిస్తారు. కానీ ఈ ఆలోచన కూడా అందరికీ ఏకరసముగా ఉండదు. కొంతమందికి సంబంధీకులు
గుర్తుకువస్తారు. బుద్ధి ఆ ఒక్క గురువు పైన కూడా నిలవదు. స్వామి స్మృతిలో
కూర్చునేవారు ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అందరూ శివబాబా
స్మృతిలో ఉంటారని కాదు. బుద్ధి పరిగెడుతూ ఉంటుంది. మిత్ర-సంబంధీకులు గుర్తుకువస్తారు.
మొత్తం సమయమంతా ఒక్క శివబాబా సమ్ముఖములోనే ఉంటే అహో సౌభాగ్యము. స్థిరమైన స్మృతిలో
ఎవరో అరుదుగా మాత్రమే ఉంటారు. ఇక్కడ శివబాబాకు సమ్ముఖములో ఉండటములోనైతే చాలా
సంతోషముండాలి. అతీంద్రియ సుఖము గురించి గోపీ వల్లభుని గోప-గోపికలను అడగండి అని
ఇక్కడే అంటూ ఉంటారు. ఇక్కడ మీరు బాబా స్మృతిలో కూర్చున్నారు. ఇప్పుడు మనము
ఈశ్వరునికి చెందినవారిగా అయ్యామని, తర్వాత దైవీ ఒడిలో ఉంటామని తెలుసు. కొంతమంది
బుద్ధిలో సేవా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి - ఈ చిత్రములో ఈ కరెక్షన్ చేయాలి, ఇది
వ్రాయాలి అని. కానీ మంచి పిల్లలైతే, ఇప్పుడిక తండ్రి నుండే వినాలి, ఇంకే సంకల్పాన్ని
రానివ్వను అని అనుకుంటారు. తండ్రి జ్ఞాన రత్నాలతో జోలిని నింపడానికి వచ్చారు. కనుక
తండ్రితోనే బుద్ధియోగము జోడించాలి. నంబరువారుగా ధారణ చేసేవారైతే ఎలాగూ ఉంటారు.
కొందరు మంచి రీతిలో ధారణ చేస్తారు, కొందరు తక్కువగా ధారణ చేస్తారు. బుద్ధియోగము వేరే
వైపుకు పరుగులు తీస్తూ ఉంటే ధారణ జరగదు. కచ్చాగా అయిపోతారు. ఒకటి, రెండు సార్లు
మురళీ విన్నా కానీ ధారణ జరగలేదు అంటే అదే అలవాటు పక్కా అయిపోతుంది. ఇక తర్వాత ఎంత
విన్నా కూడా, ధారణ జరగదు. ఎవ్వరికీ వినిపించలేకపోతారు. ఎవరికైతే ధారణ జరుగుతుందో,
వారికి సేవ పట్ల అభిరుచి ఉంటుంది, నేను వెళ్ళి ధనాన్ని (జ్ఞాన ధనము) దానము చేస్తాను
అని వారు ఉత్సాహముతో ఉంటారు, ఎందుకంటే ఈ ధనము ఒక్క తండ్రి వద్ద తప్ప ఇంకెవ్వరి వద్దా
లేదు. అందరికీ ధారణ జరగదని కూడా తండ్రికి తెలుసు. అందరూ ఏకరసముగా ఉన్నత పదవిని
పొందలేరు, అందుకే బుద్ధి వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. భవిష్య భాగ్యము అంత
ఉన్నతముగా తయారవ్వలేదు. కొందరు స్థూల సేవలలో తమ ఎముకలను అర్పిస్తారు, అందరినీ రాజీ
చేస్తారు. ఉదాహరణకు భోజనము తయారుచేస్తారు, తినిపిస్తారు, ఇది కూడా సబ్జెక్ట్ యే కదా.
ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు నోటితో చెప్పకుండా ఉండరు. బాబా చూస్తారు
కూడా - ఎక్కడా దేహాభిమానమైతే లేదు కదా, పెద్దవారికి గౌరవమిస్తున్నారా లేదా. పెద్ద
మహారథులకు గౌరవమైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చిన్నవారు తెలివైనవారై ఉంటే,
పెద్దవారు వారిని గౌరవించాల్సి ఉంటుంది ఎందుకంటే వారి బుద్ధి గ్యాలప్ చేస్తుంది.
సేవ పట్ల ఉన్న అభిరుచిని చూసి తండ్రి అయితే సంతోషిస్తారు కదా. వీరు మంచి సేవ
చేస్తారు అని అనుకుంటారు. రోజంతా ప్రదర్శనీలో అర్థం చేయించేందుకు కూడా ప్రాక్టీస్
చేయాలి. ప్రజలు కూడా ఎంతోమంది తయారవ్వాలి కదా. లక్షలాది మంది ప్రజలు కావాలి. ఇంకే
ఉపాయము లేదు. సూర్యవంశీ, చంద్రవంశీ రాజు, రాణి, ప్రజలు అందరూ ఇక్కడే తయారయ్యేది ఉంది.
ఎంత సేవ చేయాలి. ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లల బుద్ధిలో ఉంది. ఇంటిలో,
గృహస్థములో ఉండటముతో ప్రతి ఒక్కరి అవస్థ ఎవరిది వారిది ఉంటుంది కదా. ఇళ్ళు-వాకిళ్ళను
అయితే వదలకూడదు. బాబా అంటారు - ఇంటిలోనే ఉండండి, కానీ ఈ పాత ప్రపంచము సమాప్తమయ్యే
ఉంది అన్న నిశ్చయము బుద్ధిలో ఉంచుకోవాలి. మనకు ఇప్పుడు తండ్రితోనే పని ఉంది.
కల్పక్రితం ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకున్నారో, వారే తీసుకుంటారని కూడా తెలుసు. ప్రతి
సెకండు యథావిధిగా రిపీట్ అవుతూ ఉంది. ఆత్మలో జ్ఞానముంది కదా. తండ్రి వద్ద కూడా
జ్ఞానముంది. పిల్లలైన మీరు కూడా తండ్రి వలె తయారవ్వాలి, పాయింట్లను ధారణ చేయాలి.
అన్ని పాయింట్లను ఒకేసారి అర్థం చేయించడము జరగదు. లక్ష్యము పక్కాగా పెట్టుకోవడము
జరుగుతుంది. వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇది అదే వినాశనము. సత్య,
త్రేతాయుగాలలో యుద్ధము మొదలైనవేవీ ఉండవు. తర్వాత ఎప్పుడైతే చాలా ధర్మాలు ఉంటాయో,
సైన్యాలు పెద్దవి అవుతాయో, అప్పుడు యుద్ధము మొదలవుతుంది. మొట్టమొదట ఆత్మలు
సతోప్రధానముగా దిగుతాయి, తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తాయి. ఈ విషయాలన్నీ బుద్ధిలో
ఉంచుకోవాలి. ఇక్కడ కూర్చున్నారు కావున రాజధాని ఎలా స్థాపనవుతోంది అనేది బుద్ధిలో
ఉంచుకోవాలి. శివబాబా వచ్చి మనకు ఖజానాను ఇస్తారు, దానిని బుద్ధిలో ధారణ చేయాలి.
మంచి-మంచి పిల్లలు నోట్స్ వ్రాసుకుంటారు. నోట్స్ వ్రాసుకోవడము మంచిది, అప్పుడు
బుద్ధిలోకి టాపిక్స్ వస్తాయి. ఈ రోజు ఈ టాపిక్ పై అర్థం చేయిస్తాను అని అనుకుంటారు.
తండ్రి అంటారు, నేను మీకు ఎంత ఖజానాను ఇచ్చాను. సత్య, త్రేతాయుగాలలో మీ వద్ద
అపారమైన ధనముండేది, తర్వాత వామ మార్గములోకి వెళ్ళడముతో తగ్గిపోతూ వచ్చింది. సంతోషము
కూడా తగ్గిపోతూ వచ్చింది. ఏవో ఒక వికర్మలు జరగడము మొదలయ్యాయి. దిగుతూ-దిగుతూ కళలు
తగ్గిపోతూ ఉంటాయి. సతోప్రధాన, సతో, రజో, తమో స్థితులు ఉంటాయి కదా. సతో నుండి రజోలోకి
వచ్చినప్పుడు వెంటనే వస్తారని కాదు. తమోప్రధానతలోకి కూడా నెమ్మది-నెమ్మదిగా దిగుతారు,
అందులో కూడా సతో, రజో, తమో స్థితులు ఉంటాయి. వెంటనే తమోప్రధానముగా అవ్వరు.
నెమ్మది-నెమ్మదిగా మెట్లు దిగుతూ వెళ్తారు. కళలు తగ్గుతాయి. ఇప్పుడు జంప్ చేయాలి.
తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి, దాని కోసం ఇంకా కొంత సమయమే ఉంది. ఎక్కితే
వైకుంఠ రసాన్ని చవి చూస్తారు అని అంటూ ఉంటారు కూడా. కామము యొక్క చెంపదెబ్బ తగిలితే
పూర్తిగా ముక్కలు-ముక్కలుగా అయిపోతారు, ఎముకలు విరిగిపోతాయి. మనుష్యులు తమ శరీరాన్ని
హత్య చేసుకున్నట్లే అవుతుంది. దానిని ఆత్మహత్య అనరు, జీవహత్య అని అంటారు. అలాగే ఇది
కూడా ఆత్మను హత్య చేసుకున్నట్లే అవుతుంది. చేసుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుంది.
ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి, తండ్రిని స్మృతి చేయాలి ఎందుకంటే
తండ్రి నుండి రాజ్యాధికారము లభిస్తుంది. తమను తాము ప్రశ్నించుకోవాలి - నేను తండ్రిని
స్మృతి చేసి భవిష్యత్తు కోసం ఎంత సంపాదించుకున్నాను? ఎంతమంది అంధులకు చేతికర్రగా
అయ్యాను? ఈ పాత ప్రపంచము మారుతుందని ఇంటి-ఇంటికీ సందేశాన్ని ఇవ్వాలి. తండ్రి కొత్త
ప్రపంచము కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మెట్ల వరస చిత్రములో చూపించారు, దీనిని
తయారుచేయడములో శ్రమ ఉంటుంది. ఎవరైనా సహజముగా అర్థం చేసుకునే విధముగా తయారుచేయాలి అని
రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది. స్వర్గములోకి మొత్తం ప్రపంచమైతే రాదు. దేవీ-దేవతా
ధర్మము వారు మాత్రమే వస్తారు. మీ సేవ అయితే చాలా జరిగేది ఉంది. మన క్లాసు ఎంతవరకు
నడుస్తుందో మీకు తెలుసు! వారైతే కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని భావిస్తారు.
కావున శాస్త్రాలు మొదలైనవాటిని వినిపిస్తూనే ఉంటారు. అంతిమ సమయము వచ్చినప్పుడు
సర్వుల సద్గతిదాత వస్తారని, అప్పుడిక మా శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి గతి
ప్రాప్తిస్తుందని, తర్వాత మేము కూడా వెళ్ళి జ్యోతిలో లీనమైపోతామని భావిస్తారు. కానీ
అలా జరగదు. మనము అమరుడైన తండ్రి ద్వారా సత్యాతి-సత్యమైన అమరకథను వింటున్నామని మీకు
తెలుసు. కావున అమరుడైన బాబా ఏదైతే చెప్తున్నారో, దానిని పాటించాలి కూడా. వారు కేవలం
ఇదే చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి, లేదంటే చాలా
శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా తక్కువది లభిస్తుంది. సేవలో శ్రమించాలి.
దధీచి ఋషి ఉదాహరణ ఉంది కదా, ఎముకలను కూడా సేవలో ఇచ్చేసారు. తమ శరీరము గురించి కూడా
ఆలోచించకుండా సేవలో ఉండాలి, దీనినే ఎముకలను సైతం అర్పించేంత సేవ (మనస్ఫూర్తిగా చేసే
సేవ) అని అంటారు మరియు రెండవది మనస్ఫూర్తిగా చేసే ఆత్మిక సేవ. ఆత్మిక సేవ చేసేవారు
ఆత్మిక జ్ఞానాన్నే వినిపిస్తూ ఉంటారు. జ్ఞాన ధనాన్ని దానము చేస్తూ సంతోషములో నాట్యము
చేస్తూ ఉంటారు. ప్రపంచములోని మనుష్యులు ఏదైతే సేవ చేస్తారో, అది భౌతిక సేవ. కూర్చుని
శాస్త్రాలను వినిపిస్తారు, అది ఆత్మిక సేవ ఏమీ కాదు. ఆత్మిక సేవను కేవలం తండ్రి
మాత్రమే నేర్పిస్తారు. ఆత్మిక తండ్రియే వచ్చి ఆత్మిక పిల్లలను (ఆత్మలను) చదివిస్తారు.
మీరిప్పుడు సత్యయుగ కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అక్కడ మీ ద్వారా వికర్మలేవీ జరగవు. అది రామ రాజ్యము. అక్కడ కొద్దిమంది మాత్రమే
ఉంటారు. ఆ కొద్దిమంది మాత్రమే వచ్చి చదువుకుంటారు. ఇప్పుడైతే రావణ రాజ్యములో అందరూ
దుఃఖితులుగా ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా నంబరువారు పురుషార్థానుసారముగా మీ బుద్ధిలో
ఉంది. ఈ మెట్ల వరస చిత్రములోనే మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఈ చిత్రాలను
తయారుచేయడానికి మెషినరీ కావాలి. ఆ గవర్నమెంట్ యొక్క వార్తాపత్రికలు రోజుకు ఎన్ని
ముద్రించబడతాయి. ఎన్ని కార్య వ్యవహారాలు నడుస్తాయి. ఇక్కడైతే అన్నీ చేతితో
తయారుచేయవలసి ఉంటుంది.
తండ్రి అంటారు - ఈ అంతిమ జన్మ పవిత్రముగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా
అవుతారు. ఈ జ్ఞానము ఎవరి వద్ద లేదు. ఈ మెట్ల వరస చిత్రములో ఇతర ధర్మాల సమాచారము
ఎక్కడుంది అని అంటారు. ఆ సమాచారము కూడా ఈ సృష్టి చక్రము చిత్రములో చూపించారు. వారు
కొత్త ప్రపంచములోకి రానే రారు. వారికి శాంతి లభిస్తుంది. భారతవాసులు మాత్రమే
స్వర్గములో ఉండేవారు కదా. భారత్ లోకే తండ్రి రాజయోగాన్ని నేర్పించడానికి వస్తారు,
అందుకే భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని అందరూ ఇష్టపడతారు. తప్పకుండా కొత్త
ప్రపంచములో కేవలం భారత్ మాత్రమే ఉండేదని ఈ చిత్రముతో వారు స్వయమే అర్థం చేసుకుంటారు.
తమ ధర్మము గురించి కూడా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు క్రైస్టు వచ్చారు, ధర్మ స్థాపన
చేయడానికి, ఈ సమయములో వారు కూడా బికారి రూపములో ఉన్నారు, అందరూ తమోప్రధానముగా
ఉన్నారు. ఇది రచయిత మరియు రచనల యొక్క ఎంత గొప్ప జ్ఞానము. మీరు ఇలా చెప్పవచ్చు - మాకు
ఎవ్వరి ధనము అవసరము లేదు. ధనాన్ని మేమేం చేసుకుంటాము! మీరు ఈ విషయాలను వినండి మరియు
ఇతరులకు వినిపించేందుకు ఈ చిత్రాలు మొదలైనవాటిని ముద్రించండి. ఈ చిత్రాలను
ఉపయోగించాలి. ఈ జ్ఞానము వినిపించే విధముగా హాలును తయారుచేయండి. ఇకపోతే, మేము ధనాన్ని
తీసుకుని ఏం చేస్తాము. మీ ఇంటి వారి కళ్యాణమే జరగనున్నది. మీరు కేవలం ఏర్పాట్లు
చేయండి, చాలామంది వచ్చి వింటారు. రచయిత మరియు రచనల జ్ఞానమైతే చాలా బాగుంది. ఇది
మనుష్యులే అర్థం చేసుకోవాలి. విదేశీయులు ఈ జ్ఞానాన్ని విని చాలా ఇష్టపడతారు, చాలా
సంతోషిస్తారు. మేము కూడా తండ్రితో యోగము జోడించినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని
అర్థం చేసుకుంటారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ జ్ఞానాన్ని గాడ్ ఫాదర్
తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకుంటారు. ఖుదా (భగవంతుడు) బహిష్త్ ను (స్వర్గాన్ని)
స్థాపన చేసారని అంటారు. కానీ వారు ఎలా వస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. మీరు చెప్పే
విషయాలను విని చాలా సంతోషిస్తారు. తర్వాత పురుషార్థము చేసి యోగము నేర్చుకుంటారు.
తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు కూడా పురుషార్థము చేస్తారు. సేవ కోసమైతే
చాలా ఆలోచించాలి. భారత్ లో నైపుణ్యాన్ని చూపించినప్పుడే విదేశాలకు పంపిస్తారు.
కొత్త ప్రపంచము తయారవ్వడానికి సమయమేమీ పట్టదని మనుష్యులు తెలుసుకుంటారు. ఎక్కడైనా
భూకంపాలు మొదలైనవి సంభవిస్తే 2-3 సంవత్సరాలలో పూర్తిగా కొత్త ఇళ్ళు తయారవుతాయి.
కార్మికులు ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా ఇల్లు తయారైపోతుంది. ఒక్క నెలలో కూడా
ఇంటిని తయారుచేయగలరు. కార్మికులు, సామాన్లు మొదలైనవన్నీ సిద్ధముగా ఉంటే ఇక
నిర్మించడానికి సమయమేమీ పట్టదు. విదేశాలలో ఇళ్ళు ఎలా తయారవుతాయి, మినిట్ మోటర్ వలె.
మరి స్వర్గములో ఇంకెంత త్వరగా తయారవుతూ ఉండవచ్చు. బంగారము, వెండి మీకు చాలా
లభిస్తాయి. గనుల నుండి బంగారము, వెండి, వజ్రాలు మొదలైనవి తీసుకువస్తారు. ఆ
కళలన్నింటినీ నేర్చుకుంటున్నారు. సైన్స్ కు ఎంత గర్వముంది. ఈ సైన్స్ యే తర్వాత
అక్కడ కూడా పనికొస్తుంది. ఇక్కడ నేర్చుకున్నవారు అక్కడ మరుసటి జన్మ తీసుకుని అవన్నీ
ఉపయోగిస్తారు. ఆ సమయములో మొత్తం ప్రపంచమంతా కొత్తదిగా అవుతుంది, రావణ రాజ్యమే
సమాప్తమైపోతుంది. 5 తత్వాలు కూడా నియమానుసారముగా సేవలో ఉంటాయి. స్వర్గము తయారవుతుంది.
అక్కడ ఉపద్రవాలేవీ సంభవించవు. రావణ రాజ్యమే ఉండదు, అందరూ సతోప్రధానముగా ఉంటారు.
అన్నింటికంటే మంచి విషయమేమిటంటే - తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. తండ్రి ఏ చింతనైతే
ఇస్తారో, దానిని ధారణ చేయాలి మరియు ఇతరులకు దానము చేయాలి. ఎంతగా దానము చేస్తారో,
అంతగా జమ అవుతూ ఉంటుంది. సేవయే చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది. సేవలో బుద్ధి నడవాలి.
సేవ అయితే ఎంతో జరగగలదు, ఎవరో ఒకరు చేస్తూ ఉండాలి. రోజురోజుకు ఉన్నతి పొందాలి. తమ
ఉన్నతిని కూడా చేసుకోవాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పరస్పరములో ఒకరినొకరు గౌరవించుకోవాలి. సేవ పట్ల చాలా-చాలా అభిరుచిని ఉంచాలి.
జ్ఞాన రత్నాలతో తమ జోలిని నింపుకుని తర్వాత వాటిని దానము చేయాలి.
2. ఒక్క తండ్రి నుండి మాత్రమే వినాలి అనే సంకల్పము పెట్టుకోవాలి. ఇతర ఆలోచనలలో
బుద్ధిని భ్రమింపజేయకూడదు.
వరదానము:-
ఆలోచించడము మరియు చేయడము మధ్యనున్న తేడాను తొలగించే
స్వపరివర్తకుల నుండి విశ్వపరివర్తక భవ
ఏ సంస్కారమైనా, స్వభావమైనా, మాటైనా లేక సంపర్కమైనా, ఏదైతే
యథార్థముగా లేదో, వ్యర్థముగా ఉందో, ఆ వ్యర్థాన్ని పరివర్తన చేసే మెషినరీని తీవ్రతరము
చేయండి. ఆలోచించారు మరియు చేసేసారు... అప్పుడు విశ్వ పరివర్తన యొక్క మెషినరీ
వేగవంతమవుతుంది. ఇప్పుడు స్థాపనకు నిమిత్తులుగా అయిన ఆత్మల యొక్క ఆలోచించడములో మరియు
చేయడములో తేడా కనిపిస్తుంది, ఈ తేడాను తొలగించండి. అప్పుడు స్వ పరివర్తకుల నుండి
విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు.
స్లోగన్:-
ఎవరైతే తమ
జీవితములో అనుభూతి అనే గిఫ్ట్ ను ప్రాప్తి చేసుకున్నారో, వారే అందరికన్నా లక్కీ.
అవ్యక్త ప్రేరణలు -
బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
సంగమయుగము యొక్క
సంపూర్ణ స్థితికి సంబంధించిన చిత్రము ఫరిశ్తా. ఫరిశ్తా పూర్తిగా తేలికగా ఉంటుంది
మరియు ఎవరిలోనైతే తేలికదనము ఉంటుందో, వారు ప్రతి పరిస్థితిలోనూ తమ శ్రేష్ఠ స్థితిని
తయారుచేసుకుంటారు. ఫరిశ్తాలు సంకల్పములో కూడా తేలికగా ఉంటారు, వాణిలో కూడా తేలికగా
ఉంటారు మరియు కర్మలు చేయడములో కూడా తేలికగా ఉంటారు మరియు సంబంధాలలో కూడా తేలికగా
ఉంటారు మరియు ఎవరైతే తేలికగా ఉంటారో, వారు ఒక్క సెకండులో ఏ ఆత్మలోని సంస్కారాలనైనా
పరిశీలించగలుగుతారు. ఎప్పుడైతే ఈ అన్ని గుణాలు ప్రతి కర్మలో ప్రత్యక్షముగా
కనిపిస్తాయో, అప్పుడు ఇక సంపూర్ణ స్థితి సమీపముగా ఉంది అని భావించండి.