‘‘సంతుష్టమణులుగా అయి విశ్వములో సంతుష్టత యొక్క
ప్రకాశాన్ని వ్యాపింపజేయండి, సంతుష్టముగా ఉండండి మరియు అందరినీ
సంతుష్టపరచండి’’
ఈ రోజు బాప్ దాదా సదా సంతుష్టముగా ఉండే తమ సంతుష్టమణులను
చూస్తున్నారు. ఒక్కొక్క సంతుష్టమణి యొక్క ప్రకాశముతో నలువైపులా
ఎంతటి సుందరమైన ప్రకాశము, ప్రకాశిస్తూ ఉంది. ప్రతి ఒక్క
సంతుష్టమణి ఎంతగా తండ్రికి ప్రియముగా, ప్రతి ఒక్కరికీ ప్రియముగా,
స్వయానికి కూడా ప్రియముగా ఉంది. సంతుష్టత సర్వులకు ప్రియమైనది.
సంతుష్టత సదా సర్వ ప్రాప్తి సంపన్నమైనది ఎందుకంటే ఎక్కడైతే
సంతుష్టత ఉంటుందో అక్కడ అప్రాప్తి అన్న వస్తువేదీ ఉండదు.
సంతుష్ట ఆత్మలో సంతుష్టత యొక్క సహజమైన నేచర్ ఉంటుంది. సంతుష్టతా
శక్తి స్వతహాగా మరియు సహజముగా నలువైపులా వాయుమండలాన్ని
వ్యాపింపజేస్తుంది. వారి ముఖము, వారి నయనాలు, వాయుమండలములో కూడా
సంతుష్టత యొక్క అలలను వ్యాపింపజేస్తాయి. ఎక్కడైతే సంతుష్టత
ఉంటుందో అక్కడ ఇతర విశేషతలు స్వతహాగానే వచ్చేస్తాయి. సంతుష్టత
సంగమములో విశేషముగా తండ్రి ఇచ్చిన కానుక. సంతుష్టతా స్థితి
పరిస్థితిపైన సదా విజయిగా ఉంటుంది. పరిస్థితి మారుతూ ఉంటుంది
కానీ సంతుష్టతా శక్తి సదా ప్రగతిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటుంది.
ఎంతటి పరిస్థితి ఎదురుగా వచ్చినా కానీ సంతుష్టమణి ఎదురుగా ప్రతి
సమయము మాయ మరియు ప్రకృతి ఒక తోలుబొమ్మలాటలా కనిపిస్తూ ఉంటుంది,
అందుకే సంతుష్ట ఆత్మ ఎప్పుడూ ఆందోళన చెందదు. పరిస్థితి అనే
తోలుబొమ్మలాట మనోరంజకముగా అనుభవమవుతుంది. ఈ మనోరంజనాన్ని
అనుభవము చేసుకునేందుకు, మీ స్థితి అనే సీట్ సదా సాక్షీ దృష్టాగా
ఉండాలి. సాక్షీ దృష్టా స్థితిలో స్థితి అయి ఉండేవారు ఈ
మనోరంజనాన్ని అనుభవము చేస్తారు. దృశ్యము ఎంతగా మారినా కానీ
సాక్షీ దృష్టా సీట్ పై స్థితి అయి ఉండే సంతుష్ట ఆత్మ సాక్షీగా
అయ్యి, ప్రతి పరిస్థితిని స్వ స్థితితో మార్చివేస్తుంది. కనుక
ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి - నేను సదా సంతుష్టముగా
ఉన్నానా? సదానా? సదా ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉన్నారా?
బాప్ దాదా ఎల్లప్పుడూ ప్రతి శక్తి కోసం, సంతోషం కోసం, డబుల్
లైట్ గా అయి ఎగరడం కోసం పిల్లలకు ఇదే చెప్తారు, సదా అన్న
పదాన్ని సదా గుర్తుంచుకోండి. అప్పుడప్పుడు అన్న పదము బ్రాహ్మణ
జీవితము యొక్క డిక్షనరీలో లేనే లేదు ఎందుకంటే సంతుష్టత యొక్క
అర్థమే సర్వ ప్రాప్తులు. ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో
అక్కడ అప్పుడప్పుడు అన్న పదము ఉండనే ఉండదు. మరి సదా అనుభూతి
చేసేవారా లేక పురుషార్థము చేస్తున్నారా? ప్రతి ఒక్కరూ తమను తాము
ప్రశ్నించుకున్నారా, చెక్ చేసుకున్నారా? ఎందుకంటే మీరందరూ
విశేషముగా తండ్రికి స్నేహీ, సహయోగీ, ప్రియమైన, మధురాతి మధురమైన
స్వ-పరివర్తక పిల్లలు. అలానే ఉన్నారు కదా? అంతేనా? తండ్రి
మిమ్మల్ని ఏ విధముగానైతే చూస్తున్నారో అలాగే స్వయాన్ని అనుభవము
చేస్తున్నారా? ఎవరైతే సదా, అప్పుడప్పుడు కాదు, సదా సంతుష్టముగా
ఉంటున్నారో వారు చేతులెత్తండి. సదా అన్న పదము గుర్తుంది కదా.
చేయిని కొంచెం నెమ్మది-నెమ్మదిగా ఎత్తుతున్నారు. అచ్ఛా, చాలా
మంచిది. కొద్ది-కొద్దిమంది మాత్రమే ఎత్తుతున్నారు మరియు
ఆలోచించి-ఆలోచించి ఎత్తుతున్నారు. కానీ బాప్ దాదా పదే-పదే
అటెన్షన్ ఇప్పించారు, ఇప్పుడు సమయాన్ని మరియు స్వయాన్ని,
రెండింటినీ చూసుకోండి. సమయము యొక్క వేగాన్ని మరియు స్వయం యొక్క
వేగాన్ని, రెండింటినీ చెక్ చేసుకోండి. పాస్ విత్ ఆనర్ గా అయితే
కావలసిందే కదా. ప్రతి ఒక్కరూ ఆలోచించండి - నేను తండ్రికి
రాకుమారిగా లేక రాకుమారునిగా ఉన్నానా? స్వయాన్ని రాకుమారునిగా
భావిస్తున్నారు కదా! ప్రతిరోజు బాప్ దాదా మీకు ఏమని
ప్రియస్మృతులు ఇస్తున్నారు? ప్రియమైన పిల్లలూ అని. మరి
ప్రియమైనవారిగా ఎవరు అవుతారు? ఎవరైతే ఫాలో ఫాదర్ చేస్తారో వారే
ప్రియమైనవారిగా అవుతారు, అంతేకాక ఫాలో చేయడమనేది చాలా-చాలా-చాలా
సహజము, కష్టమేమీ కాదు. ఒక్క విషయాన్ని ఫాలో చేసినా కానీ సహజముగా
అన్ని విషయాలలోనూ ఫాలో చేయడమనేది జరిగిపోతుంది. ఒకటే వాక్యము,
దానిని తండ్రి ప్రతిరోజు గుర్తు తెప్పిస్తూ ఉంటారు. అది
గుర్తుంది కదా? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను
స్మృతి చెయ్యండి. ఒకటే వాక్యము కదా మరియు స్మృతి చేసేటువంటి
ఆత్మ, ఎవరికైతే తండ్రి ఖజానా లభించిందో, ఆ ఆత్మ సేవ చేయకుండా
ఉండనే ఉండలేరు ఎందుకంటే అపారమైన ప్రాప్తి ఉంది, తరగని ఖజానాలు
ఉన్నాయి. మీరు దాత యొక్క పిల్లలు, వారు ఇవ్వకుండా ఉండలేరు మరియు
మెజారిటీ మీ అందరికీ ఏ టైటిల్ లభించింది? డబుల్ విదేశీయులు. మరి
టైటిల్ లోనే డబుల్ ఉంది. బాప్ దాదాకు కూడా మీ అందరినీ చూసి
సంతోషముగా ఉంటుంది మరియు - వాహ్ నా పిల్లలు వాహ్! అన్న పాటను
సదా ఆటోమేటిక్ గా పాడుతూ ఉంటారు. మంచిది, భిన్న-భిన్న దేశాల
నుండి ఏ విమానములో వచ్చారు? స్థూలముగానైతే ఏ విమానములోనైనా
వచ్చి ఉండవచ్చు కానీ బాప్ దాదా ఏ విమానాన్ని చూస్తున్నారు? అతి
స్నేహము అనే విమానములో తమ ప్రియాతి-ప్రియమైన ఇంటికి
చేరుకున్నారు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ఈ రోజు
విశేషముగా ఈ వరదానాన్నే ఇస్తున్నారు - ఓ గారాబాల, ప్రియమైన
పిల్లలూ, సదా సంతుష్టమణులుగా అయి విశ్వములో సంతుష్టతా
ప్రకాశాన్ని వ్యాపింపజేయండి. సంతుష్టముగా ఉండండి మరియు
సంతుష్టపరచండి. చాలామంది పిల్లలంటారు, సంతుష్టముగా ఉండటమైతే
సహజమే కానీ సంతుష్టపరచడము అనేది కొంచెము కష్టము అనిపిస్తుంది.
బాప్ దాదాకు తెలుసు, ఒకవేళ ప్రతి ఒక్క ఆత్మను సంతుష్టపరచాలి
అంటే దానికి విధి చాలా సహజమైన సాధనము ఉంది, ఒకవేళ ఎవరైనా మీతో
అసంతుష్టముగా అయినట్లయితే లేక అసంతుష్టముగా ఉన్నట్లయితే, వారు
ఎలాగూ అసంతుష్టముగా ఉన్నారు కానీ మీపై కూడా వారి అసంతుష్టత
యొక్క ప్రభావము ఎంతోకొంత పడుతుంది కదా. వ్యర్థ సంకల్పాలైతే
నడుస్తాయి కదా. బాప్ దాదా శుభ భావన, శుభ కామన యొక్క
మంత్రమునేదైతే ఇచ్చారో, ఒకవేళ మిమ్మల్ని మీరు ఈ మంత్రములో
స్మృతి స్వరూపులుగా ఉంచుకున్నట్లయితే మీకు వ్యర్థ సంకల్పాలు
నడవవు. వీరు ఇలాంటివారు, వీరు అలాంటివారు అని మీకు తెలిసి ఉన్నా
కూడా స్వయాన్ని సదా అతీతముగా, వారి వైబ్రేషన్ల నుండి అతీతముగా
మరియు తండ్రికి ప్రియమైనవారిగా అనుభవము చేయండి. అప్పుడు మీ
అతీతమైన మరియు తండ్రికి ప్రియమైన శ్రేష్ఠ స్థితి యొక్క
వైబ్రేషన్లు ఒకవేళ ఆ ఆత్మకు చేరుకోకపోయినా కానీ వాయుమండలములో
తప్పకుండా వ్యాపిస్తుంది. ఒకవేళ ఎవరైనా పరివర్తన అవ్వకపోతే
మరియు మీపై ఆ ఆత్మ యొక్క ప్రభావము వ్యర్థ సంకల్పాల రూపములో
పడుతూ ఉంటే, అప్పుడు వాయుమండలములో అందరి సంకల్పాలు వ్యాపిస్తాయి,
అందుకే మీరు అతీతముగా అయి తండ్రికి ప్రియముగా అయి ఆ ఆత్మ పట్ల
కూడా కళ్యాణము కోసం శుభ భావన, శుభ కామన ఉంచండి. చాలా సార్లు
పిల్లలు అంటారు - వారు తప్పు చేసారు కదా, కావున మేము కూడా
గట్టిగా చెప్పవలసి వస్తుంది, కొద్దిగా తమ స్వభావము కూడా, ముఖము
కూడా ఫోర్స్ కలదిగా అయిపోతుంది. అయితే వారు తప్పు చేసారు, కానీ
మీరు ఏదైతే ఫోర్స్ ను చూపించారో అది తప్పు కాదా? వారు ఒక తప్పు
చేసారు, మీరు మీ నోటితో ఏదైతే ఫోర్స్ గా మాట్లాడారో, దానినే
క్రోధము యొక్క అంశము అని అంటారు, మరి అది రైటా? మరి ఒక తప్పు
ఇంకొక తప్పును సరి చేయగలదా? ఈ నాటి సమయమనుసారముగా తమ మాటలను
ఫోర్స్ కలవిగా చేసుకోవడం, దీని పట్ల కూడా విశేషమైన అటెన్షన్ ను
పెట్టండి ఎందుకంటే గట్టిగా మాట్లాడటము లేక విసుగుతో మాట్లాడటము,
వారైతే మారరు అనుకోవడము, ఇది కూడా రెండవ నంబర్ వికారము యొక్క
అంశము. నోటి నుండి మాటలు ఎలా రావాలంటే పుష్పాల వర్షము
కురుస్తుంది అన్నట్లు అనిపించాలి. ఇలా చెప్తుంటారు కదా.
మధురమైన మాటలు, చిరునవ్వుతో కూడిన ముఖము, మధురమైన వృత్తి,
మధురమైన దృష్టి, మధురమైన సంబంధ సంపర్కాలు - ఇవి కూడా సేవా
సాధనాలే, అందుకే రిజల్టును చూడండి, ఒకవేళ ఎవరైనా తప్పు
చేసారనుకోండి, అది తప్పే అనుకోండి, మరియు మీరు అర్థం చేయించే
లక్ష్యముతో, వేరే ఏ లక్ష్యము లేదు, వీరికి శిక్షణ ఇస్తున్నాను,
అర్థం చేయిస్తున్నాను అన్న మీ లక్ష్యము చాలా మంచిదే, కానీ
రిజల్టులో ఏమి చూడడం జరిగింది? వారు మారుతున్నారా? ఇంకా
చెప్పాలంటే భవిష్యత్తులో మీ ఎదురుగా రావడానికి భయపడతారు. మరి
మీరు ఏదైతే లక్ష్యము పెట్టుకున్నారో, అదైతే జరగడము లేదు, అందుకే
మీ మనసా సంకల్పాలను మరియు వాణిని అనగా మాటలను మరియు
సంబంధ-సంపర్కాలను సదా మధురముగా, మధురతా సంపన్నముగా అనగా మహాన్
గా తయారుచేసుకోండి ఎందుకంటే వర్తమాన సమయములో మనుష్యులు
ప్రాక్టికల్ జీవితాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఒకవేళ వాణి
ద్వారా సేవ చేస్తున్నట్లయితే వాణి యొక్క సేవతో ప్రభావితమై
సమీపముగానైతే వస్తారు, ఈ లాభమైతే ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా
మధురతను, మహానతను, శ్రేష్ఠ భావనను, నడవడికను మరియు ముఖాన్ని
చూసి స్వయము కూడా పరివర్తన కోసం ప్రేరణ తీసుకుంటారు మరియు
రాబోయే సమయములో పరిస్థితులు పరివర్తన అయ్యే కొద్దీ అటువంటి
సమయములో మీరందరూ ముఖము మరియు నడవడికతో ఎక్కువ సేవ చేయవలసి
ఉంటుంది, అందుకే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - సర్వాత్మల
పట్ల శుభ భావన, శుభ కామనల వృత్తి మరియు దృష్టి యొక్క సంస్కారాలు
స్వభావముగా మరియు సహజముగా ఉన్నాయా?
బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ విజయమాలలోని మణులుగా
చూడాలని కోరుకుంటున్నారు. మరి మీరందరూ కూడా స్వయాన్ని - మేము
తప్పకుండా మాలలో మణులుగా అయ్యేవారము అని భావిస్తున్నారా?
చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే, 108 మాలలోకైతే ఎవరైతే
నిమిత్తముగా అయ్యే పిల్లలు ఉన్నారో వారే వస్తారు కానీ బాప్ దాదా
ఇంతకుముందు కూడా చెప్పారు, 108 యొక్క గాయనమేదైతే ఉందో అది భక్తి
యొక్క మాలకు సంబంధించినది, కానీ ఒకవేళ మీలోని ప్రతి ఒక్కరూ
విజయీ మణులుగా అయినట్లయితే బాప్ దాదా మాలలో చాలా వరుసలను
ఏర్పాటు చేస్తారు. తండ్రి హృదయ మాలలో విజయీ పిల్లలైన మీలోని
ప్రతి ఒక్కరికీ స్థానము ఉంది, ఇది తండ్రి ఇస్తున్న గ్యారంటీ.
కేవలం స్వయాన్ని మనసా-వాచా-కర్మణా మరియు నడవడిక, ముఖములో
విజయులుగా తయారుచేసుకోండి. ఇష్టమేనా, తయారవుతారా? విజయమాలలోని
మణులుగా తయారుచేస్తాను అని బాప్ దాదా యొక్క గ్యారంటీ ఉంది. ఎవరు
తయారవుతారు? (అందరూ చేతులెత్తారు) అచ్ఛా, మరి బాప్ దాదా మాల
లోపల మాలలను తయారుచెయ్యడము మొదలుపెడతారు. డబుల్ విదేశీయులకు
ఇష్టమే కదా! విజయీ మాలలోకి తీసుకురావడము తండ్రి పని కానీ మీ పని
విజయులుగా అవ్వడము. ఇది సహజమే కదా లేక కష్టమా? కష్టము
అనిపిస్తుందా? ఎవరికైతే కష్టము అనిపిస్తుందో వారు చేతులెత్తండి.
అలా అనిపిస్తుందా? కొద్ది-కొద్దిమంది, కొంతమంది ఉన్నారు. బాప్
దాదా అంటారు - బాప్ దాదా అని అన్నప్పుడు మరి బాబా అని అనడముతో
తండ్రి యొక్క వారసత్వము లభించదా! అందరూ వారసత్వానికి అధికారులు
అన్నప్పుడు మరియు ఎంత సహజముగా తండ్రి వారసత్వాన్ని ఇచ్చారు, ఇది
క్షణము యొక్క విషయము. నా బాబా అని మీరు తెలుసుకున్నారు,
ఒప్పుకున్నారు మరియు తండ్రి ఏమన్నారు? నా పిల్లలు. మరి పిల్లలు
అంటే స్వతహాగానే వారసత్వానికి అధికారులు. బాబా అని అంటారు కదా,
అందరూ ఒకే మాట అంటారు - నా బాబా. అంతేనా? నా బాబాయేనా? ఇందులో
చేతులెత్తండి. నా బాబా అని అన్నప్పుడు మరి నా వారసత్వము కాదా?
నా బాబా అన్నప్పుడు మరి నా వారసత్వము కూడా బంధించబడి ఉంది మరియు
ఆ వారసత్వము ఏమిటి? తండ్రి సమానముగా అవ్వడము, విజయులుగా అవ్వడము.
బాప్ దాదా చూసారు - డబుల్ విదేశీయులలో మెజారిటీ చేతిలో చేయి
వేసి నడుస్తుంటారు. చేతిలో చేయి వేయడము, అలా నడవడము, ఇది
ఫ్యాషన్. మరి ఇప్పుడు కూడా తండ్రి అంటున్నారు, తండ్రి అయిన
శివబాబా చేయి అంటే ఏమిటి? ఈ చేయి అయితే కాదు, మరి శివబాబా
చేతిని పట్టుకున్నారు, అది ఏ చేయి? శ్రీమతమే తండ్రి చేయి. మరి
ఏ విధముగానైతే స్థూలముగా చేతిలో చేయి వేసి నడవడము
ఇష్టమనిపిస్తుందో, అలాగే శ్రీమతమనే చేతిలో చేయి వేసి నడవడము,
ఇదేమైనా కష్టమా! బ్రహ్మాబాబాను చూసారు, ప్రాక్టికల్ ఋజువును
చూసారు, వారు ప్రతి అడుగు శ్రీమతమనుసారముగా నడవడము ద్వారా
సంపూర్ణ ఫరిశ్తాతనము అనే గమ్యానికి చేరుకున్నారు కదా! అవ్యక్త
ఫరిశ్తాగా అయ్యారు కదా. కనుక ఫాలో ఫాదర్, ప్రతి ఒక్క శ్రీమతము,
లేచినప్పటి నుండి మొదలుకుని రాత్రి వరకు ప్రతి అడుగుకు
శ్రీమతాన్ని బాప్ దాదా చెప్పేసారు. ఎలా లేవాలి, ఎలా నడవాలి,
కర్మను ఎలా చేయాలి, మనసులో సంకల్పాలు ఏవేవి చేయాలి మరియు
సమయాన్ని శ్రేష్ఠముగా ఎలా గడపాలి, రాత్రివేళ పడుకునే వరకు
శ్రీమతము లభించి ఉంది. ఇది చెయ్యనా లేక వద్దా అని ఆలోచించవలసిన
అవసరము కూడా లేదు, బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. మరి బాప్ దాదాకు
గాఢమైన ప్రేమ ఉంది, బాప్ దాదా పిల్లలు ఒక్కరినైనా కూడా
విజయులుగా అవ్వకుండా, రాజాగా అవ్వకుండా చూడాలనుకోవడం లేదు.
ప్రతి బిడ్డ రాజా బిడ్డ, స్వరాజ్య అధికారి, అందుకే మీ
స్వరాజ్యాన్ని మర్చిపోకండి. అర్థమైందా.
బాప్ దాదా చాలా సార్లు సూచనను ఇచ్చారు - సమయము అకస్మాత్తుగా
మరియు నాజూకుగా రానున్నది, అందుకే ఎవర్రెడీ, అశరీరి స్థితి
యొక్క అనుభవము అవసరము. ఎంతగా బిజీగా ఉన్నా కానీ బిజీగా ఉంటూ
కూడా ఒక్క క్షణము అశరీరిగా అయ్యే అభ్యాసాన్ని ఇప్పటినుండే చేసి
చూడండి. మేము చాలా బిజీగా ఉంటాము అని మీరు అంటారు, కానీ ఎంత
బిజీగా ఉన్నా కానీ ఒకవేళ మీకు దాహము వేస్తే ఏమి చేస్తారు? నీరు
తాగుతారు కదా! ఎందుకంటే దాహము వేసింది కావున నీరు తాగడము
తప్పనిసరి అని భావిస్తారు. అలాగే మధ్యమధ్యలో అశరీరి, ఆత్మిక
స్థితిలో స్థితి అయ్యే అభ్యాసము కూడా అవసరము ఎందుకంటే రాబోయే
సమయములో నలువైపులా ఉన్న అలజడిలో చలించని స్థితి యొక్క అవసరము
ఉంది. కావున ఇప్పటినుండే బహుకాలపు అభ్యాసము చేయకపోతే అతి అలజడి
సమయములో అచలముగా ఎలా ఉంటారు! మొత్తము రోజంతటిలో ఒకటి-రెండు
క్షణాలు తీసి కూడా చెక్ చేసుకోండి, సమయమనుసారముగా ఆత్మిక స్థితి
ద్వారా అశరీరిగా అవ్వగలుగుతున్నారా? చెక్ చేసుకోండి మరియు ఛేంజ్
చేసుకోండి. కేవలం చెక్ చేసుకోవడమే కాదు, ఛేంజ్ కూడా చేసుకోండి.
కావున పదే-పదే ఈ అభ్యాసాన్ని చెక్ చేసుకోవడము ద్వారా, రివైజ్
చేసుకోవడము ద్వారా నేచురల్ స్థితి తయారవుతుంది. బాప్ దాదా పట్ల
స్నేహము ఉంది అని ఇందులోనైతే అందరూ చేతులెత్తుతారు. ఉంది కదా
స్నేహము! పూర్తి స్నేహము ఉందా, పూర్తిగా ఉందా లేక సగమేనా?
సగమైతే లేదు కదా! స్నేహముంటే ప్రతిజ్ఞ ఏమిటి? ఏం ప్రతిజ్ఞ
చేసారు? నాతోపాటు కలిసి వస్తారా? అశరీరిగా అయి కలిసి వస్తారా
లేక వెనుక-వెనుక వస్తారా? కలిసి వస్తారా? కొద్ది సమయము వతనములో
కలిసి ఉంటారు కూడా మరియు ఆ తర్వాత బ్రహ్మాబాబాతో పాటు మొదటి
జన్మలోకి వస్తారు. ఈ ప్రతిజ్ఞ ఉందా? ఉంది కదా! చేతులెత్తించను,
అలా తల ఊపండి. చేతులెత్తుతూ అలసిపోతారు కదా. కలిసి వెళ్ళేదే
ఉంది అన్నప్పుడు, వెనుక ఉండేది లేదు అన్నప్పుడు, మరి బాబా కూడా
ఎవరిని తమతోపాటు తీసుకువెళ్తారు? బాబా తన సమానమైనవారిని
తమతోపాటు తీసుకువెళ్తారు. బాబాకు కూడా ఒంటరిగా వెళ్ళడము ఇష్టము
లేదు, పిల్లలతోపాటు వెళ్ళాలి. మరి కలిసి వెళ్ళడానికి సిద్ధముగా
ఉన్నారా! తల ఊపండి. సిద్ధముగా ఉన్నారా? అందరూ వస్తారా? అచ్ఛా,
అందరూ వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారా? ఎప్పుడైతే తండ్రి
వెళ్తారో, అప్పుడే వెళ్తారు కదా. ప్రస్తుతము వెళ్ళరు, ఇప్పుడైతే
విదేశాలకు తిరిగి వెళ్ళాలి కదా. తండ్రి ఆర్డర్ ఇస్తారు,
నష్టోమోహా స్మృతిర్లబ్ధ అనే గంటను మ్రోగిస్తారు మరియు కలిసి
వెళ్ళిపోతాము. మరి ఏర్పాటు సిద్ధముగా ఉంది కదా! స్నేహానికి
గుర్తు కలిసి వెళ్ళడము. అచ్ఛా.
బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ దూరముగా ఉన్నా కూడా
సమీపముగా అనుభవం చేస్తున్నారు. సైన్స్ సాధనాలు దూరాన్ని
సమీపముగా తీసుకురాగలిగినప్పుడు, చూడగలిగినప్పుడు,
మాట్లాడగలిగినప్పుడు, మరి బాప్ దాదా కూడా దూరముగా కూర్చుని
ఉన్న పిల్లలను అందరికంటే సమీపముగా చూస్తున్నారు. దూరముగా లేరు,
హృదయములో ఇమిడి ఉన్నారు. కనుక బాప్ దాదా విశేషముగా టర్న్
అనుసారముగా వచ్చి ఉన్న పిల్లలను తమ హృదయములో, నయనాలలో
ఇముడ్చుకుంటూ ఒక్కొక్కరినీ కలిసి వెళ్ళేవారిగా, కలిసి
ఉండేవారిగా, కలిసి రాజ్యము చేసేవారిగా చూస్తున్నారు. మరి ఈ రోజు
నుండి మొత్తము రోజంతటిలో పదే-పదే ఏ డ్రిల్ ను చేస్తారు?
ఇప్పుడిప్పుడే ఒక్క క్షణములో ఆత్మ-అభిమాని, తమ శరీరాన్ని కూడా
చూస్తూ అశరీరి స్థితిలో అతీతముగా మరియు తండ్రికి ప్రియముగా
అనుభవము చేయగలరు కదా! అయితే ఇప్పుడు ఒక్క క్షణములో అశరీరి భవ!
అచ్ఛా!
(బాప్ దాదా డ్రిల్ చేయించారు) ఇలాగే మధ్యమధ్యలో రోజంతటిలో
ఎలాగైనా సరే ఒక్క నిముషాన్ని కేటాయించి ఈ అభ్యాసాన్ని పక్కా
చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే బాప్ దాదాకు తెలుసు - రాబోయే కాలము
అతి హాహాకారాలు కలదిగా ఉంటుంది. మీరందరూ సకాష్ ఇవ్వవలసి ఉంటుంది
మరియు సకాష్ ఇవ్వటములోనే మీకు మీ తీవ్ర పురుషార్థము
జరిగిపోతుంది. కొద్ది సమయములోనే సకాష్ ద్వారా సర్వ శక్తులను
ఇవ్వవలసి ఉంటుంది మరియు ఎవరైతే ఇటువంటి నాజూకు సమయములో సకాష్
ఇస్తారో, ఎంతమందికైతే ఇస్తారో, ఎక్కువమందికి ఇచ్చినా సరే,
కొద్దిమందికి ఇచ్చినా సరే, అంతగానే ద్వాపరము మరియు కలియుగములో
మీకు భక్తులుగా అవుతారు. కనుక సంగమములో ప్రతి ఒక్కరూ భక్తులను
కూడా తయారుచేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి సుఖము
మరియు శాంతి వారి హృదయములో ఇమిడిపోతుంది మరియు భక్తి రూపములో
వారు మీకు రిటర్న్ ఇస్తారు. అచ్ఛా.
నలువైపులా ఉన్న బాప్ దాదా యొక్క కంటితారలకు, విశ్వానికి
ఆధారము మరియు ఉద్ధరణ చేసే ఆత్మలకు, మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్త,
విశ్వ పరివర్తక పిల్లలకు చాలా-చాలా హృదయపూర్వకమైన స్నేహాన్ని,
హృదయపూర్వకమైన ప్రియస్మృతులను మరియు పదమాల, పదమాల వరదానాలను
స్వీకరించండి. అచ్ఛా.