11-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు
ఒక్క తండ్రి పట్ల పూర్తి ప్రీతిని పెట్టుకోండి, మీకు ఏ దేహధారి పట్ల ప్రీతి ఉండకూడదు’’
ప్రశ్న:-
ఎవరైతే మన దైవీ
సాంప్రదాయానికి చెందినవారు ఉంటారో, వారి ఎదురుగా ఏ మాటలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి?
జవాబు:-
తండ్రిని
స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని మరియు దేవీ-దేవతా ధర్మ స్థాపన
జరుగుతుందని మీరు వారికి తెలియజేసినప్పుడు, ఆ మాటలు వారి ఎదురుగా ప్రతిధ్వనిస్తూ
ఉంటాయి. మేము దేవతలుగా అవ్వాలి, అందుకే మా ఆహార-పానీయాలు శుద్ధముగా ఉండాలి అని వారి
బుద్ధిలోకి వస్తుంది.
పాట:-
భోళానాథుని
కన్నా అతీతమైనవారు లేరు...
ఓంశాంతి
భోళానాథుని పిల్లలు వింటున్నారు. ఎవరి నుండి వింటున్నారు? భోళానాథుడి నుండి.
భోళానాథుడు అని శివుడినే అంటారు. వారి పేరే శివ. భోళానాథుని పిల్లలు అనగా శివుని
పిల్లలు. ఆత్మలు ఈ చెవుల ద్వారా వింటున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా
అయ్యారు. పిల్లలు టేప్ ద్వారా కూడా మురళీ వింటారు. అప్పుడు, మాకు శివబాబా తమ
పరిచయాన్ని ఈ విధముగా ఇస్తున్నారని అర్థం చేసుకుంటారు - నేను ఆత్మలందరికీ తండ్రిని,
నన్నే మీరు పరమపిత పరమ ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు. వారిని సదా ఫాదర్ అనే అంటారు.
వారు ఫాదర్ అని ఎవరంటారు? ఆత్మ అంటుంది. ఆత్మకు ఇప్పుడు జ్ఞానము లభించింది, ఇతర
మనుష్యమాత్రులెవరికీ ఈ జ్ఞానము లేదు. ఆత్మలైన మనకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు
సాకార తండ్రి, ఒకరు నిరాకార తండ్రి. వారు పరమపిత, ఈ వివరణ ఇతరులెవరూ ఇవ్వలేరు.
తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇలా అడగలేరు, తండ్రియే అడుగుతారు - మీరు పరమపిత పరమాత్మ,
గాడ్ ఫాదర్ అని అంటారు కదా, అలా ఎవరి గురించి అంటారు? లౌకిక తండ్రి గురించా లేక
పారలౌకిక తండ్రి గురించా? లౌకిక తండ్రిని గాడ్ ఫాదర్ అని అంటారా? హిందీలో పరమపిత అనే
పదము కూడా ఉంది. వారు ఒక్కరే, నిరాకారుడు. ఈశ్వరా, ప్రభు లేక భగవంతుడు అని అనడము
వలన వారు తండ్రి అనేది నిరూపణ అవ్వదు. గాడ్ ఫాదర్ అనే పదము బాగుంది. వారు మా గాడ్
ఫాదర్ అని ఆత్మ అంది. లౌకిక ఫాదర్ అయితే కేవలం శరీరానికి తండ్రి. మీకు ఎంతమంది
తండ్రులు ఉన్నారు, అని మిమ్మల్నందరినీ అడగడము జరుగుతుంది. ఒకరు లౌకిక ఫాదర్, మరొకరు
పారలౌకిక ఫాదర్. ఇరువురిలో ఎవరు పెద్ద? తప్పకుండా పారలౌకిక ఫాదర్ అనే అంటారు.
పతితులందరినీ పావనముగా తయారుచేసే పారలౌకిక తండ్రి అని వారికి మహిమ ఉంది. ఇది కూడా
ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ప్రపంచములో ఎవరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోరు.
తండ్రి అర్థం చేయించారు - మీకు పారలౌకిక తండ్రి పట్ల ప్రీతి ఉంది. ఇతరులది వినాశకాలే
విపరీత బుద్ధి. ఇప్పుడిది వినాశన సమయము. అదే మహాభారత యుద్ధము ఇప్పుడు జరగనున్నది.
ఒకరికొకరు విమానాలు, ట్యాంకులు మొదలైనవాటిని సప్లై చేసుకుంటున్నారు, అందరికీ ఇస్తూ
ఉంటారు. ధనానికి రిటర్న్ లో ఎవరికి, ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు. అప్పుగా కూడా
తీసుకుంటారు. ఇలా విమానాలు, తుపాకులు మొదలైనవన్నీ కొంటూ ఉంటారు. ఈ వస్తువులన్నీ చాలా
ఖరీదైనవిగా ఉంటాయి. విదేశీయులు తయారుచేస్తారు, అవి మళ్ళీ అమ్ముతూ ఉంటారు. భారతవాసులు
విమానాలు మొదలైనవాటిని అమ్మరు. ఈ వస్తువులన్నీ విదేశాల నుండి వచ్చాయి. ఇప్పుడు ఏ
వస్తువులనైతే కొంటారో, వాటిని తప్పకుండా ఉపయోగిస్తారు, పారేయడానికి కొనరు కదా. వారు
వినాశకాలే విపరీత బుద్ధి గల యాదవ సాంప్రదాయానికి చెందినవారు, వారు యూరోప్ లో ఉంటారు.
అందులో అందరూ వచ్చేస్తారు. భారత్ అయితే అవినాశీ ఖండము ఎందుకంటే ఇది అవినాశీ తండ్రి
యొక్క జన్మ స్థలము. పాత ప్రపంచము సమాప్తమవ్వబోతున్నప్పుడే తండ్రి వస్తారు మరియు
ఎప్పటికీ సమాప్తము కానటువంటి స్థానములో వారు జన్మ తీసుకుంటారు. తండ్రి వచ్చారు
కావుననే శివజయంతిని జరుపుకుంటారు కానీ శివబాబా ఎప్పుడు వస్తారు అనేది వారికి తెలియదు.
వారు రావడము కూడా వినాశనము కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయములోనే వస్తారు.
ఇప్పుడు తండ్రి అంటారు - వారు యూరోప్ వాసులు, యాదవ సాంప్రదాయానికి చెందినవారు, వారు
సత్యయుగములో ఉండరు. అక్కడ బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైనవారు ఉండరు. ఇప్పుడు తండ్రి
అంటారు - వారిది వినాశకాలే విపరీత బుద్ధి, ఎందుకంటే తండ్రి అయిన పరమాత్మను
సర్వవ్యాపి అని అనేస్తారు. మీది వినాశకాలే ప్రీతి బుద్ధి. మీకు తండ్రి గురించి
తెలుసు. మేము 84 జన్మలు తీసుకున్నామని మీరు అర్థం చేసుకున్నారు. 84 జన్మలలో
పాపాత్ములుగా, తమోప్రధానముగా అయిపోయారు. భారతవాసులే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు
నాటకము పూర్తవుతుంది, అందరూ తిరిగి వెళ్ళాలి. మీకు తండ్రి రాజయోగాన్ని
నేర్పిస్తున్నారు. ఇది అందరి వినాశన సమయము అనగా మృత్యు సమయము. ఆ యాదవులకు కూడా
ఈశ్వరుని పట్ల ప్రీతి లేదు, అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. దేహధారీ
మనుష్యులెవరి పట్ల ప్రీతి పెట్టుకోకూడదు. వారు రచన, వారి నుండి వారసత్వము లభించదు.
సోదరునికి సోదరుని నుండి వారసత్వము లభించదు. ఈ విషయాన్ని మంచి రీతిలో అర్థం
చేయించారు.
వారిది వినాశకాలే విపరీత బుద్ధి మరియు మీది ప్రీతి బుద్ధి అని పిల్లలైన మీరు ఇప్పుడు
అర్థం చేసుకున్నారు. ఇందులో కూడా ఎవరైతే తీవ్రమైన ప్రీతి గలవారు ఉన్నారో, వారు
తండ్రి పట్ల పూర్తి ప్రీతి పెట్టుకుంటారు. మనము బాబా నుండి 21 జన్మలకు స్వర్గ
వారసత్వాన్ని తీసుకుంటాము. ఆ బాబాయే సత్యాన్ని తెలియజేస్తారు. ఇంకెవరి పట్ల ప్రీతి
పెట్టుకోకూడదు. కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు, ఇక కొత్త ఇంటి పట్ల ప్రీతి
ఏర్పడుతుంది. పాత ఇల్లు పడిపోనున్నదని అర్థం చేసుకోవడము జరుగుతుంది. కనుక మనము కూడా
పాత ప్రపంచము నుండి మనసు తెంచుకుంటూ వెళ్తాము. తండ్రి అర్థం చేయిస్తున్నారు,
రోజురోజుకు వాయుమండలము పాడవుతూ ఉంటుంది. ఎన్ని హంగామాలు జరుగుతాయో మీరు చూస్తారు,
అప్పుడిక ఇది సమాప్తమైపోతుందని అర్థం చేసుకుంటారు. మనము కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి.
కనుక కొత్త ప్రపంచాన్ని గుర్తు చేయాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రిని మరియు
వారసత్వాన్ని గుర్తు చేయాలి. ఇతరులెవరినైనా గుర్తు చేయడము వలన ఏమీ లభించదు.
మనుష్యులు భక్తి మార్గములోనైతే ఎంతగా గుర్తు చేస్తారు. తల్లిదండ్రులను,
మిత్ర-సంబంధీకులను గుర్తు చేసుకుంటూ కూడా, మళ్ళీ దేవీ-దేవతలను ఎంతగా గుర్తు చేస్తారు.
నీటిలో స్నానము చేస్తారు, దానిని పతిత-పావని అని అంటారు. బాణం వేయగానే గంగ
వెలువడినట్లుగా చూపిస్తారు. మరణించేటప్పుడు గంగా జలాన్ని నోటిలో పోస్తారు. గంగా జలం
కొద్దిగా లభించినా కూడా ముక్తిని పొందుతామని భావిస్తారు. తండ్రి అంటారు, ఇక్కడ
జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. మీరు కొద్దిగా జ్ఞానము విన్నా దాని ఫలం
లభిస్తుంది. ఇది జ్ఞానము వినడానికి సంబంధించిన విషయము. అమృతము అనగా తాగేటువంటి
వస్తువు కాదు, ఇది జ్ఞానము. భోగ్ రోజున అమృతము తాగిస్తారని భావించకండి. అలా కాదు.
అది తీపి నీరు. ఇకపోతే, ఇది జ్ఞానానికి సంబంధించిన విషయము. జ్ఞానము అనగా తండ్రిని
మరియు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడము మరియు ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది,
84 జన్మలు ఎవరు తీసుకుంటారు అనేది అర్థం చేసుకోవడము. అందరూ అయితే 84 జన్మలు
తీసుకోలేరు. మొట్టమొదట భారతవాసులే వస్తారు. వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు.
ఎవరైతే దేవతలుగా ఉండేవారో, వారే 84 జన్మలను అనుభవించి పతితులుగా అయిపోతారు. తండ్రి
వచ్చి మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు. మనుష్యులు దేహాభిమానములోకి వచ్చి 5
వికారాలలో చిక్కుకుపోతారు. ఇప్పుడిది రావణ రాజ్యము. సత్యయుగము దైవీ రాజ్యముగా ఉండేది.
శివబాబాయే స్వర్గపురిని రచిస్తారు. అక్కడ సూర్యవంశీ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది.
ఇప్పుడు స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. మీది వినాశకాలే ప్రీతి బుద్ధి, అందుకే
విజయులుగా అవుతారు. మీరు మొత్తము విశ్వమంతటిపై విజయము పొందుతారు. ఇది మంచి రీతిలో
గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కలియుగములో ఉన్న భారతవాసులమైన మనము పరివర్తన చెంది
స్వర్గములోకి వెళ్తాము. పాత ప్రపంచాన్ని వదిలేయాలి. ఇవి వికారీ సంబంధాలు, వీటిని
బంధనాలని అంటారు. మీరు వికారీ బంధనాల నుండి బయటకు వచ్చి, నిర్వికారీ సంబంధాలలోకి
వెళ్తారు, ఇక మరుసటి జన్మలో మీరు వికారీ బంధనాలలోకి రారు. అక్కడ ఉన్నదే నిర్వికారీ
సంబంధాలు, ఈ సమయములో ఆసురీ బంధనాలు ఉన్నాయి. నాకు శివబాబా పట్ల ప్రీతి ఉంది అని
ఆత్మ అంటుంది. బ్రాహ్మణులైన మీకు ప్రీతి ఉంది ఎందుకంటే మీరు యథార్థ రీతిలో
తెలుసుకున్నారు. మీరు తండ్రిని, సృష్టి చక్రాన్ని తెలుసుకుని ఇతరులకు అర్థం
చేయిస్తారు. ఎవరు ఎంతగా ఇతరులకు అర్థం చేయిస్తారో, అంతగా అనేకుల కళ్యాణము చేస్తారు.
ఎవరైతే ఎక్కువ అర్థం చేసుకుంటారో, వారే తెలివైనవారు, ఉన్నత పదవిని కూడా వారే
పొందుతారు. సేవ తక్కువగా చేస్తే, పదవి కూడా తక్కువదే పొందుతారు. మొత్తము ప్రపంచమంతా
పతితముగానే ఉంది. ప్రతి ఒక్కరికీ పతితము నుండి పావనముగా అయ్యే మార్గాన్ని
తెలియజేయాలి, ఇంకే ఉపాయము లేదు. స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. దైవీ
సాంప్రదాయానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారి ఎదురుగా ఈ మాటలు ప్రతిధ్వనిస్తూ
ఉంటాయి, ఇవి సరైన విషయాలని అర్థం చేసుకుంటారు. తప్పకుండా మనము దేవీ-దేవతలుగా అవుతాము.
మన భోజనము కూడా శుద్ధముగా ఉండాలి. దైవీ గుణాలు కూడా ఇక్కడే ధారణ చేయాలి, సర్వగుణ
సంపన్నులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు అలా తయారవుతున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు దేవతలు,
వారికి భోగ్ పెట్టేటప్పుడు సిగరెట్ మొదలైనవాటిని భోగ్ లో పెడతారా? సిగరెట్ తాగేవారు
ఉన్నత పదవిని పొందలేరు. ఇది దైవీ పదార్థమేమీ కాదు. సిగరెట్ తాగినా లేదా ఉల్లి,
వెల్లుల్లి మొదలైనవి తిన్నా మరింత దిగజారిపోతారు. ఇవి మానేస్తే ఆరోగ్యము
పాడైపోతుందని అంటారు. తండ్రి అంటారు - శివబాబాను స్మృతి చేయండి. ఈ అలవాటులన్నింటినీ
వదిలేస్తే మీ సద్గతి జరుగుతుంది. సిగరెట్ తాగే అలవాటు అయితే చాలా మందికి ఉంటుంది.
దేవతలకు ఎప్పుడూ కూడా వీటిని భోగ్ లా పెట్టరని అర్థం చేయించడము జరుగుతుంది. కనుక
మీరు దేవతల వలె ఇక్కడే తయారవ్వాలి. మీరు ఛీ-ఛీ పదార్థాలు తింటూ ఉన్నట్లయితే, ఆ
దుర్వాసన వస్తూ ఉంటుంది. సిగరెట్ లేదా మద్యం తాగేవారి నుండి దూరము నుండే దుర్వాసన
వస్తుంది. పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి, వైష్ణవులుగా అవ్వాలి. ఎలాగైతే
విష్ణువుకు సంతానము ఉంటారో, అలా మీరు కూడా విష్ణు సంతానముగా అనగా దైవీ సంతానముగా
అవుతారు. ఇక్కడ మీరు ఈశ్వరీయ సంతానము. ఇది మీ సర్వోత్తమ జన్మ. దేవతల కన్నా ఉత్తములు
మీరు. మీరు ఇతరులను కూడా ఉత్తములుగా చేసేటువంటివారు. ఇది అనంతమైన తండ్రి యొక్క
మిషనరీ. క్రిస్టియన్ల మిషనరీ ఉంటుంది కదా. తమ క్రిస్టియన్ ధర్మములోకి అనేకులను
కన్వర్ట్ చేస్తారు. ఇది ఈశ్వరీయ మిషనరీ. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణ ధర్మములోకి
కన్వర్ట్ అయి, తర్వాత దేవతా ధర్మములోకి కన్వర్ట్ అయిపోతారు. మేము శూద్రుల నుండి
ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. మీరు జీవిస్తూ మరణించారు, తర్వాత
వెళ్ళి దేవతలుగా అవుతారు, గర్భము నుండి జన్మ లభిస్తుంది.
ఇక్కడ తండ్రి మిమ్మల్ని ధర్మాత్ములుగా చేయడానికి దత్తత తీసుకున్నారు. తండ్రి
మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. పిల్లలకు తండ్రి నేర్పిస్తారు, మీరు బ్రాహ్మణుల
నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు. ఆ మనుష్యులు (దేవతలు) ఎంత ఉన్నతమైనవారు, వారిలో అన్ని
దైవీ గుణాలు ఉన్నాయి. ఆత్మలైన మీరు పవిత్రముగా అయినప్పుడు, శరీరము కూడా పవిత్రమైనది
కావాలి. పాత శరీరము సమాప్తమవ్వనున్నది, తర్వాత మీకు సతోప్రధానమైన కొత్త శరీరము
కావాలి. సత్యయుగములో 5 తత్వాలు కూడా సతోప్రధానముగా అవుతాయి. తండ్రి అంటారు - మీరు
శూద్ర వర్ణములో ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా అయ్యారు,
తర్వాత దైవీ వర్ణములోకి వస్తారు. 84 జన్మలు తీసుకుంటారు కదా. బ్రాహ్మణ వర్ణాన్ని
మాయం చేసేసారు. ఇప్పుడు తండ్రి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి, దేవతలుగా చేస్తారు.
ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. పిల్లిమొగ్గలాట ఉంటుంది కదా. ఇప్పుడు
బ్రాహ్మణులుగా ఉన్నారు, తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా... మళ్ళీ బ్రాహ్మణులుగా
అవుతారు. దీనిని చక్రమని అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణములో ఉన్నారు. ఈ జ్ఞానము
ఇప్పుడు ఉంది, తర్వాత ప్రారబ్ధము లభిస్తుంది. ఈ సమయములో చేసే నంబరువారు
పురుషార్థానుసారముగా, అక్కడ 21 జన్మలు సదా సుఖమయముగా ఉంటారు. కొందరు రాజ్య వంశములోకి,
కొందరు ప్రజలలోకి వెళ్తారు. రాజ్య వంశములో చాలా సుఖము ఉంటుంది, తర్వాత కళలు
తగ్గిపోతాయి. మీకు 84 జన్మల జ్ఞానము లభించింది, స్మృతి కలిగింది. తండ్రి వచ్చి అర్థం
చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి.
కొందరు 84 జన్మలు, కొందరు 80, 50 లేదా 60 జన్మలు కూడా తీసుకున్నారు. అందరికన్నా
ఎక్కువగా భారతవాసులైన మీరు సుఖాన్ని చూస్తారు. ఈ డ్రామాలో మీ పేరు ప్రసిద్ధి
చెందింది. మీరు దేవతల కన్నా ఉన్నతమైనవారు. మేమే పూజ్యులుగా అవుతామని మీకు తెలుసు.
సత్యయుగములో మనము ఎవరినీ పూజించము, అలాగే మనల్ని ఎవరూ పూజించరు. అక్కడ మనము
పూజ్యులుగానే ఉంటాము, తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. మనము పూజ్యుల నుండి పూజారులుగా
అయి తల వంచి నమస్కరిస్తూ ఉంటాము. ద్వాపరములో మనము పూజారులుగా అవ్వడము ప్రారంభిస్తాము.
అంతిమానికల్లా అందరూ వ్యభిచారులుగా అయిపోతారు. ఈ శరీరము 5 తత్వాలతో తయారుచేయబడినది,
ఎవరైనా దీనిని పూజిస్తే, దానిని భూత పూజ అని అంటారు. ప్రతి ఒక్కరిలో 5 భూతాలు
ఉన్నాయి. దేహాభిమాన భూతము మొదటిది, ఆ తర్వాత కామ-క్రోధాల భూతాలు. భూత సాంప్రదాయము
అనండి లేదా ఆసురీ సాంప్రదాయము అనండి, విషయము ఒక్కటే. తండ్రి వచ్చి మళ్ళీ దైవీ
సాంప్రదాయులుగా తయారుచేస్తారు. తండ్రి భూతాల నుండి విడిపించడానికి వస్తారు మరియు
తనతో యోగము జోడింపజేసి దేవతలుగా తయారుచేస్తారు. గురునానక్ కూడా, పరమపిత పరమాత్మ
మనుష్యులను దేవతలుగా చేసారని మహిమ పాడారు. వారే పతితులను పావనముగా తయారుచేసేవారు.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు, ఛీ-ఛీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో,
వాటన్నింటినీ వదిలేయాలి. శూద్రులను బ్రాహ్మణ ధర్మములోకి కన్వర్ట్ చేసి దేవతలుగా
చేసేందుకు, ఈశ్వరీయ మిషన్ యొక్క కార్యములో సహయోగులుగా అవ్వాలి. మద్యం, సిగరెట్ లేదా
అశుద్ధమైన అలవాట్లు ఏమున్నా సరే, వాటిని తొలగించి వేయాలి.
2. ఈ వినాశకాల సమయములో ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి. పాత
ఇల్లు పడిపోనున్నది కనుక దీని నుండి మనసును తొలగించి కొత్తదానితో జోడించాలి.
వరదానము:-
శ్రేష్ఠ కర్మల ద్వారా స్మరణయోగ్యులుగా అయ్యే యోగయుక్త,
యుక్తియుక్త భవ
మీ ఒక్కొక్క కర్మ ఎంత శ్రేష్ఠముగా ఉంటుందో, అంతగానే మీరు
శ్రేష్ఠ ఆత్మలలో స్మరింపబడతారు. భక్తిలో నామ స్మరణ చేస్తారు, కానీ ఇక్కడ శ్రేష్ఠ
ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారి గుణాలను మరియు కర్మలను ఉదాహరణగా చేసుకునేందుకు
స్మరిస్తారు. కావున మీరు శ్రేష్ఠ కర్మల ఆధారముగా స్మరణయోగ్యులుగా అవుతూ ఉంటారు. దీని
కొరకు యోగయుక్తులుగా అవ్వండి. యోగయుక్తులుగా అవ్వడము ద్వారా ప్రతి సంకల్పము, మాట
మరియు కర్మ యుక్తియుక్తముగా తప్పకుండా ఉంటాయి, వారి ద్వారా అయుక్తమైన కర్మలు మరియు
సంకల్పాలు జరగనే జరగవు. ఈ కనెక్షన్ కూడా ఉంది.
స్లోగన్:-
నిమిత్తము
మరియు నిర్మానచిత్తము - ఇవే సత్యమైన సేవాధారుల లక్షణాలు.
అవ్యక్త ప్రేరణలు -
సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి
సరళచిత్తమైన నేచర్
ఉన్నట్లయితే హర్షితముగా ఉండటముతోపాటుగా నయనాల ద్వారా, ముఖము ద్వారా మరియు నడవడిక
ద్వారా మధురత ప్రత్యక్ష రూపములో కనిపిస్తుంది. ఎప్పుడూ నోటి నుండి కఠినమైన మాటలు
వెలువడవు. వారి మనసు, బుద్ధి, మాటలు అన్నీ సమానముగా ఉంటాయి. మనసులో ఒకటి, మాటలలో
మరొకటి ఉంటే - అది సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావము కలవారు సదా నిర్మానచిత్తులుగా,
నిరహంకారిగా, నిస్వార్థముగా ఉంటారు.