11-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మొట్టమొదట అందరికీ తండ్రి యొక్క
యథార్థమైన పరిచయాన్ని ఇచ్చి గీతా భగవానుడి గురించి నిరూపించండి, అప్పుడు మీ పేరు
ప్రసిద్ధమవుతుంది’’
ప్రశ్న:-
పిల్లలైన మీరు నాలుగు యుగాలలోనూ చక్రములో తిరిగారు, దీనికి గుర్తుగా భక్తిలో ఒక
ఆచారము కొనసాగుతూ వస్తోంది, అది ఏమిటి?
జవాబు:-
మీరు నాలుగు
యుగాలలోనూ చక్రములో తిరిగారు, దీనికి గుర్తుగా వారు అన్ని శాస్త్రాలు, చిత్రాలు
మొదలైనవాటిని రథములో పెట్టి నలువైపులా ఊరేగిస్తారు, ఆ తర్వాత ఇంట్లోకి తీసుకువచ్చి
పడుకోబెడతారు. మీరు బ్రాహ్మణులుగా, దేవతలుగా, క్షత్రియులుగా... అవుతారు. ఈ చక్రానికి
గుర్తుగా వారు ఆ రథాన్ని అలా ఊరేగిస్తారు, ఇది కూడా ఒక ఆచారము.
ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎవరికైనా అర్థం
చేయించేటప్పుడు మొదట ఒక విషయాన్ని స్పష్టము చేయండి, అదేమిటంటే - తండ్రి ఒక్కరే.
తండ్రి ఒక్కరా లేక అనేకమంది తండ్రులున్నారా అని ప్రశ్నించవద్దు. అలా
ప్రశ్నించినట్లయితే అనేకమంది ఉన్నారు అని అనేస్తారు. అందుకే చెప్పడమే ఏమని
చెప్పండంటే - తండ్రి, రచయిత, గాడ్ ఫాదర్ ఒక్కరే. వారు సర్వాత్మలకు తండ్రి. వారు ఒక
బిందువు అని కూడా మొట్టమొదటే చెప్పకూడదు, అలా చెప్తే వారు తికమకపడతారు. మొట్టమొదటైతే
- మనకు ఇద్దరు తండ్రులు ఉన్నారు అన్న విషయాన్ని బాగా అర్థం చేయించండి. ఒకరు లౌకిక
తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి అయితే అందరికీ ఉంటారు. ఆ పారలౌకిక
తండ్రిని కొందరు ఖుదా అని, కొందరు గాడ్ అని పిలుస్తారు, కానీ వాస్తవానికి వారు
ఒక్కరే. అందరూ ఆ ఒక్కరినే స్మృతి చేస్తారు. మొట్టమొదట ఈ పక్కా నిశ్చయాన్ని
కలిగించండి - ఆ తండ్రియే స్వర్గాన్ని రచిస్తారు. వారు స్వర్గానికి యజమానిగా
తయారుచేయడానికి ఇక్కడికి వస్తారు, ఆ సమయాన్ని శివజయంతి అని కూడా అంటారు. స్వర్గ
రచయిత భారత్ లోనే స్వర్గాన్ని రచిస్తారని, అందులో దేవీ-దేవతల రాజ్యము మాత్రమే
ఉంటుందని కూడా పిల్లలైన మీకు తెలుసు. మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. వారి
పేరు శివ. గీతలో భగవానువాచ అని ఉంది కదా. మొట్టమొదటైతే ఈ విషయముపై నిశ్చయాన్ని
కలిగించి వారిచేత ఇది వ్రాయించాలి. గీతలో భగవానువాచ ఇలా ఉంది - నేను మీకు
రాజయోగాన్ని నేర్పిస్తాను అనగా నరుడి నుండి నారాయణుడిగా తయారుచేస్తాను. ఈ విధంగా
ఎవరు తయారుచేయగలరు? ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించవలసి ఉంటుంది. భగవంతుడు ఎవరు
అన్న విషయాన్ని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. సత్యయుగములో మొదటి నంబరులో ఏ
లక్ష్మీ-నారాయణులైతే ఉన్నారో, తప్పకుండా వారే 84 జన్మలు తీసుకుంటూ ఉండవచ్చు. ఆ
తర్వాత ఇతర ధర్మాలవారు వస్తారు, వారికి ఇన్ని జన్మలు ఉండే అవకాశము లేదు. మొదట
వచ్చినవారికే 84 జన్మలు ఉంటాయి. సత్యయుగములోనైతే ఏమీ నేర్చుకోరు. తప్పకుండా
సంగమములోనే నేర్చుకుంటూ ఉండవచ్చు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఏ విధంగా
ఆత్మ కనులకు కనిపించదు కానీ దానిని మనము అర్థం చేసుకోగలమో, అలాగే పరమాత్మను కూడా
మనము చూడలేము. వారు ఆత్మలైన మన తండ్రి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. వారిని
పరమ ఆత్మ అని అంటారు. వారు సదా పావనమైనవారు. వారు వచ్చి పతిత ప్రపంచాన్ని పావనముగా
చేయవలసి ఉంటుంది. మొట్టమొదట తండ్రి ఒక్కరే అన్న విషయాన్ని నిరూపిస్తూ
తెలియజేసినట్లయితే గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అన్న విషయము కూడా
నిరూపించబడుతుంది. ఒక్క తండ్రినే సత్యము అని అంటారని పిల్లలైన మీరు నిరూపించి
తెలియజేయాలి. మిగిలిన ఈ కర్మకాండలు, తీర్థాలు మొదలైన విషయాలన్నీ భక్తి మార్గపు
శాస్త్రాలలో ఉన్నాయి. జ్ఞానములోనైతే వీటి వర్ణన ఏదీ లేదు. ఇక్కడ ఏ శాస్త్రాలు లేవు.
తండ్రి వచ్చి మొత్తం రహస్యమంతటినీ అర్థం చేయిస్తారు. భగవంతుడు ఒక్క నిరాకారుడే,
సాకారుడు కాదు అన్న ఈ విషయాన్ని నిరూపించడములో పిల్లలైన మీరు మొట్టమొదట విజయాన్ని
పొందుతారు. ఇది పరమపిత పరమాత్మ శివ భగవానువాచ, వారు జ్ఞానసాగరుడు, అందరికీ తండ్రి.
శ్రీకృష్ణుడు అయితే అందరికీ తండ్రి అవ్వలేరు. దేహపు సర్వ ధర్మాలను వదిలి
నన్నొక్కరినే స్మృతి చేయండి అని శ్రీకృష్ణుడు ఎవరికీ చెప్పలేరు. ఇది చాలా సహజమైన
విషయము. కానీ మనుష్యులు శాస్త్రాలు మొదలైనవి చదివి భక్తిలో పక్కా అయిపోయారు. ఈ మధ్య
శాస్త్రాలు మొదలైనవాటిని రథములో పెట్టి చుట్టూ ఊరేగిస్తూ ఉంటారు. చిత్రాలను, గ్రంథ్
ను కూడా ఊరేగిస్తారు, ఆ తర్వాత ఇంటికి తీసుకువచ్చి పడుకోబెడతారు. మనము దేవతల నుండి
క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతామని, ఈ చక్రములో ఈ విధంగా తిరుగుతామని
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ చక్రానికి గుర్తుగా వారు అక్కడ ఆ ఊరేగింపు చేసి
ఇంటికి తీసుకువెళ్ళి పెడతారు. వారికి ఊరేగింపు కోసం ఒక రోజు నిశ్చితమై ఉంటుంది.
మొట్టమొదట నిరూపించి తెలియజేయండి - శ్రీకృష్ణ భగవానువాచ కాదు, అది శివ భగవానువాచ అని.
శివుడే పునర్జన్మ రహితుడు. వారు తప్పకుండా వస్తారు, కానీ వారిది దివ్య జన్మ. వారు
భగీరథుడి శరీరముపై స్వారీ అవుతారు. వారు వచ్చి పతితులను పావనముగా తయారుచేస్తారు.
రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానము గురించి
ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి తమంతట తామే వచ్చి తమ పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది.
ముఖ్యమైన విషయము తండ్రి పరిచయానికి సంబంధించినదే. వారే గీతా భగవానుడు, ఇది మీరు
నిరూపించి తెలియజేసినట్లయితే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. కావున ఇటువంటి
కరపత్రాలను తయారుచేసి అందులో చిత్రాలు మొదలైనవి కూడా ముద్రించి వాటిని విమానాల నుండి
కిందకు వేయాలి. తండ్రి ముఖ్య, ముఖ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ముఖ్యమైన ఈ
ఒక్క విషయములో మీరు విజయము పొందినట్లయితే ఇక మీరు పూర్తి విజయము పొందినట్లే. దీని
ద్వారా మీ పేరు ఎంతగానో ప్రసిద్ధమవుతుంది. ఇందులో ఎవరూ గొడవ పెట్టరు. ఈ విషయము చాలా
స్పష్టముగా ఉంది. తండ్రి అంటారు, నేను సర్వవ్యాపిని ఎలా అవుతాను. నేను అయితే వచ్చి
పిల్లలకు జ్ఞానాన్ని వినిపిస్తాను. మీరు వచ్చి పావనముగా తయారుచేయండి, రచయిత మరియు
రచనల జ్ఞానాన్ని వినిపించండి అని పిలుస్తూ ఉంటారు కూడా. మహిమ కూడా తండ్రిది వేరు,
శ్రీకృష్ణుడిది వేరు. శివబాబా వచ్చి శ్రీకృష్ణుడిగా లేక నారాయణుడిగా అవుతారని, 84
జన్మల్లోకి వస్తారని కాదు. అలా కాదు. మీ బుద్ధి అంతా ఈ విషయాలను అర్థం చేయించడంలోనే
నిమగ్నమై ఉండాలి. ముఖ్యమైనది గీతయే. భగవానువాచ అని ఉంది అంటే తప్పకుండా భగవంతునికి
ఒక నోరు కావాలి కదా. భగవంతుడు అయితే నిరాకారుడు. మరి ఆత్మ నోరు లేకుండా ఎలా
మాట్లాడగలదు. అందుకే, నేను సాధారణ తనువును ఆధారముగా తీసుకుంటాను అని అంటారు. ఎవరైతే
మొదట లక్ష్మీ-నారాయణులుగా అవుతారో, వారే 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ చివరిలోకి
వస్తారు, అప్పుడు వారి తనువులోకే వస్తారు. శ్రీకృష్ణుని అనేక జన్మల అంతిమములో
అతనిలోకి వస్తారు. ఈ విషయాలను ఎవరికి ఎలా అర్థం చేయించాలి అని ఈ విధంగా విచార సాగర
మంథనము చేస్తూ ఉండండి. ఈ ఒక్క విషయముతోనే మీ పేరు ప్రసిద్ధమవుతుంది మరియు రచయిత
అయిన తండ్రి గురించి అందరికీ తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మీ వద్దకు ఎంతోమంది వస్తారు.
ఇక్కడికి వచ్చి భాషణ ఇవ్వండి అని మిమ్మల్ని పిలుస్తారు, అందుకే మొట్టమొదట పరమాత్మను
గురించి నిరూపించి అర్థం చేయించండి. బాబా ద్వారా మనము స్వర్గ వారసత్వాన్ని
తీసుకుంటున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. బాబా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత
భారత్ లోనే భాగ్యశాలీ రథములోకి వస్తారు. వీరు సౌభాగ్యశాలి ఆత్మ, వీరి రథములోకి
భగవంతుడు వచ్చి కూర్చొంటారు, ఇదేమైనా తక్కువ విషయమా. భగవంతుడు వీరిలో కూర్చుని
పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, నేను అనేక జన్మల అంతిమములో వీరి తనువులోకి
ప్రవేశిస్తాను. వీరి తనువు శ్రీకృష్ణుని ఆత్మ యొక్క రథము కదా. వీరు స్వయమే
శ్రీకృష్ణుడు కాదు. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. ప్రతి జన్మలోనూ పోలికలు,
ఉద్యోగము మారుతూ ఉంటాయి. అనేక జన్మల అంతిమములో ఎవరి తనువులోకి అయితే ప్రవేశిస్తానో,
అతను మళ్ళీ శ్రీకృష్ణుడిగా అవుతారు. తండ్రి వచ్చేదే సంగమయుగములో. మనము కూడా తండ్రికి
చెందినవారిగా అయి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి చదివించి తనతోపాటు
తీసుకువెళ్తారు, ఇందులో ఇంకే శ్రమా లేదు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి
కేవలం ఇదే చెప్తున్నారు. ఈ విషయాన్ని ఏ విధంగా వ్రాయాలి అని బాగా విచార సాగర మంథనము
చేస్తూ ఉండాలి. ఇదే ముఖ్యమైన పొరపాటు, దీని కారణముగానే భారత్ అధర్మయుక్తముగా,
ధర్మభ్రష్టముగా, దివాలా తీసినట్లుగా అయిపోయింది. తండ్రి మళ్ళీ వచ్చి రాజయోగాన్ని
నేర్పిస్తారు. భారత్ ను ధర్మయుక్తముగా, సుసంపన్నముగా తయారుచేస్తారు. తండ్రి మొత్తము
ప్రపంచాన్ని ధర్మయుక్తముగా తయారుచేస్తారు. ఆ సమయములో మొత్తం విశ్వానికి యజమానులు
మీరే. ‘విష్ యు లాంగ్ లైఫ్ అండ్ ప్రాస్పరిటీ’ (మీకు దీర్ఘాయుష్షు మరియు సంపద కలగాలని
కోరుకుంటున్నాను) అని అంటారు కదా. బాబా ఏమీ సదా జీవిస్తూ ఉండండి అని దీవించరు.
అమరులుగా ఉండండి అని సాధువులు దీవిస్తూ ఉంటారు. అమరులు అయితే తప్పకుండా అమరపురిలోనే
ఉంటారని పిల్లలైన మీరు భావిస్తారు. మృత్యులోకములో ఉండేవారిని అమరులు అని ఎలా అంటారు.
పిల్లలు మీటింగులు మొదలైనవి చేసినప్పుడు తండ్రిని సలహాను అడుగుతారు. బాబా ముందుగా
ఒక సలహా ఇస్తున్నారు, అదేమిటంటే - మీరందరూ మీ, మీ అభిప్రాయాలను వ్రాసి పంపించండి, ఆ
తర్వాత అందరూ ఒక చోట కలుసుకోవచ్చు కూడా. సలహా అనేది మురళిలో వ్రాసి పంపించినట్లయితే
అది అందరి వద్దకు చేరుకుంటుంది. 2-3 వేల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది. ఈ 2-3 వేల
రూపాయలతో 2-3 సెంటర్లు తెరవవచ్చు. చిత్రాలు మొదలైనవి తీసుకుని పల్లె-పల్లెకూ
వెళ్ళాలి.
పిల్లలైన మీకు సూక్ష్మవతనానికి సంబంధించిన విషయాల పట్ల ఎక్కువ అభిరుచి ఉండకూడదు.
బ్రహ్మా, విష్ణువు, శంకరుడు మొదలైన చిత్రాలు ఉన్నాయి కావున వాటిపై కాస్త అర్థం
చేయించడం జరుగుతుంది. వీళ్ళ పాత్ర మధ్యలో కాస్త ఉంది. మీరు అక్కడికి వెళ్తారు,
వాళ్ళను కలుసుకుంటారు, అంతేకానీ అక్కడ ఇంకేమీ లేదు. అందుకే ఈ విషయములో ఎక్కువ
అభిరుచిని చూపించరు. ఇక్కడికి ఆత్మను పిలుస్తారు, వారికి చూపిస్తారు, కొందరు వచ్చి
ఏడుస్తారు కూడా, కొందరు ప్రేమగా కలుసుకుంటారు, కొందరు దుఃఖపు కన్నీరు కారుస్తారు.
ఇదంతా డ్రామాలోని పాత్ర, దీనిని కేవలం సంభాషణ అని అంటారు. వాళ్ళు అయితే
బ్రాహ్మణుడిలోకి ఏ ఆత్మనైనా పిలుస్తారు, అప్పుడు వారికి కొత్త బట్టలు మొదలైనవి
వేస్తారు. ఇప్పుడు ఆ గత శరీరమైతే సమాప్తమైపోయింది కదా, మరి ఆ వస్త్రాలను వేసుకునేది
ఎవరు? మీ వద్ద ఆ ఆచారము లేదు, ఏడ్వడము మొదలైన విషయమే లేదు. ఉన్నతోన్నతమైనవారిగా
తయారవ్వాలి, అలా ఎలా తయారవుతాము. తప్పకుండా మధ్యలో సంగమయుగము ఉంటుంది, ఆ సమయములోనే
పవిత్రముగా అవుతారు. మీరు ఒక్క విషయాన్ని నిరూపించినట్లయితే - వీరు యథార్థము
వినిపిస్తున్నారు అని అంటారు. భగవంతుడు ఎప్పుడూ అసత్యాన్ని చెప్పరు కదా. ఆ తర్వాత
అనేకులకు ప్రేమ కలుగుతుంది. అప్పుడు ఎంతోమంది వస్తారు. సమయమనుసారముగా పిల్లలకు
పాయింట్లన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అంతిమములో ఏమేమి జరుగుతాయో కూడా మీరు చూస్తారు,
యుద్ధము జరుగుతుంది, ఎన్నో బాంబులు పేలుతాయి. మొదట విదేశాలలో మృత్యువు
ప్రారంభమవుతుంది. ఇక్కడైతే రక్తపు నదులు ప్రవహించనున్నాయి, ఆ తర్వాత పాలు మరియు నేతి
నదులు ప్రవహిస్తాయి. మొట్టమొదట పొగ విదేశాల నుండి ప్రారంభమవుతుంది. భయము కూడా అక్కడే
ఉంటుంది. ఎంత పెద్ద-పెద్ద బాంబులను తయారుచేస్తూ ఉంటారు. వాటిలో ఏమేమో పదార్థాలు
వేస్తారు, దాని వల్ల మొత్తం పట్టణాలే నాశనమైపోతాయి. స్వర్గ రాజ్యాన్ని ఎవరు
స్థాపించారు అనేది కూడా తెలియజేయాలి. స్వర్గాన్ని రచించే తండ్రి తప్పకుండా
సంగమములోనే వస్తారు. ఇప్పుడు ఇది సంగమమని మీకు తెలుసు. తండ్రి స్మృతియే ముఖ్యమైన
విషయమని మీకు అర్థం చేయించడం జరుగుతుంది, దాని ద్వారానే పాపాలు వినాశనమవుతాయి.
భగవంతుడు వచ్చినప్పుడు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానముగా
అవుతారని, ముక్తిధామములోకి వెళ్తారని తెలియజేశారు. ఇక ఆ తర్వాత మొదటి నుండి
మొదలుకుని ఈ చక్రము రిపీట్ అవుతుంది. దేవతా ధర్మము, ఇస్లామ్ ధర్మము, బౌద్ధ ధర్మము...
విద్యార్థులైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి కదా. మేము ఎంత సంపాదన చేసుకుంటున్నాము
అని మీకు సంతోషము కలుగుతుంది. ఈ అమరకథను అమరుడైన బాబా మీకు వినిపిస్తున్నారు. మీకు
అనేక పేర్లు పెట్టారు. మొట్టమొదట దేవతా ధర్మము ముఖ్యమైనది, ఆ తర్వాత మెల్లగా అందరి
వృద్ధి జరుగుతూ, జరుగుతూ వృక్షము పెరుగుతూ ఉంటుంది. అనేకానేక ధర్మాలు, అనేక
అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ ఒక్క ధర్మము మాత్రమే ఒక్క శ్రీమతము ద్వారా స్థాపన అవుతుంది.
అక్కడ ద్వైతము యొక్క విషయమే లేదు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తున్నారు. పిల్లలైన మీరు సంతోషముగా కూడా ఉండాలి.
తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. మీరు అనుభవముతో చెప్తారు.
స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు కావున మాకు ఇంకేమి కావాలి అన్న శుద్ధ
అహంకారము మీలో ఉండాలి! మనము విశ్వానికి యజమానులుగా అవుతున్నప్పుడు మరి మనలో సంతోషము
ఎందుకు ఉండదు, లేదా నిశ్చయములో ఏమైనా సంశయము ఉందా? తండ్రిపై సంశయము రానివ్వకూడదు.
మాయ సంశయములోకి తీసుకువచ్చి మరపింపజేస్తుంది. బాబా అర్థం చేయించారు, మాయ కళ్ళ ద్వారా
చాలా మోసగిస్తుంది. మంచి వస్తువును చూస్తే తినాలి అని కోరికతో మనసు లాగుతూ ఉంటుంది,
కళ్ళతో చూసిన తర్వాతనే కొట్టాలి అని క్రోధము కలుగుతుంది. అసలు చూడనే చూడకపోతే ఎలా
కొట్టగలరు! కళ్ళ ద్వారా చూసినప్పుడే మోహము, లోభము కలుగుతుంది. ముఖ్యముగా మోసగించేవి
కళ్ళే. వీటిపై పూర్తిగా గమనము ఉంచాలి. ఆత్మకు జ్ఞానము లభించినట్లయితే ఇక అశుద్ధ
స్వభావము సమాప్తమవుతుంది. అలాగని కళ్ళను తీసేయాలని కూడా కాదు. మీరైతే అశుద్ధ
దృష్టిని శుద్ధముగా మార్చుకోవాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని సదా ఇదే నషాలో మరియు సంతోషములో ఉండాలి.
ఏ విషయములోనూ సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు. శుద్ధ అహంకారమును ఉంచుకోవాలి.
2. సూక్ష్మవతనము యొక్క విషయాలలో ఎక్కువ అభిరుచిని ఉంచుకోకూడదు. ఆత్మను
సతోప్రధానముగా తయారుచేసుకునేందుకు పూర్తి-పూర్తి పురుషార్థము చేయాలి. పరస్పరం
చర్చించుకుని సలహాలు తీసి అందరికీ తండ్రి యొక్క యథార్థ పరిచయాన్ని ఇవ్వాలి.
వరదానము:-
పాస్
విత్ హానర్ గా అయ్యేందుకు పురుషార్థము యొక్క వేగాన్ని తీవ్రతరముగా మరియు బ్రేక్ ను
శక్తిశాలిగా ఉంచుకునే యథార్థ యోగీ భవ
వర్తమాన సమయమనుసారముగా
పురుషార్థము యొక్క వేగము తీవ్రతరముగా మరియు బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి, అప్పుడే
అంతిమములో పాస్ విత్ హానర్ గా అవ్వగలుగుతారు ఎందుకంటే ఆ సమయములోని పరిస్థితులు
బుద్ధిలో అనేక సంకల్పాలను తీసుకువచ్చేవిగా ఉంటాయి. ఆ సమయములో అన్ని సంకల్పాలకు
అతీతముగా ఏక సంకల్పములో స్థితులయ్యే అభ్యాసము కావాలి. ఏ సమయములోనైనా బుద్ధి
విస్తారములోకి వెళ్ళిపోతూ ఉంటే, ఆ సమయములో దానిని స్టాప్ చేసే ప్రాక్టీస్ ఉండాలి.
స్టాప్ చేయగానే స్టాప్ అయిపోవాలి. ఎంత సమయము కావాలంటే అంత సమయము బుద్ధిని ఏక
సంకల్పములో స్థితి చేయగలగాలి - ఇదే యథార్థ యోగము.
స్లోగన్:-
మీరు
ఆజ్ఞాకారీ సేవాధారులు, అందుకే నిర్లక్ష్యముగా ఉండలేరు, సేవాధారి అనగా సదా సేవలో
ఉపస్థితులై ఉండేవారు.
అవ్యక్త సూచనలు -
సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి
ఏ విధంగా ఇంజెక్షన్
ద్వారా రక్తములో శక్తిని నింపుతారో, అలా మీ శ్రేష్ఠ సంకల్పము ఇంజెక్షన్ లా పని
చేస్తుంది. సంకల్పము ద్వారా సంకల్పములో శక్తి రావాలి - ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరము
చాలా ఉంది. స్వయము యొక్క రక్షణ కొరకు కూడా శుభమైన మరియు శ్రేష్ఠమైన సంకల్పాల శక్తిని
మరియు నిర్భయతా శక్తిని జమ చేసుకోండి, అప్పుడే అంతిమము చక్కగా ఉంటుంది మరియు
అనంతమైన కార్యములో సహయోగులుగా అయ్యి అనంతమైన విశ్వ రాజ్యాధికారులుగా అవ్వగలుగుతారు.
| | |