ఓంశాంతి
పిల్లలు ఎవరి ఎదురుగా కూర్చున్నారు. మేము పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత అయిన మా
అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నామని తప్పకుండా పిల్లల బుద్ధిలో నడుస్తూ ఉండవచ్చు.
వారు బ్రహ్మా తనువులో ఉన్నా కానీ మీరు స్మృతి చేయవలసింది శివబాబానే. మనుష్యులెవ్వరూ
సర్వులకు సద్గతిని ఇవ్వలేరు. మనుష్యులను పతిత-పావనుడు అని అనరు. పిల్లలు స్వయాన్ని
ఆత్మగా భావించాల్సి ఉంటుంది. ఆత్మలమైన మనందరికీ తండ్రి వారే. ఆ తండ్రి మనల్ని
స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తున్నారు. ఈ విషయాన్ని పిల్లలు తెలుసుకోవాలి,
అంతేకాక పిల్లలకు సంతోషము కూడా ఎంతో ఉండాలి. మనము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా
తయారవుతున్నాము అని కూడా పిల్లలకు తెలుసు. చాలా సహజమైన మార్గము లభిస్తోంది. కేవలం
స్మృతి చేయాలి మరియు స్వయములో దైవీ గుణాలను ధారణ చేయాలి. స్వయాన్ని చెక్ చేసుకుంటూ
ఉండాలి. నారదుని ఉదాహరణ కూడా ఉంది. ఈ ఉదాహరణలన్నింటినీ జ్ఞానసాగరుడైన తండ్రియే
ఇచ్చారు. సన్యాసులు మొదలైనవారు ఏయే ఉదాహరణలనైతే ఇచ్చారో, అవన్నీ వాస్తవానికి తండ్రి
ఇచ్చినవే. భక్తి మార్గములో కేవలము గానము చేస్తూ ఉంటారు. తాబేలు, సర్పము, భ్రమరము
ఉదాహరణలను ఇస్తూ ఉంటారు. కానీ వారు స్వయం ఏమీ చేయలేరు. తండ్రి ఇచ్చిన ఉదాహరణలను
భక్తి మార్గములో మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. భక్తి మార్గము అంటేనే గతానికి
సంబంధించిన స్మృతిచిహ్నము. ఈ సమయములో ఏదైతే ప్రాక్టికల్ గా జరుగుతోందో దానికి
తర్వాత భక్తిలో గాయనము జరుగుతుంది. దేవతల జన్మదినాన్ని మరియు భగవంతుని జన్మదినాన్ని
జరుపుకుంటారు, కానీ వారికేమీ తెలియదు. ఇప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకుంటూ ఉంటారు.
తండ్రి నుండి శిక్షణను తీసుకుని పతితుల నుండి పావనముగా కూడా అవుతారు మరియు పతితులకు
పావనముగా తయారయ్యేందుకు మార్గాన్ని కూడా తెలియజేస్తారు. ఇదే మీ ముఖ్యమైన ఆత్మిక సేవ.
మొట్టమొదట ఎవరికైనా ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. మీరు ఒక ఆత్మ అని చెప్పాలి. ఆత్మను
గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ అయితే అవినాశీ అయినది. ఎప్పుడైతే సమయము
వస్తుందో అప్పుడు ఆత్మ వచ్చి శరీరములోకి ప్రవేశిస్తుంది, కావున స్వయాన్ని ఘడియ,
ఘడియ ఆత్మగా భావించండి. ఆత్మలమైన మన తండ్రి పరమపిత పరమాత్మ. వారు పరమ శిక్షకుడు కూడా.
ఈ విషయము కూడా పిల్లలకు నిత్యం గుర్తు ఉండాలి. ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు తిరిగి
వెళ్ళాలి అని మీకు తెలుసు. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. సత్యయుగములో దైవీ పరివారము
చాలా చిన్నగా ఉంటుంది. కలియుగములోనైతే ఎంతమంది మనుష్యులు ఉన్నారు. అనేక ధర్మాలు,
అనేక మతాలు ఉన్నాయి. సత్యయుగములో ఇవేవీ ఉండవు. పిల్లలు రోజంతా బుద్ధిలోకి ఈ విషయాలను
తెచ్చుకుంటూ ఉండాలి. ఇది చదువు కదా. ఆ చదువులోనైతే ఎన్ని పుస్తకాలు మొదలైనవి ఉంటాయి.
ప్రతి క్లాస్ లోనూ కొత్త-కొత్త పుస్తకాలను కొనుక్కోవలసి ఉంటుంది. ఇక్కడైతే ఏ
పుస్తకాలు లేక శాస్త్రాలకు సంబంధించిన విషయము లేదు. ఇందులోనైతే ఒకే ఒక్క విషయము ఉంది,
ఒక్కటే చదువు ఉంది. ఇక్కడ బ్రిటీష్ గవర్నమెంట్ ఉన్న సమయములో, రాజుల రాజ్యాలు ఉన్న
సమయములో, వారి స్టాంప్ లపై కూడా రాజు, రాణుల చిత్రాలు తప్ప ఇంకెవ్వరి చిత్రాలు
వేసేవారు కాదు. ఈ రోజుల్లో చూడండి, ఒకప్పుడు ఉండి వెళ్ళిన భక్తుల చిత్రాలను కూడా
స్టాంప్ లపై వేస్తుంటారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు చిత్రము కూడా ఒకే
మహారాజు, మహారాణిది ఉంటుంది. అలాగని ఒకప్పుడు ఎవరైతే దేవతలు ఉండి వెళ్ళారో, వారి
చిత్రాలు తొలగిపోతాయని కాదు, అలా ఏమీ జరగదు, అన్నింటికంటే పురాతనమైన దేవతల చిత్రాలను
చాలా హృదయపూర్వకముగా స్వీకరిస్తారు, ఎందుకంటే శివబాబా తరువాత ఉన్నది ఈ దేవతలే.
ఇతరులకు మార్గాన్ని తెలియజేసేందుకు పిల్లలైన మీరు ఈ విషయాలన్నింటినీ ధారణ
చేస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త చదువు. మీరే ఒకప్పుడు ఇది విన్నారు మరియు పదవిని
పొందారు, ఇంకెవ్వరికీ ఈ విషయాలను గురించి తెలియదు. మీకు రాజయోగాన్ని పరమపిత పరమాత్మ
నేర్పిస్తున్నారు. మహాభారత యుద్ధము కూడా ప్రసిద్ధమైనది. ఏం జరుగుతుంది అనేది మీరు
మున్ముందు చూస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటారు. రోజురోజుకు మనుష్యులకు ఈ
విషయము టచ్ అవుతూ ఉంటుంది. ప్రపంచ యుద్ధము మొదలైపోతుంది అని అంటారు కూడా. దాని కంటే
ముందే పిల్లలైన మీరు మీ చదువు ద్వారా కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకోవాలి. ఇకపోతే
అసురులు మరియు దేవతలకు మధ్యన యుద్ధమేమీ జరుగదు. ఈ సమయములో మీరు బ్రాహ్మణ
సాంప్రదాయులు, మీరే మళ్ళీ వెళ్ళి దైవీ సాంప్రదాయులుగా అవుతారు, అందుకే ఈ జన్మలో దైవీ
గుణాలను ధారణ చేస్తున్నారు. నంబర్ వన్ దైవీ గుణము పవిత్రత. మీరు ఈ శరీరము ద్వారా
ఎన్ని పాపాలు చేస్తూ వచ్చారు. ఆత్మనే పాపాత్మ అని అంటారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల
ద్వారా ఎన్ని పాపాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెడు వినవద్దు... అన్న మాట ఎవరికి
చెప్తున్నారు? ఆత్మకు చెప్తున్నారు. ఆత్మయే చెవుల ద్వారా వింటుంది. తండ్రి పిల్లలైన
మీకు స్మృతిని కలిగించారు - మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా
ఉండేవారు, చక్రములో తిరిగి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఆ విధముగా తయారవ్వాలి. ఈ
మధురమైన స్మృతి కలగడం ద్వారా పవిత్రముగా తయారయ్యేందుకు ధైర్యము వస్తుంది. మనము 84
జన్మల పాత్రను ఎలా అభినయించాము అనేది మీ బుద్ధిలో ఉంది. మొట్టమొదట మనము ఈ విధముగా
ఉండేవారము. ఇది ఒక కథ కదా. 5000 సంవత్సరాల క్రితం మేమే దేవతలుగా ఉండేవారము అని
బుద్ధిలోకి రావాలి. ఆత్మలమైన మనము మూలవతన నివాసులము. ఆత్మలమైన మనకు అది ఇల్లు అన్న
ఆలోచన ఇంతకుముందు కొద్దిగా కూడా ఉండేది కాదు. అక్కడ నుండి మనము పాత్రను
అభినయించేందుకు వస్తాము. సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా... అయ్యాము. ఇప్పుడు
బ్రహ్మా సంతానమైన మీరు బ్రాహ్మణ వంశీయులు. మీరు ఈశ్వరీయ సంతానముగా అయ్యారు. ఈశ్వరుడు
కూర్చుని మీకు శిక్షణను ఇస్తున్నారు. వీరు సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచర్,
సుప్రీమ్ గురువు కూడా. మనము వారి మతమనుసారముగా మనుష్యమాత్రులందరినీ శ్రేష్ఠముగా
తయారుచేస్తున్నాము. ముక్తి, జీవన్ముక్తి రెండూ శ్రేష్ఠమైనవే. మనము మన ఇంటికి
వెళ్తాము, ఆ తరువాత పవిత్రాత్మలుగా వచ్చి రాజ్యము చేస్తాము. ఇది ఒక చక్రము కదా.
దీనినే స్వదర్శన చక్రము అని అనడం జరుగుతుంది. ఇది జ్ఞానపు విషయము. తండ్రి అంటారు,
మీ ఈ స్వదర్శన చక్రము ఆగకూడదు. ఇది అలా తిరుగుతూ ఉన్నట్లయితే వికర్మలు
వినాశనమైపోతాయి. అలా మీరు ఈ రావణుడిపై విజయాన్ని పొందుతారు. పాపాలన్నీ తొలగిపోతాయి.
ఇవన్నీ స్మరణ చేసుకునేందుకని ఇప్పుడు స్మృతి కలిగింది. అలాగని కూర్చుని మాలను
స్మరించమని కాదు. ఆత్మలో లోపల జ్ఞానముంది, దానిని పిల్లలైన మీరు ఇతర సోదరీ-సోదరులకు
అర్థం చేయించాలి. పిల్లలు కూడా సహాయకులుగా అయితే అవుతారు కదా. పిల్లలైన మిమ్మల్నే
స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తాను. ఈ జ్ఞానము నాలో ఉంది, అందుకే నన్ను
జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు అని అంటారు. వారిని తోట యజమాని అని అంటారు.
దేవీ-దేవతా ధర్మము యొక్క బీజాన్ని శివబాబాయే నాటారు. ఇప్పుడు మీరు దేవీ-దేవతలుగా
తయారవుతున్నారు. ఈ విషయాన్ని మీరు రోజంతా స్మరణ చేసుకుంటూ ఉన్నా సరే మీకు ఎంతో
కళ్యాణము జరుగుతుంది. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. పవిత్రముగా కూడా అవ్వాలి.
స్త్రీ-పురుషులు ఇరువురూ కలిసి ఉంటూ పవిత్రముగా ఉంటారు. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు.
కేవలము పురుషులు మాత్రమే నివృత్తి మార్గము వారిగా అవుతారు. స్త్రీ-పురుషులు ఇరువురూ
కలిసి ఉంటూ పవిత్రముగా ఉండలేరని, అలా ఉండడము కష్టమని వారు అంటారు కదా. సత్యయుగములో
మరి అలాగే ఉండేవారు కదా. లక్ష్మీ-నారాయణుల మహిమను కూడా గానం చేస్తూ ఉంటారు.
ఇప్పుడు మీకు తెలుసు - బాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసి, ఆ
తరువాత దేవతలుగా తయారుచేస్తారు. మనమే పూజ్యుల నుండి పూజారులుగా అవుతాము. ఆ తరువాత
ఎప్పుడైతే వామ మార్గములోకి వెళ్తారో, అప్పుడు శివుని మందిరాలను తయారుచేసి పూజిస్తారు.
పిల్లలైన మీకు మీ 84 జన్మల జ్ఞానము ఉంది. తండ్రియే అంటారు, మీకు మీ జన్మల గురించి
తెలియదు, వాటి గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ విధముగా మనుష్యమాత్రులెవ్వరూ
అనలేరు. మిమ్మల్ని ఇప్పుడు తండ్రి స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తారు. ఆత్మ అయిన
మీరు పవిత్రముగా అవుతూ ఉన్నారు. శరీరమైతే ఇక్కడ పవిత్రముగా అవ్వలేదు. ఆత్మ
పవిత్రముగా అయిపోతే ఇక అపవిత్ర శరీరాన్ని వదలవలసి ఉంటుంది. ఆత్మలందరూ పవిత్రముగా
అయ్యే వెళ్ళాలి. పవిత్ర ప్రపంచము ఇప్పుడు స్థాపన అవుతుంది. మిగిలినవారందరూ మధురమైన
ఇంటికి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
తండ్రి స్మృతితోపాటుగా ఇంటి స్మృతి కూడా తప్పకుండా కావాలి, ఎందుకంటే ఇప్పుడు
తిరిగి ఇంటికి వెళ్ళాలి. తండ్రిని ఆ ఇంటిలోనే స్మృతి చేయాలి. బాబా ఈ తనువులోకి వచ్చి
మనకు వినిపిస్తున్నారని మీకు తెలిసినా కానీ, బుద్ధి మాత్రము మధురమైన ఇల్లు అయిన ఆ
పరంధామము నుండి తెగిపోకూడదు. మిమ్మల్ని చదివించేందుకని టీచర్ ఇల్లు వదిలి ఇక్కడకు
వస్తారు. మిమ్మల్ని చదివించి మళ్ళీ ఎంతో దూరము వెళ్ళిపోతారు. ఒక్క క్షణములో
ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆత్మ ఎంత చిన్నని బిందువు. ఆశ్చర్యము కలగాలి. తండ్రి
ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా ఇచ్చారు. ఇది కూడా మీకు తెలుసు, స్వర్గములో ఏ
విధమైన అశుద్ధమైన వస్తువు ఉండదు కావున అక్కడ మీ కాళ్ళు, చేతులు, బట్టలు మొదలైనవేవీ
మురికి అవ్వవు. దేవతల వస్త్రాలు ఎంత సుందరముగా ఉంటాయి. వారి వస్త్రాలు ఎంత ఫస్ట్
క్లాస్ గా ఉంటాయి. అసలు వాటిని ఉతకవలసిన అవసరము కూడా ఉండదు. వారిని చూసి ఎంత సంతోషము
కలగాలి. భవిష్యత్తులో 21 జన్మలు మనము ఈ విధముగా అవుతామని ఆత్మకు తెలుసు. ఇక అలా
చూస్తూ ఉండిపోవాలి. ఈ చిత్రము అందరి వద్దా ఉండాలి. మమ్మల్ని బాబా ఈ విధముగా
తయారుచేస్తున్నారు అని ఎంతో సంతోషము ఉండాలి. మరి ఇటువంటి బాబాకు పిల్లలైన మనము
ఎందుకు ఏడుస్తాము! మనకు ఏ చింతా ఉండకూడదు. దేవతల మందిరాల్లోకి వెళ్ళి - సర్వ గుణ
సంపన్నులు... అచ్యుతం, కేశవం... అని మహిమను పాడుతూ ఉంటారు, ఎన్ని పేర్లతో పిలుస్తూ
ఉంటారు. ఇవన్నీ శాస్త్రాలలో వ్రాయబడి ఉన్నాయి, వాటిని తలచుకుంటూ ఉంటారు. శాస్త్రాలలో
ఎవరు వ్రాశారు? వ్యాసుడు. లేక ఎవరైనా కొత్త-కొత్తవారు కూడా వ్రాస్తూ ఉంటారు. పూర్వము
గ్రంథ్ చాలా చిన్నగా ఉండేది, చేతితో వ్రాసినది ఉండేది. ఇప్పుడు దానిని ఎంత పెద్దగా
తయారుచేశారు. తప్పకుండా ఆ గ్రంథ్ లో ఏదో ఒకటి కలిపి ఉంటారు. ఇప్పుడు గురునానక్ అయితే
ధర్మ స్థాపన చేయడానికి వస్తారు. జ్ఞానాన్ని ఇచ్చేవారు అయితే ఒక్కరే. క్రైస్టు కూడా
కేవలం ధర్మ స్థాపన చేయడానికి వస్తారు. ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడిక తిరిగి
వెళ్తారు. ఇంటికి పంపించేది ఎవరు? క్రైస్టు పంపిస్తారా? లేదు, ఎందుకంటే అతను వేరే
నామ-రూపాలతో తమోప్రధాన అవస్థలో ఉన్నారు. సతో, రజో, తమోలలోకి వస్తారు కదా. ఈ సమయములో
అందరూ తమోప్రధానముగా ఉన్నారు. అందరిదీ శిథిలావస్థే కదా. పునర్జన్మలు తీసుకుంటూ,
తీసుకుంటూ ఈ సమయములో సర్వ ధర్మాల వారు తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు అందరూ
తప్పకుండా తిరిగి వెళ్ళాలి. మళ్ళీ చక్రములో తిరగవలసిందే. మొదట కొత్త ధర్మము కావాలి,
అది సత్యయుగములో ఇంతకుముందు ఉండేది. తండ్రియే వచ్చి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని
స్థాపన చేస్తారు. ఆ తరువాత వినాశనము కూడా జరగవలసిందే. స్థాపన, వినాశనము, ఆ తరువాత
పాలన. సత్యయుగములో ఒకే ధర్మము ఉంటుంది. ఇది స్మృతిలోకి వస్తుంది కదా. మొత్తము
చక్రమంతటినీ స్మృతిలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి
చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తాము. మీరు మాట్లాడుతూ, తిరుగుతూ స్వదర్శన చక్రధారులుగా
ఉన్నారు. కానీ వారు, శ్రీకృష్ణుడికి స్వదర్శన చక్రముండేదని, దానితో అందరినీ
సంహరించారని చెప్తూ ఉంటారు. అకాసురుడు, బకాసురుడు మొదలైనవారి చిత్రాలను చూపించారు.
కానీ వాస్తవానికి అటువంటి విషయమేదీ లేదు.
పిల్లలైన మీరు ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయి ఉండాలి, ఎందుకంటే స్వదర్శన
చక్రముతో మీ పాపాలు నాశనమవుతాయి, ఆసురీ స్వభావము సమాప్తమైపోతుంది. దేవతలు మరియు
అసురులకు మధ్యన అయితే యుద్ధము జరుగదు. అసురులు కలియుగములో ఉంటారు, దేవతలు
సత్యయుగములో ఉంటారు. ఈ రెండింటికీ మధ్యలో సంగమయుగము ఉంది. శాస్త్రాలన్నీ భక్తి
మార్గానికి చెందినవే. వాటిలో జ్ఞానము యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. అందరికీ
జ్ఞానసాగరుడు ఆ తండ్రి ఒక్కరే. తండ్రి లేకుండా ఏ ఆత్మా పవిత్రముగా అయి తిరిగి
వెళ్ళలేదు. పాత్రను తప్పకుండా అభినయించవలసిందే, కావున ఇప్పుడు మీ 84 జన్మల చక్రాన్ని
కూడా స్మృతి చేయాలి. మనము ఇప్పుడు సత్యయుగపు కొత్త జన్మలోకి వెళ్తాము. ఇటువంటి జన్మ
ఇంకెప్పుడూ లభించదు. శివబాబా, ఆ తరువాత బ్రహ్మాబాబా. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి
మరియు వీరు అలౌకిక తండ్రి. ఇది ఈ సమయానికి చెందిన విషయమే. వీరిని అలౌకిక తండ్రి అని
అనడం జరుగుతుంది. పిల్లలైన మీరు ఆ శివబాబాను స్మృతి చేస్తారు, బ్రహ్మాను కాదు.
బ్రహ్మా మందిరాలలోకి వెళ్ళి పూజించినా, అది కూడా అతను సూక్ష్మవతనములో సంపూర్ణ
అవ్యక్తమూర్తిగా ఉన్నప్పుడే జరుగుతుంది. ఈ శరీరధారి పూజకు అర్హులు కాదు. ఇతను ఒక
మానవుడు కదా. మానవునికి పూజ జరుగదు. బ్రహ్మా ఇక్కడివారు అని సూచించేందుకు వారికి
గడ్డము చూపిస్తారు. దేవతలకు గడ్డము ఉండదు. ఈ విషయాలన్నింటినీ పిల్లలకు అర్థం
చేయించారు. మీ పేరు చాలా ప్రసిద్ధమైనది, అందుకే మీ మందిరాలు కూడా తయారయ్యాయి.
సోమనాథ మందిరము ఎంత ఉన్నతోన్నతమైనది. సోమరసాన్ని తాగించారు, ఆ తరువాత ఏమయ్యింది?
అలాగే ఇక్కడ కూడా దిల్వాడా మందిరాన్ని చూడండి. ఈ మందిరము ఏక్యురేట్ స్మృతిచిహ్నముగా
తయారయ్యింది. కింద మీరు తపస్య చేస్తున్నారు, ఆ పైన స్వర్గము ఉంది. స్వర్గము ఎక్కడో
పైన ఉందని మనుష్యులు భావిస్తారు. మందిరములో కూడా స్వర్గాన్ని కింద ఎలా
చిత్రీకరించగలరు! కావుననే పైన చిత్రీకరించారు. తయారుచేసే వారికెవ్వరికీ ఈ విషయాలు
తెలియవు. పెద్ద-పెద్ద కోటీశ్వరులైనవారికి ఈ విషయాలను అర్థం చేయించాలి. మీకు ఇప్పుడు
జ్ఞానము లభించింది కావున మీరు దీనిని అనేకమందికి ఇవ్వవచ్చు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.