11-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు మొత్తం ప్రపంచమంతటికీ
సత్యాతి-సత్యమైన మిత్రులు, మీకు ఎవరితోనూ శత్రుత్వము ఉండకూడదు’’
ప్రశ్న:-
మీరు
ఆత్మిక మిలట్రీ వంటివారు, మీకు తండ్రి నుండి లభించిన ఏ డైరెక్షన్ ను అమలులోకి
తీసుకురావాలి?
జవాబు:-
సదా బ్యాడ్జీని
పెట్టుకుని ఉండండి అని మీకు డైరెక్షన్ లభించింది. ఎవరైనా - ఇదేమిటి? మీరు ఎవరు? అని
అడిగితే, మీరు చెప్పండి - మేము మొత్తం ప్రపంచములో నుండి కామాగ్నిని ఆర్పివేసే ఫైర్
బ్రిగేడ్ (అగ్నిమాపక దళము). ఈ సమయములో మొత్తం ప్రపంచములో కామాగ్ని అంటుకుని ఉంది,
మేము అందరికీ సందేశము ఇస్తాము - ఇప్పుడు పవిత్రముగా అవ్వండి, దైవీ గుణాలను ధారణ
చేయండి, అప్పుడు మీ నావ తీరానికి చేరుకుంటుంది అని.
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు సహజమైన స్మృతిలో కూర్చున్నారు. కొందరికి ఇది
కష్టమనిపిస్తుంది. మేము టైట్ గా లేక స్ట్రిక్ట్ గా కూర్చోవాలి అని చాలామంది
తికమకపడతారు. తండ్రి అంటారు, అటువంటి విషయమేమీ లేదు, మీరు ఎలాగైనా కూర్చోవచ్చు.
తండ్రిని కేవలం స్మృతి చేయాలి అంతే. ఇందులో కష్టమైన విషయమేమీ లేదు. ఆ హఠయోగులు అలా
టైట్ గా కూర్చుంటారు. మఠము వేసుకుని కూర్చుంటారు. ఇక్కడైతే తండ్రి అంటారు,
విశ్రాంతిగా కూర్చోండి, తండ్రిని మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. ఇది
సహజమైన స్మృతి. ఇది లేస్తూ, కూర్చుంటూ బుద్ధిలో ఉండాలి. ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు తన
తండ్రి పక్కన కూర్చున్నాడు చూడండి, ఇతనికి బుద్ధిలో తల్లిదండ్రులే గుర్తుంటారు.
అలాగే మీరు కూడా పిల్లలు కదా. తండ్రిని స్మృతి చేయడమనేది చాలా సహజము. మనము బాబా
పిల్లలము. బాబా నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. శరీర నిర్వహణార్థము గృహస్థ
వ్యవహారములో ఉండండి, కేవలం ఇతరుల స్మృతిని బుద్ధి నుండి తొలగించండి. పూర్వము కొందరు
హనుమంతుడిని, కొందరు ఇంకెవరినో, కొందరు సాధువులు మొదలైనవారిని స్మృతి చేసేవారు,
ఇప్పుడు ఇక ఆ స్మృతిని వదిలివేయాలి. స్మృతి అయితే అందరూ చేస్తారు కదా. పూజ కోసం
పూజారికి మందిరములోకి వెళ్ళవలసి ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరము
కూడా లేదు. ఎవరైనా కలిస్తే - తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి అని శివబాబా
చెప్తున్నారు అని వారికి చెప్పండి. శివబాబా అయితే నిరాకారుడు. కావున తప్పకుండా వారు
- నన్నొక్కరినే స్మృతి చేయండి అన్న మాటను సాకారములోకి వచ్చే అంటారు. నేను
పతిత-పావనుడిని, ఇది సరైన మాట కదా. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి. మీరందరూ
పతితముగా ఉన్నారు. ఇది పతితమైన తమోప్రధాన ప్రపంచము కదా, అందుకే బాబా అంటారు, ఏ
దేహధారినీ స్మృతి చేయకండి. ఇది మంచి విషయము కదా. ఇక్కడ గురువులు మొదలైనవారెవరి
మహిమను చేయరు. తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు
కట్ అవుతాయి. ఇది యోగబలము మరియు యోగాగ్ని. గీతా భగవానుడు నిరాకారుడని, శ్రీకృష్ణుడు
కాదని అనంతమైన తండ్రి సత్యమునే చెప్తారు కదా. భగవంతుడు చెప్తున్నారు, కేవలం
నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకే ఉపాయము లేదు. పావనముగా అయి వెళ్ళినట్లయితే ఉన్నత
పదవిని పొందుతారు, లేకపోతే పదవి తగ్గిపోతుంది. నేను మీకు బాబా సందేశాన్ని
ఇస్తున్నాను, నేను సందేశకుడిని అని అర్థం చేయించడములో కష్టమేమీ లేదు. మాతలు, అహల్యలు
(రాతిబుద్ధి కలవారు), గును స్త్రీలు కూడా ఉన్నత పదవిని పొందవచ్చు, అది ఇక్కడ
ఉన్నవారైనా లేక ఇంటిలో, గృహస్థములో ఉన్నవారైనా సరే. ఇక్కడ ఉండేవారు ఎక్కువ స్మృతి
చేయగలరు అనేమీ కాదు. బాబా అంటారు, బయట ఉండేవారు కూడా చాలా స్మృతిలో ఉండగలరు, చాలా
సేవ చేయగలరు. ఇక్కడికి వచ్చి బాబా ద్వారా రిఫ్రెష్ అయి వెళ్తారు, కావున లోలోపల ఎంత
సంతోషముండాలి. ఈ ఛీ-ఛీ ప్రపంచములోనైతే ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి, ఆ
తరువాత శ్రీకృష్ణపురిలోకి వెళ్తాము. శ్రీకృష్ణుని మందిరాన్ని కూడా సుఖధామము అని
అంటారు. మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున పిల్లలకు అపారమైన సంతోషము
ఉండాలి. మిమ్మల్నే స్వర్గానికి అధిపతులుగా చేసాను. మీరు కూడా అంటారు - బాబా, 5000
సంవత్సరాల క్రితం కూడా మేము మిమ్మల్ని కలుసుకున్నాము, మళ్ళీ కలుసుకుంటాము. ఇప్పుడు
తండ్రిని స్మృతి చేయడం ద్వారా మాయపై విజయాన్ని పొందాలి. ఇప్పుడు ఈ దుఃఖధామములోనైతే
ఉండేది లేదు. మీరు చదువుతున్నది సుఖధామములోకి వెళ్ళేందుకే. అందరూ లెక్కాచారాలను
సమాప్తము చేసుకుని తిరిగి వెళ్ళాలి. నేను వచ్చిందే కొత్త ప్రపంచాన్ని స్థాపించడానికి.
మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములోకి వెళ్ళిపోతాయి. తండ్రి అంటారు, నేను కాలుడికే
కాలుడిని. అందరినీ శరీరాల నుండి విడిపించి ఆత్మలను తీసుకువెళ్తాను. మేము త్వరగా
వెళ్ళిపోవాలి, ఇక్కడ ఇక ఉండేది లేదు, ఇది పాత ప్రపంచము, పాత శరీరము అని అందరూ అంటూ
ఉంటారు కూడా. ఇప్పుడు తండ్రి అంటారు, నేను అందరినీ తీసుకువెళ్తాను. నేను ఎవ్వరినీ
వదలను. మీరందరూ పిలిచిందే - ఓ పతిత-పావనా రండి అని. ఇలా స్మృతి చేస్తూ ఉంటారు కానీ
అర్థమేమీ అర్థం చేసుకోరు. పతిత-పావనా అని ఎంతగా భజన చేస్తూ ఉంటారు. మళ్ళీ రఘుపతి
రాఘవ రాజా రామ్ అని కూడా అంటారు. వాస్తవానికి శివబాబా అయితే రాజుగా అవ్వరు, రాజ్యము
చేయరు. కావున వారిని రాజా రామ్ అని అనడం పొరపాటు. మాలను స్మరించినప్పుడు రామ, రామ
అని అంటూ ఉంటారు. అప్పుడు భగవంతుని స్మృతి కలుగుతుంది. శివుడే భగవంతుడు. మనుష్యులు
ఎన్నో పేర్లు పెడుతుంటారు. శ్రీకృష్ణుడికి కూడా శ్యామసుందరుడు, వైకుంఠనాథుడు,
వెన్నదొంగ మొదలైన పేర్లు ఎన్నో పెడుతూ ఉంటారు. మీరు ఇప్పుడు శ్రీకృష్ణుడిని
వెన్నదొంగ అని అంటారా? అస్సలు అనరు. మీరు ఇప్పడు అర్థం చేసుకున్నారు - భగవంతుడు
ఒక్క నిరాకారుడే, ఏ దేహధారినీ భగవంతుడు అని అనలేము అని. బ్రహ్మా, విష్ణు, శంకరులను
కూడా భగవంతుడు అని అనలేము అన్నప్పుడు మరి మనుష్యులు తమను తాము భగవంతుడు అని ఎలా
చెప్పుకోగలరు. వైజయంతీ మాల కేవలం 108 మందిదే గాయనము చేయబడ్డది. శివబాబా స్వర్గాన్ని
స్థాపించారు, దానికి వీరు యజమానులు. తప్పకుండా అలా తయారయ్యేందుకు ముందు వారు ఆ
పురుషార్థము చేసి ఉంటారు. దానిని కలియుగాంతము, సత్యయుగ ఆది, రెండింటికీ మధ్యన ఉన్న
సంగమయుగము అని అంటారు. ఇది కల్పము యొక్క సంగమయుగము. మనుష్యులు యుగే-యుగే అని అన్నారు.
అవతారము అన్న మాటను కూడా మర్చిపోయి వారిని రాయి-రప్పలలోనూ, కణకణములోనూ ఉన్నారని
అనేసారు. ఇది కూడా డ్రామాయే. ఏ విషయమైతే గతించిపోయిందో, దానిని డ్రామా అని అంటారు.
ఎవరితోనైనా కొట్లాట జరిగితే, అది గతించిపోతే ఇక దాని గురించి చింతన చేయకూడదు. అచ్ఛా,
ఎవరైనా అలాంటి, ఇలాంటి మాట ఏదైనా అంటే, మీరు అది మర్చిపోండి. కల్పపూర్వము కూడా అలానే
అన్నారు. ఆ విషయాలను గుర్తు చేసుకుంటే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఆ విషయాన్ని
ఇంకెప్పుడూ ప్రస్తావించకండి కూడా.
పిల్లలైన మీరు సేవ అయితే చేయాలి కదా. సేవలో విఘ్నాలేమీ రాకూడదు. సేవలో బలహీనతలను
చూపించకూడదు. ఇది శివబాబా సేవ కదా. దానికి ఎప్పుడూ ‘నేను చేయను’ అని అనకూడదు, లేదంటే
తమ పదవినే భ్రష్టము చేసుకుంటారు. తండ్రికి సహాయకులుగా అయ్యారు కావున పూర్తిగా సహాయము
చేయాలి. తండ్రి సేవను చేయడములో కొద్దిగా కూడా మోసము చేయకూడదు. సందేశాన్ని అందరికీ
అందించాల్సిందే. తండ్రి ఏమని చెప్తూ ఉంటారంటే, మ్యూజియంలకు ఎటువంటి పేర్లు పెట్టండి
అంటే, దానిని చూసి మనుష్యులు లోపలికి రావాలి మరియు వచ్చి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే
ఇది కొత్త విషయము కదా. మనుష్యులు కొత్త విషయాన్ని చూసి లోపలికి వస్తారు. ఈ రోజుల్లో
భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని నేర్చుకునేందుకు విదేశాల నుండి వస్తూ ఉంటారు.
వాస్తవానికి ప్రాచీనము అనగా అన్నింటికన్నా పాతది అని అర్థము. దానిని భగవంతుడే
నేర్పించారు. అది నేర్పించి 5000 సంవత్సరాలవుతోంది. సత్య-త్రేతాయుగాలలో యోగము ఉండదు.
ఎవరైతే నేర్పించారో వారు వెళ్ళిపోయారు, మళ్ళీ వారు ఎప్పుడైతే 5000 సంవత్సరాల తర్వాత
వస్తారో అప్పుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ప్రాచీనము అనగా 5000 సంవత్సరాల
క్రితం భగవంతుడు నేర్పించారు. ఆ భగవంతుడే మళ్ళీ సంగమములో వచ్చి రాజయోగాన్ని
నేర్పిస్తారు, దాని ద్వారా పావనముగా అవ్వగలరు. ఈ సమయములోనైతే తత్వాలు కూడా
తమోప్రధానముగా ఉన్నాయి. నీరు కూడా ఎంతగా నష్టపరుస్తూ ఉంటుంది. పాత ప్రపంచములో
ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. సత్యయుగములో ఉపద్రవాలనే మాటే ఉండదు. అక్కడైతే ప్రకృతి
దాసిగా అవుతుంది. ఇక్కడ ప్రకృతి శత్రువుగా అయి దుఃఖమునిస్తుంది. ఈ లక్ష్మీ-నారాయణుల
రాజ్యములో దుఃఖము అన్న మాటే ఉండేది కాదు. సత్యయుగము ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది
మళ్ళీ స్థాపనవుతోంది. తండ్రి ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మళ్ళీ 5000
సంవత్సరాల తర్వాత నేర్పిస్తారు. ఎవరికైతే పాత్ర ఉంటుందో వారే అభినయిస్తారు. అనంతమైన
తండ్రి కూడా పాత్రను అభినయిస్తూ ఉన్నారు. తండ్రి అంటారు, నేను ఇతనిలోకి ప్రవేశించి,
స్థాపన చేసి వెళ్ళిపోతాను. హాహాకారాల తర్వాత మళ్ళీ జయజయ ధ్వనులు వినిపిస్తాయి. పాత
ప్రపంచము సమాప్తమైపోతుంది. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు పాత ప్రపంచము
ఉండేది కాదు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. లక్షల సంవత్సరాలు ఉండే అవకాశము లేదు.
తండ్రి అంటున్నారు, మీ కళ్యాణము చేసుకునేందుకు ఇతర విషయాలన్నింటినీ వదిలి ఈ సేవలో
నిమగ్నమైపోండి. అలిగి సేవలో మోసము చేయకూడదు. ఇది ఈశ్వరీయ సేవ. మాయ తుఫానులు ఎన్నో
వస్తాయి. కానీ తండ్రి యొక్క ఈశ్వరీయ సేవలో ఎప్పుడూ మోసము చేయకూడదు. తండ్రి సేవార్థము
డైరెక్షన్లు అయితే ఇస్తూ ఉంటారు. మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరు వచ్చినా, అందరికీ
సత్యమైన మిత్రులు అయితే మీరే. బ్రహ్మాకుమార, కుమారీలైన మీరైతే మొత్తం ప్రపంచమంతటికీ
మిత్రులు, ఎందుకంటే మీరు తండ్రికి సహాయకులు. మిత్రుల మధ్యన ఎటువంటి శత్రుత్వము
ఉండకూడదు. ఏదైనా విషయము వస్తే, శివబాబాను స్మృతి చేయండి అని చెప్పండి. తండ్రి
శ్రీమతముపై నడవడములో నిమగ్నమైపోవాలి. లేకపోతే తమను తామే నష్టపరచుకుంటారు. మీరు
ట్రైన్ లో వస్తారు, అక్కడైతే అందరూ ఖాళీగా ఉంటారు. సేవ చేయడానికి అది మంచి అవకాశము.
బ్యాడ్జీ అనేది చాలా మంచి వస్తువు. ప్రతి ఒక్కరూ దానిని ధరించాలి. ఎవరైనా మీరు ఎవరు
అని ప్రశ్నిస్తే, మీరు చెప్పండి - మేము ఫైర్ బ్రిగేడ్ వంటి వారము. ప్రపంచములో
అగ్నిని ఆర్పేందుకు ఆ ఫైర్ బ్రిగేడ్ (అగ్నిమాపకదళము) ఉంటుంది. ఈ సమయములో మొత్తం
ప్రపంచములో అందరూ కామాగ్నిలో దహించుకుపోయి ఉన్నారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు,
కామమనే మహాశత్రువుపై విజయాన్ని పొందండి. తండ్రిని స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి,
దైవీ గుణాలను ధారణ చేయండి, అప్పుడు నావ తీరానికి చేరుతుంది. ఈ బ్యాడ్జీలను శ్రీమతము
ఆధారముగానే తయారుచేసారు. బ్యాడ్జీపై సేవ చేసే పిల్లలు చాలా తక్కువమంది ఉన్నారు. బాబా
మురళీలలో ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రతి బ్రాహ్మణాత్మ వద్ద ఈ బ్యాడ్జీ ఉండాలి.
ఎవరైనా కలిస్తే వారికి బ్యాడ్జీపై ఇలా అర్థం చేయించాలి - వీరు మన తండ్రి, వీరిని
మనము స్మృతి చేయాలి, మేము సాకారుడి మహిమ చేయము, సర్వుల సద్గతిదాత ఒక్క నిరాకారుడైన
తండ్రి మాత్రమే, వారిని స్మృతి చేయాలి, స్మృతి బలము ద్వారానే మీ పాపాలు కట్ అవుతాయి,
అప్పుడు ఇక అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ ఆధారపడి ఉంటుంది, మీరు దుఃఖధామము నుండి
విముక్తులవుతారు, ఇక అప్పుడు మీరు విష్ణుపురిలోకి వచ్చేస్తారు. ఇది ఎంతటి శుభవార్త.
మీరు లిటరేచర్ ను కూడా వారికి ఇవ్వవచ్చు. మీరు ఇలా చెప్పండి - మీరు పేదవారైతే మేము
మీకు ఉచితముగా ఇవ్వగలము. షావుకారలైతే తప్పకుండా దీని ఖరీదు ఇవ్వవలసిందే, ఎందుకంటే
వీటిని ఎన్నో ముద్రించవలసి ఉంటుంది. ఈ లిటరేచర్ ఎటువంటిదంటే దీని ద్వారా మీరు
నిరుపేదల నుండి విశ్వానికి యజమానులుగా అయిపోతారు. అర్థం చేయించడమైతే జరుగుతూ ఉంటుంది.
ఏ ధర్మమువారికైనా మీరు చెప్పండి - వాస్తవానికి మీరు ఒక ఆత్మ, స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇప్పుడు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది, ఈ ప్రపంచము
ఇక మారనున్నది, శివబాబాను స్మృతి చేసినట్లయితే విష్ణుపురిలోకి వచ్చేస్తారు. మేము
మీకు కోట్లు, పదమాలు విలువ చేసే వస్తువును ఇస్తున్నాము అని చెప్పండి.
బ్యాడ్జీపై సేవ చేయాలి అని బాబా ఎంతగా అర్థం చేయించారు, కానీ బ్యాడ్జీని
పెట్టుకోరు, సిగ్గుపడతారు. బ్రాహ్మణీలు పార్టీలను తీసుకుని వచ్చేటప్పుడు లేక ఆఫీసులు
మొదలైన చోట్లకు ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఈ బ్యాడ్జీని తప్పకుండా ధరించి ఉండాలి.
ఎవరికైనా మీరు దీనిపై అర్థం చేయిస్తే వారు చాలా సంతోషిస్తారు. మీరు ఇలా చెప్పండి -
మేము ఒక్క తండ్రినే నమ్ముతాము, వారే అందరికీ సుఖ-శాంతులు ఇస్తారు, కావున వారినే
స్మృతి చేయండి, పతితాత్మలైతే వారి వద్దకు వెళ్ళలేరు, ఇప్పుడు ఈ పాత ప్రపంచము
మారుతోంది. ఈ విధంగా దారిలో సేవ చేస్తూ రావాలి. మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది.
బ్యాడ్జీ పెట్టుకుని సేవ చేయటము లేదంటే బహుశా సిగ్గుగా అనిపిస్తుందేమో అని బాబా
అనుకుంటారు. ఒకటేమో బ్యాడ్జీ, ఇంకొకటి - మెట్ల వరుస, త్రిమూర్తి, సృష్టిచక్రము మరియు
కల్పవృక్షము చిత్రాలు మీతోపాటు ఉండాలి. పరస్పరమూ కూర్చుని మీకు మీరే ఒకరికొకరు అర్థం
చేయించుకుంటూ ఉండాలి, అప్పుడు అది విని అందరూ గుమికూడతారు. ఇదేమిటి అని అడుగుతారు.
మీరు చెప్పండి - శివబాబా వీరి ద్వారా ఈ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు,
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి,
అపవిత్రులైతే తిరిగి వెళ్ళలేరు. ఈ విధముగా మధురాతి మధురమైన విషయాలను వారికి
వినిపించాలి. అప్పుడు సంతోషముగా అందరూ వింటారు. కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోవడం
లేదు. సెంటర్ కు క్లాస్ కు వెళ్ళినప్పుడు కూడా బ్యాడ్జీ పెట్టుకోవాలి. మిలట్రీవారు
ఎప్పుడూ వారి బ్యాడ్జీ పెట్టుకుని ఉంటారు. వారికెప్పుడైనా సిగ్గుగా అనిపిస్తుందా.
మీరు కూడా ఆత్మిక మిలట్రీయే కదా. తండ్రి డైరెక్షన్ ఇస్తున్నారు, మరి దానిని మీరు
అమలులోకి ఎందుకు తీసుకురారు. బ్యాడ్జీ పెట్టుకుని ఉంటే - మేము శివబాబా పిల్లలము అని
శివబాబా స్మృతి కూడా ఉంటుంది. రోజురోజుకు సెంటర్లు కూడా తెరవబడతూ ఉంటాయి. ఎవరో ఒకరు
వెలువడుతూ ఉంటారు. ఫలానా ఊరిలో మీ బ్రాంచ్ లేదు అని అంటారు. మీరు చెప్పండి - ఎవరైనా
ఇల్లు మొదలైన ఏర్పాట్లు చేస్తే, ఆహ్వానము ఇస్తే మేము వచ్చి సేవ చేయగలము. ధైర్యము
చేసే పిల్లలకు తండ్రి సహాయము చేస్తారు. తండ్రి అయితే పిల్లలకే చెప్తారు - సెంటర్లు
తెరవండి, సేవ చేయండి. ఇవన్నీ శివబాబా దుకాణాలే కదా. పిల్లల ద్వారా నడిపిస్తున్నారు.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎప్పుడూ పరస్పరం అలిగి సేవలో మోసము చేయకూడదు. విఘ్నరూపులుగా అవ్వకూడదు. తమ
బలహీనతలను చూపించకూడదు. తండ్రికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి.
2. ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ జరిగితే, అది గతించిపోతే, ఇక దాని గురించి చింతన
చేయకూడదు. ఎవరైనా అలాంటి, ఇలాంటి మాట ఏదైనా అంటే, మీరు అది మర్చిపోండి. కల్పపూర్వము
కూడా ఇలాగే అన్నారు. ఆ విషయాన్ని ఇక మళ్ళీ ఎప్పుడూ ప్రస్తావించకండి కూడా.
వరదానము:-
శాంతిదూతలుగా అయ్యి సర్వులకు శాంతి సందేశాన్ని ఇచ్చే మాస్టర్
శాంతి, శక్తి దాతా భవ
పిల్లలైన మీరు శాంతి సందేశకులు, శాంతిదూతలు. ఎక్కడున్నా
కానీ సదా స్వయాన్ని శాంతిదూతలుగా భావిస్తూ నడుచుకోండి. మీరు శాంతిదూతలు, శాంతి
సందేశాన్ని ఇచ్చేవారు, దీని వలన స్వయం కూడా శాంతి స్వరూపులుగా, శక్తిశాలిగా ఉంటారు
మరియు ఇతరులకు కూడా శాంతిని ఇస్తూ ఉంటారు. వారు అశాంతిని ఇస్తారు, మీరు శాంతిని
ఇవ్వండి. వారు నిప్పు అంటిస్తారు, మీరు నీరు పోయండి. ఇదే శాంతి సందేశకులు, మాస్టర్
శాంతి, శక్తి దాత పిల్లలైన మీ కర్తవ్యము.
స్లోగన్:-
ఏ
విధంగా శబ్దములోకి రావటము సహజమనిపిస్తుందో, అదే విధంగా శబ్దము నుండి అతీతముగా
వెళ్ళటము కూడా సహజమవ్వాలి.
అవ్యక్త ప్రేరణలు:-
ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి
యోగములో సదా లైట్
హౌస్మరియు మైట్ హౌస్ స్థితిని అనుభవం చేయండి. జ్ఞానము లైట్మరియు యోగము మైట్.
జ్ఞానము మరియు యోగము అనే రెండు శక్తులు ఉండాలి, లైట్మరియు మైట్సంపన్నముగా ఉండాలి
- వారినే మాస్టర్సర్వశక్తివంతులు అని అంటారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు ఎటువంటి
పరిస్థితినైనా క్షణములో దాటివేస్తారు.
| | |