‘‘సేవలతోపాటు ఒకరికొకరు సహయోగులుగా అయ్యి
వాయుమండలములో తీవ్ర పురుషార్థము యొక్క అలను వ్యాపింపజేయండి,
మనసును జయించేవారిగా అయ్యి ఆత్మలకు మనసా సేవను చేయండి’’
ఈ రోజు విశేషముగా స్నేహము యొక్క రోజు. నలువైపులా ఉన్న
పిల్లలు స్నేహ స్వరూపముతో మిలనము జరుపుకుంటున్నారు. మీరందరూ
కూడా స్నేహ స్వరూపములో మగ్నమై ఉన్నారు. ఈ రోజు అమృతవేళ నుండి
నలువైపులా ఉన్న పిల్లలు అమృతవేళ కన్నా ముందే హృదయపూర్వకమైన
స్నేహముతో కూడిన ముత్యాల మాలలను తీసుకుని చేరుకున్నారు. అనేక
రకాల భిన్న-భిన్న మనోభావాలను బాబా ఎదురుగా వర్ణిస్తూ ఉన్నారు.
పిల్లల స్నేహము ఎంత ప్రియమైనదో మీకు తెలుసు కదా. భిన్న-భిన్న
భాషలలో, భిన్న-భిన్న భావాలతో బాప్ దాదా ఎదుట తమ మనసులోని మాటలను
చెప్తున్నారు కూడా మరియు నయనాల ద్వారా, నోటి ద్వారా తమ భావాలను
కూడా స్పష్టము చేస్తున్నారు. బాప్ దాదా నలువైపులా ఉన్న
పిల్లల్లోని స్నేహ భావాలను చూసి అందరి స్నేహములో నిమగ్నమైపోయారు
మరియు హృదయము నుండి ఇవే మాటలు వెలువడుతున్నాయి - వాహ్ పిల్లలూ
వాహ్! అలాగే పిల్లల నోటి నుండి వాహ్ బాబా వాహ్! అన్న పాట
వినిపిస్తూ ఉంది. బాప్ దాదా ప్రతి బిడ్డను చూస్తూ పిల్లల
ప్రేమలో లీనమై ఉన్నారు మరియు పిల్లలు బాబా ప్రేమలో లీనమై
ఉన్నారు.
ఈ రోజున బాబా తన పిల్లలను బాలక్ సో మాలిక్ గా తయారుచేసే
దృష్టితో చూస్తున్నారు. ఈ రోజు పిల్లలకు రాజ్య తిలకాన్ని దిద్దే
రోజు. ఈ రోజున బాప్ దాదా స్వయంగా ఫరిశ్తా రూపములో ఉంటూ పిల్లలను
విశ్వ సేవార్థము నిమిత్తం చేసిన రోజు. స్వయం వెన్నుముకగా
అయ్యారు, పిల్లలను విశ్వమనే స్టేజిపై ప్రత్యక్షము చేసారు మరియు
బాప్ దాదా ఇప్పుడు పిల్లల సేవను చూసి, ఏ బాధ్యతనైతే ఇచ్చారో,
దాని రిజల్టును చూసి పిల్లలపై చాలా చాలా సంతోషముగా ఉన్నారు
మరియు హృదయపూర్వకముగా అభినందనలను తెలియజేస్తున్నారు. అభినందనలు,
అభినందనలు.
బాప్ దాదా ఏమి చూసారంటే - ఇప్పటివరకు కూడా బాబా ద్వారా
ఇవ్వబడిన విశ్వ సేవాధారి అన్న వరదానము అనుసారముగా ప్రతి బిడ్డ
అతి స్నేహముతో మరియు హృదయపూర్వకముగా సేవ చేసారు మరియు
చేస్తున్నారు కూడా. రిజల్టును కూడా బాప్ దాదా చూసారు, ప్రతి
బిడ్డ హృదయములో ‘‘నా బాబా’’ అన్న తపన ఉంది మరియు బాబా హృదయములో
‘‘వాహ్ నా పిల్లలు’’ అని పిల్లలపై స్నేహము ఉంది. ఇప్పుడు అతి
త్వరగా నలువైపులా బాబాను ప్రత్యక్షము చెయ్యవలసిందే అని వర్తమాన
సమయములో మెజారిటీ చిన్న-పెద్ద సెంటరు నివాసీ పిల్లల్లో ఉత్సాహము
ఉంది. బాబా అంతా తిరిగినప్పుడు పిల్లలలోని ఈ ఉల్లాసాన్ని,
ఉత్సాహాన్ని చూసారు, చిన్న-పెద్ద సేవాకేంద్రాలలోని పిల్లలకు
సేవా ఉల్లాసము చాలా చాలా చాలా మంచిగా ఉంది మరియు మున్ముందు కూడా
మంచిగా ఉంటుంది. కావున బాప్ దాదా స్నేహ దివసమైన ఈ రోజున
నలువైపులా ఉన్న దేశ-విదేశాలలోని పిల్లలందరికీ తమ దృష్టితో,
హృదయముతో స్నేహము మరియు సేవకు రిటర్నులో హృదయపూర్వక స్నేహాన్ని,
ప్రియస్మృతులను పదమాల రెట్లుగా ఇస్తున్నారు.
ఇప్పుడు సమయమనుసారముగా బాబాను ప్రత్యక్షము చెయ్యాలి అన్న
ఉత్సాహము ఏదైతే ఉందో, అది నెమ్మది-నెమ్మదిగా ఇతర ఆత్మల హృదయములో
కూడా రావడము ప్రారంభమైంది. బ్రహ్మాకుమారీలు ఏదో పొందారు అని
భావిస్తున్నారు. వారి భావనలో పరివర్తన వచ్చింది. ‘‘ఏమో ఏమి
చేస్తున్నారో తెలియదు’’ అనే భావన ఏదైతే ఇంతకుముందు ఉండేదో, దాని
నుండి ‘‘మంచి కార్యము చేస్తున్నారు’’ అన్నంతవరకు ఇప్పుడు
వచ్చారు. మేము చెయ్యలేనిది వీరు తమ సంగఠనలో ఉంటూ సఫలతను పొంది
చూపించారు అని అనుకునేంత పరివర్తన వచ్చింది. అందుకే ఈ రోజు బాప్
దాదా ఎదురుగా కూర్చుని ఉన్న పిల్లలకు మరియు నలువైపులా ఏ
పిల్లలైతే వింటున్నారో, చూస్తున్నారో, ఆ పిల్లలందరికీ
హృదయపూర్వక స్నేహాన్ని మరియు హృదయపూర్వక ప్రేమను విశేషముగా
అందిస్తున్నారు. ఇప్పుడు మున్ముందు ఏమి చేయాలి? సేవ కోసం
అభినందనలనైతే బాప్ దాదా ఇచ్చారు. ఇప్పుడు బాప్ దాదా ఏమి
ఆశిస్తున్నారంటే, ఇప్పుడు ప్రతి బిడ్డ - ఇప్పుడు బాబా సమానముగా
ఫరిశ్తాగా అవ్వాల్సిందే అన్న ఉల్లాస-ఉత్సాహాలను ఉంచి, దృఢ
నిశ్చయము, తీవ్ర పురుషార్థము చెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ
బాబాతోపాటు రిటర్న్ జర్నీ చెయ్యవలసిందే, ఫరిశ్తా సమానముగా
అవ్వవలసిందే ఎందుకంటే అందరూ చేసిన ప్రతిజ్ఞ ఏమిటంటే - కలిసి
వెళ్తాము, కలిసి రాజ్యము చేస్తాము. మరి బ్రహ్మాబాబా కూడా
ఫరిశ్తాగా అయ్యారు, మరి మీరు కలిసి ఎలా వెళ్ళగలరు? బ్రహ్మాబాబా
జీవిస్తూనే ఫరిశ్తా స్వరూపాన్ని చూపించారు. ఎంత బాధ్యత ఉండేది!
అందరినీ యోగ్యులుగా చెయ్యవలసిందే కానీ ఇంతటి బాధ్యత ఉన్నప్పటికీ
ఎంత అతీతముగా మరియు ప్రియముగా ఉండేవారో మీరందరూ చూసారు. సదా
నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు, చింత ఉండేది కాదు, నిశ్చింత
చక్రవర్తి. అదే విధముగా పిల్లలైన మీరు కూడా ఇప్పుడు బాబా
సమానముగా నిశ్చింత చక్రవర్తులుగా, ఫరిశ్తాగా అవ్వవలసిందే.
అవ్వవలసిందే అన్న దృఢ సంకల్పము ఉందా లేక అవుతాములే అని
అనుకుంటున్నారా!
ఇప్పుడు బాప్ దాదా ఏమి చూసారంటే - ఇప్పుడు సమయమనుసారముగా
ఎంతైతే సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు ప్రాక్టికల్ గా ఉన్నాయో,
అంతగానే ఇప్పుడు తీవ్ర పురుషార్థులుగా అవ్వడము మరియు
తయారుచెయ్యడము, సంపన్నముగా అవ్వడము మరియు తయారుచెయ్యడము, ఈ
పాయింటు ఆధారముగా కూడా ఇప్పుడు స్వయమూ ఉల్లాస-ఉత్సాహాలలో ఉండండి
మరియు వాయుమండలములోనూ ఉల్లాస-ఉత్సాహాలను నింపండి. ఒకరికొకరు
సహయోగులుగా అయ్యి ఇప్పుడు వాయుమండలములో తీవ్ర పురుషార్థము
యొక్క అలను వ్యాపింపజేయండి. ఎలా అయితే ఒకరికొకరు పరస్పరములో
సేవా ఉత్సాహాన్ని వాయుమండలములో వ్యాపింపజేసారో, అలాగే ఇప్పుడు
బాప్ దాదా పిల్లల పట్ల ఇదే శుభమైన ఆశను పెట్టుకుంటున్నారు -
తీవ్ర పురుషార్థము యొక్క అలను వాయుమండలములో వ్యాపింపజేయాలి.
బాప్ దాదా సంతోషిస్తున్నారు కానీ ఇప్పటికీ పురుషార్థము ఉంది,
కానీ తీవ్ర పురుషార్థము చేయాలి. ఇప్పుడు ప్రతి బిడ్డ పట్ల బాప్
దాదాకు ఇదే ఆశ ఉంది - ప్రతి బిడ్డ బాప్ దాదా యొక్క ఆశా సితారగా
ఉండాలి. అటువంటి సితారలే కదా? మేము బాబా ఆశల సితారలుగా అయ్యి
ఉల్లాస-ఉత్సాహాలను వాయుమండలములో వ్యాపింపజేస్తాము అని ఎవరైతే
భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. అచ్ఛా! చేతులైతే చాలా బాగా
ఎత్తుతున్నారు. బాప్ దాదా చేతులను చూసి సంతోషిస్తున్నారు.
మెజారిటీ చేతులెత్తారు. వెనుకవారి చేతులు కనిపించటం లేదు కానీ
ముందువారిది కనిపిస్తుంది. ఇప్పుడు వెనుకవారు కూడా
ఎత్తుతున్నారు. అభినందనలు, అభినందనలు. అచ్ఛా!
బాప్ దాదా ఏమి చూసారంటే విశేషముగా మనసులో ఏదైనా విషయము పట్ల
ఉల్లాస-ఉత్సాహాలు ఉంటే ఆ కార్యము సాకార రూపములో మంచిగా అవుతుంది.
అందుకే బాప్ దాదా ఈ సారి ఈ స్నేహ దివసము సందర్భముగా ఈ హోమ్
వర్కును ఇస్తున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరూ మనసు కారణముగా
ఏవైతే సంకల్పాలు మరియు సమయము వ్యర్థముగా పోతుందో, దానిని
సమాప్తము చేయండి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా వ్యర్థ సంకల్పము వస్తే,
అందులో ఎంత సమయము వృధా అవుతుందో, ఎంత శక్తి వృధా అవుతుందో, అది
అందరికీ అనుభవమవుతుంది. కావున బాప్ దాదా ఏ హోమ్ వర్కును
ఇవ్వాలనుకుంటున్నారంటే - ప్రతి బిడ్డ ఈ రెండు నెలలు మనసులోని
వ్యర్థ సంకల్పాలను మరియు వ్యర్థ సమయాన్ని పొదుపు చేసేందుకు
స్వయం కోసం ఒక విధిని తయారుచేసుకోండి. ఈ రెండు నెలలు ప్రతి
ఒక్కరూ తమ చార్టును పెట్టుకోండి - వ్యర్థ సమయాన్ని, వ్యర్థ
సంకల్పాలను ఎంత కంట్రోల్ చేసుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు
సమయమనుసారముగా మీరందరూ మనసా శక్తి ద్వారా ఆత్మలకు మనసా సేవ చేసే
సమయమిది. దీని కోసం సదా మనసు పట్ల అటెన్షన్ పెట్టడము అవసరము.
మనసును జయించినవారు జగత్తును జయిస్తారు అని కూడా చెప్పబడి ఉంది.
కనుక మన్మనాభవ వాయుమండలములో మనసులోని వ్యర్థాన్ని సమాప్తము
చేయాలి. చెయ్యగలరా? చేస్తారా? వారు చేతులెత్తండి. బాప్ దాదా
బహుమతిని ఇస్తారు. మీ రిజల్టును మీరే చూసుకోండి. మనసు సంతోషముగా
ఉంటే మనసులోని సంతోషాన్ని పంచగలరు. ఈ పురుషార్థములో అందరూ ముందు
నంబరు తీసుకునే అటెన్షన్ పెట్టండి. సంకల్పాలు మరియు సమయము, ఈ
రెండింటి నుండి వ్యర్థము సమాప్తము మరియు సమర్థ సంకల్పాలు,
సమర్థ సమయము రాబోయే సమయములో వాయుమండలములో వ్యాపిస్తాయి.
బాప్ దాదా ఒక విషయములో పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. అది
ఏ విషయము? ప్రతి బిడ్డ సేవనైతే చేసారు కానీ దానితోపాటు ‘డబుల్
రాజు’గా అవ్వండి అని బాప్ దాదా ఏదైతే సూచనను ఇచ్చారో, దాని
గురించి తెలుసు కదా! ఒకటి స్వరాజ్య అధికారి, రెండు భవిష్య
రాజ్య అధికారి. మీరు స్వరాజ్య అధికారి. తన ప్రతి బిడ్డ
స్వరాజ్య అధికారిగా అయిన తండ్రి బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న
నషా బాబాకు ఉంది. మీరందరూ స్వరాజ్య అధికారులు కదా! స్వ పై ఆత్మ
రాజ్యము చేస్తుంది. కర్మేంద్రియాలకు వశమవ్వదు, రాజ్య అధికారి.
ప్రతి బిడ్డ స్వరాజ్య అధికారిగా సదా ఉండాలి, అప్పుడప్పుడూ కాదు
అన్నదే బాబా కోరుకుంటున్నారు. అలా అవ్వగలరా? మీకిచ్చిన ఈ రెండు
నెలలలో స్వరాజ్య అధికారిగా ఉన్నారా? లేక కర్మేంద్రియాలకు
వశమయ్యారా? అన్న విషయాన్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు
కర్మాతీతముగా అవ్వాలి, సమయము సమీపముగా వస్తూ ఉంది. మరి ఏమి
చేయాలి? నడుస్తూ-తిరుగుతూ స్వరాజ్య అధికారులుగా అవ్వవలసిందే. ఈ
సంస్కారాలు బ్రాహ్మణ పిల్లలైన మీవే. డబల్ రాజ్యము, స్వరాజ్యము
మరియు భవిష్యత్తులో విశ్వ రాజ్యము. బాప్ దాదా అంతటా తిరుగుతూ
పిల్లల రిజల్టును నోట్ చేసుకుంటూ ఉంటారు. కావున సదా స్వరాజ్య
అధికారి అన్న విషయము పట్ల ఇప్పుడు అటెన్షన్ అవసరము. బాప్ దాదా
రెండు కార్యాలను చెయ్యమని ఇచ్చారు. ఒకటి, ఈ రెండు నెలలు
స్వరాజ్య అధికారిగా ఎంతవరకు ఉంటారు? ఈ రిజల్టును చూసుకోవాలి
మరియు దానితోపాటు మనసు యొక్క కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్
ద్వారా వ్యర్థాన్ని సమాప్తము చేయాలి. ఇందులో ఎవరైతే నంబరు
తీసుకుంటారో, వారికి బాప్ దాదా బహుమతిని ఇస్తారు. ఇష్టమేనా?
చేయాలి కదా! చేస్తారా? చేస్తారు కదా! తల ఊపండి. అచ్ఛా!
బాప్ దాదా ఈ రోజు పిల్లలందరి స్నేహము ఏదైతే ఉందో, దానిని
స్వీకరించారు. అమృతవేళలో అయితే వతనములో కూడా చాలామంది పిల్లల
సందడి ఉంది. అడ్వాన్స్ పార్టీవారు కూడా వతనములో ఈ రోజు తమ
హృదయపూర్వక స్నేహాన్ని అందించడానికి, తీసుకోవడానికి వచ్చారు.
ఇప్పుడు వారు బాబాను అడుగుతున్నారు - చివరికి మా ఈ పాత్ర ఇంకా
ఎంత కాలం? వారికి ఏమని జవాబు ఇవ్వమంటారు? ఏమని జవాబు ఇవ్వాలో
మొదటి లైనువారు చెప్పండి. ఏమన్నారు? (మేము రెడీగా ఉన్నాము అని
జానకి దాదీ అన్నారు) మీరు ఒంటరిగానే వెళ్ళిపోతారా? (అందరమూ
వెళ్తాము) మీకు అందరిపై ప్రేమ ఉంది కదా, అలా వదిలేసి రాజ్యము
ఎలా చేస్తారు. (అడ్వాన్స్ పార్టీవారు మమ్మల్ని విడిచి ఎందుకు
వెళ్ళిపోయారు). వారి పాత్ర అలా ఉంది కదా. వారు వెళ్ళవలసిందే.
ఇప్పుడు త్వరత్వరగా సంగఠనను తయారుచేయడానికి మీరు ప్రయత్నము
చేయండి. రెండు నెలల హోమ్ వర్కు ఏదైతే ఇచ్చామో, ఒకవేళ మీరు ఇది
అందరితో చేయించగలిగితే, రిజల్టు వస్తే త్వరగా అయిపోతుంది. (బాబా
స్నేహములో చేసేస్తాము) స్నేహమైతే ఉంది. స్నేహములో అందరూ పాస్
అయ్యారు. అందరికీ స్నేహము ఉండటాన్ని బాప్ దాదా కూడా చూసారు కానీ
స్నేహముతో పాటు శక్తి కూడా కావాలి. దాని కోసం అమృతవేళను
శక్తిశాలిగా చేసుకోండి. కూర్చుంటున్నారు. కూర్చుంటున్నందుకు
బాప్ దాదా అభినందనలు తెలియజేస్తున్నారు కానీ కూర్చున్న
వాయుమండలము శక్తిశాలిగా ఉండాలి. ఒకరు ఒకలా కూర్చుంటారు, ఇంకొకరు
ఇంకోలా కూర్చుంటారు. ఒకవేళ మీరు ఫోటో తీస్తే ఇంకేదో ఉండాలి అని
మీకే అనిపిస్తుంది. బాప్ దాదా ఏదైతే జ్వాలాముఖి యోగము కోసం
చెప్పారో, ఇప్పుడు దాని పట్ల మరింత అటెన్షన్ ఇవ్వండి.
పురుషార్థము అందరూ చేస్తారు కానీ పురుషార్థము అనే పదము ముందు
‘తీవ్ర’ అనే పదాన్ని జోడించండి. ఇప్పుడు బాప్ దాదా ప్రతి
బిడ్డకు ఈ రెండు నెలల సమయాన్ని ఇచ్చారు. ఇందులో ఎంత అటెన్షన్
ను పెడితే, అంత అటెన్షన్ తో పాటు బాప్ దాదా కూడా ఎక్స్ ట్రా
సహయోగాన్ని అందిస్తారు. మనసుకు యజమానులు మీరు, మీ పాదాలను,
చేతులను సునాయాసముగా నడిపించగలిగినంతగా మీ మనసును నడిపించండి.
మీరు ఏది కావాలంటే అది చేస్తారు కదా. దీనిని ఇక్కడ కాకుండా
అక్కడ పెట్టాలి అని అనుకుంటే పెట్టగలరు కదా! అలాగే మైండ్
కంట్రోల్, ఏది అవసరమో మనసు అదే సంకల్పము చేయాలి. రోజూ రాత్రి
రిజల్టును చూసుకోండి. ఈ రోజు మనసు యొక్క రూలింగ్ పవర్,
కంట్రోలింగ్ పవర్ ఎంత ఉంది? ఇప్పుడు వ్యర్థాన్ని త్వరత్వరగా
సమాప్తము చేయాలి, ఇప్పుడు సమర్థులుగా అయ్యి వాయుమండలములో సమర్థ
శక్తిని వ్యాపింపజేయండి. బాప్ దాదా అయితే పిల్లల దుఃఖాన్ని,
బాధను, మొరను విని పిల్లల ద్వారా ఇప్పుడు త్వరగా సమాప్తిని
చేయించాలని కోరుకుంటున్నారు. వినిపించాము కదా, పురుషార్థము
అందరూ చేస్తున్నారు కానీ ఇప్పుడు దానికి ‘తీవ్రత’ను కలపండి.
చెయ్యవలసిందే. చేస్తాములే, చూద్దాములే... ఈ లే, లే అన్నది
ఇప్పుడు నడవదు.
స్నేహ దృశ్యాన్ని కూడా ఈ రోజు చూసాము. ప్రతి ఒక్కరి మనసులో
ఎంత ప్రేమ ఉంది కానీ ఎంతైతే ప్రేమ ఉందో, దానితోపాటు అంతే శక్తి
కూడా కావాలి. ఇప్పుడు శక్తిని నింపుకోండి. ఎప్పుడూ ఏ సోదరి కూడా
తమను తాము కేవలం శక్తిగా కాకుండా శివశక్తిగా భావించండి.
శివశక్తి, బాబా తోడుగా ఉన్నారు. పాండవులతో పాండవపతి తోడుగా
ఉన్నారు. మరి ఇప్పుడు ఏమి చేస్తారు? బాప్ దాదా చెప్పినట్లుగా
ఇప్పుడు పురుషార్థము అన్న పదం ముందు తీవ్ర అని పెట్టండి.
వాయుమండలాన్ని తయారుచేయండి. ఒకరికొకరు సహయోగులుగా అయ్యి, ప్రతి
ఒక్కరూ ఏయే స్థానాలలోనైతే ఉంటారో ఆ స్థానాన్ని శక్తిశాలిగా
చేయండి, మీ తోటివారిని శక్తిశాలిగా చేయండి. మరి ఇప్పుడు ఏం
చేస్తారు? నవీనత చేస్తారు కదా! ‘నా బాబా’ అని అంటున్నప్పుడు
‘నా’ సమానముగా అవ్వాలి కదా. ప్రతి ఒక్కరూ మీ మనసులో దృఢ
సంకల్పము చేయండి. సంకల్పాలు మంచి-మంచిగా చేస్తారు. ఇది చేస్తాము,
అది చేస్తాము, ఇది చేస్తాము అంటూ అమృతవేళలో ఎంతో మంచి
సంకల్పాలను చేయడాన్ని బాప్ దాదా చూస్తారు, కానీ కర్మయోగిగా
అయినప్పుడు, సంబంధ-సంపర్కాలలోకి వచ్చినప్పుడు అక్కడ తేడా
కనిపిస్తుంది. కర్మయోగీ స్థితిలో అటెన్షన్ ఎక్కువ అవసరము. అచ్ఛా!
అందరూ సంతోషముగా ఉన్నారు కదా! సంతోషముగా ఉన్నారా? చూడండి,
కొత్తకొత్తవారు కూడా ఎంతమంది వస్తున్నారో! కొత్తవారు,
మొదటిసారిగా వచ్చినవారు చేతులెత్తండి. చూడండి, ఎంతమంది ఉన్నారో!
సగం క్లాసు కొత్తవారే. వచ్చిన కొత్తవారిని చూసి బాప్ దాదా
సంతోషిస్తున్నారు ఎందుకంటే అంతిమ సమాప్తి సమయము కన్నా ముందుగానే
వచ్చి చేరుకున్నారు. కానీ ఎంత లేట్ గా వచ్చారో అంతే తీవ్ర
పురుషార్థము చెయ్యవలసి ఉంటుంది ఎందుకంటే ఈ కొద్ది సమయములోనే
మీరు పూర్తి 21 జన్మల కొరకు మీ భవిష్యత్తును తయారుచేసుకోవాలి.
అంతటి అటెన్షన్ ను పెట్టవలసి ఉంటుంది. సమయాన్ని పొదుపు చేయండి,
ఒక్క క్షణము కూడా వ్యర్థముగా పోకూడదు. తీవ్ర పురుషార్థీగా
ఉండండి. సాధారణ పురుషార్థముతో చేరుకోవడము కష్టము. అయినప్పటికీ
వచ్చిన కొత్త పిల్లలకు బాప్ దాదా హృదయపూర్వక అభినందనలను
తెలియజేస్తున్నారు. అచ్ఛా!