11-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ప్రపంచములో ఇంకెవ్వరికీ భయపడకపోయినా కానీ ఈ తండ్రి అంటే తప్పకుండా భయపడండి, భయపడటము అనగా పాప కర్మల నుండి రక్షింపబడటము’’

ప్రశ్న:-
బాబా ప్రతి బిడ్డకి స్వయాన్ని చెక్ చేసుకునే (చార్టు పెట్టుకునే) శ్రీమతాన్ని ఎందుకు ఇస్తారు?

జవాబు:-
ఎందుకంటే ఈశ్వరీయ నియమాలు చాలా కఠినమైనవి. ఒకవేళ బ్రాహ్మణులుగా అయిన తర్వాత చిన్న-చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నట్లయితే చాలా కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, అందుకే బాబా అంటారు, స్వయాన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏవైనా పాత లెక్కాచారాలు మిగిలిపోయి ఉంటే, శిక్షలు అనుభవించి చిన్న పదవిని పొందాల్సి ఉంటుంది. ఇప్పుడు వినాశన సమయము చాలా సమీపముగా ఉంది, అందుకే తమ లెక్కాచారాలన్నింటినీ యోగబలముతో సమాప్తము చేసుకోండి.

ఓంశాంతి
తండ్రి స్మృతిలోనైతే పిల్లలు తమంతట తామే ఉంటారు. పదే-పదే చెప్పవలసిన అవసరము కూడా ఉండదు. తండ్రి డైరెక్షన్ ఏమిటంటే - నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చుంటూ తండ్రిని స్మృతి చేసినట్లయితే, ఏ రావణుడైతే మిమ్మల్ని పతితముగా తయారుచేసాడో, అతనిపై విజయాన్ని పొందుతారు. దీని కోసం మీకు ఆయుధాలు మొదలైనవేవీ ఇవ్వరు, కేవలం యోగబలముతో మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు. తప్పకుండా విజయము పొందాలి, అది కూడా సంగమములోనే పొందుతారు, రావణ రాజ్యము సమాప్తమై రామ రాజ్య స్థాపన జరగనున్నప్పుడు పొందుతారు. తండ్రి హింసనైతే ఎప్పుడూ నేర్పించలేరు. దేవతలది అహింసా పరమోధర్మము. అక్కడ కామ ఖడ్గము యొక్క హింస ఉండదని ప్రపంచానికి తెలియదు. ఎవరైతే కల్పక్రితం నిర్వికారులుగా అయ్యి ఉంటారో, వారే మీ మాటలను అంగీకరిస్తారు. ఇప్పుడు మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. శివ శక్తి సైన్యము అని అంటూ ఉంటారు కూడా. మీరు గుప్త యోధులు, ప్రతి ఒక్కరూ స్వయం కోసమే చేసుకుంటున్నారు. మాయాజీతులుగా, జగత్ జీతులుగా అవ్వాలి. మీరు మీ కోసమే చేసుకుంటారు, అనగా మీ భారత్ దేశము కోసం చేస్తారు. ఇందులో ఎవరైతే మంచి రీతిలో పురుషార్థము చేస్తారో, వారు పొందుతారు. ఎవరైతే 5 వికారాలపై విజయము పొందుతారో, వారే జగత్ జీతులుగా అవుతారు. ఇంక దేనిపైనా విజయము పొందాల్సిన అవసరము లేదు. మీరు రావణ రాజ్యముపై విజయాన్ని పొందాలి అనగా దైవీ గుణాలను ధారణ చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయకుండా సత్యయుగములోకి వెళ్ళలేరు. కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి - నేను ఎంతవరకు దైవీ గుణాలను ధారణ చేసాను. దైవీ గుణాలను ధారణ చేయడము అనగా రావణుడిపై విజయాన్ని పొందడము. రామ రాజ్యము ఉండేది అని అంటారు అంటే ఒక్క రాముడు మాత్రమే రాజ్యము చేసి ఉండరు కదా? ప్రజలు కూడా ఉంటారు. ఇక్కడ రాజు, రాణి మరియు ప్రజలు, అందరూ రావణుడిపై విజయము పొందుతున్నారు. దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. దైవీ గుణాలలో ఆహార-పానీయాలు, మాట్లాడడము, చేయడము అన్నీ శుద్ధముగా, పవిత్రముగా ఉంటాయి. ప్రతి విషయములోనూ సత్యము చెప్పాలి. తండ్రి ఉన్నదే సత్యమైనవారు. మరి ఇటువంటి తండ్రితో ఎంత సత్యముగా ఉండాలి. ఒకవేళ సత్యముగా ఉండకపోతే ఎంత దుర్గతి ఏర్పడుతుంది. గతి అయితే ఉన్నతమైనది పొందాలి. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వాలి. మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము మీకే తెలుసు అని అంటారు కూడా. తండ్రి ఏ మతాన్ని అయితే ఇస్తారో, దాని ద్వారా ఎంత ఉన్నతమైన గతి ఏర్పడుతుంది. ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతోన్నతమైన గతిని ప్రాప్తింపజేస్తారు. కనుక ఇప్పుడు శ్రీమతముపై నడుస్తూ దైవీ గుణాలను ధారణ చేయాలి. జన్మజన్మల పాపాలు యోగబలము లేకుండా కట్ అవ్వవు, దాని కోసం స్మృతియాత్ర చాలా బాగుండాలి. స్మృతి అనేది అమృతవేళ బాగుంటుంది. ఆ సమయములో వాయుమండలము బాగుంటుంది. పగటి పూట ఎంత సమయము కూర్చున్నా సరే, అమృతవేళ వంటి సమయము ఉండదు. మన విషయాలు గుప్తమైనవి. ఇంగ్లీషులో - ‘‘వి యార్ ఎట్ వార్’’ (మేము యుద్ధములో ఉన్నాము) అని అంటారు. మన యుద్ధము రావణుడితో జరుగుతుంది. అతడు నంబర్ వన్ శత్రువు. రామ సాంప్రదాయము వారు శ్రీమతము ఆధారముగా రావణ సాంప్రదాయము వారిపై విజయాన్ని పొందారు. తండ్రి సర్వశక్తివంతుడు కదా. ప్రపంచమైతే ఈ సమయములో పాపం ఘోర అంధకారములో ఉంది. మేము ఓడిపోయాము అని వారికి అసలు తెలియనే తెలియదు. మాయతో ఓడిపోతే ఓడిపోయినట్లే, మాయ అని దేనినంటారు - ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మొత్తం లంక అంతటిపై రావణుని రాజ్యముండేది. శాస్త్రాలలో భక్తి మార్గానికి సంబంధించి ఎన్ని కల్పిత కథలు వ్రాసేసారు. వాటిని జన్మజన్మలుగా చదివారు. శాస్త్రాలనైతే తప్పకుండా చదవాలని ఇప్పటికీ అంటూ ఉంటారు. వారు అంటారు - ఎవరైతే శాస్త్రాలను చదవరో, వారు నాస్తికులు అని మరియు తండ్రి అంటారు - మీరవన్నీ చదువుతూ-చదువుతూ నాస్తికులుగా అయిపోయారు అని. ఈ విషయాలను పిల్లలు బాగా అర్థం చేయించాలి - భారత్ సతోప్రధానముగా ఉన్నప్పుడు దానిని స్వర్గము అని అనేవారు. ఆ భారతవాసులే 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు పతితముగా, తమోప్రధానముగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనముగా ఎలా అవ్వాలి. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా, పావనముగా అవుతారు, ఇంకే దేహధారులను స్మృతి చేయకండి. ఎవ్వరినీ గురువుగా చేసుకోకండి. గురువు లేకపోతే ఘోర అంధకారముంటుందని అంటారు. ఎంతోమంది గురువులు ఉన్నారు. కానీ అందరూ అంధకారములోకి తీసుకువెళ్ళేవారే. తండ్రి అంటారు - జ్ఞాన సూర్యుడు వచ్చినప్పుడు ఘోర అంధకారము దూరమవుతుంది. సన్యాసులు పావనముగా అవుతారు కానీ వారు జన్మ అయితే వికారాల ద్వారానే తీసుకుంటారు కదా. దేవీ-దేవతలైతే వికారాల ద్వారా జన్మ తీసుకోరు. ఇక్కడ అందరి శరీరాలు మురికిపట్టిన వస్త్రాలు వలె ఉన్నాయి. తండ్రి ఇటువంటి మురికిపట్టిన వస్త్రాలను శుభ్రము చేస్తారు. ఆత్మ పవిత్రముగా అయినట్లయితే శరీరము కూడా మంచిది లభిస్తుంది. దాని కోసం పురుషార్థము చేయాలి. నా ద్వారా ఏ చెడు పని జరగడము లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఈశ్వరీయ నియమాలు కూడా కఠినమైనవి. ఏదైనా చెడు పని చేస్తే, దానికి శిక్ష చాలా కఠినముగా ఉంటుంది. ఇది వినాశన సమయము. లెక్కాచారాలన్నింటినీ యోగబలముతో సమాప్తము చేసుకోవాలి. ఒకవేళ సమాప్తము చేసుకోకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. శిక్షలు మరియు పదవి అని అంటూ ఉంటారు. పదవి (రొట్టె ముక్క) అయితే అందరికీ లభించనున్నది. ముక్తి మరియు జీవన్ముక్తుల పదవినైతే అందరికీ ఇస్తారు. కొందరు పాస్ విత్ ఆనర్ గా అవుతారు, కొందరికి శిక్షలు లభించిన తర్వాత చిన్న పదవి లభిస్తుంది, అది కూడా గౌరవపూర్వకముగా లభించదు. వారు సింహాసనముపైనైతే కూర్చోలేరు. ఏదైనా చెడు పని చేస్తే పరువు పోతుంది, అది కూడా తండ్రి ఎదురుగా. శివబాబా కూర్చుని ఉన్నారు కదా. నేను వీరిలో ఉన్నప్పుడు నీకు ఎంతగా అర్థం చేయించాను అని మీకు సాక్షాత్కారము చేయిస్తారు. ఇప్పుడు నేను సంపూర్ణ బ్రహ్మాలో ఉన్నాను. కుమార్తెలైన మీరు సంపూర్ణ బాబా వద్దకు వెళ్తారు. శివబాబా వారి ద్వారా డైరెక్షన్ మొదలైనవి ఇస్తారు కదా. మీకు బాబా సాక్షాత్కారము చేయిస్తారు - వీరిలో కూర్చుని మిమ్మల్ని ఎంతగా చదివించేవాడిని, దైవీ గుణాలను ధారణ చేయండి, సేవ చేయండి, ఎవ్వరినీ నిందించకండి అని అర్థం చేయించేవాడిని, అయినా నీవు ఈ పని చేసావు, ఇప్పుడు శిక్ష అనుభవించు. ఎంతెంతగా పాపాలు చేసి ఉంటారో, అంతగా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. కొందరు చాలా శిక్షలు అనుభవిస్తారు, కొందరు తక్కువగా అనుభవిస్తారు. అందులో కూడా నంబరువారుగా ఉన్నారు. ఎంత వీలైతే అంత యోగబలముతో వికర్మలను కట్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలు ఈ అతి పెద్ద చింతను పెట్టుకోవాలి - నేను సంపూర్ణ పక్కా బంగారముగా ఎలా అవ్వాలి? లేస్తూ-కూర్చుంటూ ఇదే బుద్ధిలో ఉండాలి - ఎంతగా స్మృతి చేస్తే, అంత ఉన్నత పదవిని పొందుతాను అని. మాయ తుఫానులను లెక్క చేయకూడదు. ఎంత సమయము లభిస్తే అంత తండ్రిని స్మృతి చేయాలి. నేను తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. ఏ పాపము చేయకూడదు. లేదంటే 100 రెట్లు అయిపోతుంది. క్షమాపణ తీసుకోలేదంటే అది ఇక వృద్ధి అవుతూ-అవుతూ అంతా సర్వనాశనమైపోతుంది. మాయ పాపం వెనుక పాపం చేయిస్తూ ఉంటుంది. ఇక అనంతమైన తండ్రి పట్ల అగౌరవము ఉంటుంది. ఈ విషయము కూడా చాలామందికి తెలియదు. బాబా ఎల్లప్పుడూ ఏమని అర్థం చేయిస్తూ ఉంటారంటే - శివబాబా మురళీని నడిపిస్తున్నారు, శివబాబా డైరెక్షన్ ఇస్తున్నారు అని భావించండి, అప్పుడు స్మృతి కూడా ఉంటుంది, భయము కూడా ఉంటుంది. చాలా పాపాలు చేస్తూ ఉంటారు. బాబా, నా వల్ల ఈ తప్పు జరిగింది అని స్పష్టముగా చెప్పాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పాపాల భారము తలపై చాలా ఉంది. ఏమేమి చేశారో అది చెప్పండి. సత్యము చెప్తే సగం తగ్గుతుంది.

బాబా అర్థం చేయించారు - ఎవరైతే నంబరువన్ పుణ్యాత్మగా అవుతారో, వారే తర్వాత నంబరువన్ పాపాత్మగా కూడా అవుతారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - ఇది మీ అనేక జన్మలలో కూడా అంతిమ జన్మ. మీరు పుణ్యాత్ములుగా ఉండేవారు, ఇప్పుడు పాపాత్ములుగా అయ్యారు, మళ్ళీ పుణ్యాత్ములుగా అవ్వాలి. మీ కళ్యాణమైతే చేసుకోవాలి. ఇక్కడ మీరు తల వంచి నమస్కరించాల్సిన అవసరము కూడా లేదు, కేవలం తండ్రిని స్మృతి చేయాలి. వీరు కూడా వృద్ధుడే, అయినా నమస్కరిస్తారు. పిల్లలు ఇంటిలో పదే-పదే నమస్కరించరు. ఒక్కసారి నమస్కరించారు అంటే దానికి రిటర్న్ లో ఎదుటివారు కూడా నమస్కరిస్తారు. తండ్రి అంటారు - మీరు నన్ను పెద్దవారిగా భావిస్తూ నమస్కరిస్తారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా భావిస్తూ నమస్కరిస్తాను. దీనికి అర్థముంది కదా. మనుష్యులైతే రామా-రామా అని అంటారు కానీ అర్థమేమీ అర్థం చేసుకోరు. వాస్తవానికి రాముడు అనగా శివబాబా. రాముడు అనగా ఆ రఘుపతి కాదు, ఈ రాముడు నిరాకారుడు. వీరి పేరు శివబాబా. నేను రాముడిని పూజిస్తున్నాను అని శివుని ఎదురుగా ఎవ్వరూ అనరు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు మందిరాలకు వెళ్ళి ఇలా అర్థం చేయించండి - దేవతలు కూడా మనుష్యులే, మీరు వారి ముందుకు వెళ్ళి మహిమను పాడుతారు - మీరు నిర్వికారులు, సర్వగుణ సంపన్నులు, మేము పాపులము, నీచులము అని. ఈ తనువులు కూడా మనుష్యులవే మరియు ఆ తనువులు కూడా మనుష్యులవే కానీ వారిలో దైవీ గుణాలు ఉన్నాయి కావున వారు దేవతలు. మాలో ఆసురీ గుణాలున్నాయి కావుననే కోతుల వలె ఉన్నామని మీరు స్వయం అంటారు. ముఖాలు ఇరువురివి ఒకే విధముగా ఉంటాయి. కానీ గుణాలలో తేడా ఉంది. భారతవాసులే కిరీటధారులుగా ఉండేవారు. ఇప్పుడు కిరీటము లేదు, పేదవారిగా కూడా భారతవాసులే ఉన్నారు. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు, ఎక్కడైతే స్వర్గాన్ని తయారుచేసేది ఉందో అక్కడికి తండ్రి వస్తారు కదా. కళంగీ అవతారమని అంటారు, ఎన్ని కళంకాలను మోపారు. ఒకవేళ ఇతర ధర్మాలవారు కూడా ఏమైనా అంటే, వారు కూడా భారతవాసులనే ఫాలో చేస్తున్నట్లు. రాతిబుద్ధి కలవారిగా ఉన్న కారణముగా నన్ను కూడా రాయి-రప్పలలో ఉన్నారని అంటారు. తండ్రి గురించి తెలియనే తెలియదు - తండ్రి వీరిలో ప్రవేశించి భారత్ ను ఎంతటి కిరీటధారిగా తయారుచేస్తారు, భారత్ కు ఎంత సేవ చేస్తారు. తండ్రి అంటారు - మీరు నన్ను నిందిస్తారు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. మీరు ఎంత అపకారము చేస్తారు. రావణుడు మీ మతాన్ని ఎంతగా హతమార్చాడు. దుర్గతి పట్టింది, అందుకే, పతిత-పావనా రండి అని పిలుస్తారు. ఎంత సహజమైన వివరణ లభిస్తుంది. అయినా కొంతమంది పిల్లలు మర్చిపోతారు. యోగము లేకపోతే ధారణ కూడా జరగదు. అందుకే బాబా అంటారు - బంధనములో ఉన్నవారు అందరికంటే ఎక్కువగా స్మృతి చేస్తారు. శివబాబా స్మృతిలో సహనము కూడా చేస్తారు. భారతవాసులలో ఎవరైతే దేవీ-దేవతలుగా అయ్యేది ఉందో, వారే ఇక్కడకు వస్తారు. ఆర్య సమాజము వారైతే దేవతల మూర్తులను అసలు నమ్మరు. వృక్షములోని చివరి శాఖలలో ఉన్నవారు కష్టం మీద 2-3 జన్మలు తీసుకుంటారు.

వికారాలు లేకుండా ప్రపంచము ఎలా నడుస్తుందని చాలామంది భావిస్తారు. అరే, దేవతలను సంపూర్ణ నిర్వికారులని అంటారు కదా. అక్కడ అసలు వికారాలే ఉండవని కూడా ఎవ్వరికీ తెలియదు. కల్పక్రితం వచ్చిన వారు వెంటనే అర్థం చేసుకుంటారు. భగవానువాచ - కామము మహాశత్రువు అని అంటూ ఉంటారు కూడా. కానీ భగవంతుడు ఎప్పుడు చెప్పారు - ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు జగత్ జీతులుగా అవుతున్నారు. కానీ ఉన్నత పదవిని పొందేందుకు శ్రమించాలి. తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం బుద్ధియోగాన్ని నాతో జోడించండి. తండ్రికి చెందినవారిగా అయినప్పుడు తండ్రి పట్ల ప్రేమ ఉండాలి. ఇకపోతే, పని నడిపించడము కోసం ఇతరుల పట్ల ప్రేమనుంచాలి. పాపం వారిని స్వర్గవాసులుగా ఎలా చేయాలి అని బుద్ధిలో ఈ ఆలోచన పెట్టుకోవాలి. సత్యమైన యాత్రను చేసే యుక్తిని చెప్పాలి. అవి దైహిక యాత్రలు, వాటిని జన్మజన్మలుగా చేస్తూ వచ్చారు. ఇదొక్కటే స్మృతియాత్ర. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి, మళ్ళీ సత్యయుగ చరిత్ర రిపీట్ అవ్వనున్నది. పతితులైతే ఇంటికి వెళ్ళలేరు. పావనముగా తయారుచేయడానికి పతిత-పావనుడైన తండ్రి కావాలి. సన్యాసులు పావనముగా అవుతారు కానీ తిరిగి వెళ్ళలేరు. అందరినీ తీసుకువెళ్ళేవారు తండ్రి మాత్రమే. తండ్రి వచ్చి అందరినీ రావణుడి నుండి విడిపించి విముక్తులుగా చేస్తారు. సత్యయుగములో దుఃఖాన్ని ఇచ్చే వస్తువేదీ ఉండదు. దాని పేరే సుఖధామము. ఇది దుఃఖధామము. అది క్షీర సాగరము, ఇది విషయ సాగరము.

స్వర్గములో ఎంత సుఖముగా, ప్రశాంతముగా ఉంటారో ఇప్పుడు మీకు తెలుసు. క్షీర సాగరము నుండి బయటకు వచ్చి విషయ సాగరములోకి ఎలా వస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - శ్రీమతముపై నడవాలి, అప్పుడిక బాధ్యత వారిది. శ్రీమతము చెప్తుంది - వెళ్ళండి, పిల్లలను సంభాళించండి, వారికి భూ-భూ చేస్తూ ఉండండి, అప్పుడు ఎంతోకొంత కళ్యాణము జరుగుతుంది, స్వర్గములోకైతే వస్తారు. తండ్రి వచ్చి 21 జన్మల కోసం నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారుచేస్తారు. ఈ విషయము కూడా మీ బుద్ధిలో ఉంది. మనుష్యులకైతే ఏమీ తెలియదు. వీరికి కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. ఎలాగైతే వీరి 84 జన్మల కథ ఉందో, అలా - ‘‘తతత్వమ్’’ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). వీరు కూడా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు రాజఋషులు. వారు హఠయోగ ఋషులు. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. మీరందరూ శరణాగతిని పొందేందుకు వచ్చారు కదా. ఇప్పుడు మేము స్వర్గములో కూర్చున్నామని వారు భావిస్తారు. ప్రపంచములో మాయ ఆర్భాటము ఉంది. నరకము వినాశనమవ్వనంత వరకు స్వర్గము ఎలా ఏర్పడగలదు. మాయావి పురుషులు దీనినే స్వర్గముగా భావిస్తూ కూర్చున్నారు. బాబాకు కొత్త ప్రపంచము స్థాపన చేయడానికి ఎంత శ్రమ అనిపిస్తుంది. అందరూ నరకవాసులుగా ఉన్నారు. స్వర్గవాసులుగా అవ్వనే అవ్వరు. తండ్రి ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన పిల్లలూ, మీరు రావణుడిపై విజయాన్ని పొందడము ద్వారానే జగత్ జీతులుగా అవుతారు. దాని కోసం పూర్తి పురుషార్థము చేయాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అప్రతిష్టపాలు చేసే పనులేవీ చేయకూడదు. శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. మాయ తుఫానులను లెక్క చేయకుండా ఎంత సమయము లభిస్తే అంత తండ్రిని స్మృతి చేయాలి. ఒక్క తండ్రి పట్ల సత్యాతి-సత్యమైన ప్రేమనుంచుకోవాలి.

2. తమ గతిని ఉన్నతముగా తయారుచేసుకునేందుకు సత్యమైన తండ్రితో సత్యముగా ఉండాలి. ఏ విషయాన్నీ దాచి పెట్టకూడదు.

వరదానము:-
సర్వ బాధ్యతల భారాన్ని తండ్రికి ఇచ్చి సదా తమ ఉన్నతిని చేసుకునే సహజయోగీ భవ

 పిల్లలైతే తండ్రి కార్యాన్ని సంపన్నము చేసే బాధ్యత యొక్క సంకల్పాన్ని తీసుకుంటారో, వారికి తండ్రి కూడా అంతే సహయోగాన్ని ఇస్తారు. కేవలం మీ వద్ద ఉన్న వ్యర్థమనే భారాన్ని తండ్రిపై వదిలేయండి. తండ్రికి చెందినవారిగా అయి, తండ్రిపై బాధ్యతల భారాన్ని వదిలేసినట్లయితే సఫలత కూడా ఎక్కువగా లభిస్తుంది మరియు ఉన్నతి కూడా సహజముగా జరుగుతుంది. ఎందుకు మరియు ఏమిటి అనే ప్రశ్నల నుండి ముక్తలుగా ఉండండి. విశేషముగా ఫుల్ స్టాప్ స్థితి ఉన్నట్లయితే సహజయోగులుగా అయి అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేస్తూ ఉంటారు.

స్లోగన్:-
స్లోగన్:- మనసు మరియు బుద్ధిలో నిజాయితీగా ఉన్నట్లయితే తండ్రికి మరియు పరివారానికి విశ్వాసపాత్రులుగా అవుతారు.

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

ఎంతగా సంపూర్ణ స్థితి సమీపముగా వస్తూ ఉంటుందో, అంతగా ఇతరుల సంకల్పాలను చదవగలరు, దీని కోసం మీ సంకల్పాలపై ఫుల్ బ్రేక్ ఉండాలి. ఎవరైతే తమ సంకల్పాలను ప్యాకప్ చేయగలరో, వారే ఇతరుల సంకల్పాలను అర్థం చేసుకోగలరు. కనుక సంకల్పాల పెట్టె బేడను మూసివేస్తూ వెళ్ళండి.