12-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు పావన ప్రపంచములోకి వెళ్ళాలి, అందుకే కామమనే మహాశత్రువుపై విజయము పొందాలి, కామజీతులుగా, జగత్ జీతులుగా అవ్వాలి’’

ప్రశ్న:-
ప్రతి ఒక్కరూ తమ కర్మల ద్వారా ఏ సాక్షాత్కారాన్ని అందరికీ చేయించగలరు?

జవాబు:-
నేను హంసనా లేక కొంగనా? ఇది ప్రతి ఒక్కరూ తమ కర్మల ద్వారా అందరికీ సాక్షాత్కారము చేయించగలరు ఎందుకంటే హంసలు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. కొంగలు దుఃఖాన్ని ఇస్తారు, వారు వికారీగా ఉంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు కొంగల నుండి హంసలుగా అయ్యారు. పారసబుద్ధి కలవారిగా తయారయ్యే పిల్లలైన మీ కర్తవ్యము అందరినీ పారసబుద్ధి కలవారిగా తయారుచేయడము.

ఓంశాంతి
ఓంశాంతి అని అన్నప్పుడు మన స్వధర్మము గుర్తుకువస్తుంది. ఇంటి స్మృతి కూడా కలుగుతుంది కానీ ఇంటిలోనే కూర్చుని ఉండిపోకూడదు. మీరు తండ్రి పిల్లలు కావున తప్పకుండా మీ స్వర్గాన్ని కూడా స్మృతి చేయాలి. కావున ఓం శాంతి అని అనడముతో మొత్తము జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని. ఏ తండ్రి అయితే స్వర్గ స్థాపన చేస్తారో, ఆ తండ్రియే మనల్ని పవిత్రముగా, శాంతి స్వరూపులుగా తయారుచేస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రత. ప్రపంచమే పవిత్రముగా మరియు అపవిత్రముగా అవుతుంది. పవిత్ర ప్రపంచములో వికారులు ఒక్కరు కూడా ఉండరు. అపవిత్ర ప్రపంచములో 5 వికారాలు ఉన్నాయి, అందుకే దీనిని వికారీ ప్రపంచమని అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. నిర్వికారీ ప్రపంచము నుండి మెట్లు దిగుతూ-దిగుతూ మళ్ళీ కిందకు వికారీ ప్రపంచములోకి వస్తారు. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. అది పగలు, సుఖము. ఇది భ్రమించే రాత్రి. వాస్తవానికి రాత్రిలో ఎవరో భ్రమించడమని కాదు, కానీ భక్తిని భ్రమించడము అని అంటారు.

పిల్లలైన మీరు ఇప్పుడు ఇక్కడకు సద్గతిని పొందేందుకు వచ్చారు. మీ ఆత్మలో అన్నీ పాపాలే ఉండేవి, 5 వికారాలు ఉండేవి. అందులో కూడా ముఖ్యమైనది కామ వికారము, దాని ద్వారానే మనుష్యులు పాపాత్ములుగా అవుతారు. మేము పతితులము మరియు పాపాత్ములము అని కూడా అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒక్క కామ వికారము కారణముగా అన్ని అర్హతలు పాడైపోతాయి, అందుకే తండ్రి అంటారు, కామాన్ని జయించినట్లయితే మీరు జగత్ జీతులుగా అనగా కొత్త విశ్వానికి యజమానులుగా అవుతారు. కావున లోలోపల అంతటి సంతోషముండాలి. మనుష్యులు పతితులుగా అయినప్పుడు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఏ వికారమూ ఉండకూడదు. ముఖ్యమైనది కామ వికారము, దాని వలన ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంటింటిలోనూ ఎంతటి అశాంతి ఏర్పడుతుంది, హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయములో ప్రపంచములో హాహాకారాలు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే వారు పాపాత్ములు. వికారాల కారణముగానే అసురులు అని అంటారు. ఈ సమయములో ప్రపంచములో పనికొచ్చే వస్తువేదీ లేదని, విశ్వానికి నిప్పు అంటుకోనున్నదని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో, దానినంతటికీ నిప్పు అంటుకుంటుంది. ఆత్మకైతే నిప్పు అంటుకోదు. ఆత్మ అయితే సదా ఇన్ష్యూర్ చేయబడి ఉన్నట్లే ఉంటుంది ఎందుకంటే అది సదా జీవిస్తూ ఉంటుంది. ఆత్మను ఎప్పుడైనా ఇన్ష్యూర్ చేయిస్తారా? శరీరాన్ని ఇన్ష్యూర్ చేయడము జరుగుతుంది. ఆత్మ అవినాశీ. ఇది ఆట అని పిల్లలకు అర్థం చేయించడము జరిగింది. ఆత్మ అయితే పైన ఉంటుంది, అది 5 తత్వాలకు పూర్తిగా అతీతముగా ఉంటుంది. 5 తత్వాలతో పూర్తి ప్రపంచమంతటి సామాగ్రి తయారవుతుంది. ఆత్మ అయితే అలా తయారవ్వదు. ఆత్మ సదా ఉండనే ఉంటుంది. కేవలం పుణ్యాత్మగా, పాపాత్మగా అవుతుంది. పుణ్యాత్మ, పాపాత్మ అన్న పేర్లు ఆత్మకే ఉంటాయి. 5 వికారాల వలన ఎంత అశుద్ధముగా అయిపోతారు. ఇప్పుడు పాపాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. వికారాలే క్యారెక్టర్ అంతటినీ పూర్తిగా పాడు చేస్తాయి. క్యారెక్టర్ అని దేనినంటారు అనేది కూడా అర్థం చేసుకోరు. ఇది ఉన్నతోన్నతమైన ఆత్మిక గవర్నమెంట్. పాండవ గవర్నమెంట్ అని అనకుండా మిమ్మల్ని ఈశ్వరీయ గవర్నమెంట్ అని అనవచ్చు. మేము ఈశ్వరీయ గవర్నమెంట్ అని మీరు భావిస్తారు. ఈశ్వరీయ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆత్మలను పవిత్రముగా తయారుచేసి దేవతలుగా తయారుచేస్తుంది. లేదంటే దేవతలు ఎక్కడ నుండి వస్తారు? వాస్తవానికి వారు కూడా మనుష్యులే కానీ దేవతలుగా ఎలా ఉండేవారు, వారిని అలా ఎవరు తయారుచేసారు అన్నది ఎవరికీ తెలియదు. దేవతలైతే స్వర్గములోనే ఉంటారు. మరి వారిని స్వర్గవాసులుగా ఎవరు తయారుచేసారు? స్వర్గవాసులే మళ్ళీ తప్పకుండా నరకవాసులుగా అవుతారు, వారే మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. ఈ విషయాల గురించి మీకు కూడా ఇంతకుముందు తెలియదు, మరి అటువంటప్పుడు ఇతరులకు ఎలా తెలుస్తుంది! ఈ డ్రామా తయారై ఉన్నదని, వీరందరూ పాత్రధారులని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉండాలి. చదువు అనేది బుద్ధిలో ఉండాలి కదా, మరియు పవిత్రముగా కూడా తప్పకుండా అవ్వాలి. పతితముగా అవ్వడమనేది చాలా చెడ్డ విషయము. ఆత్మయే పతితముగా అవుతుంది. పరస్పరము పతితముగా అవుతారు. పతితులను పావనముగా తయారుచేయడము, ఇది మీ వ్యాపారము. పావనముగా అయినట్లయితే పావన ప్రపంచములోకి వెళ్తారు. ఇది ఆత్మ అర్థం చేసుకుంటుంది. ఆత్మ లేకపోతే శరీరము కూడా నిలిచి ఉండదు, రెస్పాన్స్ లభించదు. మేము వాస్తవానికి పావన ప్రపంచ నివాసులమని ఆత్మకు తెలుసు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - మీరు పూర్తి వివేకహీనులుగా ఉండేవారు, అందుకే పతిత ప్రపంచానికి అర్హులుగా అయ్యారు. ఎప్పటివరకైతే పావనముగా అవ్వరో, అప్పటివరకు స్వర్గానికి అర్హులుగా అవ్వలేరు. స్వర్గముతో పోల్చడము అనేది సంగమయుగములోనే జరుగుతుంది. అక్కడ ఈ విధముగా పోల్చలేరు. ఈ సంగమయుగములోనే మీకు మొత్తము జ్ఞానమంతా లభిస్తుంది. పవిత్రముగా అయ్యేందుకు ఆయుధము లభిస్తుంది. పతిత-పావన బాబా, మమ్మల్ని ఈ విధముగా పావనముగా తయారుచేయండి అని ఒక్కరితో మాత్రమే అనడము జరుగుతుంది. వీరు స్వర్గానికి యజమానులు కదా. మనమే స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుని పతితముగా అయ్యామని మీకు తెలుసు. శ్యామము మరియు సుందరము, వీరి పేరు కూడా అలాగే పెట్టారు. శ్రీకృష్ణుని చిత్రాన్ని నల్లగా తయారుచేస్తారు కానీ దాని అర్థము తెలియదు. కృష్ణుని గురించి కూడా మీకు ఎంత స్పష్టమైన వివరణ లభిస్తుంది. ఇందులో రెండు ప్రపంచాలుగా చేసేసారు. వాస్తవానికి రెండు ప్రపంచాలైతే లేనే లేవు. ప్రపంచము ఒక్కటే ఉంది. అదే కొత్తదిగా మరియు పాతదిగా అవుతుంది. మొదట చిన్న పిల్లలు కొత్తగా ఉంటారు, ఆ తర్వాత పెద్దవారిగా అయి ఆ తర్వాత వృద్ధులుగా అవుతారు. ఇవి అర్థం చేయించేందుకు మీరు ఎంతగా కష్టపడుతూ ఉంటారు, మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు కదా. లక్ష్మీ-నారాయణులు అర్థం చేసుకున్నారు కదా. అర్థం చేసుకోవడము వలన ఎంత మధురముగా అయ్యారు. ఎవరు అర్థం చేయించారు? భగవంతుడు. యుద్ధము మొదలైనవాటి విషయమైతే ఏమీ లేదు. భగవంతుడు ఎంత వివేకవంతులు, వారు నాలెడ్జ్ ఫుల్. వారు ఎంత పవిత్రమైనవారు. శివుని చిత్రానికి ఎదురుగా వెళ్ళి మనుష్యులందరూ నమస్కరిస్తారు కానీ వారు ఎవరు, ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. శివకాశి విశ్వనాథ గంగ... అని కేవలం నామమాత్రముగా అంటూ ఉంటారు. దాని అర్థం ఏమాత్రము తెలియదు. అర్థం చేయిస్తే, మీరు మాకేమి అర్థం చేయిస్తారు, మేమైతే వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ చదివాము అని అంటారు. కానీ రామ రాజ్యమని దేనినంటారు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. రామ రాజ్యమని కొత్త ప్రపంచమైన సత్యయుగాన్ని అంటారు. మీలో కూడా ధారణ జరిగేవారు నంబరువారుగా ఉన్నారు. కొందరైతే మర్చిపోతారు కూడా, ఎందుకంటే పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా ఎవరైతే తయారయ్యారో, వారి పని ఇతరులను కూడా పారసబుద్ధి కలవారిగా తయారుచేయడము. రాతిబుద్ధి కలవారి కర్మలు అలాగే కొనసాగుతూ ఉంటాయి, ఎందుకంటే హంసలు మరియు కొంగలు ఉన్నారు కదా. హంసలు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. కొంగలు దుఃఖాన్ని ఇస్తారు. కొంతమంది ఏ విధముగా ఉన్నారంటే, వారి వ్యవహారమే కొంగల వలె ఉంటుంది, వారిలో అన్ని వికారాలు ఉంటాయి. ఇక్కడకు కూడా అటువంటి వికారులు చాలామంది వస్తుంటారు, వారిని అసురులు అని అంటారు. వారిని గుర్తించలేము. చాలా సెంటర్ల వద్దకు కూడా వికారులు వస్తారు, మేము బ్రాహ్మణులమని సాకులు చెప్తారు కానీ అదంతా అసత్యమే. దీనిని అసత్య ప్రపంచము అని అంటారు. ఆ కొత్త ప్రపంచము సత్యమైన ప్రపంచము. ఇప్పుడు ఇది సంగమము. ఎంత వ్యత్యాసము ఉంటుంది. ఎవరైతే అసత్యము చెప్తారో, అసత్యమైన పనులు చేస్తారో, వారు థర్డ్ గ్రేడ్ గా తయారవుతారు. ఫస్ట్ గ్రేడ్, సెకెండ్ గ్రేడ్ అని ఉంటాయి కదా.

తండ్రి అంటున్నారు, పవిత్రత విషయములో కూడా మీరు పూర్తి ఋజువును ఇవ్వాలి. కొందరు అంటారు, వీరిరువురూ కలిసి ఉంటూ కూడా పవిత్రముగా ఉంటారా, అది అసాధ్యము. కావున పిల్లలు అర్థం చేయించవలసి ఉంటుంది. యోగబలము లేని కారణముగా ఇంతటి సహజమైన విషయాన్ని కూడా పూర్తిగా అర్థం చేయించలేకపోతారు. ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అన్న విషయాన్ని వారికి ఎవ్వరూ అర్థం చేయించరు. బాబా అంటారు, పవిత్రముగా అయినట్లయితే మీరు 21 జన్మల కొరకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అది పవిత్రమైన ప్రపంచము. పవిత్రమైన ప్రపంచములో పతితులెవ్వరూ ఉండలేరు. 5 వికారాలే ఉండవు. అది నిర్వికారీ ప్రపంచము. ఇది వికారీ ప్రపంచము. మనకు సత్యయుగ రాజ్యాధికారము లభిస్తున్నప్పుడు, మరి మనము ఒక్క జన్మ కోసం ఎందుకు పావనముగా అవ్వము! మనకు చాలా గొప్ప లాటరీ లభిస్తుంది, కావున సంతోషము కలుగుతుంది కదా. దేవీ-దేవతలు పవిత్రమైనవారు కదా. అపవిత్రము నుండి పవిత్రముగా కూడా తండ్రియే తయారుచేస్తారు. మాకు ఈ టెంప్టేషన్ ఉంది అని వారికి తెలియజేయాలి. తండ్రియే ఈ విధముగా తయారుచేస్తారు. తండ్రి తప్ప కొత్త ప్రపంచాన్ని ఇంకెవ్వరూ తయారుచేయలేరు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతుడే వస్తారు, వారు వచ్చేటటువంటి ఆ రాత్రి మహిమ చేయబడుతుంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని కూడా అర్థం చేయించబడింది. జ్ఞానము మరియు భక్తి సగము, సగము ఉంటాయి. భక్తి తర్వాత వైరాగ్యము ఉంటుంది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, ఈ శరీరమనే వస్త్రాన్ని వదిలేయాలి. ఈ ఛీ-ఛీ ప్రపంచములో ఉండకూడదు. 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తయ్యింది. ఇప్పుడు వయా శాంతిధామము వెళ్ళాలి. మొట్టమొదట భగవంతుని విషయాన్ని మర్చిపోకూడదు. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని ఇది కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. స్వర్గ స్థాపన చేయడానికి తండ్రి అనేక సార్లు వచ్చారు. నరకము వినాశనమైపోవాలి. నరకము ఎంత పెద్దది, స్వర్గము ఎంత చిన్నది. కొత్త ప్రపంచములో ఒకే ధర్మముంటుంది. ఇక్కడ ఉన్నది అనేక ధర్మాలు. ఏక ధర్మాన్ని ఎవరు స్థాపన చేసారు? బ్రహ్మా అయితే కాదు. బ్రహ్మాయే పతితము నుండి మళ్ళీ పావనముగా అవుతారు. పతితము నుండి పావనముగా అవుతారని నా కోసమైతే అనరు. పావనముగా ఉన్నప్పుడు లక్ష్మీ-నారాయణులు అన్న పేరు ఉంది. బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి. వీరు ప్రజాపిత కదా. శివబాబాను అనాది రచయిత అని అంటారు. అనాది అన్న పదము తండ్రికి వర్తిస్తుంది. తండ్రి అనాది అయినవారు కావున ఆత్మలు కూడా అనాది అయినవే, అలాగే ఆట కూడా అనాది అయినదే. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. స్వయంగా ఆత్మకు సృష్టి చక్రపు ఆదిమధ్యాంతాల గురించి, దాని కాల వ్యవధి గురించి జ్ఞానము లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చారు. మీరు 21 జన్మలకు నాథుడికి చెందినవారిగా అవుతారు, మళ్ళీ రావణ రాజ్యములో అనాథలుగా అవుతారు. అక్కడి నుండే క్యారెక్టర్ పాడైపోతుంది, అక్కడ వికారాలు ఉంటాయి కదా. అంతేకానీ రెండు ప్రపంచాలు లేవు. మనుష్యులు స్వర్గము, నరకము అన్నీ కలిసే ఉంటాయని భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత స్పష్టముగా అర్థం చేయించడము జరుగుతుంది. ఇప్పుడు మీరు గుప్తముగా ఉన్నారు. శాస్త్రాలలోనైతే ఏమేమో వ్రాసేసారు. దారము ఎంతగా చిక్కులు పడి ఉంది. కేవలం తండ్రి తప్ప ఇంకెవ్వరూ దీనిని విప్పలేరు. మేము దేనికీ పనికిరాకుండా ఉన్నాము, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేసి మా క్యారెక్టర్ ను సరిదిద్దండి అని వారినే పిలుస్తూ ఉంటారు. మీ క్యారెక్టర్స్ ఎంతగా సరిదిద్దబడుతున్నాయి. కొందరైతే పరివర్తన అయ్యేందుకు బదులుగా ఇంకా పాడైపోతారు. వారి నడవడిక ద్వారా కూడా తెలిసిపోతుంది. నేడు మహారథీ హంసలుగా పిలవబడతారు, రేపు కొంగలుగా అయిపోతారు. దానికి సమయము పట్టదు. మాయ కూడా గుప్తముగా ఉంది కదా. క్రోధమనేదేమీ చూడటానికి పైకి కనిపించదు. భౌ-భౌ అని అన్నప్పుడు అది బయటకు రావడము వలన కనిపిస్తుంది. ఆ తర్వాత ఆశ్చర్యము కలిగించేలా విన్నవారు, వర్ణించినవారు మళ్ళీ పారిపోతారు. ఎంతగా పడిపోతారు. పూర్తిగా రాయిలా అయిపోతారు. ఇంద్రప్రస్థము యొక్క విషయము కూడా ఉంది కదా. తెలియడమైతే తెలిసిపోతుంది. అటువంటివారు సభలోకి రాకూడదు. జ్ఞానము కొద్దిగా విన్నా సరే స్వర్గములోకి తప్పకుండా వస్తారు. జ్ఞానము వినాశనమవ్వదు.

ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాలి. ఒకవేళ వికారాలలోకి వెళ్తే, పదవి భ్రష్టమైపోతుంది. మీరు సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు, ఆ తర్వాత వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అవుతారు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వారైతే కలియుగము ఆయువును 40 వేల సంవత్సరాలని అంటారు. మెట్లు అయితే కిందకు దిగవలసి ఉంటుంది కదా. 40 వేల సంవత్సరాలు ఉన్నట్లయితే ఎంతోమంది మనుష్యులైపోతారు. 5 వేల సంవత్సరాలకే ఇంతమంది మనుష్యులు ఉన్నారు, తినడానికి సరిపడా భోజనము కూడా లభించడము లేదు. మరి ఇన్ని వేల సంవత్సరాలలో ఇంకెంత వృద్ధి జరుగుతుంది. తండ్రి వచ్చి ఓదార్పును ఇస్తారు. పతిత మనుష్యులైతే గొడవపడుతూనే ఉంటారు. వారి బుద్ధి ఇటువైపుకు రాలేదు. ఇప్పుడు మీ బుద్ధిని చూడండి, అది ఎంతగా మారుతూ ఉంటుంది, అయినా కూడా మాయ తప్పకుండా మోసము చేస్తుంది. ఇచ్ఛా మాత్రం అవిద్యగా (కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా) అవ్వాలి. ఏదైనా కోరిక ఉంటే ఇక అంతా పోయినట్టే. పైసకు కొరగానివారిగా అయిపోతారు. మంచి-మంచి మహారథులను కూడా మాయ ఏదో ఒక రకముగా, ఎప్పుడో ఒకప్పుడు మోసము చేస్తూ ఉంటుంది. అప్పుడిక వారు హృదయాన్ని అధిరోహించలేరు. ఉదాహరణకు కొందరు లౌకిక తల్లిదండ్రుల హృదయాన్ని అధిరోహించరు. కొందరు పిల్లలైతే తండ్రిని కూడా హతమార్చేవారిగా ఉంటారు. కుటుంబాన్నే అంతము చేసేస్తారు. వారు మహాపాపాత్ములు. రావణుడు ఎలా చేసేస్తాడు, ఇది చాలా అశుద్ధమైన ప్రపంచము. దీని పట్ల ఎప్పుడూ మనసు పెట్టుకోకూడదు. పవిత్రముగా అయ్యేందుకు చాలా ధైర్యము ఉండాలి. విశ్వ రాజ్యాధికారమనే ప్రైజ్ ను తీసుకునేందుకు పవిత్రత ముఖ్యమైనది, అందుకే - మీరు వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని తండ్రిని పిలుస్తూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయ మోసాల నుండి రక్షించుకునేందుకు ఇచ్ఛా మాత్రం అవిద్యగా (కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా) అవ్వాలి. ఈ అశుద్ధమైన ప్రపంచము పట్ల మనసు పెట్టుకోకూడదు.

2. పవిత్రత యొక్క పూర్తి ఋజువును ఇవ్వాలి. అన్నింటికన్నా ఉన్నతమైన క్యారెక్టర్ పవిత్రత. తమను తాము సరిదిద్దుకునేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి.

వరదానము:-
త్రికాలదర్శీ స్థితిలో స్థితులై సదా అచలముగా మరియు సాక్షీగా ఉండే నంబర్ వన్ భాగ్యశాలి భవ

త్రికాలదర్శీ స్థితిలో స్థితులై ప్రతి సంకల్పాన్ని, ప్రతి కర్మను చేయండి మరియు ప్రతి విషయాన్ని చూడండి. ఇది ఎందుకు, ఇది ఏమిటి అన్న ప్రశ్నార్థకాలు ఉండకూడదు, సదా ఫుల్ స్టాప్, నథింగ్ న్యూ. ప్రతి ఆత్మ యొక్క పాత్రను మంచిగా తెలుసుకుని పాత్రలోకి రండి. ఆత్మల సంబంధ సంపర్కములోకి వస్తూ అతీతముగా మరియు ప్రియముగా ఉండే సమానత ఉండాలి, అప్పుడు అలజడి సమాప్తమైపోతుంది. ఈ విధముగా సదా అచలముగా మరియు సాక్షీగా ఉండటము, ఇదే నంబర్ వన్ భాగ్యశాలి ఆత్మకు గుర్తు.

స్లోగన్:-
సహనశీలతా గుణాన్ని ధారణ చేసినట్లయితే కఠోర సంస్కారాలు కూడా శీతలముగా అయిపోతాయి.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

ముక్తి మరియు జీవన్ముక్తి మన జన్మసిద్ధ అధికారము అన్నది మీ స్లోగన్. ముక్తి అంటే ఏమిటి, జీవన్ముక్తి అంటే ఏమిటి అన్నది పరంధామములోనైతే తెలియనే తెలియదు, ముక్తి-జీవన్ముక్తుల అనుభవాన్ని ఈ బ్రాహ్మణ జీవితములో ఇప్పుడే చెయ్యాలి.