ఓంశాంతి
బ్రహ్మా ముఖవంశావళి, బ్రాహ్మణ కుల భూషణులు ఈ ప్రతిజ్ఞను చేస్తారు ఎందుకంటే వారి
ప్రీతి ఒక్క తండ్రితో జోడించబడి ఉంది. ఇది వినాశన సమయమని మీకు తెలుసు. వినాశనమైతే
జరగాల్సిందేనని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. వినాశన సమయములో ఎవరి ప్రీతి అయితే
తండ్రి పట్ల ఉంటుందో, వారే విజయాన్ని పొందుతారు అనగా సత్యయుగానికి యజమానులుగా
అవుతారు. శివబాబా అర్థం చేయిస్తున్నారు - విశ్వానికి యజమానులుగానైతే రాజులు కూడా
అవుతారు మరియు ప్రజలు కూడా అవుతారు, కానీ పొజిషన్ (పదవి) లో చాలా తేడా ఉంటుంది.
ఎంతగా తండ్రి పట్ల ప్రీతిని ఉంచుకుంటారో, స్మృతిలో ఉంటారో, అంతటి ఉన్నత పదవిని
పొందుతారు. తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మల భారము భస్మమవుతుందని బాబా అర్థం
చేయించారు. వినాశన సమయములో విపరీత బుద్ధి... అని మీరు వ్రాయవచ్చు. ఇది వ్రాయడానికి
భయపడాల్సిన విషయమేమీ లేదు. తండ్రి అంటారు - వారి (విపరీత బుద్ధి కల వారి)
వినాశనమవుతుందని మరియు ప్రీతి బుద్ధి కల వారి విజయము కలుగుతుందని నేను స్వయంగా
చెప్తున్నాను అని తండ్రి అంటారు. బాబా చాలా స్పష్టముగా చెప్తున్నారు. ఈ ప్రపంచములో
ప్రీతి అయితే ఎవరికీ లేదు. మీకు మాత్రమే ప్రీతి ఉంది. బాబా అంటారు - పిల్లలూ,
పరమాత్ముని మహిమను మరియు శ్రీకృష్ణుని మహిమను వేరు-వేరుగా వ్రాసినట్లయితే గీతా
భగవంతుడు ఎవరు అనేది నిరూపించబడుతుంది. ఇది తప్పనిసరి కదా. మరో విషయమేమిటంటే -
జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు పరమపితనా లేక నీటి నదులా? జ్ఞాన గంగనా లేదా నీటి గంగనా?
అన్నది కూడా బాబా అర్థం చేయిస్తారు. ఇది చాలా సహజమైన విషయము. రెండవ విషయము -
ప్రదర్శనీలు ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటగా గీతా పాఠశాల వారికి ఆహ్వానము ఇవ్వాలి.
వారు చాలా మంది ఉన్నారు. వారికి విశేషముగా ఆహ్వానము ఇవ్వాలి. ఎవరైతే శ్రీమత్
భగవద్గీతను అభ్యాసము చేస్తారో, వారికి ముందు ఆహ్వానము ఇవ్వాలి ఎందుకంటే వారే
మర్చిపోయారు మరియు అందరినీ మరపింపజేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు వచ్చి జడ్జి చేయండి,
ఆ తర్వాత ఏమి అర్థమైతే అది చేయండి అని వారిని పిలవాలి. అప్పుడు, గీత చదివేవారిని
వీరు పిలుస్తున్నారు, బహుశా వీరు గీతనే ప్రచారము చేస్తున్నారేమో అని మనుష్యులు కూడా
భావిస్తారు. గీత ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. గీతకు చాలా మహిమ ఉంది కానీ భక్తి
మార్గములోని గీతకు కాదు.
తండ్రి అంటారు - నేను మీకు అంతా సత్యమే వినిపిస్తాను. మనుష్యులు ఏవైతే అర్థాలు
తీస్తారో, అవి పూర్తిగా తప్పు. ఎవరూ సత్యము చెప్పరు, నేను మాత్రమే సత్యాన్ని
తెలియజేస్తాను. పరమాత్మను సర్వవ్యాపి అని అనడము కూడా సత్యము కాదు, వారంతా వినాశనము
చెందుతారు మరియు కల్ప-కల్పము ఇలా జరుగుతుంది కూడా. మీరు మొట్టమొదట ఈ ముఖ్యమైన
విషయాన్ని అర్థం చేయించాలి. తండ్రి అంటారు - యూరోప్ వాసులైన యాదవులది వినాశకాలే
విపరీత బుద్ధి. వినాశనము కోసం మంచి రీతిలో ఏర్పాట్లను చేస్తున్నారు కానీ రాతిబుద్ధి
కలవారు అర్థం చేసుకోలేరు. మీరు కూడా రాతిబుద్ధి కలవారిగా ఉండేవారు, ఇప్పుడు
పారసబుద్ధి కలవారిగా తయారవ్వాలి. పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, మళ్ళీ రాతిబుద్ధి
కలవారిగా ఎలా అయ్యారు! ఇది కూడా అద్భుతము. తండ్రిని నాలెడ్జ్ ఫుల్ (జ్ఞానసాగరుడు),
మెర్సిఫుల్ (దయాసాగరుడు) అని అంటారు. ఇకపోతే ఎవరికైతే తమ కళ్యాణము చేసుకోవడమే
తెలియదో, వారు ఇతరుల కళ్యాణాన్ని ఎలా చేస్తారు! ఎవరైతే జ్ఞానాన్ని ధారణ చేయరో, వారు
పదవి కూడా అటువంటిదే పొందుతారు, ఎవరైతే సేవాధారులుగా ఉంటారో, వారే ఉన్నత పదవిని
పొందుతారు. వారినే తండ్రి ప్రేమిస్తారు కూడా. వారు నంబరువారు పురుషార్థానుసారముగా
ఉంటారు. మాకు తండ్రి పట్ల ప్రీతి లేదు కావున పదవి కూడా లభించదు అని కొందరు ఇది కూడా
అర్థం చేసుకోరు. సొంత పిల్లలైనా లేక సవతి పిల్లలైనా, వినాశన సమయములో ప్రీతి బుద్ధి
లేకపోతే, తండ్రిని ఫాలో చేయకపోతే, తక్కువ పదవిని పొందుతారు. దైవీ గుణాలు కూడా ఉండాలి.
ఎప్పుడూ అసత్యము మాట్లాడకూడదు. తండ్రి అంటారు - నేను సత్యము వినిపిస్తాను, ఎవరైతే
నా పట్ల ప్రీతి కలిగి ఉండరో, వారికి పదవి కూడా లభించదు. ప్రయత్నము చేసి 21 జన్మల
కొరకు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కావున ప్రదర్శనీలకు, మేళాలకు ముందుగా గీతా
పాఠశాల వారికి ఆహ్వానము ఇవ్వాలి, ఎందుకంటే వారు భక్తులు కదా. గీతా పాఠకులు తప్పకుండా
శ్రీకృష్ణుడిని స్మృతి చేస్తూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడు మురళీని
వాయించారు, మరి రాధ ఎక్కడికి వెళ్ళినట్లు. సరస్వతికి వీణను చూపించారు,
శ్రీకృష్ణుడికి మురళీని చూపించారు. మమ్మల్ని అల్లా సృష్టించారని మనుష్యులు అంటారు
కానీ అల్లా గురించి తెలియదు. ఇది భారత్ కు సంబంధించిన విషయమే. భారత్ లోనే దేవతల
రాజ్యముండేది, వారి చిత్రాలు మందిరాలలో పూజించబడతాయి. ఇకపోతే రాజులు మొదలైనవారి
విగ్రహాలను బయటే పెడతారు, వాటిపై పక్షులు రెట్టలు వేస్తూ ఉంటాయి. లక్ష్మీ-నారాయణులు,
రాధా-కృష్ణులు మొదలైనవారి విగ్రహాలను ఎంత ఫస్ట్ క్లాస్ స్థానాలలో ప్రతిష్ఠాపిస్తారు.
వారిని మహారాజా-మహారాణి అని అంటారు, కింగ్ అనేది ఇంగ్లీషు పదము. ఎన్ని లక్షల
రూపాయలను ఖర్చు చేసి మందిరాలను తయారుచేస్తారు, ఎందుకంటే ఆ మహారాజులు పవిత్రముగా
ఉండేవారు. యథా రాజా-రాణి, తథా ప్రజ అందరూ పూజ్యులే. మీరే పూజ్యులుగా, మళ్ళీ
పూజారులుగా అవుతారు. కావున మొదటి విషయము - తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి
చేసే అభ్యాసము చేసినట్లయితే ధారణ జరుగుతుంది. ఆ ఒక్కరి పట్ల ప్రీతి లేదంటే, ఇక
ఇతరుల పట్ల ప్రీతి కలుగుతుంది. కొంతమంది కుమార్తెలు ఎలా ఉన్నారంటే, వారు పరస్పరము
ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారంటే, శివబాబాను కూడా అంతగా ప్రేమించటము లేదు.
శివబాబా అంటారు - మీరు బుద్ధియోగాన్ని నాతో జోడించాలా లేదా మీలో మీరు
ప్రేయసీ-ప్రియులుగా అవ్వాలా! అప్పుడిక నన్ను పూర్తిగా మర్చిపోతారు. మీరు
బుద్ధియోగాన్ని నాతో జోడించాలి, ఇందులో శ్రమించాల్సి ఉంటుంది. ఇతరుల నుండి బుద్ధి
అసలు తొలగడమే లేదు. రాత్రింబవళ్ళు శివబాబాకు బదులుగా ఒకరినొకరు తలచుకుంటూ ఉంటారు.
బాబా వారి పేర్లను వినిపించినట్లయితే, ద్రోహులుగా అయిపోతారు, ఇక నిందించేందుకు కూడా
ఆలస్యము చేయరు. ఈ బాబాను నిందించినట్లయితే శివబాబా కూడా వెంటనే వింటారు. బ్రహ్మా
ద్వారా చదువుకోకపోతే శివబాబా ద్వారా చదువుకోలేరు. బ్రహ్మా లేకుండా శివబాబా కూడా
వినలేరు, అందుకే సాకారుని వద్దకు వెళ్ళి అడగండి అని అంటారు. కొందరు మంచి-మంచి
పిల్లలు ఉన్నారు, వారు సాకారుడిని అంగీకరించరు, ఇతను కూడా పురుషార్థీయే కదా అని
భావిస్తారు. అందరూ పురుషార్థులే కావచ్చు కానీ మీరు ఫాలో అనేది తల్లి-తండ్రులనే
చేయాలి కదా. కొందరు అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు, ఎవరి భాగ్యములోనైనా లేకపోతే
అర్థం చేసుకోరు. సేవాధారులుగా అవ్వరు. కానీ బుద్ధిని ఒక్క తండ్రి పట్ల మాత్రమే
పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య, నాలో శివబాబా వస్తారు అని అనేవారు చాలామంది
వెలువడ్డారు, ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ చాలా ప్రవేశిస్తూ ఉంటుంది,
ఎవరిలోనైతే పూర్వము శ్రీ నారాయణుడు మొదలైనవారు వచ్చేవారో, వారు కూడా ఈ రోజు లేరు.
కేవలం ప్రవేశించడముతో ఏమీ జరగదు. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి.
ఇకపోతే, నాలోకి వీరు వస్తారు, వారు వస్తారు... ఇదంతా మాయ. నా స్మృతియే లేకపోతే ఏమి
ప్రాప్తి కలుగుతుంది, ఎప్పటివరకైతే తండ్రితో డైరెక్ట్ యోగాన్ని జోడించరో, అప్పటివరకు
పదవిని ఎలా పొందుతారు, ధారణ ఎలా జరుగుతుంది.
తండ్రి అంటారు - మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి. బ్రహ్మా ద్వారానే నేను అర్థం
చేయిస్తాను, బ్రహ్మా ద్వారానే స్థాపన జరిగింది. త్రిమూర్తులు కూడా తప్పకుండా కావాలి.
కొందరు బ్రహ్మా చిత్రాన్ని చూసి కోపగించుకుంటారు. మరి కొందరు శ్రీకృష్ణుని 84
జన్మలను చూసి కోపగించుకుంటారు. చిత్రాలను చింపేస్తారు కూడా. అరే, ఈ చిత్రాలను తండ్రి
తయారు చేయించారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మర్చిపోకండి, కేవలం
తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనములో ఉన్నవారు కూడా మొర పెట్టుకోకూడదు. ఇంటిలో
కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనములో ఉన్నవారికైతే మరింత ఉన్నత పదవి
లభించగలదు. పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు ఒక్కరే. ఆధ్యాత్మిక
జ్ఞానము ఒక్క తండ్రిలో తప్ప ఇంకెవరిలోనూ లేదు. జ్ఞానసాగరుడు ఒక్క పరమపిత పరమాత్మయే,
వారినే లిబరేటర్ (ముక్తిదాత) అని అంటారు, ఇందులో భయపడే విషయమేముంది. తండ్రి పిల్లలకు
అర్థం చేయిస్తారు, ఆ తర్వాత పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి అంటారు - నన్ను
స్మృతి చేసినట్లయితే సద్గతిని పొందుతారు. సత్యయుగములో రామరాజ్యము ఉంటుంది,
కలియుగములో ఉండదు. సత్యయుగములోనైతే ఒకే రాజ్యముంటుంది. ఈ విషయాలన్నీ మీలో కూడా
నంబరువారుగా ఉన్నాయి, కొందరి బుద్ధిలో ధారణ జరుగుతుంది. కొందరికి ధారణ జరగదు, వారిని
వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు, అటువంటివారు పదవిని పొందలేరు. వినాశనమైతే
అందరిదీ జరగవలసిందే. ఇవేమైనా తక్కువ విషయాలా! శివబాబా అంటారు - వినాశకాలే ప్రీతి
బుద్ధి కలవారిగా అవ్వండి. ఇది మీ అంతిమ జన్మ, ఇక్కడ ఒకవేళ మీరు ప్రీతిని
పెట్టుకోకపోతే పదవి కూడా లభించదు. సత్యమైన హృదయముపై సాహెబ్ రాజీ అవుతారు. దధీచి ఋషి
వలె సేవలో ఎముకలను ఇవ్వాలి. ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారము కూర్చుంటే, నషాయే
తొలగిపోతుంది, అప్పుడిక అనేక రకాల తుఫానులు వస్తూ ఉంటాయి. దీని కన్నా లౌకికము వారి
వద్దకు వెళ్ళిపోతే బాగుంటుంది, ఇక్కడ ఎలాంటి ఆనందము లేదు అని నోటితో అంటారు.
అక్కడైతే నాటకాలు, సినిమాలు మొదలైనవి చాలా ఉన్నాయి, ఎవరైతే ఆ విషయాలకు అలవాటు
పడిపోయారో, వారు ఇక్కడ నిలవలేరు, చాలా కష్టము. అయితే, పురుషార్థము చేసి ఉన్నత పదవిని
కూడా పొందవచ్చు. సంతోషములో ఉండాలి. బాబా స్వయంగా అంటున్నారు, నేను ఉదయాన్నే లేచి
కూర్చోకపోతే నాకు మజాయే రాదు. చారబడి ఉంటే అప్పుడప్పుడు కునికిపాట్లు వస్తాయి. లేచి
కూర్చుంటే మంచి పాయింట్లు వెలువడుతాయి, చాలా మజా వస్తుంది.
ఇప్పుడు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి, మనము తండ్రి నుండి విశ్వ
రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నాము. కూర్చుని ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నా సరే
సంతోషపు పాదరసము పైకెక్కుతుంది. ఉదయాన్నే చింతన నడిచినట్లయితే, రోజంతా కూడా సంతోషము
ఉంటుంది. ఒకవేళ సంతోషము లేకపోతే, తప్పకుండా తండ్రి పట్ల ప్రీతి బుద్ధి లేనట్లు.
అమృతవేళలో ఏకాంతము బాగుంటుంది, ఎంతగా తండ్రిని స్మృతి చేస్తే అంతగా సంతోషపు పాదరసము
పైకి ఎక్కుతుంది. ఈ చదువులో గ్రహచారము కూర్చుంటుంది ఎందుకంటే తండ్రిని మర్చిపోతారు.
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలంటే మనసా-వాచా-కర్మణా సేవ చేయాలి. ఈ సేవలోనే ఈ
అంతిమ జన్మను గడపాలి. ఒకవేళ వేరే ప్రాపంచిక విషయాలలో నిమగ్నమైపోతే ఇక ఈ సేవను
ఎప్పుడు చేస్తారు! రేపు-రేపు అంటూ మరణిస్తారు. తండ్రి వచ్చిందే స్వర్గములోకి
తీసుకువెళ్ళేందుకు. ఇక్కడైతే యుద్ధాలలో ఎంతమంది మరణిస్తూ ఉంటారు, ఎంతమందికి దుఃఖము
కలుగుతూ ఉండవచ్చు. అక్కడైతే యుద్ధాలు మొదలైనవి ఉండవు. ఇవన్నీ అంతిమ సమయానికి
చెందినవి, అందరూ సమాప్తమవ్వనున్నారు. అనాథలు అలానే మరణిస్తారు, సనాథలు రాజ్య
భాగ్యాన్ని పొందుతారు.
ప్రదర్శనీలలో కూడా ఇలా అర్థం చేయించాలి - మేము మా సంపాదన ద్వారానే, మా
తనువు-మనసు-ధనముల ద్వారానే మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము, మేము భిక్ష అడగము,
అవసరమే లేదు, మేము అనేకమంది సోదరీ-సోదరులము కలిసి రాజధానిని స్థాపన చేస్తాము, మీరు
కోట్లు జమ చేసి మిమ్మల్ని మీరు వినాశనము చేసుకుంటారు, మేము పైస-పైస జమ చేసి
విశ్వానికి యజమానులుగా అవుతాము. ఇది ఎంత అద్భుతమైన విషయము. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.