12-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు సేవ చేయాలి అని ఎంతో ఉత్సాహము కలగాలి, జ్ఞాన-యోగాలు ఉన్నాయి కావున ఇతరులకు కూడా నేర్పించండి, సేవను వృద్ధి చేయండి’’

ప్రశ్న:-
సేవలో ఉత్సాహము కలగపోవడానికి కారణము ఏమిటి? ఏ విఘ్నము కారణముగా ఉత్సాహము కలగదు?

జవాబు:-
అన్నింటికన్నా పెద్ద విఘ్నము వికారీ దృష్టి. ఈ వ్యాధి సేవలో ఉత్సాహము కలగనివ్వదు. ఇది చాలా కఠినమైన వ్యాధి. ఒకవేళ వికారీ దృష్టి శాంతించకపోతే, గృహస్థ వ్యవహారములో రెండు చక్రాలు కలిసి సరిగ్గా నడవకపోతే గృహస్థము భారమవుతుంది, అప్పుడు తేలికగా ఉంటూ సేవ పట్ల ఉత్సాహముతో ఉండలేరు.

పాట:-
మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి...

ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలు ఈ పాటను విన్నారు. ఇటువంటి మంచి పాటలు 2-4 ఉన్నాయి, అవి పిల్లలందరి వద్దా ఉండాలి. వాటిని టేప్ లో నింపుకోవాలి. ఈ పాటలైతే మనుష్యులు తయారుచేసినవే. డ్రామానుసారముగా వారికి టచింగ్ కలిగి వీటిని తయారుచేశారు, ఇవి పిల్లలకు ఉపయోగపడతాయి. ఇటువంటి పాటలను పిల్లలు విన్నట్లయితే వారికి నషా కలుగుతుంది. ఇప్పుడు మేము కొత్త రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని, రావణుడి నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నాము అని పిల్లలకైతే నషా ఎక్కి ఉండాలి. ఎవరైనా యుద్ధము చేసేటప్పుడు వీరి రాజ్యాన్ని నేను తీసుకోవాలి, వీరి పల్లెను నేను చేజిక్కించుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది కదా. అయితే, వారందరూ హద్దులోనివాటి కోసం యుద్ధాలు చేస్తూ ఉంటారు. పిల్లలైన మీ యుద్ధము మాయతో, దీని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మనము ఈ విశ్వముపై గుప్త రీతిగా రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలని అనగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని మీకు తెలుసు. వాస్తవానికి దీనిని యుద్ధము అని కూడా అనరు. డ్రామానుసారముగా మీరు సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానులుగా అవ్వాలి. మీకు మీ జన్మల గురించి ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇతర ధర్మాలకు చెందినవారెవరైతే ఉన్నారో, వారికి ఈ జ్ఞానము లభించేది లేదు. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు మాత్రమే ఈ విషయాలను అర్థం చేయిస్తారు. ధర్మములోనే శక్తి ఉంది అని అంటూ ఉంటారు కూడా. తమ ధర్మము ఏది అనేది భారతవాసులకు తెలియదు కూడా. మనది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమని మీకు తండ్రి ద్వారా తెలిసింది. తండ్రి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఆ ధర్మములోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మన ధర్మము ఎంత సుఖాన్ని ఇచ్చేటువంటిదో మీకు తెలుసు. మీరు ఎవరితోనూ యుద్ధము మొదలైనవి చేయకూడదు. మీరు మీ స్వధర్మములో ఉండాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి, దీనికి కూడా సమయము పడుతుంది. కేవలం స్వధర్మములో ఉండాలి అని చెప్పినంతమాత్రాన అలా ఉండిపోగలరని కాదు. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అని లోలోపల ఈ స్మృతి ఉండాలి. ఆత్మ అయిన మనము ఇప్పుడు తమోప్రధానముగా, పతితముగా అయ్యాము. ఆత్మ అయిన మనము శాంతిధామములో ఉన్నప్పుడు పవిత్రముగా ఉండేవారము, ఆ తర్వాత పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ తమోప్రధానముగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అయి మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని తండ్రిని స్మృతి చేయాలి. మేము ఈశ్వరుని సంతానము అని మీకు నషా కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఇది ఎంత సహజము - స్మృతి ద్వారా మనము పవిత్రముగా అయి తిరిగి శాంతిధామములోకి వెళ్ళిపోతాము. ప్రపంచానికి ఈ శాంతిధామము, సుఖధామము అంటే ఏమిటో కూడా తెలియదు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. జ్ఞానసాగరుడు వినిపించనది ఒక్క గీతయే, ఇందులో కేవలం పేరును మార్చారు. సర్వులకు సద్గతిదాత, జ్ఞానసాగరుడు అని ఆ పరమపిత పరమాత్మనే పిలవడం జరుగుతుంది. ఇంకెవ్వరినీ జ్ఞానవంతులు అని పిలవడానికి లేదు. ఎప్పుడైతే వారు జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడే మీరు జ్ఞానవంతులుగా అవుతారు. ఇప్పుడు అందరూ భక్తివంతులు, మీరు కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞానవంతులుగా అవుతున్నారు. నంబరువారు పురుషార్థానుసారముగా జ్ఞానము కొందరిలో ఉంది, కొందరిలో లేదు. మరి ఏమంటారు? ఆ లెక్కన ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి సేవ కొరకు ఎంత ఉత్సాహముతో ఉంటారు. ఎవరికైనా బాగా అర్థం చేయించగలిగే శక్తి పిల్లలలో ఇంకా రాలేదు. ఈ విధమైన యుక్తులను రచించాలి. పిల్లలు కష్టపడి కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తున్నారు, గోపులలో కొంత శక్తి ఉంది. వారికి - ఒక సంగఠన ఉండాలని, అందులో అందరూ కలిసి యుక్తులను రచించాలని ఈ ఆలోచన ఉంటుంది. సేవ ఎలా వృద్ధి అవుతుంది? అని కష్టపడుతున్నారు. పేరు ఏమో శక్తిసేన అని ఉంది కానీ వారు అంతగా చదువుకోలేదు. కానీ కొందరు చదువుకోనివారు కూడా చదువుకున్నవారిని బాగా చదివిస్తారు. బాబా అర్థం చేయించారు, వికారీ దృష్టి చాలా నష్టపరుస్తుంది. ఈ వ్యాధి చాలా చెడ్డది, దీని వల్లే అంత ఉత్సాహము కలగదు. బాబా అడుగుతుంటారు - రెండు చక్రాలవంటి భార్యాభర్తలైన మీరిరువురూ బాగా నడుస్తున్నారా? అటువైపు ఎంత పెద్ద-పెద్ద సైన్యాలు ఉన్నాయి, స్త్రీలది కూడా సైన్యము ఉంది, వారు బాగా చదువుకున్నవారు, వారికి సహాయము కూడా లభిస్తుంది. కానీ మీరు గుప్తముగా ఉన్నారు. ఈ బ్రహ్మాకుమార, కుమారీలు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. గృహస్థ వ్యవహారాల భారము తలపై ఉన్న కారణముగా వంగి ఉన్నారు. బ్రహ్మాకుమార, కుమారీలు అని పిలుచుకుంటున్నారు, కానీ ఆ వికారీ దృష్టి శాంతించదు. రెండు చక్రాలు ఒకేలా ఉండడం చాలా కష్టము. పిల్లలు సేవ చేపట్టాలని చెప్పి బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. కొందరు ధనవంతులైనా సరే సేవలో అంతగా ఉత్సాహము చూపించరు. ధనము కోసం ఆకలితో ఉన్నారు. వారికి పిల్లలు లేకపోయినా సరే ఎవరినో ఒకరిని దత్తత తీసుకుంటారు. బాబా, మేము ఉన్నాము కదా, మేము పెద్ద ఇల్లును తీసుకుని ఇస్తాము అన్న ఉత్సాహాన్ని చూపించరు.

బాబా దృష్టి విశేషముగా ఢిల్లీపై ఉంది ఎందుకంటే ఢిల్లీ రాజధాని, అది హెడ్ ఆఫీస్ వంటిది. బాబా అంటారు, ఢిల్లీలో విశేషముగా సేవతో ముట్టడి చేయండి. ఎవరికైనా అర్థం చేయించేందుకు లోపలకు దూరాలి. పాండవులకు కౌరవుల నుండి మూడడుగుల నేల కూడా లభించేది కాదు అన్న గాయనము కూడా ఉంది. ఈ కౌరవులు అన్న పదము గీతలోనిది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు, దానికి గీత అన్న పేరు పెట్టారు, కానీ గీతా భగవానుడిని మర్చిపోయారు. అందుకే ముఖ్యమైన ఈ విషయాన్ని మీరు అందరికీ చెప్పాలి అని బాబా ఘడియ-ఘడియ చెప్తూ ఉంటారు. బనారస్ లోని విద్వత్ మండలి వారికి అర్థం చేయించండి అని ఇంతకుముందు బాబా చెప్తుండేవారు. బాబా యుక్తులనైతే తెలియజేస్తూ ఉంటారు. కావున బాగా ప్రయత్నించాలి. బాబా పదే-పదే అర్థం చేయిస్తూ ఉంటారు. ఢిల్లీలో నంబరు వన్ యుక్తులను రచించండి. సంగఠనలో కూడా దీని గురించి ఆలోచించండి. పెద్ద మేళాలు మొదలైనవి ఢిల్లీలో ఎలా చేయాలి అన్నది ముఖ్యమైన విషయము. వారైతే ఢిల్లీలో ఎన్నో నిరాహార దీక్షలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరైతే అటువంటి పనులేవీ చేయరు. మీరు ఎవరితోనూ గొడవపడరు. మీరు కేవలం నిదురించి ఉన్నవారిని మేల్కొలుపుతారు. ఢిల్లీవారే కృషి చేయాలి. మనము బ్రహ్మాండానికి కూడా యజమానులుగా, అలాగే కల్పపూర్వము వలె సృష్టికి కూడా యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. విశ్వానికి యజమానులుగా అయి తీరవలసిందే. ఇప్పుడు మీకు మూడడుగుల భూమి కూడా రాజధానిలోనే కావాలి, అక్కడ జ్ఞాన బాంబులు వేసేందుకు కావాలి. ఇలా చేయడానికి నషా కావాలి కదా. పెద్దవారి నుండి వాయిస్ కావాలి కదా. ఈ సమయములో భారత్ అంతా నిరుపేదగా ఉంది. పేదవారి సేవ చేయడానికే తండ్రి వస్తారు. ఢిల్లీలో అయితే చాలా మంచి సేవ జరగాలి. బాబా సూచనలు ఇస్తూ ఉంటారు. బాబా మాకు ఈ విషయము పట్ల అటెన్షన్ ఇప్పుస్తున్నారని ఢిల్లీవారు భావిస్తారు. పరస్పరము క్షీరఖండములా ఉండాలి. పాండవులైన మన కోటనైతే తయారుచేయాలి. ఢిల్లీలోనే తయారుచేయవలసి ఉంటుంది. దీని కోసం చాలా మంచి తెలివి కావాలి. చాలానే చేయగలరు. వారంతా - భారత్ మా దేశము, మేము ఇలా, ఇలా చేస్తాము అని ఎంతగానో పాడుతూ ఉంటారు కానీ స్వయములో ఏ శక్తి లేదు. విదేశాల సహాయము లేకుండా లేవలేకపోతారు. మీకైతే అనంతమైన తండ్రి నుండి ఎంతో సహాయము లభిస్తోంది. ఇంతటి సహాయాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు త్వరగా కోటను తయారుచేయాలి. పిల్లలైన మీకు తండ్రి విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారు కావున మీకు ఎంతో ఉత్సాహము మరియు ధైర్యము ఉండాలి. వ్యర్థమైన పరచింతనా విషయాల్లో ఎంతోమంది బుద్ధి చిక్కుకుని ఉంటుంది. మాతలపై బంధనాల ఆపద ఉంది. పురుషులపై ఏ బంధనమూ లేదు. మాతలను అబలలు అని అంటారు. పురుషులు శక్తివంతముగా ఉంటారు. పురుషులు వివాహము చేసుకున్నప్పుడు - నీవే గురువు, నీవే ఈశ్వరుడవు, నీవే సర్వస్వము అని అతనికి బలాన్ని ఇవ్వడము జరుగుతుంది. స్త్రీని ఒక తోకలా చూస్తారు. పతి వెనుక వేలాడే స్త్రీ అయితే మరి నిజంగానే తోకలానే వేలాడుతూ ఉంటుంది. పతిపై మోహము, పిల్లలపై మోహము ఉంటుంది, పురుషులకు అంత మోహము ఉండదు. వారు ఒక చెప్పు పోతే రెండవ చెప్పు, మూడవ చెప్పు తీసుకుంటారు. ఇది ఒక అలవాటుగా అయిపోయింది. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు - ఈ, ఈ విషయాలను వార్తాపత్రికలలో ముద్రించండి. పిల్లలు తండ్రిని ప్రసిద్ధము చేయాలి. జ్ఞానము అర్థం చేయించడమనేది మీ పని. బాబాతో పాటు దాదా కూడా ఉన్నారు కావున వారు బయటకు వెళ్ళలేరు. కొందరు ఏమంటూ ఉంటారంటే - శివబాబా, మాపై ఈ ఆపదలు వచ్చాయి, ఇందులో ఏమి చేయాలి అని మీరు మాకు సలహాను ఇవ్వండి. ఇలాంటి, ఇలాంటి విషయాలను అడుగుతూ ఉంటారు. తండ్రి అయితే పతితులను పావనముగా చేయడానికి వచ్చారు. తండ్రి అంటారు, పిల్లలైన మీకు జ్ఞానమంతా లభిస్తుంది. ప్రయత్నించి పరస్పరము కలిసి చర్చించుకుని సలహాలు తీయండి. పిల్లలైన మీరు ఇప్పుడు విహంగ మార్గపు సేవ యొక్క తమాషాను చూపించాలి. చీమ నడక వంటి సేవ అయితే నడుస్తూ వస్తోంది. కానీ ఎటువంటి తమాషాను చూపించండి అంటే దాని ద్వారా అనేకుల కళ్యాణము జరగాలి. బాబా ఇది కల్పపూర్వము కూడా అర్థం చేయించారు, ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. చాలామంది బుద్ధి అక్కడా, ఇక్కడా చిక్కుకుని ఉంది, అంత ఉత్సాహము లేదు. వెంటనే దేహాభిమానము వచ్చేస్తుంది. దేహాభిమానమే సర్వనాశనము చేసింది. ఇప్పుడు తండ్రి సత్యముగా ఉన్నతిని కలిగించేందుకు ఎంతటి సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే శక్తి వస్తుంది, లేదంటే శక్తి రాదు. సెంటరు సంభాళిస్తూ ఉంటారు కానీ నషా లేదు ఎందుకంటే దేహాభిమానము ఉంది. దేహీ-అభిమానులుగా అయినట్లయితే నషా ఎక్కుతుంది. నేను ఎటువంటి తండ్రికి సంతానమును! తండ్రి అంటారు, ఎంతగా మీరు దేహీ-అభిమానులుగా అవుతారో అంతగా బలము వస్తుంది. అర్థకల్పవు దేహాభిమానపు నషా ఉంది కావున దేహీ-అభిమానులుగా అవ్వడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. బాబా జ్ఞానసాగరుడు కదా, మేము కూడా జ్ఞానాన్ని తీసుకున్నాము, అనేకమందికి అర్థం చేయిస్తున్నాము అని అనుకోవడం కాదు, స్మృతి అనే పదును కూడా కావాలి. జ్ఞానమనేది ఒక ఖడ్గము. స్మృతి అనేది యాత్ర వంటిది. ఈ రెండూ వేర్వేరు విషయాలు. జ్ఞానములో స్మృతియాత్ర అనే పదును కావాలి. అది లేకపోతే చెక్క ఖడ్గములా అయిపోతుంది. సిక్కు ధర్మమువారు ఖడ్గానికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు. అది హింసాయుతమైనది, దానితో యుద్ధము చేసారు. వాస్తవానికి గురువులు యుద్ధము చేయవచ్చా. గురువులు అయితే అహింసాయుతముగా ఉండాలి కదా. యుద్ధముతో సద్గతి లభిస్తుందా. మీది యోగము యొక్క విషయము. స్మృతి బలము లేకుండా జ్ఞానమనే ఖడ్గము పని చేయదు. వికారీ దృష్టి ఎంతో నష్టము కలిగిస్తుంది. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. తండ్రి అంటారు, మీరు స్మృతిలో నిమగ్నమై ఉన్నట్లయితే సేవ పెరుగుతూ ఉంటుంది. బాబా, సంబంధీకులు వినడం లేదు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. బాబా అంటారు, స్మృతియాత్రలో కచ్చాగా ఉన్నారు, అందుకే జ్ఞాన ఖడ్గము పని చేయడం లేదు. స్మృతి విషయములో శ్రమించండి. ఇది గుప్తమైన శ్రమ. మురళిని వినిపించడమైతే ప్రత్యక్షమైనది. స్మృతిలోనే గుప్తమైన శ్రమ ఉంది, దీని ద్వారానే శక్తి లభిస్తుంది. జ్ఞానము ద్వారా శక్తి లభించదు. మీరు స్మృతి బలము ద్వారానే పతితుల నుండి పావనముగా అవుతారు. సంపాదన కోసమే పురుషార్థము చేయాలి.

పిల్లల స్మృతి ఎప్పుడైతే ఏకరసముగా ఉంటుందో, అవస్థ ఎప్పుడైతే బాగుంటుందో, అప్పుడు చాలా సంతోషము ఉంటుంది మరియు ఎప్పుడైతే స్మృతి సరిగ్గా ఉండదో, ఏదో ఒక విషయములో గుటకలు మింగుతూ ఉంటారో, అప్పుడు సంతోషము మాయమైపోతుంది. విద్యార్థికి తన టీచర్ స్మృతి కలగదా ఏమిటి. ఇక్కడైతే ఇంటిలో ఉంటూ, అన్నీ చేసుకుంటూ టీచరును స్మృతి చేయాలి. ఈ టీచర్ ద్వారానైతే చాలా-చాలా ఉన్నత పదవి లభిస్తుంది. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. టీచర్ స్మృతి ఉన్నా సరే, తండ్రి మరియు గురువు తప్పకుండా గుర్తుకువస్తారు. తండ్రి ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ఇంటిలో మళ్ళీ ధన-సంపదలను, పిల్లలు మొదలైనవారిని చూస్తూ అన్నీ మర్చిపోతారు. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఆత్మిక సేవ చేయాలి. తండ్రి స్మృతియే ఉన్నతోన్నతమైన సేవ. మనసా, వాచా, కర్మణా బుద్ధిలో తండ్రి స్మృతియే ఉండాలి. నోటి ద్వారా జ్ఞాన విషయాలనే వినిపించండి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఏ విధమైన తప్పుడు పనులూ చేయకూడదు. మొదట భగవంతుని గురించి అర్థం చేసుకోకపోతే ఇంకేమీ అర్థం చేసుకోరు. మొట్టమొదట భగవంతుని గురించి పక్కాగా అర్థం చేయించండి, అప్పటివరకు ముందుకు వెళ్ళకూడదు. శివబాబా రాజయోగాన్ని నేర్పించి విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు. ఈ ఛీ-ఛీ ప్రపంచములో మాయ ఆకర్షణ ఎంతగానో ఉంది, ఎంతగా ఫ్యాషన్ పెరిగిపోయింది. ఛీ-ఛీ ప్రపంచము పట్ల అయిష్టము కలగాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి, మీరు పవిత్రముగా అవుతారు. సమయాన్ని వృధా చేయకండి. బాగా ధారణ చేయండి. మాయా శత్రువు అనేకుల బుద్ధిని నాశనము చేస్తుంది. కమాండర్ తప్పు చేస్తే అతడిని డిస్మిస్ కూడా చేస్తారు. స్వయం కమాండర్ కు కూడా సిగ్గు కలుగుతుంది, ఇక అతను రాజీనామా కూడా చేసేస్తారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మంచి-మంచి కమాండర్లు కూడా ఫెయిల్ అయిపోతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతి విషయములో గుప్తమైన శ్రమ చేయాలి. స్మృతి యొక్క ఆనందములో నిమగ్నమై ఉన్నట్లయితే సేవ స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. మనసా, వాచా, కర్మణా స్మృతిలో ఉండేందుకు పురుషార్థము చేయాలి.

2. నోటి ద్వారా జ్ఞాన విషయాలనే వినిపించాలి, ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఎటువంటి తప్పుడు పనులూ చేయకూడదు. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు కృషి చేయాలి.

వరదానము:-
లోహ సమానమైన ఆత్మను పారసముగా తయారుచేసే మాస్టర్ పారసనాథ్ భవ

మీరందరూ పారసనాథుడైన తండ్రి పిల్లలైన మాస్టర్ పారసనాథులు, కావున ఎటువంటి లోహ సమానమైన ఆత్మ అయినా కానీ మీ సాంగత్యముతో ఆ లోహము కూడా పారసమైపోవాలి. వీరు లోహము వంటివారు అని ఎప్పుడూ ఆలోచించకండి. లోహాన్ని పారసముగా తయారుచేయడమే పారసము పని. ఇదే లక్ష్యాన్ని మరియు లక్షణాలను సదా స్మృతిలో ఉంచుకుని ప్రతి సంకల్పము, ప్రతి కర్మ చేయండి, అప్పుడు ఆత్మనైన నా ప్రకాశ కిరణాలు అనేక ఆత్మలను స్వర్ణిమముగా తయారుచేసే శక్తిని అందిస్తున్నాయి అని అనుభవమవుతుంది.

స్లోగన్:-
ప్రతి కార్యాన్ని సాహసముతో చేసినట్లయితే సర్వుల గౌరవము ప్రాప్తిస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

పరమాత్మ ప్రేమ ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితానికి ఆధారము. ప్రేమ ఉంటే ప్రపంచము ఉంటుంది, ప్రాణము ఉంటుంది అని అంటారు కదా. ప్రేమ లేకపోతే ప్రపంచమూ లేదు, ప్రాణమూ లేదు. ప్రేమ లభించింది అంటే ప్రపంచము లభించినట్లే. ప్రపంచములోని వారు ఒక్క చుక్క ప్రేమ కోసం దాహార్తులై ఉన్నారు కానీ పిల్లలైన మీకు ఈ ప్రభు ప్రేమ అనేది ఆస్తి వంటిది. ఈ ప్రభు ప్రేమతోనే పాలింపబడుతున్నారు అనగా బ్రాహ్మణ జీవితములో ముందుకు వెళ్తున్నారు. కనుక సదా ప్రేమ సాగరునిలో లవలీనులై ఉండండి.