12-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు ఈ రావణ రాజ్యము, పాత ప్రపంచము సమాప్తమై కొత్త ప్రపంచము వస్తోంది, అందుకే శ్రీమతముపై నడుస్తూ పవిత్రముగా అయినట్లయితే శ్రేష్ఠమైన దేవీ-దేవతలుగా అవుతారు’’

ప్రశ్న:-
తండ్రి తమ పిల్లలకు సత్యనారాయణ కథను వినిపిస్తారు, ఆ కథ యొక్క రహస్యమేమిటి?

జవాబు:-
ఆ కథ యొక్క రహస్యమేమిటంటే - రాజ్యాధికారాన్ని తీసుకోవడము మరియు పోగొట్టుకోవడము. మొట్టమొదటివారికి అనగా దాదా లేఖ్ రాజ్ కు అల్లాహ్ లభించగానే గాడిద చాకిరీని వదిలేశారు. ఎవరైతే విశ్వానికి యజమానిగా ఉండేవారో, వారే 84 జన్మలు తీసుకుని రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటారు, మళ్ళీ తండ్రి వారికి రాజ్యాధికారాన్ని ఇస్తారు. పతితము నుండి పావనముగా అవ్వడము, గాడిద చాకిరీని వదిలి రాజ్యాధికారాన్ని తీసుకోవడము - ఈ సత్యమైన సత్యనారాయణ కథనే తండ్రి వినిపిస్తారు.

పాట:-
చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది...

ఓంశాంతి
ఓంశాంతి అర్థాన్ని అయితే ఆత్మిక తండ్రి అర్థం చేయించారు. ఓం అంటే - నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. ఆత్మ అయితే చూడటానికి కనిపించదు. నేను ఆత్మను, ఇది నా శరీరమని అర్థమవుతుంది. ఆత్మలోనే మనసు, బుద్ధి ఉన్నాయి. బుద్ధి శరీరములో లేదు. ఆత్మలోనే మంచి మరియు చెడు సంస్కారాలు ఉంటాయి. ముఖ్యమైనది ఆత్మ. ఆ ఆత్మను ఎవ్వరూ చూడలేరు. శరీరాన్ని ఆత్మ చూస్తుంది. ఆత్మను శరీరము చూడలేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరము జడముగా అయిపోతుందని అర్థం చేసుకోగలరు. ఆత్మను చూడలేము, శరీరాన్ని చూడగలము. అలాగే ఆత్మకు తండ్రి, ఎవరినైతే ఓ గాడ్ ఫాదర్ అని అంటామో, వారు కూడా కనిపించరు. వారిని అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఆత్మలందరూ పరస్పరములో సోదరులు. శరీరములోకి వచ్చినప్పుడు - వీరు సోదరులు లేక సోదరీ-సోదరులు అని అంటారు. ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ. దైహిక సోదరీ-సోదరులు ఒకరినొకరు చూసుకోగలరు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, వారిని చూడలేము. తండ్రి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయడానికి వచ్చారు. కొత్త ప్రపంచము సత్యయుగము, ఈ పాత ప్రపంచము కలియుగము. ఇప్పుడు ఇది పరివర్తన అవ్వనున్నది. ఎలాగైతే పాత ఇల్లు సమాప్తమై, కొత్త ఇల్లు తయారవుతుందో, అలా ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. సత్యయుగము తర్వాత త్రేతా, ద్వాపర, కలియుగాలు ఉంటాయి, మళ్ళీ తప్పకుండా సత్యయుగము వస్తుంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవ్వనున్నాయి. సత్యయుగములో దేవీ-దేవతల రాజ్యముంటుంది. సూర్యవంశము మరియు చంద్రవంశము అర్ధకల్పం ఉంటాయి. వాటిని లక్ష్మీ-నారాయణుల వంశము, సీతా-రాముల వంశము అని అంటారు. ఇది సహజమే కదా. తర్వాత, ద్వాపర-కలియుగాలలో ఇతర ధర్మాలు వస్తాయి. అప్పుడు, పవిత్రముగా ఉన్న దేవీ-దేవతలు అపవిత్రముగా అయిపోతారు. దీనిని రావణ రాజ్యమని అంటారు. రావణుడిని ప్రతి సంవత్సరము కాలుస్తారు కానీ అసలు కాలడమే లేదు. రావణుడు అందరికీ పెద్ద శత్రువు, అందుకే అతడిని కాల్చే ఆచారము మొదలయ్యింది. భారత్ యొక్క నంబరు వన్ శత్రువు రావణుడు మరియు నంబరు వన్ మిత్రుడు, సదా సుఖాన్ని ఇచ్చేవారు ఖుదా (భగవంతుడు). ఖుదాను దోస్త్ (మిత్రుడు) అని అంటారు కదా. దీనిపై ఒక కథ కూడా ఉంది. భగవంతుడు మిత్రుడు, రావణుడు శత్రువు. ఖుదా దోస్త్ ను ఎప్పుడూ కాల్చరు. రావణుడు శత్రువు కావున 10 తలల రావణుడిని తయారుచేసి అతడిని ప్రతి సంవత్సరము కాలుస్తారు. గాంధీజీ కూడా - మాకు రామ రాజ్యము కావాలని అనేవారు. రామ రాజ్యములో సుఖముంటుంది, రావణ రాజ్యములో దుఃఖముంటుంది. ఇప్పుడు ఇదంతా ఎవరు కూర్చుని అర్థం చేయిస్తున్నారు? పతిత-పావనుడైన తండ్రి శివబాబా మరియు బ్రహ్మా దాదా. బాబా ఎప్పుడూ - బాప్ దాదా అని సంతకము చేస్తారు. ప్రజాపిత బ్రహ్మా కూడా అందరికీ చెందినవారు, వారిని ఏడమ్ అని అంటారు. వారిని గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. వారు మనుష్య సృష్టికి ప్రజాపిత. ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు తయారవుతారు, తర్వాత బ్రాహ్మణులే దేవీ-దేవతలుగా అవుతారు. దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు, వీరిని ప్రజాపిత బ్రహ్మా, మనుష్య సృష్టికి పెద్ద అని అంటారు. ప్రజాపిత బ్రహ్మాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. బాబా-బాబా అని అంటూ ఉంటారు. వీరు సాకార బాబా. శివబాబా నిరాకార బాబా. ప్రజాపిత బ్రహ్మా ద్వారా కొత్త మనుష్య సృష్టిని రచిస్తారని అంటూ ఉంటారు కూడా. ఇది పతిత ప్రపంచము, రావణ రాజ్యము. ఇప్పుడు రావణుడి ఆసురీ ప్రపంచము సమాప్తమైపోతుంది, దాని కోసమే ఈ మహాభారత యుద్ధము ఉంది. తర్వాత, సత్యయుగములో శత్రువైన ఈ రావణుడిని ఎవ్వరూ కాల్చరు. అక్కడ అసలు రావణుడు ఉండనే ఉండడు. రావణుడే ఈ దుఃఖపు ప్రపంచాన్ని తయారుచేసాడు. ఎవరి వద్దనైతే చాలా ధనముందో, పెద్ద-పెద్ద మహళ్ళు ఉన్నాయో, వారు స్వర్గములో ఉన్నారని కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - కొందరి వద్ద కోట్లు ఉన్నా కానీ శాంతి లేదు, ధనము మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. కొత్త ప్రపంచములో మళ్ళీ కొత్త గనులు వెలువడుతాయి, వాటితో కొత్త ప్రపంచములోని మహళ్ళు మొదలైనవన్నీ తయారుచేయడము జరుగుతుంది. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. సత్యయుగములో వైస్ లెస్, సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. అక్కడ పిల్లలు యోగబలముతో జన్మిస్తారు. వికారాలు అక్కడ ఉండనే ఉండవు. దేహాభిమానమూ ఉండదు, క్రోధమూ ఉండదు, కామమూ ఉండదు. 5 వికారాలు ఉండనే ఉండవు, అందుకే అక్కడ ఎప్పుడూ రావణుడిని కాల్చనే కాల్చరు. ఇక్కడైతే రావణ రాజ్యముంది, అందుకే అందరూ - ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు. వారు ముక్తిదాత కూడా మరియు సర్వుల దుఃఖహర్త. ఇప్పుడు అందరూ రావణ రాజ్యములో ఉన్నారు. తండ్రి వచ్చి విడిపించాల్సి ఉంటుంది.

ఇప్పుడు తండ్రి అంటారు - మీరు పవిత్రముగా అవ్వండి. ఈ పతిత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఎవరైతే శ్రీమతముపై నడుస్తారో, వారు శ్రేష్ఠమైన దేవీ-దేవతలుగా అవుతారు. వినాశనమైతే జరుగుతుంది, అందరూ సమాప్తమైపోతారు. ఇక ఎవరు మిగులుతారు? ఎవరైతే శ్రీమతమనుసారముగా పవిత్రముగా ఉంటారో, వారే తండ్రి మతముపై నడుస్తూ విశ్వ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది కదా. ఇప్పుడైతే రావణ రాజ్యముంది, ఇది సమాప్తమవ్వనున్నది. సత్యయుగీ రామ రాజ్యము స్థాపనవ్వనున్నది. రాముడు అంటే ఆ సీతకు చెందిన రాముడు కాదు. ఈ ప్రపంచమంతా లంకే, ఇందులో రావణ రాజ్యముంది. సత్యయుగములో భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది. అప్పుడు, వేరే ఏ రాజ్యము ఉండేదే కాదు. తండ్రి భారత్ లోకి వచ్చి మళ్ళీ దీనిని బంగారు పిచ్చుకగా, స్వర్గముగా తయారుచేస్తారు. ఇకపోతే, ఇన్ని ధర్మాలేవైతే ఉన్నాయో, అవన్నీ సమాప్తమైపోతాయి. సముద్రము కూడా ఉప్పొంగుతుంది. బొంబాయి ఎలా ఉండేది, ఒక చిన్న గ్రామముగా ఉండేది. ఇప్పుడు సత్యయుగ స్థాపన జరుగుతుంది. అప్పుడిక, బొంబాయి మొదలైనవి ఉండవు. సత్యయుగములో చాలా కొద్దిమంది మనుష్యులుంటారు. ఢిల్లీ రాజధానిగా ఉంటుంది, అక్కడ లక్ష్మీ-నారాయణుల రాజ్యముంటుంది. ఢిల్లీ సత్యయుగములో పరిస్తాన్ గా ఉండేది. ఢిల్లీలోనే సింహాసనముండేది. రామ రాజ్యములో కూడా ఢిల్లీయే రాజధానిగా ఉంటుంది. కానీ రామ రాజ్యములో వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి, అపారమైన సుఖముండేది. తండ్రి అంటారు - మీరు విశ్వ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, నేను మళ్ళీ ఇస్తాను. మీరు నా మతముపై నడవండి. శ్రేష్ఠముగా తయారవ్వాలంటే కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయండి, ఇతర ఏ దేహధారులను స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు, మీరు నా వద్దకు వచ్చేస్తారు. మీరు నా మెడలోని మాలగా అయి, తర్వాత విష్ణు మెడలోని మాలగా అవుతారు. మాలలో పైన నేనున్నాను, తర్వాత యుగళులైన బ్రహ్మా-సరస్వతులు ఉన్నారు. వారే సత్యయుగ మహారాజు-మహారాణిగా అవుతారు. తర్వాత ఎవరైతే నంబరువారుగా సింహాసనముపై కూర్చుంటారో, వారి మాల అంతా ఉంటుంది. నేను భారత్ ను ఈ బ్రహ్మా-సరస్వతులు మరియు బ్రాహ్మణుల ద్వారా స్వర్గముగా తయారుచేస్తాను. ఎవరైతే కృషి చేస్తారో, వారి స్మృతిచిహ్నాలు తయారవుతాయి. ఆత్మలు నివసించే స్థానము పరంధామము, దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. ఆత్మలమైన మనమందరము అక్కడ స్వీట్ హోమ్ లో తండ్రితో పాటు నివసిస్తాము. అది శాంతిధామము. మనుష్యులు తాము ముక్తిధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అందరూ పాత్రలోకి రావాల్సిందే. అప్పటివరకు తండ్రి మిమ్మల్ని తయారుచేస్తూ ఉంటారు. మీరు తయారైపోతే, అక్కడ ఉన్న ఆత్మలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, అప్పుడిక సమాప్తి జరుగుతుంది. మీరు వెళ్ళి కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు, మళ్ళీ నంబరువారుగా చక్రము తిరుగుతుంది.

పాటలో కూడా విన్నారు కదా - చివరికి నేటికి ఆ రోజు రానే వచ్చింది. భక్తి మార్గములో భ్రమిస్తూ ఉండేవారు. తండ్రి జ్ఞానసూర్యుడు. జ్ఞానసూర్యుడు ఉదయించినప్పుడు అజ్ఞానాంధకారము సమాప్తమైపోతుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. నరకవాసులుగా ఉన్న భారతవాసులు మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారని మీకు తెలుసు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. చాలా తక్కువగా అర్థం చేయించాలి, అల్ఫ్ అనగా బాబా, బే అనగా రాజ్యాధికారము. బాబా ద్వారా రాజ్యాధికారము లభిస్తుంది, గాడిద చాకిరీ సమాప్తమైపోతుంది. ఆ కథను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇదే సత్యమైన సత్యనారాయణుడి కథ. మిగిలినవన్నీ కల్పిత కథలు. బాబాయే నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకని ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడు మొదలయ్యింది, ఎప్పటివరకు కొనసాగింది అనేదానికి సంబంధించిన చరిత్ర-భౌగోళికాలు ఉన్నాయి కదా. కావున ఇది కథ కూడా అయినట్లు కదా! ఎవరైతే విశ్వముపై రాజ్యము చేసేవారో, వారు 84 జన్మలు తీసుకుని పూర్తిగా తమోప్రధానముగా అయిపోయారు.

ఇప్పుడు తండ్రి అంటారు - నేను ఆ రాజ్యాన్నే మళ్ళీ స్థాపన చేస్తాను. మీరు పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా ఎలా అవుతారో, ఆ మొత్తం చరిత్ర-భౌగోళికమంతటినీ అర్థం చేయిస్తారు. మొట్టమొదట సూర్యవంశీయుల రాజ్యము ఉంటుంది, తర్వాత చంద్ర వంశీయులది ఉంటుంది... ఆ తర్వాత ఇతర ధర్మాలు, బౌద్ధులు, ఇస్లాములు, తర్వాత క్రిస్టియన్లు వచ్చారు. అప్పుడు, దేవీ-దేవతా ధర్మము ఏదైతే ఉండేదో, అది మాయమైపోయింది. మళ్ళీ ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి. శాస్త్రాలలో బ్రహ్మా ఆయువును 100 సంవత్సరాలుగా చూపించడం జరిగింది. ఏ బ్రహ్మాలోనైతే తండ్రి కూర్చుని వారసత్వాన్ని ఇస్తారో, వారి శరీరము కూడా అంతమైపోతుంది. ఆత్మల తండ్రి కూర్చుని ఆత్మలకు వినిపిస్తారు, వారే పతిత-పావనుడు. మనుష్యులు మనుష్యులను పావనముగా చేయలేరు. ఎవరైతే స్వయమే విముక్తులుగా అవ్వలేరో, వారు ఇతరులను విముక్తులుగా ఎలా చేస్తారు. వారంతా భక్తిని నేర్పించే అనేకమంది గురువులు. ఫలానా వారి భక్తి చేయమని కొంతమంది అంటారు, శాస్త్రాలను వినమని కొంతమంది అంటారు. అనేకానేక మత-మతాంతరాలు ఉన్నాయి, అందుకే అందరూ మరింత వివేకహీనులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి వచ్చి వివేకవంతులుగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు వివేకవంతులుగా, విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడు ఎంత నిరుపేదగా అయిపోయారు. మళ్ళీ శివబాబా వచ్చి నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారుచేస్తారు. తండ్రి వచ్చి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, దానితో ఇక్కడ భాగ్యము మేలుకుంటుంది. తండ్రి వచ్చేదే మనుష్యమాత్రుల భాగ్యాన్ని మేలుకొలిపేందుకని. అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు కదా. అందరూ ఆర్తనాదాలు చేస్తూ వినాశనమైపోతారు. అందుకే, బాబా అంటారు - ఆర్తనాదాలు మొదలవ్వక ముందే అనంతమైన తండ్రి నుండి కొంత వారసత్వమైనా తీసుకోండి. ఈ ప్రపంచములో ఏదైతే చూస్తున్నారో, అదంతా సమాప్తమవ్వనున్నది. భారత్ యొక్క పతనము, భారత్ యొక్క ఉన్నతి అని అంటారు. ఇదంతా భారత్ కు సంబంధించిన ఆట. సత్యయుగములో ఉన్నతముగా ఉంటుంది. ఇప్పుడు కలియుగములో పతనము అవ్వనున్నది. ఇదంతా రావణ రాజ్యము యొక్క ఆర్భాటము. ఇప్పుడు వినాశనము జరగనున్నది. ప్రపంచ పతనము, ప్రపంచ ఉన్నతి అని అంటారు. సత్యయుగములో ఎవరెవరు రాజ్యము చేస్తారు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. భారత్ యొక్క ఉన్నతి అనగా దేవతల రాజ్యము. భారత్ యొక్క పతనము అనగా రావణ రాజ్యము. ఇప్పుడు కొత్త ప్రపంచము తయారవుతూ ఉంది. పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. దానికంటే ముందు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు చదువుకుంటున్నారు. ఇది ఎంత సహజము. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువు. సన్యాసులది నివృత్తి మార్గము. ఆ ధర్మమే వేరు. వారు గృహస్థ వ్యవహారాన్ని వదిలి వెళ్ళిపోతారు, వారిది హద్దు సన్యాసము. మీరు ఈ పాత ప్రపంచాన్ని సన్యసించి, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేది లేదు. ఏయే ధర్మాలు ఎప్పుడు వస్తాయనేది కూడా మంచి రీతిలో అర్థం చేయించాలి. ద్వాపరము తర్వాతనే ఇతర ధర్మాలు వస్తాయి. ముందు సుఖము, ఆ తర్వాత దుఃఖము అనుభవిస్తారు. ఈ చక్రమంతటినీ బుద్ధిలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఎప్పటినుండైతే మీరు చక్రములోకి వస్తారో, అప్పటినుండి మహారాజు-మహారాణిగా అవుతారు. కేవలం భగవంతుడు మరియు రాజ్యాధికారము గురించి అర్థం చేయించాలి.

బాబా విదేశాలకు వెళ్ళేందుకు ఎవ్వరినీ కాదనరు. తమ మృత్యువు తమ దేశములోనే సంభవించాలని అందరూ కోరుకుంటారు. ఇప్పుడు వినాశనమైతే అయ్యేదే ఉంది, ఎంత హంగామా జరుగుతుందంటే ఇక విదేశాల నుండి తిరిగి రాలేకపోతారు కూడా, అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఏ భారత భూమిలోనైతే తండ్రి వచ్చి అవతరిస్తారో, అది అన్నింటికన్నా ఉత్తమమైనది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కేవలం శ్రీకృష్ణుని పేరు వేయడముతో మహిమ అంతా సమాప్తమైపోయింది. మనుష్యమాత్రులందరి ముక్తిదాత ఇక్కడికి వచ్చి అవతరిస్తారు. గాడ్ ఫాదర్ యే వచ్చి విముక్తులుగా చేస్తారు. కావున అటువంటి తండ్రికి నమస్కరించాలి, వారి జయంతిని జరుపుకోవాలి. కానీ శ్రీకృష్ణుని పేరు వేయడముతో మొత్తం విలువంతటినీ మాయం చేసేసారు. లేదంటే భారత్ అన్నింటికన్నా ఉన్నతమైన తీర్థ స్థానము. ఆ తండ్రి ఇక్కడికే వచ్చి అందరినీ పావనముగా తయారుచేస్తారు. కావున ఇది అన్నింటికంటే పెద్ద తీర్థ స్థానము అయినట్లు. అందరినీ దుర్గతి నుండి విడిపించి సద్గతినిస్తారు. ఈ డ్రామా తయారై ఉంది. మన బాబా ఈ శరీరము ద్వారా ఈ రహస్యాలను అర్థం చేయిస్తున్నారని ఇప్పుడు ఆత్మలైన మీకు తెలుసు. ఆత్మలమైన మనము ఈ శరీరము ద్వారా వింటాము. ఆత్మాభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తుప్పు వదులుతూ ఉంటుంది మరియు పవిత్రముగా అయి మీరు తండ్రి వద్దకు వచ్చేస్తారు. ఎంత స్మృతి చేస్తే, అంత పవిత్రముగా అవుతారు. ఇతరులను కూడా తమ సమానముగా తయారుచేసినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి, ఉన్నత పదవిని పొందుతారు, అందుకే సెకెండులో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి మెడలోని మాలగా అయి విష్ణు మెడలో కూర్చబడేందుకు సంపూర్ణ సతోప్రధానముగా తయారవ్వాలి. ఒక్క తండ్రి మతముపై నడవాలి.

2. ఎటువంటి సేవ చేయాలంటే తద్వారా అనేకాత్మల ఆశీర్వాదాలు లభించాలి. ఆర్తనాదాలు జరిగే కన్నా ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.

వరదానము:-
స్నేహీలుగా అయ్యే గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకుని అందరినీ సంతుష్టపరిచే రాజయుక్త, యోగయుక్త భవ

ఏ పిల్లలైతే ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రికి స్నేహీలుగా అయి ఉంటారో, వారు సర్వాత్మలకు స్నేహీలుగా స్వతహాగానే అవుతారు. ఈ గుహ్యమైన రహస్యాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారు రాజయుక్తులుగా, యోగయుక్తులుగా మరియు దివ్యగుణాలతో యుక్తియుక్తులుగా అవుతారు. ఇటువంటి రాజయుక్త ఆత్మ సర్వాత్మలను సహజముగానే రాజీ చేస్తుంది. ఎవరికైతే ఈ రహస్యము తెలియదో, వారు ఒక్కోసారి ఇతరులను అసంతుష్టపరుస్తారు, ఒక్కోసారి స్వయం అసంతుష్టులుగా అవుతారు, అందుకే సదా స్నేహీలుగా అయ్యే రహస్యాన్ని తెలుసుకుని రాజయుక్తులుగా అవ్వండి.

స్లోగన్:-
ఎవరైతే నిమిత్తులుగా ఉంటారో, వారు బాధ్యతను సంభాళిస్తూ కూడా సదా తేలికగా ఉంటారు.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

బాప్ దాదా సదా పెద్ద మనసు కలవారు, అనంతమైన మనసు కలవారు, అందుకే వారు సర్వుల మనసును తీసుకునే మనోభిరాముడు. అలా పిల్లలు కూడా అనంతమైన, విశాలమైన మనసు కలవారు, దాతాతనపు మనసు కలవారు, సదా మనసును సంతోషముగా ఉంచుకుంటూ ప్రపంచాన్ని సంతోషపరిచే అదృష్టవంతులైన ఆత్మలు. శ్రేష్ఠ ఆత్మలైన మీరే ప్రపంచానికి ఆధారము. మీరందరూ మేలుకుని ఉన్న వెలిగే జ్యోతులుగా అయినట్లయితే ప్రపంచములోనివారు కూడా మేలుకుంటారు. మీ అందరిదీ ఎక్కే కళగా ఉన్నట్లయితే సర్వాత్మల కళ్యాణము జరుగుతుంది.