12-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు చాలా ఉన్నతమైన జాతికి చెందినవారు,
మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి, అందుకే అశుద్ధమైన వికారీ అలవాట్లను
తొలగించుకోవాలి’’
ప్రశ్న:-
ఈ చదువుకు ఏ
విషయముతో కనెక్షన్ లేదు?
జవాబు:-
ఈ చదువుకు
డ్రెస్ మొదలైనవాటితో కనెక్షన్ లేదు, ఇందులో డ్రెస్ మార్చుకోవాల్సిన విషయమేమీ లేదు.
తండ్రి అయితే ఆత్మలను చదివిస్తారు. ఇది పాత పతిత శరీరమని ఆత్మకు తెలుసు, దీనికి
ఎలాంటి సాధారణ వస్త్రాలను ధరింపజేసినా పర్వాలేదు. శరీరము మరియు ఆత్మ, రెండూ నల్లగా
ఉన్నాయి. తండ్రి నల్లగా ఉన్నవారినే తెల్లగా తయారుచేస్తారు.
ఓంశాంతి
ఆత్మిక పాఠశాలలో ఆత్మిక తండ్రి ఎదురుగా ఆత్మిక పిల్లలు కూర్చుని ఉన్నారు. ఇది భౌతిక
పాఠశాల కాదు. ఆత్మిక పాఠశాలలో ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు రాజయోగాన్ని
నేర్పిస్తున్నారు. మనము మళ్ళీ నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు అనగా దేవీ-దేవతా
పదవిని ప్రాప్తి చేసుకునేందుకు ఆత్మిక తండ్రి వద్ద కూర్చున్నామని పిల్లలైన మీకు
తెలుసు. ఇది కొత్త విషయము. ఒకప్పుడు లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని, వారు డబల్
కిరీటధారులుగా ఉండేవారని కూడా మీకు తెలుసు. ఆ సమయములో లైట్ కిరీటము మరియు రత్నజడిత
కిరీటము, రెండూ ఉండేవి. మొట్టమొదటగా లైట్ కిరీటముంటుంది. ఎవరైతే ఉండి వెళ్ళారో,
వారికి తెల్లని లైట్ ను చూపిస్తారు. ఇది పవిత్రతకు గుర్తు. అపవిత్రులకు ఎప్పుడూ లైట్
ను చూపించరు. మీకు ఫోటో తీసినప్పుడు అందులో లైట్ ను చూపించలేరు. ఇది పవిత్రతకు
గుర్తుగా చూపిస్తారు. లైట్ మరియు చీకటి ఉంటాయి, బ్రహ్మా పగలు లైట్, బ్రహ్మా రాత్రి
చీకటి. చీకటి అనగా వారికి లైట్ ఉండదు. తండ్రియే వచ్చి ఇంతమంది పతితులను అనగా ఎవరైతే
పూర్తి నల్లగా అయిపోయారో, వారందరినీ పావనముగా తయారుచేస్తారని పిల్లలైన మీకు తెలుసు.
ఇప్పుడు పవిత్ర రాజధాని లేదు. సత్యయుగములో యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ
పవిత్రముగా ఉండేవారు. అక్కడ ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. ఈ చిత్రాన్ని చూపించి
పిల్లలైన మీరు చాలా బాగా అర్థం చేయించాలి. ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. అర్థం
చేయించేందుకు ఇంకా మంచి చిత్రాలున్నాయి, అందుకే ఇన్ని చిత్రాలను ఉంచడము జరుగుతుంది.
మనము ఈ స్మృతియాత్రతో తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతామని, తర్వాత
ముక్తి-జీవన్ముక్తిలలోకి వెళ్ళిపోతామని మనుష్యులెవ్వరూ వెంటనే అర్థం చేసుకోరు.
జీవన్ముక్తి అని దేనినంటారు అనేది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీ-నారాయణుల
రాజ్యము ఎప్పుడుండేది అనేది కూడా ఎవరికీ తెలియదు. మనము తండ్రి నుండి పవిత్రత యొక్క
దైవీ స్వరాజ్యాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. మీరు చిత్రాలను చూపిస్తూ
చాలా బాగా అర్థం చేయించవచ్చు. భారత్ లోనే డబల్ కిరీటధారులను పూజిస్తారు. దీనికి
సంబంధించిన చిత్రము కూడా మెట్ల వరుస చిత్రములో ఉంది. మిగతావారికి స్థూల
కిరీటముంటుంది కానీ లైట్ కిరీటము ఉండదు. పవిత్రులకే పూజ జరుగుతుంది. లైట్ పవిత్రతకు
గుర్తు. అలాగని ఎవరైనా సింహాసనముపై కూర్చోగానే లైట్ వస్తుందని కాదు. అలా కాదు. ఇది
పవిత్రతకు గుర్తు. మీరు ఇప్పుడు పురుషార్థులు, అందుకే మీకు లైట్ ను చూపించలేము.
దేవీ-దేవతలకు ఆత్మ మరియు శరీరము, రెండూ పవిత్రముగా ఉంటాయి. ఇక్కడైతే ఎవరికీ
పవిత్రమైన శరీరము లేదు, అందుకే లైట్ ను చూపించలేము. మీలో కూడా, కొందరైతే పూర్తి
పవిత్రముగా ఉంటారు, కొందరు సెమీ (సగం) పవిత్రముగా ఉంటారు. మాయా తుఫానులు చాలా వస్తే,
వారిని సెమీ పవిత్రులని అంటారు. కొందరైతే పూర్తిగా పతితులుగా అయిపోతారు. మేము
పతితులుగా అయ్యామని వారు స్వయం కూడా అర్థం చేసుకుంటారు. ఆత్మయే పతితముగా అవుతుంది,
అప్పుడు లైట్ ను చూపించలేము.
మేము ఉన్నతోన్నతమైన తండ్రి సంతానమని పిల్లలైన మీరు మర్చిపోకూడదు, మరి ఎంత రాయల్టీ
ఉండాలి. ఎవరైనా ఊడ్చే పని చేసేవారు ఎం.ఎల్.ఏ గా లేక ఎం.పి గా అయితే లేక చదువుకుని
ఏదైనా మంచి పొజిషన్ కు చేరుకుంటే, అతను టిప్ టాప్ గా తయారవుతారు. ఈ విధముగా చాలామంది
తయారయ్యారు. వారి జాతి అదే కానీ పొజిషన్ లభించడముతో నషా కలుగుతుంది. ఇక డ్రెస్
మొదలైనవి కూడా అటువంటివే ధరిస్తారు. అలాగే ఇప్పుడు మీరు కూడా పతితుల నుండి పావనముగా
తయారయ్యేందుకు చదువుకుంటున్నారు. వారు కూడా చదువు ద్వారా డాక్టరు, బ్యారిస్టరు
మొదలైనవారిగా అవుతారు కానీ వారు పతితులే కదా, ఎందుకంటే వారి చదువేమీ పావనముగా
తయారుచేసేది కాదు. మనము భవిష్యత్తులో పవిత్ర దేవీ-దేవతలుగా తయారవుతామని మీకు తెలుసు
కనుక శూద్రత్వము యొక్క అలవాట్లు తొలగుతూ ఉంటాయి. లోలోపల, మమ్మల్ని పరమపిత పరమాత్మ
డబల్ కిరీటధారులుగా తయారుచేస్తున్నారనే నషా ఉండాలి. మనము శూద్రుల నుండి
బ్రాహ్మణులుగా అవుతాము, తర్వాత దేవతలుగా అవుతాము కనుక ఆ అశుద్ధమైన వికారీ అలవాట్లు
తొలగిపోతాయి. ఆసురీ వస్తువులన్నింటినీ వదిలేయాల్సి ఉంటుంది. ఊడ్చే పని చేసేవారు
ఎం.పి.గా అయినప్పుడు, అతని జీవన శైలి, ఇల్లు మొదలైనవన్నీ ఫస్ట్ క్లాస్ గా అవుతాయి.
వారిది ఈ సమయము కోసమే ఉంటుంది. మనము భవిష్యత్తులో ఎలా తయారవ్వనున్నాము అనేది మీకు
తెలుసు. మీతో మీరు ఇలా మాట్లాడుకోవాలి - మేము ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా అయ్యాము
అని. మీరు కూడా శూద్ర జాతికి చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు విశ్వానికి యజమానులుగా
అవుతారు. ఎవరైనా ఉన్నత పదవిని పొందినప్పుడు, ఆ నషా ఉంటుంది కదా. మరి మీరు కూడా ఎలా
ఉండేవారు? (పతితులుగా) ఛీ-ఛీగా ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడు చదివించి
అనంతమైన యజమానులుగా తయారుచేస్తారు. పరమపిత పరమాత్మ తప్పకుండా ఇక్కడికే వచ్చి
రాజయోగాన్ని నేర్పిస్తారని కూడా మీరు అర్థం చేసుకుంటారు. మూలవతనము లేక
సూక్ష్మవతనములోనైతే నేర్పించరు. మీరంతా దూరదేశములో నివసించే ఆత్మలు, ఇక్కడకు వచ్చి
పాత్రను అభినయిస్తారు. 84 జన్మల పాత్రను అభినయించాల్సిందే. వారు 84 లక్షల యోనులని
అంటారు. ఎంతటి ఘోర అంధకారములో ఉన్నారు. 5 వేల సంవత్సరాల క్రితం మనము దేవీ-దేవతలుగా
ఉండేవారమని, ఇప్పుడు పతితులుగా అయ్యామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఓ
పతిత-పావనా రండి, మమ్మల్ని పావనముగా చేయండి అని పాడుతారు కూడా, కానీ అర్థం చేసుకోరు.
ఇప్పుడు స్వయంగా తండ్రి పావనముగా తయారుచేయడానికి వచ్చారు. వారు రాజయోగాన్ని
నేర్పిస్తున్నారు. చదువు లేకుండా ఎవ్వరూ ఉన్నత పదవిని పొందలేరు. బాబా మనల్ని
చదివించి నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారని మీకు తెలుసు. లక్ష్యము-ఉద్దేశ్యము
ఎదురుగా నిలబడి ఉంది. ప్రజా పదవి లక్ష్యమేమీ కాదు. చిత్రము కూడా లక్ష్మీ-నారాయణులదే
ఉంది. ఎక్కడైనా ఇలాంటి చిత్రాలు పెట్టి చదివిస్తారా? మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా
ఉంది. మనము 84 జన్మలు తీసుకుని పతితులుగా అయ్యాము. మెట్ల వరస చిత్రము చాలా బాగుంది.
ఇది పతిత ప్రపంచము కదా, ఇందులో సాధు-సత్పురుషులంతా ఉన్నారు. స్వయంగా వారు కూడా
పతిత-పావనా రండి అని పాడుతూ ఉంటారు. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచమని అనరు. కొత్త
ప్రపంచము పావన ప్రపంచము. పాత పతిత ప్రపంచములో పావనమైనవారు ఎవరూ ఉండరు.
ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత నషా ఉండాలి. మనము గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్, ఈశ్వరుడు
మనల్ని చదివిస్తున్నారు. తండ్రి వచ్చి పేదవారినే చదివిస్తారు. పేదవారి వస్త్రాలు
మొదలైనవి మురికిగా ఉంటాయి కదా. మీ ఆత్మ చదువుకుంటుంది కదా. ఇది పాత శరీరమని ఆత్మకు
తెలుసు. దీనికి సాధారణ వస్త్రాలు వేసినా పర్వాలేదు. ఇందులో డ్రెస్ మొదలైనవి
మార్చుకోవడము లేక ఆర్భాటము చేసే విషయమేమీ లేదు. ఇక్కడ డ్రెస్ తో ఎలాంటి సంబంధము లేదు.
తండ్రి అయితే ఆత్మలను చదివిస్తారు. శరీరమైతే పతితముగా ఉంది. శరీరానికి ఎంత మంచి
వస్త్రాలు వేసినా కానీ, ఆత్మ మరియు శరీరము పతితముగా ఉన్నాయి కదా. శ్రీకృష్ణుడిని
నల్లగా చూపిస్తారు కదా. ముందు జన్మలో వారి ఆత్మ మరియు శరీరము రెండూ నల్లగా ఉండేవి.
వారు పల్లెటూరి బాలునిగా ఉండేవారు, మీరంతా పల్లెటూరి పిల్లలుగా ఉండేవారు. ప్రపంచములో
మనుష్యమాత్రులంతా అనాథలుగా ఉన్నారు. తండ్రి గురించి తెలియనే తెలియదు. హద్దు తండ్రి
అయితే అందరికీ ఉన్నారు. అనంతమైన తండ్రి బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభించారు. ఇప్పుడు
అనంతమైన తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భక్తి మరియు జ్ఞానము. భక్తి
అంతమైనప్పుడు తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడిది అంతిమము. సత్యయుగములో
ఇవేవీ ఉండవు. ఇప్పుడు పాత ప్రపంచ వినాశనము సమీపముగా చేరుకుంది. పావన ప్రపంచాన్ని
స్వర్గమని అంటారు. చిత్రాలలో ఎంత స్పష్టముగా అర్థం చేయించబడింది. రాధా-కృష్ణులే
మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇరువురూ వేర్వేరు
రాజధానులకు చెందినవారని మీకు తెలుసు. మీరు స్వర్గము యొక్క స్వయంవరాన్ని కూడా చూసారు.
పాకిస్తాన్ లో పిల్లలైన మిమ్మల్ని ఆహ్లాదపరిచేందుకు అన్ని రకాల వాయిద్యాలు ఉండేవి,
మీకు అన్ని సాక్షాత్కారాలు కలిగేవి.
మనము రాజయోగము నేర్చుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు, ఇది మర్చిపోకూడదు. వంట పని
చేస్తున్నా లేక పాత్రలు శుభ్రం చేస్తున్నా, చదువుకునేది అయితే అందరి ఆత్మే కదా.
ఇక్కడికి అందరూ వచ్చి కూర్చుంటారు, అందుకే పెద్ద-పెద్ద వ్యక్తులు రారు - ఇక్కడ అందరూ
పేదవారే ఉన్నారని అనుకుంటారు కావున వారికి సిగ్గుగా అనిపిస్తుంది. తండ్రి పేదల
పెన్నిధి. కొన్ని సెంటర్లకు ఊడ్చే పని చేసేవారు కూడా వస్తారు. కొందరు ముసల్మానులు
కూడా వస్తారు. తండ్రి అంటారు - దేహ ధర్మాలన్నింటినీ విడిచిపెట్టండి. మేము గుజరాతీలము,
మేము ఫలానావారము - ఇదంతా దేహాభిమానము. ఇక్కడైతే ఆత్మలను పరమాత్మ చదివిస్తారు. తండ్రి
అంటారు - నేను సాధారణ తనువులోకే వచ్చాను కనుక సాధారణమైనవారి వద్దకు సాధారణమైనవారే
వస్తారు. ఇతను వజ్రాల వ్యాపారిగా ఉండేవారని తెలుసు. తండ్రి స్వయంగా గుర్తు
తెప్పిస్తారు - నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తానని కల్పక్రితం కూడా చెప్పాను,
అనేక జన్మల అంతిమములో కూడా అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. మీకు మీ జన్మల గురించి
తెలియదు అని వీరికి (బ్రహ్మాకు) చెప్తారు. కేవలం ఒక్క అర్జునుడికి మాత్రమే గుర్రపు
రథములో కూర్చుని జ్ఞానము ఇవ్వలేదు కదా, దానిని పాఠశాల అని అనరు. ఇది యుద్ధ మైదానము
కాదు, ఇది చదువు. పిల్లలు చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. మనము పూర్తిగా
చదువుకుని డబల్ కిరీటధారులుగా అవ్వాలి. ఇప్పుడైతే ఏ కిరీటము లేదు. భవిష్యత్తులో డబల్
కిరీటధారులుగా అవ్వాలి. ద్వాపరము నుండి లైట్ పోతుంది కనుక సింగిల్ కిరీటముంటుంది.
సింగిల్ కిరీటధారులు డబల్ కిరీటధారులను పూజిస్తారు. ఈ గుర్తు కూడా తప్పకుండా ఉండాలి.
బాబా చిత్రాల గురించి డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు కనుక చిత్రాలు తయారుచేసేవారికి మురళి
పట్ల చాలా అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఎవరికైనా సరే చిత్రాలపై అర్థం చేయించడము
చాలా సహజము. ఉదాహరణకు కాలేజీలో మ్యాప్ చూపించినట్లయితే, యూరోప్ అటువైపు ఉంది,
ఐర్లాండ్ ఇటువైపు ఉంది, లండన్ అటువైపు ఉంది అని బుద్ధిలోకి వస్తుంది. మ్యాప్ నే
చూడలేదంటే, యూరోప్ ఎక్కడుందో వారికెలా తెలుస్తుంది. మ్యాప్ చూస్తే వెంటనే బుద్ధిలోకి
వస్తుంది. పైన పూజ్య డబల్ కిరీటధారులైన దేవీ-దేవతలున్నారని ఇప్పుడు మీకు తెలుసు.
తర్వాత, కిందకు వచ్చినప్పుడు పూజారులుగా అవుతారు. మెట్లు దిగుతారు కదా. ఈ మెట్ల వరస
చిత్రము చాలా సహజముగా ఉంది. ఈ చిత్రాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు. కానీ కొందరి
బుద్ధిలో అసలేమీ కూర్చోదు. వారి భాగ్యమే అలా ఉంటుంది. స్కూల్లో కూడా పాస్ అయ్యేవారు,
ఫెయిల్ అయ్యేవారు ఉంటారు. భాగ్యములో లేకపోతే పురుషార్థము కూడా జరగదు, రోగగ్రస్తులుగా
అవుతారు, ఇక చదువుకోలేరు. కొందరైతే పూర్తిగా చదువుకుంటారు. కానీ, ఎంతైనా అది భౌతిక
చదువు, ఇది ఆత్మిక చదువు. దీని కోసం బంగారు బుద్ధి కావాలి. తండ్రి బంగారము వంటి వారు,
వారు సదా పవిత్రమైనవారు, వారిని స్మృతి చేస్తే మీ ఆత్మ బంగారముగా తయారవుతూ ఉంటుంది.
ఫలానావారు పూర్తి రాతి బుద్ధి కలవారని అంటూ ఉంటారు. ఆ ప్రపంచములో ఈ విధముగా అనరు.
అది స్వర్గముగా ఉండేది. భారత్ స్వర్గముగా ఉండేదని మర్చిపోయారు. ఇది కూడా ఎక్కడైనా
ప్రదర్శనీలలో అర్థం చేయించవచ్చు, తర్వాత వారి చేత రిపీట్ కూడా చేయించవచ్చు.
ప్రొజెక్టరుతో ఇది సాధ్యము కాదు. మొట్టమొదట ఈ త్రిమూర్తి, లక్ష్మీ-నారాయణులు మరియు
మెట్ల వరస చిత్రాలు చాలా అవసరము. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రములో పూర్తి 84 జన్మల
జ్ఞానము ఉంటుంది. పిల్లలకు రోజంతా ఇదే చింతన నడుస్తూ ఉండాలి. ప్రతి సెంటరులోనూ
ముఖ్యమైన చిత్రాలను తప్పకుండా పెట్టాలి. చిత్రాల ద్వారా బాగా అర్థం చేసుకోగలరు.
బ్రహ్మా ద్వారా ఈ రాజధాని స్థాపనవుతుంది. మనము ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలము,
బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలము. ఇంతకుముందు మనము శూద్ర వర్ణానికి చెందినవారిగా
ఉండేవారము, ఇప్పుడు మనము బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా అయ్యాము, తర్వాత దేవతలుగా
తయారవ్వనున్నాము. శివబాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. మన
లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి
యజమానులుగా ఉండేవారు, మరి వీరు మెట్లు ఎలా దిగారు. ఎలా ఉన్నవారు ఎలా తయారవుతారు.
పూర్తిగా అవివేకుల వలె అయిపోతారు. ఈ లక్ష్మీ-నారాయణులు భారత్ లో రాజ్యము చేసేవారు.
మరి తర్వాత ఏమైంది, వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, వారిపై ఎవరైనా విజయము పొందారా, వారు
యుద్ధములో ఎవరినైనా ఓడించారా అని భారతవాసులకు తెలియాలి కదా. వారు ఎవరిపైనా
గెలుపొందలేదు, ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. ఇదంతా మాయకు సంబంధించిన విషయము. రావణ
రాజ్యము ప్రారంభమైంది మరియు 5 వికారాలలో పడి రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, 5
వికారాలపై విజయము పొందడముతో మళ్ళీ అలా తయారవుతారు. ఇప్పుడిది రావణ రాజ్యము యొక్క
ఆర్భాటము. మనము గుప్త రీతిలో మన రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము. మీరు ఎంత
సాధారణమైనవారు. చదివించేవారు ఎంత ఉన్నతోన్నతమైనవారు. నిరాకార తండ్రి పతిత శరీరములోకి
వచ్చి పిల్లలను ఇలా (లక్ష్మీ-నారాయణులుగా) తయారుచేస్తారు. దూరదేశము నుండి పతిత
దేశములోకి, పతిత శరీరములోకి వస్తారు. అది కూడా వారు స్వయాన్ని లక్ష్మీ-నారాయణులుగా
తయారుచేసుకోరు, పిల్లలైన మిమ్మల్ని అలా తయారుచేస్తారు. కానీ అలా తయారయ్యేందుకు
పూర్తి పురుషార్థము చేయరు. రాత్రింబవళ్ళు చదువుకోవాలి మరియు చదివించాలి. బాబా
రోజురోజుకు చాలా సహజమైన యుక్తులను అర్థం చేయిస్తూ ఉంటారు. వివరణ లక్ష్మీ-నారాయణులతో
ప్రారంభించాలి - వారు 84 జన్మలు ఎలా తీసుకున్నారు, వారు ఇప్పుడు అంతిమ జన్మలో
చదువుకుంటున్నారు, తర్వాత వారి వంశము తయారవుతుంది. అర్థం చేయించాల్సిన విషయాలు ఎన్ని
ఉన్నాయి. చిత్రాల కోసం బాబా డైరెక్షన్లు ఇస్తారు. ఏదైనా చిత్రాన్ని తయారుచేస్తే
వెంటనే బాబా వద్దకు పరుగెత్తుకుని రావాలి. బాబా వాటిని సరిదిద్ది, అన్ని డైరెక్షన్లు
ఇస్తారు.
బాబా అంటారు - నేను చక్రవర్తులకే చక్రవర్తిని కనుక హుండీ నిండిపోతుంది. ఏ విషయము
గురించి చింతించాల్సిన అవసరము లేదు. ఇంతమంది పిల్లలు కూర్చుని ఉన్నారు. ఎవరి ద్వారా
హుండీ నింపవచ్చు అనేది బాబాకు తెలుసు. జైపూర్ ను బాగా పైకెత్తాలని బాబాకు ఆలోచన ఉంది.
అక్కడే హఠయోగుల మ్యూజియం ఉంది. మీ రాజయోగ మ్యూజియం కూడా ఎంత బాగా తయారై ఉండాలంటే,
దానిని ఎవరైనా వచ్చి చూడగలగాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పవిత్రమైన జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేయడానికి తమ బుద్ధి రూపీ పాత్రను
బంగారముగా తయారుచేసుకోవాలి. స్మృతి ద్వారానే పాత్ర బంగారముగా అవుతుంది.
2. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కనుక శూద్రత్వానికి సంబంధించిన అలవాట్లు
అన్నింటినీ తొలగించాలి. చాలా రాయల్టీతో ఉండాలి. మేము విశ్వానికి యజమానులుగా
అవుతున్నాము అనే నషాలో ఉండాలి.
వరదానము:-
సంగమయుగములో ఒకటికి వంద రెట్లు ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి
చేసుకునే పదమాపదమ భాగ్యశాలి భవ
సంగమయుగమే ఒకటికి వంద రెట్లు ప్రత్యక్ష ఫలమిచ్చే యుగము,
నేను బాబాకు చెందినవాడిని, నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని అని ఒక్కసారి సంకల్పము
చేసినా సరే మాయాజీతులుగా, విజయులుగా అయ్యే నషా అనుభవం అవుతుంది. శ్రేష్ఠ సంకల్పము
చేయడము - ఇదే బీజము. దీనికి అన్నింటికన్నా పెద్ద ఫలము - స్వయంగా తండ్రి అయిన
పరమాత్మ కూడా సాకార మనుష్య రూపములో కలుసుకోవడానికి వస్తారు, ఈ ఫలములో అన్ని ఫలాలు
వచ్చేస్తాయి.
స్లోగన్:-
ఎవరి ముఖము
మరియు నడవడిక ద్వారా పవిత్రత పర్సనాలిటీ మరియు రాయల్టీ అనుభవం అవుతాయో వారే సత్యమైన
బ్రాహ్మణులు.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
వర్తమాన సమయములో
అనేకాత్మలలో స్వ ఉపకారము చేసుకోవాలన్న కోరిక ఉంది కానీ ధైర్యము మరియు శక్తి లేదు.
అటువంటి నిర్బల ఆత్మలకు ఉపకారము చేయడానికి పరోపకారీ పిల్లలైన మీరు నిమిత్తులు.
ఉపకారము సత్యమైన మనసుతో చెయ్యటము జరుగుతుంది. విశ్వ రాజ్యాధికారులుగా అవ్వాలంటే
స్వ-ఉపకారులుగా అవ్వడముతోపాటు పరోపకారులుగా అవ్వండి.