ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలు ఈ మాటలను విన్నారు మరియు వెంటనే సంతోషములో రోమాలు
నిక్కబొడుచుకుని ఉంటాయి. తమ సౌభాగ్యాన్ని, స్వర్గము యొక్క భాగ్యాన్ని తీసుకునేందుకు
ఇక్కడకు వచ్చారని పిల్లలకు తెలుసు. ఈ విధముగా మరెక్కడా చెప్పరు. మనము తండ్రి నుండి
స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని అనగా స్వర్గాన్ని తయారుచేసే పురుషార్థము
చేస్తున్నామని మీకు తెలుసు. కేవలం స్వర్గవాసులుగా అయ్యేందుకే కాదు, కానీ స్వర్గములో
ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు. స్వర్గము యొక్క
సాక్షాత్కారాన్ని చేయించే తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ నషా కూడా పిల్లలకు
ఎక్కాలి. భక్తి ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. భగవంతుడు భక్తులను ఉద్ధరించేందుకు
వస్తారని అంటారు ఎందుకంటే వారు రావణుడి సంకెళ్ళలో చిక్కుకుని ఉన్నారు. అనేకమంది
మనుష్యులవి అనేక మతాలు ఉన్నాయి. మీరైతే తెలుసుకున్నారు. సృష్టి చక్రము అనాదిగా
రచింపబడిన ఒక ఆటలా ఉంది. వాస్తవానికి మనము ప్రాచీన కొత్త ప్రపంచ నివాసులుగా
ఉండేవారము, ఇప్పుడు పాత ప్రపంచ నివాసులుగా అయ్యాము అని కూడా భారతవాసులు భావిస్తారు.
తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారుచేసారు, రావణుడు మళ్ళీ నరకముగా చేసాడు.
బాప్ దాదా యొక్క మతము అనుసారముగా మీరు ఇప్పుడు మీ కోసం కొత్త ప్రపంచాన్ని తయారు
చేసుకుంటున్నారు. కొత్త ప్రపంచము కోసం చదువుకుంటున్నారు. ఎవరు చదివిస్తున్నారు?
ఎవరికైతే జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు అని మహిమ ఉందో వారు. ఒక్కరికి తప్ప
ఇంకెవ్వరికీ మహిమ చేయడము జరగదు. వారే పతిత-పావనుడు. మనమందరము పతితులము. పావన
ప్రపంచపు స్మృతి ఎవ్వరికీ లేదు. తప్పకుండా 5 వేల సంవత్సరాల క్రితం పావన ప్రపంచము
ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. ఈ భారత్ యే ఉండేది. మిగిలిన ధర్మాలన్నీ శాంతిలో ఉండేవి.
భారతవాసులైన మనము సుఖధామములో ఉండేవారము. మనుష్యులు శాంతిని కోరుకుంటారు కానీ
ఇక్కడైతే ఎవరూ శాంతిగా ఉండలేరు. ఇది శాంతిధామమేమీ కాదు. శాంతిధామము నిరాకారీ
ప్రపంచము, అక్కడి నుండి మనము వస్తాము. ఇకపోతే, సత్యయుగము సుఖధామము, దానిని
శాంతిధామమని అనరు. అక్కడ మీరు పవిత్రత, సుఖ-శాంతులతో ఉంటారు, ఎటువంటి హంగామాలు ఉండవు.
ఇంటిలో పిల్లలు గొడవ చేసినప్పుడు, వారిని శాంతిగా ఉండమని చెప్తారు. తండ్రి
అంటున్నారు, ఆత్మలైన మీరు ఆ శాంతిదేశానికి చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు గొడవల
దేశములోకి వచ్చి కూర్చున్నారు. ఈ విషయము మీ బుద్ధిలో ఉంది. మీరు తండ్రి ద్వారా మళ్ళీ
ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఈ స్కూల్ తక్కువైనదేమీ
కాదు. ఇది గాడ్ ఫాదర్ యొక్క యూనివర్శిటీ. మొత్తము ప్రపంచమంతటిలో ఇది అన్నింటికన్నా
పెద్ద యూనివర్శిటీ. ఇందులో అందరూ తండ్రి నుండి శాంతి మరియు సుఖము యొక్క వారసత్వాన్ని
పొందుతారు. ఒక్క తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ మహిమ లేదు. బ్రహ్మాకు మహిమ లేదు.
తండ్రియే ఈ సమయములో వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. ఇక తర్వాత సుఖమే సుఖముంటుంది.
సుఖ-శాంతులను ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మహిమంతా వారిదే. సత్య, త్రేతాయుగాలలో
ఎవరికీ మహిమ జరగదు. అక్కడైతే రాజధాని నడుస్తూ ఉంటుంది. మీరు వారసత్వాన్ని పొందుతారు,
మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. మహిమ ఎవ్వరికీ లేదు. ఉదాహరణకు క్రైస్ట్ ధర్మ
స్థాపన చేస్తారు, అది వారు చేయాల్సిందే. ధర్మ స్థాపన చేస్తారు, అయినా కూడా కిందకు
దిగుతూనే వస్తారు. ఇక మహిమ ఏముంది? మహిమ కేవలం ఒక్కరికి మాత్రమే ఉంది, వారిని
పతిత-పావనుడు, ముక్తిదాత అని పిలుస్తారు. వారికి క్రైస్ట్, బుద్ధుడు మొదలైనవారు
గుర్తుకువస్తూ ఉంటారని కాదు. స్మృతి ఎంతైనా ఒక్కరినే చేస్తారు, ఓ గాడ్ ఫాదర్ అని
అంటూ తలచుకుంటారు. సత్యయుగములోనైతే ఎవరికీ మహిమ జరగదు. తర్వాత ఈ ధర్మాలు
ప్రారంభమైనప్పుడు తండ్రి మహిమను పాడుతారు మరియు భక్తి ప్రారంభమవుతుంది. డ్రామా ఎలా
తయారై ఉంది, చక్రము ఎలా తిరుగుతుంది అనేది తండ్రికి పిల్లలుగా అయినవారికి మాత్రమే
తెలుసు. తండ్రి రచయిత. వారు కొత్త సృష్టి అయిన స్వర్గాన్ని రచిస్తారు. కానీ అందరూ
అయితే స్వర్గములోకి రాలేరు. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి నుండి
సుఖపు వారసత్వము లభిస్తుంది. ఈ సమయములో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందరూ తిరిగి
వెళ్ళాలి, ఆ తర్వాత సుఖములోకి వస్తారు. పిల్లలైన మీకు చాలా మంచి పాత్ర లభించి ఉంది.
ఏ తండ్రికైతే ఇంతటి మహిమ ఉందో, వారు ఇప్పుడు సమ్ముఖములోకి వచ్చి కూర్చున్నారు మరియు
పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ పిల్లలే కదా. తండ్రి అయితే సదా సంతోషముగా
ఉంటారు. వాస్తవానికి తండ్రి విషయములో ఇలా అనలేము ఎందుకంటే ఒకవేళ వారు సంతోషాన్ని
పొందితే, మరి దుఃఖితులుగా కూడా అవ్వవలసి ఉంటుంది. బాబా అయితే వీటన్నింటికీ
అతీతమైనవారు. బాబా మహిమ ఏదైతే ఉందో, మీ మహిమ కూడా ఈ సమయములో అదే ఉంటుంది, ఆ తర్వాత
భవిష్యత్తులో మీ మహిమ వేరే ఉంటుంది. ఏ విధముగా బాబా జ్ఞాన సాగరుడో, మీరు కూడా అలాగే
ఉన్నారు. మీ బుద్ధిలో సృష్టి చక్రము యొక్క జ్ఞానముంది. తండ్రి సుఖ సాగరుడని, వారి
నుండి అపారమైన సుఖము లభిస్తుందని మీకు తెలుసు. ఈ సమయములో మీరు తండ్రి నుండి
వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి పిల్లలకు ఇప్పుడు శ్రేష్ఠ కర్మలను
నేర్పిస్తున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఉన్నారు, వీరు తప్పకుండా మునుపటి జన్మలో మంచి
కర్మలను చేసారు, అందుకే ఈ పదవిని పొందారు. వీరు రాజ్యాన్ని ఎలా పొందారు అనేది
ప్రపంచములోని వారెవ్వరూ అర్థం చేసుకోరు.
తండ్రి అంటారు, పిల్లలైన మీరు ఇప్పుడు ఈ విధముగా తయారవుతున్నారు. మేము ఈ విధముగా
ఉండేవారము, మళ్ళీ ఈ విధముగా తయారవుతాము అని మీ బుద్ధిలోకి వస్తుంది. తండ్రి కూర్చుని
కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తారు, దాని ద్వారా మనము ఈ విధముగా తయారవుతాము.
వారు శ్రీమతాన్ని ఇస్తారు కావున ఆ శ్రీమతాన్ని తెలుసుకోవాలి కదా. శ్రీమతము ద్వారా
మొత్తం ప్రపంచాన్ని, తత్వాలు మొదలైనవాటన్నింటినీ శ్రేష్ఠముగా తయారుచేస్తారు.
సత్యయుగములో అందరూ శ్రేష్ఠముగా ఉండేవారు. అక్కడ ఎటువంటి హంగామాలు మరియు తుఫానులు
మొదలైనవి ఉండవు. ఎక్కువ చలి గాని, ఎక్కువ వేడి గాని ఉండవు. సదా వసంత ఋతువే ఉంటుంది.
అక్కడ మీరు ఎంత సుఖముగా ఉంటారు. ఖుదా బహిష్త్ ను అనగా స్వర్గాన్ని స్థాపన చేస్తారని
వారు పాడుతారు కూడా. కనుక అందులో ఉన్నత పదవిని పొందే పురుషార్థము చేయాలి. ఎల్లప్పుడూ
- ఫాలో ఫాదర్ మదర్ అని అంటూ ఉంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు
వినాశనమవుతాయి మరియు ఆత్మలమైన మనము తండ్రితో పాటు కలిసి వెళ్తాము. శ్రీమతమనుసారముగా
నడుచుకుంటూ ప్రతి ఒక్కరికీ మార్గాన్ని తెలియజేయాలి.
అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. ఇప్పుడిది నరకము. తప్పకుండా నరకములో ఉండగానే
స్వర్గము యొక్క వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తవుతాయి, మళ్ళీ
మనము మొదటి జన్మను స్వర్గములో తీసుకోవాలి. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి
ఉంది. ఇప్పుడు ఆ విధముగా తయారవ్వాలి. మనమే లక్ష్మీ-నారాయణులుగా అవుతాము. వాస్తవానికి
ఈ చిత్రాల అవసరము లేదు. ఎవరైతే కచ్చాగా ఉంటారో, పదే-పదే మర్చిపోతారో, వారి కోసం
చిత్రాలను పెట్టడము జరుగుతుంది. కొందరు శ్రీకృష్ణుని చిత్రాన్ని పెట్టుకుంటారు.
శ్రీకృష్ణుడిని చూడకుండా స్మృతి చేయలేకపోతారు. చిత్రాలైతే అందరి బుద్ధిలోనూ ఉంటాయి.
మీరు ఎటువంటి చిత్రాలను పెట్టుకోవలసిన అవసరము లేదు. మీరు స్వయాన్ని ఆత్మగా
భావిస్తారు, మీరు మీ చిత్రాన్ని కూడా మర్చిపోవాలి. దేహ సహితముగా అన్ని సంబంధాలను
మర్చిపోవాలి. తండ్రి అంటారు, మీరు ఒక్క ప్రియునికి ప్రేయసులు. ప్రియుడైన తండ్రి
అంటారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఎటువంటి అవస్థ
ఉండాలంటే, శరీరాన్ని విడిచిపెట్టే సమయములో, నేను ఈ పాత ప్రపంచాన్ని వదిలి ఇప్పుడు
తండ్రి వద్దకు వెళ్తాను అని భావించాలి. 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు వెళ్ళాలి.
తండ్రి ఆజ్ఞాపించారు - నన్ను స్మృతి చేయండి. కేవలం తండ్రిని మరియు స్వీట్ హోమ్ ను
స్మృతి చేయండి. ఆత్మనైన నేను శరీరము లేకుండా ఉండేవాడిని, తర్వాత ఇక్కడ పాత్రను
అభినయించేందుకు శరీరాన్ని ధారణ చేసాను అని బుద్ధిలో ఉంది. పాత్రను
అభినయిస్తూ-అభినయిస్తూ పతితముగా అయిపోయాము. ఈ శరీరమైతే ఒక పాత చెప్పు. ఆత్మ
పవిత్రముగా అవుతూ ఉంది. పవిత్రమైన శరీరమైతే ఇక్కడ లభించజాలదు. ఇప్పుడు ఆత్మలమైన మనము
తిరిగి ఇంటికి వెళ్తాము. ముందు రాకుమార, రాకుమారీలుగా అవుతారు, స్వయంవరము తర్వాత
లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. రాధ-కృష్ణులు ఎవరు అనేది మనుష్యులకు తెలియదు. వారివురూ
వేర్వేరు రాజధానులకు చెందినవారు, ఆ తర్వాత వారి స్వయంవరము జరుగుతుంది. పిల్లలైన మీరు
ధ్యానములో స్వయంవరాన్ని చూసారు. ప్రారంభములో చాలా సాక్షాత్కారాలు కలిగేవి, ఎందుకంటే
పాకిస్తాన్ లో మిమ్మల్ని సంతోషపరిచేందుకని ఈ పాత్ర అంతా నడిచేది. చివరిలోనైతే
కొట్లాటలే ఉంటాయి. భూకంపాలు మొదలైనవి చాలా జరుగుతాయి. మీకు సాక్షాత్కారాలు అవుతూ
ఉంటాయి. మేము ఎటువంటి పదవిని పొందుతాము అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది.
అప్పుడిక, ఎవరైతే తక్కువగా చదువుకుని ఉంటారో, వారు చాలా పశ్చాత్తాపపడతారు. తండ్రి
అంటారు, నీవూ చదువుకోలేదు, ఇతరులనూ చదివించలేదు, స్మృతిలో కూడా ఉండేవాడివి కాదు.
స్మృతి ద్వారానే సతోప్రధానముగా అవ్వగలరు. పతిత-పావనుడు అయితే తండ్రి మాత్రమే. వారు
అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ మాలిన్యము తొలగిపోతుంది. స్మృతియాత్ర
యొక్క పురుషార్థము చేయాలి. వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి. కర్మలనైతే చేయవలసిందే కదా.
కానీ బుద్ధియోగము అక్కడ ఉండాలి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఇక్కడే తయారవ్వాలి.
గృహస్థ వ్యవహారములో ఉంటూ మీరు నన్ను స్మృతి చేయండి, అప్పుడే మీరు కొత్త ప్రపంచానికి
యజమానులుగా అవుతారు. తండ్రి ఇంకే కష్టము ఇవ్వరు. మీకు చాలా సహజమైన ఉపాయాన్ని
తెలియజేస్తారు. సుఖధామానికి యజమానులుగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయండి.
ఇప్పుడు మీరు స్మృతి చేయండి - బాబా కూడా నక్షత్రమే. వారు సర్వశక్తివంతుడని, చాలా
తేజోమయుడని మనుష్యులు భావిస్తారు. తండ్రి అంటారు, నేను మనుష్య సృష్టికి చైతన్య
బీజరూపుడిని. బీజమునైన కారణముగా సృష్టి ఆదిమధ్యాంతాలు నాకు తెలుసు. మీరు బీజము కాదు,
నేను బీజాన్ని, అందుకే నన్ను జ్ఞాన సాగరుడని అంటారు. వారు మనుష్య సృష్టి యొక్క
చైతన్య బీజము, ఈ సృష్టి చక్రమెలా తిరుగుతుంది అనేది తప్పకుండా వారికి తెలుస్తుంది.
ఋషులు, మునులు మొదలైనవారెవ్వరికీ రచయిత మరియు రచనల యొక్క ఆదిమధ్యాంతాలను గురించి
తెలియదు. ఒకవేళ పిల్లలకు ఈ విషయము తెలిసినట్లయితే, వారు తండ్రి వద్దకు వెళ్ళడానికి
సమయము పట్టదు. కానీ తండ్రి వద్దకు వెళ్ళే మార్గము ఎవ్వరికీ తెలియదు. పావన
ప్రపంచములోకి అసలు పతితులు ఎలా వెళ్ళగలరు, అందుకే తండ్రి అంటారు, కామమనే
మహాశత్రువుపై విజయము పొందండి. ఇదే మీకు ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. పిల్లలైన
మీకు ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, ఎటువంటి కష్టము లేదు. కేవలం తండ్రిని మరియు
వారసత్వాన్ని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారా అనగా యోగము ద్వారా పాపాలు
భస్మమవుతాయి. సెకెండులో తండ్రి ద్వారానే రాజ్యాధికారము లభిస్తుంది. పిల్లలు
స్వర్గములోకైతే వస్తారు కానీ స్వర్గములో కూడా ఉన్నత పదవిని పొందాలి, దాని కోసం
పురుషార్థము చేయాలి. స్వర్గములోకైతే వెళ్ళాల్సిందే. కొద్దిగా విన్నా సరే, తండ్రి
వచ్చారని అర్థం చేసుకుంటారు. ఇది అదే మహాభారత యుద్ధమని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు.
పిల్లలకు రాజయోగాన్ని నేర్పించేందుకు తప్పకుండా తండ్రి కూడా ఉంటారు కదా. మీరు
అందరినీ మేలుకొలుపుతూ ఉంటారు. ఎవరైతే అనేకులను మేలుకొలుపుతారో, వారు ఉన్నత పదవిని
పొందుతారు. పురుషార్థము చేయాలి. అందరూ ఒకే రకమైన పురుషార్థులుగా కాలేరు. ఇది చాలా
పెద్ద స్కూల్. ఇది వరల్డ్ యూనివర్శిటీ. మొత్తము ప్రపంచమంతటినీ సుఖధామముగా మరియు
శాంతిధామముగా తయారుచేయాలి. ఇటువంటి టీచర్ ఎక్కడైనా ఉంటారా. యూనివర్స్ అని మొత్తము
ప్రపంచాన్ని అంటారు. తండ్రియే మొత్తము యూనివర్స్ యొక్క మనుష్యమాత్రులను
సతోప్రధానముగా తయారుచేస్తారు అనగా స్వర్గాన్ని తయారుచేస్తారు.
భక్తి మార్గములో ఏవైతే పండుగలను జరుపుకుంటారో, అవన్నీ ఇప్పటి సంగమయుగానికి
చెందినవే. సత్య, త్రేతాయుగాలలో ఎటువంటి పండుగలు ఉండవు. అక్కడైతే ప్రారబ్ధాన్ని
అనుభవిస్తారు. పండుగలన్నీ ఇక్కడ జరుపుకుంటారు. హోలీ మరియు ధురియా, ఇవి జ్ఞానానికి
సంబంధించిన విషయాలు. గతంలో జరిగినదానికి సంబంధించి పండుగలన్నీ జరుపుకుంటూ వచ్చారు.
అవన్నీ ఈ సమయానికి చెందినవే. హోలీ కూడా ఈ సమయానికి చెందినదే. ఈ 100 సంవత్సరాల లోపల
అన్ని పనులు జరిగిపోతాయి. సృష్టి కూడా కొత్తగా తయారైపోతుంది. మనము అనేక సార్లు సుఖము
యొక్క వారసత్వాన్ని తీసుకున్నాము, మళ్ళీ పోగొట్టుకున్నాము అని మీకు తెలుసు. మనము
మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని సంతోషము కలుగుతుంది. ఇతరులకు కూడా
మార్గాన్ని తెలియజేయాలి. డ్రామానుసారముగా స్వర్గ స్థాపన తప్పకుండా జరగనున్నది.
ఎలాగైతే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తుందో, అదే విధముగా కలియుగము
తర్వాత తప్పకుండా సత్యయుగము రానున్నది. మధురాతి మధురమైన పిల్లల బుద్ధిలో సంతోషపు
భజంత్రీలు మోగాలి. ఇప్పుడు సమయము పూర్తవుతుంది, మనము శాంతిధామానికి వెళ్తాము. ఇది
అంతిమ జన్మ. కర్మ భోగాన్ని అనుభవించడము కూడా సంతోషములో తేలికైపోతుంది. కొంత
అనుభవించడము ద్వారా, కొంత యోగబలము ద్వారా లెక్కాచారాలు సమాప్తమవ్వనున్నాయి. తండ్రి
పిల్లలకు ఓదార్పును ఇస్తున్నారు, మీ కొరకు సదా సుఖము యొక్క రోజులు వస్తున్నాయి.
వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. శరీర నిర్వహణార్థము ధనమైతే కావాలి కదా. బాబా అర్థం
చేయించారు, వ్యాపారస్థులు ధర్మార్థము ధనము కేటాయిస్తారు. ఎక్కువ ధనము జమ అయినట్లయితే,
ఎంతో దానము చేయవచ్చని భావిస్తారు. ఇక్కడ కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవరైనా
రెండు పైసలు ఇచ్చినా సరే, దానికి రిటర్న్ లో వారికి 21 జన్మల కొరకు చాలా లభిస్తుంది.
ఇంతకుముందు మీరు ఏవైతే దాన-పుణ్యాలు చేసేవారో, దానికి మరుసటి జన్మలో రిటర్న్
లభించేది. ఇప్పుడైతే 21 జన్మల కొరకు ఫలము లభిస్తుంది. పూర్వము సాధు-సన్యాసులు
మొదలైనవారికి ఇచ్చేవారు. ఇప్పుడైతే మీకు తెలుసు, ఇదంతా సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు
నేను సమ్ముఖములోకి వచ్చాను కావున ఈ కార్యములో ఉపయోగించండి. అప్పుడు మీకు 21 జన్మల
కొరకు వారసత్వము లభిస్తుంది. ఇంతకుముందు మీరు ఇన్ డైరెక్ట్ గా (పరోక్షముగా)
ఇచ్చేవారు, ఇక్కడ డైరెక్ట్ (ప్రత్యక్షము) గా ఇస్తున్నారు. ఇక మీది మిగిలినదంతా
సమాప్తమైపోతుంది. బాబా అంటూ ఉంటారు - ధనముంటే సెంటర్లు తెరుస్తూ వెళ్ళండి. సత్యమైన
గీతా పాఠశాల అన్న పదాలు వ్రాయండి. భగవానువాచ, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు
వారసత్వాన్ని స్మృతి చేయండి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.