13-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ద్వారా మీకు సృష్టి
ఆదిమధ్యాంతాల జ్ఞానమేదైతే లభించిందో, దానిని మీరు బుద్ధిలో ఉంచుకుంటారు, అందుకే మీరు
స్వదర్శన చక్రధారులు’’
ప్రశ్న:-
ఆత్మను
పావనముగా చేయడానికి ఆత్మిక తండ్రి ఏ ఇంజెక్షన్ ను ఇస్తారు?
జవాబు:-
మన్మనాభవ అనే
ఇంజెక్షన్ ను. ఈ ఇంజెక్షన్ ను ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి అంటారు
- మధురమైన పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేయండి, అంతే. స్మృతితోనే ఆత్మ పావనముగా
అయిపోతుంది. ఇందులో సంస్కృతము మొదలైనవి చదవాల్సిన అవసరము కూడా లేదు. తండ్రి అయితే
హిందీలో స్పష్టమైన పదాలతో వినిపిస్తారు. ఆత్మకు ఎప్పుడైతే, మేము పావనముగా అయ్యేందుకు
ఆత్మిక తండ్రి యుక్తులను తెలియజేస్తున్నారు అన్న నిశ్చయము ఏర్పడుతుందో, అప్పుడు
వికారాలను వదులుతూ వెళ్తుంది.
ఓంశాంతి
ఓం శాంతి అర్థాన్ని అయితే పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది.
నా స్వరూపము శాంతి మరియు నా నివాస స్థానము శాంతిధామము, దానినే పరంధామము,
నిర్వాణధామము అని కూడా అంటారు. దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి,
తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి కూడా అంటారు. వారు పతిత-పావనుడు. నేను ఒక ఆత్మను,
ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాను - అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు డ్రామా
పూర్తవుతుంది, తిరిగి వెళ్ళాలి, అందుకే - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు
వినాశనమవుతాయని అంటారు. దీనినే సంస్కృతములో మన్మనాభవ అని అంటారు. తండ్రి
సంస్కృతములోనేమీ చెప్పలేదు. తండ్రి అయితే ఈ హిందీ భాషలో అర్థం చేయిస్తారు. ఒక్క
హిందీ భాష మాత్రమే ఉండాలని గవర్నమెంట్ అంటుంది. తండ్రి కూడా వాస్తవానికి హిందీలోనే
అర్థం చేయించారు. కానీ ఈ సమయములో అనేక ధర్మాలు, మఠాలు, మార్గాలు ఉన్న కారణముగా అనేక
రకాల భాషలను కూడా సృష్టించారు. సత్యయుగములో ఇక్కడ ఉన్నన్ని భాషలు ఉండవు. గుజరాత్ లో
ఉండేవారి భాష వేరుగా ఉంటుంది. ఎవరు ఏ ఊరిలో ఉంటారో, వారికి అక్కడి భాష తెలుస్తుంది.
అనేకమంది మనుష్యులు ఉన్నారు, అనేక భాషలు ఉన్నాయి. సత్యయుగములోనైతే ఒకే ధర్మము, ఒకే
భాష ఉండేవి. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము బుద్ధిలో ఉంది, ఇది
ఏ శాస్త్రాలలోనూ లేదు. ఈ జ్ఞానము ఉన్నటువంటి శాస్త్రమేదీ లేదు. కల్పము ఆయువు గురించి
కూడా ఎక్కడా వ్రాసి లేదు, ఎవరికీ తెలియదు కూడా. సృష్టి అయితే ఒక్కటే. సృష్టి చక్రము
తిరుగుతూ ఉంటుంది. కొత్తదాని నుండి పాతదిగా, పాతదాని నుండి మళ్ళీ కొత్తదిగా అవుతుంది,
దీనినే స్వదర్శన చక్రమని అంటారు. ఎవరికైతే ఈ చక్రము యొక్క జ్ఞానము ఉంటుందో, వారిని
స్వదర్శన చక్రధారులని అంటారు. ఆత్మకు ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనే జ్ఞానము
ఉంటుంది. వారేమో శ్రీకృష్ణుడికి, విష్ణువుకు స్వదర్శన చక్రాన్ని చూపించారు. కానీ
వారికి ఈ జ్ఞానము ఉండేది కాదని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. సృష్టి
ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తండ్రియే ఇస్తారు. ఇదే స్వదర్శన చక్రము. ఇకపోతే, శిరస్సును
ఖండించే హింస యొక్క విషయమేమీ లేదు. అంతా అసత్యమే వ్రాశారు. ఈ జ్ఞానాన్ని తండ్రి
తప్ప మనుష్యమాత్రులెవరూ ఇవ్వలేరు. బ్రహ్మా-విష్ణు-శంకరులనే దేవతలని అంటున్నప్పుడు,
మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనలేరు. తండ్రికి ఏ మహిమ అయితే ఉందో, అది దేవతలకు కూడా
లేదు. తండ్రి అయితే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తండ్రికి ఏదైతే మహిమ ఉందో,
పిల్లల మహిమ కూడా అదేనని అనరు. పిల్లలు ఎంతైనా పునర్జన్మలు తీసుకుంటారు, తండ్రి
అయితే పునర్జన్మల్లోకి రారు. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. ఉన్నతోన్నతమైనవారు
భగవంతుడు, వారు సదా పావనుడు. పిల్లలు పావనముగా అయి, మళ్ళీ పతితముగా అవుతారు. తండ్రి
అయితే సదా పావనుడే. పిల్లలకు తండ్రి వారసత్వము కూడా తప్పకుండా కావాలి. ఒకటి ముక్తి
కావాలి, రెండు జీవన్ముక్తి కావాలి. శాంతిధామాన్ని ముక్తి అని, సుఖధామాన్ని
జీవన్ముక్తి అని అంటారు. ముక్తి అయితే అందరికీ లభిస్తుంది. ఎవరైతే చదువుకుంటారో,
వారికి జీవన్ముక్తి లభిస్తుంది. భారత్ లో తప్పకుండా జీవన్ముక్తి ఉండేది,
మిగిలినవారంతా ముక్తిధామములో ఉండేవారు. సత్యయుగములో కేవలం భారత ఖండము మాత్రమే ఉండేది,
లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. బాబా అర్థం చేయించారు, అందరికన్నా ఎక్కువగా
లక్ష్మీ-నారాయణుల మందిరాలను నిర్మిస్తారు. బిర్లా మొదలైనవారు ఎవరైతే మందిరాలను
నిర్మిస్తారో, వారికి, లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్యాధికారము ఎక్కడ నుండి లభించింది,
వారు ఎంతకాలం రాజ్యము చేసారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ఏమీ తెలియదు.
కావున బొమ్మల పూజలా ఉన్నట్లు కదా, దీనిని భక్తి అని అంటారు. మీరే పూజ్యులు, మళ్ళీ
మీరే పూజారులు. పూజ్యులకు మరియు పూజారులకు చాలా తేడా ఉంటుంది, దీనికి కూడా
అర్థముంటుంది కదా. ఎవరైతే వికారులుగా ఉన్నారో, వారిని పతితులు అని అంటారు. క్రోధము
కలవారిని పతితులు అని అనరు. ఎవరైతే వికారాల్లోకి వెళ్తారో, వారిని పతితులు అని
అంటారు. ఈ సమయములో మీకు జ్ఞానామృతము లభిస్తుంది. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే.
బాబా అర్థం చేయించారు - ఈ భారత్ యే సతోప్రధానముగా, ఉన్నతోన్నతముగా ఉండేది, ఇప్పుడు
తమోప్రధానముగా ఉంది, ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఇక్కడ రాజ్యమేమీ లేదు. ఇక్కడ
ఇది ప్రజలపై ప్రజల రాజ్యము. సత్యయుగములో చాలా తక్కువమంది ఉంటారు, ఇప్పుడు ఎంతమంది
ఉన్నారు. వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఢిల్లీ పరిస్తాన్ గా
అవ్వాల్సిందే. కానీ ఈ విషయము ఎవరికీ తెలియదు. ఇది కొత్త ఢిల్లీ అని వారు అనుకుంటారు.
ఈ పాత ప్రపంచాన్ని మార్చేవారు ఎవరు! ఇది ఎవరికీ తెలియదు. ఇది ఏ శాస్త్రాలలోనూ లేదు.
అర్థం చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే.
ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచము కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గవ్వ
నుండి వజ్ర సమానముగా అవుతున్నారు. భారత్ ఎంత సంపన్నముగా ఉండేది, వేరే ధర్మాలేవీ
ఉండేవి కాదు. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు దయార్ద్ర హృదయుడైన తండ్రిని
స్మృతి చేస్తారు. భారత్ సుఖధామముగా ఉండేది, ఇది మర్చిపోయారు. ఇప్పుడు భారత్
పరిస్థితి ఎలా ఉంది. లేదంటే భారత్ స్వర్గముగా ఉండేది. ఇది తండ్రి జన్మ స్థలం కదా.
డ్రామానుసారముగా తండ్రికి దయ కలుగుతుంది. భారత్ అయితే ప్రాచీన దేశము. తప్పకుండా
క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేదని, వేరే ధర్మమేదీ ఉండేది
కాదని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు ఈ భారత్ పూర్తిగా దిగజారిపోయింది. మా భారత్ దేశము
అన్నింటికన్నా ఉన్నతముగా ఉండేదని పాడుతారు. హెవెన్, స్వర్గము అన్న పేర్లు ఉండేవి.
భారత్ మహిమ గురించి కూడా ఎవరికీ తెలియదు. తండ్రియే వచ్చి భారత్ యొక్క కథను అర్థం
చేయిస్తారు. భారత్ యొక్క కథ అనగా ప్రపంచము యొక్క కథ, దీనిని సత్యనారాయణుడి కథ అని
అంటారు. తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తున్నారు - పూర్తిగా 5 వేల సంవత్సరాల క్రితం
భారత్ లో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, వారి చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ వారికి
ఈ రాజ్యము ఎలా లభించింది? సత్యయుగానికి ముందు ఏముండేది? సంగమయుగానికి ముందు ఏముండేది?
కలియుగము ఉండేది. ఇది సంగమయుగము, ఈ యుగములో తండ్రి రావాల్సి ఉంటుంది ఎందుకంటే పాత
ప్రపంచాన్ని ఎప్పుడైతే కొత్తదిగా తయారుచేయాల్సి ఉంటుందో, అప్పుడు పతిత ప్రపంచాన్ని
పావనముగా చేయడానికి నేను రావాల్సి ఉంటుంది. నేను సర్వవ్యాపినని, ప్రతి యుగములోనూ
వస్తానని నా గురించి చెప్పారు కనుక మనుష్యులు తికమకపడిపోయారు. సంగమయుగము గురించి
కేవలం మీకే తెలుసు. మీరు ఎవరు - ప్రజాపిత బ్రహ్మాకుమార కుమారీ అని బోర్డుపై వ్రాసి
ఉంది. బ్రహ్మాకు తండ్రి ఎవరు? శివుడు, వారు ఉన్నతోన్నతమైనవారు. ఆ తర్వాత బ్రహ్మా.
బ్రహ్మా ద్వారా రచన జరుగుతుంది. ప్రజాపిత అని తప్పకుండా బ్రహ్మానే అనడము జరుగుతుంది.
శివుడిని ప్రజాపిత అని అనరు. శివుడు ఆత్మలందరికీ నిరాకార తండ్రి. ఇక్కడికి వచ్చి
ప్రజాపిత బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను
వీరిలో ప్రవేశించాను, వీరి ద్వారా మీరు ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు, బ్రహ్మా
ద్వారానే మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేసి, తర్వాత దేవతలుగా చేస్తాను. ఇప్పుడు మీరు
బ్రహ్మాకు పిల్లలుగా అయ్యారు. బ్రహ్మా ఎవరి బిడ్డ? బ్రహ్మా యొక్క తండ్రికి ఏదైనా
పేరు ఉందా? వారు నిరాకార తండ్రి అయిన శివుడు. వారు వచ్చి వీరిలో ప్రవేశించి దత్తత
తీసుకుంటారు, ముఖవంశావళిని తయారుచేస్తారు. తండ్రి అంటారు, నేను వీరి అనేక జన్మల
అంతిమములో ప్రవేశిస్తాను, వీరు నా వారిగా అవుతారు, సన్యాసాన్ని ధారణ చేస్తారు. ఏ
సన్యాసము? 5 వికారాల సన్యాసము. ఇళ్ళు-వాకిళ్ళను వదలాల్సిన అవసరము లేదు. గృహస్థ
వ్యవహారములో ఉంటూ పవిత్రముగా ఉండాలి. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు
వినాశనమైపోతాయి. ఇదే యోగము, దీనితో మాలిన్యము తొలగిపోతుంది మరియు మీరు సతోప్రధానముగా
అయిపోతారు. భక్తిలోనైతే ఎన్ని గంగా స్నానాలు చేసినా, జప-తపాదులు మొదలైనవి చేసినా,
తప్పకుండా కిందకు దిగాల్సిందే. ఇంతకుముందు సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడు
తమోప్రధానముగా ఉన్నారు, మళ్ళీ సతోప్రధానముగా ఎలా అవ్వాలి? తండ్రి తప్ప ఎవ్వరూ ఈ
మార్గాన్ని తెలియజేయలేరు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అయితే పూర్తిగా
సహజమైన రీతిలో తెలియజేస్తున్నారు. వారు ఆత్మలతో మాట్లాడుతున్నారు, అంతేకానీ
గుజరాతీలతోనో లేక సింధీలతోనో మాట్లాడటము లేదు. ఇది ఉన్నదే ఆత్మిక జ్ఞానము.
శాస్త్రాలలో ఉన్నది భౌతిక జ్ఞానము. ఆత్మకే జ్ఞానము కావాలి, ఆత్మయే పతితముగా అయ్యింది,
ఆత్మకే ఆత్మిక ఇంజక్షన్ కావాలి. తండ్రిని, ఆత్మిక అవినాశీ సర్జన్ అని అంటారు. వారు
వచ్చి - నేను మీ ఆత్మిక సర్జన్ ను అని తమ పరిచయాన్ని ఇస్తారు. మీ ఆత్మ పతితముగా
అయిన కారణముగా శరీరము కూడా రోగగ్రస్తంగా అయిపోయింది. ఈ సమయములో భారతవాసులు మరియు
మొత్తము ప్రపంచమంతా నరకవాసులుగా ఉన్నారు, మళ్ళీ స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరు అనేది
తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - నేనే వచ్చి పిల్లలందరినీ స్వర్గవాసులుగా
చేస్తాను. నిజంగా మేము నరకవాసులుగా ఉండేవారమని మీరు కూడా అర్థం చేసుకున్నారు.
కలియుగాన్ని నరకమని అంటారు. ఇప్పుడిది నరకము యొక్క అంతిమము కూడా. భారతవాసులు ఈ
సమయములో రౌరవ నరకములో పడి ఉన్నారు, దీనిని రాజ్యమని కూడా అనరు. కొట్లాడుకుంటూ,
గొడవపడుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు యోగ్యులుగా
తయారుచేస్తారు కనుక వారు చెప్పింది వినాలి. మనుష్యులకు తమ ధర్మశాస్త్రము గురించి
కూడా తెలియదు, తండ్రి గురించి కూడా తెలియదు.
తండ్రి అంటారు - నేను మిమ్మల్ని పతితము నుండి పావనముగా చేసాను, అంతేకానీ
శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు నంబర్ వన్ పావనముగా ఉండేవారు. అతడిని శ్యామ
సుందరుడని కూడా అంటారు. శ్రీకృష్ణుని ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు
శ్యామముగా అయిపోయింది. కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయింది. జగదంబను నల్లగా ఎందుకు
చూపిస్తారు? ఇది ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడిని ఎలాగైతే నల్లగా చూపించారో, అదే
విధముగా జగదంబను కూడా నల్లగా చూపిస్తారు. ఇప్పుడు మీరు నల్లగా ఉన్నారు, మళ్ళీ
సుందరముగా అవుతారు. భారత్ చాలా సుందరముగా ఉండేదని మీరు అర్థం చేయించవచ్చు.
సౌందర్యాన్ని చూడాలంటే అజ్మేర్ లోని బంగారు ద్వారక యొక్క మోడల్ లో చూడండి.
స్వర్గములో బంగారము, వజ్రాలతో తయారుచేయబడిన మహళ్ళు ఉండేవి. ఇప్పుడైతే రాళ్ళు-రప్పలతో
తయారుచేయబడిన మహళ్ళు ఉన్నాయి, అందరూ తమోప్రధానముగా ఉన్నారు. శివబాబా, బ్రహ్మా దాదా
ఇరువురూ కలిసి ఉన్నారని పిల్లలకు తెలుసు, అందుకే బాప్ దాదా అని అంటారు. వారసత్వము
శివబాబా నుండి లభిస్తుంది. ఒకవేళ దాదా నుండే వారసత్వము లభిస్తుందంటే, ఇక శివుని
వద్ద ఏమున్నట్లు? వారసత్వము శివబాబా నుండి లభిస్తుంది, బ్రహ్మా ద్వారా. బ్రహ్మా
ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడిది రావణ రాజ్యము, మీరు తప్ప
అందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరు ఇప్పుడు సంగమములో ఉన్నారు. ఇప్పుడు పతితుల నుండి
పావనులుగా అవుతున్నారు, తర్వాత విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఇది మనుష్యులేమీ
చదివించడము లేదు. మీకు మురళీని ఎవరు వినిపిస్తారు? శివబాబా. వారు పరంధామము నుండి
వస్తారు, పాత ప్రపంచములోకి, పాత శరీరములోకి వస్తారు. ఎవరికైనా నిశ్చయము ఏర్పడితే,
ఇక తండ్రిని కలుసుకోకుండా ఉండలేరు. ముందు అనంతమైన తండ్రినైతే కలుసుకోవాలి అని అంటారు,
కలుసుకోకుండా ఉండలేకపోతారు. ఏ అనంతమైన తండ్రి అయితే స్వర్గానికి యజమానులుగా
తయారుచేస్తారో, వారి వద్దకు నన్ను వెంటనే తీసుకువెళ్ళండి, శివబాబా రథము ఎవరు అనేది
చూడాలి అని అంటారు! మనుష్యులు కూడా గుర్రాన్ని అలంకరిస్తారు, పట్కా (నడికట్టు) ను
గుర్తుగా పెడతారు. ఆ గుర్రము మహమ్మద్ రథముగా ఉండేది, అతను ధర్మస్థాపనను చేసారు.
భారతవాసులు నందికి తిలకాన్ని దిద్ది, మందిరములో పెడతారు. దానిపై శివుడు స్వారీ
చేసారని భావిస్తారు. ఇప్పుడు శివుడైనా లేక శంకరుడైనా నందిపై స్వారీ చేయలేదు. ఏమీ
అర్థం చేసుకోరు. శివుడు నిరాకారుడు, వారు ఎలా స్వారీ చేస్తారు. ఎద్దుపై
కూర్చొనేందుకు కాళ్ళు ఉండాలి కదా. ఇది అంధవిశ్వాసము. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి నుండి ఏ జ్ఞానామృతమైతే లభిస్తుందో, ఆ అమృతాన్ని తాగాలి మరియు తాగించాలి.
పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు వికారాలను త్యజించాలి.
2. ఏ తండ్రి అయితే స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తున్నారో, వారి
ప్రతి మాటను వినాలి, పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వాలి.
వరదానము:-
అనుభవము యొక్క విల్ పవర్ ద్వారా మాయ పవర్ ను ఎదుర్కునే అనుభవీ
మూర్త భవ
అన్నింటికంటే శక్తిశాలి స్థితి - మీ అనుభవము. అనుభవీ ఆత్మ
తన అనుభవము యొక్క విల్ పవర్ తో మాయ యొక్క ఏ పవర్ ను అయినా, అన్ని విషయాలను, సర్వ
సమస్యలను సహజముగానే ఎదుర్కోగలదు మరియు ఆత్మలందరినీ సంతుష్టము కూడా చేయగలదు. అనుభవము
యొక్క విల్ పవర్ ఆధారముగా ఎదుర్కునే శక్తితో సర్వులను సంతుష్టపరిచే శక్తి సహజముగా
ప్రాప్తిస్తుంది. అందుకే ప్రతి ఖజానాను అనుభవములోకి తీసుకువచ్చి అనుభవీ మూర్తులుగా
అవ్వండి.
స్లోగన్:-
ఇతరులను
చూసేందుకు బదులుగా స్వయాన్ని చూసుకోండి మరియు పరివర్తన చేసుకోండి.
అవ్యక్త ప్రేరణలు -
‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’
మిమ్మల్ని మీరు చెక్
చేసుకోండి - ప్రతి శక్తి, ప్రతి ప్రాప్తి, ప్రతి గుణము యొక్క అనుభవము ఉందా? ఒకవేళ
అనుభవము యొక్క అథారిటీ ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితి అయినా కానీ అది అనుభవమనే
అథారిటీ ముందు ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదు. అనుభవీమూర్తులు ఎప్పుడైనా, ఎటువంటి
పరిస్థితిలోనైనా అచంచలముగా-స్థిరముగా ఉంటారు, అలజడిలోకి రారు, ఎందుకంటే అన్నింటికంటే
అతి పెద్ద అథారిటీ అనుభవము యొక్క అథారిటీ. ఏ సమయములో ఏ శక్తిని ఆహ్వానిస్తారో, అది
క్షణములో సహయోగిగా అవుతుంది.
| | | |