13-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అకాలమూర్తి అయిన తండ్రి యొక్క మాట్లాడుతూ-నడుస్తూ ఉన్న సింహాసనము ఈ బ్రహ్మా, ఎప్పుడైతే వారు బ్రహ్మాలోకి వస్తారో అప్పుడు బ్రాహ్మణులైన మిమ్మల్ని రచిస్తారు’’

ప్రశ్న:-
తెలివైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకుని ఇతరులకు దానిని సరిగ్గా అర్థం చేయించగలుగుతారు?

జవాబు:-
బ్రహ్మా ఎవరు మరియు వారు బ్రహ్మా నుండి విష్ణువుగా ఎలా అవుతారు. ప్రజాపిత బ్రహ్మా ఇక్కడ ఉన్నారు, వారు దేవత ఏమీ కాదు... బ్రహ్మాయే బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు... ఈ రహస్యాలన్నింటినీ తెలివైన పిల్లలే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. గుర్రపు స్వారీ వారు మరియు పాదచారులు అయితే ఇందులో తికమకపడతారు.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
భక్తిలో ఒక్కరినే మహిమ చేస్తారు. మహిమనైతే గానం చేస్తారు కదా. కానీ వారి గురించి కూడా తెలియదు, అలాగే వారి యథార్థ పరిచయము గురించి కూడా తెలియదు. ఒకవేళ యథార్థ మహిమను గురించి తెలిసి ఉన్నట్లయితే తప్పకుండా దానిని వర్ణన చేస్తారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడని పిల్లలైన మీకు తెలుసు. వారి చిత్రమే ముఖ్యమైనది. బ్రహ్మా యొక్క సంతానము కూడా ఉంటారు కదా. మీరందరూ బ్రాహ్మణులు. బ్రహ్మాను గురించి కూడా బ్రాహ్మణులే తెలుసుకుంటారు, ఇంకెవ్వరూ తెలుసుకోరు, కావుననే - ఇతను బ్రహ్మా ఎలా అవుతారు, బ్రహ్మాను సూక్ష్మవతనవాసిగా చూపించారు కదా అని తికమకపడతారు. వాస్తవానికి ప్రజాపిత సూక్ష్మవతనములో ఉండడానికి అవకాశము లేదు. అక్కడ రచన ఏమీ ఉండదు. ఈ విషయములో మీతో ఎంతగానో వాదవివాదాలు కూడా చేస్తారు. బ్రహ్మా మరియు బ్రాహ్మణులైతే తప్పకుండా ఉన్నారు కదా అని మీరు అర్థం చేయించారు. ఏ విధముగా క్రైస్టు నుండి క్రిస్టియన్లు అన్న పదము వెలువడిందో, బుద్ధుడి నుండి బౌద్ధులు అన్న పదము వెలువడిందో, ఇబ్రహీం నుండి ఇస్లాములు అన్న పదము వెలువడిందో, అలాగే ప్రజాపిత బ్రహ్మా వలన బ్రాహ్మణులు అన్న పదము ప్రసిద్ధమైనది. ఆదిదేవుడు బ్రహ్మా. వాస్తవానికి బ్రహ్మాను దేవత అని అనలేరు. అది కూడా తప్పే. ఎవరైతే తమను తాము బ్రాహ్మణులుగా పిలుచుకుంటారో వారిని అడగాలి - బ్రహ్మా ఎక్కడి నుంచి వచ్చారు? అతను ఎవరి రచన? బ్రహ్మాను ఎవరు రచించారు? వీటికి సమాధానాలు ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే వీటి గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు - శివబాబా యొక్క రథము ఎవరంటే, శివబాబా ఎవరిలోకి ప్రవేశిస్తారంటే, ఏ ఆత్మ అయితే ఒకప్పుడు యువరాజైన శ్రీకృష్ణుడిగా అయ్యారో వారు. వారే 84 జన్మల తరువాత మళ్ళీ ఈ విధముగా బ్రహ్మాగా అయ్యారు. జన్మపత్రిలో ఉన్న పేరు అయితే ఇతనిది వేరే ఉంటుంది కదా ఎందుకంటే వాస్తవానికి ఇతను ఒక మనిషే కదా. తండ్రి వీరిలోకి ప్రవేశించిన కారణముగా ఇతనికి బ్రహ్మా అన్న పేరును పెడతారు. ఈ బ్రహ్మాయే విష్ణు రూపము అని కూడా పిల్లలకు తెలుసు. వీరే నారాయణుడిగా అవుతారు కదా. 84 జన్మల అంతిమములో కూడా ఇతను ఒక సాధారణ రథముగా ఉన్నారు కదా. ఈ శరీరాలన్నీ ఆత్మలకు రథములు. అకాలమూర్తి యొక్క మాట్లాడుతూ, నడుస్తూ ఉన్న రథము. సిక్కు ధర్మమువారు దీనికి గుర్తుగా ఆ సింహాసనాన్ని తయారుచేశారు. దానిని వారు అకాల సింహాసనము అని అంటారు. వాస్తవానికి ఈ శరీరాలన్నీ ఆత్మలకు అకాల సింహాసనాలే. ఆత్మలన్నీ అకాలమూర్తులే. ఉన్నతోన్నతుడైన భగవంతుడికి ఈ రథమైతే కావాలి కదా. ఈ రథములోకి ప్రవేశించి, ఇందులో కూర్చుని జ్ఞానాన్ని ఇస్తారు. వారినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. రచయిత మరియు రచనల యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. నాలెడ్జ్ ఫుల్ అనగా, అతను అంతర్యామి అని, అన్నీ తెలిసినవారు అనేమీ కాదు. సర్వవ్యాపి అర్థము వేరు, అన్నీ తెలిసినవారు అన్నదానికి అర్థము వేరు. మనుష్యులైతే అన్నింటినీ కలిపేసి ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. బ్రాహ్మణులమైన మనమందరము బ్రహ్మా సంతానమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మన కులము అన్నింటికన్నా ఉన్నతమైనది. వారు దేవతలను ఉన్నతమైనవారిగా చూపిస్తారు ఎందుకంటే సత్యయుగ ఆదిలో దేవతలు ఇక్కడ ఉండి వెళ్ళారు. ప్రజాపిత బ్రహ్మాకు సంతానము బ్రాహ్మణులు, ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అయినా వారు బ్రహ్మా సూక్ష్మవతనములో ఉంటారు అనుకుంటున్నప్పుడు అసలు వారికి ఈ విషయము ఎలా తెలుస్తుంది. పూజలు చేసే, శ్రాద్ధపు భోజనాలు తినే ఆ దైహికమైన బ్రాహ్మణులు వేరు. మీరైతే ఆ శ్రాద్ధ భోజనాలు తినడం మొదలైనవేవీ చేయరు. బ్రహ్మా యొక్క రహస్యాన్ని ఇప్పుడు బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. మీరు ఏమని చెప్పండంటే - మిగిలిన విషయాలన్నింటినీ వదిలి ఏ తండ్రి అయితే పతితము నుండి పావనముగా తయారుచేస్తారో, ముందుగా ఆ తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటారు. చిన్న విషయములో సంశయము కలిగినా తండ్రినే వదిలేస్తారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయమేమిటంటే - భగవంతుడు మరియు రాజ్యాధికార వారసత్వము. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను తప్పకుండా ఎవరో ఒకరిలోకి వస్తాను కదా. అతనికి పేరు కూడా ఉండాలి. నేను వచ్చి అతడిని రచిస్తాను. బ్రహ్మా గురించి అర్థం చేయించేందుకు మీకు చాలా తెలివి కావాలి. పాదచారులు, గుర్రపు స్వారీవారు తికమకపడతారు. తమ అవస్థ అనుసారముగా అర్థం చేయిస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడ ఉన్నారు. బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు కావున మరి తప్పకుండా బ్రాహ్మణులే కావాలి కదా. బ్రాహ్మణులు జన్మించేందుకని ప్రజాపిత బ్రహ్మా కూడా ఇక్కడే కావాలి. మేము బ్రహ్మా సంతానము అని ఆ బ్రాహ్మణులు అంటారు కూడా. పరంపరగా మా కులము కొనసాగుతూ వచ్చింది అని వారు భావిస్తారు. కానీ బ్రహ్మా ఎప్పుడు ఉండేవారు అన్న విషయము వారికి తెలియదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ఎవరైతే బ్రహ్మా సంతానమో వారే బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులకైతే తండ్రి యొక్క కర్తవ్యము గురించి తెలియనే తెలియదు. భారత్ లో మొదట బ్రాహ్మణులే ఉంటారు. బ్రాహ్మణులది ఉన్నతోన్నతమైన కులము. మా కులము తప్పకుండా బ్రహ్మా నుండే వెలువడి ఉంటుందని ఆ బ్రాహ్మణులు కూడా భావిస్తారు. కానీ ఎప్పుడు మరియు ఎలా వెలువడుతుంది అనేది వారు వర్ణించలేరు. ప్రజాపిత బ్రహ్మాయే బ్రాహ్మణులను రచిస్తారని మీరు అర్థం చేసుకుంటారు. ఆ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అయ్యేది ఉంది. బ్రాహ్మణులను తండ్రి వచ్చి చదివిస్తారు. బ్రాహ్మణులది కూడా వంశము ఉండదు. బ్రాహ్మణులది కులము మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే రాజులుగా, రాణులుగా అవుతారో అప్పుడే వంశము అని అంటారు. ఉదాహరణకు సూర్యవంశము. బ్రాహ్మణులైన మీలో రాజులుగా అవ్వరు. కౌరవుల రాజ్యము ఉండేది మరియు పాండవుల రాజ్యము ఉండేది అని వారు ఏదైతే అంటారో, రెండూ తప్పు, రాజ్యము అయితే ఇరువురికీ లేదు. ప్రజలపై ప్రజల రాజ్యము కొనసాగుతోంది, దీనిని రాజధాని అని అనరు. కిరీటమే లేదు. తండ్రి అర్థం చేయించారు - మొదట ద్వికిరీటధారులుగా భారత్ లో ఉండేవారు, ఆ తరువాత ఏక కిరీటధారులుగా ఉన్నారు. ఈ సమయములోనైతే ఏ కిరీటమూ లేదు. ఈ విషయాన్ని కూడా బాగా నిరూపించి తెలియజేయాలి. ఎవరైతే పూర్తిగా మంచి ధారణ కలవారు ఉంటారో, వారు మంచి రీతిలో అర్థం చేయించగలుగుతారు. బ్రహ్మా గురించే ఎక్కువగా అర్థం చేయించవలసి ఉంటుంది. విష్ణువు గురించి కూడా తెలియదు. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. వైకుంఠాన్ని విష్ణుపురి అని అంటారు అనగా అక్కడ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. శ్రీకృష్ణుడు యువరాజుగా ఉన్నట్లయితే, మా తండ్రిగారు ఒక రాజు అని అంటారు కదా. శ్రీకృష్ణుడి తండ్రి రాజుగా అవ్వలేరు అనేమీ కాదు. శ్రీకృష్ణుడిని యువరాజు అని అన్నట్లయితే మరి తప్పకుండా అతని జన్మ ఎవరో ఒక రాజు వద్ద జరిగి ఉంటుంది. షావుకారు వద్ద జన్మ తీసుకుంటే యువరాజు అని అనరు కదా. రాజు పదవికి మరియు షావుకారు పదవికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. శ్రీకృష్ణుడి తండ్రియైన రాజు పేరు అంత ప్రసిద్ధము కాదు. కానీ శ్రీకృష్ణుడి పేరు ఎంత ప్రసిద్ధమైనది. అతని తండ్రి పదవిని ఉన్నత పదవి అని అనరు. అది సెకండ్ క్లాస్ పదవి. వారు కేవలము శ్రీకృష్ణుడికి జన్మనిచ్చేందుకు మాత్రమే నిమిత్తమవుతారు. వారు శ్రీకృష్ణుని ఆత్మకన్నా ఎక్కువగా చదివినవారు అని కాదు. అలా కాదు. శ్రీకృష్ణుడే మళ్ళీ నారాయణుడిగా అవుతారు. అతని తండ్రి పేరు మాయమైపోతుంది. వాస్తవానికి అతని తండ్రి కూడా బ్రాహ్మణుడే, కానీ చదువులో శ్రీకృష్ణుడికన్నా తక్కువగా చదివారు. శ్రీకృష్ణుని ఆత్మ యొక్క చదువు అతని తండ్రి కన్నా ఉన్నతముగా ఉంది, కావుననే శ్రీకృష్ణుడికి అంత పేరు ఉంటుంది. శ్రీకృష్ణుడి తండ్రి ఎవరు అన్నది అసలు ఎవ్వరికీ తెలియదు. మున్ముందు తెలుస్తుంది. ఇక్కడి నుండే తయారయ్యేది ఉంది కదా. రాధకు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా. కానీ వారికన్నా రాధకు ఎక్కువ పేరు ఉంటుంది, ఎందుకంటే తల్లిదండ్రులు తక్కువగా చదువుకున్నారు. రాధ పేరు వారి పేరు కన్నా ఉన్నతముగా అవుతుంది. పిల్లలకు అర్థం చేయించేందుకని ఇవి విస్తారమైన విషయాలు. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. బ్రహ్మా గురించి కూడా అర్థం చేయించేందుకు తెలివి కావాలి. ఆ శ్రీకృష్ణుడి ఆత్మయే 84 జన్మలను అనుభవిస్తుంది. మీరు కూడా 84 జన్మలను తీసుకుంటారు. అందరూ ఒకేసారి కలిసి రారు. ఎవరైతే చదువులో ముందు ఉంటారో, అక్కడికి కూడా వారే ముందుగా వస్తారు. నంబరువారుగా అయితే వస్తారు కదా. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. తక్కువ బుద్ధి కలవారైతే వీటిని ధారణ చేయలేరు. నంబరువారుగా వెళ్తారు. మీరు నంబరువారుగా ట్రాన్స్ఫర్ అవుతారు. ఎంత పెద్ద క్యూ ఉంది, ఇదంతా అంతిమములో వెళ్తుంది. నంబరువారుగా తమ-తమ స్థానాలలోకి వెళ్ళి నివాసము చేస్తారు. అందరి స్థానాలు నిశ్చితమై ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన ఆట. కానీ దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోరు. దీనిని ఒక ముళ్ళ అడవి అని అంటారు. ఇక్కడ అందరూ ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు. అక్కడైతే ప్రకృతిసిద్ధమైన సుఖము ఉంటుంది. ఇక్కడ ఉన్నది కృత్రిమమైన సుఖము. సత్యమైన సుఖాన్ని ఒక్క తండ్రియే ఇస్తారు. ఇక్కడి సుఖము కాకిరెట్టతో సమానమైనది. రోజురోజుకు తమోప్రధానముగా అవుతూ ఉంటారు. ఇక్కడ ఎంత దుఃఖము ఉంది. పిల్లలు అంటారు - బాబా, మాయ తుఫానులు ఎన్నో వస్తూ ఉంటాయి, మాయ చిక్కుకుపోయేలా చేస్తుంది, దుఃఖపు ఫీలింగ్ చాలా కలుగుతుంది. సుఖదాత అయిన తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత కూడా ఒకవేళ దుఃఖపు ఫీలింగ్ వస్తే మరి తండ్రి అంటారు - పిల్లలూ, ఇది మీరు చేసుకున్న చాలా పెద్ద కర్మభోగము. తండ్రి లభించిన తరువాత ఇక దుఃఖము ఫీలింగ్ రాకూడదు. పాత కర్మభోగము ఏదైతే ఉందో, దానిని యోగబలము ద్వారా సమాప్తము చేసుకోండి. ఒకవేళ యోగబలము లేకపోతే మరి శిక్ష అనుభవించి సమాప్తము చేసుకోవలసి ఉంటుంది. శిక్ష అనుభవించి ఆ తరువాత పదవిని పొందడము అంత మంచిది కాదు. పురుషార్థము చేయాలి లేకపోతే చివరిలో న్యాయసభ కూర్చుంటుంది. ప్రజలైతే ఎంతోమంది ఉన్నారు. డ్రామానుసారముగా అందరూ గర్భజైలులో ఎన్నో శిక్షలు పొందుతారు. ఆత్మలు ఎంతగానో భ్రమిస్తూ ఉంటాయి కూడా. కొన్ని ఆత్మలైతే ఎంతో నష్టపరుస్తాయి. ఎవరి శరీరములో అయినా అశుద్ధ ఆత్మ ప్రవేశించినట్లయితే వారు ఎంతగా హైరానా పడతారు. కొత్త ప్రపంచములో ఈ విషయాలేవీ ఉండవు. ఇప్పుడు మీరు - మేము కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి అని పురుషార్థము చేస్తారు. అక్కడికి వెళ్ళి కొత్త-కొత్త మహళ్ళను తయారుచేయవలసి ఉంటుంది. ఏ విధముగా శ్రీకృష్ణుడు రాజుల వద్ద జన్మ తీసుకుంటారో, అలా మీరు కూడా జన్మ తీసుకుంటారు. కానీ అన్ని మహళ్ళు మొదలైనవన్నీ ముందు నుండే ఉండవు కదా. వాటన్నింటినీ తయారుచేయవలసి ఉంటుంది. వాటిని ఎవరు రచిస్తారు. ఎవరి వద్దనైతే జన్మ తీసుకుంటారో వారు. రాజుల వద్ద జన్మ తీసుకుంటారని అంటూ ఉంటారు కూడా. ఏమేమి జరుగుతుందో మున్ముందు చూడవలసి ఉంటుంది. బాబా ఇప్పుడే వాటన్నింటిని గురించి చెప్పరు. అలా చెప్పినట్లయితే అది కృత్రిమమైన నాటకములా అయిపోతుంది. అందుకే ముందే ఏమీ చెప్పరు. డ్రామాలో అలా తెలియజేసే పాత్ర లేదు. తండ్రి అంటారు, నేను కూడా పాత్రధారినే. భవిష్యత్తులో జరగబోయే విషయాలు నాకు ముందుగానే తెలిసినట్లయితే మీకు ఎన్నో తెలియజేసి ఉండేవాడిని. బాబా అంతర్యామి అయినట్లయితే అన్నీ ముందే తెలియజేసేవారు. తండ్రి అంటారు, అలా కాదు, డ్రామాలో ఏదైతే జరుగుతుందో దానిని మీరు సాక్షీగా అయి చూస్తూ వెళ్ళండి, అంతేకాక స్మృతియాత్రలో నిమగ్నమై ఉండండి. ఈ విషయములోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. జ్ఞానము ఎప్పుడూ ఎక్కువ, తక్కువ అవ్వదు. స్మృతియాత్రయే ఒక్కోసారి తక్కువ, ఒక్కోసారి ఎక్కువ అవుతుంది. జ్ఞానము ఏదైతే లభించిందో అది మీ వద్ద ఎలాగూ ఉంది. స్మృతియాత్రలో ఒక్కోసారి ఉల్లాసము ఉంటుంది, ఒక్కోసారి ఢీలాగా ఉంటారు. యాత్రలో పైకీ-క్రిందికీ అవుతూ ఉంటుంది. జ్ఞానములో మీరు మెట్లు ఎక్కరు. జ్ఞానాన్ని యాత్ర అని అనరు. స్మృతి అనేది యాత్ర. తండ్రి అంటారు, స్మృతిలో ఉండడము వలన మీరు సురక్షితముగా ఉంటారు. దేహాభిమానములోకి వచ్చినట్లయేత మీరు ఎంతో మోసపోతారు, వికర్మలు చేసేస్తారు. కామము మహాశత్రువు, అందులోనే ఫెయిల్ అయిపోతారు. క్రోధము మొదలైనవాటి గురించి బాబా అంత ఎక్కువగా చెప్పరు.

జ్ఞానము విషయములో - అయితే ఒక్క క్షణములో జీవన్ముక్తి లభిస్తుంది అని అంటారు లేదా మొత్తము సముద్రమంతటినీ సిరాగా మార్చినా అది పూర్తవ్వదని అంటారు, లేదా ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి అని కేవలము ఇదే అంటారు. స్మృతి చేయడము అని దేనినంటారో వారికెవ్వరికీ తెలియదు. కలియుగము నుండి మమ్మల్ని సత్యయుగములోకి తీసుకువెళ్ళండి అని అంటారు. పాత ప్రపంచములో దుఃఖము ఉంది. వర్షాలు పడినప్పుడు ఎన్ని ఇళ్ళు కూలిపోతాయో, ఎన్ని ఇళ్ళు మునిగిపోతాయో మీరు చూస్తుంటారు. ఈ వర్షాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. అందరూ కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్నారు. వినాశన సమయములో మేల్కొంటారు, కానీ అప్పుడు ఏం చేయగలుగుతారు! చనిపోతారు. భూమి కూడా చాలా తీవ్రముగా కంపిస్తుంది. తుఫానులు, వర్షాలు మొదలైనవన్నీ వస్తాయి. బాంబులు కూడా వేస్తారు. కానీ, ఇక్కడ దానికి అదనముగా సివిల్ వార్స్ (అంతర్యుద్ధాలు) కూడా జరుగుతాయి.... రక్తపు నదులు అని అంటూ ఉంటారు. ఇక్కడ కొట్లాటలు జరుగుతాయి. ఒకరిపై ఒకరు కేసులు పెడుతూ ఉంటారు. అలా తప్పకుండా యుద్ధాలు కూడా చేసుకుంటారు. అందరూ అనాథలే, మీరు నాథుడికి చెందినవారు. మీరు ఏ యుద్ధము చేయకూడదు. బ్రాహ్మణులుగా అవ్వడము వలన మీరు నాథుడికి చెందినవారిగా అయ్యారు. నాథుడు అని తండ్రిని లేక పతిని అంటారు. శివబాబా అయితే పతులకే పతి వంటివారు. నిశ్చితార్థమయ్యాక, నేను ఇటువంటి పతిని ఎప్పుడు కలుసుకుంటాను అని అంటారు. ఆత్మలు అంటాయి - శివబాబా, మాకైతే మీతో నిశ్చితార్థమయ్యింది, ఇప్పుడు మేము మిమ్మల్ని ఎలా కలుసుకోవాలి? కొందరు నిజం వ్రాస్తారు, కొందరు చాలా దాస్తారు. బాబా, మా వల్ల ఈ పొరపాటు జరిగింది, క్షమించండి అని సత్యతతో వ్రాయరు. ఒకవేళ ఎవరైనా వికారాలలో పడినట్లయితే వారి బుద్ధిలో ధారణ జరగదు. బాబా అంటారు, మీరు ఇటువంటి కఠినమైన పొరపాటు చేసారంటే ముక్కలుముక్కలుగా అయిపోతారు. మిమ్మల్ని నేను తెల్లగా తయారుచేయడానికి వస్తే మీరు మళ్ళీ నల్ల ముఖము ఎలా చేసుకంటారు. స్వర్గములోకి వస్తారు కానీ పైసకు విలువచేసే పదవిని పొందుతారు. రాజధాని స్థాపన అవుతోంది కదా. కొందరు ఓడిపోయి జన్మ-జన్మాంతరాలు పదభ్రష్టులుగా అయిపోతారు. తండ్రి నుండి నీవు ఇటువంటి పదవిని పొందడానికి వచ్చావా అని అడుగుతారు. తండ్రి ఇంత ఉన్నతముగా తయారవుతుంటే, మరి పిల్లలైన మనము ప్రజలుగా అవుతామా. తండ్రి సింహాసనముపై ఉండి, పిల్లలు దాస-దాసీలుగా అయితే, అది ఎంత సిగ్గుపడే విషయము. చివరిలో మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి, అప్పుడు - ఎందుకిలా చేశాము అని మీరు చాలా పశ్చాత్తాపపడతారు. సన్యాసులు కూడా బ్రహ్మచర్యములో ఉంటారు, కావున వికారులందరూ వారికి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రతకు గౌరవము ఉంటుంది. ఎవరి భాగ్యములోనైనా లేకపోతే, తండ్రి వచ్చి చదివించినా మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు. అసలు స్మృతే చేయరు. కావున ఎన్నో వికర్మలు జరుగుతాయి.

పిల్లలైన మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. దీనికన్నా ఉన్నతమైన దశ ఇంకేదీ ఉండదు. పిల్లలైన మీపై ఈ దశలు చక్రములా తిరుగుతూ ఉంటాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షీగా అయి చూడాలి, ఒక్క తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉండాలి. స్మృతియాత్రలో ఎప్పుడూ ఉల్లాసము తగ్గకూడదు.

2. చదువులో ఎప్పుడూ నిర్లక్ష్యము చేయకూడదు, తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. ఓడిపోయి జన్మ-జన్మాంతరాల కొరకు పదభ్రష్టులుగా అవ్వకూడదు.

వరదానము:-
సత్యమైన సేవ ద్వారా అవినాశీ, అలౌకిక సంతోషపు సాగరములో తేలియాడే అదృష్టవంతులైన ఆత్మగా కండి

ఏ పిల్లలైతే సేవలలో బాప్ దాదా మరియు నిమిత్తులైన పెద్దల స్నేహపు ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటారో, వారికి లోపల నుండి అలౌకికమైన, ఆత్మికమైన సంతోషము అనుభవమవుతుంది. వారు సేవల ద్వారా ఆంతరిక సంతోషాన్ని, ఆత్మిక ఆనందాన్ని, అనంతమైన ప్రాప్తిని అనుభవము చేస్తూ సదా సంతోషపు సాగరములో తేలియాడుతూ ఉంటారు. సత్యమైన సేవ సర్వుల స్నేహము, సర్వుల ద్వారా అవినాశీ గౌరవము మరియు సంతోషపు ఆశీర్వాదాలు ప్రాప్తించేలా అదృష్టమనే శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం చేయిస్తూ ఉంటుంది. ఎవరైతే సదా సంతోషముగా ఉంటారో వారే అదృష్టవంతులు.

స్లోగన్:-
సదా హర్షితముగా మరియు ఆకర్షణమూర్తులుగా అయ్యేందుకు సంతుష్టమణులుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

కర్మలో, వాణిలో, సంబంధ-సంపర్కములో ప్రేమ, స్మృతి మరియు స్థితిలో లవలీనులై ఉండాలి. ఎవరు ఎంత లవ్లీగా ఉంటారో, వారు అంతగానే లవలీనులుగా ఉండగలరు. ఈ లవలీన స్థితిని మనుష్యాత్మలు లీనమైయ్యే అవస్థ అని అన్నారు. బాబాలో లవలీనమవ్వటము అన్న మాటలో నుండి వారు లవ్ (ప్రేమ) అన్న మాటను తీసేసి కేవలము లీనమవ్వటము అన్న మాటను పట్టుకున్నారు. పిల్లలైన మీరు బాబా ప్రేమలో లవలీనులై ఉన్నట్లయితే ఇతరులను కూడా సహజముగానే మీ సమానముగా మరియు బాబా సమానముగా తయారుచేయగలరు.