ఓంశాంతి
ఆత్మిక పిల్లలు (ఆత్మలు) శరీరము ద్వారా పాటను విన్నారా? ఎందుకంటే తండ్రి ఇప్పుడు
పిల్లలను ఆత్మాభిమానులుగా తయారుచేస్తున్నారు. మీకు ఆత్మ జ్ఞానము కూడా లభిస్తుంది.
ఆత్మను గురించిన యథార్థమైన జ్ఞానము ఉన్న మనుష్యులు ప్రపంచములో ఒక్కరు కూడా లేరు.
కావున వారికి పరమాత్మ జ్ఞానము ఎలా ఉంటుంది? ఈ విషయాలను తండ్రియే కూర్చుని అర్థం
చేయిస్తారు. అర్థం చేయించడమనేది శరీరము ద్వారానే అర్థం చేయిస్తారు. శరీరము
లేకుండానైతే ఆత్మ ఏమీ చేయలేదు. నేను ఎక్కడి నివాసిని, నేను ఎవరి సంతానాన్ని అన్నది
ఆత్మకు తెలుసు. ఇప్పుడు మీకు యథార్థ రీతిలో తెలుసు. నటులందరూ పాత్రధారులే.
భిన్న-భిన్న ధర్మాల ఆత్మలు ఎప్పుడు వస్తారు, ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. తండ్రి
విస్తారముగా అర్థం చేయించరు, హోల్ సేల్ గా అర్థం చేయిస్తారు. హోల్ సేల్ అనగా ఒక్క
క్షణములో వారు ఏ విధముగా అర్థం చేయిస్తారంటే, దాని ద్వారా సత్యయుగ ఆది నుండి
మొదలుకుని అంతిమము వరకు - మన పాత్ర ఎలా రచింపబడి ఉంది అనేది తెలుస్తుంది. తండ్రి
ఎవరు మరియు డ్రామాలో వారి పాత్ర ఏమిటి అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఉన్నతోన్నతమైనవారు
తండ్రియేనని, వారే సర్వుల సద్గతిదాత, దుఃఖహర్త, సుఖకర్త అని మీకు తెలుసు. శివజయంతి
ప్రసిద్ధమైనది. శివజయంతి అన్నింటికన్నా ఉన్నతమైనది అని తప్పకుండా అంటారు. విశేషముగా
భారత్ లోనే జయంతిని జరుపుకుంటారు. ఎవరెవరి రాజ్యములో ఏయే ఉన్నతమైన వ్యక్తుల యొక్క
గత చరిత్ర బాగుంటుందో వారివి స్టాంపులు కూడా తయారుచేస్తారు. ఇప్పుడు శివుని జయంతిని
కూడా జరుపుకుంటారు. అందరికన్నా ఉన్నతమైన జయంతి ఎవరిదైనట్లు అన్నది అర్థం చేయించాలి.
మరి ఎవరి స్టాంపును తయారుచేయించాలి? సాధు-సన్యాసులవి మరియు సిక్కులవి, ముసల్మానులవి,
ఆంగ్లేయులవి లేక మంచి తత్వవేత్తలు ఎవరైనా ఉంటే వారివి స్టాంపులు తయారుచేస్తూ ఉంటారు.
రాణాప్రతాప్ మొదలైనవారివి కూడా స్టాంపులు తయారుచేస్తారు. ఇప్పుడు వాస్తవానికి
సర్వుల సద్గతిదాత అయిన ఆ తండ్రి స్టాంపును తయారుచేయాలి. ఈ సమయములో తండ్రి రాకపోతే
సద్గతి ఎలా జరుగుతుంది ఎందుకంటే అందరూ రౌరవ నరకములో మునకలు వేస్తూ ఉన్నారు.
అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు శివబాబా, వారే పతిత-పావనుడు. శివునివి మందిరాలు కూడా
చాలా ఎత్తైన స్థానాలలో నిర్మిస్తారు ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైనవారు కదా.
తండ్రియే వచ్చి భారత్ ను స్వర్గానికి అధిపతిగా తయారుచేస్తారు. వారు ఎప్పుడైతే
వస్తారో అప్పుడు సద్గతి చేస్తారు కావున ఆ తండ్రి స్మృతియే ఉండాలి. స్టాంపు కూడా
శివబాబాది ఎలా తయారుచేయాలి? భక్తి మార్గములోనైతే శివలింగాన్ని తయారుచేస్తారు. వారే
ఉన్నతోన్నతమైన ఆత్మ. ఉన్నతోన్నతమైన మందిరము అని కూడా శివుని మందిరాన్నే భావిస్తారు.
సోమనాథాలయము శివుని మందిరము కదా. భారతవాసులు తమోప్రధానముగా అయిపోయిన కారణముగా వారికి
- తాము పూజిస్తున్న ఆ శివుడు ఎవరు అనేది కూడా తెలియదు, వారి కర్తవ్యము ఏమిటి అనేది
తెలియదు. రాణాప్రతాప్ కూడా యుద్ధము చేసారు, అది హింస అయినట్లు. ఈ సమయములోనైతే అందరూ
డబుల్ హింసకులుగా ఉన్నారు. వికారాలలోకి వెళ్ళడము, కామ ఖడ్గాన్ని ఉపయోగించడము, ఇది
కూడా హింసయే కదా. డబుల్ అహింసకులైతే ఈ లక్ష్మీ-నారాయణులే. మనుష్యులకు ఎప్పుడైతే
పూర్తి జ్ఞానము కలుగుతుందో అప్పుడు అర్థ సహితముగా స్టాంపు వెలువడుతుంది. సత్యయుగములో
ఈ లక్ష్మీ-నారాయణుల స్టాంపులే వెలువడుతాయి. శివబాబా గురించిన జ్ఞానమైతే అక్కడ ఉండదు
కావున తప్పకుండా ఉన్నతోన్నతులైన లక్ష్మీ-నారాయణులవే స్టాంపులు వెలువడుతూ ఉండవచ్చు.
ఇప్పుడు కూడా భారత్ కు ఆ స్టాంపు ఉండాలి. ఉన్నతోన్నతమైనవారు త్రిమూర్తీ శివుడు, వారి
స్టాంపు అవినాశీగా ఉండాలి ఎందుకంటే వారు భారత్ కు అవినాశీ రాజ్య సింహాసనాన్ని
ఇస్తారు. పరమపిత పరమాత్మయే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. బాబా మనల్ని
స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు అన్న విషయాన్ని మర్చిపోయేవారు మీలో కూడా
చాలామంది ఉన్నారు. మాయ అది మరిపింపజేస్తుంది. తండ్రి గురించి తెలియని కారణముగా
భారతవాసులు ఎన్ని పొరపాట్లు చేస్తూ వచ్చారు. శివబాబా ఏం చేస్తారు అనేది ఎవ్వరికీ
తెలియదు. శివజయంతి అర్థాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. ఈ జ్ఞానము తండ్రి వద్ద తప్ప
ఇంకెవ్వరి వద్దా లేదు.
ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ఇతరులపై కూడా దయ
చూపించండి, మీపై కూడా మీకు మీరే దయ చూపించుకోండి. టీచర్ చదివిస్తారు, ఇది కూడా దయ
చూపించడమే కదా. నేను టీచర్ ను, మిమ్మల్ని చదివిస్తాను అని వారు అంటారు కూడా.
వాస్తవానికి దీనికి పాఠశాల అన్న పేరు కూడా సరైనది కాదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద
విశ్వవిద్యాలయము. మిగిలినవన్నీ అసత్యమైన పేర్లే. ఆ కాలేజీలు మొత్తము విశ్వమంతటి
కొరకు ఉన్న కాలేజీలైతే కావు. కావున విశ్వవిద్యాలయము ఉంది అంటే అది ఒక్క తండ్రిదే,
అది మొత్తం విశ్వమంతటి సద్గతిని చేస్తుంది. వాస్తవానికి విశ్వవిద్యాలయము ఇదొక్కటే.
దీని ద్వారానే అందరూ ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్తారు అనగా శాంతిని మరియు సుఖాన్ని
పొందుతారు. విశ్వము అంటే ఇదే కదా. కావున బాబా అంటారు, మీరు భయపడకండి, ఇది అర్థం
చేయించవలసిన విషయము. కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే, ఎమర్జెన్సీ సమయములో ఎవరూ ఎవరి
మాటను వినరు కూడా. ప్రజలపై ప్రజల రాజ్యము నడుస్తుంది. ఇతర ఏ ధర్మాలలోనూ ప్రారంభము
నుండి రాజ్యము నడవదు. వారు కేవలం ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తారు, తరువాత
ఎప్పుడైతే వారి సంఖ్య లక్షలకు చేరుకుంటుందో, అప్పుడు రాజ్యము చేయగలుగుతారు. ఇక్కడైతే
తండ్రి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు, మొత్తం విశ్వము కొరకు స్థాపన చేస్తున్నారు.
ఇది కూడా అర్థం చేయించవలసిన విషయము. దైవీ రాజధానిని ఈ పురుషోత్తమ సంగమయుగములో
స్థాపన చేస్తున్నారు. బాబా అర్థం చేయించారు - శ్రీకృష్ణుడు, శ్రీనారాయణుడు,
శ్రీరాముడు మొదలైనవారి నల్లని చిత్రాలను మీరు మీ చేతుల్లోకి తీసుకుని,
శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడు అని ఎందుకంటారో అప్పుడు అర్థం చేయించండి. ఒకప్పుడు
సుందరముగా ఉండేవారు, మరి తరువాత శ్యామముగా ఎలా అవుతారు? భారత్ యే ఒకప్పుడు
స్వర్గముగా ఉండేది, ఇప్పుడు నరకముగా ఉంది. నరకము అనగా నలుపు, స్వర్గము అనగా తెలుపు.
రామ రాజ్యాన్ని పగలు అని, రావణ రాజ్యాన్ని రాత్రి అని అంటారు. దేవతలను నల్లగా ఎందుకు
చూపించారు అనేది మీరు అర్థం చేయించవచ్చు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు,
మీరు ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. వారు సంగమయుగములో లేరు, కానీ మీరైతే
ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా. ఇక్కడ మీరు ఉన్నదే సంగమయుగములో, మీరు పురుషోత్తములుగా
తయారయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు. వికారీ పతిత మనుష్యులతో మీకు ఎటువంటి సంబంధము
లేదు. కానీ ఇప్పుడు ఇంకా కర్మాతీత అవస్థ తయారవ్వలేదు, అందుకే కర్మ సంబంధీకుల వైపుకు
కూడా మనసు వెళ్తూ ఉంటుంది. కర్మాతీతముగా అయ్యేందుకు కావాల్సినది స్మృతియాత్ర. తండ్రి
అర్థం చేయిస్తున్నారు - నీవు ఒక ఆత్మవు, నీకు పరమపిత పరమాత్మపై ఎంతటి ప్రేమ ఉండాలి.
ఓహో! బాబా మమ్మల్ని చదివిస్తున్నారు. అంతటి ఉత్సాహము ఎవరిలోనూ ఉండడము లేదు. మాయ
ఘడియ-ఘడియా దేహాభిమానములోకి తీసుకువస్తుంది. శివబాబా ఆత్మలైన మనతో మాట్లాడుతూ
ఉన్నారని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆకర్షణ, ఆ సంతోషము ఉండాలి కదా. ఏ సూది పైనైతే
కొద్దిగా కూడా తుప్పు ఉండదో, దానిని మీరు అయస్కాంతము ముందు పెడితే అది వెంటనే దానికి
అతుక్కుపోతుంది, కొద్దిగా తుప్పు ఉన్నా అది అతుక్కోదు, ఆ ఆకర్షణ ఉండదు. ఎటువైపైతే
తుప్పు ఉండదో అటువైపు నుండి అయస్కాంతము తనవైపుకు ఆకర్షిస్తుంది. పిల్లలు ఎప్పుడైతే
స్మృతియాత్రలో ఉంటారో అప్పుడు వారిలో అంత ఆకర్షణ ఉంటుంది. తుప్పు ఉంటే వారు
ఆకర్షించలేరు. నా సూది పూర్తిగా పవిత్రముగా అయిపోతే నాలో ఆకర్షణ కూడా ఉంటుంది అని
ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. తుప్పు పట్టి ఉన్న కారణముగా ఆకర్షణ కలగడం లేదు. మీరు
చాలా ఎక్కువగా స్మృతిలో ఉంటే వికర్మలు భస్మమవుతాయి. అచ్ఛా, మళ్ళీ ఒకవేళ ఏదైనా పాపము
చేస్తే దానికి వంద రెట్లు శిక్ష పడుతుంది, తుప్పు పడుతుంది, ఇక స్మృతి చేయలేకపోతారు.
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. స్మృతిని మర్చిపోతే తుప్పు
పడుతుంది. అప్పుడు అంత ఆకర్షణ మరియు ప్రేమ ఉండదు. తుప్పు వదిలిపోతే ప్రేమ ఉంటుంది,
సంతోషము కూడా ఉంటుంది. ముఖము హర్షితముగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఈ విధముగా
తయారవ్వాలి. సేవ చేయకపోతే గతించిపోయిన, కుళ్ళిపోయిన విషయాలను గురించి మాట్లాడుతూ
ఉంటారు. అటువంటివారు తండ్రి నుండి బుద్ధియోగాన్ని తెగిపోయేలా చేస్తారు. ఏదైతే
అంతవరకు మెరుపు ఉండేదో, ఇక అది కూడా మాయమైపోతుంది. తండ్రి పట్ల కొద్దిగా కూడా ప్రేమ
ఉండదు. ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉంటారో వారికి తండ్రిపై ప్రేమ ఉంటుంది.
తండ్రికి కూడా వారి పట్ల ఆకర్షణ కలుగుతుంది - ఈ బిడ్డ సేవ కూడా బాగా చేస్తున్నారు
మరియు యోగములో కూడా ఉంటున్నారు అనిపిస్తుంది, అటువంటివారిపై తండ్రికి ప్రేమ ఉంటుంది.
నా ద్వారా పాపమేమీ జరగలేదు కదా అని స్వయముపై గమనిక పెట్టుకుంటారు. ఒకవేళ స్మృతి
చేయకపోతే తుప్పు ఎలా వదులుతుంది. తండ్రి అంటారు, చార్టు పెట్టుకున్నట్లయితే తుప్పు
వదిలిపోతుంది. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలంటే తుప్పు వదలాలి. తుప్పు
వదులుతుంది కూడా, కానీ మళ్ళీ పడుతూ ఉంటుంది, అప్పుడు వంద రెట్లు శిక్ష పడుతుంది.
తండ్రిని స్మృతి చేయకపోతే ఏదో ఒక పాప కర్మను చేసేస్తారు. తండ్రి అంటారు, తుప్పు
వదలకుండానైతే మీరు నా వద్దకు రాలేరు, లేదంటే ఇక శిక్షలు అనుభవించవలసి ఉంటుంది.
శిక్షలు కూడా పడతాయి, పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇక అప్పుడు తండ్రి నుండి వారసత్వము
ఏమి లభించినట్లు? తుప్పు మరింత పెరిగేలాంటి పనులేవీ చేయకూడదు. ముందైతే మీ తుప్పు
వదిలించుకునేందుకు ఆలోచన చేయండి. ఆలోచించకపోతే ఇక వీరి భాగ్యములో లేదు అని తండ్రి
భావిస్తారు. అర్హత కావాలి, మంచి క్యారెక్టర్లు కావాలి. లక్ష్మీ-నారాయణుల
క్యారెక్టర్లు అయితే మహిమ చేయబడతాయి. ఈ సమయములోని మనుష్యులు వారి ఎదురుగా నిలబడి
స్వయం యొక్క క్యారెక్టర్లను వర్ణించుకుంటూ ఉంటారు. శివబాబా గురించి వారికి అసలు
తెలియనే తెలియదు కానీ సద్గతినిచ్చేది అయితే వారే. సన్యాసుల వద్దకు వెళ్తారు కానీ
సర్వుల సద్గతిదాత వారొక్కరే. తండ్రియే స్వర్గ స్థాపనను చేస్తారు, ఇక ఆ తరువాత
కిందికే దిగవలసి ఉంటుంది. తండ్రి తప్ప ఇంకెవ్వరూ పావనముగా తయారుచేయలేరు. మనుష్యులు
భూమిలో గొయ్యి తవ్వుకుని అందులో కూర్చుంటారు, దానికన్నా గంగానదిలోకి వెళ్ళి
కూర్చుంటే ఎంతోకొంత శుభ్రమవుతారు ఎందుకంటే పతిత-పావని గంగ అంటారు కదా. మనుష్యులు
శాంతిని కోరుకుంటారు, మరి వారు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో అప్పుడు పాత్ర
పూర్తవుతుంది. ఆత్మలైన మన ఇల్లు నిర్వాణధామమే. ఇక్కడికి శాంతి ఎక్కడి నుండి వస్తుంది?
తపస్య చేస్తారు, మరి అది కూడా ఒక కర్మ చేసినట్లే కదా. మహా అయితే శాంతిగా కూర్చుంటారు
కానీ శివబాబా గురించైతే వారికేమీ తెలియదు. అదంతా భక్తి మార్గము. పురుషోత్తమ
సంగమయుగము ఒక్కటే, అప్పుడే తండ్రి వస్తారు. ఆత్మ స్వచ్ఛముగా అయి
ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్ళిపోతుంది. ఎవరైతే కష్టపడతారో వారు రాజ్యము చేస్తారు,
మిగిలినవారు ఎవరైతే కష్టపడరో వారు శిక్షలు అనుభవిస్తారు. ప్రారంభములో శిక్షల యొక్క
సాక్షాత్కారాలు చేయించారు. మళ్ళీ అంతిమములో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మేము
శ్రీమతముపై నడవలేదు, అందుకే మాకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నది సాక్షాత్కారములో
చూస్తారు. పిల్లలు కళ్యాణకారులుగా అవ్వాలి. తండ్రి మరియు రచన యొక్క పరిచయాన్ని
ఇవ్వాలి. ఏ విధముగా సూదిని కిరసనాయిల్లో వేయడం ద్వారా తుప్పు వదులుతుందో, అలాగే
తండ్రి స్మృతిలో ఉండడం ద్వారా కూడా తుప్పు వదులుతుంది, లేదంటే తండ్రి పట్ల ఆ ఆకర్షణ,
ప్రేమ ఉండదు. ప్రేమ అంతా మిత్ర-సంబంధీకులు మొదలైనవారి వైపుకు వెళ్ళిపోతుంది. అప్పుడు
ఇక మిత్ర-సంబంధీకుల వద్దకు వెళ్ళి ఉంటారు. ఆ తుప్పు పట్టిన సాంగత్యము ఎక్కడ, ఈ
సాంగత్యము ఎక్కడ. తుప్పు పట్టినవారి సాంగత్యములో వారికి కూడా తుప్పు పడుతుంది.
తుప్పును వదిలించేందుకే తండ్రి వస్తారు. స్మృతి ద్వారానే పావనముగా అవుతారు.
అర్ధకల్పము నుండి చాలా జోరుగా తుప్పు పట్టి ఉంది. ఇప్పుడు అయస్కాంతమైన తండ్రి
చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. బుద్ధియోగము ఎంతగా నాతో ఉంటుందో అంతగా తుప్పు
వదులుతుంది. కొత్త ప్రపంచమైతే తయారవ్వవలసిందే. సత్యయుగములో మొదట దేవీ-దేవతలది చాలా
చిన్న వృక్షము ఉంటుంది, ఆ తరువాత అది వృద్ధిని పొందుతుంది. ఈ ప్రపంచములో నుండే మీ
వద్దకు వచ్చి పురుషార్థము చేస్తూ ఉంటారు. పై నుండి ఎవరూ రారు. ఇతర ధర్మాలవారైతే పై
నుండి వస్తారు. కానీ మీ రాజధాని ఇక్కడ తయారవుతుంది. చదువు పైన మరియు తండ్రి
శ్రీమతముపై నడవడం పైన మొత్తమంతా ఆధారపడి ఉంది. బుద్ధియోగము బయటికి వెళ్ళినా కూడా
తుప్పు పట్టుకుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు తమ లెక్కాచారాలన్నింటినీ సమాప్తము
చేసుకుని జీవిస్తూనే అన్నింటినీ సమాప్తము చేసుకుని వస్తారు. సన్యాసులు కూడా
సన్యసిస్తారు, కానీ ఎంతోకాలము వరకు వారికి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి.
ఇప్పుడు మనకు సత్యమైనవారి యొక్క సాంగత్యము లభిస్తోందని పిల్లలైన మీకు తెలుసు.
మనము మన తండ్రి స్మృతిలోనే ఉంటాము. మిత్ర-సంబంధీకులు మొదలైనవారి గురించైతే తెలుసు
కదా. గృహస్థ వ్యవహారములో ఉంటూ, కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేస్తారు. పవిత్రముగా
అవ్వాలి, ఇతరులకు కూడా నేర్పించాలి. అప్పుడిక వారి భాగ్యములో ఉంటే ఈ మార్గములో నడవడం
మొదలుపెడతారు. బ్రాహ్మణ కులానికే వారు చెందకపోతే ఇక దేవతా కులములోకి ఎలా వస్తారు?
చాలా సహజమైన పాయింట్లను ఇవ్వడం జరుగుతుంది, ఇవి వెంటనే ఎవరి బుద్ధిలోనైనా
కూర్చుండిపోయేలా ఉంటాయి. వినాశ కాలే విపరీత బుద్ధి అన్న చిత్రము కూడా స్పష్టముగా
ఉంది. ఇప్పుడు ఆ రాజ్యము లేదు. ఒకప్పుడు దైవీ రాజ్యము ఉండేది, దానిని స్వర్గము అని
అనేవారు, ఇప్పుడు ఇది పంచాయితీ రాజ్యము, ఇలా అర్థం చేయించడములో తప్పేమీ లేదు. కానీ
తుప్పు తొలగి ఉంటేనే ఎవరికైనా బాణము తగులుతుంది. మొదట తుప్పును తొలగించుకునేందుకు
ప్రయత్నము చేయాలి. తమ క్యారెక్టర్ ను చూసుకోవాలి. రాత్రింబవళ్ళు నేను ఏం
చేస్తున్నాను? వంటింటిలో కూడా భోజనము వండేటప్పుడు, రోటీ చేసేటప్పుడు, ఎంత వీలైతే
అంత స్మృతిలో ఉండండి. విహరించేందుకు వెళ్ళినప్పుడు కూడా స్మృతిలో ఉండండి. తండ్రికి
అందరి అవస్థల గురించైతే తెలుసు కదా. పరచింతనా విషయాలను మాట్లాడుకున్నట్లయితే తుప్పు
ఇంకా ఎక్కువగా పడుతుంది. పరచింతనా విషయాలనేమీ వినకండి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.