13-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు దేవతలుగా అవ్వాలి కావున మాయావీ
అవగుణాలను త్యాగము చేయండి, కోపము చేయడము, కొట్టడము, విసిగించడము, చెడు పనులు చేయడము,
దొంగతనాలు చేయడము, ఇవన్నీ మహాపాపాలు’’
ప్రశ్న:-
ఈ
జ్ఞానంలో ఏ పిల్లలు వేగముగా ముందుకు వెళ్ళగలరు? ఎవరికి నష్టము కలుగుతుంది?
జవాబు:-
ఎవరికైతే తమ
లెక్కాపత్రము పెట్టడము వస్తుందో, వారు ఈ జ్ఞానములో చాలా వేగముగా ముందుకు వెళ్ళగలరు.
ఎవరైతే దేహీ-అభిమానులుగా ఉండరో వారికి నష్టము కలుగుతుంది. బాబా అంటారు,
వ్యాపారస్థులకు ఖాతా వ్రాసే అలవాటు ఉంటుంది, వారు ఇక్కడ కూడా వేగముగా ముందుకు
వెళ్ళగలరు.
పాట:-
ముఖము చూసుకో
ప్రాణీ...
ఓంశాంతి
ఆత్మిక పాత్రధారులైన పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే అనంతమైన
నాటకములో ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. నాటకము మనుష్యులదే కదా. పిల్లలు ఈ సమయంలో
పురుషార్థము చేస్తున్నారు. వేద-శాస్త్రాలు చదువుతారు, శివుని పూజ చేస్తారు కానీ
తండ్రి అంటారు - వీటి ద్వారా ఎవరూ నన్ను ప్రాప్తి చేసుకోలేరు ఎందుకంటే భక్తి అంటేనే
దిగే కళ. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది అంటే తప్పకుండా ఇంకేదో దాని కారణంగా
దిగడము కూడా జరుగుతుంది. ఇది ఒక ఆట, దీని గురించి ఎవరికీ తెలియదు. శివలింగాన్ని
పూజించినప్పుడు దానిని బ్రహ్మ తత్వము అని అనరు. మరి ఎవరిని పూజిస్తున్నట్లు. ఆ
లింగాన్ని కూడా ఈశ్వరునిగా భావించి పూజిస్తారు. మీరు మొట్టమొదట భక్తిని
ప్రారంభించినప్పుడు శివలింగాన్ని వజ్రాలతో తయారుచేస్తారు. ఇప్పుడు పేదవారిగా
అయిపోయారు కావున రాతితో తయారుచేస్తారు. వజ్రాల లింగము ఆ సమయములో 4-5 వేలు ఉండేది.
ఇప్పటి సమయంలోనైతే దాని విలువ 5-7 లక్షలు ఉంటుంది. అటువంటి వజ్రాలు ఇప్పుడు లభించడం
కష్టము. రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు కావున ఈ జ్ఞానము లేని కారణంగా పూజించడము కూడా
రాతి లింగాన్నే పూజిస్తారు. జ్ఞానము ఉన్నప్పుడు మీరు పూజ చేయరు. చైతన్యమైనవారు
సమ్ముఖంలో ఉన్నారు, వారినే మీరు స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా వికర్మలు
వినాశనమవుతాయని మీకు తెలుసు. పాటలో కూడా - ఓ పిల్లలూ అని అంటారు. ప్రాణి అని ఆత్మను
అనడం జరుగుతుంది. ప్రాణము వెళ్ళిపోతే ఇక శవము వలె అయిపోతారు. ఆత్మ వెళ్ళిపోతుంది.
ఆత్మ అవినాశీ. ఆత్మ శరీరములో ప్రవేశించినప్పుడు చైతన్యముగా ఉంటుంది. తండ్రి అంటారు
- హే ఆత్మలూ, స్వయాన్ని చెక్ చేసుకోండి - ఎంతవరకు దైవీ గుణాలు ధారణ అయ్యాయి? ఏ
వికారాలూ లేవు కదా? దొంగతనాలు మొదలైన ఆసురీ గుణాలైతే లేవు కదా? ఆసురీ కర్తవ్యాలు
చేసినట్లయితే మళ్ళీ పడిపోతారు. అంతటి పదవిని పొందలేరు. చెడు అలవాట్లను తప్పకుండా
తొలగించుకోవాలి. దేవతలు ఎప్పుడూ ఎవరి పైనా కోపము చేయరు. ఇక్కడ అసురుల ద్వారా ఎన్నో
దెబ్బలు తింటారు ఎందుకంటే మీరు దైవీ సంప్రదాయస్థులుగా అవుతున్నారు కావున మాయ ఎంతగా
శత్రువుగా అయిపోతుంది. మాయావి అవగుణాలు పని చేస్తాయి. కొట్టడము, విసిగించడము, చెడు
పనులు చేయడము, ఇవన్నీ పాపాలు. పిల్లలైన మీరు చాలా శుద్ధంగా ఉండాలి. దొంగతనాలు
మొదలైనవి చేయడము మహాపాపము. తండ్రితో మీరు ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు - బాబా,
నాకు మీరొక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. మేము మిమ్మల్నే స్మృతి చేస్తాము అని. భక్తి
మార్గంలో పాడుతారు కానీ స్మృతి ద్వారా ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారికి తండ్రి
గురించి తెలియనే తెలియదు. ఒకవైపు వారు నామ-రూపాలకు అతీతుడు అని అంటారు, మరోవైపు
మళ్ళీ లింగాన్ని పూజిస్తారు. మీరు మంచి రీతిలో అర్థము చేసుకుని, ఆ తర్వాత అర్థము
చేయించాలి. తండ్రి అంటారు, ఈ విషయాన్ని కూడా నిర్ణయించండి - మహాన్ ఆత్మ అని ఎవరిని
అంటారు? శ్రీ కృష్ణుడు చిన్న బాలుడు, స్వర్గానికి రాకుమారుడు, వారు మహాత్మనా లేక
ఇప్పటి కలియుగీ మనుష్యులా? వారు వికారాల ద్వారా జన్మించరు కదా. అది నిర్వికారీ
ప్రపంచము. ఇది వికారీ ప్రపంచము. నిర్వికారులకు అనేక టైటిల్స్ ను ఇవ్వవచ్చు.
వికారులకు ఏమి టైటిల్స్ ఉన్నాయి? శ్రేష్ఠాచారులుగా ఒక్క తండ్రి మాత్రమే
తయారుచేస్తారు. వారు అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు, మిగిలిన మనుష్యులందరూ
పాత్రధారులు కావున తప్పకుండా పాత్రను అభినయించడానికి రావాల్సి వస్తుంది. సత్యయుగము
శ్రేష్ఠ మనుష్యుల ప్రపంచము. జంతువులు మొదలైనవన్నీ శ్రేష్ఠముగా ఉంటాయి. అక్కడ మాయా
రావణుడే ఉండడు. అక్కడ ఇటువంటి తమోగుణీ జంతువులేవీ ఉండవు. సత్యయుగంలో వికారాల మాటే
ఉండదు. మరి అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారు! ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. అక్కడ
వికారాలు ఉండవు, అక్కడ ఉన్నదే యోగబలము. తండ్రి అంటారు - మిమ్మల్ని దేవతలుగా
తయారుచేస్తున్నాను కావున స్వయాన్ని పూర్తిగా చెక్ చేసుకోండి. శ్రమ లేకుండా
విశ్వానికి యజమానులుగా అవ్వగలరా.
ఆత్మలైన మీరు ఏ విధంగా బిందువో, అదే విధంగా తండ్రి కూడా బిందువు. ఇందులో తికమకపడే
అవసరమే లేదు. మేము చూడాలి అని కొంతమంది అంటారు. తండ్రి అంటారు, మీరు కనిపించేవారి
యొక్క పూజలు చాలా చేశారు. అసలేమీ లాభము కలగలేదు. ఇప్పుడు యథార్థ రీతిలో నేను మీకు
అర్థం చేయిస్తాను. నాలో మొత్తం పాత్ర అంతా నిండి ఉంది. నేను సుప్రీమ్ సోల్ ను కదా,
సుప్రీమ్ ఫాదర్ ను. ఏ పిల్లలూ తమ లౌకిక తండ్రిని ఈ విధంగా పిలవరు. అలా ఒక్కరినే
పిలుస్తారు. సన్యాసులను తండ్రి అని పిలవడానికి వారికి పిల్లలే ఉండరు. వీరు
ఆత్మలందరికీ తండ్రి, వీరు వారసత్వాన్ని ఇస్తారు. వారికి గృహస్థ ఆశ్రమాలేవీ లేవు.
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు - మీరే 84 జన్మలు అనుభవించారు, మొట్టమొదట మీరు
సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత క్రిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు స్వయాన్ని ఎవరూ
సుప్రీమ్ గా పిలుచుకోరు, ఇప్పుడైతే స్వయాన్ని నీచులుగా భావిస్తారు. తండ్రి పదే-పదే
ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు - లోలోపల చెక్ చేసుకోండి, నాలో ఏ
వికారాలూ లేవు కదా? ప్రతి రోజూ రాత్రి మీ లెక్కాపత్రాన్ని రాయండి. వ్యాపారస్థులు
ఎప్పుడూ ఖాతాను రాసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖాతా వ్రాయడానికి అవ్వదు ఎందుకంటే
వారి జీతము ఫిక్స్డ్ గా ఉంటుంది. ఈ జ్ఞానమార్గములో కూడా వ్యాపారస్థులు వేగంగా
ముందుకు వెళ్తారు, చదువుకున్న ఆఫీసర్లు అంతగా వెళ్ళరు. వ్యాపారంలోనైతే ఈ రోజు 50
సంపాదిస్తారు, రేపు 60 సంపాదిస్తారు. అప్పుడప్పుడు నష్టము కూడా కలుగుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతము ఫిక్స్డ్ గా ఉంటుంది. ఈ సంపాదనలో కూడా ఒకవేళ
దేహీ-అభిమానులుగా ఉండకపోతే నష్టము కలుగుతుంది. మాతలైతే వ్యాపారము చేయరు. వారికి ఇది
ఇంకా సహజము. కన్యలకు కూడా సహజమే ఎందుకంటే మాతలైతే మెట్లు దిగవలసి వస్తుంది. అంతగా
శ్రమ చేసేవారిదే గొప్పతనము. కన్యలైతే వికారాలలోకి వెళ్ళనే వెళ్ళలేదు, వారేమి వదలాలి.
పురుషులకైతే కష్టమనిపిస్తుంది. కుటుంబ-పరివారాలను సంభాళించవలసి ఉంటుంది. ఏ మెట్లనైతే
ఎక్కారో అవన్నీ దిగవలసి వస్తుంది. పదే-పదే మాయ చెంపదెబ్బ వేసి పడేస్తుంది. ఇప్పుడు
మీరు బి.కె.లు గా అయ్యారు. కుమారీలు పవిత్రంగానే ఉంటారు. అందరికంటే ఎక్కువ ప్రేమ పతి
పట్ల ఉంటుంది. మీరు పతులకే పతి అయిన పరమాత్మను స్మృతి చేయాలి, మిగిలిన వారందరినీ
మర్చిపోవాలి. తల్లిదండ్రులకు పిల్లలపై మోహముంటుంది. పిల్లలకైతే ఏమీ ఉండదు. వివాహము
తర్వాత మోహము మొదలవుతుంది. మొదట పత్ని పట్ల ప్రేమ ఉంటుంది, తర్వాత వికారాల మెట్ల
మీదకు తొయ్యడము మొదలుపెడతారు. కుమారీలు నిర్వికారిగా ఉంటారు కావున పూజింపబడతారు. మీ
పేరు బి.కె. మీరు మహిమా యోగ్యులుగా అయి తర్వాత పూజకు యోగ్యులుగా అవుతారు. తండ్రియే
మీకు టీచరు కూడా. కావున పిల్లలైన మీకు నషా ఉండాలి, మేము విద్యార్థులము. భగవంతుడు
తప్పకుండా భగవాన్-భగవతీలుగానే తయారుచేస్తారు. కేవలం ఏమని అర్థం చేయించడం
జరుగుతుందంటే - భగవంతుడు ఒక్కరే. మిగిలినవారంతా సోదరులు. ఇంకే సంబంధమూ లేదు.
ప్రజాపిత బ్రహ్మా ద్వారా రచన జరుగుతుంది, తర్వాత వృద్ధి జరుగుతుంది. ఆత్మల వృద్ధి
అని అనరు. మనుష్యుల వృద్ధి జరుగుతుంది. ఆత్మలు లిమిటెడ్ గా (పరిమిత సంఖ్యలో) ఉంటారు.
చాలామంది ఆత్మలు వస్తూ ఉంటారు. అక్కడ ఆత్మలు ఉన్నంతవరకు వస్తూనే ఉంటారు. వృక్షము
పెరుగుతూ ఉంటుంది. అది ఎండిపోతుంది అని కాదు. దీనిని మర్రి వృక్షముతో పోల్చడం
జరుగుతుంది. దీనికి పునాది లేదు. కానీ మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంటుంది. మీ
విషయములో కూడా అలాగే ఉంది. పునాది లేదు. ఏవో కొన్ని గుర్తులున్నాయి. ఇప్పటికీ కూడా
మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. దేవతల రాజ్యము ఎప్పుడు ఉండేది, తర్వాత ఎక్కడికి
వెళ్ళింది అనేది మనుష్యులకు ఏమైనా తెలుసా. ఈ జ్ఞానము బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది.
పరమాత్మ స్వరూపము బిందువు అని మనుష్యులకు తెలియదు. వారు అఖండ జ్యోతి స్వరూపుడు అని
గీతలో వ్రాసేశారు. ఇంతకుముందు చాలామందికి భావన అనుసారంగా సాక్షాత్కారము జరిగేది.
వారి ముఖము చాలా ఎర్ర-ఎర్రగా అయిపోయేది. మేము ఇక సహనము చేయలేము, ఇక చాలు అని అనేవారు.
అదైతే సాక్షాత్కారము. తండ్రి అంటారు - సాక్షాత్కారము ద్వారా ఎటువంటి కళ్యాణమూ జరగదు.
ఇక్కడ ముఖ్యమైనది స్మృతి యాత్ర. ఏ విధంగా పాదరసము జారిపోతుంది కదా, అదే విధంగా
స్మృతి కూడా ఘడియ-ఘడియ జారిపోతుంది. తండ్రిని స్మృతి చేయాలని ఎంతగా అనుకుంటారు, కానీ
వేరే-వేరే ఆలోచనలు వచ్చేస్తాయి. ఇందులోనే మీ రేస్ ఉంది. పాపాలు వెంటనే
సమాప్తమైపోతాయని కాదు. సమయము పడుతుంది. కర్మాతీత అవస్థ తయారైతే ఇక ఈ శరీరమే ఉండదు.
కానీ ఇప్పుడే ఎవరూ కర్మాతీత అవస్థను పొందలేరు. అలా జరిగితే, అప్పుడు వారికి సత్యయుగీ
శరీరము కావాలి. కావున ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రినే స్మృతి చేయాలి. స్వయాన్ని
పరిశీలించుకుంటూ ఉండండి - మా ద్వారా చెడు కర్మలేవీ జరగడము లేదు కదా? లెక్కాపత్రాన్ని
తప్పకుండా పెట్టాలి. ఇటువంటి వ్యాపారస్థులు వెంటనే షావుకార్లుగా అవ్వగలరు.
తండ్రి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో, అది ఇస్తున్నారు. తండ్రి అంటారు, నా ఆత్మలో ఈ
జ్ఞానము నిశ్చితమై ఉంది. కల్పక్రితము ఏ జ్ఞానమునైతే ఇచ్చానో, మళ్ళీ అదే చెప్తాను.
పిల్లలకే అర్థము చేయిస్తాను, ఇతరులకు అర్థమవ్వదు కదా. మీకు ఈ సృష్టి చక్రము గురించి
తెలుసు, ఇందులో పాత్రధారులందరి పాత్ర నిశ్చితమై ఉంది. ఇందులో మార్పు చేర్పులు ఉండవు.
ఎవరూ దీని నుండి విముక్తులుగా అవ్వలేరు. అయితే, మిగిలిన సమయములో ముక్తి లభిస్తుంది.
మీరు ఆల్ రౌండర్లు. 84 జన్మలు తీసుకుంటారు. మిగిలినవారంతా తమ ఇంట్లో ఉంటారు, తర్వాత
చివర్లో వస్తారు. మోక్షము కోరుకునేవారు ఇక్కడికి రారు, వారు చివర్లో పరంధామానికి
తిరిగి వెళ్ళిపోతారు. వారు జ్ఞానము ఎప్పుడూ వినరు. దోమల వలె వస్తారు మరియు
వెళ్ళిపోతారు. మీరు డ్రామానుసారంగా చదువుకుంటారు. మీకు తెలుసు, బాబా 5 వేల
సంవత్సరాల క్రితం కూడా ఇలాగే రాజయోగాన్ని నేర్పించారు. శివబాబా ఈ విధంగా
చెప్తున్నారని మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు తెలుసు, మనము ఎంత
ఉన్నతంగా ఉండేవారము, ఇప్పుడు ఎంత నీచంగా అయ్యాము. మళ్ళీ తండ్రి ఉన్నతంగా
తయారుచేస్తారు కావున అటువంటి పురుషార్థము చేయాలి కదా. ఇక్కడికి మీరు రిఫ్రెష్
అయ్యేందుకు వస్తారు. దీని పేరే మధుబన్. మీ కలకత్తాలో లేక బొంబాయిలో ఏమైనా మురళి
నడిపిస్తారా. మధుబన్ లోనే మురళి మ్రోగుతుంది. రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు
మురళి వినడము కోసము రావలసి ఉంటుంది. కొత్త-కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. చాలా
తేడా ఉంది అని సమ్ముఖంలో విన్నప్పుడు అనుభవము చేస్తారు. మున్ముందు ఎన్నో పాత్రలను
చూడాల్సి ఉంటుంది. బాబా ముందే అంతా వినిపిస్తే అంత రుచి ఉండదు. నెమ్మది-నెమ్మదిగా
ఇమర్జ్ అవుతూ ఉంటుంది. ఒక సెకండు మరొక సెకెండుతో కలవదు. తండ్రి ఆత్మిక సేవను
చేసేందుకు వచ్చారు కావున ఆత్మిక సేవ చేయడము పిల్లల బాధ్యత కూడా. తండ్రిని స్మృతి
చేయండి మరియు పవిత్రంగా అవ్వండి అని కనీసం ఇదైనా చెప్పండి. పవిత్రత విషయములోనే
ఫెయిల్ అవుతారు ఎందుకంటే స్మృతి చేయరు. పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. మేము
అనంతమైన తండ్రి సమ్ముఖములో కూర్చున్నాము, వారి గురించి ఎవరికీ తెలియదు. జ్ఞానసాగరుడు
ఆ శివబాబా మాత్రమే. దేహధారుల నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. ఇది శివబాబా రథము.
వీరికి గౌరవాన్ని ఇవ్వకపోతే ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.
పెద్దవారి పట్ల గౌరవాన్ని ఉంచాలి కదా. ఆదిదేవ్ కు ఎంత గౌరవాన్ని ఇస్తారు. జడ
చిత్రాలకే అంతటి గౌరవము ఇచ్చినప్పుడు, మరి చైతన్యములో ఉన్నవారికి ఎంత గౌరవాన్ని
ఇవ్వాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. లోలోపల స్వయాన్ని పరిశీలించుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి. చెడు అలవాట్లను
తొలగించుకోవాలి. బాబా, మేము ఎప్పుడూ చెడు కర్మలు చేయము అని ప్రతిజ్ఞ చేయాలి.
2. కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి యొక్క రేస్ చేయాలి. ఆత్మిక సేవలో
తత్పరులై ఉండాలి. పెద్దవారి పట్ల గౌరవాన్ని ఉంచాలి.
వరదానము:-
ఫాలో ఫాదర్ పాఠము ద్వారా కష్టమైనవాటిని కూడా సహజము చేసే
తీవ్ర పురుషార్థీ భవ
కష్టమైనవాటిని సహజము చేసేందుకు మరియు చివరి పురుషార్థంలో
సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు మొదటి పాఠము ‘‘ఫాలో ఫాదర్’’. ఈ మొదటి పాఠమే చివరి
స్టేజ్ ను సమీపముగా తీసుకువస్తుంది. ఈ పాఠము ద్వారా పొరపాట్లు లేనివారిగా, ఏకరసముగా
మరియు తీవ్ర పురుషార్థులుగా అవుతారు ఎందుకంటే ఎప్పుడైతే ఫాలో చేసేందుకు బదులుగా తమ
బుద్ధిని ఉపయోగిస్తారో, అప్పుడే ఏదైనా విషయము కష్టమనిపిస్తుంది. దీని వలన స్వయము
యొక్క సంకల్పాల వలలోనే చిక్కుకుపోతారు, అప్పుడు దాని వెనుక సమయము కూడా ఖర్చు
అవుతుంది మరియు శక్తి కూడా ఖర్చు అవుతుంది. ఒకవేళ ఫాలో చేస్తూ వెళ్ళారంటే సమయము
మరియు శక్తి, రెండూ పొదుపు అవుతాయి, జమ అవుతాయి.
స్లోగన్:-
సత్యత,
స్వచ్ఛతలను ధారణ చేసేందుకు తమ స్వభావాన్ని సరళముగా తయారుచేసుకోండి.
అవ్యక్త సూచనలు -
స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి
ఎంతగా స్వయాన్ని మనసా
సేవలో బిజీ పెట్టుకుంటారో, అంతగానే సహజంగా మాయాజీతులుగా అవుతారు. కేవలం స్వయము పట్ల
మాత్రమే భావన కలిగి ఉండడము కాదు, కానీ ఇతరులను కూడా శుభ భావన మరియు శుభ కామనల ద్వారా
పరివర్తన చేసే సేవ చెయ్యండి. భావన మరియు జ్ఞానము, స్నేహము మరియు యోగము రెండింటి
యొక్క బ్యాలెన్స్ఉండాలి. కళ్యాణకారులుగా అయితే అయ్యారు, ఇప్పుడు అనంతమైన విశ్వ
కళ్యాణకారులుగా అవ్వండి.
| | |