14-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ పురుషోత్తమ సంగమయుగము కళ్యాణకారీ
యుగము, ఈ యుగములోనే పరివర్తన జరుగుతుంది, మీరు కనిష్టుల నుండి ఉత్తమ పురుషులుగా
అవుతారు’’
ప్రశ్న:-
ఈ
జ్ఞాన మార్గములో ఏ విషయాన్ని ఆలోచించడము లేక మాట్లాడడము వలన ఎప్పుడూ ఉన్నతి జరగదు?
జవాబు:-
డ్రామాలో ఉంటే
పురుషార్థము చేస్తాము. డ్రామా చేయిస్తే చేస్తాము. ఇలా ఆలోచించేవారు లేక మాట్లాడేవారి
యొక్క ఉన్నతి ఎప్పుడూ జరగదు. ఇలా అనడమే రాంగ్. మీకు తెలుసు, ఇప్పుడు మనము ఏదైతే
పురుషార్థము చేస్తున్నామో, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పురుషార్థము
చేయాల్సిందే.
పాట:-
ఇది దీపము
మరియు తుఫాను యొక్క కథ...
ఓంశాంతి
ఇది కలియుగీ మనుష్యుల పాట. కానీ దీని అర్థము వారికి తెలియదు. దీని గురించి మీకు
తెలుసు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగవాసులు. సంగమయుగముతో పాటు పురుషోత్తమ అని
కూడా వ్రాయాలి. పిల్లలకు జ్ఞానము యొక్క పాయింట్లు గుర్తు ఉండని కారణంగా ఇలాంటి
పదాలను వ్రాయడం మర్చిపోతారు. ఇది ముఖ్యమైనది, దీని అర్థాన్ని కూడా మీరే అర్థం
చేసుకుంటారు. పురుషోత్తమ మాసము కూడా ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సంగమము
కూడా ఒక పండుగ. ఈ పండుగ అన్నింటికన్నా ఉన్నతమైనది. మీకు తెలుసు, ఇప్పుడు మనము
పురుషోత్తములుగా అవుతున్నాము. ఉత్తమోత్తమ పురుషులుగా అవుతున్నాము. లక్ష్మీనారాయణులను
ఉన్నతోన్నతమైనవారు, షావుకారులకే షావుకార్లు, నంబరువన్ అని అంటారు. మహాప్రళయము
జరిగినట్లు, తర్వాత నంబరువన్ శ్రీకృష్ణుడు సాగరంలో రావి ఆకుపై వచ్చినట్లు
శాస్త్రాలలో చూపిస్తారు. ఇప్పుడు మీరేమంటారు? ఈ శ్రీకృష్ణుడు నంబరువన్, వారినే
శ్యామ-సుందరుడు అని అంటారు. వారు బొటన వ్రేలు చప్పరిస్తూ వచ్చారని చూపిస్తారు.
చిన్న బిడ్డ గర్భములోనే ఉంటాడు. కావున జ్ఞానసాగరుని నుండి వెలువడిన మొట్టమొదటి
ఉత్తమోత్తమ పురుషుడు శ్రీకృష్ణుడు. జ్ఞానసాగరుని ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది.
అక్కడ నంబరువన్ పురుషోత్తముడు ఈ శ్రీకృష్ణుడు మరియు వీరు జ్ఞానసాగరుడు, నీటి సాగరము
కాదు. ప్రళయము కూడా జరగదు. కొత్త-కొత్త పిల్లలు వస్తారు కావున బాబా పాత పాయింట్లను
మళ్ళీ రిపీట్ చేయవలసి ఉంటుంది. సత్య-త్రేతా-ద్వాపర-కలియుగాలు... ఇవి నాలుగు యుగాలు.
ఐదవది పురుషోత్తమ సంగమయుగము. ఈ యుగములో మనుష్యులు పరివర్తన అవుతారు. కనిష్టుల నుండి
సర్వోత్తములుగా అవుతారు. శివబాబాను కూడా పురుషోత్తముడు లేక సర్వోత్తముడు అని అంటారు
కదా. వారు పరమ ఆత్మ, పరమాత్మ. తర్వాత పురుషులలో ఉత్తములు ఈ లక్ష్మీ-నారాయణులు.
వీరిని ఈ విధంగా ఎవరు తయారుచేశారు? ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ సమయంలో మనం
ఈ విధంగా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాము అని పిల్లలకు కూడా అర్థమయ్యింది.
పురుషార్థము పెద్దదేమీ కాదు. చాలా సింపుల్. నేర్చుకునేవారు కూడా అబలలు, కుబ్జలు,
వారేమీ చదువుకోలేదు. వారికి ఎంత సహజంగా అర్థము చేయించడము జరుగుతుంది. చూడండి,
అహ్మదాబాద్ లో ఒక సాధువు ఉండేవారు, నేనేమీ తినను-తాగను అని చెప్పేవారు. అచ్ఛా,
ఎవరైనా జీవితాంతము తినకుండా-త్రాగకుండా ఉంటే లాభమేముంది? ప్రాప్తి ఏమీ లేదు కదా.
వృక్షానికి కూడా భోజనం లభిస్తుంది కదా. దానికి ఎరువు, నీరు మొదలైనవి న్యాచురల్ గా
లభిస్తుంది, వాటి ద్వారా వృక్షము వృద్ధి చెందుతుంది. ఆ సాధువు కూడా ఏదో
రిద్ధి-సిద్ధులను పొంది ఉంటారు. అగ్ని పైన, నీటి పైన నడిచి వెళ్ళేవారు చాలామంది
ఉన్నారు. కానీ వీటి వలన లాభమేముంది. మీ ఈ సహజ రాజయోగముతో జన్మ-జన్మాంతరాలకు
లాభముంటుంది. ఇది మిమ్మల్ని జన్మ-జన్మాంతరాలకు దుఃఖితుల నుండి సుఖవంతులుగా చేస్తుంది.
తండ్రి అంటారు - పిల్లలూ, డ్రామానుసారంగా నేను మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తాను.
శివుడిని మరియు శంకరుడిని ఎందుకు కలిపారో బాబా అర్థము చేయించారు. శంకరునికైతే ఈ
సృష్టిలో పాత్రయే లేదు. శివునికి, బ్రహ్మాకు, విష్ణువుకు పాత్ర ఉంది. బ్రహ్మా మరియు
విష్ణువులది ఆల్ రౌండ్ పాత్ర. శివబాబా పాత్ర కూడా ఈ సమయంలో ఉంది, వారు వచ్చి
జ్ఞానాన్నిస్తారు. తర్వాత నిర్వాణధామానికి వెళ్ళిపోతారు. పిల్లలకు ఆస్తిని ఇచ్చి
స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. వానప్రస్థులుగా అవ్వడము అనగా గురువు ద్వారా వాణి
నుండి అతీతముగా వెళ్ళే పురుషార్థము చేయడము. కానీ తిరిగి ఎవరూ వెళ్ళలేరు ఎందుకంటే
వికారులుగా, భ్రష్టాచారులుగా ఉన్నారు. అందరి జన్మ వికారాల ద్వారానే జరుగుతుంది. ఈ
లక్ష్మీనారాయణులు నిర్వికారులు, వారి జన్మ వికారాల ద్వారా జరగదు కావున వారు
శ్రేష్ఠాచారులుగా పిలవబడతారు. కుమారీలు కూడా నిర్వికారులు కావున వారి ముందు తల
వంచుతారు. ఇక్కడ శంకరునికి ఎలాంటి పాత్ర లేదు అని బాబా అర్థం చేయించారు, ప్రజాపిత
బ్రహ్మా అయితే తప్పకుండా ప్రజలకు తండ్రి కదా. శివబాబాను ఆత్మల తండ్రి అని అంటారు.
వారు అవినాశీ తండ్రి, ఈ గుహ్యమైన విషయాలను మంచి రీతిలో ధారణ చేయాలి. ఎవరైతే
గొప్ప-గొప్ప తత్వవేత్తలు ఉంటారో, వారికి ఎన్నో టైటిల్స్ లభిస్తాయి. శ్రీ శ్రీ 108
అనే టైటిల్ కూడా పండితులకు లభిస్తుంది. బనారస్ కాలేజీ నుండి పాస్ అయ్యి టైటిల్స్ ను
తీసుకుంటారు. తండ్రి టైటిల్ ను కూడా వారు స్వయానికి పెట్టుకుని కూర్చున్నారు అని
వారికి వెళ్ళి అర్థం చేయించమని బాబా గుప్తాజీ ని బనారస్ కు పంపించారు. తండ్రిని శ్రీ
శ్రీ 108 జగత్ గురువు అని అంటారు. 108 మాల ఉంటుంది. అష్టరత్నాలను మహిమ చేస్తారు.
వారు పాస్ విత్ ఆనర్ గా అవుతారు అందుకే వారి మాలను జపిస్తారు. ఆ తర్వాత 108 మాలను
జపిస్తారు, వారి కన్నా తక్కువగా ఉన్నవారి యొక్క పూజను చేస్తారు. యజ్ఞాన్ని
రచించినప్పుడు కొందరు 1000 సాలిగ్రామాలను తయారుచేస్తారు, కొందరు 10 వేలు, కొందరు 50
వేలు, కొందరు లక్ష కూడా తయారుచేస్తారు. మట్టితో తయారుచేసి యజ్ఞాన్ని రచిస్తారు. సేఠ్
ఏ విధంగా ఉంటారో, అంత బాగా తయారుచేయిస్తారు, పెద్ద సేఠ్ అయితే లక్ష తయారుచేయిస్తారు.
తండ్రి అర్థం చేయించారు - మాల అయితే పెద్దది కదా, 16,108 మాలను తయారుచేస్తారు.
పిల్లలైన మీకు ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీరందరూ బాబాతో పాటు
భారత్ యొక్క సేవను చేస్తున్నారు. తండ్రికి పూజ జరుగుతున్నప్పుడు పిల్లలకు కూడా పూజ
జరగాలి, రుద్ర పూజ ఎందుకు జరుగుతుందో వారికి తెలియదు. పిల్లలందరూ శివబాబాకు
చెందినవారు. ఈ సమయములో సృష్టిలో ఎంత జనాభా ఉంది, ఇందులో ఆత్మలందరూ శివబాబాకు పిల్లలే
కదా. కానీ అందరూ సహాయకులుగా అవ్వరు. ఈ సమయంలో మీరు ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా
ఉన్నతముగా అవుతారు. పూజకు యోగ్యులుగా అవుతారు. ఈ విషయాన్ని అర్థం చేయించే అంతటి
శక్తి ఇంకెవ్వరికీ లేదు, అందుకే - ఈశ్వరుని గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు అని
అంటారు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు, తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు కావున
తప్పకుండా జ్ఞానాన్నే ఇస్తారు కదా. ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. భగవంతుడు ఏమైనా
ప్రేరణ ద్వారా అర్థం చేయిస్తారా. వారి వద్ద సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముందని, దానిని
మళ్ళీ పిల్లలైన మీకు వినిపిస్తారని మీకు తెలుసు. మీకు ఈ నిశ్చయముంది - నిశ్చయము
ఉన్నప్పటికీ తండ్రిని మర్చిపోతారు. తండ్రి స్మృతియే ఈ చదువు యొక్క సారము.
స్మృతియాత్ర ద్వారా కర్మాతీత అవస్థను పొందడము శ్రమ అనిపిస్తుంది, ఇందులోనే మాయ
విఘ్నాలు వస్తాయి. చదువులో ఇన్ని విఘ్నాలు రావు. శంకరుడు నేత్రాన్ని తెరిస్తే
వినాశనం జరుగుతుందని శంకరుని గురించి ఈ విధంగా చెప్తారు, ఇలా చెప్పడము కూడా సరి కాదు.
తండ్రి అంటారు - నేనూ వినాశనము చేయించను, శంకరుడు కూడా చేయరు, ఇది రాంగ్, దేవతలు
పాపము చేయరు. ఇప్పుడు శివబాబా కూర్చొని ఈ విషయాలను అర్థం చేయిస్తారు. ఆత్మకు ఈ
శరీరము రథము. ప్రతి ఒక్క ఆత్మ తన రథముపై స్వారీ చేస్తుంది. తండ్రి అంటారు - నేను
వీరి రథాన్ని అప్పుగా తీసుకుంటాను కావున నాది దివ్య, అలౌకిక జన్మ అని అంటారు.
ఇప్పుడు మీ బుద్ధిలో 84 జన్మల చక్రముంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాము, తర్వాత
స్వర్గములోకి వస్తామని మీకు తెలుసు. బాబా చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు, ఇందులో
హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. బాబా, మేము చదువుకోలేదు, నోటి ద్వారా ఏమీ వెలువడడం లేదు
అని అంటారు. కానీ అలా జరగదు. నోరు అయితే తప్పకుండా పని చేస్తుంది. భోజనం
చేస్తున్నారంటే నోరు పని చేస్తుందనే కదా. వాణి వెలువడకపోవడము అనేది జరగదు. బాబా చాలా
సహజముగా అర్థం చేయించారు. ఎవరైనా మౌనంలో ఉన్నా కూడా - వారిని స్మృతి చేయండి అని పైకి
చూపిస్తారు. దుఃఖహర్త-సుఖకర్త ఆ ఒక్క దాత మాత్రమే. వారు భక్తిమార్గములో కూడా దాత,
అలాగే ఈ సమయములో కూడా దాత, వానప్రస్థంలో శాంతి మాత్రమే ఉంటుంది. పిల్లలు కూడా
శాంతిధామములో ఉంటారు. పాత్ర నిశ్చితమై ఉంది, ఆ పాత్రను అభినయిస్తారు. విశ్వాన్ని
కొత్తగా తయారుచేయడము ఇప్పుడు మన పాత్ర. స్వర్గ రచయిత అన్న వారి పేరు చాలా బాగుంది.
తండ్రి స్వర్గ రచయిత. తండ్రి నరకాన్ని ఏమైనా రచిస్తారా. పాత ప్రపంచాన్ని ఎవరైనా
రచిస్తారా. ఎప్పుడూ కొత్త ఇంటినే నిర్మిస్తారు. శివబాబా బ్రహ్మా ద్వారా కొత్త
ప్రపంచాన్ని రచిస్తారు. వారికి పాత్ర లభించి ఉంది. ఇక్కడ పాత ప్రపంచములో ఉన్న
మనుష్యులందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు.
మీకు తెలుసు - మనము శివబాబా సంతానము. తర్వాత శరీరధారి ప్రజాపిత బ్రహ్మాకు దత్తత
తీసుకోబడిన పిల్లలుగా అయ్యాము. మనకు జ్ఞానాన్ని వినిపించేవారు, రచయిత అయిన శివబాబా.
వారు తమ రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ విధంగా అవ్వడమే మీ
లక్ష్యము-ఉద్దేశ్యము. మనుష్యులు ఎంతగా ఖర్చు చేసి మార్బల్ మొదలైనవాటితో మూర్తులను
తయారుచేస్తారో చూడండి. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము, వరల్డ్ యూనివర్సిటీ. మొత్తం
విశ్వాన్ని పరివర్తన చేయడము జరుగుతుంది. వారికున్న క్యారెక్టర్లు అన్నీ ఆసురీ
క్యారెక్టర్లు. అవి ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తాయి. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము.
ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఒకటే ఉంటుంది, దానిని ఈశ్వరుడు వచ్చి తెరుస్తారు, దీని
ద్వారా మొత్తం విశ్వము యొక్క కళ్యాణము జరుగుతుంది. పిల్లలైన మీకిప్పుడు రైట్ మరియు
రాంగ్ యొక్క జ్ఞానము లభిస్తుంది, ఇలా అర్థం చేసుకునే మనుష్యులు ఇంకెవరూ లేరు. రైట్
రాంగ్ లను అర్థం చేయించే ధర్మయుక్తమైనవారు ఒక్కరే, వారినే సత్యము అని అంటారు.
తండ్రియే వచ్చి ప్రతి ఒక్కరినీ ధర్మయుక్తంగా తయారుచేస్తారు. ధర్మయుక్తంగా
అయినట్లయితే ముక్తిలోకి వెళ్ళి, ఆ తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. డ్రామా గురించి
కూడా పిల్లలైన మీకు తెలుసు. ఆది నుండి మొదలుకొని అంతిమము వరకు పాత్రను
అభినయించేందుకు నంబరువారుగా వస్తారు. ఈ ఆట నడుస్తూనే ఉంటుంది. డ్రామా షూటింగ్
జరుగుతూ ఉంటుంది. ఇది ఎవర్ న్యూ (సదా కొత్తగా ఉంటుంది). ఈ డ్రామా ఎప్పుడూ పాతదిగా
అవ్వదు, మిగిలిన నాటకాలు మొదలైనవన్నీ వినాశనమైపోతాయి. ఇది అనంతమైన అవినాశీ డ్రామా.
ఇందులో పాత్రధారులందరూ అవినాశీ. అవినాశీ ఆట మరియు రంగస్థలము ఎంత పెద్దదిగా ఉందో
చూడండి. తండ్రి వచ్చి పాత సృష్టిని మళ్ళీ కొత్తదిగా చేస్తారు. అవన్నీ మీకు
సాక్షాత్కారమవుతాయి. సమీపంగా వచ్చే కొద్దీ మీకు సంతోషము కలుగుతుంది. సాక్షాత్కారాలు
జరుగుతాయి. ఇప్పుడు పాత్ర పూర్తయ్యిందని అంటారు. డ్రామా అయితే మళ్ళీ రిపీట్ అవ్వాలి.
కల్పక్రితం అభినయించిన పాత్రను మళ్ళీ కొత్తగా అభినయిస్తారు. ఇందులో కొద్దిగా కూడా
తేడా ఉండదు, కావున ఎంత వీలైతే అంత పిల్లలైన మీరు ఉన్నత పదవిని పొందాలి. పురుషార్థము
చేయాలి, తికమకపడకూడదు. డ్రామా ఏది చేయించేది ఉంటే, అది చేయిస్తుంది అని ఇలా అనడము
కూడా రాంగ్. మనమైతే పురుషార్థము చేయాల్సిందే. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. చదువు యొక్క సారాన్ని బుద్ధిలో ఉంచుకొని స్మృతియాత్ర ద్వారా కర్మాతీత అవస్థను
పొందాలి. ఉన్నతమైనవారిగా, పూజ్యనీయులుగా అయ్యేందుకు తండ్రికి పూర్తిగా సహాయకులుగా
అవ్వాలి.
2. సత్యమైన తండ్రి ద్వారా రైట్-రాంగ్ యొక్క జ్ఞానము ఏదైతే లభించిందో, దాని ద్వారా
ధర్మయుక్తంగా అయి జీవన బంధనము నుండి ముక్తులవ్వాలి. ముక్తి మరియు జీవన్ముక్తుల
వారసత్వాన్ని తీసుకోవాలి.
వరదానము:-
పరస్పరము స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడము ద్వారా సర్వులను
సహయోగులుగా చేసే సఫలతామూర్త భవ
ఇప్పుడు జ్ఞానాన్ని ఇచ్చే మరియు తీసుకునే స్టేజ్ ను దాటారు,
ఇప్పుడు స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడము చేయండి. ఎవరు ఎదురుగా వచ్చినా, సంపర్కంలోకి
వచ్చినా, స్నేహాన్ని ఇవ్వాలి మరియు తీసుకోవాలి - అటువంటివారిని సర్వులకు స్నేహీలు
మరియు సర్వులకు ప్రియమైనవారు అని అంటారు. జ్ఞానదానము అజ్ఞానులకు చేయాలి కానీ
బ్రాహ్మణ పరివారములో ఈ దానము యొక్క మహాదానులుగా అవ్వాలి. సంకల్పములో కూడా ఎవరి
పట్లనైనా స్నేహము తప్ప ఇంకేదీ ఉత్పన్నమవ్వకూడదు. ఎప్పుడైతే అందరి పట్ల స్నేహము
ఏర్పడుతుందో, అప్పుడు స్నేహానికి రిటర్న్ గా సహయోగము లభిస్తుంది మరియు సహయోగానికి
ప్రతిఫలముగా సఫలత లభిస్తుంది.
స్లోగన్:-
ఒక్క
సెకెండులో వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టడము - ఇదే తీవ్ర పురుషార్థము.
మాతేశ్వరిగారి
అమూల్యమైన మహావాక్యాలు
ఈ రోజులలో మనుష్యులు
ముక్తినే మోక్షము అని అంటారు, ఎవరైతే ముక్తిని పొందుతారో, వారు జనన-మరణాల నుండి
విడుదలవుతారని వారు భావిస్తారు. వారు జనన-మరణాలలోకి రాకపోవడమే ఉన్నతమైన పదవిగా
భావిస్తారు, దానినే ప్రారబ్ధము అని అనుకుంటారు. జీవితములో ఉంటూ మంచి కర్మలను చేయడమే
జీవన్ముక్తిగా భావిస్తారు, ఏ విధంగా ధర్మాత్మలు ఉన్నారు, వారు జీవన్ముక్తులుగా
ఉన్నట్లు భావిస్తారు. అంతేకానీ, కర్మ బంధనాల నుండి ముక్తులవ్వడమే జీవన్ముక్తి అని
కోటిలో ఎవరో అరుదుగా మాత్రమే అర్థం చేసుకుంటారు, ఇప్పుడు ఇది వారి అభిప్రాయము. కానీ
ఎంతవరకైతే మనుష్యులు మొదట వికారీ కర్మబంధనాల నుండి ముక్తులవ్వరో, అంతవరకు
ఆదిమధ్యాంతాలు దుఃఖము నుండి విడుదలవ్వలేరని మనము పరమాత్మ ద్వారా తెలుసుకున్నాము.
కావున దీని నుండి విడుదల అవ్వడము కూడా ఒక స్టేజ్. అది కూడా మొదట ఈశ్వరీయ జ్ఞానాన్ని
ధారణ చేసినప్పుడే, ఆ స్టేజ్ వరకు చేరుకోగలరు మరియు ఆ స్టేజ్ వరకు చేర్చేందుకు
స్వయంగా పరమాత్మ కావాలి, ఎందుకంటే ముక్తి-జీవన్ముక్తులను ఇచ్చేవారు వారు, అది కూడా
ఒకే సమయములో వచ్చి అందరికీ ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. అంతేకానీ పరమాత్మ అనేక
సార్లు ఏమీ రారు. పరమాత్మయే అన్ని అవతారాలను ధారణ చేస్తారని కూడా భావించకండి. ఓం
శాంతి.
అవ్యక్త సూచనలు -
స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి
మనసా సేవ అనంతమైన
సేవ. ఎంతగా మీరు మనసు ద్వారా, వాణి ద్వారా స్వయం శ్యాంపుల్గా అవుతారో, అప్పుడు
శ్యాంపుల్ను చూసి స్వతహాగానే ఆకర్షితులవుతారు. కేవలం దృఢ సంకల్పము
పెట్టుకున్నట్లయితే సేవ సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాణి కొరకు సమయము లేకపోతే
వృత్తి ద్వారా, మనసు ద్వారా పరివర్తన చేసే సమయమైతే ఉంది కదా. ఇప్పుడు సేవ కోసము
తప్ప మరే విధంగానూ సమయాన్ని పోగొట్టుకోకూడదు. నిరంతర యోగులుగా, నిరంతర సేవాధారులుగా
అవ్వండి. ఒకవేళ మనసా సేవ చెయ్యటం రాకపోతే మీ సంపర్కము ద్వారా, మీ నడవడిక ద్వారా కూడా
సేవ చేయవచ్చు.
| | |