15-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 24.03.2009


‘‘బాప్ దాదా ద్వారా లభించిన ఖజానాలను స్వయములో నింపుకుని కార్యములో వినియోగించండి, అనుభవము యొక్క అథారిటీలుగా అవ్వండి’’

ఈ రోజు నలువైపులా ఉన్న సర్వ ఖజానాలను జమ చేసుకునే సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. దానితోపాటు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు సర్వ ఖజానాలను జమ చేసుకున్నారు అన్న రిజల్టును కూడా చూస్తున్నారు. ఖజానాలైతే బాప్ దాదా ద్వారా అవినాశీ అయినవి ఎన్నో ప్రాప్తించాయి. అన్నిటికంటే ముందుగా అత్యంత పెద్ద ఖజానా జ్ఞాన ధనము, దాని ద్వారా ముక్తి మరియు జీవన్ముక్తి ప్రాప్తించాయి. పాత దేహము మరియు పాత ప్రపంచము నుండి ముక్తి అయిన జీవన్ముక్తి స్థితి మరియు ముక్తిధామానికి వెళ్ళే మార్గము పిల్లలందరికీ ప్రాప్తించాయి. అలాగే, ఒక్క జ్ఞాన ఖజానాయే కాదు, యోగము కూడా ఖజానాయే, దీని ద్వారా సర్వ శక్తుల ప్రాప్తి లభిస్తుంది. దానితోపాటు ధారణ చేసే ఖజానా, దీని ద్వారా సర్వ గుణాల ప్రాప్తి లభిస్తుంది. దానితోపాటు సేవా ఖజానా, దీని ద్వారా ఆశీర్వాదాల ఖజానా, సంతోషపు ఖజానా ప్రాప్తిస్తాయి. దానితోపాటు అన్నిటికంటే అత్యంత పెద్ద ఖజానా వర్తమాన సంగమయుగము యొక్క సమయము ఎందుకంటే పూర్తి కల్పములో ఈ సంగమ సమయము అమూల్యమైన ఖజానా. ఈ సంగమ సమయములోని ఒక్కొక్క సంకల్పము మరియు ఒక్కొక్క క్షణము ఎంతో అమూల్యమైనవి ఎందుకంటే సంగమ సమయములోనే బాప్ దాదా మరియు పిల్లల యొక్క మధుర మిలనము జరుగుతుంది, మరే యుగములోనూ పరమాత్ముడైన తండ్రి మరియు పరమాత్ముని పిల్లల యొక్క మిలనము జరుగదు. దానితోపాటు సంగమ సమయములోనే బాప్ దాదా ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఖజానాలు జమ అయ్యేందుకు సమయము సంగమయుగమే, ఇతర ఏ యుగములోనూ జమ ఖాతా గాని, జమ చేసుకునే బ్యాంకు గాని లేనే లేవు. కేవలం ఒక్క సంగమయుగములోనే ఎంత ఖజానాను జమ చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు మరియు ఈ సంగమ సమయానికి ఉన్న మహత్వము ఏమిటంటే - ఒక్క జన్మలో అనేక జన్మల కోసం ఖజానాలను జమ చేసుకోవచ్చు, అందుకే ఈ చిన్నని యుగానికి చాలా మహత్వము ఉంది మరియు ఖజానాలు కూడా బాప్ దాదా ద్వారా పిల్లలందరికీ లభిస్తాయి. బాబా అందరికీ ఇస్తారు కానీ ఖజానాలను జమ చేసుకోవడమనేది పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము అనుసారముగా చేస్తున్నారు. ఇచ్చే బాబా ఒక్కరే మరియు ఇవ్వడము అందరికీ ఒకేలా ఇస్తారు, ఒకే సమయములో ఇస్తారు కానీ ధారణ చేయడములో ఏమి చూసారు? బాబా అయితే ఒకే విధముగా ఇచ్చారు కానీ ధారణ చెయ్యడములో ప్రతి ఒక్కరిదీ వారి-వారి పురుషార్థము ఉంది ఎందుకంటే ఖజానాలను ధారణ చేయడానికి - ఒకటి, తమ పురుషార్థముతో ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవచ్చు మరియు రెండవది, సదా స్వయము సంతుష్టముగా ఉండండి మరియు సర్వులను సంతుష్టపరచండి. సంతుష్టత అనే విశేషతతో ఖజానాలను జమ చేసుకోవచ్చు మరియు మూడవది, సేవ ద్వారా, ఎందుకంటే సేవ ద్వారా సర్వాత్మలకు సంతోషము ప్రాప్తిస్తుంది, కావున సంతోషపు ఖజానాను ప్రాప్తి చేసుకోవచ్చు. తమ పురుషార్థము మరియు సర్వులను సంతుష్టపరిచే పురుషార్థము మరియు మూడవది, సేవా పురుషార్థము. ఈ మూడు విధాలుగా ఖజానాలను జమ చేసుకోవచ్చు. ఖజానాలను జమ చేసుకోవడములో విశేషముగా సంబంధ-సంపర్కాలలోకి వచ్చేటప్పుడు, ఒకటి నిమిత్త భావము, నిర్మాన భావము, నిస్వార్థ భావము, ప్రతి ఆత్మ పట్ల శుభ భావనను మరియు శుభ కామనను ఉంచవలసిన అవసరముంది. ఒకవేళ సేవలో మరియు సంబంధ-సంపర్కాలలో ఇవన్నీ ఉన్నట్లయితే పుణ్య ఖాతాను మరియు ఆశీర్వాదాల ఖాతాను చాలా సహజముగా జమ చేసుకోగలరు.

బాప్ దాదా అందరి లెక్కాపత్రాలను చూస్తున్నారు, మరి ఏమి చూసారు? నలువైపులా ఉన్న పిల్లలను నంబరువారుగా చూసారు. తండ్రి ఒక్కరే, ఒకే సమయములో ఇస్తారు, కానీ జమ చేసుకోవడములో రెండు రకాలు పిల్లలను చూసారు. ఒక రకం పిల్లలైతే జమ అయిన ఖజానాను తింటారు, జమ కూడా చేసుకుంటారు మరియు తినేసి సమాప్తము కూడా చేసేస్తారు. రెండవ రకం పిల్లలు, తింటారు, జమ చేసుకుంటారు, మరియు జమ చేసుకోవడము పట్ల అటెన్షన్ పెట్టి పెంచుకుంటారు కూడా. ఖజానాలను పెంచుకునేందుకు సాధనము ఏమిటి? పెంచుకునేందుకు సాధనము ఏమిటంటే - ఏ ఖజానా అయితే లభిస్తుందో దానిని సమయానికి, ఏ పరిస్థితి అయితే వస్తుందో ఆ పరిస్థితి అనుసారముగా కార్యములో వినియోగించడము. ఎవరైతే కార్యములో వినియోగిస్తారో, స్థితి ద్వారా పరిస్థితిని మార్చగలరో, వారికి జమ అవుతుంది. ఎవరైతే కార్యములో వినియోగించరో వారికి జమ అవ్వదు. కావున ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి - సమయానికి స్వయము పట్ల మరియు ఇతరుల పట్ల కార్యములో వినియోగిస్తున్నారా? ఎంతగా కార్యములో వినియోగిస్తారో, అంతగా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే కార్యములో వినియోగించడము ద్వారా అనుభవమవుతూ ఉంటుంది, అప్పుడు అనుభవము యొక్క అథారిటీ యాడ్ అవుతూ ఉంటుంది (కలుస్తూ ఉంటుంది). కావున చెక్ చేసుకోండి, స్వయాన్ని ప్రశ్నించుకోండి, ఈ ఖజానాలన్నీ జమ అయి ఉన్నాయా? మరియు పెంచుకునే సాధనాన్ని సమయానికి కార్యములో వినియోగిస్తున్నారా? అనుభవము యొక్క అథారిటీ పెరుగుతూ ఉంటుందా? ఎందుకంటే అథారిటీలలో అన్నిటికంటే గొప్పది అనుభవము యొక్క అథారిటీ అని అంటూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ తమ ఖాతాను పెంచుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు సమయముంది, చెక్ చేసుకుని ఇప్పుడు కూడా ఖజానాలను పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అవకాశము ఉంది, తర్వాత అవకాశము కూడా సమాప్తమైపోతుంది. ఖజానాలను పెంచుకోవాలనుకున్నా కూడా పెంచుకోలేకపోతారు.

బాప్ దాదా ఏమి చూసారంటే - ఖజానాలు లభిస్తాయి, ఎంతో సంతోషముగా వాటిని స్వయములో ఇముడ్చుకునేందుకు ప్రయత్నము కూడా చేస్తారు కానీ ఖజానాలు లభించేటప్పుడు, మురళి ద్వారానే ఖజానాలు లభిస్తాయి, ఇక్కడ రెండు రకాల పిల్లలు ఉన్నారు. ఒకరు - వినేవారు మరియు రెండవవారు - ఇముడ్చుకునేవారు. కొంతమంది పిల్లలు విని చాలా సంతోషపడతారు కానీ వినడము మరియు ఇముడ్చుకోవడము, రెండింటిలోనూ చాలా తేడా ఉంది. ఇముడ్చుకునేవారు అనుభవీగా అవుతూ ఉంటారు ఎందుకంటే ఇముడ్చుకున్నదానిని సమయానికి కార్యములో వినియోగిస్తూ, ఖజానాలను పెంచుకుంటూ ఉంటారు. వినేవారు వర్ణన చేస్తారు, చాలా బాగా వినిపించారు, బాబా చాలా మంచి విషయము చెప్పారు అని అంటారు కానీ ఇముడ్చుకోకపోతే సమయానికి కార్యములో వినియోగించలేరు. కావున మీరందరూ చెక్ చేసుకోండి, మీరు ఇముడ్చుకునేవారేనా! కొంచెం కూడా ఒకవేళ తక్కువగా ఉంటే, నిండుగా లేకపోతే అలజడి కలుగుతుంది. కానీ ఇముడ్చుకున్నవారు నిండుగా ఉంటారు కావున అలజడి కలగదు. అందుకే ఈ రోజు బాప్ దాదా అందరి ఖజానాలను చెక్ చేసారు. రెండు రకాల పిల్లలు ఉన్నారు అని వినిపించాము కదా, ఇప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోండి - నేను ఎవరిని? ఖజానాలను పెంచుకోవడము అనగా సమయానికి కార్యములో వినియోగించడము. ఎంతగా కార్యములో వినియోగిస్తూ ఉంటారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఏ ఖజానా ఉన్నా, ఖజానా యొక్క యజమాని ఖజానాను కార్యములో వినియోగిస్తారు కానీ ఖజానా మిమ్మల్ని కార్యములో వినియోగించదు. మరి మీ అందరికీ సర్వ ఖజానాలను బాబా వారసత్వముగా ఇచ్చారు. బాబా ఖజానాలను మీ ఖజానాలుగా చేసుకోవడములో ప్రతి ఒక్కరూ అటెన్షన్ పెట్టాలి ఎందుకంటే ఎంతగా ఖజానాలు నిండుగా ఉంటాయో అంతగా నిండుదనముతో కూడిన అవస్థలో అచలముగా, స్థిరముగా ఉంటారు.

బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ఒక్కొక్క బిడ్డ సంపన్నముగా అవ్వాలి, తక్కువగా కాదు, ఎందుకంటే బాబా ద్వారా అవినాశీ ఖాతాను జమ చేసుకునే ఈ అవకాశము కేవలం ఇప్పుడే వీలవుతుంది, అందుకే - ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అని అంటారు. ఇది సంగమ సమయము గురించిన గాయనమే. భవిష్యత్తులోనైతే ఏదైతే జమ చేసుకున్నారో దాని ఫలాన్ని పొందుతారు కానీ ప్రాప్తి చేసుకునే సమయము కేవలం ఇప్పుడే ఉంది. కావున ప్రతి ఒక్కరూ తమ ఖాతాను చూసుకోవాలి. ఎవరి భండారా ఎంత నిండుగా ఉంది అనేది వారి నయనాల ద్వారా, నడవడిక ద్వారా, ముఖము ద్వారా తెలుస్తుంది. వారి నడవడిక మరియు ముఖము వికసించిన గులాబీ పుష్పములా అనిపిస్తాయి. బాప్ దాదా ప్రతి ఒక్కరి నడవడిక మరియు ముఖము ద్వారా - వారు ఎంత హర్షితముగా మరియు ఎంత సంతోషముగా ఉంటారు అనేది చూస్తూ ఉంటారు. నయనాల ద్వారా ఆత్మికత, ముఖము ద్వారా చిరునవ్వు మరియు కర్మ ద్వారా ప్రతి గుణము అందరికీ అనుభవమవుతాయి! కావున ప్రతి ఒక్కరూ తమను తాము చెక్ చేసుకోండి.

బాప్ దాదాకు ప్రతి బిడ్డ పట్ల ఇదే శుభ భావన ఉంది, అదేమిటంటే, ప్రతి బిడ్డ అనేక ఆత్మలను ఈ విధముగా ఖజానాలతో సంపన్నముగా చేయాలి. ఈ రోజు విశ్వములోని ఆత్మలందరూ - ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి లభించాలి అని ఇదే కోరుకుంటున్నారు. మరియు ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చే దాతలు బ్రాహ్మణ ఆత్మలైన మీరే ఎందుకంటే హోలియెస్ట్ (అతి పవిత్రమైనవారు), హైయెస్ట్ (అతి ఉన్నతమైనవారు) మరియు రిచెస్ట్ (అతి ధనవంతులు) ఆత్మలైన మీరే. ఆత్మలందరి కన్నా ఎక్కువ హోలియెస్ట్ మీరే. ఆత్మలైన మీ పూజ ఎంత విధిపూర్వకముగా జరుగుతుందో, అంతగా మరెవ్వరికీ జరగదు. ఇప్పుడు చివరి జన్మలో కూడా ఆత్మలైన మీకు జరిగినట్లుగా పూజ, నిమిత్తమైన ఏ ధర్మపితలకు లేక మహానాత్మలకు కూడా జరగదు. విధిపూర్వక పూజ జరగదు. వారి స్మృతిచిహ్నాలను తయారుచేస్తారేమో కానీ విధిపూర్వక పూజ జరగదు. అంతేకాక మీకున్నటువంటి ఖజానాలు, మీరు రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచములోనే అతి ధనవంతులు), బ్రాహ్మణ ఆత్మలైన మీ ఒక్క జన్మలోని ఖజానాలు 21 జన్మల వరకు గ్యారంటీగా నడుస్తాయి ఎందుకంటే బాబా ద్వారా, బాబా వారసత్వము లభించింది. ఏ విధముగా బాబా అవినాశీగా ఉన్నారో అదే విధముగా బాబా ద్వారా లభించిన ఖజానాలు కూడా అవినాశీగా ఉంటాయి, అందుకే మీరు రిచెస్ట్ ఇన్ ది వరల్డ్, హోలియెస్ట్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచములోనే అతి ధనవంతులు, అతి పవిత్రమైనవారు).

మరి అందరూ స్వయాన్ని ఇటువంటి విశేషమైన సేవాధారులుగా భావిస్తున్నారు కదా! ఈ నాటి సమయమనుసారముగా విశ్వములోని ఆత్మలకు ఏమి అవసరముందో తెలుసు కదా! ఈ రోజు విశ్వానికి సంతోషము, శక్తి మరియు స్నేహము యొక్క అవసరముంది, ఆత్మిక స్నేహాన్ని కోరుకుంటున్నారు. బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఇప్పుడు సమయమనుసారముగా దాతలుగా అవ్వండి. మనసా ద్వారా శక్తులను ఇవ్వండి, వాచా ద్వారా జ్ఞానాన్ని ఇవ్వండి మరియు కర్మణా ద్వారా గుణదానాన్ని ఇవ్వండి. బ్రహ్మాబాబా అంతిమములో మూడు పదాలను పిల్లలందరికీ కానుకగా ఇచ్చారు, గుర్తుంది కదా! ఈ మూడు పదాలను ఒకవేళ సేవలో వినియోగించినట్లయితే అనేక ఆత్మలను సంతుష్టపరచగలరు. ఆ మూడు పదాలు ఏమిటంటే - నిరాకారి, నిరహంకారి మరియు నిర్వికారి. మనసా ద్వారా నిరాకారి, వాచా ద్వారా నిరహంకారి మరియు కర్మణా ద్వారా నిర్వికారి. ఈ మూడు పదాలను సేవలో వినియోగించండి. ఇప్పుడు విశ్వానికి మీ శక్తి ద్వారా కొంచెం హృదయపూర్వక ఆనందము, సుఖము యొక్క ప్రాప్తి జరగాలి, అందరూ నిరాశతో ఉన్నారు మరియు మీరు విశ్వానికి ఆశల సితారలు మరియు బాప్ దాదా పిల్లలందరినీ బాబా యొక్క ఆశల సితారలుగా చూస్తారు. కేవలం నమ్మకమైన సితారలుగా కాదు కానీ ఆశలను పూర్తి చేసే ఆశల సితారలు.

బాప్ దాదా వద్దకు పిల్లల స్నేహము సదా చేరుకుంటుంది మరియు అన్నింటికన్నా సహజమైన పురుషార్థము ఏమిటి? భిన్న-భిన్న పురుషార్థాలు ఉన్నాయి కానీ అన్నింటికన్నా సహజమైన పురుషార్థము స్నేహము. స్నేహములో శ్రమ కూడా ప్రేమగా మారిపోతుంది. బాబాకు స్నేహీగా అవ్వడము అనగా సహజ పురుషార్థము చేయడము. స్నేహములో మీరందరూ స్వయాన్ని స్నేహీగా భావిస్తున్నారా, అప్పుడప్పుడూ కాదు, సదా స్నేహీ. ఎవరైతే స్వయాన్ని సదా స్నేహ సాగరునిలో ఇమిడి ఉన్నట్లుగా భావిస్తున్నారో, సదా స్నేహ సాగరములో ఇమిడి ఉన్నట్లు, మునకలు వేసేవారు కాదు, ఇమిడి ఉండేవారు, ఎవరైతే స్వయాన్ని స్నేహ సాగరునిలో ఇమిడి ఉన్నట్లుగా అని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. సదానా? సదా అన్న పదాన్ని అండర్ లైన్ చేయండి. చేతులెత్తండి, సదానా, సదానా? చేతులైతే బాగా ఎత్తారు. చేతులను చూసి బాప్ దాదా సంతోషిస్తారు ఎందుకంటే ధైర్యమును ఉంచుతారు. ఒకవేళ ఏదైనా తక్కువైనా కానీ చేతులెత్తాము అనైతే గుర్తుకువస్తుంది ఎందుకంటే బాప్ దాదాకు ఒక్కొక్క బిడ్డ పట్ల అతి స్నేహము ఉంది. ఎందుకని? ఎందుకంటే బాప్ దాదాకు తెలుసు - ఈ ఒక్కొక్క ఆత్మ అనేక సార్లు స్నేహీగా అయ్యింది, ఇప్పుడు కూడా అయ్యింది మరియు ప్రతి కల్పము ఈ ఆత్మలే స్నేహీగా అవుతాయి. మేమే ప్రతి కల్పము యొక్క అధికారీ ఆత్మలము అన్న నషా ఉందా, సంతోషము ఉందా?

బాప్ దాదా ఇటువంటి అధికారీ ఆత్మలను చూసి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు. సదా అలసట లేనివారిగా అయ్యి ఎగురుతూ ఉండండి. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే స్వ స్థితిని కింద-మీద చేసుకోవద్దు. స్వ స్థితి ముందు పరిస్థితి ఏమీ చెయ్యలేదు.

అచ్ఛా, మొదటిసారి ఎవరు వచ్చారు, వారు చేతులెత్తండి. చాలామంది వస్తున్నారు. బాప్ దాదాకు ఒక్కొక్క బిడ్డను చూసి గర్వముగా ఉంటుంది - వాహ్ నా పిల్లలు వాహ్! ఎలా అయితే మీరు ఆటోమేటిక్ గా హృదయములో వాహ్ బాబా వాహ్! నా బాబా వాహ్! అనే పాటను పాడుతారో, అలాగే బాబా కూడా పిల్లల కోసం - వాహ్ ప్రతి ఒక్క బిడ్డ వాహ్! అనే పాటను పాడుతారు, ఎందుకంటే బాబాకు కూడా కల్పము తర్వాత పిల్లలైన మీరు లభిస్తారు మరియు ఒక్కొక్కరూ విశ్వము ఎదుట మహానులు. కావున బాబా కూడా వాహ్ పిల్లలు వాహ్! అనే పాటను పాడుతారు. మీరు వాహ్ వాహ్ కదా! వాహ్ వాహ్ పిల్లలు కదా! వాహ్ వాహ్ పిల్లలు, చేతులెత్తండి.

కావున - మేము వాహ్ వాహ్ పిల్లలము అని సదా గుర్తుంచుకోండి. పురుషార్థులే కావచ్చు కానీ మీరు - వాహ్ వాహ్ పిల్లలు! మీరు బాబాకు వాహ్ వాహ్ పిల్లలు! మీరు బాబాతోపాటే వెళ్తారు. ఉండిపోరు కదా! బాబా అయితే అంటారు, ప్రతి బిడ్డను స్నేహపు ఒడిలో నాతోపాటు తీసుకువెళ్తాను. మరి సిద్ధముగా ఉన్నారా! సిద్ధముగా ఉన్నారా? దారిలో ఆగిపోరు కదా? నాతోపాటే వస్తారు ఎందుకంటే ప్రతిజ్ఞ ఉంది, మీరు ప్రతిజ్ఞను నిలబెట్టుకునేవారు.

ఇప్పుడు బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, మీ ఫరిశ్తా రూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. నడుస్తూ-తిరుగుతూ ఫరిశ్తా డ్రెస్ వారిగా అనుభవము చేయించండి. బాప్ దాదా డ్రిల్ ను వినిపించారు కదా. వస్త్రాన్ని మార్చుకునే అలవాటైతే ఉంది కదా! ఎలా అయితే శరీరపు డ్రెస్ ను మారుస్తారో, అలాగే ఆత్మ స్వరూపమైన ఫరిశ్తాను పదే-పదే అనుభవము చేయండి. ఫరిశ్తా డ్రెస్ ఇష్టమే కదా! ఎలా అయితే బ్రహ్మాబాబా అవ్యక్త ఫరిశ్తా రూపములో వతనములో కూర్చుని ఉన్నారో, అలాగే బాబా సమానముగా మీరందరూ కూడా నడుస్తూ-తిరుగుతూ ఫరిశ్తా రూపములో అనుభవము చేయండి ఎందుకంటే ఫరిశ్తా రూపము ఉంటేనే దేవతగా అవుతారు. ఎలా అయితే బాబా యొక్క మూడు రూపాలు గుర్తుంటాయి కదా - తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు. అలాగే స్వయానికి ఉన్న మూడు రూపాలను కూడా గుర్తుంచుకోండి - బ్రాహ్మణ్ సో ఫరిశ్తా మరియు ఫరిశ్తా సో దేవత. ఈ మూడు రూపాలు పక్కాగా ఉన్నాయి కదా! ఒక్కోసారి బ్రాహ్మణ డ్రెస్ ను ధరించండి, ఒక్కోసారి ఫరిశ్తా డ్రెస్ ను, ఒక్కోసారి దేవత డ్రెస్. ఈ మూడు రూపాలతో స్వతహాగానే త్రికాలదర్శి సీట్ లో కూర్చుని సాక్షీగా అయి ప్రతి కార్యాన్ని చేస్తూ ఉంటారు. కావున అందరి నుండి బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - సదా బాబాతోపాటు ఉండండి, ఒంటరిగా అవ్వకండి. తోడుగా ఉన్నప్పుడే తోడుగా వెళ్తారు. ఒకవేళ ఇప్పుడు అప్పుడప్పుడు ఉన్నట్లయితే తోడుగా ఎలా వెళ్ళగలరు! స్నేహీ, స్నేహీ అయినవారిని ఎప్పుడూ మర్చిపోలేరు. రోజంతటిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇప్పుడే-ఇప్పుడే బ్రాహ్మణులు, ఇప్పుడే-ఇప్పుడే ఫరిశ్తా, ఇప్పుడే-ఇప్పుడే దేవత. అచ్ఛా!

నలువైపులా ఉన్న పిల్లలందరికీ, ఎవరైతే సదా ఖజానాలతో సంపన్నముగా ఉన్నారో, సదా తమ నడవడిక మరియు ముఖము ద్వారా సేవాధారిగా ఉన్నారో, ఎందుకంటే మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటంటే - మేము విశ్వ పరివర్తకులుగా అయి విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని, కావున నడుస్తూ-తిరుగుతూ కూడా సేవాధారులు సేవలో తత్పరులై ఉంటారు. ఇటువంటి విశ్వ సేవాధారులు, విశ్వ పరివర్తకులు, ప్రతి ఒక్కరినీ బాబా ఖజానాలతో నిండుగా చేసేవారు, బాప్ దాదా యొక్క నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మరియు నమస్తే. అచ్ఛా!

వరదానము:-
మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను యుక్తియుక్తముగా చేసే కర్మబంధన ముక్త భవ

ఏ సంకల్పము, మాట మరియు కర్మను చేసినా - దానిని మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి చేసినట్లయితే ఏ కర్మ కూడా వ్యర్థముగా లేక అనర్థముగా అవ్వదు. త్రికాలదర్శిగా అయ్యి అనగా సాక్షీతనపు స్థితిలో స్థితులై, కర్మల గుహ్యగతిని తెలుసుకుని ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించినట్లయితే ఎప్పుడూ కూడా కర్మబంధనములో బంధింపబడరు. ప్రతి కర్మను చేస్తూ కర్మబంధన ముక్తులుగా, కర్మాతీత స్థితిని అనుభవము చేస్తూ ఉంటారు.

స్లోగన్:-
ఎవరి వద్దనైతే హద్దు కోరికల అవిద్య ఉంటుందో వారే మహాన్ ధనవంతులు.

అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

కాపలా కాసే కాపలాదారుడు ఒకవేళ శస్త్రధారిగా ఉన్నట్లయితే మరియు అతనికి - నా శస్త్రము శత్రువులను పారద్రోలేది, వారిని ఓడింపజేసేది అన్న నిశ్చయము ఉన్నట్లయితే, వారు ఎంత నిర్భయతతో నడుచుకుంటారు. మరి మీ వద్ద కూడా సర్వ శక్తుల రూపీ శస్త్రాలు సదా తోడుగా ఉన్నాయి, కేవలము వాటిని ఆహ్వానించండి అనగా యజమానిగా అయ్యి ఆజ్ఞాపించండి, అప్పుడు సఫలత సదా లభించే తీరుతుంది.