15-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ ప్రపంచము శ్మశానవాటికగా అవ్వనున్నది,
అందుకే దీనిపై మనసు పెట్టుకోకండి, పరిస్తాన్ ను స్మృతి చేయండి’’
ప్రశ్న:-
పేద పిల్లలైన
మీ వంటి అదృష్టవంతులు ప్రపంచములో ఎవ్వరూ లేరు, ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే పేద
పిల్లలైన మీరే డైరెక్టుగా ఆ తండ్రికి చెందినవారిగా అయ్యారు, వారి నుండి సద్గతి
యొక్క వారసత్వము లభిస్తుంది. పేద పిల్లలే చదువుకుంటారు. షావుకారులు ఒకవేళ కొద్దిగా
చదువుకున్నా కూడా, వారికి తండ్రి స్మృతి కష్టము మీద నిలుస్తుంది. మీకైతే అంతిమములో
తండ్రి తప్ప ఇంకేదీ గుర్తుకు రాదు, అందుకే మీరు అందరికన్నా అదృష్టవంతులు.
పాట:-
మనసు యొక్క
ఆధారము తెగిపోకూడదు...
ఓంశాంతి
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మరియు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు -
తప్పకుండా ఈ ప్రపంచము ఇప్పుడు శ్మశానవాటికగా అవ్వనున్నది అని. ఇంతకుముందు ఈ ప్రపంచము
పరిస్తాన్ గా ఉండేది, ఇప్పుడు పాతదిగా అయిపోయింది, అందుకే దీనిని శ్మశానవాటిక అని
అంటారు. అందరూ శ్మశానగ్రస్థులుగా అవ్వాల్సిందే. పాత వస్తువు సమాధి అవుతుంది అనగా
మట్టిలో కలిసిపోతుంది. ఇది కూడా కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి
తెలియదు. శ్మశానవాటికగా అయ్యే సమయము కనిపిస్తుందని కొంతమంది విదేశీయులకు తెలుస్తుంది.
పరిస్తాన్ ను స్థాపన చేసే మన తండ్రి మళ్ళీ వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు కూడా తెలుసు.
ఒకవేళ ఈ శ్మశానవాటిక పట్ల మనసు పెట్టుకున్నట్లయితే, నష్టపోతాము అని పిల్లలు ఇది కూడా
అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు కల్పక్రితం వలె, అనంతమైన తండ్రి నుండి అనంతమైన
సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇది అడుగడుగునా పిల్లలైన మీ బుద్ధిలో
ఉండాలి, ఇదే మన్మనాభవ. తండ్రి స్మృతిలో ఉండటముతోనే స్వర్గవాసులుగా అవుతారు. భారత్
పరిస్తాన్ గా ఉండేది, ఇంకే ఖండము పరిస్తాన్ గా అవ్వదు. ఇది మాయా రావణుడి ఆర్భాటము.
ఇది ఇంకా కొద్ది సమయమే నడవనున్నది. ఇది అసత్యపు ఆర్భాటము. అసత్యపు మాయ, అసత్యపు
శరీరము కదా. ఇది అంతిమ సమయము యొక్క ఆర్భాటము. దీనిని చూసి, స్వర్గమైతే ఇప్పుడే ఉంది,
ఇంతకుముందు నరకముండేదని అనుకుంటారు. పెద్ద-పెద్ద భవనాలను నిర్మిస్తూ ఉంటారు. ఇది ఈ
100 సంవత్సరాల్లో ఏర్పడిన ఆర్భాటము. టెలిఫోన్, విద్యుత్తు, విమానాలు మొదలైనవన్నీ ఈ
100 సంవత్సరాల లోపలే తయారయ్యాయి. ఎంతటి ఆర్భాటముంది, అందుకే స్వర్గమైతే ఇప్పుడే
ఉందని భావిస్తారు. పాత ఢిల్లీ ఎలా ఉండేది? ఇప్పుడు కొత్త ఢిల్లీ ఎంత బాగా
తయారయ్యింది. పేరు కూడా న్యూ ఢిల్లీ అని పెట్టబడింది. కొత్త ప్రపంచము, రామ రాజ్యము
కావాలని, పరిస్తాన్ కావాలని బాపూజీ కోరుకునేవారు. ఇప్పుడు ఉన్నది తాత్కాలిక ఆర్భాటము.
ఎంత పెద్ద-పెద్ద భవనాలను, ఫౌంటెన్లు మొదలైనవాటిని నిర్మిస్తారు, దీనిని
అల్పకాలికమైన కృత్రిమ స్వర్గమని అంటారు. దీని పేరు స్వర్గమేమీ కాదని మీకు తెలుసు.
దీని పేరు నరకము. నరకానికి కూడా ఒక ఆర్భాటము ఉంది, ఇది అల్పకాలిక ఆర్భాటము.
ఇప్పుడిది ఇక సమాప్తమైనట్లే.
ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు - ముందుగా శాంతిధామాన్ని స్మృతి చేయండి.
మనుష్యమాత్రులందరూ శాంతిని వెతుకుతూ ఉంటారు. శాంతి ఎక్కడ లభిస్తుంది? ప్రపంచములో
శాంతి ఎలా ఏర్పడుతుంది అనే ప్రశ్న అయితే ఇప్పుడు మొత్తము ప్రపంచానికి ఉంది.
వాస్తవానికి మనమంతా శాంతిధామ నివాసులమని మనుష్యులకు తెలియదు. ఆత్మలమైన మనము
శాంతిధామములో శాంతిగా ఉంటాము, తర్వాత ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. ఇది
కూడా పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు వయా శాంతిధామము, సుఖధామానికి వెళ్ళేందుకు
పురుషార్థము చేస్తున్నారు. ఆత్మలమైన మేము ఇప్పుడు మా ఇల్లు అయిన శాంతిధామానికి
వెళ్తామని ప్రతి ఒక్కరి బుద్ధిలోనూ ఉంది. ఇక్కడైతే శాంతి యొక్క విషయము ఉండదు, ఇది
దుఃఖధామము. సత్యయుగము పావన ప్రపంచము, కలియుగము పతిత ప్రపంచము. ఈ విషయాలను గురించిన
వివేకము ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. ప్రపంచములోని వారికైతే ఏమీ తెలియదు.
అనంతమైన తండ్రి మాకు సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారని,
అంతేకాక ధర్మ స్థాపకులు వచ్చి ధర్మాలను ఎలా స్థాపన చేస్తారు అనేది కూడా అర్థం
చేయిస్తారని మీ బుద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు సృష్టిలో ఎంతమంది మనుష్యులు ఉన్నారు.
భారత్ లో కూడా చాలామంది ఉన్నారు. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు చాలా షావుకారులుగా
ఉండేవారు, వేరే ధర్మమేదీ ఉండేది కాదు. పిల్లలైన మిమ్మల్ని రోజూ రిఫ్రెష్ చేయడము
జరుగుతుంది. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. భక్తి మార్గములో కూడా ఇది
కొనసాగుతూ వచ్చింది - పరమాత్మను స్మృతి చేయండి, పరమాత్మ లేక అల్లా అక్కడ ఉన్నారు అని
సదా వేలును పైకి చూపిస్తారు. కాని కేవలం ఊరికే అలా స్మృతి చేయడము వలన ఏమీ జరగదు.
స్మృతితో కలిగే లాభమేమిటి అనేది కూడా వారికి తెలియదు. వారితో మనకున్న సంబంధమేమిటి
అనేది తెలియనే తెలియదు. దుఃఖము సమయములో ఓ రామా... అని పిలుస్తారు. ఆత్మ స్మృతి
చేస్తుంది. కానీ సుఖ-శాంతులు అని వేటిని అంటారు అనేది వారికి తెలియదు. మనమంతా ఒక్క
తండ్రి సంతానమని మీ బుద్ధిలోకి వస్తుంది. మరి దుఃఖము ఎందుకు కలగాలి? అనంతమైన తండ్రి
నుండి సదా సుఖము యొక్క వారసత్వము లభించాలి. ఇది కూడా చిత్రములో స్పష్టముగా ఉంది.
భగవంతుడు స్వర్గాన్ని స్థాపన చేసేవారు, వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు రావడము కూడా
భారత్ లోనే వస్తారు, కానీ ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. దేవీ-దేవతా ధర్మము
యొక్క స్థాపన తప్పకుండా సంగమములోనే జరుగుతుంది, సత్యయుగములో ఎలా జరుగుతుంది. కానీ ఈ
విషయాలు ఇతర ధర్మాల వారికి తెలియదు. తండ్రియే నాలెడ్జ్ ఫుల్. ఆది సనాతన దేవీ-దేవతా
ధర్మము ఎలా స్థాపన అయ్యింది అనేది వారు అర్థం చేయిస్తారు. సత్యయుగ ఆయువు లక్షల
సంవత్సరాలు అని అనడముతో చాలా దూరము తీసుకువెళ్ళిపోతారు. పిల్లలైన మీరు చిత్రాలపైనే
అర్థం చేయించాలి. భారత్ లో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. వీరు ఎలా మరియు
ఎప్పుడు ఈ రాజ్యాన్ని పొందారు అనేది తెలియదు. కేవలం, వీరు సత్యయుగానికి యజమానులుగా
ఉండేవారని అంటారు. వారి ఎదురుగా వెళ్ళి భిక్ష అడుగుతారు, అప్పుడు అల్పకాలికముగా ఏదో
ఒకటి లభిస్తుంది. ఎవరైనా దాన-పుణ్యాలు చేసినప్పుడు, వారికి కూడా అల్పకాలికముగా ఫలము
లభిస్తుంది. షావుకారుగా ఉన్న పంచాయతీ ముఖ్యుడికి ఎంత సంతోషముంటుందో, పేదవానిగా ఉన్న
పంచాయతీ ముఖ్యుడికి కూడా అంతే సంతోషముంటుంది. పేదవారు కూడా తమను తాము సుఖముగా
ఉన్నామని భావిస్తారు. బొంబాయిలో పేదవారు ఎలాంటి స్థానాలలో ఉంటారో చూడండి.
కోటీశ్వరులైనా కానీ ఎంత దుఃఖితులుగా ఉన్నారు అనేది పిల్లలైన మీరిప్పుడు అర్థం
చేసుకున్నారు. మా వంటి అదృష్టవంతులు ఇంకెవరూ లేరని ఇప్పుడు మీరంటారు. మనము
డైరెక్టుగా తండ్రికి చెందినవారిగా అయ్యాము, వారి నుండి సద్గతి యొక్క వారసత్వము
లభిస్తుంది. పెద్ద-పెద్ద వ్యక్తులు ఎప్పుడూ కూడా ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే
ఇప్పుడు పేదవారిగా ఉన్నారో, వారు షావుకారులుగా అవుతారు. మీరు చదువుకుంటారు. వారు
చదువుకోనివారు, ఒకవేళ కొద్దిగా చదువుకున్నా కూడా, తండ్రి స్మృతిలో ఉండలేకపోతారు.
అంతిమములో మీకు తండ్రి తప్ప ఇంకేమీ గుర్తు ఉండకూడదు. ఇదంతా శ్మశానవాటికగా
అవ్వనున్నదని మీకు తెలుసు. ఈ వ్యాపారాలు మొదలైనవి ఏవైతే మనము చేస్తున్నామో, ఇవి
కొద్ది సమయము కోసమే ఉంటాయని బుద్ధిలో ఉండాలి. ధనవంతులు ధర్మశాలలు మొదలైనవాటిని
నిర్మిస్తారు. వాటిని వ్యాపారము కోసమేమీ నిర్మించరు. తీర్థ స్థానాలు ఉన్న చోట
ధర్మశాలలు లేకపోతే ఇంకెక్కడ ఉండాలి, అందుకే షావుకారులు ధర్మశాలలను నిర్మిస్తారు.
అలాగని వ్యాపారస్తులు అక్కడకు వచ్చి వ్యాపారము చేసుకోవడము కాదు. ధర్మశాలలను తీర్థ
స్థానాలలో నిర్మించడము జరుగుతుంది. ఇప్పుడు మీ సెంటర్లు అన్నింటికన్నా పెద్ద తీర్థ
స్థానాలు. మీ సెంటర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అవి అన్నింటికన్నా పెద్ద తీర్థ
స్థానాలు, అక్కడ మనుష్యులకు సుఖ-శాంతులు లభిస్తాయి. మీ ఈ గీతాపాఠశాల పెద్దది. ఇది
సంపాదనకు ఆధారము, దీనితో మీకు చాలా సంపాదన జరుగుతుంది. పిల్లలైన మీ కోసం, ఇది కూడా
ధర్మశాలయే, ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము. మీరు అనంతమైన తండ్రి నుండి
అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. దీనంతటి పెద్ద తీర్థ స్థానము ఇంకేదీ ఉండదు. ఆ
తీర్థ స్థానాలకు వెళ్ళడముతో మీకు ఏమీ లభించదు. ఈ విషయము కూడా మీరు అర్థం
చేసుకున్నారు. భక్తులు మందిరాలు మొదలైనవాటిలో, చాలా ప్రేమగా చరణామృతాన్ని
తీసుకుంటారు. దీనితో మా హృదయము పవిత్రముగా అయిపోతుందని భావిస్తారు. కానీ అది నీరు
మాత్రమే. ఇక్కడైతే తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వము లభిస్తుంది.
ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి మీకు అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తుంది. చాలా
వరకు శంకరుని వద్దకు వెళ్తారు, అమరనాథుడు పార్వతికి కథ వినిపించారని అనుకుంటారు.
అందుకే, మా జోలిని నింపండి... అని అంటారు. మీరు అవినాశీ జ్ఞాన రత్నాలతో జోలిని
నింపుకుంటారు. అంతేకానీ, అమరనాథుడు కూర్చుని ఎవరో ఒక్కరికే కథ వినిపించరు. తప్పకుండా
చాలామంది ఉంటారు, అది కూడా మృత్యులోకములోనే ఉంటారు. సూక్ష్మవతనములోనైతే కథను
వినిపించే అవసరమే లేదు. అనేక తీర్థ స్థానాలను తయారుచేసారు. సాధు-సన్యాసులు,
మహాత్ములు మొదలైనవారు ఎంతోమంది వెళ్తారు. అమరనాథ్ కు లక్షలాది మంది వెళ్తారు.
అన్నింటికన్నా ఎక్కువగా కుంభ మేళాలో గంగా స్నానాలు చేయడానికి వెళ్తారు. మేము
పావనముగా అవుతామని భావిస్తారు. వాస్తవానికి కుంభ మేళా ఇది. ఆ మేళాలకైతే
జన్మ-జన్మలుగా వెళ్తూ వచ్చారు. కానీ తండ్రి అంటారు - వీటి ద్వారా ఎవరూ తమ ఇంటికి
తిరిగి వెళ్ళలేరు ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ పవిత్రముగా అవుతుందో అప్పుడే వెళ్ళగలదు.
కానీ అపవిత్రముగా ఉన్న కారణముగా, అందరి రెక్కలు తెగిపోయి ఉన్నాయి. ఆత్మకు రెక్కలు
లభించాయి, యోగములో ఉండటముతో ఆత్మ అన్నింటికన్నా వేగముగా ఎగురుతుంది. ఎవరి
లెక్కాచారమైనా లండన్ లో, అమెరికాలో ఉన్నట్లయితే వెంటనే ఎగిరిపోతారు, అక్కడకు
క్షణములో చేరుకుంటారు. కానీ ఎప్పుడైతే కర్మాతీతులుగా అవుతారో, అప్పుడే
ముక్తిధామానికి వెళ్ళగలరు, అప్పటివరకు ఇక్కడే జనన-మరణాలలోకి వస్తారు. ఎలాగైతే డ్రామా
టిక్-టిక్ అంటూ నడుస్తుందో, అలా ఆత్మ కూడా టిక్ అనగానే వెళ్ళిపోతుంది. ఆత్మ అంతటి
వేగవంతమైనది ఇంకేదీ ఉండదు. ఇన్ని ఆత్మలన్నీ మూలవతనానికి వెళ్ళబోతున్నాయి. ఆత్మకు
ఎక్కడ నుండి ఎక్కడికైనా చేరుకోవడానికి సమయము పట్టదు. మనుష్యులు ఈ విషయాలను అర్థం
చేసుకోరు. కొత్త ప్రపంచములో తప్పకుండా కొద్దిమంది ఆత్మలే ఉంటారని మరియు అక్కడ చాలా
సుఖమయముగా ఉంటారని పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది. ఆ ఆత్మలే ఇప్పుడు 84 జన్మలను
అనుభవించి చాలా దుఃఖితులుగా అయ్యారు. మీకు మొత్తము చక్రము గురించి తెలిసింది. మీ
బుద్ధి నడుస్తుంది, వేరే మనుష్యమాత్రుల బుద్ధి నడవదు. ప్రజాపిత బ్రహ్మా కూడా గాయనము
చేయబడ్డారు. కల్పక్రితం కూడా మీరు ఇలాగే బ్రహ్మాకుమారీ, కుమారులుగా అయ్యారు. మేము
ప్రజాపిత బ్రహ్మాకు సంతానమని మీకు తెలుసు. మన ద్వారా బాబా స్వర్గ స్థాపనను
చేయిస్తున్నారు. ఎప్పుడైతే నంబరువారు పురుషార్థానుసారముగా యోగ్యులుగా అవుతారో,
అప్పుడిక పాత ప్రపంచము వినాశనమవుతుంది. త్రిమూర్తి కూడా ఇక్కడే గాయనము చేయబడ్డారు.
త్రిమూర్తి చిత్రాన్ని కూడా పెడతారు. అందులో శివుడిని చూపించరు. బ్రహ్మా ద్వారా
స్థాపన అని కూడా అంటారు, అది ఎవరు చేయిస్తారు? శివబాబా. అలాగే విష్ణువు ద్వారా పాలన.
బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు దేవతలుగా అయ్యేందుకు యోగ్యులుగా అవుతున్నారు. ఇప్పుడు
మీరు ఆ పాత్రను అభినయిస్తున్నారు. కల్పము తర్వాత మళ్ళీ అభినయిస్తారు. మీరు
పవిత్రముగా అవుతారు. కామము రూపీ శత్రువును జయించండి, నన్నొక్కరినే స్మృతి చేయండి
అనేది బాబా ఆజ్ఞ అని అంటారు. ఇది చాలా సహజము. భక్తి మార్గములో పిల్లలైన మీరు చాలా
దుఃఖాన్ని చూసారు. కొద్దిగా సుఖము ఉన్నప్పటికీ అది అల్పకాలికముగానే ఉంటుంది. భక్తిలో
సాక్షాత్కారాలు జరుగుతాయి. అది కూడా అల్పకాలం కొరకే మీ ఆశ పూర్తవుతుంది. మీకు ఏవైతే
సాక్షాత్కారాలు కలుగుతాయో, అవి కూడా నేనే చేయిస్తాను, డ్రామాలో నిశ్చితమై ఉంది.
ఏదైతే గతించిపోయిందో, ఆ సెకండు-సెకండు డ్రామాలో చిత్రీకరించబడింది. ఇప్పుడు షూటింగ్
అయ్యింది అని అనరు. అలా అనరు. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా. ఎంతమంది
పాత్రధారులైతే ఉన్నారో, వారందరి పాత్ర అవినాశీ అయినది. ఎవరూ మోక్షము పొందరు. మేము
లీనమైపోతామని సన్యాసులు అంటారు. నీవు ఒక అవినాశీ ఆత్మవు అని తండ్రి అర్థం చేయిస్తారు.
ఆత్మ ఒక బిందువు, ఇంత చిన్నని బిందువులో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఈ చక్రము
తిరుగుతూనే ఉంటుంది. ఎవరైతే మొట్టమొదట పాత్రను అభినయించడానికి వస్తారో, వారే 84
జన్మలు తీసుకుంటారు. అందరూ తీసుకోలేరు. మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఈ
జ్ఞానము లేదు. జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. మేము తండ్రి నుండి వారసత్వాన్ని
తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రి మనల్ని పతితము నుండి పావనముగా తయారుచేస్తారు,
సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగములో దుఃఖము యొక్క నామ-రూపాలు ఉండవు.
తండ్రి అంటారు - ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ... నివృత్తి మార్గము వారు ఇటువంటి
ఆశీర్వాదాలను ఇవ్వలేరు. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వము లభిస్తోంది. సత్య,
త్రేతాయుగాలు సుఖధామము, ఆ తర్వాత దుఃఖము ఎలా కలుగుతుంది అనేది కూడా ఎవరికీ తెలియదు.
దేవతలు వామ మార్గములోకి ఎలా వెళ్తారు అన్నదానికి గుర్తులు ఉన్నాయి. జగన్నాథపురిలో
దేవతల చిత్రాలను, కిరీటము మొదలైనవి ధరించి ఉన్నట్లుగా కూడా చూపించారు, అలాగే
అశుద్ధమైన చిత్రాలను కూడా తయారుచేసారు, అందుకే వారి విగ్రహాలను కూడా నల్లగా
చూపించారు. దీని బట్టి దేవతలు వామ మార్గములోకి వెళ్తారని ఋజువవుతుంది. కనుక
అంతిమములో పూర్తిగా నల్లగా అయిపోతారు. భారత్ ఎంత సుందరముగా ఉండేది అన్న విషయము
ఇప్పుడు మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారముగా మళ్ళీ తమోప్రధానముగా అవ్వాల్సిందే.
ఇప్పుడు సంగమములో మీకు ఈ జ్ఞానము ఉంది. తండ్రి నాలెడ్జ్ ఫుల్. మీకు తండ్రి, టీచరు,
గురువు ముగ్గురూ ఒక్కరే. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని సదా బుద్ధిలో ఉండాలి.
ఇది అనంతమైన చదువు, దీనితో మీరు నాలెడ్జ్ ఫుల్ గా అయిపోయారు. మీకు అంతా తెలుసు. వారు
పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు, మీరు పరమాత్మను పతిత-పావనుడని అంటారు. ఎంతగా
రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు మీరు నంబరువారుగా మాస్టర్ నాలెడ్జ్ ఫుల్
అయ్యారు. తండ్రి వద్ద ఏదైతే ఉందో, అది మీకు నేర్పిస్తారు. తండ్రిని స్మృతి
చేసినట్లయితే 21 జన్మల కొరకు వారసత్వము లభిస్తుందని మీరు కూడా అందరికీ తెలియజేస్తారు.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయము రిఫ్రెష్ గా ఉంటూ, ఇతరులను రిఫ్రెష్ చేసేందుకు తండ్రి మరియు వారసత్వము
యొక్క స్మృతిలో ఉండాలి మరియు అందరికీ స్మృతిని ఇప్పించాలి.
2. ఈ పాత ప్రపంచము పట్ల, ఈ శ్మశానవాటిక పట్ల మనసు పెట్టుకోకూడదు. శాంతిధామాన్ని,
సుఖధామాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని దేవతలుగా అయ్యేందుకు యోగ్యులుగా
తయారుచేసుకోవాలి.
వరదానము:-
ఈశ్వరీయ అథారిటీ ద్వారా సంకల్పాలను మరియు బుద్ధిని ఆర్డర్
అనుసారముగా నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ
ఎలాగైతే స్థూలమైన చేతులు, కాళ్ళను చాలా సహజమైన రీతిలో
ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నడిపిస్తారో లేదా కర్మలు చేయడానికి ఉపయోగిస్తారో, అలాగే
సంకల్పాలను మరియు బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలగాలి - దీనినే
ఈశ్వరీయ అథారిటీ అని అంటారు. ఏ విధముగా వాణిలోకి రావడము సహజమో, అలాగే వాణి నుండి
అతీతముగా వెళ్ళడము కూడా అంతే సహజమవ్వాలి, ఈ అభ్యాసముతోనే సాక్షాత్కార మూర్తులుగా
అవుతారు. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని సహజము మరియు నిరంతరము చేసుకోండి, అప్పుడు మాస్టర్
సర్వశక్తివంతులని అంటారు.
స్లోగన్:-
స్వస్థితి
శక్తిశాలిగా ఉన్నట్లయితే పరిస్థితి దాని ముందు ఏమీ కాదు.
అవ్యక్త ప్రేరణలు -
‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’
మీ ఏకరస అచంచల స్థితి
యొక్క స్మృతిచిహ్నమే ఈ అచల్ ఘర్. ఏ విధముగా బాప్ దాదా ఏకరసముగా ఉంటారో అలా పిల్లలు
కూడా ఏకరసముగా ఉండాలి. ఎప్పుడైతే ఒక్కరి రసములోనే (తపనలోనే) ఉంటారో, అప్పుడు ఏకరస
అవస్థలో ఉంటారు. ఎందుకు అన్న మాటకు గుర్తు ప్రశ్నార్థకము, ఇది అన్నింటికన్నా వంకరగా
ఉంటుంది. ఎప్పుడైతే ఎందుకు, ఏమిటి అన్న మాటలు తొలగిపోతాయో, అప్పుడు నిశ్చితమై ఉన్న
డ్రామా విధిపై ఏకరసముగా, స్థిరముగా ఉండగలరు.