ఓంశాంతి
పిల్లలు ఈ పాటను విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మ ఈ శరీరములోని చెవుల ద్వారా విన్నది.
ఆత్మ ఎంత చిన్నది అన్న విషయము పిల్లలకు కూడా తెలిసింది. ఆ ఆత్మ ఈ శరీరములో
లేనట్లయితే శరీరము ఎందుకూ పనికిరాదు. ఇంత చిన్న ఆత్మ యొక్క ఆధారముపై ఎంత పెద్ద
శరీరము నడుస్తుంది. ఈ రథముపై విరాజమానమయ్యే ఆత్మ అంటే ఏమిటి అనేది ప్రపంచములోని
వారికెవ్వరికీ తెలియదు. అకాలమూర్తి అయిన ఆత్మకు ఇది సింహాసనము. పిల్లలకు కూడా ఈ
జ్ఞానము లభిస్తుంది. ఈ జ్ఞానము ఎంత రమణీకమైనది మరియు రహస్యయుక్తమైనది. ఎప్పుడైనా
ఇటువంటి రహస్యయుక్తమైన విషయాన్ని విన్నప్పుడు చింతన నడుస్తుంది. పిల్లలైన మీకు కూడా
ఇదే చింతన నడుస్తుంది - ఇంత పెద్ద శరీరములో ఇంత చిన్నని ఆత్మ ఉంది. ఆత్మలో 84 జన్మల
పాత్ర నిశ్చితమై ఉంది. శరీరమైతే వినాశనమైపోతుంది. కేవలం ఆత్మ మిగులుతుంది. ఇవి బాగా
ఆలోచించవలసిన విషయాలు. ఉదయమే లేచి ఈ విధముగా ఆలోచించాలి. ఆత్మ ఎంత చిన్ననిదో
పిల్లలకు స్మృతి కలిగింది. ఆత్మకు అవినాశీ పాత్ర లభించింది. ఆత్మనైన నేను ఎంత
అద్భుతముగా ఉన్నాను. ఇది కొత్త జ్ఞానము. ఇది ప్రపంచములో ఇంకెవ్వరి వద్దా లేదు.
తండ్రియే వచ్చి దీనిని తెలియజేస్తారు, దీనిని స్మరించవలసి ఉంటుంది. ఇంత చిన్నని
ఆత్మనైన నేను పాత్రను ఎలా అభినయిస్తున్నాను. శరీరము పంచ తత్వాలతో తయారవుతుంది.
శివబాబా ఆత్మ ఎలా వస్తుంది, వెళ్తుంది అనేది ఈ బాబాకు ఏమైనా తెలుస్తుందా. అలాగని సదా
వీరిలోనే ఉంటారని కూడా కాదు. కావున ఇదే చింతన చేయాలి. పిల్లలైన మీకు తండ్రి ఎటువంటి
జ్ఞానాన్ని ఇస్తున్నారంటే, ఇది ఎప్పుడూ ఎవ్వరికీ లభించజాలదు. వాస్తవానికి ఈ జ్ఞానము
ఇతని ఆత్మలో ఇంతకుముందు లేదు అని మీకు తెలుసు. ఇతర సత్సంగాలలో ఇలాంటి, ఇలాంటి
విషయాల గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము అంశమాత్రము కూడా లేదు.
సాధు-సన్యాసులు మొదలైనవారెవ్వరూ కూడా - ఆత్మనైన నేను శరీరము ద్వారా ఫలానావారికి
మంత్రాన్ని ఇస్తున్నాను అని ఇలా భావించరు. ఆత్మ శరీరము ద్వారా శాస్త్రాలు చదువుతుంది.
మనుష్యమాత్రులు ఒక్కరు కూడా ఆత్మాభిమానులుగా లేరు. ఆత్మ జ్ఞానము ఎవ్వరికీ లేదు
కావున ఇక తండ్రి యొక్క జ్ఞానము వారిలో ఎలా ఉంటుంది.
ఆత్మలైన మనల్ని తండ్రి ‘మధురాతి మధురమైన పిల్లలూ’ అని సంబోధిస్తారని పిల్లలైన
మీకు తెలుసు. మీరు ఎంత తెలివైనవారిగా అవుతున్నారు. ఈ శరీరములో ఏదైతే ఆత్మ ఉంటుందో,
పరమపిత పరమాత్మ కూర్చుని ఆ ఆత్మను చదివిస్తున్నారు అని మనుష్యమాత్రులెవ్వరూ భావించరు.
ఇవి ఎంత అర్థం చేసుకోవలసిన విషయాలు. కానీ మళ్ళీ వ్యాపార-వ్యవహారాల్లోకి వెళ్ళడముతో
వీటిని మర్చిపోతారు. మొదటైతే తండ్రి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు, ఇది
మనుష్యమాత్రులెవ్వరిలోనూ లేదు. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతోకాలము దూరముగా ఉన్నారు...
అన్న గాయనము కూడా ఉంది కదా. ఎంతకాలము అన్న లెక్క ఉంది కదా. పిల్లలైన మీకు తెలుసు -
ఆత్మయే ఈ శరీరము ద్వారా మాట్లాడుతుంది, ఆత్మయే శరీరము ద్వారా మంచి పనులు లేక చెడు
పనులు చేస్తుంది. తండ్రి వచ్చి ఆత్మలను ఎంతగా పుష్పాల వలె తయారుచేస్తారు.
మొట్టమొదటైతే తండ్రి చెప్తున్నారు, ఉదయముదయమే లేచి ఇదే అభ్యాసము లేక ఆలోచన చేయండి -
ఈ శరీరము ద్వారా వింటూ ఉన్న ఈ ఆత్మ అంటే అసలు ఏమిటి? ఆత్మకు తండ్రి పరమపిత పరమాత్మ,
వారిని పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు అని అంటారు. మరి ఇతర మనుష్యులను సుఖసాగరులు,
శాంతిసాగరులు అని ఎలా అనగలరు. ఈ లక్ష్మీ-నారాయణులను సదా పవిత్రతా సాగరులు అని
అనవచ్చా? లేదు. ఒక్క తండ్రి మాత్రమే సదా పవిత్రతా సాగరులు. మనుష్యులైతే కేవలం భక్తి
మార్గపు శాస్త్రాలను కూర్చుని వర్ణిస్తూ ఉంటారు. వారికి ప్రాక్టికల్ అనుభవము లేదు.
ఆత్మనైన నేను ఈ శరీరము ద్వారా తండ్రి మహిమను చేస్తున్నాను అని భావించరు. వారు మనకు
చాలా మధురమైన తండ్రి. వారే సుఖాన్ని ఇస్తారు. తండ్రి అంటారు - ఓ ఆత్మల్లారా,
ఇప్పుడిక నా మతముపై నడవండి. ఈ అవినాశీ ఆత్మకు అవినాశీ తండ్రి ద్వారా అవినాశీ మతము
లభిస్తుంది. ఆ వినాశీ శరీరధారులకు వినాశీ శరీరధారుల మతమే లభిస్తుంది.
సత్యయుగములోనైతే మీరు ఇక్కడి ప్రారబ్ధాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ తప్పుడు
మతమనేది లభించనే లభించదు. ఇప్పటి ఈ శ్రీమతమే అవినాశీగా అయిపోతుంది, ఇది అర్ధకల్పము
నడుస్తుంది. ఇది కొత్త జ్ఞానము, దీనిని గ్రహించేందుకు ఎంత బుద్ధి కావాలి. అంతేకాక
ఇది ఆచరణలోకి రావాలి. ఎవరైతే మొదటి నుండీ ఎంతో భక్తి చేసి ఉంటారో, వారే దీనిని బాగా
ధారణ చేయగలుగుతారు. ఒకవేళ నా బుద్ధిలో సరిగ్గా ధారణ జరగడం లేదంటే తప్పకుండా నేను
ప్రారంభము నుండి భక్తి చేయలేదు అని అర్థం చేసుకోవాలి. తండ్రి అంటారు, మీకు ఏదైనా
అర్థం కాకపోతే తండ్రిని అడగండి, ఎందుకంటే తండ్రి అవినాశీ సర్జన్. వారిని సుప్రీమ్
సోల్ అని కూడా అంటారు. ఆత్మ పవిత్రముగా అయితే అప్పుడు దానికి మహిమ జరుగుతుంది.
ఆత్మకు మహిమ జరిగితే శరీరానికి కూడా మహిమ జరుగుతుంది. ఆత్మ తమోప్రధానమైతే శరీరానికి
కూడా మహిమ ఉండదు. ఈ సమయములో పిల్లలైన మీకు ఎంతో గుహ్యమైన బుద్ధి లభిస్తుంది, ఆత్మకే
లభిస్తుంది. ఆత్మ ఎంత మధురముగా తయారవ్వాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. బాబా ఎంత
మధురమైనవారు. వారు ఆత్మలను కూడా చాలా మధురముగా తయారుచేస్తారు. ఆత్మ ఏ విధమైన తప్పుడు
కార్యాన్ని చేయకూడదు, ఈ అభ్యాసము చేయాలి. నా ద్వారా ఏ తప్పుడు కార్యము జరగడం లేదు
కదా అని చెక్ చేసుకోవాలి. శివబాబా ఎప్పుడైనా తప్పుడు కార్యాన్ని చేస్తారా? చేయరు.
వారు వచ్చేదే ఉత్తమోత్తమమైన కళ్యాణకారీ కార్యము చేసేందుకు. వారు అందరికీ సద్గతిని
ఇస్తారు. కావున తండ్రి ఏ కర్తవ్యమునైతే చేస్తారో పిల్లలు కూడా అటువంటి కర్తవ్యాన్నే
చేయాలి. ఎవరైతే మొదటి నుండి చాలా భక్తి చేస్తూ వచ్చారో వారి బుద్ధిలోనే ఈ జ్ఞానము
నిలుస్తుంది అని కూడా తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు కూడా దేవతలకు ఎంతోమంది
భక్తులు ఉన్నారు. వారు తమ శిరస్సును సమర్పించేందుకు కూడా సిద్ధముగా ఉంటారు. బాగా
భక్తి చేసేవారి వెనుక తక్కువ భక్తి చేసేవారు వేలాడుతూ ఉంటారు, వారి మహిమను పాడుతూ
ఉంటారు. వారు చేసేదంతా స్థూలముగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గుప్తముగా ఉన్నారు.
మీ బుద్ధిలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమంతా ఉంది. బాబా మనల్ని చదివించేందుకు
వచ్చారని కూడా పిల్లలకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనము ఇంటికి వెళ్తాము. ఎక్కడి నుండైతే
ఆత్మలన్నీ వస్తాయో అదే మన ఇల్లు. అక్కడ శరీరాలే లేవు కావున శబ్దము ఎలా ఉంటుంది.
ఆత్మ లేకుండా శరీరము జడమైనదిగా అయిపోతుంది. మనుష్యులకు శరీరము పట్ల ఎంత మోహము
ఉంటుంది! ఆత్మ శరీరము నుండి వెళ్ళిపోతే ఇక మిగిలేది పంచ తత్వాలే, దాని పట్ల కూడా
ఎంత ప్రేమ ఉంటుంది! పత్ని తన పతి చితి పైకి ఎక్కేందుకు సిద్ధమైపోతుంది. శరీరము పట్ల
ఎంత మోహము ఉంటుంది. ఇప్పుడు ఇక మొత్తము ప్రపంచమంతటి పట్ల నష్టోమోహులుగా అవ్వాలని
ఇప్పుడు మీరు భావిస్తారు. ఈ శరీరమైతే అంతమయ్యేదే ఉంది కావున దీని పట్ల మోహము
తొలగిపోవాలి కదా. కానీ చాలా మోహము ఉంటుంది. బ్రాహ్మణులకు తినిపిస్తూ ఉంటారు. ఇది
ఫలానా వ్యక్తి శ్రాద్ధము అని గుర్తు చేసుకుంటారు కదా. కానీ వాస్తవానికి ఆ వ్యక్తి
ఏమైనా తినగలరా. పిల్లలైన మీరు ఇప్పుడు ఈ విషయాల నుండి అతీతమైపోవాలి. డ్రామాలో ప్రతి
ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తున్నారు. మేము నష్టోమోహులుగా అవ్వాలి అన్న జ్ఞానము ఈ
సమయములో మీలో ఉంది. మోహాన్ని జయించిన రాజు కథ కూడా ఉంది కదా. వాస్తవానికి మోహాన్ని
జయించిన రాజులు ఇంకెవ్వరూ ఉండరు. ఇవన్నీ కథలుగా తయారుచేసారు కదా. అక్కడ అకాల
మృత్యువులు ఉండవు. కావున అడగవలసిన అవసరం కూడా లేదు. ఈ సమయములో మిమ్మల్ని మోహజీతులుగా
తయారుచేస్తారు. స్వర్గములో మోహాన్ని జయించిన రాజులు ఉండేవారు. యథా రాజా రాణి తథా
ప్రజ అందరూ అలానే ఉండేవారు. అది ఉన్నదే నష్టోమోహుల రాజధాని. రావణ రాజ్యములో మోహము
ఉంటుంది. అక్కడైతే వికారాలనేవే ఉండవు, రావణ రాజ్యమే ఉండదు. రావణుని రాజ్యము
వెళ్ళిపోతుంది. రామ రాజ్యములో ఏముంటుంది అనేది ఏమీ తెలియదు. కేవలం తండ్రి తప్ప
ఇంకెవ్వరూ ఈ విషయాలను తెలియజేయలేరు. తండ్రి ఈ శరీరములో ఉన్నా కానీ దేహీ-అభిమానిగా
ఉంటారు. లోన్ లో లేక అద్దెకు ఇల్లు తీసుకున్నప్పుడు దాని పట్ల కూడా మోహము ఉంటుంది.
ఇంటిని చాలా బాగా అలంకరించుకుంటారు. ఇతడినైతే అలంకరించవలసిన అవసరం లేదు ఎందుకంటే
తండ్రి అయితే అశరీరి కదా. బాబాకు అలంకరణ చేసే అభ్యాసము లేదు. బాబాకైతే అవినాశీ
జ్ఞాన రత్నాలతో పిల్లలను అలంకరించే అభ్యాసమే ఉంది. వారు సృష్టి ఆదిమధ్యాంతాల
రహస్యాన్ని అర్థం చేయిస్తారు. శరీరమైతే అపవిత్రమైనదే. ఇతనికి ఎప్పుడైతే ఇంకొక కొత్త
శరీరము లభిస్తుందో, అప్పుడు పవిత్రముగా ఉంటుంది. ఈ సమయములోనైతే ఇది పాత ప్రపంచము,
ఇది అంతమైపోనున్నది. ఈ విషయము కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మెల్లమెల్లగా ఇది
అందరికీ తెలుస్తుంది. కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము, ఇది తండ్రి
కర్తవ్యమే. తండ్రియే వచ్చి బ్రహ్మా ద్వారా ప్రజలను రచించి కొత్త ప్రపంచ స్థాపనను
చేస్తున్నారు. మీరు కొత్త ప్రపంచములో ఉన్నారా? లేదు. కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది.
బ్రాహ్మణుల పిలక కూడా ఉన్నతమైనది. బాబా అర్థం చేయించారు, బాబా సమ్ముఖములోకి
వచ్చేటప్పుడు - మేము ఈశ్వరుడైన తండ్రి సమ్ముఖములోకి వెళ్తున్నాము అని ముందుగా గుర్తు
చేసుకోవాలి. శివబాబా అయితే నిరాకారుడు, మరి వారి సమ్ముఖములోకి మనము ఎలా వెళ్తాము.
కావున ఆ తండ్రిని గుర్తు చేసుకుని అప్పుడు ఈ తండ్రి సమ్ముఖములోకి రావాలి. ఆ తండ్రి
వీరిలో కూర్చుని ఉన్నారని మీకు తెలుసు. ఈ శరీరమైతే పతితమైనది. శివబాబా స్మృతిలో
ఉండకుండా ఏదైనా పని చేసినట్లయితే పాపము అంటుకుంటుంది. మేము శివబాబా వద్దకు
వెళ్తున్నాము అని భావించాలి. మరుసటి జన్మలో వేరే సంబంధీకులు ఉంటారు. అక్కడ దేవతల
ఒడిలోకి వెళ్తారు. ఈ ఈశ్వరీయ ఒడి ఒకే ఒక్కసారి లభిస్తుంది. బాబా, నేను నీవాడిగా
అయిపోయాను అని నోటితో అంటారు. అసలు ఎప్పుడూ చూడను కూడా చూడనివారు ఎంతోమంది ఉన్నారు.
ఎక్కడో బయట ఉంటారు, కానీ - శివబాబా, నేను మీ దత్తత తీసుకోబడిన బిడ్డగా అయిపోయాను అని
బాబాకు వ్రాస్తారు. బుద్ధిలో జ్ఞానము ఉంది. ఆత్మ అంటుంది, నేను శివబాబాకు
చెందినవానిగా అయిపోయాను. ఇంతకుముందు మనము పతితుల ఒడిలో ఉండేవారము. భవిష్యత్తులో
పవిత్ర దేవతల ఒడిలోకి వెళ్తాము. ఈ జన్మ విలువైనది. మీరు వజ్రతుల్యముగా ఈ సంగమయుగములో
అవుతారు. సంగమయుగము అని ఆ నీటిసాగరము మరియు నదులు కలిసిన స్థానాన్ని అనరు. దానికి,
దీనికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. బ్రహ్మపుత్ర అన్నింటికన్నా పెద్ద నది,
అది వెళ్ళి సముద్రములో కలుస్తుంది. నదులు వెళ్ళి సాగరములో కలుస్తాయి. మీరు కూడా
సాగరము నుండి వెలువడిన జ్ఞాన నదులు. జ్ఞానసాగరుడు శివబాబా. అన్నింటికన్నా పెద్ద నది
బ్రహ్మపుత్ర. ఇతని పేరు బ్రహ్మా. సాగరుడితో ఇతనికి ఎంత కలయిక ఉంది. నదులు ఎక్కడి
నుండి వెలువడతాయో మీకు తెలుసు. నదులు సాగరము నుండే వెలువడుతాయి, మళ్ళీ సాగరములోకే
వెళ్తాయి. సాగరము నుండి తీయని నీరును అవి తీసుకుంటాయి. సాగరుని పిల్లలు మళ్ళీ
సాగరములోకే వెళ్ళి కలుస్తారు. మీరు కూడా జ్ఞానసాగరుడి నుండి వెలువడ్డారు, మళ్ళీ
అందరూ అక్కడికే వెళ్ళిపోతారు. వారు ఎక్కడైతే ఉంటారో, అక్కడే ఆత్మలైన మీరు కూడా
ఉంటారు. జ్ఞానసాగరుడు వచ్చి మిమ్మల్ని పవిత్రముగా, మధురముగా తయారుచేస్తారు. ఉప్పగా
మారిపోయిన ఆత్మను మధురముగా తయారుచేస్తారు. పంచ వికారాలనే ఛీ-ఛీ ఉప్పు మీ నుండి
తొలగిపోతుంది, అప్పుడు మీరు తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అయిపోతారు. తండ్రి
పురుషార్థము ఎంతో చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత సతోప్రధానముగా ఉండేవారు, స్వర్గములో
ఉండేవారు. మీరు పూర్తిగా ఛీ-ఛీగా అయిపోయారు. రావణుడు మిమ్మల్ని ఎలా తయారుచేసాడు.
వజ్రము వంటి అమూల్యమైన జన్మ అని భారత్ లోనే గాయనము చేయబడుతుంది.
బాబా అంటూ ఉంటారు - మీరు గవ్వల వెనుక ఎందుకంత హైరానా పడతారు. గవ్వలు కూడా
ఎక్కువేమీ అవసరం లేదు. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. షావుకారులైతే మా కొరకు
ఇక్కడే స్వర్గముంది అని అంటారు. మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో వారందరిదీ ఈ సమయములో
గవ్వ సమానమైన జన్మే అని పిల్లలైన మీకు తెలుసు. ఒకప్పుడు మనము కూడా అలాగే ఉండేవారము.
ఇప్పుడు బాబా మనల్ని ఎలా తయారుచేస్తున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము అయితే ఉంది కదా.
మనము నరుడి నుండి నారాయణుడిగా అవుతాము. భారత్ ఇప్పుడు గవ్వ సమానముగా, నిరుపేదగా ఉంది
కదా. భారతవాసులకు ఈ విషయము తెలియదు. ఇక్కడ మీరు ఎంత సాధారణమైన అబలలుగా ఉన్నారు.
పెద్ద వ్యక్తి ఎవరైనా ఉంటే అతనికి ఇక్కడ కూర్చోవాలని అనిపించదు. ఎక్కడైతే
పెద్ద-పెద్ద వ్యక్తులు, సన్యాసులు, గురువులు మొదలైనవారు ఉంటారో, అక్కడి పెద్ద-పెద్ద
సభలకు అతను వెళ్తారు. తండ్రి కూడా అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. భగవంతుడు
పేదలను రక్షిస్తారు అని అంటారు. ఒకప్పుడు మనము ఎంతో షావుకారులుగా ఉండేవారమని,
ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతామని ఇప్పుడు మీకు తెలుసు. మీరు పదమాపదమపతులుగా అవుతారు
అని తండ్రి వ్రాస్తారు కూడా. అక్కడ కొట్లాటలు ఏమీ జరగవు. ఇక్కడ చూడండి, ధనము కోసం
ఎన్ని కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. లంచాలు ఎంతగా లభిస్తూ ఉంటాయి. మనుష్యులకు ధనమైతే
కావాలి కదా. బాబా మన ఖజానాను నింపుతున్నారని పిల్లలైన మీకు తెలుసు. అర్ధకల్పము కొరకు
మీకు ఎంత కావాలనుకుంటే అంత ధనము తీసుకోండి, కానీ పురుషార్థము పూర్తిగా చేయండి.
నిర్లక్ష్యము చేయకండి. ఫాలో ఫాదర్ అని అనడం జరుగుతుంది కదా. తండ్రిని
అనుసరించినట్లయితే మీరు వెళ్ళి ఈ విధముగా అవుతారు. నరుడి నుండి నారాయణుడిగా, నారి
నుండి లక్ష్మిగా అవుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఇందులో కొద్దిగా కూడా నిర్లక్ష్యము
చేయకూడదు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు కావున దానిపై నడవాలి. నియమ-నిబంధనలను
ఉల్లంఘించకూడదు. శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్ఠముగా అవుతారు. గమ్యము చాలా
ఉన్నతమైనది. ప్రతిరోజూ మీ ఖాతాను వ్రాసుకోండి - సంపాదించుకున్నానా లేక నష్టపోయానా?
తండ్రిని ఎంత సమయము స్మృతి చేసాను? ఎంతమందికి దారిని తెలియజేసాను? అంధులకు చేతికర్ర
మీరే కదా. మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.