15-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు భవిష్య కొత్త ప్రపంచము కోసం మీ
భాగ్యాన్ని తయారుచేసుకుంటున్నారు, మీ ఈ రాజయోగము ఉన్నదే కొత్త ప్రపంచము కోసము’’
ప్రశ్న:-
భాగ్యశాలీ
పిల్లల ముఖ్యమైన గుర్తులేమిటి?
జవాబు:-
1. భాగ్యశాలీ
పిల్లలు నియమానుసారముగా శ్రీమతముపై నడుస్తారు. ఎటువంటి నియమవిరుద్ధమైన పనులు చేసి
స్వయాన్ని గాని, తండ్రిని గాని మోసం చేయరు. 2. వారికి చదువు పట్ల పూర్తి అభిరుచి
ఉంటుంది. అర్థం చేయించే అభిరుచి కూడా ఉంటుంది. 3. పాస్ విత్ ఆనర్ గా అయ్యి
స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థము చేస్తారు. 4. ఎప్పుడూ ఎవరికీ దుఃఖము ఇవ్వరు.
ఎప్పుడూ ఏ విధమైన తప్పుడు కర్మలు చేయరు.
పాట:-
భాగ్యాన్ని
మేలుకొలుపుకుని వచ్చాను...
ఓంశాంతి
మధురాతి
మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. కొత్తవారు కూడా విన్నారు, పాతవారు కూడా
విన్నారు, కుమారీలు కూడా విన్నారు. ఇది పాఠశాల. పాఠశాలలో ఏదో ఒక భాగ్యాన్ని
తయారుచేసుకునేందుకు వెళ్తారు. అక్కడైతే అనేక రకాల భాగ్యము ఉంటుంది. కొందరు సర్జన్
గా అయ్యే భాగ్యాన్ని, కొందరు బ్యారిస్టరుగా అయ్యే భాగ్యాన్ని తయారుచేసుకుంటారు.
భాగ్యాన్ని లక్ష్యము-ఉద్దేశ్యము అని అంటారు. భాగ్యాన్ని తయారుచేసుకోకుండా పాఠశాలలో
ఏం చదువుకుంటారు. కొత్త ప్రపంచములో మన రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకని మనం కూడా
భాగ్యాన్ని తయారుచేసుకుని వచ్చామని ఇప్పుడు ఇక్కడ పిల్లలకు తెలుసు. ఇది కొత్త
ప్రపంచము కోసం రాజయోగము. వారు పాత ప్రపంచము కోసం బ్యారిస్టరు, ఇంజనీరు, సర్జన్
మొదలైనవారిగా అవుతారు. అలా తయారవుతూ-తయారవుతూ, ఇప్పుడిక పాత ప్రపంచము యొక్క సమయము
చాలా తక్కువ ఉంది, ఇది ఇక సమాప్తమైపోతుంది. ఆ భాగ్యము ఈ మృత్యులోకము కోసము, ఈ జన్మ
కోసము. మీ చదువు కొత్త ప్రపంచము కోసము. మీరు కొత్త ప్రపంచము కోసం భాగ్యాన్ని
తయారుచేసుకుని వచ్చారు. కొత్త ప్రపంచములో మీకు రాజ్య భాగ్యము లభిస్తుంది. ఎవరు
చదివిస్తున్నారు? అనంతమైన తండ్రి. వారి నుండే వారసత్వాన్ని పొందేది ఉంది. ఎలాగైతే
డాక్టర్లకు, తమ డాక్టరు చదువుకు సంబంధించిన వారసత్వము లభిస్తుంది. అచ్ఛా, వృద్ధులుగా
అయినప్పుడు గురువుల వద్దకు వెళ్తారు. ఏం కోరుకుంటారు? మాకు శాంతిధామానికి వెళ్ళే
శిక్షణనివ్వండి, మాకు సద్గతినివ్వండి, ఇక్కడ నుండి బయటకు తీసి శాంతిధామానికి
తీసుకువెళ్ళండి అని అంటారు. లౌకిక తండ్రి నుండి కూడా ఈ జన్మ కోసం వారసత్వము
లభిస్తుంది. ఇకపోతే గురువుల నుండి ఏమీ లభించదు. టీచరు నుండి ఏదో ఒక వారసత్వాన్ని
పొందుతారు ఎందుకంటే జీవనోపాధి అయితే కావాలి కదా. తండ్రి యొక్క వారసత్వము ఉన్నప్పటికీ
కూడా, మేమూ మా సంపాదన చేసుకోవాలి అని అనుకుని చదువుకుంటారు. గురువు నుండి సంపాదనేమీ
లభించదు. అయితే, కొందరు గీత మొదలైనవి బాగా చదువుకుని, గీతపై భాషణ చేస్తారు. ఇవన్నీ
అల్పకాలిక సుఖము కోసము. ఇప్పుడిది ఈ మృత్యులోకము యొక్క అంతిమము. మనము కొత్త ప్రపంచము
యొక్క భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచము
సమాప్తమవ్వనున్నది. తండ్రి ఆస్తి మరియు మీ ఆస్తి, అంతా భస్మమైపోతుంది. చేతులు ఖాళీ
అయిపోతాయి. ఇప్పుడైతే కొత్త ప్రపంచము కోసం సంపాదన కావాలి. పాత ప్రపంచములోని
మనుష్యులైతే ఈ సంపాదనను చేసుకోలేరు. కొత్త ప్రపంచము కోసం సంపాదనను చేయించేవారు
శివబాబా మాత్రమే. ఇక్కడ మీరు కొత్త ప్రపంచము కోసం భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు
వచ్చారు. ఆ తండ్రియే మీకు తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా. భవిష్యత్తు కోసం
సంపాదించడము నేర్పించేందుకు వారు సంగమములోనే వస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచములోనైతే
ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి, ఈ విషయము ఈ ప్రపంచములోని మనుష్యులకు తెలియదు.
కొత్త ప్రపంచము కోసం
వీరు మనకు తండ్రి, టీచరు, సద్గురువు అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి శాంతిధామానికి,
సుఖధామానికి తీసుకువెళ్ళేందుకే వస్తారు. ఎవరైనా భాగ్యాన్ని తయారుచేసుకోవడము లేదంటే
వారేమీ అర్థం చేసుకోలేదు అన్నట్లు. ఒకే ఇంటిలో పత్ని చదువుకుంటారు, పతి చదువుకోరు,
పిల్లలు చదువుకుంటారు, తల్లిదండ్రులు చదువుకోరు. ఇలా జరుగుతూ ఉంటుంది. మొదటిలో
పరివారాలకు పరివారాలే వచ్చారు. కానీ మాయ తుఫానులు రావడముతో ఆశ్చర్యము కలిగించేలా
విన్నారు, వినిపించారు, తండ్రిని వదిలి వెళ్ళిపోయారు. ఆశ్చర్యము కలిగించేలా వింటారు,
వినిపిస్తారు, తండ్రికి చెందినవారిగా అవుతారు, చదువును చదివిస్తారు, అయినా కానీ...
అయ్యో, డ్రామా రాత అని అంటూ ఉంటారు. ఇది డ్రామా అన్నట్లే కదా. ఓహో డ్రామా, ఓహో మాయ,
అని తండ్రి స్వయంగా అంటారు. ఎవరిని వదిలి వెళ్ళిపోయారు! పతి-పత్ని ఒకరికొకరు
విడాకులిచ్చుకుంటారు. పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ
విడాకులు ఇవ్వలేరు. తండ్రి అయితే పిల్లల చేత సత్యమైన సంపాదనను చేయించేందుకు వచ్చారు.
తండ్రి ఎవరినీ గోతులో పడేయరు. తండ్రి అయితే పతిత-పావనుడు, దయార్ద్ర హృదయుడు. తండ్రి
వచ్చి దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు మరియు గైడ్ గా తనతో పాటు తీసుకువెళ్తారు.
నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని ఏ లౌకిక గురువు చెప్పరు. శాస్త్రాలలో,
నేను మీ అందరినీ తీసుకువెళ్తానని భగవానువాచ ఉంది. దోమల వలె అందరూ వెళ్ళేది ఉంది.
ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు బాగా తెలుసు. ఈ శరీరాన్ని వదిలేయాలి.
మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచము మరణించినట్లే. కేవలం, స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇది పాత ఛీ-ఛీ శరీరము. ఈ ప్రపంచము కూడా
పాతదే. పాత ఇంటిలో కూర్చుని ఉండగా ఎదురుగా కొత్త ఇల్లు తయారవుతూ ఉంటే, తండ్రి కూడా
- ఇది మా కోసమే అని అనుకుంటారు, అలాగే పిల్లలు కూడా - ఇది మా కోసమే తయారవుతుందని
అనుకుంటారు. కొత్త ఇంటిలో ఇది తయారుచేయండి, ఇది చేయండి అని బుద్ధి కొత్త ఇంటి వైపుకు
వెళ్ళిపోతుంది. బుద్ధి అందులోనే నిమగ్నమై ఉంటుంది, ఇక తర్వాత పాత ఇంటిని
పడగొట్టేస్తారు. మమకారమంతా పాతదాని నుండి తొలగి కొత్తదానితో జోడించబడుతుంది. ఇది
అనంతమైన ప్రపంచానికి సంబంధించిన విషయము. పాత ప్రపంచము నుండి మమకారాన్ని తొలగించాలి
మరియు కొత్త ప్రపంచముతో జోడించాలి. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు.
కొత్త ప్రపంచమంటే స్వర్గము. అందులో మనము రాజ్య పదవిని పొందుతాము. ఎంతగా యోగములో
ఉంటారో, జ్ఞానాన్ని ధారణ చేస్తారో, ఇతరులకు అర్థం చేయిస్తారో, అంతగా సంతోషము యొక్క
పాదరసము పైకి ఎక్కుతుంది. ఇది చాలా భారీ పరీక్ష. మనము 21 జన్మల కోసం వారసత్వాన్ని
పొందుతున్నాము. షావుకారులుగా అవ్వడమైతే మంచిదే కదా. దీర్ఘాయుష్షు లభించడము మంచిదే
కదా. సృష్టి చక్రాన్ని ఎంతగా గుర్తు చేస్తే, ఎంతమందిని తమ సమానముగా తయారుచేస్తే,
అంత లాభముంటుంది. రాజుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారుచేసుకోవాలి. ప్రదర్శనీలకు
ఎంతోమంది వస్తారు. వారంతా ప్రజలుగా అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ అవినాశీ జ్ఞానము
వినాశనమవ్వదు. పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని బుద్ధిలోకి
వస్తుంది. రామ రాజ్య స్థాపన జరుగుతూ ఉంది, రావణ రాజ్యము వినాశనమైపోతుంది.
సత్యయుగములోనైతే దేవతలు మాత్రమే ఉంటారు.
బాబా ఇలా అర్థం
చేయించారు - లక్ష్మీ-నారాయణుల చిత్రాలు ఏవైతే తయారుచేస్తారో, వాటిలో ఇలా వ్రాయాలి -
గత జన్మలో వీరు తమోప్రధాన ప్రపంచములో ఉండేవారు, తర్వాత ఈ పురుషార్థముతో తమోప్రధాన
ప్రపంచము నుండి సతోప్రధాన విశ్వానికి యజమానులుగా అవుతారు అని. రాజు, ప్రజలు అందరూ
యజమానులుగానే ఉంటారు కదా. ప్రజలు కూడా, మా భారత్ అన్నింటికంటే ఉన్నతమైనదని అంటారు.
నిజంగా భారత్ యే అన్నింటికంటే ఉన్నతముగా ఉండేది. ఇప్పుడు అలా లేదు, కానీ తప్పకుండా
ఒకప్పుడు ఉండేది. ఇప్పుడైతే పూర్తిగా నిరుపేదగా అయిపోయింది. ప్రాచీన భారత్
అన్నింటికంటే షావుకారుగా ఉండేది. భారతవాసులైన మనము అన్నింటికంటే ఉన్నతమైన దేవతా
కులానికి చెందినవారిగా ఉండేవారము. ఇతరులెవ్వరినీ దేవీ-దేవతలని అనరు. ఇప్పుడు
కుమార్తెలైన మీరు కూడా చదువుకుంటున్నారు, తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి కదా.
ప్రదర్శనీలు మొదలైనవాటి కోసం టెలిగ్రాములు ఎలా వ్రాయాలో వ్రాసుకుని రండి అని బాబా
డైరెక్షన్ ఇచ్చారు కదా. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. వారు ఈ పదవిని ఎలా పొందారు
అనేది మీరు ఋజువు చేసి చెప్పవచ్చు. ఇప్పుడు మళ్ళీ శివబాబా నుండి ఈ పదవిని
పొందుతున్నారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. శివుడు పరమపిత పరమాత్మ. బ్రహ్మా,
విష్ణువు, శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన
చేస్తున్నారు. విష్ణుపురి ఎదురుగా నిలబడి ఉంది. విష్ణువు ద్వారా కొత్త ప్రపంచ పాలన
జరుగుతుంది. విష్ణువు అనగా రాధా-కృష్ణుల కంబైండ్ రూపము. ఇప్పుడు గీతా భగవానుడు ఎవరు?
గీతా భగవానుడు నిరాకార శివుడు, అంతేకానీ కృష్ణుడు కాదు అని ముందు వ్రాయండి. బ్రహ్మా
నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు. ఒక్క చిత్రము గురించి
అర్థం చేయించడానికే ఎంత సమయము పడుతుంది. ఈ విషయము బుద్ధిలో కూర్చోవాలి కదా.
మొట్టమొదటైతే ఇది అర్థం చేయించి, తర్వాత ఇలా వ్రాయాలి, ఏమనంటే - తండ్రి అంటారు, మీకు
యోగబలముతో బ్రహ్మా ద్వారా 21 జన్మల అధికారము లభిస్తుంది. శివబాబా బ్రహ్మా ద్వారా
వారసత్వాన్ని ఇస్తున్నారు. మొట్టమొదట వీరి ఆత్మ వింటుంది. ఆత్మయే ధారణ చేస్తుంది.
ఇదే ముఖ్యమైన విషయము. చిత్రమైతే శివునిది చూపిస్తారు. వారు పరమపిత పరమాత్మ శివుడు,
ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మా కూడా తప్పకుండా కావాలి. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మాకు
అనేకమంది బ్రహ్మాకుమార-కుమారీలు ఉన్నారు. బ్రహ్మా పిల్లలుగా అవ్వనంత వరకు,
బ్రాహ్మణులుగా అవ్వనంత వరకు, శివబాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు. గర్భము
ద్వారానైతే ఇంతమంది జన్మ జరగదు. ముఖ వంశావళి అని కూడా అంటూ ఉంటారు. మేము ప్రజాపిత
బ్రహ్మా ముఖవంశావళి అని మీరు అంటారు. ఆ గురువులకు శిష్యులు లేక ఫాలోవర్స్ ఉంటారు.
ఇక్కడ మీరు ఒక్కరినే తండ్రి, టీచరు, సద్గురువు అని అంటారు. ఆ నిరాకార శివబాబానే
జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. వారు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని
ఇస్తారు. వారు టీచర్ కూడా. నిరాకారుడు వచ్చి సాకారుడి ద్వారా వినిపిస్తారు. ఆత్మయే
మాట్లాడుతుంది కదా. నా శరీరాన్ని విసిగించకండి అని ఆత్మ అంటుంది. ఆత్మ దుఃఖితముగా
అవుతుంది. ఈ సమయములో పతితాత్మలు ఉన్నారు. పతితులను పావనముగా చేసేవారు పరమపిత
పరమాత్మ. ఓ పతిత-పావనా, ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ పిలుస్తుంది. ఇప్పుడు ఒక ఫాదర్ అయితే
ఎలాగూ కూర్చుని ఉన్నారు, మరి ఇంకెవరిని స్మృతి చేస్తున్నారు. వీరు నా ఆత్మకు ఫాదర్,
వారు శరీరానికి ఫాదర్ అని ఆత్మ అంటుంది. ఇప్పుడు ఆత్మల తండ్రి అయిన నిరాకారుడు
గొప్పవారా లేక శరీరానికి రచయిత అయిన సాకార తండ్రి గొప్పవారా అని అర్థం చేయించడము
జరుగుతుంది. సాకార తండ్రి అయితే నిరాకారుడిని స్మృతి చేస్తారు. ఇప్పుడు వినాశనము
ఎదురుగా నిలబడి ఉంది కనుక అందరికీ ఈ వివరణ ఇవ్వడము జరుగుతుంది. పారలౌకిక తండ్రి
అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు అంతిమములోనే వస్తారు. మిగిలినదంతా వినాశనము
అవ్వనున్నది. దీనిని మృత్యులోకమనే అంటారు. ఎవరైనా మరణించినప్పుడు, ఫలానావారు
పరలోకానికి వెళ్ళారని, శాంతిధామానికి వెళ్ళారని అంటారు. పరలోకము అని సత్యయుగాన్ని
అంటారా లేక శాంతిధామాన్ని అంటారా అనేది మనుష్యులకు తెలియదు. సత్యయుగమైతే ఇక్కడే
ఉంటుంది. పరలోకము అని శాంతిధామాన్ని అంటారు. అర్థం చేయించేందుకు మంచి యుక్తి కావాలి.
మందిరాలకు వెళ్ళి ఇలా అర్థం చేయించాలి - ఇది శివబాబా స్మృతిచిహ్నము, ఈ శివబాబా
మనల్ని చదివిస్తున్నారు. శివుడు వాస్తవానికి ఒక బిందువు. కానీ బిందువుకు ఎలా పూజ
చేయాలి. వారికి ఫలాలు, పుష్పాలు మొదలైనవి ఎలా అర్పించాలి. అందుకే, పెద్ద రూపాన్ని
తయారుచేసారు. కానీ అంత పెద్ద రూపమేమీ ఉండదు. భృకుటి మధ్యలో మెరిసే అద్భుతమైన సితార...
అని అంటూ ఉంటారు కూడా. పెద్ద వస్తువై ఉంటే సైన్స్ వారు వెంటనే పట్టుకునేవారు. వారికి
పరమపిత పరమాత్ముని గురించి పూర్తి పరిచయము లభించలేదని బాబా అర్థం చేయిస్తున్నారు.
భాగ్యము మేలుకోనంత వరకు పరిచయము లభించదు. ఇప్పుడు ఇంకా వారి భాగ్యము మేలుకోలేదు.
తండ్రిని తెలుసుకోనంత వరకు, మా ఆత్మ బిందువు వలె ఉంటుందని అర్థం చేసుకోరు. శివబాబా
కూడా ఒక బిందువే, మనం బిందువును స్మృతి చేస్తాము. ఈ విధముగా భావిస్తూ స్మృతి
చేసినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ఇకపోతే, ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది...
వీటిని మాయా విఘ్నాలని అంటారు. మాకు పరమాత్మ లభించారు అని ఇప్పుడైతే సంతోషము ఉంది.
కానీ జ్ఞానము కూడా కావాలి కదా. ఎవరికైనా శ్రీకృష్ణుని సాక్షాత్కారము జరిగితే
సంతోషపడతారు. బాబా అంటారు - శ్రీకృష్ణుని సాక్షాత్కారాన్ని పొంది చాలా సంతోషముగా
డ్యాన్స్ మొదలైనవి చేస్తారు కానీ వాటితో సద్గతి ఏమీ లభించదు. ఈ సాక్షాత్కారాలైతే ఏ
కష్టము లేకుండా సులభముగానే కలుగుతాయి. ఒకవేళ మంచి రీతిలో చదువుకోకపోతే ప్రజల్లోకి
వెళ్ళిపోతారు. కొద్దిగా విన్నా కూడా కృష్ణపురిలోకి వెళ్ళి సాధారణ ప్రజలు
మొదలైనవారిగా అవుతారు. శివబాబా మనకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారని ఇప్పుడు
పిల్లలైన మీకు తెలుసు. వారు ఉన్నదే నాలెడ్జ్ ఫుల్.
పవిత్రముగా తప్పకుండా
అవ్వాలి అన్నది బాబా ఆజ్ఞ. కానీ కొందరు పవిత్రముగా కూడా ఉండలేకపోతారు. అప్పుడప్పుడు
పతితులు కూడా ఇక్కడకు దాక్కుని వచ్చేస్తారు. వారు తమను తామే నష్టపరచుకుంటారు,
స్వయాన్ని మోసం చేసుకుంటున్నారు. తండ్రిని మోసం చేసే ప్రసక్తే లేదు. తండ్రిని మోసం
చేసి వారి నుండి ధనము ఏమైనా తీసుకునేది ఉందా! శివబాబా యొక్క శ్రీమతమనుసారముగా,
నియమానుసారముగా నడవకపోతే మీ పరిస్థితి ఏమవుతుంది. చాలా శిక్షలు అనుభవించాల్సి
ఉంటుంది. అంతేకాక, పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఎటువంటి నియమవిరుద్ధమైన పనులు
చేయకూడదు. మీ నడవడిక సరిగ్గా లేదని తండ్రి అయితే అర్థం చేయిస్తారు కదా. తండ్రి అయితే
సంపాదన యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఇక ఆ తర్వాత ఎవరైనా చేయడము, చేయకపోవడము
అనేది వారి భాగ్యము. శిక్షలనైతే అనుభవించి తిరిగి శాంతిధామానికి వెళ్ళాల్సిందే, పద
భ్రష్టులు అయిపోతారు, అప్పుడిక ఏమీ లభించదు. రావడమైతే చాలామంది వస్తారు, కానీ ఇక్కడ
తండ్రి నుండి వారసత్వము తీసుకునే విషయముంటుంది. బాబా నుండైతే మేము స్వర్గము యొక్క
సూర్యవంశీ రాజ్య పదవిని పొందుతామని పిల్లలంటారు. ఇది రాజయోగము కదా. విద్యార్థులు
స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు కదా. పాస్ అయ్యేవారికి స్కాలర్షిప్ లభిస్తుంది కదా.
ఎవరైతే స్కాలర్షిప్ తీసుకున్నారో, వారి మాలయే తయారుచేయబడింది. ఎంతగా పాస్ అవుతారో,
అటువంటి స్కాలర్షిప్ లభిస్తుంది. వృద్ధి చెందుతూ-చెందుతూ వేలాదిమంది తయారవుతారు.
రాజ్య పదవియే స్కాలర్షిప్. ఎవరైతే ఈ చదువును బాగా చదువుకుంటారో, వారు గుప్తముగా
ఉండలేరు. చాలామంది కొత్తవారు పాతవారి కంటే ముందుకు వెళ్ళిపోతారు. వజ్ర సమానమైన
జీవితాన్ని తయారుచేసుకుంటారు. తమ సత్యమైన సంపాదనను జమ చేసుకుని 21 జన్మల కోసం
వారసత్వాన్ని పొందుతారు. ఎంత సంతోషము కలుగుతుంది. ఈ వారసత్వాన్ని ఇప్పుడు
తీసుకోకపోతే ఇంకెప్పటికీ తీసుకోలేరని మీకు తెలుసు. చదువు యొక్క అభిరుచి ఉంటుంది కదా.
కొందరికైతే అర్థం చేయించాలనే అభిరుచి ఏ మాత్రము లేదు. డ్రామానుసారముగా భాగ్యములో
లేకపోతే భగవంతుడు కూడా ఏం చేయగలరు. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ పనిని శ్రీమతానికి విరుద్ధముగా చేయకూడదు. చదువును మంచి రీతిలో చదువుకుని
ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకోవాలి. ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు.
2. ఈ పాత ప్రపంచము నుండి మమకారాన్ని తొలగించివేయాలి. బుద్ధియోగాన్ని కొత్త
ప్రపంచముతో జోడించాలి. సంతోషముగా ఉండేందుకు జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరుల చేత ధారణ
చేయించాలి.
వరదానము:-
ఆలోచించడము, మాట్లాడడము మరియు చేయడము - మూడింటినీ సమానముగా
చేసుకునే సర్వోత్తమ పురుషార్థీ భవ
అన్ని శిక్షణల సారమేమిటంటే - చూడడము, లేవడము, కూర్చోవడము,
నడవడము, నిదురించడము, ఇలా ఏ కర్మ ద్వారానైనా ఫరిశ్తాతనము కనిపించాలి. ప్రతి కర్మలో
అలౌకికత ఉండాలి. కర్మలలో గాని, సంస్కారాలలో గాని ఎటువంటి లౌకికత ఉండకూడదు.
ఆలోచించడము, చేయడము, మాట్లాడడము అన్నీ సమానముగా ఉండాలి. ఇది చేయకూడదనుకున్నాను కానీ
చేసేసాను అన్నట్లు ఉండకూడదు. ఎప్పుడైతే మూడూ సమానముగా ఉంటాయో మరియు అవి తండ్రి
సమానముగా ఉంటాయో, అప్పుడు శ్రేష్ఠమైన మరియు సర్వోత్తమమైన పురుషార్థులు అని అంటారు.
స్లోగన్:-
బాధ్యత
తీసుకోవడము అనగా ఎక్స్ ట్రా ఆశీర్వాదాలకు అధికారులుగా అవ్వడము.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
వర్తమాన సమయములో
సర్వాత్మలకు శాంతి మరియు శక్తి యొక్క అవసరమే ఉంది. మీ శక్తిశాలి శాంతి మనసా ద్వారా
ఆత్మలకు మనసు యొక్క శాంతిని అనుభవము చేయించండి. వాణి మరియు మనసా, ఈ రెండు సేవలను
కలిపి ఒకేసారి చేయండి. విశ్వ మహారాజును విశ్వ దాత అని అంటారు. ఇప్పుడు మీరు అందరికీ
సుఖ-శాంతులను మరియు శక్తిని దానముగా ఇచ్చినట్లయితే అందరూ మిమ్మల్ని సుఖదాతలుగా
భావిస్తారు.