16-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సదా గుర్తుంచుకోండి - చాలా సమయము గడిచిపోయింది, ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, ఈ ఛీ-ఛీ శరీరాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోవాలి’’

ప్రశ్న:-
ఏ నషా నిరంతరము ఉన్నట్లయితే స్థితి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది?

జవాబు:-
నిరంతరము ఈ నషా ఉండాలి - వేటగానికి అది వేట, వేటకు అది మృత్యువు. మనము ఫరిశ్తాలుగా అయి మన ప్రియునితో పాటు ఇంటికి వెళ్తాము, మిగిలినదంతా సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు మనము ఈ పాత చర్మాన్ని వదిలి కొత్తది తీసుకుంటాము. ఈ జ్ఞానము రోజంతా బుద్ధిలో చుక్క-చుక్కగా పడుతూ ఉన్నట్లయితే అపారమైన సంతోషము ఉంటుంది. స్థితి ఫస్ట్ క్లాస్ గా తయారవుతుంది.

పాట:-
ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు...

ఓంశాంతి
ఇలా ఎవరన్నారు? పిల్లలు అన్నారు. మీరు అతీంద్రియ సుఖమయ జీవితములోకి ప్రవేశించి అనంతమైన తండ్రి వచ్చారు అని చెప్తారు. ఎందుకు వచ్చారు? ఈ పతిత ప్రపంచాన్ని మార్చి పావన ప్రపంచముగా తయారుచేయడానికి వచ్చారు. పావన ప్రపంచము ఎంత పెద్దదిగా ఉంటుంది మరియు పతిత ప్రపంచము ఎంత పెద్దదిగా ఉంది అనేది పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. ఇక్కడ ఎన్ని కోట్ల మంది మనుష్యులు ఉన్నారు. దీనిని పతిత భ్రష్టాచారీ ప్రపంచమని అంటారు. మా కొత్త ప్రపంచము ఎంత చిన్నగా ఉంటుంది, మేము ఎలా రాజ్యము చేస్తాము అనేది మధురాతి మధురమైన పిల్లల హృదయములోకి రావాలి. మన భారత్ వంటి దేశము ఇంకేదీ ఉండదు. భారత్ స్వర్గముగా ఉండేదని, ఇటువంటి దేశము ఇంకేదీ ఉండదని ఎవరికీ అర్థం కాదు. ఈ భారత్ ఇప్పుడు దేనికీ పనికి రాకుండా ఉందని మీకు అర్థమవుతుంది. భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. మా భారత్ అన్నింటికన్నా ఉన్నతమైనదిగా ఉండేదని, అన్నింటికన్నా ప్రాచీనమైనదిగా ఉండేదని ఎవరికీ గుర్తు రాదు. ఈ విషయము పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది, అది కూడా నంబరువారు పురుషార్థానుసారముగా వస్తుంది. మరి అంతటి సంతోషము, అంతటి గౌరవము ఉంటుందా? అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారు కల్ప-కల్పము వస్తారు. మాయా రావణుడు మన నుండి ఏదైతే రాజ్య భాగ్యాన్ని లాక్కున్నాడో, ఆ రాజ్య భాగ్యాన్ని బాబా వచ్చి ఆత్మలైన మనకు మళ్ళీ ఇస్తారు. రాజ్య భాగ్యాన్ని యుద్ధము చేసి లాక్కున్నారు అని కాదు. అలా కాదు. రావణ రాజ్యములో మన మతము భ్రష్టాచారిగా అయిపోతుంది. శ్రేష్ఠాచారుల నుండి మనము భ్రష్టాచారులుగా అవుతాము. ప్రపంచము ఎంతగా పెరిగిపోయిందో చూడండి, మన భారత దేశము ఎంత చిన్నదిగా ఉండేది. స్వర్గములో ఎంత సుఖముగా ఉంటారు. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి. అక్కడ రావణుడు ఉండడు. పిల్లలైన మీ బుద్ధిలో సంతోషము ఉండాలి, అతీంద్రియ సుఖము ఉండాలి.

తండ్రి అంటారు - దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహ భానాన్ని తొలగించుకునేందుకు బాబా అన్నారు - 108 అతుకులు ఉన్న బట్టలను ధరించండి. (ఈ బాబాకు) గొప్ప వ్యక్తులతో, వజ్రాల వ్యాపారులతో సంబంధాలు ఉండేవి, ఆ నషా ఎలా తొలగుతుంది. దేహీ-అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. నేను ఆత్మను, ఇది పాత శరీరము. దీనిని వదిలి కొత్త ఫస్ట్ క్లాస్ శరీరాన్ని తీసుకోవాలి. సర్పమైతే ఒక కుబుసాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఈ పాత చర్మాన్ని వదిలి, మేము మరొక కొత్తదానిని తీసుకుంటామని, తర్వాత మరొక శరీరము లభిస్తుందని పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానముంది. ఈ జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో చుక్క-చుక్కగా పడుతూ ఉండాలి. ఇది ఛీ-ఛీ ప్రపంచము, దీనిని చూస్తూ కూడా బుద్ధి ద్వారా మర్చిపోవాల్సి ఉంటుంది. మనము యాత్రకు వెళ్తున్నాము, మన బుద్ధి యోగము ఇంటి వైపుకు వెళ్తూ ఉంది. అభ్యాసమైతే చేయవలసి ఉంటుంది కదా. ఈ శరీరము కూడా పాతదే, ప్రపంచము కూడా పాతదే. ఇప్పుడు ఈ దేహము మరియు దేహపు సర్వ సంబంధాలను వదిలి ఇంటికి వెళ్ళాలని మీకు సాక్షాత్కారము కలిగింది. ఇప్పుడు మేము తిరిగి వెళ్ళాలి అని లోలోపల సంతోషము ఉంటుంది. బుద్ధియోగాన్ని అక్కడ జోడించవలసి ఉంటుంది. ఒకరికొకరు మన్మనాభవ అని చెప్పుకుంటూ ఉండాలి. ఇది చాలా శక్తిశాలి మంత్రము. గీతను చాలామంది చదువుతారు కానీ అర్థం తెలియదు. ఎలాగైతే వేరే శాస్త్రాలను చదువుతారో, అలానే గీతను కూడా చదువుతారు. మనము భవిష్యత్తు కోసం రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని వారెవరి బుద్ధిలోకి రాదు. చాలా సమయము గడిచిపోయింది, ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ విధముగా స్వయాన్ని ఆహ్లాదపరుచుకుంటూ, సంతోషముగా ఉండాలి. ఇదంతా సమాప్తమవ్వనున్నది. వేటగానికి అది వేట, వేటకు అది మృత్యువు. మనము ఫరిశ్తాలుగా అయి మన ప్రియునితో పాటు ఇంటికి వెళ్తాము. ఈ ఆత్మల తండ్రి కూర్చుని శిక్షణను ఇస్తారు. సాధారణముగా ఉన్నా కానీ వీరు ఉన్నతోన్నతమైనవారు. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు, వారు కల్ప-కల్పము వస్తారు. ఇది ఛీ-ఛీ ప్రపంచము. మీతో మీరు ఇలాంటి మాటలను మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దీనినే విచార సాగర మంథనము అని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవాటిని జన్మ-జన్మలుగా చదివారు. భారతవాసులైన మనము ఎన్ని జప-తపాదులు మొదలైనవి చేసామో, అంతగా ఇంకెవ్వరూ చేయలేదు. ఎవరైతే మొట్టమొదట వచ్చారో, వారే భక్తి చేసారు మరియు వారే జ్ఞాన-యోగాలలో కూడా చురుకుగా ముందుకు వెళ్తారు ఎందుకంటే వారు మళ్ళీ మొదటి నంబరులోకి రావాలి. కొంతమందైతే చాలా బాగా పురుషార్థము చేస్తున్నారు అన్నదానిని మీరు చూస్తుంటారు.

పిల్లలైన మీలో ఎవరైతే ఈ ఆత్మిక సేవలో నిమగ్నమై ఉన్నారో, వారికైతే చాలా బాగుంటుంది. వారు నిజంగా భట్టీలో కూర్చుని ఉన్నట్లు ఉన్నారు. వారి ఈ సంబంధము తెగిపోనిదిగా అయ్యింది, మరియు ఎవరైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ, ఇది వింటూ-వినిపిస్తూ ఉంటారో, వారు పాతవారికన్నా చురుకుగా ముందుకు వెళ్తున్నారు. కొత్తగా వచ్చేవారు చాలా చురుకుగా ముందుకు వెళ్ళడాన్ని చూస్తుంటారు. మీరు లిస్ట్ తీస్తే తెలిసిపోతుంది. మొదటిలో మీ మాలను తయారుచేసేవారు, ఆ తర్వాత చాలామంది మంచి-మంచి పిల్లలు, 3-4 నంబరులో ఉన్నవారు కూడా వెళ్ళిపోవడాన్ని చూసారు. వెళ్ళిపోయి ఒక్కసారిగా ప్రజా పదవికి చేరుకున్నారు. ఇప్పుడిది మీ స్టూడెంట్ లైఫ్, గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ కోర్సును కూడా చదువుకుంటున్నారు. చాలామంది పిల్లలు డబల్ కోర్సులు చేస్తుంటారు, వారికి లిఫ్ట్ లభిస్తుంది. మీ కోర్సు గృహస్థ వ్యవహారములో ఉంటూ ఇది చదువుకోడము. ఇందులో కూడా కన్యలు చాలా చురుకుగా ముందుకు వెళ్ళాలి. కన్యల కారణముగానే కన్నయ్య మరియు గోపాలుడు అనే పేర్లు గాయనము చేయబడ్డాయి. అయితే, గోపులు కూడా ఉన్నారు ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గము కదా. మీరు సత్యయుగములో దేవీ-దేవతా ధర్మము వారిగా ఉండేవారు. ఈ లక్ష్మీ-నారాయణులు ప్రవృత్తి మార్గములో రాజ్యము చేసేవారు. మేము ఎలా తయారవ్వబోతున్నాము అనేది మీ బుద్ధిలో చుక్క-చుక్కగా పడుతూ ఉండాలి. దేవతలు ఎంత ఫస్ట్ క్లాస్ అయినవారు! వారి ముందుకు వెళ్ళి - మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు... అని మహిమను పాడుతారు. మేము పాపులము, కపటులము, నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు... అని అంటారు. ఇప్పుడు ఇందులో భగవంతుడు దయ చూపించడము లేక కృప చూపించడము అనేది ఉండదు. వాస్తవానికి దయ మరియు కృప అనేది మీపై మీరే చూపించుకోవాల్సి ఉంటుంది. మీరే దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు ఎలా తయారయ్యారు, స్వయాన్ని చూసుకోండి, మరియు పురుషార్థము చేసి దేవతలుగా అవ్వండి. శ్యామము నుండి సుందరముగా తయారయ్యేందుకు పురుషార్థము చేయవలసి ఉంటుంది. మేము మరణించబోయాము, ఫలానా వారు కృప చూపించారు, వారి ఆశీర్వాదాలతో బ్రతికిపోయాము అని భక్తి మార్గములో అంటారు. మహాత్ములు మొదలైనవారి చేతులను పట్టుకుని, మీ ఆశీర్వాదాలు కావాలని అడుగుతారు. ఇక్కడ ఉన్నది చదువు. కృప మొదలైనవాటి విషయము లేదు. మన్మనాభవ అన్న పదానికి అర్థముంది కదా. మంత్రాన్ని అయితే చాలామంది ఇస్తారు. అనేక రకాల హఠయోగాలు నేర్పిస్తారు. ప్రతి ఒక్కరి శిక్షణ వేరు-వేరుగా ఉంటుంది. హఠయోగము స్యాంపుల్స్ చూడాలనుకుంటే జైపూర్ మ్యూజియంకు వెళ్ళి చూడండి. ఇక్కడైతే మీరు ఎంత ప్రశాంతముగా కూర్చుని ఉన్నారు. బాబా మాకు మళ్ళీ రాజ్యాన్ని ఇస్తున్నారు అన్నది మీ బుద్ధిలో ఉంది. అక్కడే అద్వైత దేవీ-దేవతా ధర్మముండేది, వేరే ధర్మమేదీ ఉండేది కాదు. రెండు చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి. ఒకే ధర్మముంటే గొడవలు జరగవు. ఇప్పుడిది కలియుగము. కలియుగము పూర్తి అయితే భక్తి కూడా పూర్తవుతుంది. ఇప్పుడు మనుష్యుల వృద్ధి ఎంతగా జరుగుతూ ఉంది. భారత్ యొక్క భూమి పెరగదు. భూమి అంతే ఉంటుంది, కానీ మనుష్యులు సంఖ్య తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా తక్కువమంది మనుష్యులు ఉంటారు, ప్రపంచము ఇదే ఉంటుంది. ప్రపంచమేమీ చిన్నగా అవ్వదు. పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. మనము యోగబలముతో తండ్రి శ్రీమతమనుసారముగా మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి. ఆత్మలోనే మాలిన్యము చేరుకుంది కదా. కేవలం సతో, రజో, తమో... అని అంటూ ఉంటారు కానీ ఆత్మలోనే మాలిన్యము చేరుతుంది అని చూపించరు. మొట్టమొదట బంగారుయుగము వారిగా ఉండేవారు, స్వచ్ఛమైన బంగారములా ఉండేవారు, తర్వాత వెండి కలుస్తుంది, దానిని వెండియుగము అని అంటారు, చంద్రవంశీయులని అంటారు. గోల్డెన్, సిల్వర్, కాపర్, ఆ తర్వాత ఐరన్ - ఈ ఇంగ్లీషు పదాలు ఎంత బాగున్నాయి. ఆత్మలో మాలిన్యము చేరుకుంది, ఇప్పుడది ఎలా తొలగుతుంది అనేది బాబా అర్థం చేయిస్తారు. సతో నుండి తమోగా అయ్యారు, తర్వాత తమో నుండి సతోగా ఎలా అవ్వాలి. గంగలో స్నానము చేయడముతో సతోప్రధానముగా అవుతారని భావిస్తారు. కానీ అది సాధ్యము కాదు. గంగా స్నానాలు మొదలైనవైతే రోజూ చేస్తూ ఉంటారు. కొందరు నిష్ఠగా ఉంటారు. కొలనులోకి కూడా వెళ్ళి స్నానము చేస్తారు. బాబాను స్మృతి చేసే నియమాన్ని పెట్టుకోండి అని మీకు బాబా చెప్తున్నారు. స్మృతి అనే స్నానాన్ని మరియు స్మృతి అనే యాత్రను చేయండి. జ్ఞాన స్నానాన్ని కూడా చేయిస్తారు, యోగ యాత్రను నేర్పిస్తారు. తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. ఇందులో యోగానికి సంబంధించిన జ్ఞానము కూడా ఉంది, సృష్టి చక్రము యొక్క జ్ఞానము కూడా ఉంది. ఇకపోతే శాస్త్రాల జ్ఞానాన్ని అయితే ఎంతోమంది ఇస్తారు, వారికి యోగము గురించి అసలు తెలియదు. యోగమంటే హఠయోగమని అనుకున్నారు. యోగాశ్రమాలైతే ఎన్నో ఉన్నాయి. మన్మనాభవ మంత్రాన్ని ఇస్తారు కానీ ఒక్క తండ్రి వద్ద తప్ప ఇంకే మనుష్యుల వద్ద ఈ జ్ఞానము లేదు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అయ్యింది. తర్వాత కొత్త ప్రపంచము ఉంటుంది. వృక్షము ఎలా వృద్ధి చెందుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. రాజ్య స్థాపన జరుగుతోంది, అందరూ కలిసి ఒకేసారి వెళ్ళరు. బ్రాహ్మణుల వృక్షము చాలా పెద్దదవుతుంది. అప్పుడు కొంతమంది చొప్పున తిరిగి వెళ్తారు. ప్రజలు తయారవుతూ ఉంటారు. కొద్దిగా విన్నా సరే ప్రజల్లోకి వచ్చేస్తారు. సేవా కేంద్రాలు చాలా వృద్ధి చెందుతాయి. ఎన్నో ప్రదర్శనీలు అన్నిచోట్లా జరుగుతూ ఉంటాయి. ఎలాగైతే మందిరాలను అన్ని చోట్లా నిర్మిస్తూ ఉంటారో, అలా మీ ప్రదర్శనీలు కూడా ప్రతి గ్రామములోనూ జరుగుతాయి. ప్రతి ఇంటిలోనూ ప్రదర్శనీని పెట్టవలసి ఉంటుంది. వృద్ధి చెందుతూ ఉంటారు. అందుకే చివరికి ఈ చిత్రాలను కూడా ముద్రించవలసి ఉంటుంది. అందరి వద్దకు తండ్రి సందేశము చేరుకోవాలి. పిల్లలైన మీరు చాలా గొప్ప సేవ చేయాలి. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్, ప్రదర్శనీల ఫ్యాషన్ వెలువడింది, కావున వీటిని ప్రతి గ్రామములోనూ చూపించవలసి ఉంటుంది. వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు, స్వీకరిస్తారు. శివజయంతి అని అంటూ ఉంటారు, కానీ వారు (శివుడు) ఎలా వస్తారు అనేది ఎవరికీ తెలియదు. శివపురాణము మొదలైనవాటిలో ఈ విషయాలు లేవు. ఈ విషయాలను మీరు వింటారు. వినే సమయములో బాగా అనిపిస్తుంది, కానీ తర్వాత మర్చిపోతారు. పాయింట్లు మంచి రీతిలో ధారణ అయితే, సేవ కూడా బాగా చేయగలరు. కానీ అన్ని పాయింట్లు ఎవరికీ ధారణ అవ్వవు. భాషణ చేసి వచ్చిన తర్వాత - ఈ పాయింట్లు కూడా చెప్పి ఉంటే బాగుండేది అన్న ఆలోచన వస్తుంది. ఎవరికైతే దేహాభిమానము ఉండదో, వారు వెంటనే చెప్తారు. భాషణ చేసి వచ్చిన తర్వాత - నేను అన్ని పాయింట్లు సరిగ్గా అర్థం చేయించానా అని ఆలోచిస్తారు. ఇంకా ఈ పాయింట్లు మర్చిపోయానే అని అనుకుంటారు. ఈ పాయింట్లు ఏవీ మీతో పాటు రావు. ఇవి కేవలం ఇప్పటి కోసం మాత్రమే. తర్వాత ఇవి సమాప్తమైపోతాయి. ఈ కళ్ళతో ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో, ఇవి సత్యయుగములో ఉండవు. మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడు మీరు త్రినేత్రులుగా అవుతారు. బాబా వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు, దానిని ఆత్మ ధారణ చేస్తుంది. ఆత్మకు మూడవ నేత్రము లభిస్తుంది. నేను ఆత్మను, ఈ శరీరము ద్వారా ఇది చేస్తున్నాను అన్న జ్ఞానము ఎవరిలోనూ లేదు. బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది బుద్ధిలో ఉంచుకోవాలి - ఇందులో శ్రమ ఉంది. పిల్లలు కృషి చేయాలి మరియు సంతోషములో ఉండాలి. ఇప్పుడిక మన రాజ్యము వచ్చేసినట్లే. మన రాజ్యములో ఏమేమి ఉంటాయో మీకు తెలుసు. మేము ఈ చదువు ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. చదువుకునేవారికి పదవి గుర్తుంటుంది. మనము భవిష్యత్తు కోసం చదువుకుంటున్నాము. బాగా చదువుకుంటే రాజ్య సింహాసనముపై కూర్చుంటారు. వారు ప్రసిద్ధమవుతారు. ఇప్పుడు లిస్ట్ తీసి మాలను తయారుచేస్తే, ఫలానా కుమారిని మా వద్దకు రిఫ్రెష్ చేయడానికి పంపించండి అని అందరూ అడుగుతారు. భాషణ చేసేవారిని పిలుస్తారు, కావున వారి పట్ల గౌరవము కూడా ఉండాలి. మేము వీరి వలె చురుకైనవారిగా అవ్వాలని భావించాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు దేహ భానాన్ని తెంచే పురుషార్థము చేయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే బుద్ధియోగము ఇంటితో జోడించబడి ఉండాలి.

2. గృహస్థ వ్యవహారములో ఉంటూ చదువును కూడా చదువుకోవాలి, డబల్ కోర్స్ చేయాలి. జ్ఞాన స్నానాన్ని మరియు స్మృతియాత్రను చేయాలి మరియు చేయించాలి.

వరదానము:-
కోమలతను కమాల్ లోకి (అద్భుతములోకి) పరివర్తన చేసి మాయాజీతులుగా అయ్యే శక్తి స్వరూప భవ

శక్తి స్వరూపులుగా అయ్యేందుకు కోమలతను అద్భుతములోకి పరివర్తన చేయండి. కేవలం స్వయం యొక్క సంస్కారాలను పరివర్తన చేసుకోవడములో కోమలముగా అవ్వండి, కర్మలలో ఎప్పుడూ కోమలముగా అవ్వకండి, ఇందులో శక్తి రూపులుగా అవ్వాలి. ఎవరైతే శక్తి రూపము యొక్క కవచాన్ని ధారణ చేస్తారో, వారికి మాయ యొక్క ఏ బాణము తగలదు. అందుకే మీ ముఖము, నయనాల ద్వారా కోమలత్వానికి బదులుగా శక్తి రూపము కనిపించాలి, అప్పుడు మాయాజీతులుగా అయి పాస్ విత్ ఆనర్ యొక్క సర్టిఫికెట్ ను తీసుకోగలుగుతారు.

స్లోగన్:-
త్రికాలదర్శీ సీటుపై సెట్ అయి ప్రతి కర్మను చేసినట్లయితే మాయ దూరం నుండే పారిపోతుంది.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

ఏ విధముగా సాకార బాబా అలసిపోనివారిగా ఉంటూ ఏకరస స్థితికి ఉదాహరణగా అయ్యి చూపించారో, అదే విధముగా పిల్లలైన మీరు కూడా ఇతరులకు ఉదాహరణగా అవ్వాలి, ఇదే సేవ. సేవ అనేది కేవలం వాణి ద్వారానే జరగదు, స్థితి ద్వారా కూడా సేవ జరుగుతుంది. కావున సమయమనుసారముగా ఇప్పుడు మీ స్థితిని ఏకరసముగా తయారుచేసుకోండి.