16-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అద్భుతమైన రంగు-రంగుల ప్రపంచానికి (స్వర్గానికి) యజమానులుగా అవ్వడమే మీ లక్ష్యము, ఉద్దేశ్యము, కావున సదా ఇదే సంతోషములో హర్షితముగా ఉండండి, వాడిపోయినట్లు ఉండకండి’’

ప్రశ్న:-
భాగ్యవంతులైన పిల్లలకు ఏ ఉత్సాహము సదా నిలిచి ఉంటుంది?

జవాబు:-
మమ్మల్ని అనంతమైన తండ్రి కొత్త ప్రపంచము యొక్క రాకుమారులుగా-రాకుమారీలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు. ఈ యుద్ధములో స్వర్గము ఇమిడి ఉంది అని మీరు ఇదే ఉత్సాహముతో అందరికీ అర్థం చేయించవచ్చు. ఈ యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి - ఇదే సంతోషములో ఉండాలి మరియు ఎంతో సంతోషముగా ఇతరులకు కూడా అర్థం చేయించాలి.

పాట:-
ప్రపంచము రంగు-రంగులది బాబా...

ఓంశాంతి
ప్రపంచము రంగు-రంగులది అని బాబాతో ఎవరు అన్నారు? ఇప్పుడు దీని అర్థాన్ని ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ ఆట అంతా రంగు-రంగులది అని తండ్రి అర్థం చేయించారు. సినిమాలు మొదలైనవాటిలో రంగు-రంగుల దృశ్యాలు, సీనరీలు మొదలైనవి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ అనంతమైన ప్రపంచము గురించి ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా మొత్తం విశ్వము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. స్వర్గము ఎంత రంగు-రంగులుగా, సుందరముగా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకున్నారు. దాని గురించి ఎవ్వరికీ తెలియదు. స్వర్గమనేది అద్భుతమైన రంగు-రంగుల ప్రపంచము అని ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. దానిని వండర్ ఆఫ్ ది వరల్డ్ (ప్రపంచ అద్భుతము) అని అంటూ ఉంటారు, దీని గురించి కేవలము మీకే తెలుసు. మీరే వండర్ ఆఫ్ ది వరల్డ్ కొరకు మీ-మీ భాగ్యమనుసారముగా పురుషార్థము చేస్తున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము అయితే ఉంది. అది వండర్ ఆఫ్ ది వరల్డ్, ఎంతో రంగు-రంగుల ప్రపంచము, అక్కడ వజ్ర-వైఢూర్యాలతో పొదగబడిన మహళ్ళు ఉంటాయి. మీరు ఒక్క క్షణములో అద్భుతమైన వైకుంఠములోకి వెళ్ళిపోతారు. అక్కడ ఆడతారు, రాస-విలాసాలు మొదలైనవి చేస్తారు. తప్పకుండా అది అద్భుతమైన ప్రపంచమే కదా. ఇక్కడ ఉన్నది మాయా రాజ్యము, ఇది కూడా ఎంత అద్భుతమైనది. మనుష్యులు ఏమేమో చేస్తూ ఉంటారు. మనం నాటకములో పాత్రను అభినయిస్తున్నామని ప్రపంచములోనివారెవ్వరూ అర్థం చేసుకోరు. దీనిని ఒకవేళ నాటకముగా భావించినట్లయితే ఈ నాటకము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము కూడా ఉండాలి. తండ్రి కూడా ఎంత సాధారణమైనవారు అనేది పిల్లలైన మీకు తెలుసు. మాయ పూర్తిగా మరపింపజేస్తుంది. ముక్కు పట్టుకుని మరపింపజేస్తుంది. ఇప్పుడిప్పుడే స్మృతిలో ఉంటారు, ఎంతో హర్షితముగా ఉంటారు, ఓహో, మేము వండర్ ఆఫ్ ది వరల్డ్ అయిన స్వర్గానికి అధిపతులుగా అవుతున్నామని భావిస్తారు. మళ్ళీ మర్చిపోతే వాడిపోతారు. ఎంతగా వాడిపోతారంటే ఆటవికులు కూడా అంతగా వాడిపోయి ఉండరు. అసలు మేము స్వర్గములోకి వెళ్ళబోతున్నాము, మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అన్నది కొద్దిగా కూడా భావించనే భావించటం లేదు అన్నట్లు ఉంటారు. పూర్తిగా శవాల వలె అయిపోతారు. ఆ సంతోషము మరియు నషా ఉండదు. ఇప్పుడు వండర్ ఆఫ్ ది వరల్డ్ యొక్క స్థాపన జరుగుతోంది. వండర్ ఆఫ్ ది వరల్డ్ కు యువరాజు శ్రీకృష్ణుడు. ఇది కూడా మీకు తెలుసు. శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి కూడా ఎవరైతే జ్ఞానములో చురుకుగా ఉంటారో వారు అర్థం చేయిస్తుంటారు. శ్రీకృష్ణుడు వండర్ ఆఫ్ ది వరల్డ్ కు యువరాజు. ఆ సత్యయుగము మరి ఏమయ్యింది! సత్యయుగము నుండి మొదలుకుని మెట్లు ఏ విధంగా దిగుతూ వచ్చారు. సత్యయుగము నుండి కలియుగముగా ఎలా మారింది? దిగే కళ ఎలా ఏర్పడింది? ఇది పిల్లలైన మీ బుద్ధిలోకే వస్తుంది. శ్రీకృష్ణుడు వస్తున్నారు, శ్రీకృష్ణుని రాజ్యము మళ్ళీ స్థాపన అవుతోంది... అని ఆ సంతోషముతో అర్థం చేయించాలి. ఇది విని భారతవాసులకు కూడా సంతోషము కలగాలి. కానీ ఎవరైతే భాగ్యవంతులుగా ఉంటారో వారికే ఈ ఉత్సాహము కలుగుతుంది. ప్రపంచములోని మనుష్యులైతే రత్నాలను కూడా రాళ్ళుగా భావిస్తూ పారేస్తారు. ఇవి అవినాశీ జ్ఞాన రత్నాలు కదా. ఈ జ్ఞాన రత్నాల సాగరుడు తండ్రి. ఈ రత్నాలకు ఎంతో విలువ ఉంది. ఈ జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి. ఇప్పుడు మీరు జ్ఞాన సాగరుడి నుండి డైరెక్టుగా వింటారు, కావున ఇంకేదీ వినవలసిన అవసరమే లేదు. సత్యయుగములో ఇది ఉండదు. అక్కడ ఎల్.ఎల్.బి ఉండదు, అలాగే సర్జన్ మొదలైనవారిగా అవ్వవలసిన అవసరముండదు. అక్కడ ఈ జ్ఞానమే ఉండదు. అక్కడైతే మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. కావున జన్మాష్టమి నాడు పిల్లలు బాగా అర్థం చేయించాలి. అనేక సార్లు మురళీ కూడా వినిపించబడింది. పిల్లలు విచార సాగర మంథనము చేయాలి, అప్పుడే పాయింట్లు వెలువడుతాయి. భాషణ చేయాలంటే ఉదయాన్నే లేచి వ్రాసుకోవాలి, ఆ తర్వాత చదవాలి, మర్చిపోయిన పాయింట్లను మళ్ళీ వ్రాసుకోవాలి. దీని ద్వారా ధారణ బాగా జరుగుతుంది. అయినా ఏదైతే వ్రాసుకున్నారో, దానినంతా ఏమీ వినిపించలేరు. ఎన్నో కొన్ని పాయింట్లను మర్చిపోతారు. శ్రీకృష్ణుడు ఎవరు అనేది అర్థం చేయించవలసి ఉంటుంది. అతను వండర్ ఆఫ్ ది వరల్డ్ కు అధిపతి. భారత్ యే ప్యారడైజ్ గా ఉండేది, ఆ ప్యారడైజ్ కు అధిపతి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు వస్తున్నారని మేము మీకు సందేశము వినిపిస్తాము. రాజయోగాన్ని భగవంతుడే నేర్పించారు. వారు ఇప్పుడు కూడా నేర్పిస్తున్నారు. ద్వికిరీటధారులైన దేవతలుగా తయారుచేసేందుకు పవిత్రత కొరకు కూడా పురుషార్థము చేయిస్తున్నారు. ఇవన్నీ పిల్లలకు స్మృతిలోకి రావాలి. ఎవరికైతే అభ్యాసము ఉంటుందో వారు బాగా అర్థం చేయించగలుగుతారు. శ్రీకృష్ణుని చిత్రములో కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా వ్రాయబడి ఉంది. ఈ యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ యుద్ధములో స్వర్గము ఇమిడి ఉన్నట్లుగా ఉంది. పిల్లలు కూడా ఎంతో సంతోషముగా ఉండాలి. జన్మాష్టమి నాడు మనుష్యులు బట్టలు మొదలైనవి కొత్తవి ధరిస్తారు, కానీ ఇప్పుడు మనము ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త కాంచన శరీరాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. కాంచన కాయ అంటారు కదా, దాని అర్థమేమిటంటే - బంగారము వంటి శరీరము. ఆత్మ కూడా పవిత్రముగా ఉంటుంది, శరీరము కూడా పవిత్రముగా ఉంటుంది. ఇప్పుడు కాంచనముగా లేదు. నంబరువారుగా అవుతూ ఉన్నారు. స్మృతియాత్ర ద్వారానే కాంచనముగా అవుతారు. స్మృతి చేసే తెలివి కూడా లేనివారు చాలామంది ఉన్నారని బాబాకు తెలుసు. స్మృతి చేసేలో విషయములో ఎప్పుడైతే కృషి చేస్తారో, అప్పుడే వాణిలో పదును ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి ఎక్కడ ఉంది. యోగము లేదు. లక్ష్మీ-నారాయణులుగా అయ్యే ముఖము కూడా కావాలి కదా, అంతటి చదువు కావాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు అర్థం చేయించడం చాలా సహజము. శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడు అని అంటారు. శ్రీకృష్ణుడిని కూడా నల్లగా చూపించారు, అలాగే నారాయణుడిని కూడా నల్లగా చూపించారు, రాముడిని కూడా నల్లగా చేసేశారు. తండ్రి స్వయం అంటున్నారు - నా పిల్లలెవరైతే మొదట జ్ఞాన చితిపై కూర్చుని స్వర్గాధిపతులుగా అయ్యరో వారు తర్వత ఏమైపోయారు. కామ చితిపై కూర్చుంటూ నంబరువారుగా పడిపోతూ వచ్చారు. సృష్టి కూడా సతోప్రధానముగా, సతో, రజో, తమోగా అవుతుంది. కావున మనుష్యుల అవస్థ కూడా ఆ విధముగా అవుతుంది. కామ చితిపై కూర్చుని అందరూ శ్యామముగా అనగా నల్లగా అయిపోయారు. ఇప్పుడు నేను సుందరముగా తయారుచేయడానికి వచ్చాను. ఆత్మనే సుందరముగా తయారుచేయడం జరుగుతుంది. బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు, వారు మనసా, వాచా, కర్మణా ఎలా నడుచుకుంటున్నారో దాని బట్టి అర్థం చేసుకుంటారు. వారు ఎటువంటి కర్మలు చేస్తున్నారో దాని ద్వారా తెలిసిపోతుంది. పిల్లల నడవడిక అయితే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి. శ్రీకృష్ణ జయంతి నాడు అర్థం చేయించడము చాలా మంచిది. శ్యాముడు మరియు సుందరుడు అన్న టాపిక్ ఉండాలి. శ్రీకృష్ణుడిని కూడా నల్లగా చూపించారు, అలాగే నారాయణుడిని, రాధను కూడా నల్లగా ఎందుకు చూపిస్తారు? శివలింగాన్ని కూడా నల్లని రాయితోనే చేస్తారు, కానీ వాస్తవానికి వారు నల్లగా ఉంటారా ఏమిటి. అసలు శివుడు ఎవరు, కానీ వారిని ఎలా తయారుచేస్తారు. ఈ విషయాల గురించి పిల్లలైన మీకే తెలుసు. నల్లగా ఎందుకు తయారుచేస్తారు అన్న విషయముపై మీరు అర్థం చేయించగలరు. పిల్లలు ఏమి సేవ చేస్తారో ఇప్పుడు చూద్దాము. తండ్రి అయితే అంటారు, ఈ జ్ఞానము అన్ని ధర్మాలవారి కొరకు ఉంది. వారికి కూడా తెలియజేయాల్సింది ఏమిటంటే - నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి అని తండ్రి చెప్తున్నారు. పవిత్రముగా అవ్వాలి. మీరు ఎవరికైనా రాఖీ కట్టవచ్చు. యూరోపియన్లకు కూడా కట్టవచ్చు. వారు ఎవరైనా సరే వారికి చెప్పండి - ఇది భగవానువాచ, కావున తప్పకుండా వారు ఎవరో ఒకరి తనువు ద్వారానే వినిపిస్తారు కదా. వారు అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహపు సర్వ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. బాబా ఎంతగా అర్థం చేయిస్తారు, అయినా అర్థం చేసుకోకపోతే ఇక వీరి భాగ్యములో లేదు అని తండ్రి భావిస్తారు. శివబాబా చదివిస్తున్నారు అని అయితే భావిస్తారు కదా. రథము లేకుండానైతే చదివించలేరు కదా. కేవలం సూచనలు ఇస్తే చాలు. కొంతమంది పిల్లలకు అర్థం చేయించే అభ్యాసము బాగుంది. మమ్మా, బాబా విషయములోనైతే - వారు ఉన్నత పదవిని పొందబోతున్నారని భావిస్తారు. మమ్మా కూడా సేవ చేసేవారు కదా. ఈ విషయాలను కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. మాయకు కూడా అనేక రకాల రూపాలు ఉంటాయి. మాలోకి మమ్మా వస్తారు, శివబాబా వస్తారు అని చాలామంది అంటూ ఉంటారు, కానీ కొత్త-కొత్త పాయింట్లనైతే నిశ్చితమై ఉన్న తనువు ద్వారానే వినిపిస్తారా లేక ఇతరులెవ్వరి ద్వారానైనా వినిపిస్తారా? ఇదైతే జరుగదు. ఆ మాటకొస్తే పిల్లలు కూడా అనేక రకాల పాయింట్లను తమకు తాముగానే వినిపిస్తూ ఉంటారు. మ్యాగజైన్లలో ఎన్ని విషయాలు వస్తూ ఉంటాయి, అలాగని మమ్మా, బాబాలు వారిలోకి వచ్చి వ్రాయిస్తారని కాదు. తండ్రి అయితే నేరుగా ఇక్కడికే వస్తారు. కావుననే వినేందుకు ఇక్కడకు వస్తారు కదా. మమ్మా, బాబాలు ఎవరిలోకైనా వస్తున్నట్లయితే అక్కడే కూర్చుని చదువుకోవచ్చు కదా. కానీ అలా జరగదు. ఇక్కడికి రావాలి అని అందరికీ ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. దూరంగా ఉన్నవారికి ఇంకా ఎక్కువగా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది కావున పిల్లలు జన్మాష్టమినాడు కూడా ఎంతో సేవ చేయవచ్చు. శ్రీకృష్ణుని జన్మ ఎప్పుడు జరిగింది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మీ జోలె ఇప్పుడు నిండుతోంది కావున సంతోషము ఉండాలి. కానీ బాబా చూస్తుంటారు, కొందరిలో సంతోషము అసలు ఏమాత్రము లేదు. మేము అసలు శ్రీమతముపై నడవనే నడవము అని ప్రతిజ్ఞ చేసినట్లుగా ఉంటారు. కానీ సేవాధారులైన పిల్లలకైతే కేవలం సేవ మాత్రమే తోచినట్లుగా ఉంటుంది. బాబా సేవ చేయకపోతే, ఎవరికైనా దారి తెలియజేయకపోతే మేము అంధుల వంటివారమే అని భావిస్తారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. బ్యాడ్జిలో కూడా శ్రీకృష్ణుని చిత్రము ఉంది, దీనిపై కూడా మీరు అర్థం చేయించవచ్చు. వారిని నల్లగా ఎందుకు చూపించారు అని మీరు ఎవరినైనా అడిగితే వారు చెప్పలేకపోతారు. రాముని పత్ని అపహరించబడ్డారు అని శాస్త్రాలలో వ్రాసేశారు. కానీ అటువంటి విషయమేదీ అక్కడ జరగదు.

భారతవాసులైన మీరే స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు స్మశానవాసులుగా అయ్యారు, మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చుని దైవీ గుణాలను ధారణ చేసి స్వర్గవాసులుగా అవుతారు. సేవనైతే పిల్లలు చేయవలసిందే. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. ఇందులో చాలా వివేకము కావాలి. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మేము భగవంతునితో కలిసి ఉన్నాము, మేము భగవంతుని పిల్లలము కూడా మరియు మేము వారి నుండి చదువుకుంటున్నాము కూడా అన్న నషా ఉండాలి. బోర్డింగ్ స్కూల్లో ఉన్నప్పుడు బయటి సాంగత్యము అంటుకోదు. ఇక్కడ కూడా స్కూల్ ఉంది కదా. క్రిస్టియన్లలో కూడా మంచి మ్యానర్స్ ఉంటాయి. ఇప్పుడైతే అసలు మ్యానర్సే లేవు, తమోప్రధానముగా, పతితముగా ఉన్నారు. దేవతల ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. వారికి ఎంతటి మహిమ ఉంది. సత్యయుగములో అందరికీ దైవీ క్యారెక్టర్ ఉండేది, ఇప్పుడు ఆసురీ క్యారెక్టర్ ఉంది. ఈ విధంగా మీరు భాషణ చేసినట్లయితే అందరూ విని ఎంతో సంతోషిస్తారు. నోరు చిన్నది, మాటలు పెద్దవి అని శ్రీకృష్ణుని గురించే అంటారు. ఇప్పుడు మీరు ఇంత పెద్దగా అయ్యేందుకు ఎంత పెద్ద విషయాలను వింటున్నారు. మీరు రాఖీని ఎవరికైనా కట్టవచ్చు. తండ్రి ఇచ్చే సందేశాన్ని అయితే అందరికీ ఇవ్వాలి. ఈ యుద్ధము స్వర్గ ద్వారాలను తెరుస్తుంది. ఇప్పుడు పతితము నుండి పావనముగా అవ్వాలి, తండ్రిని స్మృతి చేయాలి, దేహధారులను స్మృతి చేయకూడదు. ఒక్క తండ్రియే సర్వులకు సద్గతిని ఇస్తారు. ఇది ఇనుపయుగ ప్రపంచము. పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా ధారణ జరుగుతుంది. స్కూల్లో కూడా స్కాలర్షిప్ తీసుకునేందుకు ఎంతో కష్టపడతారు. ఇక్కడ కూడా ఎంత పెద్ద స్కాలర్షిప్ ఉంది. సేవ ఎంతగానో ఉంది. మాతలు కూడా ఎంతో సేవ చేయవచ్చు. చిత్రాలు కూడా అన్నీ తీసుకోండి. శ్రీకృష్ణుడి నల్లని చిత్రాన్ని, నారాయణుడి నల్లని చిత్రాన్ని, రామచంద్రుడి నల్ల చిత్రాన్ని, అలాగే శివుడి నల్లని చిత్రాన్ని కూడా తీసుకోండి. ఇవి తీసుకుని దేవతలను నల్లగా ఎందుకు చూపించారో కూర్చుని అర్థం చేయించండి. శ్యామసుందరుడు అని అంటారు. శ్రీనాథ ద్వారానికి వెళ్ళినట్లయితే అక్కడ పూర్తిగా నల్లని చిత్రము ఉంటుంది. ఇటువంటి చిత్రాలను పోగు చేయాలి. మన చిత్రాలను కూడా చూపించాలి. శ్యామసుందరుడు అన్న పదము యొక్క అర్థాన్ని అర్థం చేయించి వారికి చెప్పండి - మీరు కూడా ఇప్పుడు రాఖీ కట్టుకుని, కామ చితి నుండి దిగి జ్ఞాన చితిపై కూర్చున్నట్లయితే తెల్లగా అయిపోతారు. ఇక్కడ కూడా మీరు సేవ చేయవచ్చు. వీరిని నల్లగా ఎందుకు తయారుచేసారు, అలాగే శివలింగాన్ని కూడా నల్లగా ఎందుకు తయారుచేసారు? అన్న విషయముపై భాషణ చాలా బాగా చేయవచ్చు! సుందరుడు మరియు శ్యాముడు అని ఎందుకు అంటారు అన్నది మేము వివరిస్తాము అని చెప్పండి. దీని వల్ల ఎవరూ అసంతుష్టులుగా అవ్వరు. సేవ అయితే చాలా సహజము. పిల్లలూ, మంచి గుణాలను ధారణ చేయండి, కులము పేరును ప్రఖ్యాతము చేయండి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందినవారమని మీకు తెలుసు. రాఖీ బంధనము యొక్క అర్థాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. వేశ్యలకు కూడా అర్థం చేయించి రాఖీ కట్టవచ్చు. చిత్రాలు కూడా మీతోపాటు ఉండాలి. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఈ ఆజ్ఞను పాటించినట్లయితే మీరు తెల్లగా అయిపోతారు. ఇందులో ఎన్నో యుక్తులు ఉన్నాయి. ఎవరూ అసంతుష్టులుగా అవ్వరు. తండ్రి తప్ప మనుష్యమాత్రులెవ్వరూ ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. రక్షా బంధనము రోజు కాకపోయినా ఎప్పుడైనా మీరు రాఖీ కట్టవచ్చు. దీని అర్థాన్ని తెలుసుకోవాలి. రాఖీని ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టవచ్చు, మీ వ్యాపారమే ఇది. తండ్రితో ప్రతిజ్ఞ చేయండి అని చెప్పండి. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పవిత్రముగా అయిపోతారు. మేము రాఖీ కట్టేందుకు వచ్చాము, ఈ విషయాన్ని అర్థం చేసుకునే హక్కు మీకు కూడా ఉంది అని మీరు మసీదులలోకి కూడా వెళ్ళి అర్థం చేయించవచ్చు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి మరియు పావనముగా అయి పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఇప్పుడు ఇది పతిత ప్రపంచము కదా. బంగారుయుగము తప్పకుండా ఉండేది, ఇప్పుడు ఇది ఇనుపయుగము. మీరు బంగారుయుగములోకి, ఖుదా వద్దకు వెళ్ళేది లేదా? ఈ విధంగా అర్థం చేయించినట్లయితే వారు వెంటనే వచ్చి చరణాలపై పడతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన రత్నాల సాగరుడి నుండి అవినాశీ జ్ఞాన రత్నాలేవైతే లభిస్తూ ఉన్నాయో వాటి పట్ల విలువ ఉండాలి. విచార సాగర మంథనము చేసి స్వయములో జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి. నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి.

2. స్మృతియాత్రలో ఉంటూ వాణిని పదునైనదిగా, శక్తివంతమగా చేసుకోవాలి. స్మృతి ద్వారానే ఆత్మ కాంచనముగా అవుతుంది, అందుకే స్మృతి చేసే తెలివిని నేర్చుకోవాలి.

వరదానము:-
మేరేపన్ (నాది అనే భావన) యొక్క సూక్ష్మ స్వరూపాన్ని కూడా త్యాగము చేసే సదా నిర్భయ, నిశ్చింత చక్రవర్తి భవ

నేటి ప్రపంచములో ధనము కూడా ఉంది మరియు భయము కూడా ఉంది. ఎంత ధనము ఉంటుందో అంతగానే భయముతోనే తింటారు, భయముతోనే నిద్రపోతారు. ఎక్కడైతే నాది అనే భావన ఉంటుందో, అక్కడ భయము తప్పకుండా ఉంటుంది. ఒకవేళ బంగారు జింక ఉన్నా కూడా అది నాది అన్నట్లయితే భయము ఉంటుంది, కానీ ఒకవేళ నాకు ఒక్క శివబాబానే ఉన్నారు అని అనుకున్నట్లయితే నిర్భయులుగా అయిపోతారు. కనుక సూక్ష్మరూపములో కూడా నాది-నాది అన్నది చెక్ చేసుకుని దానిని త్యాగము చేసినట్లయితే నిర్భయులుగా, నిశ్చింత చక్రవర్తులుగా ఉండే వరదానము లభిస్తుంది.

స్లోగన్:-
ఇతరుల ఆలోచనలకు గౌరవము ఇవ్వండి, అప్పుడు మీకు గౌరవము స్వతహాగా ప్రాప్తిస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

ఒకవైపు అనంతమైన వైరాగ్యము ఉండాలి, మరొకవైపు బాబా సమానముగా బాబా ప్రేమలో లవలీనులై ఉండండి, ఒక్క క్షణము కూడా లేక ఒక్క సంకల్పములో కూడా ఈ లవలీన అవస్థ నుండి కిందకు రాకండి. ఇటువంటి లవలీన పిల్లల సంగఠనయే బాబాను ప్రత్యక్షము చేస్తుంది. నిమిత్త ఆత్మలైన మీరు పవిత్ర ప్రేమ ద్వారా మరియు మీ ప్రాప్తుల ద్వారా అందరికీ శ్రేష్ఠ పాలనను ఇవ్వండి, యోగ్యులుగా తయారుచెయ్యండి అనగా యోగీలుగా తయారుచెయ్యండి.