‘‘మీ స్వమానము యొక్క గౌరవములో ఉండండి మరియు సమయము
యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఎవర్రెడీగా అవ్వండి’’
ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు పాత్రులైన,
స్వమానమనే సీట్ పై సెట్ అయ్యి ఉన్న తమ పిల్లలను చూస్తున్నారు.
సీట్ పైనైతే పిల్లలందరూ సెట్ అయ్యి ఉన్నారు, కానీ కొందరు
పిల్లలు ఏకాగ్ర స్థితిలో సెట్ అయ్యి ఉన్నారు మరియు కొందరు
పిల్లలు సంకల్పాలలో కొంచెం-కొంచెం అప్సెట్ అయ్యి ఉన్నారు (మానసిక
అలజడిలో ఉన్నారు). బాప్ దాదా వర్తమాన సమయమనుసారముగా పిల్లలు
ప్రతి ఒక్కరినీ ఏకాగ్రతా రూపములో, స్వమానధారీ స్వరూపములో సదా
చూడాలనుకుంటున్నారు. పిల్లలందరూ కూడా ఏకాగ్రతా స్థితిలో
స్థితులవ్వాలనే కోరుకుంటున్నారు. తమ భిన్న-భిన్న స్వమానాల
గురించి తెలుసు కూడా, ఆలోచిస్తారు కూడా, కానీ ఏకాగ్రతను
అలజడిలోకి తీసుకువస్తారు. సదా ఏకరస స్థితి అనేది తక్కువగా
ఉంటుంది. అనుభవమవుతుంది మరియు ఈ స్థితిని కోరుకుంటారు కూడా,
కానీ ఈ స్థితి అప్పుడప్పుడు మాత్రమే అన్నట్లు ఎందుకు ఉంటుంది,
కారణమేమిటి! సదా అటెన్షన్ పెట్టడములో లోపము. ఒకవేళ స్వమానాల
లిస్ట్ తయారుచేసినట్లయితే అది ఎంత పెద్దదిగా ఉంటుంది.
అన్నింటికంటే మొదటి స్వమానము ఏమిటంటే - ఏ తండ్రినైతే స్మృతి
చేస్తూ ఉండేవారో, వారికి డైరెక్ట్ పిల్లలుగా అయ్యారు, నంబర్ వన్
సంతానముగా ఉన్నారు. బాప్ దాదా కోట్లలో కొద్దిమంది అయిన
పిల్లలైన మిమ్మల్ని ఎక్కడెక్కడి నుండో ఎంచుకుని తమవారిగా
చేసుకున్నారు. ఐదు ఖండాల నుండీ డైరెక్టుగా బాబా పిల్లలను
తమవారిగా చేసుకున్నారు. ఇది ఎంత పెద్ద స్వమానము. సృష్టి రచయిత
యొక్క మొదటి రచన మీరు. ఈ స్వమానము గురించి తెలుసు కదా! బాప్
దాదా తనతోపాటుగా పిల్లలైన మిమ్మల్ని కూడా మొత్తము విశ్వములోని
ఆత్మలకు పూర్వజలుగా తయారుచేసారు. మీరు విశ్వానికి పూర్వజులు,
పూజ్యులు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ విశ్వానికి
ఆధారమూర్తులుగా, ఉదాహరణమూర్తులుగా తయారుచేసారు. ఆ నషా ఉందా?
అప్పుడప్పుడు ఆ నషా కొంచెం తక్కువైపోతూ ఉంటుంది. ఆలోచించండి,
అన్నిటికంటే అమూల్యమైన సింహాసనాన్ని, మొత్తము కల్పములో మరెవరికీ
ఇటువంటి అమూల్యమైన సింహాసనము లభించదు, అటువంటి పరమాత్మ
సింహాసనాన్ని, ప్రకాశ కిరీటాన్ని, స్మృతి తిలకాన్ని ఇచ్చారు.
నేను ఎవరిని - అన్న స్మృతి వస్తూ ఉంది కదా! నా స్వమానము ఏమిటి!
నషా ఎక్కుతూ ఉంది కదా! మొత్తము కల్పములో సత్యయుగ సింహాసనము ఎంత
అమూల్యమైనది, అయినా కానీ పరమాత్మ హృదయ సింహాసనమనేది పిల్లలైన
మీకే ప్రాప్తిస్తుంది.
బాప్ దాదా సదా చివరి నంబర్ లోని బిడ్డను కూడా ఫరిశ్తా నుండి
దేవతగా అయ్యే స్వరూపములోనే చూస్తారు. ఇప్పుడిప్పుడే
బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాగా, ఫరిశ్తా నుండి
దేవతగా అవ్వాల్సిందే. మీ స్వమానము తెలుసా? ఎందుకంటే బాప్ దాదాకు
తెలుసు - స్వమానాన్ని మర్చిపోయిన కారణముగానే దేహభానము,
దేహ-అభిమానము వస్తుంది, అలజడి చెందుతారు, వ్యాకులపడతారు కూడా.
దేహ-అభిమానము లేక దేహభానము వచ్చినప్పుడు ఎంత అలజడి చెందుతారో,
వ్యాకులపడతారో బాప్ దాదా చూస్తారు. అందరూ అనుభవీలే కదా!
స్వమానపు నషాలో ఉండటము మరియు ఈ నషా నుండి దూరమై అలజడిలో,
వ్యాకులతలో ఉండటము, ఈ రెండింటి గురించి మీకు తెలుసు. బాప్ దాదా
చూస్తున్నారు, పిల్లలందరిలో మెజారిటీ నాలెడ్జ్ ఫుల్ గా అయితే
చాలా బాగా అయ్యారు, కానీ పవర్ లో ఫుల్ గా, పవర్ ఫుల్ గా లేరు.
పర్సంటేజ్ లో ఉన్నారు.
బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ తమ సర్వ ఖజానాలకు బాలకుల
నుండి యజమానులుగా తయారుచేసారు. అందరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు,
ఎక్కువ-తక్కువ ఇవ్వలేదు ఎందుకంటే లెక్కలేనంత ఖజానా ఉంది,
అనంతమైన ఖజానా ఉంది, అందుకే పిల్లలు ప్రతి ఒక్కరినీ అనంతమైన
బాలకుల నుండి యజమానులుగా తయారుచేసారు. తండ్రి అనంతమైనవారు,
ఖజానా అనంతమైనది, కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి
- మీ వద్ద కూడా అనంతమైన ఖజానా ఉందా? సదాకాలము ఉంటుందా లేక
అప్పుడప్పుడు ఏదైనా దొంగలించబడుతుందా? మాయమైపోతుందా? బాబా
ఎందుకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు? అలజడి చెందవద్దు, వ్యాకుల
పడవద్దు, స్వమానమనే సీట్ పై సెట్ అయ్యి ఉండండి, అప్సెట్
అవ్వద్దు (మానసిక అలజడికి లోనవ్వద్దు). 63 జన్మలైతే మానసిక
అలజడిని అనుభవము చేసారు కదా! ఇప్పుడు ఇంకా అనుభవము చేద్దామని
అనుకుంటున్నారా? అలసిపోలేదా? ఇప్పుడు స్వమానములో ఉండండి అనగా
మీ ఉన్నతోన్నతమైన గౌరవములో ఉండండి. ఎందుకని? ఎంత సమయము
గడిచిపోయింది. 70 వ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా! కనక
స్వయాన్ని గురించిన అవగాహన అనగా స్వమానము గురించిన అవగాహన అనగా
స్వమానములో స్థితులవ్వడము. సమయమనుసారముగా ఇప్పుడు ‘సదా’ అన్న
పదాన్ని ప్రాక్టికల్ జీవితములోకి తీసుకురండి, పదాన్ని అండర్
లైన్ చెయ్యడం కాదు, దానిని ప్రాక్టికల్ జీవితములో అండర్ లైన్
చెయ్యండి. అలా ఉండాలి, ఉంటాము, చెయ్యడమైతే చేస్తున్నాము,
చేసేస్తాము... ఇవి అనంతమైన బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారి
మాటలు కావు. ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయము నుండి -
‘పొందాల్సినదేదో పొందేసాము’ అన్న అనంతమైన నాదము వెలువడాలి.
పొందుతూ ఉన్నాము... అన్న మాటను అనంతమైన ఖజానా కల అనంతమైన తండ్రి
యొక్క పిల్లలు అనలేరు. పొందేసాము అని అనాలి, బాప్ దాదాను
పొందారు, నా బాబా అని అన్నారు, స్వీకరించారు, వారిని
తెలుసుకున్నారు కూడా మరియు స్వీకరించారు కూడా, కనుక
‘పొందేసాము’ అన్న ఈ అనంతమైన నాదము వెలువడుతూ ఉండాలి, ఎందుకంటే
బాప్ దాదాకు తెలుసు, పిల్లలు స్వమానములో అప్పుడప్పుడు ఉంటున్న
కారణముగా సమయము యొక్క మహత్వాన్ని కూడా స్మృతిలో తక్కువగా
ఉంచుకుంటారు. ఒకటేమో స్వయము యొక్క స్వమానము, మరొకటి సమయము
యొక్క మహత్వము. మీరు సాధారణమైనవారు కారు, మీరు పూర్వజులు.
మీలోని ఒక్కొక్కరూ విశ్వములోని ఆత్మలకు ఆధారము. కావున
ఆలోచించండి, ఒకవేళ మీరే అలజడిలోకి వచ్చినట్లయితే విశ్వములోని
ఆత్మల పరిస్థితి ఎలా ఉంటుంది! మహారథులుగా పిలవబడే వారిపైనే
విశ్వము ఆధారపడి ఉంది అని అనుకోకండి. కొత్త-కొత్తవారు అయినా సరే,
ఎందుకంటే ఈ రోజు కొత్తవారు కూడా చాలామంది వచ్చి ఉంటారు (మొదటిసారిగా
వచ్చినవారు చేతులెత్తారు) కొత్తవారు, వీరు హృదయపూర్వకముగా ‘‘నా
బాబా’’ అని స్వీకరించారు. స్వీకరించారా? కొత్త-కొత్తగా ఎవరైతే
వచ్చారో, వారు స్వీకరించారా? తెలుసుకోవటము కాదు, ‘‘నా బాబా’’
అని ఎవరైతే స్వీకరించారో వారు చేతులెత్తండి. చేతిని బాగా పైకి
ఎత్తండి. కొత్త-కొత్తవారు చేతులెత్తుతున్నారు. పాతవారైతే
పక్కాగానే ఉన్నారు కదా, ఎవరైతే హృదయపూర్వకముగా ‘‘నా బాబా’’ అని
స్వీకరించారో మరియు బాబా కూడా ఎవరినైతే ‘‘నా పిల్లలు’’ అని
స్వీకరించారో, వారందరూ బాధ్యులే. ఎందుకని? ఎప్పటినుండైతే మీరు
- నేను బ్రహ్మాకుమారుడను, నేను బ్రహ్మాకుమారిని అని అంటూ
వచ్చారో, మీరు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలా లేక
శివకుమారులు, శివకుమారీలా, లేక ఇద్దరూనా? అలా అయితే మరి
బంధింపబడిపోయారు. బాధ్యతా కిరీటము తలపైకి వచ్చేసింది.
వచ్చేసింది కదా? పాండవులూ, చెప్పండి, బాధ్యతా కిరీటము
వచ్చేసిందా? బరువుగా అయితే అనిపించడం లేదు కదా? తేలికగా ఉంది
కదా! అది ఉన్నదే లైట్ కిరీటము, లైట్ ఎంత తేలికగా ఉంటుంది. అలాగే
సమయము యొక్క మహత్వాన్ని కూడా అటెన్షన్ లో పెట్టుకోండి. సమయమనేది
చెప్పి రాదు. కొంతమంది పిల్లలు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు,
ఆలోచిస్తూ ఉంటారు - సమయము గురించి కొంచెం సుమారుగా అయినా
తెలియాలి కదా, 20 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా,
కాస్త తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ బాప్ దాదా
అంటారు, సమయము గురించి, అంతిమ వినాశనము గురించి వదిలేయండి,
ముందు మీకు మీ శరీర వినాశనము గురించి తెలుసా? నేను ఫలానా
తారీఖున శరీరము వదిలేస్తాను అని తెలిసినవారు ఎవరైనా ఉన్నారా,
ఎవరికైనా తెలుసా? అంతేకాక ఈ రోజుల్లోనైతే బ్రాహ్మణుల పేరు మీద
వారు దేహము వదిలేస్తున్న భోగ్ ను చాలామంది పెట్టించుకుంటున్నారు.
శరీరముపై ఎటువంటి నమ్మకము లేదు, అందుకే సమయము యొక్క మహత్వాన్ని
తెలుసుకోండి. ఈ చిన్నని యుగము ఆయుష్షులో చిన్నది కానీ ఇది
అత్యంత పెద్ద ప్రాప్తులను ఇచ్చే యుగము, ఎందుకంటే అత్యంత పెద్ద
తండ్రి ఈ చిన్నని యుగములోనే వస్తారు, ఇతర పెద్ద యుగాలలో రారు.
ఈ చిన్నని యుగములోనే మొత్తము కల్పము యొక్క ప్రాప్తికి బీజాన్ని
నాటే సమయము ఉంటుంది. కావాలంటే విశ్వ రాజ్యాన్ని ప్రాప్తి
చేసుకోండి, కావాలంటే పూజ్యులుగా అవ్వండి, మొత్తము కల్పములో
బీజాన్ని వేసే సమయము ఇదే మరియు డబుల్ ఫలాన్ని ప్రాప్తి చేసుకునే
సమయము ఇదే. భక్తి ఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది మరియు
ప్రత్యక్షఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడిప్పుడే చేయగానే
ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము లభిస్తుంది మరియు భవిష్యత్తు కూడా
తయారవుతుంది. మొత్తము కల్పములో చూడండి, ఇటువంటి యుగము మరేదైనా
ఉందా? ఎందుకంటే ఈ సమయములోనే తండ్రి తన పిల్లలు ప్రతి ఒక్కరికీ
అరచేతిలో అత్యంత పెద్ద కానుకను ఇచ్చారు, మీ కానుక గుర్తుందా?
స్వర్గము యొక్క రాజ్య భాగ్యము. కొత్త ప్రపంచమైన స్వర్గము అనే
కానుక పిల్లలు ప్రతి ఒక్కరికీ అరచేతిలో ఇచ్చారు. ఇంత పెద్ద
కానుకను మరెవ్వరూ ఇవ్వరు మరియు ఎప్పుడూ ఇవ్వలేరు. అది ఇప్పుడే
లభిస్తుంది. ఇప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు,
మరే ఇతర యుగములోనూ మాస్టర్ సర్వశక్తివంతులు అన్న పదవి లభించదు.
కనుక స్వయము యొక్క స్వమానములో కూడా ఏకాగ్రముగా ఉండండి మరియు
సమయము యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకోండి. స్వయము మరియు సమయము
- స్వయము యొక్క స్వమానము, సమయము యొక్క మహత్వము. నిర్లక్ష్యులుగా
అవ్వకండి. 70 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు కూడా ఒకవేళ
నిర్లక్ష్యులుగా అయినట్లయితే మీ ప్రాప్తిని చాలా
తగ్గించేసుకుంటారు, ఎందుకంటే ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో,
అంతగానే ఒక రకమైన నిర్లక్ష్యము వస్తుంది. చాలా బాగున్నాము, చాలా
బాగా నడుస్తున్నాము, చేరుకుంటాములే, వెనకేమీ ఉండిపోము, కావాలంటే
చూడండి, అయిపోతుందిలే... ఇలా నిర్లక్ష్యము వస్తుంది, రెండవది
రాయల్ రూపములోని సోమరితనము వస్తుంది. నిర్లక్ష్యము మరియు
సోమరితనము. ‘ఎప్పుడో’ అన్న పదాన్ని ఉపయోగించటము అంటే సోమరితనము,
‘ఇప్పుడు’ అన్న పదాన్ని ఉపయోగించటము అంటే త్వరిత దానము
మహాపుణ్యము అవుతుంది.
ఇప్పుడు ఈ రోజు మొదటి టర్న్ కదా! కనుక బాప్ దాదా అటెన్షన్
ఇప్పిస్తున్నారు. ఈ సీజన్ లో స్వమానము నుండి దిగిపోకూడదు, అలాగే
సమయము యొక్క మహత్వాన్ని మర్చిపోకూడదు. అలెర్టుగా, తెలివైనవారిగా,
జాగ్రత్తగా ఉండండి. ప్రియమైనవారు కదా! ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో,
వారిలోని ఏ కొంచెము బలహీనతనైనా, లోపాన్ని అయినా చూడలేరు. బాప్
దాదాకు చివరి బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఆ బిడ్డపై కూడా అత్యంత
ప్రేమ ఉంటుందని వినిపించాము కదా. బిడ్డ కదా. ఇప్పుడు ఈ జరుగుతూ
ఉన్న సీజన్ లో, సీజన్ ఇండియావారిదైనా కానీ డబుల్ విదేశీయులు
కూడా తక్కువేమీ లేరు, బాప్ దాదా చూసారు, డబల్ విదేశీయులు లేని
టర్న్ అంటూ ఏదీ ఉండదు. ఇది వారి అద్భుతము. డబుల్ విదేశీయులు
ఇప్పుడు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారో చూడండి! స్పెషల్ సీజన్
అయిపోయింది, అయినా కూడా చూడండి ఎంతమంది ఉన్నారో! అభినందనలు.
మంచిది రండి, చాలా చాలా అభినందనలు.
మరి ఇప్పుడు ఏం చెయ్యాలో విన్నారా? ఈ సీజన్ లో ఏమేమి
చెయ్యాలి అన్నదాని గురించి హోంవర్క్ ను ఇచ్చేసాము. స్వయాన్ని
రియలైజ్ అవ్వండి, స్వయాన్నే రియలైజ్ అవ్వండి, ఇతరులను కాదు,
మరియు నిజమైన బంగారముగా అవ్వండి ఎందుకంటే బాప్ దాదా భావిస్తారు
- ఎవరైతే ‘‘నా బాబా’’ అని అన్నారో, వారు తోడుగా వెళ్తారు.
ఊరేగింపులో కలిసిపోయి వెళ్ళటము కాదు. బాప్ దాదాతోపాటుగా
శ్రీమతమనే చేతిని పట్టుకుని తోడుగా వెళ్ళాలి మరియు తరువాత
బ్రహ్మాబాబాతోపాటు మొదట రాజ్యములోకి రావాలి. కొత్త ఇంటిలో
ఉన్నప్పుడే మజా వస్తుంది కదా. ఒక్క నెల గడిచిపోయినా సరే దానిని
ఒక నెల పాతది అని అంటారు. కొత్త ఇల్లు, కొత్త ప్రపంచము, కొత్త
పద్ధతులు, కొత్త ఆచార-వ్యవహారాలు మరియు బ్రహ్మాబాబాతోపాటు
రాజ్యములోకి రావాలి. బ్రహ్మాబాబాపై మాకు చాలా ప్రేమ ఉంది అని
అందరూ అంటారు కదా. మరి ప్రేమ ఉంది అన్నదానికి గుర్తు ఏమిటి?
తోడుగా ఉండాలి, తోడుగా వెళ్ళాలి, తోడుగా రావాలి. ఇదే ప్రేమ ఉంది
అన్నదానికి ఋజువు. ఇష్టమేనా? తోడుగా ఉండడము, తోడుగా వెళ్ళడము,
తోడుగా రావడము, ఇష్టమేనా? ఇష్టమేనా? మరి ఇష్టమైనదానిని ఎవరైనా
వదిలేస్తారా! అందుకే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ప్రీతి
యొక్క రీతి ఏమిటంటే - పిల్లలు తోడుగా వెళ్ళాలి, అంతేకానీ
వెనుక-వెనుక కాదు. ఒకవేళ ఏదైనా ఖాతా మిగిలిపోయి ఉంటే
ధర్మరాజపురిలో శిక్షలు తినటం కోసం ఆగవలసి వస్తుంది. చేతిలో
చెయ్యి ఉండదు, వెనుక-వెనుక వస్తారు. మజా ఎందులో ఉంది? తోడుగా
ఉండటములోనే ఉంది కదా! కనుక తోడుగానే వెళ్ళాలి అన్నది పక్కా
ప్రతిజ్ఞయే కదా? లేక వెనుక-వెనుక రావాలా? చూడండి, చేతులనైతే
చాలా బాగా ఎత్తుతారు. ఎత్తిన ఆ చేతులను చూసి బాప్ దాదా అయితే
సంతోషిస్తారు కానీ శ్రీమతమనే చేతిని ఎత్తండి. శివబాబాకు అయితే
చెయ్యి ఉండదు, బ్రహ్మాబాబా ఆత్మకు కూడా చేయ్యి ఉండదు, అలాగే
మీకు కూడా ఈ స్థూల చెయ్యి ఉండదు, శ్రీమతమనే చేతిని పట్టుకుని
తోడుగా వెళ్ళాలి. తోడుగా వెళ్తారు కదా! తల అయితే ఊపండి. అచ్ఛా,
చేతులు ఊపుతున్నారు. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - పిల్లలు
ఒక్కరు కూడా వెనుక ఉండిపోకూడదు. అందరూ తోడుతోడుగానే వెళ్ళాలి.
ఎవర్రెడీగా ఉండవలసి ఉంటుంది. అచ్ఛా!
ఇప్పుడు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల రిజిస్టరును చూస్తూ
ఉంటారు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత దానిని నిలబెట్టుకున్నారు అంటే
లాభము పొందినట్లు. కేవలము ప్రతిజ్ఞ చెయ్యటమే కాదు, దాని నుండి
లాభము పొందాలి. అచ్ఛా. ఇప్పుడు అందరూ దృఢ సంకల్పము చేస్తారా!
దృఢ సంకల్పము యొక్క స్థితిలో స్థితులై కూర్చోండి -
చెయ్యాల్సిందే, వెళ్ళాల్సిందే. తోడుగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ దృఢ
సంకల్పాన్ని మీకు మీరు చేయండి. ఈ స్థితిలో కూర్చుండిపోండి.
చేస్తాములే... చేస్తాములే... అని అనవద్దు, చెయ్యాల్సిందే. అచ్ఛా!
అన్ని వైపులా ఉన్న డబుల్ సేవాధారీ పిల్లలకు, సదా ఏకాగ్రముగా
స్వమానమనే సీటి పై సెట్ అయ్యి ఉండే నలువైపులా ఉన్న బాప్ దాదా
యొక్క మస్తక మణులకు, సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని తీవ్ర
పురుషార్థము యొక్క ఋజువును ఇచ్చే నలువైపులా ఉన్న సుపుత్రులైన
పిల్లలకు, ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఉండే మరియు
ఎగిరేలా చేసే నలువైపులా ఉన్న డబుల్ లైట్ ఫరిశ్తా పిల్లలకు బాప్
దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.