17-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - స్మృతి ద్వారా సతోప్రధానముగా
అవ్వడముతో పాటుగా చదువు ద్వారా సంపాదనను జమ చేసుకోవాలి, చదువుకునే సమయములో బుద్ధి
ఇటూ-అటూ పరుగెత్తకూడదు’’
ప్రశ్న:-
డబల్
అహింసకులు, గుప్త యోధులైన మీకు ఏ విజయము నిశ్చితము మరియు ఎందుకు?
జవాబు:-
పిల్లలైన
మీరెవరైతే మాయపై విజయము పొందే పురుషార్థము చేస్తున్నారో, మీ లక్ష్యమేమిటంటే - మేము
రావణుడి నుండి మా రాజ్యాన్ని తీసుకునే తీరుతాము అని... ఇది కూడా డ్రామాలో యుక్తి
రచింపబడి ఉంది. మీ విజయము నిశ్చితము ఎందుకంటే మీకు తోడుగా సాక్షాత్తు పరమపిత
పరమాత్మ ఉన్నారు. మీరు యోగబలముతో విజయము పొందుతారు. మన్మనాభవ మహామంత్రము ద్వారా మీకు
రాజ్యము లభిస్తుంది. మీరు అర్ధకల్పము రాజ్యము చేస్తారు.
పాట:-
నీ ముఖము
చూసుకో ప్రాణీ...
ఓంశాంతి
మధురాతి-మధురమైన పిల్లలు ఎదురుగా కూర్చున్నప్పుడు, మా టీచరు సాకారుడు కాదు, మమ్మల్ని
చదివించేవారు జ్ఞానసాగరుడైన బాబా అని తప్పకుండా భావిస్తారు. వారు మన తండ్రి కూడా
అన్న పక్కా నిశ్చయముంది. చదువుకుంటున్నప్పుడు చదువుపై అటెన్షన్ ఉంటుంది. విద్యార్థి
తన స్కూల్లో కూర్చున్నప్పుడు టీచరు గుర్తుకొస్తారు, అంతేకానీ తండ్రి గుర్తుకు రారు
ఎందుకంటే స్కూల్లో కూర్చొని ఉన్నారు. అలాగే మీకు కూడా తెలుసు, బాబా టీచరు కూడా అని.
పేరును పట్టుకోకూడదు కదా. నేను ఆత్మను, తండ్రి ద్వారా వింటున్నాను అన్నది ధ్యానములో
పెట్టుకోవాలి. ఇలా ఇంకెప్పుడూ జరగనే జరగదు. సత్యయుగములోనూ జరగదు, కలియుగములోనూ జరగదు.
కేవలం ఒక్కసారి మాత్రమే సంగమయుగములో జరుగుతుంది. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు.
మన తండ్రి ఈ సమయములో టీచరుగా ఉన్నారు ఎందుకంటే వారు చదివిస్తున్నారు, రెండు పనులు
చేయాల్సి ఉంటుంది. ఆత్మ శివబాబా ద్వారా చదువుకుంటుంది. ఇది కూడా యోగము మరియు చదువు.
చదువుకునేది ఆత్మ, చదివించేది పరమాత్మ. అందులోనూ మీరు సమ్ముఖముగా ఉన్నప్పుడు ఇంకా
ఎక్కువ లాభముంటుంది. చాలామంది పిల్లలు చాలా బాగా స్మృతిలో ఉంటారు. కర్మాతీత అవస్థకు
చేరుకున్నప్పుడు పవిత్రతా శక్తి లభించినట్లు అవుతుంది. శివబాబా మనల్ని
చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇది మీకు యోగము కూడా, అలాగే సంపాదన కూడా. ఆత్మయే
సతోప్రధానముగా అవ్వాలి. మీరు సతోప్రధానముగా కూడా అవుతున్నారు, ధనము కూడా
పొందుతున్నారు. స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి. బుద్ధి పరుగెత్తకూడదు. ఇక్కడ
కూర్చున్నప్పుడు, మమ్మల్ని చదివించేందుకు శివబాబా టీచరు రూపములో రాబోతున్నారు అని
బుద్ధిలో ఉండాలి. వారే నాలెడ్జ్ ఫుల్, మనల్ని చదివిస్తున్నారు. తండ్రిని స్మృతి
చేయాలి. స్వదర్శన చక్రధారులము కూడా మనమే, మనము లైట్ హౌస్ లము కూడా. ఒక కంటిలో
శాంతిధామము, మరొక కంటిలో జీవన్ముక్తిధామము. ఇది ఈ కళ్ళకు సంబంధించిన విషయము కాదు.
ఆత్మ యొక్క మూడవ నేత్రము అని అంటారు. ఇప్పుడు ఆత్మలు వింటున్నారు, శరీరము
వదిలినప్పుడు ఆత్మలో ఈ సంస్కారాలుంటాయి. ఇప్పుడు మీరు తండ్రితో యోగము జోడిస్తున్నారు.
సత్యయుగము నుండి మొదలుకొని మీరు వియోగులుగా ఉండేవారు అనగా తండ్రితో యోగము ఉండేది
కాదు. ఇప్పుడు మీరు తండ్రి సమానముగా యోగీలుగా అవుతారు. యోగము నేర్పించేవారు ఈశ్వరుడు,
అందుకే వారిని యోగేశ్వరుడు అని అంటారు. మీరు కూడా యోగేశ్వరుని పిల్లలు. వారు యోగము
చేయాల్సిన అవసరముండదు. వారు యోగాన్ని నేర్పించే పరమపిత పరమాత్మ. మీలోని ప్రతి ఒక్కరు
యోగేశ్వర్, యోగేశ్వరిగా అవుతారు, ఆ తర్వాత రాజ-రాజేశ్వరిగా అవుతారు. వారు యోగాన్ని
నేర్పించే ఈశ్వరుడు. వారు స్వయం నేర్చుకోరు, వారు నేర్పిస్తారు. శ్రీకృష్ణుడి ఆత్మే
అంతిమ జన్మలో యోగము నేర్చుకుని మళ్ళీ శ్రీకృష్ణునిగా అవుతుంది, అందుకే
శ్రీకృష్ణుడిని కూడా యోగేశ్వరుడు అని అంటారు ఎందుకంటే వారి ఆత్మ ఇప్పుడు నేర్చుకుంటూ
ఉంది. యోగేశ్వరుడి నుండి యోగాన్ని నేర్చుకుని శ్రీకృష్ణుని పదవిని పొందుతుంది.
తండ్రి వీరికి బ్రహ్మా అన్న పేరును పెట్టారు. మొదట లౌకిక పేరు ఉండేది, ఆ తర్వాత
మరజీవాగా అయ్యారు. ఆత్మయే తండ్రికి చెందినదిగా అవ్వాలి. తండ్రికి చెందినవారిగా
అయ్యారంటే మరణించినట్లే కదా. మీరు కూడా తండ్రి ద్వారా యోగము నేర్చుకుంటారు. ఈ
సంస్కారాలతోనే మీరు శాంతిధామానికి వెళ్తారు. ఆ తర్వాత ప్రారబ్ధము యొక్క కొత్త పాత్ర
ఇమర్జ్ అవుతుంది. అక్కడ ఈ విషయాలు గుర్తుండవు. ఈ విషయాలను ఇప్పుడు తండ్రి అర్థం
చేయిస్తున్నారు. ఇప్పుడు పాత్ర పూర్తవుతుంది, మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుంది. ‘నేను
వెళ్ళాలి’ అని తండ్రికి సంకల్పము కలుగుతుంది కావున తండ్రి చెప్తున్నారు, అప్పుడు
నేను వస్తాను మరియు నా వాణి వెలువడడం మొదలవుతుంది. అక్కడైతే శాంతిలో ఉంటారు. ఆ
తర్వాత డ్రామానుసారముగా వారి పాత్ర మొదలవుతుంది. రావాలి అనే సంకల్పము
ఉత్పన్నమవుతుంది. అప్పుడు ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. కల్పక్రితము వలె
నంబరువారు పురుషార్థానుసారముగా ఆత్మలైన మీరు కూడా వింటారు. రోజురోజుకూ వృద్ధిని కూడా
పొందుతూ ఉంటారు. ఒకానొక రోజు మీకు పెద్ద రాయల్ హాలు కూడా లభిస్తుంది, అందులో
గొప్ప-గొప్ప వారు కూడా వస్తారు. అందరూ కలిసి కూర్చుని వింటారు. రోజురోజుకూ
షావుకారులు కూడా పేదవారిగా అవుతూ ఉంటారు, కడుపు వీపుకు అంటుకుంటుంది. అటువంటి ఆపదలు
వచ్చేది ఉంది, కుండపోతగా వర్షము కురిస్తే పొలాలు మొదలైనవన్నీ నీటిలో మునిగిపోతాయి.
ప్రకృతి వైపరీత్యాలు అయితే రావాల్సిందే, వినాశనము జరగాల్సిందే, వాటిని ప్రకృతి
వైపరీత్యాలు అని అంటారు. వినాశనము తప్పకుండా జరగనున్నది అని బుద్ధి చెప్తుంది.
విదేశాల వైపు కోసం బాంబులు కూడా సిద్ధముగా ఉన్నాయి, ఇక్కడి కోసం ప్రకృతి వైపరీత్యాలు
మొదలైనవి ఉన్నాయి. ఇందులో చాలా ధైర్యము కావాలి. అంగదుడి ఉదాహరణ కూడా ఉంది కదా,
అతడిని ఎవ్వరూ కదిలించలేకపోయారు. నేను ఆత్మను అన్న అవస్థ పక్కా చేసుకోవాలి, శరీర
భానము తొలగిపోతూ ఉండాలి. సత్యయుగములోనైతే సమయము పూర్తయినప్పుడు, ఇప్పుడు నేను ఈ
శరీరము వదిలి వెళ్ళి చిన్న బిడ్డగా అవ్వాలి అని ఆటోమేటిక్ గా సాక్షాత్కారమవుతుంది.
ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొకదానిలో ప్రవేశిస్తారు, అక్కడ శిక్షలు మొదలైనవైతే ఏమీ
ఉండవు. రోజురోజుకు మీరు సమీపముగా వస్తూ ఉంటారు. తండ్రి అంటారు, నాలో ఏదైతే పాత్ర
నిండి ఉందో, అది బయటకు వస్తూ ఉంటుంది, పిల్లలకు తెలియజేస్తూ ఉంటాను. మళ్ళీ తండ్రి
పాత్ర పూర్తయినప్పుడు మీది కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత మీ సత్యయుగ పాత్ర
మొదలవుతుంది. ఇప్పుడు మీరు మీ రాజ్యము తీసుకోవాలి, ఈ డ్రామా చాలా యుక్తిగా
తయారుచేయబడి ఉంది. మీరు మాయపై విజయము పొందుతారు, ఇందులోనే సమయము పడుతుంది. వారు
ఒకవైపేమో, మేము స్వర్గములో కూర్చున్నాము, ఇది సుఖధామముగా అయిపోయింది అని భావిస్తారు,
మరోవైపు పాటలో భారత్ యొక్క పరిస్థితి గురించి వినిపిస్తారు. ఇది ఇంకా తమోప్రధానముగా
అయిపోయిందని మీకు తెలుసు. డ్రామానుసారముగా తమోప్రధానముగా కూడా తీవ్రముగా అవుతూ
ఉంటారు. మీరు ఇప్పుడు సతోప్రధానముగా అవుతున్నారు. ఇప్పుడు మీరు సమీపముగా వస్తూ
ఉంటారు, చివరికి విజయమైతే మీకే లభించేది ఉంది. హాహాకారాల తర్వాత మళ్ళీ జయజయకారాలు
జరుగుతాయి. నేతి నదులు ప్రవహిస్తాయి. అక్కడ నెయ్యి మొదలైనవి కొనవలసిన అవసరముండదు.
అందరి వద్ద తమ-తమ ఫస్ట్ క్లాస్ ఆవులుంటాయి. మీరు ఎంత ఉన్నతముగా అవుతారు. ప్రపంచ
చరిత్ర-భౌగోళికాలు మళ్ళీ రిపీట్ అవుతాయని మీకు తెలుసు. తండ్రి వచ్చి ప్రపంచ చరిత్రను
రిపీట్ చేస్తారు, అందుకే బాబా అన్నారు, ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయో
వచ్చి అర్థం చేసుకోండి అని ఇలా కూడా వ్రాయండి. తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారు
అంటారు - ఇప్పుడు ఇది ఇనుప యుగము కావున తప్పకుండా బంగారు యుగము రిపీట్ అవుతుంది.
కొంతమందైతే సృష్టి చక్రము లక్షల సంవత్సరాలు ఉంటుంది, అది ఇప్పుడు ఎలా రిపీట్
అవుతుంది అని అడుగుతారు. ఇక్కడ సూర్యవంశీయుల, చంద్రవంశీయుల చరిత్ర అయితే లేదు. ఈ
చక్రము ఎలా రిపీట్ అవుతుంది అన్నది అంతిమము వరకు వారికి తెలియదు, వీరి రాజ్యము మళ్ళీ
ఎప్పుడు వస్తుంది అన్నది కూడా తెలియదు. రామ రాజ్యము గురించి తెలియదు. ఇప్పుడు
మీతోపాటు తండ్రి ఉన్నారు. ఎవరి వైపైతే సాక్షాత్తు పరమపిత పరమాత్మ అయిన తండ్రి
ఉన్నారో, వారికి విజయము తప్పకుండా లభిస్తుంది. తండ్రి అయితే ఏ విధమైన హింస చేయించరు.
ఎవరినైనా హత్య చేయడమనేది హింస కదా. అన్నింటికన్నా పెద్ద హింస కామ ఖడ్గాన్ని
ఉపయోగించడము. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతున్నారు. అక్కడ ఉన్నది అహింసా పరమో
దేవీ-దేవతా ధర్మము. అక్కడ కొట్లాడుకోరు, అలాగే వికారాలలోకి వెళ్ళరు. ఇప్పుడు మీది
యోగబలము, కానీ ఇది అర్థం చేసుకోని కారణముగా శాస్త్రాలలో అసురులు మరియు దేవతల మధ్యన
యుద్ధాన్ని చూపించారు. అహింస గురించి ఎవ్వరికీ తెలియదు. దీని గురించి మీకు మాత్రమే
తెలుసు. మీరు గుప్త యోధులు. అన్నోన్ బట్ వెరీ వెల్ నోన్ (ఎవ్వరికీ తెలియనివారు కానీ
మీ గురించి అందరికీ చాలా బాగా తెలుసు). మిమ్మల్ని ఎవరైనా యోధులుగా భావిస్తారా? మీ
ద్వారా అందరికీ మన్మనాభవ యొక్క సందేశము లభిస్తుంది. ఇది మహామంత్రము. మనుష్యులు ఈ
విషయాలను అర్థం చేసుకోరు. సత్య-త్రేతా యుగాలలో ఈ మంత్రము ఉండదు. మంత్రము ద్వారా మీరు
రాజ్యాన్ని పొందారు కావున ఇక తర్వాత దాని అవసరముండదు. మనము చక్రములో ఎలా తిరిగి
వచ్చామో మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మళ్ళీ మహామంత్రాన్ని ఇస్తారు. మళ్ళీ అర్ధకల్పము
రాజ్యము చేస్తారు. ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి మరియు చేయించాలి. మీరు
చార్టు పెట్టినట్లయితే చాలా ఆనందముగా అనిపిస్తుంది అని బాబా సలహానిస్తున్నారు.
రిజిస్టరులో గుడ్, బెటర్, బెస్ట్ ఉంటాయి కదా. అది స్వయం కూడా అనుభవము చేస్తారు.
కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమందికి అటెన్షన్ లేకపోతే ఫెయిల్ అయిపోతారు. ఇది
అనంతమైన చదువు. తండ్రి టీచర్ కూడా, గురువు కూడా. ముగ్గురూ కలిసే ఉన్నారు. మరజీవాగా
అవ్వమని చెప్పే తండ్రి వీరొక్కరే. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి
చేయండి. తండ్రి చెప్తున్నారు, నేను మీ తండ్రిని, బ్రహ్మా ద్వారా రాజ్యాన్ని ఇస్తాను.
వీరు మధ్యలో మధ్యవర్తి, వీరితో యోగము జోడించకూడదు. ఇప్పుడు మన బుద్ధి, పతులకే పతి
అయిన , ప్రియుడైన శివునితో జోడించబడింది. బ్రహ్మా ద్వారా వారు మిమ్మల్ని తమవారిగా
చేసుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని వారు చెప్తారు.
ఆత్మలమైన మనము పాత్రను పూర్తి చేసాము, ఇప్పుడు తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి.
ఇప్పుడైతే మొత్తం సృష్టి అంతా తమోప్రధానముగా ఉంది. పంచ తత్వాలు కూడా తమోప్రధానముగా
ఉన్నాయి. అక్కడ అన్నీ కొత్తవిగా ఉంటాయి. ఇక్కడ చూడండి, వజ్ర-వైఢూర్యాలు మొదలైనవేవీ
లేవు. సత్యయుగములో మరి ఎక్కడ నుండి వస్తాయి? ఖాళీ అయిన గనులన్నీ ఇప్పుడు నిండుతూ
ఉంటాయి. గనుల నుండి తవ్వి తీసుకువస్తారు. ఆలోచించండి, అన్నీ కొత్త వస్తువులే ఉంటాయి
కదా. లైట్లు మొదలైనవి కూడా సహజముగా ఉంటాయి, సైన్సు ద్వారా ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు,
ఇది అక్కడ కూడా ఉపయోగపడుతుంది. హెలికాప్టర్ నిలబడి ఉంటుంది, బటన్ నొక్కగానే
ఎగురుతుంది. ఏ కష్టమూ ఉండదు. అక్కడ అన్నీ ఫుల్ ప్రూఫ్ గా ఉంటాయి, మిషన్లు మొదలైనవి
ఎప్పుడూ పాడవ్వవు. ఇంటిలో కూర్చుని సెకెండులో స్కూలుకైనా లేదా విహారానికైనా వెళ్తారు.
ప్రజలకు వారికన్నా తక్కువగా ఉంటుంది. మీ కోసం అక్కడ సుఖాలన్నీ ఉంటాయి. అకాల
మృత్యువులు ఉండవు. కావున పిల్లలైన మీరు ఎంత అటెన్షన్ పెట్టాలి. మాయ తీవ్రత కూడా చాలా
ఉంది. ఇది మాయ యొక్క అంతిమ ఆర్భాటము. యుద్ధములో చూడండి, ఎంతమంది మరణిస్తారు! యుద్ధము
ఆగనే ఆగదు. ఇంత పెద్ద ప్రపంచమెక్కడ, కేవలం ఒక్క స్వర్గమెక్కడ? అక్కడ గంగను
పతిత-పావని అని అనరు. అక్కడ భక్తి మార్గపు విషయాలేవీ ఉండవు. ఇక్కడ చూడండి, గంగలో
మొత్తం నగరములోని చెత్త అంతా వచ్చి కలుస్తూ ఉంటుంది. బొంబాయిలోని చెత్త అంతా
సముద్రములో కలుస్తుంది.
భక్తిలో మీరు పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు. వజ్ర-వైఢూర్యాల యొక్క
సుఖముంటుంది కదా. 3/4 భాగము సుఖము, మిగిలిన 1/4 భాగము దుఃఖము. సగము-సగము అయితే ఇక
ఆనందము అనిపించదు. భక్తి మార్గములో కూడా మీరు చాలా సుఖముగా ఉంటారు. ఆ తర్వాత వచ్చి
మందిరాలు మొదలైనవాటిని దోచుకుంటారు. సత్యయుగములో మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు,
కావున పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. లక్ష్యము-ఉద్దేశ్యము అయితే ఎదురుగా నిలబడి
ఉంది. తల్లి-తండ్రికి అయితే అది నిశ్చితమై ఉంది. సంతోషము వంటి ఔషధము లేదు అని అంటూ
ఉంటారు. యోగము ద్వారా ఆయుష్షు పెరుగుతుంది.
నేను 84 జన్మల చక్రములో తిరుగుతాను, ఇంతటి పాత్రను అభినయిస్తాను అని ఇప్పుడు
ఆత్మకు స్వ దర్శనము అయ్యింది. పాత్రధారులైన ఆత్మలన్నీ కిందికి వచ్చేస్తాయి, అప్పుడు
తండ్రి అందరినీ తీసుకువెళ్తారు. శివుని ఊరేగింపు అని అంటారు కదా. ఇవన్నీ మీకు
నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఎంతగా మీరు స్మృతిలో ఉంటారో, అంతగా సంతోషములో
ఉంటారు. రోజురోజుకు ఇది అనుభవం చేస్తూ ఉంటారు, ఎందుకంటే నేర్పించేవారైతే ఆ తండ్రి
కదా. బ్రహ్మా కూడా నేర్పిస్తూ ఉంటారు. బ్రహ్మా ఏమీ అడగవలసిన అవసరముండదు. అడిగేది
మీరు. ఈ బ్రహ్మా కేవలం వింటారు. తండ్రి జవాబిస్తారు మరియు వీరు కూడా వింటారు, వీరి
పాత్ర ఎంత అద్భుతమైనది. వీరు కూడా స్మృతిలో ఉంటారు, ఆ తర్వాత పిల్లలకు వర్ణించి
చెప్తారు. బాబా నాకు తినిపిస్తారు, నేను వారికి నా రథాన్ని ఇస్తాను. వారు ఈ రథముపై
సవారీ చేస్తారు కనుక ఎందుకు తినిపించరు. ఇది మానవ అశ్వము. నేను శివబాబా రథాన్ని -
ఇది గుర్తున్నా శివబాబా స్మృతి ఉంటుంది. స్మృతి ద్వారానే లాభముంటుంది. భండారాలో
భోజనము తయారుచేసేటప్పుడు కూడా - నేను శివబాబా పిల్లల కోసం తయారుచేస్తున్నాను, నేను
కూడా శివబాబా సంతానాన్ని అని భావించండి. ఇలా స్మృతి చేసినా లాభముంటుంది. ఎవరైతే
స్మృతిలో ఉంటూ కర్మాతీత అవస్థను పొందుతారో మరియు సేవను కూడా చేస్తారో, వారికే
అందరికన్నా గొప్ప పదవి లభిస్తుంది. ఈ బాబా కూడా చాలా సేవ చేస్తారు కదా. వీరిది
అనంతమైన సేవ, మీరు హద్దులోని సేవ చేస్తారు. సేవ ద్వారానే వీరికి కూడా పదవి
లభిస్తుంది. ఇలా, ఇలా చేయండి అని శివబాబా చెప్తారు, బాబా వీరికి కూడా సలహా ఇస్తారు.
తుఫానులైతే పిల్లలకు వస్తాయి, స్మృతి లేకుండా కర్మేంద్రియాలు వశమవ్వడం కష్టము.
స్మృతి ద్వారానే నావ తీరానికి చేరుతుంది. ఇది శివబాబా చెప్తున్నారా లేక బ్రహ్మాబాబా
చెప్తున్నారా అని అర్థం చేసుకోవడం కూడా కష్టము. దీని కోసం చాలా సూక్ష్మమైన బుద్ధి
కావాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ సమయములో పూర్తిగా మరజీవాగా అవ్వాలి. చదువు బాగా చదువుకోవాలి, మీ చార్టును
లేక రిజిస్టరును పెట్టుకోవాలి. స్మృతిలో ఉంటూ మీ కర్మాతీత అవస్థను తయారుచేసుకోవాలి.
2. అంతిమ వినాశన దృశ్యాన్ని చూసేందుకు ధైర్యవంతులుగా అవ్వాలి. నేను ఆత్మను అనే ఈ
అభ్యాసము ద్వారా శరీర భానము తొలగిపోతూ ఉండాలి.
వరదానము:-
దేహ భానాన్ని త్యాగము చేసి క్రోధము లేనివారిగా అయ్యే
నిర్మానచిత్త భవ
ఏ పిల్లలైతే దేహభానాన్ని త్యాగము చేస్తారో, వారికి ఎప్పుడూ
క్రోధము రాదు, ఎందుకంటే క్రోధము వచ్చేందుకు రెండు కారణాలు ఉంటాయి : ఒకటి - ఎప్పుడైనా
ఎవరైనా అసత్యమైన విషయాన్ని చెప్పినప్పుడు, మరొకటి ఎవరైనా నింద చేసినప్పుడు. ఈ రెండు
విషయాలే క్రోధానికి జన్మనిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మానచిత్తము యొక్క
వరదానము ద్వారా అపకారులకు కూడా ఉపకారము చేయండి, నిందించేవారిని హృదయానికి హత్తుకోండి,
నిందించేవారిని సత్యమైన మిత్రులుగా భావించండి, అప్పుడు అద్భుతము అని అంటారు.
ఎప్పుడైతే ఇటువంటి పరివర్తనను చూపిస్తారో అప్పుడు విశ్వము ఎదురుగా ప్రసిద్ధమవుతారు.
స్లోగన్:-
ఆనందాన్ని అనుభవం చేసేందుకు మాయ యొక్క ఆధీనతను వదిలి స్వతంత్రులుగా అవ్వండి.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి
ఇప్పుడు జ్వాలాముఖిగా
అయి ఆసురీ సంస్కారాలను, ఆసురీ స్వభావాన్ని, అన్నింటినీ భస్మము చేయండి. దేవీల
స్మృతిచిహ్నములో జ్వాల ద్వారా అసురులను సంహరించినట్లుగా చూపిస్తారు కదా. అక్కడ
అసురులు అంటే ఎవరో వ్యక్తులు కారు, అక్కడ ఆసురీ శక్తులను అంతము చేసారు. ఇది ఇప్పుడు
మీ జ్వాలా స్వరూప స్థితి యొక్క స్మృతిచిహ్నము. ఇప్పుడు ఎటువంటి యోగ జ్వాలను
ప్రజ్వలితము చేయండంటే, అందులో ఈ కలియుగీ ప్రపంచము కాలి భస్మమైపోవాలి.
| | |