17-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇది పురుషోత్తమ సంగమయుగము, పాత
ప్రపంచము మారి ఇప్పుడు కొత్తదిగా అవుతుంది, మీరు ఇప్పుడు పురుషార్థము చేసి ఉత్తమమైన
దేవ పదవిని పొందాలి’’
ప్రశ్న:-
సర్వీసబుల్ పిల్లల బుద్ధిలో ఏ విషయము సదా గుర్తుంటుంది?
జవాబు:-
ధనము ఇచ్చినా
ధనము తరగదు... అని వారికి గుర్తుంటుంది. అందుకే వారు రాత్రింబవళ్ళు నిద్రను కూడా
త్యాగము చేసి జ్ఞాన ధనాన్ని దానము చేస్తూ ఉంటారు, అలసిపోరు. కానీ ఒకవేళ స్వయములో
ఏవైనా అవగుణాలు ఉంటే సేవ చేయాలనే ఉత్సాహము కూడా కలగదు.
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఏ విధముగా
ప్రతి రోజు టీచర్ చదివిస్తారో, అదే విధముగా పరమపిత ప్రతి రోజు అర్థం చేయిస్తారని
పిల్లలకు తెలుసు. తండ్రి కేవలం శిక్షణను ఇస్తారు, సంభాళిస్తూ ఉంటారు ఎందుకంటే తండ్రి
ఇంట్లోనే పిల్లలు ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులతో పాటు ఉంటారు. ఇక్కడైతే ఇది
అద్భుతమైన విషయము. ఆత్మిక తండ్రి వద్ద మీరు ఉంటారు. ఒకటేమో, ఆత్మిక తండ్రి వద్ద
మూలవతనములో ఉంటారు. ఆ తర్వాత కల్పములో ఒక్కసారి మాత్రమే పిల్లలకు వారసత్వాన్ని
ఇచ్చేందుకు మరియు పావనముగా చేసేందుకు, సుఖ-శాంతులను ఇచ్చేందుకు తండ్రి వస్తారు.
తప్పకుండా ఆ సమయములో కిందకే వచ్చి ఉంటూ ఉండవచ్చు. ఇందులోనే మనుష్యులు తికమకపడతారు.
వారు సాధారణ తనువులో ప్రవేశిస్తారని గాయనము కూడా ఉంది. ఇప్పుడు సాధారణ తనువు అనేది
ఎక్కడ నుండో ఎగురుకుంటూ రాదు కదా. తప్పకుండా మనుష్య తనువులోనే వస్తారు. నేను ఈ
తనువులో ప్రవేశిస్తానని కూడా వారు అంటారు. తండ్రి మనకు స్వర్గ వారసత్వాన్ని
ఇచ్చేందుకు వచ్చారని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఇప్పుడు
మనము యోగ్యులుగా లేము, పతితముగా అయిపోయాము. ఓ పతిత-పావనా రండి, మీరు వచ్చి పతితులైన
మమ్మల్ని పావనముగా చేయండి అని అందరూ అంటారు కూడా. తండ్రి అంటారు, నాకు కల్ప-కల్పము
పతితులను పావనముగా చేసే డ్యూటీ లభించింది. ఓ పిల్లలూ, ఇప్పుడు ఈ పతిత ప్రపంచాన్ని
పావనముగా చేయాలి. పాత ప్రపంచాన్ని పతితమని, కొత్త ప్రపంచాన్ని పావనమని అంటారు. అంటే
పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు తండ్రి వచ్చారు. కలియుగాన్ని ఎవ్వరూ కొత్త
ప్రపంచమని అనరు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. కలియుగము పాత ప్రపంచము. తండ్రి
కూడా తప్పకుండా పాత మరియు కొత్త ప్రపంచము యొక్క సంగమములోనే వస్తారు. మీరు ఎక్కడైనా
ఇది అర్థం చేయించేటప్పుడు ఇలా చెప్పండి - ఇది పురుషోత్తమ సంగమయుగము, తండ్రి వచ్చి
ఉన్నారు అని. ఇది పురుషోత్తమ సంగమయుగమని తెలిసిన మానవులు పూర్తి ప్రపంచములో ఎవ్వరూ
లేరు. మీరు తప్పకుండా సంగమములో ఉన్నారు, అందుకే మీరు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన
విషయము సంగమయుగానికి సంబంధించినదే. కావున పాయింట్లు కూడా చాలా అవసరము. ఏ విషయాలైతే
ఎవ్వరికీ తెలియవో, వాటిని అర్థం చేయించవలసి ఉంటుంది, అందుకే బాబా అన్నారు, ఇప్పుడు
ఇది పురుషోత్తమ సంగమయుగము అని తప్పనిసరిగా వ్రాయాలి. కొత్త యుగము అనగా సత్యయుగము
యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగ కొత్త ప్రపంచానికి
యజమానులని మనుష్యులు ఎలా అర్థం చేసుకుంటారు. ఆ చిత్రాలపై పురుషోత్తమ సంగమయుగము అన్న
పదము తప్పకుండా ఉండాలి. ఇది తప్పకుండా వ్రాయాలి ఎందుకంటే ఇదే ముఖ్యమైన విషయము.
కలియుగము పూర్తవ్వడానికి ఇప్పుడింకా చాలా సంవత్సరాలు ఉన్నాయని మనుష్యులు భావిస్తారు.
పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. కనుక కొత్త ప్రపంచానికి యజమానులు ఈ
లక్ష్మీ-నారాయణులు అని అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ చిత్రాలు పూర్తి చిహ్మాల వంటివి.
ఈ రాజ్యము యొక్క స్థాపన జరుగుతోందని మీరంటారు. నవ యుగము వచ్చింది, అజ్ఞాన నిద్ర
నుండి మేలుకోండి అని పాట కూడా ఉంది. ఇప్పుడు ఇది సంగమయుగమని, దీనిని నవ యుగమని అనరని
మీకు తెలుసు. సంగమమును సంగమయుగమనే అంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు పాత
ప్రపంచము సమాప్తమై కొత్త ప్రపంచము స్థాపనవుతుంది. ఇందులో మనుష్యుల నుండి దేవతలుగా
అవుతున్నారు, రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దేవతలలో కూడా ఉత్తమ పదవి ఈ
లక్ష్మీ-నారాయణులదే. వీరు కూడా మానవులే కానీ వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి, అందుకే
వీరిని దేవీ-దేవతలని అంటారు. అన్నింటికన్నా ఉత్తమ గుణము పవిత్రత, అందుకే మనుష్యులు
దేవతల ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో, వారి
బుద్ధిలో ఈ పాయింట్లన్నీ ధారణ అవుతాయి. ధనము ఇచ్చినా ధనము తరగదని అంటూ ఉంటారు. మీకు
ఎంతో వివరణ లభిస్తూ ఉంటుంది. జ్ఞానమైతే చాలా సహజము, కానీ కొందరిలో ధారణ బాగా
జరుగుతుంది, కొందరిలో జరగదు. ఎవరిలోనైతే అవగుణాలు ఉంటాయో, వారు సెంటరును
సంభాళించలేరు కూడా. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ప్రదర్శనీలలో కూడా
డైరెక్ట్ పదాలను వాడాలి. ముఖ్యముగా పురుషోత్తమ సంగమయుగము గురించి అర్థం చేయించాలి.
ఈ సంగమములో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన జరుగుతుంది. ఈ ధర్మము
ఉన్నప్పుడు వేరే ఏ ధర్మము లేదు. ఈ మహాభారత యుద్ధమేదైతే ఉందో, అది కూడా డ్రామాలో
నిశ్చితమై ఉంది. ఇతర ధర్మాలు కూడా ఇప్పుడే వచ్చాయి, ఇంతకుముందు లేవు. 100 సంవత్సరాల
లోపు అన్నీ సమాప్తమైపోతాయి. సంగమయుగానికి తక్కువలో తక్కువ 100 సంవత్సరాలైతే కావాలి
కదా. మొత్తం ప్రపంచము కొత్తదిగా అవ్వనున్నది. న్యూఢిల్లీని తయారుచేయడానికి ఎన్ని
సంవత్సరాలు పట్టింది.
భారత్ లోనే కొత్త ప్రపంచముంటుందని, అప్పుడిక పాతది సమాప్తమైపోతుందని మీరు అర్థం
చేసుకుంటారు. ఎంతోకొంత అయితే మిగిలి ఉంటుంది కదా, ప్రళయమైతే జరగదు. ఈ విషయాలన్నీ మీ
బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడిది సంగమయుగము. కొత్త ప్రపంచములో తప్పకుండా ఈ దేవీ-దేవతలు
ఉండేవారు, మళ్ళీ వీరే ఉంటారు. ఇది రాజయోగము యొక్క చదువు. ఒకవేళ ఎవరైనా వివరముగా
అర్థం చేయించలేకపోతే కేవలం ఒక్క విషయమే చెప్పండి - అందరికీ తండ్రి అయిన పరమపిత
పరమాత్మను అందరూ స్మృతి చేస్తారు. వారు పిల్లలైన మనందరికీ చెప్తున్నారు - మీరు
పతితముగా అయిపోయారు. ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు కూడా. తప్పకుండా కలియుగములో
ఉన్నది పతితులు, సత్యయుగములో పావనులు ఉంటారు. ఇప్పుడు పరమపిత పరమాత్మ చెప్తున్నారు,
దేహ సహితముగా ఈ పతిత సంబంధాలన్నింటినీ విడిచిపెట్టి నన్నొక్కరినే స్మృతి
చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు అని. ఇవి గీతలోని మాటలే. ఈ యుగము కూడా గీతా
యుగమే. గీత సంగమయుగములోనే వినిపించడం జరిగింది, అప్పుడే వినాశనము జరిగింది. తండ్రి
రాజయోగాన్ని నేర్పించారు. ఇంతకుముందు రాజ్యము స్థాపనయ్యింది, మళ్ళీ తప్పకుండా
అవుతుంది. ఇవన్నీ ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు కదా. పోనీ ఈ తనువులోకి రాకపోయినా
కానీ, వేరొకరి తనువులోకి వచ్చినా సరే, అర్థం చేయించేది అయితే తండ్రియే కదా. మనము
వీరి పేరునైతే తీసుకోము. మనము కేవలం ఈ విషయాన్ని తెలియజేస్తాము - నన్ను స్మృతి
చేసినట్లయితే మీరు పావనముగా అయ్యి నా వద్దకు వచ్చేస్తారని తండ్రి చెప్తున్నారు. ఇది
ఎంత సహజమైన విషయము. కేవలం నన్ను స్మృతి చేయండి మరియు 84 జన్మల చక్రము యొక్క జ్ఞానము
బుద్ధిలో ఉండాలి. ఎవరైతే ధారణ చేస్తారో, వారు చక్రవర్తి రాజుగా అవుతారు. ఈ సందేశము
అన్ని ధర్మాల వారి కొరకు ఉంది. ఇంటికైతే అందరూ వెళ్ళాల్సిందే. మనము కూడా ఇంటికి
వెళ్ళే మార్గాన్నే తెలియజేస్తాము. క్రిస్టియన్ ఫాదర్లు మొదలైనవారెవరికైనా మీరు
తండ్రి సందేశాన్ని ఇవ్వవచ్చు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు
వినాశనమవుతాయని పరమపిత పరమాత్మ చెప్తున్నందుకు మీకు సంతోషము యొక్క పాదరసము బాగా పైకి
ఎక్కాలి. అందరికీ ఇదే స్మృతిని ఇప్పించండి. తండ్రి సందేశాన్ని వినిపించడమే నంబర్ వన్
సేవ. గీతా యుగము కూడా ఇప్పుడే ఉంది. తండ్రి వచ్చారు కావున ఆ చిత్రాన్నే ప్రారంభములో
పెట్టాలి. మేము తండ్రి సందేశాన్ని ఇవ్వగలము అని ఎవరైతే భావిస్తారో వారు తయారుగా
ఉండాలి. మేము కూడా అంధులకు చేతికర్రగా అవ్వాలని మనసులో అనిపించాలి. ఈ సందేశాన్ని
అయితే ఎవరికైనా ఇవ్వవచ్చు. బి.కె.ల పేరు వినగానే భయపడతారు. మేము కేవలం తండ్రి
సందేశాన్ని ఇస్తామని చెప్పండి. పరమపిత పరమాత్మ చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి,
అంతే. మేము ఎవ్వరినీ నిందించము. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు.
నేను ఉన్నతోన్నతమైన పతిత-పావనుడను. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు
వినాశనమవుతాయి. ఇది నోట్ చేసుకోండి. ఇది చాలా పనికొచ్చే విషయము. చేతులపై లేదా
బాహువులపై అక్షరాలు వ్రాయించుకుంటారు కదా. అలా ఇది కూడా వ్రాసుకోండి. కేవలం ఇంత
మాత్రము తెలియజేసినా కూడా దయార్ద్ర హృదయులుగా, కళ్యాణకారులుగా అవుతారు. మీతో మీరే
ప్రతిజ్ఞ చేసుకోవాలి. సేవ తప్పకుండా చేయాలి, అప్పుడిక అలవాటైపోతుంది. ఇక్కడ కూడా
మీరు అర్థం చేయించవచ్చు. చిత్రాలను ఇవ్వవచ్చు. ఇవి సందేశాన్ని ఇచ్చే వస్తువులు.
లక్షల కొలది తయారవుతాయి. ఇంటింటికీ వెళ్ళి సందేశాన్ని ఇవ్వాలి. ఎవరైనా ధనము ఇచ్చినా,
ఇవ్వకపోయినా కానీ, మీరు చెప్పండి - తండ్రి పేదల పెన్నిధి, ఇంటింటికీ సందేశాన్ని
ఇవ్వడం మా బాధ్యత. వీరు బాప్ దాదా, వీరి ద్వారా ఈ వారసత్వము లభిస్తుంది. వీరు 84
జన్మలు తీసుకుంటారు. ఇది వీరి అంతిమ జన్మ. మనము బ్రాహ్మణులము, మళ్ళీ దేవతలుగా
అవుతాము. బ్రహ్మా కూడా బ్రాహ్మణుడే. ప్రజాపిత బ్రహ్మా ఒక్కరే అయితే ఉండరు కదా.
తప్పకుండా బ్రాహ్మణ వంశావళి కూడా ఉంటుంది కదా. బ్రహ్మా నుండి విష్ణు దేవతగా అవుతారు,
బ్రాహ్మణులు పిలక వంటివారు. వారే దేవత, క్షత్రియ, వైశ్య, శుద్రులుగా అవుతారు. మీ
విషయాలను అర్థం చేసుకునేవారు తప్పకుండా ఎవరో ఒకరు వెలువడుతారు. పురుషులు కూడా సేవ
చేయవచ్చు. మనుష్యులు ఉదయాన్నే లేచి దుకాణాన్ని తెరిచినప్పుడు - ఓ ప్రాతఃస్మరణీయ
ప్రభూ, ఈ రోజంతటికీ సరిపడే సంపాదనను ఇచ్చే కొనుగోలుదారుడిని పంపించండి అని
భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. మీరు కూడా ఉదయముదయమే వెళ్ళి తండ్రి సందేశాన్ని
వినిపించండి. మీరు వారికి ఇలా చెప్పండి - మీ వ్యాపారము చాలా బాగుంటుంది, మీరు
భగవంతుడిని స్మృతి చేసినట్లయితే 21 జన్మల వారసత్వము లభిస్తుంది. అమృతవేళ సమయము
బాగుంటుంది. ఈ రోజుల్లో ఫ్యాక్టరీలలో మాతలు కూడా కూర్చొని పని చేస్తున్నారు. ఈ
బ్యాడ్జిలు తయారుచేయడం కూడా చాలా సహజము.
పిల్లలైన మీరైతే రాత్రింబవళ్ళు సేవలో నిమగ్నమవ్వాలి, నిద్రను త్యాగము చేయాలి.
తండ్రి పరిచయము లభించడముతో మనుష్యులు సనాథలుగా అవుతారు. మీరెవ్వరికైనా సందేశాన్ని
ఇవ్వవచ్చు. మీ జ్ఞానము చాలా ఉన్నతమైనది. మేము ఒక్కరినే స్మృతి చేస్తామని చెప్పండి.
క్రైస్ట్ ఆత్మ కూడా వారి సంతానమే. ఆత్మలందరూ వారి పిల్లలే. ఆ గాడ్ ఫాదరే
చెప్తున్నారు - ఇంకే దేహధారులనూ గుర్తు చేయకండి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. నా వద్దకు వచ్చేస్తారు.
మనుష్యులు ఇంటికి వెళ్ళేందుకే పురుషార్థము చేస్తారు. కానీ ఎవ్వరూ వెళ్ళరు. పిల్లలు
ఇప్పుడు చాలా చల్లబడిపోయారని బాబా చూస్తారు, అంత శ్రమ చేయడము లేదు, సాకులు చెప్తూ
ఉంటారు, ఇందులో చాలా సహనము చేయవలసి ఉంటుంది కూడా. ధర్మ స్థాపకులు ఎంతగా సహనము
చేయవలసి ఉంటుంది. శిలువ పైకి ఎక్కించారని క్రైస్ట్ కోసం కూడా చెప్తారు. మీ పని
అందరికీ సందేశాన్ని ఇవ్వడం. దీని కోసం బాబా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. ఎవరైనా
సేవ చేయడం లేదంటే ధారణ లేదని బాబా భావిస్తారు. సందేశాన్ని ఎలా ఇవ్వాలి అని బాబా
సలహాలు ఇస్తారు. ట్రైన్ లో కూడా మీరు ఈ సందేశాన్ని ఇస్తూ ఉండండి. మనము స్వర్గములోకి
వెళ్తామని మీకు తెలుసు. కొందరు శాంతిధామానికి కూడా వెళ్తారు కదా. మార్గాన్ని అయితే
మీరే తెలియజేయగలరు. బ్రాహ్మణులైన మీరే వెళ్ళాలి. బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు
కావున వారిని ఎక్కడో ఒకచోటనైతే పెడతారు కదా. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు.
తప్పకుండా ప్రజాపిత బ్రహ్మాకు సంతానము కదా. ఆదిలో ఉండేది బ్రాహ్మణులే. బ్రాహ్మణులైన
మీరు ఉన్నతోన్నతమైనవారు. ఆ బ్రాహ్మణులు కుఖవంశావళి. బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి
కదా. లేకపోతే ప్రజాపిత బ్రహ్మా పిల్లలైన బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళినట్లు. ఆ
బ్రాహ్మణులకు మీరు కూర్చుని అర్థం చేయిస్తే వారు వెంటనే అర్థం చేసుకుంటారు. మీరు
వారికి ఇలా చెప్పండి - మీరు కూడా బ్రాహ్మణులే, మేము కూడా స్వయాన్ని బ్రాహ్మణులుగా
పిలుచుకుంటాము, మరి మీ ధర్మాన్ని స్థాపన చేసేవారెవరో ఇప్పుడు చెప్పండి. బ్రహ్మా
పేరును తప్ప ఇంకెవ్వరి పేరును తీసుకోరు. మీరు ప్రయత్నించి చూడండి. బ్రాహ్మణులలో కూడా
చాలా పెద్ద-పెద్ద కులాలు ఉంటాయి. పూజారి బ్రాహ్మణులైతే ఎంతోమంది ఉన్నారు. అజ్మేర్
కు చాలామంది పిల్లలు వెళ్తారు, కానీ - మేము బ్రాహ్మణులను కలిసాము, వారిని మీ
ధర్మాన్ని స్థాపన చేసేవారు ఎవరు, బ్రాహ్మణ ధర్మాన్ని ఎవరు స్థాపన చేసారు అని అడిగాము
అని ఈ సమాచారాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేదు. సత్యమైన బ్రాహ్మణులు ఎవరు అనేది మీకైతే
తెలుసు. మీరు అనేకుల కళ్యాణము చేయగలరు. యాత్రలకు భక్తులే వెళ్తారు. ఈ
లక్ష్మీ-నారాయణుల చిత్రము చాలా బాగుంది. జగదంబ ఎవరు, లక్ష్మి ఎవరు అన్నది మీకు
తెలుసు. ఈ విధముగా మీరు నౌకర్లు, ఆదివాసి స్త్రీలు మొదలైనవారికి కూడా అర్థం
చేయించవచ్చు. మీరు తప్ప వారికి వినిపించేవారు ఇంకెవ్వరూ లేరు. చాలా దయార్ద్ర
హృదయులుగా అవ్వాలి. మీరు ఇలా చెప్పండి - మీరు కూడా పావనముగా అయి పావన ప్రపంచములోకి
వెళ్ళవచ్చు, స్వయాన్ని ఆత్మగా భావించండి, శివబాబాను స్మృతి చేయండి అని. ఎవరికైనా
మార్గాన్ని తెలియజేయాలి అనే అభిరుచి చాలా ఉండాలి. ఎవరైతే స్వయం స్మృతి చేస్తూ ఉంటారో,
వారే ఇతరుల చేత స్మృతి చేయించే పురుషార్థము చేస్తారు. తండ్రి అయితే వెళ్ళి చెప్పరు.
ఇది పిల్లలైన మీ పని. పేదవారి కళ్యాణము కూడా చేయాలి. పాపం అప్పుడు చాలా సుఖవంతులుగా
అవుతారు. కొద్దిగా స్మృతి చేసి ప్రజల్లోకి వచ్చినా, అది కూడా మంచిదే. ఈ ధర్మమైతే
చాలా సుఖాన్ని ఇస్తుంది. రోజు-రోజుకూ మీ శబ్దము జోరుగా వెలువడుతుంది. అందరికీ ఇదే
సందేశాన్ని ఇస్తూ ఉండండి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని.
మధురాతి మధురమైన పిల్లలైన మీరు పదమాపదమ భాగ్యశాలులు. మహిమను విన్నప్పుడు అర్థం
చేసుకుంటారు, ఇక వేరే ఏ విషయాల గురించి అయినా ఎందుకు చింత పెట్టుకోవాలి. ఇది
గుప్తమైన జ్ఞానము, గుప్తమైన సంతోషము. మీరు గుప్తమైన యోధులు. మిమ్మల్నే గుప్త యోధులని
అంటారు, ఇంకెవ్వరూ గుప్త యోధులు కాలేరు. మీ దిల్వాడా మందిరము పూర్తి స్మృతిచిహ్నము.
హృదయాన్ని గెలుచుకునేవారి పరివారము కదా. మహావీర్, మహావీరని మరియు వారి సంతానము, ఇది
సంపూర్ణ తీర్థ స్థానము. ఇది కాశీ కన్నా కూడా ఉన్నతమైన స్థానముగా అయ్యింది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇంటింటికీ వెళ్ళి తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. సేవ చేయాలనే ప్రతిజ్ఞను చేయండి,
సేవ కొరకు ఏ సాకులు చెప్పకండి.
2. ఏ విషయము గురించి చింతించకూడదు, గుప్తమైన సంతోషములో ఉండాలి. ఏ దేహధారినీ
స్మృతి చేయకూడదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి.
వరదానము:-
కళ్యాణకారి తండ్రి మరియు సమయము నుండి ప్రతి క్షణము లాభము
పొందే నిశ్చయబుద్ధి, నిశ్చింత భవ
ఏ దృశ్యము జరుగుతున్నా, దానిని త్రికాలదర్శులుగా అయి
చూడండి, ధైర్యము మరియు ఉల్లాసములో ఉంటూ స్వయము కూడా సమర్థ ఆత్మలుగా కండి మరియు
విశ్వాన్ని కూడా సమర్థ ఆత్మలుగా చెయ్యండి. స్వయము యొక్క తుఫానులలో కదిలిపోకండి,
అచలముగా అవ్వండి. ఏదైతే సమయము లభించిందో, తోడు లభించిందో, అనేక రకాల ఖజానాలు
లభిస్తున్నాయో, వాటి ద్వారా సంపత్తివంతులుగా మరియు సమర్థవంతులుగా అవ్వండి. మొత్తము
కల్పములో ఇటువంటి రోజులు మళ్ళీ రావు, అందుకే మీ చింతలన్నింటినీ బాబాకు ఇచ్చి
నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి సదా నిశ్చింతగా కండి, కళ్యాణకారి తండ్రి మరియు సమయము
యొక్క లాభాన్ని ప్రతి క్షణము తీసుకోండి.
స్లోగన్:-
తండ్రి
సాంగత్యము యొక్క రంగు అంటించుకున్నట్లయితే చెడువన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి.
అవ్యక్త సూచనలు -
అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి
విదేహీగా అయ్యేందుకు
విధి - బిందువుగా అవ్వటము. అశరీరిగా అవుతారు, కర్మాతీతముగా అవుతారు, వీటన్నిటికీ
విధి బిందువే, అందుకే బాప్ దాదా చెప్తున్నారు - అమృతవేళ బాప్ దాదాతో మిలనము
చేసుకుంటూ, ఆత్మిక సంభాషణను చేసుకుంటూ, కార్యములోకి వచ్చినప్పుడు ముందుగా మూడు
బిందువుల తిలకాన్ని మస్తకముపై పెట్టుకోండి మరియు చెక్ చేసుకోండి - ఏ కారణముగానైనా ఈ
స్మృతి తిలకము చెరిగిపోవటము లేదు కదా? అవినాశీ మరియు చెరిగిపోని తిలకము ఉండాలి.
| | | |